e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home జిందగీ అవకాడో పాస్తా

అవకాడో పాస్తా

కావలసిన పదార్థాలు
అవకాడో: రెండు, పాస్తా: ఒక కప్పు, పాలకూర: అర కప్పు, కొత్తిమీర: కొద్దిగా, ఉప్పు: తగినంత, ఆలివ్‌ ఆయిల్‌: రెండు టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి: రెండు, వెల్లుల్లి రెబ్బలు: రెండు, మిరియాల పొడి: అర టీస్పూన్‌, చిల్లీ ఫ్లేక్స్‌: కొన్ని

తయారీ విధానం
ముందుగా పాస్తాను కొంత ఉప్పు, రెండు చుక్కలు నూనెవేసి ఉడికించి వడకట్టి పక్కన పెట్టుకోవాలి. అవకాడోల గింజలు, తొక్క వేరు చేసి గుజ్జు తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీజార్‌లో అవకాడో గుజ్జు, తరిగిన పాలకూర, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు, మిరియాల పొడి, ఆలివ్‌ ఆయిల్‌ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి అవకాడో మిశ్రమాన్ని వేసి పాస్తా ఉడికించిన నీటిని పోసి, మళ్లీ ఉడికించాలి. దగ్గరపడిన మిశ్రమంలో ఉడికించిన పాస్తా వేసి బాగా కలుపుకొని పైనుంచి చిల్లీ ఫ్లేక్స్‌ చల్లుకుని సర్వ్‌ చేస్తే.. అవకాడో పాస్తా రెడీ.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana