పోలవరం బంగారం- లెండి వెండి


Mon,April 2, 2012 12:11 AM

ఇదిగో అదిగో అని ఎంతకాలం నుంచో ఊరిస్తూ వస్తున్న లెండి, ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది? ఇంత జాప్యానికి కారణాలు ఏమిటి? పోలవరంపైన పాలకులు చూపుతున్న ప్రేమ ‘లెండి’పై ఎందుకు చూపడం లేదు?

- బి. గంగారాం, నిజామాబాద్


నిజమే, మీరన్నట్టు ‘లెండి’ ప్రాజెక్టు పైన మహారాష్ట్ర, ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వాలు ఒప్పందం చేసుకుని 36 ఏళ్ల పుణ్యకాలం గడిచింది. 6-10-75 నాడు చేసుకున్న ఒప్పందంలో లోయర్ పెన్‌గంగ, ప్రాణహితలతోపాటు ‘లెండి’ని కూడా ఉభయ ప్రభుత్వాలు ఉమ్మడి ప్రాజెక్టులుగా చేపట్టాలని నిర్ణయించాయి. కానీ ఏం లాభం ? ఇంత వరకు ఏ ప్రాజెక్టు క్యారరూపం దాల్చలేదుపాణహిత పూర్తిగా గాయబ్ అయింది. ప్రాణహిత- చేవెళ్ల వస్తోంది కదా, ఇంకా ప్రాణహిత అవసరం లేదు. అన్న కారణం కావొచ్చు. కానీ ఆ విషయమైనా స్పష్టం చేయాలి కదా ! ఇంతవరకు ప్రభుత్వం వివరణ ఇచ్చినట్టులేదు. ఇక లోయర్ పెన్‌గంగ DPR (సవివరమైన ప్రాజెక్టు వేదిక) తయారీ స్టేజీలోనే ఉన్నది. ఆ రెండు ప్రాజెక్టులతో పోలిస్తే నిజామాబాద్ జిల్లాలోని బిచ్‌కుంద, మద్దూరు మండలాల్లోని 22 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే ఉద్దేశంతో తలపెట్టిన ‘లెండి’ ప్రాజెక్టు చాలా ముందుంది. అని చెప్పొ చ్చు. లెండి చేసుకున్న సుకృతమేమంటే ప్రభుత్వం సాగునీటికి సంబంధించిన ఏ డాక్యుమెంట్ తయారు చేసినా అందులో తప్పనిసరిగా లెండి ప్రస్తావన ఉండి తీరుతుంది.13-4- 93 నాడు కేంద్ర జల సంఘం మహారాష్ట్రలోని ‘లెండి’ డ్యాం సైట్ దగ్గర మహారాష్ట్ర, ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వాల ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేసింది. అందులో కొన్ని సాంకేతిక ,ఆర్థిక పరమైన విషయాల పైన రెండు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నట్టు ఆంధ్రవూపదేశ్, ప్రభుత్వం వారి సాగునీటి అంశాలపై రిపోర్టు (1995-1996) స్పష్టం చేసింది.

ఆ నిర్ణయాలు చేసిన అంశాలు ఇవి:
1. ఆంధ్రవూపదేశ్ వాటా ఖర్చు అంచనా
2. సాగుచేసే క్షేతం అంచనా
3. పంట వివరాలు, వాటికి నెలవారీగా అవసరమయ్యే నీటి వివరాలు
4. కాలువ సామర్థ్యం వగైరా వివరాలు
ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం నిర్ణయాలనుకనుగుణంగా 19-4-93 నాడే మహారాష్ట్ర ప్రభుత్వానికి ఈ వివరాలన్నీ అందచేసినట్టుగా తెలియ చేయడం జరిగింది. 21--93 నాడు ఔరంగాబాద్‌లో ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో మరో సమావేశం జరిగి సాంకేతిక ఆర్థిక అంశాలపై మరింత స్పష్టత వచ్చినట్టు తెలిసింది. ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం వారి నివేదిక అనుసరించి కేంద్ర జల సంఘం అనుమతి ఇంకా రావలసి ఉందని, ప్రాజెక్టు ఖర్చులో ఎవంత భరించాలి అన్న విషయంపై మహారాష్ట్రలో ఇంకా అవగాహన పూర్తికాలేదని తెలిసింది. ఏదేమైనా 95-96 నాటికి లెండి ప్రాజెక్టుపై చర్చలు ఇంకా జరుగుతున్నట్లు భావించవలసి ఉంటుంది. అంటే 20 సంవత్సరాలు గడిచినా చర్చలు ఓ కొలిక్కి రాలేదని అర్థం చేసుకోవలసి ఉంటుంది.
20-6-1999 నాడు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన గోదావరి జలాల వినియోగ ్రప్రణాళికలో ఈ ప్రాజెక్టు గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. అందులో నిజామాబాద్ జిల్లాలో ఈ ప్రాజెక్టు ద్వారా 2. టీఎంసీల గోదావరి జలాల వినియోగంతో 22 వేల ఎకరాలు సాగులోకి వస్తాయి. ఈ ప్రాజెక్టుపైన రాష్ట్ర వాటా ఖర్చు 106 కోట్ల రూపాయలు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఉమ్మడి ప్రాజెక్టుగా నిర్మించడానికి తన సంసిద్ధతని తెలియ చేసింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వంతో ఈ మేరకు అంతరాష్ట్ర ఒప్పంద పత్రాన్ని ఖరారు చేయవలసి ఉంది. అని రాసుంది.

ఇక శాసనసభలో ప్రవేశపెట్టిన 2005-2006 సంవత్సరపు భారీ మరియు మధ్యతరహా సాగునీటి డిమాండ్ (నెంబర్ X X X I I I )పై వివరణ డాక్యుమెంట్‌లో నాటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఏమన్నారంటే ‘లెండి’ ప్రాజెక్టు మహారాష్ట్ర, ఆంధ్రవూపదేశ్ రాష్ట్రాల మధ్య ఏర్పాటు చేయబడిన ఉమ్మడి ప్రాజెక్టు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముఖేడ్ తాలూకా, గోనెగావ్ గ్రామం దగ్గర లెండి నదిపై ఈ రిజర్వాయర్‌ను ప్రతిపాదించడమయింది. ప్రతిపాదిత స్థలంలో నీటి లభ్యత 7.423 టీఎంసీలు అందులో ఆంధ్రవూపదేశ్ వాటా ప్రవాహ నష్టాలతో కలిపి 2.3 టీఎంసీలు, మహారాష్ట్రలోని ఎడమగట్టు కాలువ 20.46 కిమీ వద్ద ప్రారంభమయ్యే 34. 57 కిమీల పొడవు గల కుడి గట్టు కాలువ ఆంధ్రవూపదేశ్‌లో 22 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి ప్రతిపాదించడమయినది. మొత్తం మీద నిజామాబాద్ జిల్లా మద్దూరు, బిచ్‌కుంద మండలాలలోని 31 గ్రా మాలకు ప్రయోజనం చేకూరుతుంది.ఈ ప్రాజెక్టు మొత్తం విలువ రూ. 275 కోట్లకు గాను, ఆంధ్రవూపదేశ్ వాటా రూ. 117.7 కోట్లు (ఎస్‌ఎస్‌ఆర్ 2000-2001).
లెండి నది వద్ద డ్యాం పని కొనసాగుతున్నది. నిర్వాసితులకు చెల్లింపులు చేయవలసి ఉంది. మహారాష్ట్ర, ఆంధ్రవూపదేశ్‌లో కాలు వ సర్వే పనులు జరుగుతున్నాయి. ఆంధ్రవూపదేశ్‌లో లెండి నదిపై ప్రధాన నిర్మాణ పనిని అతి త్వరలో ప్రారంభించడం జరుగుతుంది. నీటిని పంచుకోవడంతో సహా అంతర్‌రాష్ట్ర అంశాలపై స్థూల ఏకాభివూపాయం కుదిరింది. లెండి ప్రాజెక్టు అమలు, నిర్వహణ కోసం మహారాష్ట్ర, ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వాల మధ్య అంతర్‌రాష్ట్ర ఒప్పందాన్ని 1-11-2003 తేదిన కుదుర్చుకోవడం జరిగింది. ఇప్పటికీ అమలు చేసిన పనుల కోసం తన వాటాగా ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం రూ.12.9 కోట్ల మొత్తాన్ని విడుదల చేసింది. 2005-2006 బడ్జెట్ అంచనాలలో రూ. 15 కోట్ల మొత్తాన్ని సమకూర్చడమయినది. అంటే 30 సంవత్సరాల తర్వాత లెండి ప్రాజెక్టు పురోగతి పైన చెప్పిన విధంగా ఉంది. మరో ఆరు సంవత్సరాల తర్వాత లెండి గురించి ప్రభుత్వం ఏం చెప్పిందో గమనిద్దాం.

24-12-2012 నాటి ప్రభుత్వ నివేదిక లెండి వూపాజెక్టుపైన తాజా సమాచారాన్ని తెలియజేప్పింది. దానిలోని ప్రధానమైన అంగాలు ఇవి. లెండి డ్యాం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముఖేడ్ తాలూకా గోనెగావ్ వద్ద ఉన్నది. ప్రాజెక్టు ద్వారా మొత్తం 49వేల ఎకరాలకు సాగునీరందుతుంది. అందులో మన వాటా 22వేల ఎకరాలు. ప్రాజెక్టు దగ్గర లభించే నీరు 6.36 టీఎంసీలు (ముందు చెప్పినట్లుగా 7.423 టీఎంసీలకు భిన్నంగా)అందులో ఆంధ్రవూపదేశ్ 2.43 టీఎంసీలు, మహారాష్ట్ర 3.93 టీఎంసీలు వాడుకుంటాయి. ప్రాజెక్టు ఖర్చు 1-11-2003 నాటి అంతపూరాష్ట్ర ఒప్పం దం అనుసరించి ఆంధ్రవూపదేశ్ 3 శాతం, మహారాష్ట్ర 62 శాతం భరిస్తాయి. ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం జారీచేసిన రెండవ సవరించిన పరిపాలక ఆమోదం ప్రకారం(జీవో 397,తేదీ :16.06-2010) ప్రాజెక్టు విలువ 263.9 కోట్ల రూపాయలు. ఇందులో డ్యాం హెడ్‌వర్క్స్‌కు గాను 117.22 కోట్లు(39 శాతం మన వాటా)19 కిలోమీటర్ల ఉమ్మడి కాలువకు గాను మన వాటా 2.66 కోట్లు. మహారాష్ట్రలో మన కోసం తవ్వే కాలువ 7.5 కి.మీ.పై ఖర్చు 44.47కోట్లు. వెరసి 190.35 కోట్ల రూపాయలను మనం మహారాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటుంది. నవంబర్ 2011 వరకు 152.23 కోట్ల రూపాయలను మహారాష్ట్రకు చెల్లించడం జరిగింది. ఇంకా మహారాష్ట్ర భూ భాగంలో 1.93 కి.మీ. కాలువ తవ్వకం పనులు మిగిలి ఉన్నాయి. దానిపై ఖర్చు ఖరారు అయిన పిమ్మట మనం భరించవలసి ఉంటుంది. ఇక మన భూభాగం విషయానికి వస్తే 9.43 కి.మీ.నుంచి 34.57 కి.మీ.వరకు అంటే.. 25.14 కి.మీ. ప్రధాన కాలువ, ఉప కాలువలు వగైరా పనులకు 45.75 కోట్ల రూపాయల ఖర్చవుతుందని అంచనా వేయడం జరిగింది. ఇందులో నవంబర్ 11నాటికి 12.491 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి ప్రధానమైన అడ్డంకి భూసేకరణ అని ప్రభుత్వం చెబుతున్నది. మొత్తం కాలువల కోసం 1075 ఎకరాల భూసేకరణ జరగవలసి ఉండగా నవంబర్ 2011నాటికి 410 ఎకరాలు సేకరించినట్లు పధాన కాలువలకు దాదాపు పూర్తి భూసేకరణ జరిగింది), మిగిలిన భూసేకరణ కోసం ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు తెలియవచ్చింది.

మహారాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు 75 శాతం పనులు పూర్తి చేసింది. మన భూభాగంలో కాలువ, పంపిణీ వ్యవస్థ, కాలువలపై నిర్మాణాలు, భూసేకరణ కావొచ్చు, ఇతర కారణాలు కావచ్చు కేవలం 2 శాతం పనులు మాత్రమే పూర్తయినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 177.121 కోట్ల రూపాయలు ఖర్చయినా ప్రాజెక్టు పూర్తి కాలేదు. 2011-12 సంవత్సరానికి 60 కోట్ల రూపాయల బడ్జెట్ సమకూర్చినా12 కోట్ల రూపాయలే ఖర్చు అయినట్లు తెలిసింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే కేవలం 2.3 టీఎంసీల నీటి వినియో గం, 22వేల ఎకరాలకు సాగునీటి సౌకర్యం. అదే వెనుకబడ్డ జిల్లాలోని రెండు మండలాల్లో 31 గ్రామాల ప్రజలకు ఉపయోగపడే స్కీంనొండి పూర్తి కావడానికి 36 సంవత్సరాలు గడిచినా ఇంకా ఒక కొలిక్కి రాకపోవడం. ఈ స్కీం గురిం చి ఇంతగా ఎందుకు ప్రస్తావించవలసి వస్తుందంటే ఇది గ్రావిటీ మార్గంగా (వాలుమార్గంగా) అంటే డ్యాం, కాలువల ద్వారా నీరందించే పథకం.ఎత్తిపోతలు లేవు. ఖర్చుకూడా అట్టే లేదు. ఎందుకు ఆలస్యమవుతున్నది అనేది ఆందోళన కలిగించే అంశం. మన మేం చేస్తాం మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదనో, కేంద్ర జలసంఘం అనుమతులు ఇవ్వలేదనో తేలిగ్గా చెప్పి తప్పుకోవచ్చు. కానీ మన ప్రభుత్వం చిత్త శుద్ధిగా ఈ ప్రాజెక్టు సాకారం కోసం ప్రయత్నాలు చేసిందా అన్నది అనుమానమే. ఇకపోతే భూసేకరణ సమస్య. ఇందులో నూటికి నూరు శాతం ప్రభుత్వానిదే తప్పు. మార్కెట్ రేటు కాకుండా ఏదో ఓ రేటు నిర్ణయించి ఆ రేటుకే రైతులు తమ భూముల్ని ప్రభుత్వ ప్రయోజనాలకు అంతా పక్షపాత ధోరణిలో ఈ భూసేకరణ కార్యక్షికమం కొనసాగడం మనం చూశాం. రైతులకు నాయమైన రేటు ఇస్తే భూముల్ని వదులుకోవడానికి ప్రజా ప్రయోజనాల కోసం వెనుకాడరు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వితీయ దశ పనులు ఖమ్మం ఏరియాలో సరియైన రేట్లు చెల్లించని కారణంగా భూసేకరణ పనులు ఏళ్లకొద్దీ ఆగిపోవడం అందరికీ తెలుసు. బహుశా లెండి పనులు కూడా ఈ కారణంగానే ఆలస్యమవుతున్నట్లుగా భావించవలసి వస్తుంది. ఏదేమైనా శాశ్వతంగా తమ జీవనోపాధిని కోల్పోయే రైతుల పట్ల ప్రభుత్వం మరింత ఉదారంగా మానవీ య కోణంలో ప్రవర్తించవలసిన అవసరం ఉన్నది.
ఇటు లెండి ప్రాజెక్టు కానివ్వండి, అటు లోయర్ పెన్‌గంగ కానివ్వండి రెండూ చాలా చిన్న పథకాలే. రెండూ మహారాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సాకారం కావలసినవే.

కానీ ఇవి రెండూ గ్రావిటీ పథకాలు. ఎలాంటి విద్యుత్ అవసరాలతో నిమిత్తం లేకుండా ప్రవాహ మార్గంగా తెలంగాణలోని వెనుకబడ్డ ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ప్రజల అవసరాలను పాక్షికంగా తీర్చేవే! కనుక ప్రభుత్వం తన వివక్ష విడనాడి మరింత చిత్త శుద్ధితో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సత్వర చర్యలు చేపట్టాలి. అదే విధంగా రైతుల పట్ల మరింత ఔధార్యం ప్రదర్శించి భూసేకరణ పనులను వేగవంతం చేయాల్సిన అవసరం కూడా ఉంది. అసలు విషయం ఏమిటంటే.. లెండి పూర్తి కాకపోయినా, పెన్‌గంగ పూర్తి కాకపోయినా వలస పాలకులకు పోయేదేమీ లేదు. ఆ నీళ్లు కాస్త కిందకు పారతాయి. సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్టకు ఎన్ని పోచికోలు కబుర్లు చెప్పినా వలస పాలకులకు తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి కావాలన్న ఆదుర్దా, తపన ఎందుకుంటుంది? తెలంగాణ వాడు కాకపోతే ఆ నీళ్లన్నీ ఆంధ్రకే , కృష్ణా అయినా, గోదావరి అయినా ఇదే కథ. ఏదో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామన్న పేరు తప్ప సీమాంధ్ర ప్రాజెక్టుల పట్ల ఉన్న శ్రద్ధ చస్తే తెలంగాణ ప్రాజెక్టుల పట్ల ఉండదు. పోలవరంపై ఉన్న ప్రేమ ప్రాణహితపైన గానీ, లెండి పైన గానీ ఉండదు. పోలవరం బంగారం అయితే లెండి వెండి. కనుక పరిష్కారం ఒక్కటే. ప్రత్యేక రాష్ట్రం.

-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

country oven

Featured Articles