e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home వంటలు తోటకూర ఎగ్‌ వడలు ఎలా తయారీ చేయాలి?

తోటకూర ఎగ్‌ వడలు ఎలా తయారీ చేయాలి?

కావలసిన పదార్థాలు:
కోడిగుడ్లు: నాలుగు, తోటకూర: ఒక కట్ట, కార్న్‌ఫ్లోర్‌: ఒక కప్పు, శనగపిండి: రెండు కప్పులు, బియ్యప్పిండి: రెండు కప్పులు, ఉప్పు: తగినంత, నూనె: సరిపడా, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, పచ్చిమిర్చి: ఐదు, ఉల్లిపాయలు: రెండు, అల్లం: చిన్నముక్క

తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో కోడిగుడ్లను కొట్టు కోవాలి. అందులో శనగపిండి, బియ్యప్పిండి వేసి కలపాలి. తగినంత ఉప్పు, కారం, కార్న్‌ఫ్లోర్‌తోపాటు తరిగిన పచ్చిమిర్చి, చిదిమిన వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు వేయాలి. తోటకూరను చిన్నగా కట్‌ చేసి వేయాలి. తగినన్ని నీళ్ళు చల్లుకుంటూ అన్నీ బాగా కలిసేలా కలగలపాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి, నూనె పోసి వేడయ్యాక మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ వడల్లా వేయాలి. గోధుమ రంగులోకి మారేవరకూ వేయిస్తే చాలు. నోరూరించే తోటకూర ఎగ్‌ వడలు రెడీ.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana