చిన్న ప్రాజెక్టులంటే చిన్న చూపు


Mon,April 23, 2012 01:51 AM

పెద్ద ప్రాజెక్టుల గురించే మీరు చెప్పుతున్నారు. తెలంగాణలోని చెరువులు, కుంటలు, బావుల మీద ఆధారపడి బతుకుతున్న వాళ్లు చాలామంది ఉన్నారు. వాటి పరిస్థితి గురించి కూడా కాస్త చెప్పండి. ప్రభుత్వం వీటి గురించి పట్టించుకోవడం లేదని మా కనిపిస్తున్నది. ఇది నిజం కాదంటారా?

- జానకీరాణి, మలక్‌పేట, హైదరాబాద్


నిజమే! ఇంతకాలం పెద్ద ప్రాజెక్టులు, నదుల వివాదాల గురించే మాట్లాడటం జరిగింది. అట్లా అని, చిన్న ప్రాజెక్టుల పైన చిన్న చూపు చూసినట్టు కాదు. కాకపోతే ‘మైనర్ ఇరిగేషన్’ చిన్నతరహా ప్రాజెక్టుల గురించి చర్చించే అవకాశం రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం విషయంలో మీరన్నది నూటికి నూరు పాళ్లు నిజం.పెద్ద ప్రాజెక్టులంటే భారీ కాంట్రాక్టులు, భారీ ముడుపులు కాబట్టి వాటి పట్ల ఉన్న శ్రద్ధ, ఆసక్తి చిన్న సైజు ప్రాజెక్టుల మీద ప్రభుత్వాధికారులకు నాయకులకు లేదు.

సాగునీటి రంగ ప్రాజెక్టులలో మూడు రకాలు- 10 వేల హెక్టార్లు ఆయకట్టు, అంతకుమించి ఉన్న ప్రాజెక్టును భారీ ప్రాజెక్టు అని, 2000 హెక్టార్లకు మించి పదివేల హెక్టార్లకు లోబడి ఆయకట్టు ఉన్న ప్రాజెక్టును మధ్యతరహా ప్రాజెక్టు అని, రెండువేల హెక్టార్లు లేక అంతకు తక్కువ ఆయకట్టు ఉన్న ప్రాజెక్టును చిన్న తరహా ప్రాజెక్టు అని భారత ప్రభుత్వం నామకరణం చేసింది. వీటినే మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులుగా వ్యవహరిస్తుంటారు. ఒక్క హెక్టారుకు 2.47 ఎకరాలు కనుక 5000 ఎకరాల ఆయకట్టు, 5000- 25000 ఎకరాల ఆయకట్టు, 25 వేల ఎకరాలకు పైబడ్డ ఆయకట్టు కలిగిన ప్రాజెక్టులను చిన్న తరహా , మధ్యతరహా, భారీ సాగునీటి ప్రాజెక్టులుగా పరిగణిస్తూ ఉంటాం.

నదులపైన నిర్మించే బహుళార్థకసాధక ప్రాజెక్టులు అంటే అందులో సాగునీరు, తాగునీరు, వరద నియంవూతణ, విద్యుత్ ఉత్పాదన ఉండే అవకాశాలు గల ప్రాజెక్టులు, లేక కేవలం సాగునీటి కోసం నిర్మించే పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా భారీ సాగునీటి ప్రాజెక్టుల కోవలోకే వస్తాయి. దాదాపు అవే ప్రయోజనాలు కలిగిన ప్రాజెక్టులు, కాకపోతే తక్కువ ఆయకట్టు కలిగినవి మధ్యతరహా ప్రాజెక్టులు. రాష్ట్రాలలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను కలిపి ఒకే శాఖ, ఒకే మంత్రి ఉండటం సాంప్రదాయం. ఇకపోతే చిన్నతరహా పథకాలలో ఉపరితల చిన్న నీటి పారుదల స్కీములు, భూగర్భ జలాలపై ఆధారపడ్డ పథకాలు కలిసి ఉన్నాయి. ఉపరితల చిన్నతరహా పథకాలలో చెరువులు, కుంటలు, చిన్నసైజు తరలింపు పథకాలు, చిన్న సైజు ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ఈ ఎత్తిపోతలు వాగులపైన, కాలువలపైన నిర్మించిన ఎత్తిపోతలు, భూగర్భజల పథకాలలో ఊటబావులు, గొట్టపుబావులు ఉన్నా యి.

దేశంలో మొత్తం 34 కోట్ల 95 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యం ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో 14 కోట్ల 60 లక్షల ఎకరాల ఆయకట్టుకు భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు సాగునీరు అందివ్వగలవని, మిగిలిన 20 కోట్ల 35 లక్షల ఎరకాల ఆయకట్టులో 4 కోట్ల 35 లక్షల ఎకరాలకు ఉపరితల చిన్నతరహా ప్రాజెక్టులు సాగునీటి అందివ్వగలవని, తతిమ్మా 16 కోట్ల ఎకరాలకు భూగర్భ జలాలు సాగునీరు అందివ్వగలవని అంచనా. ఇక్కడ గమనించవలసిన అంశమేమంటే భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కంటే అధికంగా సాగునీరందించే ప్రాజెక్టులు చిన్నతరహా ప్రాజెక్టులు. అందులోనూ భూగర్భ జలాలు సుమారు 46 శాతం నీరందించే సామర్థ్యం కలిగినవి. 58 శాతం నీరందించే చిన్నతరహా ప్రాజెక్టుల కన్న 42 శాతం నీరందించే భారీ, మధ్యతరహా ప్రాజెక్టులం ప్రభుత్వాలకు మక్కువ ఎక్కువ. అంతిమంగా 42 శాతం సాగునీటి సామర్థ్యం, భారీ మధ్యతరహా ప్రాజెక్టులు కలిగిస్తే 12 శాతం ఉపరితల చిన్న తరహా ప్రాజెక్టులు 46 శాతం భూగర్భ జలవూపాజెక్టులు కలిగిస్తాయి.

ఇక రాష్ట్ర బడ్జెట్ విషయానికి వచ్చినా, శాసనసభలో ప్రశ్నోత్తరాలు, చర్చల విషయానికి వచ్చినా భారీ, మధ్యతరహా సాగునీటి శాఖ అమాత్యులకుండే ప్రాధాన్యం చిన్ననీటిపారుదల శాఖ మంత్రికి ఉండదు. 2011-2012 సంవత్సరానికి భారీ సాగునీటి శాఖ డిమాండ్ సుమారు 20 వేల కోట్ల రూపాయలు. అదే సంవత్సరానికి చిన్న తరహా సాగునీటి శాఖ డిమాండ్ 2607 కోట్ల రూపాయలు. అంటే 9 రెట్లన్నమాట. ఇప్పుడర్థమయిందా చెల్లెమ్మా! చిన్న ప్రాజెక్టులంటే ప్రభుత్వానికెందుకుకంత చిన్నచూపో?
వాస్తవానికి చిన్న తరహా సాగునీరు, వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధిలోనూ, జీవనోపాధిని సమకూర్చేలా చూడడంలోనూ భారీ మధ్యతరహా ప్రాజెక్టులు ముఖ్యపాత్ర వహిస్తున్నవి. దీనివల్ల కలిగే ప్రయోజనాలలో తక్కువ పెట్టుబడి వ్యయం అనుకూలమైన వ్యయ ప్రయోజనం, తక్కువ వ్యవధిలో పూర్తికావటం, స్థానిక కూలీలను సులభంగా సమీకరించుకోవడం వంటి ఉపయోగాలు ఉన్నాయి. భూములకు సాగునీటి సౌకర్యాలను, ప్రజలకు త్రాగునీటిని సమకూర్చడానికి చెరువుల నిర్మాణం అనేది 500 సంవత్సరాలకు పైబడి అనుసరిస్తున్న పురాతన పద్ధతి. గ్రామాల సమీపంలో నిర్మించిన చెరువులు, సాగునీటికి అదనంగా పశువులకు తాగునీరు, ఇతర గృహావసరాల వంటి మరెన్నిటినో తీరుస్తాయి.

ప్రభుత్వ లెక్కల ప్రకారం నాడు రాష్ట్రంలో వంద ఎకరాల ఆయకట్టు కంటే ఎక్కువ ఆయకట్టుకు నీరందించే పెద్ద చెరువుల కింద 31 లక్షల 80 వేల ఎకరాలకు నీరందించగల సామర్థ్యం ఉంది. అదేవిధంగా 66,165 చిన్న చెరువులు, కుంటలు (100 ఎకరాలలోపు) పంచాయితీరాజ్‌శాఖ నుంచి 13-6-2005 నాడు జీవో 216 ద్వారా చిన్నతరహా సాగునీటి శాఖకు బదిలీ అయినవి. వాటి సామర్థ్యం 14 లక్షల 69 వేల ఎకరాలు. అంటే పెద్దా చిన్న చెరువుల కింద మొత్తం నిర్ధారిత ఆయకట్టు 46 లక్షల 49 వేల ఎకరాలు. అయితే ఈ పెద్ద చెరువులు, చిన్న చెరువులు, గండిపడి , పరాధీనమై పట్టించుకునే నాథుడు లేక, మరమ్మత్తులకు నోచుకోక చాలా దీనావస్థలో ఉన్నవని ప్రభుత్వమే చెప్పుతున్నది.

చిన్నతరహా సాగునీటి రంగంలోని పెద్ద చెరువుల కింద 31.80 లక్షల ఎకరాల సామర్థ్యం ఉన్నప్పటికీ, సాగు విస్తీర్ణం విషయమై వినియోగం పనితీరు సంతృప్తికరంగా లేదు. చిన్న చెరువులతో సహా మంచి వర్షపాత సంవత్సరంలో సాగుచేసిన గరిష్ట విస్తీర్ణం 20 లక్షల ఎకరాలుగాను, తక్కువ వర్షపాతం సంవత్సరంలో 10 లక్షల ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం గానూ అంచనా వేయబడింది. కోసం తక్కువ నిధులు సమకూర్చడం మూలంగా అత్యధిక చెరువుల స్థిరమైన నిర్వహణ కొరవడడమే ఇందుకు ముఖ్య కారణం. సాగునీటి వ్యవస్థల నిర్వహణలో ప్రజలు రైతుల ప్రమేయం తగ్గిపోవడం, అంతిమంగా భాగస్వామ్యం, ప్రమేయం అసలే లేకపోవడం కూడా చిన్న తరహా సాగునీటి రంగం దిగజారిపోవడానికి కారణమైంది. ఒకనాటి ఉజ్వలమైన స్వయం సమృద్ధి గల నిర్వహణ రంగం నిర్లక్ష్యానికి గురై శిథిలావస్థకు చేరింది.

ఇక తెలంగాణ విషయానికి వస్తే పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో మైనర్ ఇరిగేషన్ చెరువులు 4679. వీటి కింద ఆయకట్టు 11 లక్షల 22 వేల 428 ఎకరాలు. మరో లక్ష 44 వేల 949 ఎకరాలు. ఇవికాక ఎత్తిపోతలు, ఆనకట్టలు, ఇతర వనరుల ద్వారా మొత్తం 12 లక్షల 67 వేల 377 ఎకరాలు సాగునీరు అందవలసి ఉన్నది. అంతకు ముందు పంచాయితీరాజ్ అధీనంలో ఉండి 2005లో చిన్న తరహా సాగునీటి శాఖకు బదిలీ అయిన చిన్న చెరువులు తెలంగాణలో 30820. వీటికింద ఆరు లక్షల 68 వేల 141 ఎకరాలకు నీరందవలసి ఉన్నది. అంటే మొత్తం చిన్న తరహా పథకాల ద్వారా తెలంగాణలో 19 లక్షల 35 వేల 518 ఎకరాలకు సాగునీటి సామర్థ్యం ఉన్నదని సాగునీటి శాఖ అధికారులు చెప్తున్నారు. తిరిగి అదే పంచాయితీరాజ్‌శాఖ చెరువుల సంగతి పక్కనబెట్టి ఏం చెప్తున్నదంటే చిన్ననీటి తరహా స్కీంల ద్వారా 12 లక్షల 66 వేల 377 ఎకరాలకు సాగునీటి సామర్థ్యం కల్పించినప్పటికినీ వాస్తవానికి 2002లో కేవలం 2.22 లక్షల ఎకరాలకు, 2003లో 3 లక్షల 50 వేల ఎకరాలకు, 2004లో 3 లక్షల 65 వేలకు 2005లో 6 లక్షల 15 వేల ఎకరాలకు అలాగే 2006, 2007, 2008లో 6 లక్షల 43 వేల ఎకరాలకు, 5 లక్షల 84 వేల ఎకరాలకు, 7 లక్షల 15 వేలకు మాత్రమే సాగునీరందివ్వగలిగామని, అంటే 12 లక్షల 67 వేల ఎకరాలకు బదులు కేవలం 2 నుంచి 7 లక్షల ఎకరాల లోపు ఆయకట్టునే నీరివ్వగలిగామని తెలిపింది.

ఇక ఆంధ్రవూపదేశ్ గణాంకశాఖ వారిచ్చే సమాచారం ఆధారంగా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో పనిచేసే ఆచార్య గౌతం పింగ్లే అధ్యయనం తెలంగాణలో చెరువుల పరిస్థితి గురించి ఏం చెప్పుతుందో చూద్దాం. తెలంగాణలో 1875 నుంచి 1940 మధ్య కాలం(65 సంవత్సరాల్లో)లో చెరువుల కింద వ్యవసాయం 9 రెట్లు పెరిగింది. 1940 నుంచి 1957 (17ఏళ్లు) మధ్యకాలంలో 42 శాతం పెరిగింది. నైజాం ప్రభుత్వంలో చెరువుల పునరుద్ధరణ వంటి కార్యక్షికమాలతో ‘మూ డు పువ్వులు ఆరుకాయలు’ గా చెరువుల కింద సాగు భాసిల్లింది. అయితే తెలంగాణను ఆంధ్రలో కలిపాక 1956-57 నుంచి 2008-2009 , చెరువుల కింద సాగు 59 శాతం పడిపోయింది.

ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం ఏర్పడటానికి పూర్వం తెలంగాణలో చెరువుల కింద సాగు 13 లక్షల ఎకరాలుంటే 2005 నాటికి 9 లక్షల ఎకరాలు ఉంటుంది. వర్షాలు పడకపోవడం అని ప్రభుత్వం సాకులు చెబుతున్నా, చెరువుల నిర్వహణ వైపు శ్రద్ధ పెట్టకపోవడం, చెరువుల కింద భూమిని కబ్జాలు చేయడం, చెరువుల పునరుద్ధరణకు నిధులు సమకూర్చకపోవడం అన్నింటికంటే ముఖ్యం. పెద్ద ప్రాజెక్టులలాగ ఈ ప్రాజెక్టుల వల్ల ముడుపులు ఎక్కువగా ముట్టవు కనుక వీటిపై రాజకీయ నాయకులు దృష్టి పెట్టకపోవడం కారణం. 2007- 2008 సంవత్సర గణాంకాలు 1956-57తో పోల్చిచూస్తే తెలంగాణలో చెరువుల కింద సాగు 9 లక్షల 25 వేలు తగ్గింది. కాకపోతే 51 సంవత్సరాలలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి మూలంగా కాలువల కింద సాగు 2 లక్షల 65 వేల ఎకరాలు పెరిగింది. వెరసి చెరువులు, కాలువల కింద సాగు 6 లక్షల 60 వేల ఎకరాలు తగ్గింది. ఈ 51 సంవత్సరాల వ్యవధిలో రైతులు సొంత పెట్టుబడితో బోర్లు వేసుకుని బావుల కింద వ్యవసాయాన్ని 30 లక్షల ఎకరాలు పెంచుకున్నారు. 56-57 నాటి 3 లక్షల ఎకరాల నుంచి 2007-2008 నాటి 33 లక్షల ఎకరాలకు చేరింది. ప్రభుత్వం తెలివిగా చెరువుల కింద భారీగా నష్టపోయిన ఆయకట్టు ప్రసక్తి బయటికి రాకుండా జాగ్రత్త పడి రైతుల కష్టంతో పెరిగిన ఆయకట్టును తమ ఖాతాలో వేసుకున్నది.

ఆంధ్రవూపదేశ్ ఏర్పడ్డాక తెలంగాణ సాగునీటి క్షేత్రం 20 లక్షల నుంచి (56-57 ) 44 లక్షలకు పైగా (2007-2008) పెరిగిందని డబ్బాకొట్టుకుంటున్నది ప్రభుత్వం. నిజానికి ప్రభుత్వ వ్యయంతో పెరిగిన ఆయకట్టు కాలువల కింద నామమావూతంగానే కోల్పోయినా ఆయకట్టు చెరువులు, బోరు బావుల కింద తెలంగాణలో రైతుల పెట్టుబడులతో పెరిగిన ఆయకట్టును తమ ప్రయోజకత్వంగా చెప్పుకుంటున్నారుపస్తుతమున్న వ్యవస్థ పునరుజ్జీవన, పునరుద్ధరణ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు, నాబార్డు, కేంద్ర ప్రభుత్వం , జపాన్ బ్యాంకు నుంచి రుణాలు, నిధులు స్వీకరించి కొత్త చెరువులు ఏర్పాటుతో సహా పాత చెరువుల పునరుద్ధరణ, మరమ్మత్తులు నవీకరణ చేపట్టిన్నట్టు శాసనసభలో ప్రకటన చేశారు.ఏదేమైనా చిన్న ప్రాజెక్టులం అధికారులకు, నాయకులకు చిన్నచూపు. అందులో తెలంగాణ ప్రాజెక్టులైతే, అవి చిన్నవైనా, పెద్దవైనా మరీ చిన్న చూపు. ఈ నేపథ్యంలో తెలంగాణ చెరువులు, కుంటలు, రాష్ట్రావతరణకు పూర్వపు స్థితిని వైభవాన్ని పొందుతాయని చెప్పడం ఆత్మవంచనే అవుతుంది.

- ఆర్. విద్యాసాగర్‌రావు,కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

country oven

Featured Articles