గొంతెండిపోతంది సారూ..


Mon,April 9, 2012 12:03 AM

గోదావరి పక్కనే ఉన్నా మా గొంతు లెండిపోతున్నయి సారూ- మా బతుకులిట్లా తెల్లారవలసిందేనా కనీసం గుక్కెడు నీల్లకయినా మేం నోచుకోలేదా? చెప్పండి సారూ చెప్పండి? మా బాధపూట్లా తీరుతాయి?

- జి. ప్రేమలత, ముధోల్ ఆదిలాబాద్


మీ ఆదిలాబాద్ జిల్లాయే కాదు యావత్ తెలంగాణ మంచినీళ్ల ఎద్దడితో కన్నీళ్ల పర్యంతమవుతున్నది.దేశానికి స్వాతంత్య్రం వచ్చి 65ఏళ్లు పూర్తికావొచ్చినయి. ఆంధ్రవూపదేశ్ ఏర్పడి 55 ఏళ్లు నిండినయి. గోదావరి, కృష్ణానదులు తెలంగాణ నుంచి పారుతున్న వాటిలో పుష్కలంగా నీళ్లున్నా ప్రతియేడు సగటున మూడు వేలు గోదావరి నుంచి, వెయ్యి టీఎంసీలు కృష్ణా నుంచి సముద్రం పాలవుతున్నాయని పాలకులు ప్రకటనలు చేస్తున్న సాగునీరు ఇవ్వకపోతే పోయిరి, కనీసం గుక్కెడు తాగునీళ్ళయినా ప్రజలకు ఇవ్వలేని దుస్థితికి ఏంచెప్పాలో, ఏంచేయాలో అర్థం కావడం లేదు.పొద్దునలేస్తే అభివృద్ధి మంత్రం జపిస్తారు. హైటెక్ సిటీలో ఆకాశహర్మ్యాలు, వంద అంతస్తుల అపార్టుమెంట్‌లు, ఊరూ రా సిమెంట్ కాంక్రీట్ రోడ్లు, ప్రపం చ ఖ్యాతిగాంచిన విమానాక్షిశయం, సూపర్‌మ్కాట్లు, మెట్రోరైళ్లు, నారాయణ, చైతన్య కాన్‌సెప్ట్ స్కూళ్లు, నాలుగు, ఆరులైన్ల రహదారులు, కంప్యూటర్లు, ఇంట్నట్‌లు, ఈ -సేవలు ప్రతి మనిషి దగ్గరా మొబైల్‌ఫోన్లు వగైరా..అభివృద్ధికి సంకేతాలు కావొచ్చు. కానీ ఇంకిపోతున్న బావులు, అడుగంటిపోతున్న భూగర్భజలాలు, కోసుల కొద్దీ కడవపూత్తుకుని పోతున్న మహిళలు, ఆకలిచావులు, ఆత్మహత్యలు చెలిమెల నుంచి గీక్కుని తాగే బురదనీళ్లు. కలుషిత నీటిని తాగి కలరాతో చచ్చే గిరిజనవాసులు, ఫ్లోరైడ్ జబ్బుతో నరకయాతన అనుభవించే నల్లగొండ ప్రజల ఆక్రందనలు.. ఇవన్నీ దేనికి సంకేతాలు?

జాతీయ జలవిధానంలో తాగునీటికి అగ్రతాంబూలం ఇవ్వడం, ప్రతి ప్రాజెక్టులో విడిగా తాగునీటి అంశాన్ని చేర్చాలని కేంద్రం ఆదేశాలివ్వడం, తాగునీరు పొందడం మౌలికహక్కుగా సుప్రీంకోర్టు గుర్తించి, ప్రతిపౌరునికీ తాగునీరు సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలివ్వడం, లోగడ అత్యంత ప్రతిష్టాత్మక రాజీవ్ తాగునీటి పథకం క్రింద ప్రతిపౌరునికీ నిర్ణీత వ్యవధిలో తాగునీటి సౌకర్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు విడుదల చేసి అనేక కార్యక్షికమాలను దేశవ్యాప్తంగా చేపట్టడం ఇవన్నీ జరిగినవే. కానీ ఇవ్వాళ్టి పరిస్థితి ఏమిటి? ఆదిలాబాద్ జిల్లా పరిస్థితే తీసుకుందాం. నీటి వనరులే కాదు, అడవులు, బొగ్గు లాంటి అనేక వనరులు పుష్కలంగా ఉన్న జిల్లా.

ఉత్తరాన పెన్‌గంగ, తూర్పున ప్రాణహిత, దక్షిణాన గోదావరినది, అనేక వాగులు, వంకలు నదులు, ఉపనదులతో కళకళలాడుతున్న జిల్లా. సాలీనా 1051 మిల్లీమీటర్లు సగటున వర్షపాతం కలిగిన జిల్లా. శ్రీరామసాగరం ప్రథమదశ, ద్వితీయదశ, కడం, లోయర్‌పెన్‌గంగ, ప్రాణహిత చేవెళ్ల లాంటి భారీవూపాజెక్టులు, సదర్‌మాట్, స్వర్ణ, సాత్‌నాల, వట్టివాగు, చెలమలవాగు, సుద్దవాగు, ఎర్రవాగు, కొమురంభీం, నీల్‌వాయి, మత్తడివాగు, గొల్లవాగు, రాలివాగు, పెద్దవాగు (జగన్నాథపురం), పెద్దవాగు (బారాకగూడెం)లాంటి మధ్యతరహా ప్రాజెక్టులు, ఇంకా అనేక సాగునీటి శాఖ, పంచాయితీరాజ్‌శా ఖ, ఐడీసీ వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న చిన్నతరహా ప్రాజెక్టులు ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని నిర్మాణమయి మరికొన్ని నిర్మింపబడుతూ, వివిధ దశలలో ఉన్నమాట వాస్తవం. ఇవికాక గోదావరి నదిపైన నిర్మింపబడుతున్న ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి కూడా జిల్లాకు తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్న నేపథ్యంలో పుణ్య క్షేత్రమైన బాసరను (గోదావరి తీరాన ఉన్న క్షేత్రం) దర్శించే యాత్రికులు నిత్యం నీళ్లకు కటకటలాడటమేమిటి? ప్రతిష్టాత్మకంగా ఇటీవలే ప్రారంభించబడిన ఐఐఐటీలో విద్యార్థులు స్నానం చేయడానికి నీళ్లులేక అవస్థలు పడటమేమిటి? ముధోల్‌కు వేళ్లేదారిలో బిద్రెల్లి, గ్రామంలో ఆడవాళ్లు ఖాళీ బిందెలతో స్థానిక ఎమ్మె ల్యే ఎదుట నిరసనలు తెలుపుతూ రహదారిని నిర్బంధించి, అయిదురోజులకోసారి మాకునీళ్లు రావడంలేదు మహావూపభో అని అర్తనాదాలు చేయడమేమిటి? మండల కేంద్రమైన ముధోల్‌లోని ఖజానా చెరువు పూర్తిగా ఎండిపోయి క్రికెట్ గ్రౌండ్‌గా మారడమేమిటి? పదికోట్ల రూపాయల వ్యయంతో చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టిన గోదావరి చెక్ డ్యాం పనులు (బాసర సమీపంలో) కాంట్రాక్టర్‌కు అప్పచెప్పాక, రాజకీయ ఆర్థిక కారణంగా నిలిచిపోయి ఇప్పటికీ ఆ స్కీం ఉందో లేదో తెలియని అయోమయస్థితిలో కొట్టుమిట్టాడమేమిటి? ఇవన్నీ ఏం చెబుతున్నాయి? దేనికి సంకేతమిస్తున్నాయి?
ఇన్ని నీళ్లున్న (ఉన్నాయనుకుంటున్న )మరో కశ్మీర్ అని పోలుస్తున్న ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రజలు గుక్కెడు తాగునీళ్ల కోసం ఇన్ని అవస్థలుపడుతూ ఉంటే ఆ పాపం ఎవరిదని చెప్పాలి? కచ్చితంగా ఆ జిల్లా ప్రజావూపతినిధులదే తప్ప మరొకరిది కాదు. అయితే ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అత్యంత అమాయకులు కావడం, వారికి సంక్రమించిన హక్కుల గురించి వాళ్లకు తెలియకపోవడం, తత్కారణంగా ప్రజావూపతినిధులను నిలదీయకపోవడం, వారు ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయకపోవడం కూడా కారణాలుగా కనిపిస్తున్నాయి.

మామూలుగా ఒక నది ప్రవహిస్తూ ఉంటే దానికి ఇరుపక్కలా ఉన్న దేశా లు, రాష్ట్రాలు, జిల్లాలు, ఊళ్లూ దాదాపు సగం సగం నీటిని పంచుకుంటా యి. అంతర్జాతీయ న్యాయసూవూతాలు చెప్పినా, సహజ న్యాయసూవూతాలు చెప్పినా ఇదేమాట. గతంలో కూడా ఇదే జరిగింది. ప్రత్యేక కారణాలు ఉంటే తప్ప ప్రపంచంలో ఎక్కడైనా అనుసరిస్తున్న విధానమిదే- మన రాష్ట్రం విషయమే తీసుకుందాం- తుంగభద్ర నదికి ఒకవైపు మదరాసు, మరోపక్క హైదరాబాద్ ఉండేవి. జూన్ 1944లో రాసుకున్న ఒప్పందం ప్రకారం ఆ రెండు రాష్ట్రాలకు ఉపయోగపడేటట్టుగా తుంగభద్ర డ్యాం కట్టుకుని, దాని నుంచి చెరి 65 టీఎంసీల నీళ్లు పంచుకున్నాయి. అదే అగ్రిమెంట్‌లో మదరాసు రాష్ట్రంలో అప్పటికే చెలామణి అవుతున్న కేసీ కాలువకు సమానంగా హైదరాబాద్ రాష్ట్రంలో మరో కాలువను కేసీ కాలువకు సమానస్థాయిలో కట్టుకోవచ్చునని రాసుకున్నారు. కాలక్షికమేణ అదే రాజోలిబండ కాలువ అయింది.అయితే సమానం కాదు కదా కనీసం కేసీ కాలువలో పదో వంతు నీటిని కూడా రాజోలిబండ కాలువ పొందకపోవడం దారుణ వివక్షకు గురికావడం వేరే విషయం. అదేమాదిరిగా నాగార్జునసాగర్ ఎడమ కాలువ, కుడి కాలువలు చెరి 132 టీఎంసీల నీళ్లు మోసుకుపోయేటట్టు తీర్చిదిద్దారు. చెప్పొచ్చేదేమంటే గోదావరినదికి ఎడమ పక్కన ఆదిలాబాద్ జిల్లా, కుడి పక్కన నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలున్నాయి. మరి గోదావరి నదిలో నీటిని నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలు రెండూ కలిపి అనుభవిస్తున్న స్థాయిలో ఆదిలాబాద్ అనుభవిస్తున్నదా అనేది ప్రస్తు తం చర్చించదలచుకున్న అంశం. అలా జరగకపోతే కారణాలేమిటి? ఆదిలాబాద్‌లో ఇతర ప్రాజెక్టుల ద్వారా సమృద్ధిగా నీరు లభిస్తూ ఉంటే, గోదావరి జలాలు తక్కువగా వచ్చినా ఫర్వాలేదు. కానీ అలా జరగడం లేదే! ఒక్క కడం తప్ప చెప్పుకోదగ్గ భారీ ప్రాజెక్టు ఏదీ లేదు. దాన్ని నుంచి 6 వేల ఎకరాలకు సాగునీరివ్వాలి. 45 వేల ఎకరాలకు మించి నీరందడం లేదన్నది వాస్తవం.

మరలాంటి పరిస్థితుల్లో గోదావరి నుంచి ఆదిలాబాద్ జిల్లాకు ఎందుకు తగినం త నీరు అందివ్వలేదన్నది అర్థంకాని అంశం. శ్రీరాంసాగర్ నుంచి ఎడమ వైపు లక్ష్మికాలువ, కాకతీయ కాలువ, కుడివైపు సరస్వతి కాలువ ఉన్నాయి. శ్రీరాంసాగర్ ప్రథమదశలో కాకతీయ కాలువ 9 లక్షల 64 వేల ఎకరాలకు నీరు అందివ్వాల్సి ఉండగా ( కరీంనగర్, వరంగల్) లక్ష్మి కాలువ 16 వేల ఎకరాలు (నిజామాబాద్) సాగునీరు అందివ్వవలసి ఉండగా, ఆదిలాబాద్ జిల్లాకు ఉపయోగపడే సరస్వతి కాలువ కేవలం 42 వేల ఎకరాలకు మాత్ర మే నీరు అందించడానికి ఉద్దేశించబడింది. ముందు ఉన్నట్టు శ్రీరాంసాగర్ ద్వితీయ దశలో సరస్వతి కాలువను పొడిగించి మరో 79 వేల ఎకరాల ఆయకట్టుకు గ్రావిటీ మార్గంగా నీరందించే అవకాశమున్నా ఇప్పుడు పథ కం మారిపోయింది. శ్రీరాంసాగర్ ద్వితీయదశ, వరదకాలువ దేవాదుల ప్రాజెక్టులు సాధ్యపడటం లేదు. ప్రాణహిత చేవెళ్ల నుంచి సుమారు లక్ష యాభై వేల ఎకరాలకు, ఎత్తిపోతల ద్వారా సాగునీరందించే ప్రతిపాదన ఉన్నా అది ఎప్పుడు సాకారమవుతుందో తెలియదు. కనుక ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీరాంసాగర్ నుంచి ప్రజావూపతినిధులు కోరుకున్నట్టు మరో 12 టీఎంసీల నీటిని (ండు టీఎంసీలు సదర్‌మాట్‌కు, రెండు టీఎంసీలు సరస్వతి కాలువ ఆయకట్టుకు ఎనిమిది టీఎంసీలు కడం రిజర్వాయర్‌కు) అందించే ఏర్పాటును ప్రభుత్వం తక్షణం చేపట్టాలి. దాంతోపాటు సదర్‌మాట్ బ్యారేజీని వెంటనే చేపట్టాలి.

అదేవిధంగా మరిచిపోయిన బాసర బ్యారేజీని పూర్తిచేయడంలోపాటు కడం డ్యాం ఎత్తును 10 అడుగుల దాక పెంచే అవకాశాన్ని పరిశీలించాలి. ఎల్లంపల్లి నుంచి ప్రస్తుతం తాగునీటి కోసం విడుదల చేయదలిచిన ఐదు టీఎంసీలకు తోడుగా మరో ఐదు టీఎంసీల నీటిని విడుదల చేసి ఆదిలాబాద్ జిల్లావాసుల దాహార్తిని తీర్చాలి. లోయర్ పెన్‌గంగను పూర్తిచేయడంతోపాటు, బచావత్ ట్రిబ్యునల్ అనుమతించిన ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా 12 టీఎంసీల నీటిని ఎత్తిపోతల ద్వారా యుద్ధ ప్రాతిపదికన ఆదిలాబాద్ జిల్లాకు అందించే ఏర్పాట్లు చేయాలి. ప్రాణహిత చేవెళ్ల మెగావూపాజెక్టు ముసుగులో ఎప్పట్నుంచో నలుగుతున్న ప్రాణహిత ప్రాజెక్టును విస్మరించడం, మరుగున పడేయడం దారుణం.

సోదరీ- ఒకపక్కన తాగేనీరు లేక అలమటిస్తుంటే ఈ ప్రాజెక్టుల గోల వినిపిస్తున్నాందుకు అని మీకు అనిపించవచ్చు. నేను చెప్పేది ఆదిలాబాద్‌కు లబ్ధి చేకూర్చే దీర్ఘకాలిక ప్రణాళికల గురించి. తక్షణం చేయవలసింది, నిజామాబాద్ జిల్లాకు అనుసరిస్తున్న పద్ధతిలాగ గోదావరి నుంచి వాలైన ప్రదేశాల్లో పంపింగ్ ప్రారంభించి ఆదిలాబాద్ జిల్లాకు తాగునీరందివ్వడం. అప్పటి వరకు ట్యాంకర్ల ద్వారా నీరందించడం తప్ప ఇప్పటికిప్పుడు మరో పరిష్కార మార్గం కనిపించదు.
గోదావరి జలాలు పుష్కలంగా ఉన్నాయన్న వాదన తెరపైకి తీసుకొచ్చి కృష్ణా జలాలను పక్కనబెట్టి (Krishna Phase II) ఖర్చు ఎక్కువైనాసరే గోదావరి జలాలనే రాజధానికి తీసుకువస్తాం (మొత్తం 30 టీఎంసీల, అర్జెంటుగా 10 టీఎంసీలు ఎల్లంపల్లి నుంచి)అని భీష్మించుకుని యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం పనులు చేపట్టిన వలసపాలకులకు, 165 టీఎంసీల విలువైన గోదావరి జలాలను వరదజలాలు ముసుగులో కృష్ణా బేసిన్‌కు (నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్) తరలించి,ఆ క్రమంలో పోతిడ్డిపాడు నుంచి అక్రమంగా కృష్ణాజలాలను సీమాంవూధకు తరలించాలన్న కుట్రలు పన్నే సీమాంధ్ర పాలకులకు, వారికి తాబేదార్లుగా మారిన వెన్నుముక లేని తెలంగాణ నాయకులకు, పక్కనే గోదావరి ఉన్నా గొంతెండిపోతున్న ఆదిలాబాద్ జిల్లా ప్రజలగోస, బురదనీళ్లు తాగుతూ రోగాల బారిపడుతున్న అడవితల్లిబిడ్డల దీనాక్షికందనలు చెవినపడుతాయా? సమైక్యపాలనలో ఆదిలాబాద్ జిల్లాయేకాదు, తెలంగాణ జిల్లాలకు తాగునీళ్లు అందవు, సాగునీరూ అందదు. కాకపోతే పంచరంగుల కలలు, భ్రమలు కల్పించబడతా యి. అంతే.

-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర