కావలసిన పదార్థాలు:మీల్ మేకర్ (సోయా చంక్స్): ఒక కప్పు, శెనగపిండి: రెండు టేబుల్ స్పూన్లు, బియ్యపు పిండి: ఒక టేబుల్ స్పూన్, కార్న్‌ఫ్లోర్: అర టేబుల్ స్పూన్, కారం: ఒక టీస్పూన్, గరం మసాలా: అర టీస్పూన్, పసుపు: పావు టీస్పూన్, నిమ్మరసం: ఒక టీస్పూన్, ధనియాల పొడి: ఒక టీస్పూన్, అల్లం: కొద్దిగా, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం:
మీల్ మేకర్‌ను పది నిమిషాలపాటు గోరువెచ్చని నీటిలో నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు లేకుండా గట్టిగా పిండిన మీల్మేకర్, కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, అల్లం, నిమ్మరసం వేసి బాగా కలిపి పదిహేను నిమిషాలు నాననివ్వాలి. నానిన మీల్ మేకర్లో శెనగపిండి, బియ్యం పిండి, కార్న్‌ఫ్లోర్, గరం మసాలా వేసి బాగా కలపాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి, వేయించడానికి సరిపడా నూనెపోసి, వేడయ్యాక మీల్మేకర్ వేసి దోరగా వేయించుకుంటే కరకరలాడే పకోడి సిద్ధం.