పెనుగంగకు మోక్షమెప్పుడు?


Mon,March 26, 2012 01:56 AM

లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు గురించి నా చిన్నతనం నుంచి వింటున్నాను. మా ఆదిలాబాద్ జిల్లాకు లాభించే ప్రాజెక్టుపై ప్రభుత్వానికి చిన్న చూపెందుకు? ఆ ప్రాజెక్టుకు ‘లోయర్’ స్టేటస్ వెలుగుచూసేదెప్పుడు? ‘లోయర్ పెన్‌గంగ’ లాగే తెలంగాణలో ఇంకా ఎన్ని ప్రాజెక్టులు మురుగుతున్నాయి?

-కె. ఆదిలక్ష్మి రాథోడ్, ఆదిలాబాద్


లోయర్ పెన్‌గంగ లాంటి అనేక ప్రాజెక్టులు వలస పాలకుల వివక్షకు గురయి అవస్థలు పడుతున్నాయి. కొన్ని శాశ్వతంగా కనుమరుగయ్యాయి. మరికొన్ని మరుగుజ్జులయ్యాయి. నత్తనడకన, అటు బతికున్నట్టు కాక, ఇటు బంద్ అయినట్టు కాక నడుస్తున్న ప్రాజెక్టులు కొన్ని.190లో ప్రచురించబడిన ‘గోదావరి జల వివాద ట్రిబ్యునల్’ (దీన్ని కూడా బచావత్ ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తారు) -గోదావరి నది భాగస్వామ్య రాష్ట్రాలు పరస్పరం వివిధ సందర్భాలలో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ ఒకచోట చేర్చి ఈ ట్రిబ్యునల్ రిపోర్టుగా బహిర్గతం చేయడం జరిగింది. పోలవరం, ఇచ్చంపల్లి, లోయర్ పెన్‌గంగ, ప్రాణహిత, సింగూరు, పోచంపాడు, (శ్రీరాంసాగర్), లెండి మొదలైన ప్రాజెక్టుల గురించి వివిధ ఒప్పందాలలో నిర్ణయాలున్నాయి.అలాంటి ఒప్పందాలలో ఒకటి ఆంధ్రవూపదేశ్ ముఖ్యమంత్రి వెంగళరావు, మహారాష్ట్ర మఖ్యమంత్రి ఎస్. బి.చవాన్ 6-10-75న సంతకాలు చేసింది.ఆ ఒప్పందంలోని (7వ) పేరాను పరిశీలిద్దాం.
మహారాష్ట్ర, ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వాలు ఈ కింద ఉదహరించిన ప్రాజెక్టులను, పరస్పరం అంగీకరించిన వినియోగంతో సరైన సమయంలో చేపట్టాలని, ఇందు కోసం ఉమ్మడి కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి.
1) లెండి ప్రాజెక్టు, 2) లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు,
3) ప్రాణహిత ప్రాజెక్టు
7--7 నాడు మహారాష్ట్ర, మధ్యవూపదేశ్, ఆంధ్రవూపదేశ్, సాగునీటిశాఖ సచివులు చేసుకున్న ఒప్పందంలో లోయర్ పెన్‌గంగ గురించి ఈ విధంగా ప్రస్తావించబడింది. పెన్‌గంగ నదిపైన చికల్‌వార్ధా చోటు దగ్గర లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టును ఉమ్మడి ప్రాజెక్టుగా చేపట్టాలిపాజెక్టు వివరాలను ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం చర్చించుకుని నిర్ణయిస్తాయి. ఇదే ఒప్పందంలో మరోచోట మహారాష్ట్ర, ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వాలు ప్రాణహిత నదిపైన అనువైన చోట బ్యారేజీ నిర్మాణం చేసి, వారివారి ప్రదేశాలలో సాగునీటి సౌకర్యం కల్పించవచ్చు అని, ఇందుకోసం అవసరమైన అంగీకార పత్రాలను సిద్ధం చేసుకోవచ్చని స్పష్టం చేయబడింది.
ఈ విషయాలను బట్టి ఆదిలాబాద్ జిల్లాకు ఉపయోగపడే లోయర్ పెన్‌గంగ, ప్రాణహిత ప్రాజెక్టులను 1975లోనే చేపట్టాలని ముఖ్యమంవూతులు నిర్ణయించి, 197లో సంబంధిత సచివులు అంగీకార పత్రాలపై సంతకాలు చేశారని తెలుస్తున్నది. అంటే 36 ఏళ్ల కిందట ముఖ్యమంవూతులు నిర్ణయించిన ఈ రెండు ప్రాజెక్టులు ఇంతకాలం సాక్షాత్కరించకపోవడంలో ఆంతర్యం ఏమిటి? మహారాష్ట్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ ఆదేశాలను ఉల్లంఘించి వెనక్కి వెళ్లిందా? అలా కానప్పుడు ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను అమలు చేయించడంలో ఎందుకు ఇంత జాప్యం జరిగింది? ఈ ప్రశ్నకు జవాబు ఎవరు చెబుతారు? ఈ విషయం చర్చించుకునే ముందు ఈ రెండు ప్రాజెక్టుల గురించి మరికొంత వివరంగా తెలుసుకుందాం. ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం 29-6-1999నాడు ‘ఆంవూధవూపదేశ్‌లో గోదావరి జల వనరులను వినియోగించే ప్రణాళిక’ అని ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేసిం ది. అందులో ‘లోయర్ పెన్‌గంగ’, ‘ప్రాణహిత’ ప్రాజెక్టుల గురించి సంక్షిప్తంగా వివరాలు పొందుపర్చబడ్డాయి.

లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు
ఇది మహారాష్ట్రలో నిర్మించబడే అంతర్ రాష్ట్ర ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నుంచి ఐదు టీఎంసీల నీటిని వినియోగించుకుని ఆదిలాబాద్ జిల్లాలోని 40 వేల ఎకరాలకు సేద్యపు సౌకర్యాన్ని అందజేస్తారు. మొత్తం ప్రాజెక్టు ఖర్చు 162 కోట్ల రూపాయలు. కాగా అందులో ఆంధ్రవూపదేశ్ వాటా 200 కోట్ల రూపాయలు.

ప్రాణహిత ప్రాజెక్టు
ఈ ప్రాజెక్టు 12 టీఎంసీల నీటిని ఉపయోగించుకుని ఆదిలాబాద్ జిల్లాలోని 7 వేల ఎకరాలకు సాగునీటి వసతి కల్పిస్తుంది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం 154 మీటర్ల ఎత్తుతో మహారాష్ట్రలో బ్యారేజీ నిర్మాణానికి, ఆ రాష్ట్రంలో కలగనున్న ముంపు కారణంగా ఒప్పుకోలేదు. మహారాష్ట్రలో ఎలాంటి ముప్పు లేకుండా ఉండేందుకు 150 మీటర్ల ఎత్తులో కట్టడం ఉండాలని, తద్వారా 33 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేసి ఆదిలాబాద్ జిల్లా ‘సిర్‌పూర్’ మండలానికి12 టీఎంసీల నీటిని అందించాలని ప్రతిపాదించడం జరిగింది. ఈ విధంగా బ్యారేజీని తక్కువ ఎత్తుతో నిర్మించాలని, అందుకు అవసరమైన అంత ర్ రాష్ట్ర, పర్యావరణ అనుమతులు పొందాలని ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం నిశ్చయించింది.

పై రిపోర్టును బట్టి ఏమర్థమవుతోంది? 25 ఏళ్లు గడిచినా ఇంకా ప్రతిపాదనల స్థాయిలోనే ఈ రెండు ప్రాజెక్టులున్నాయి అని కదా! 3 మార్చి 2003లో ‘ది ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్’ వారు విడుదల చేసిన సావనీర్‌లో ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టుల గురించి తెలియజేస్తూ లోయర్
పెన్‌గంగ, ప్రాణహితలను కొత్త ప్రాజెక్టులుగా అభివర్ణించడం జరిగింది. అంటే నిర్మించబడ్డ, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కాక మూడోక్షిశేణి కొత్త ప్రాజెక్టుల లిస్ట్‌లో ఈ రెంటినీ చేర్చారన్న మాట. అయితే ఈ పుస్తకంలో లోయర్‌పెన్‌గంగ ఆయకట్టు 40 వేల ఎకరాలు అని కరెక్ట్‌గానే చూపినా ప్రాణహిత ఆయకట్టు 50 వేలకు తగ్గించి చూపడం విశేషం.

ప్రతి ఏడూ బడ్జెట్ సమావేశాలలో భారీ సాగునీటి శాఖ అమాత్యులు ‘భారీ, మధ్యతరహా సాగునీటిపై వివరణ’ ఇస్తూ డిమాండ్ నెం XXX111 ప్రవేశపెట్టడం ఆనవాయితీ. 2010-11 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశంలో శాసనసభలో ప్రవేశపెట్టిన డాక్యుమెంట్‌లో ప్రప్రథమంగా లోయర్ పెన్‌గంగ గురించి ప్రస్తావించడం జరిగింది. ఆ పుస్తకంలో ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టును (హెడ్‌వర్క్స్) మహారాష్ట్రలోని యావత్‌మల్ జిల్లా షటాన్జీ తాలుకాకు చెందిన తాడ్‌సోలీ గ్రామం దగ్గర పెన్‌గంగపైన నిర్మిస్తున్నారని, ఆప్రాజెక్టు కుడి కాలువ 4.6 కిలోమీటర్ల పొడవున ఆదిలాబాద్ జిల్లాలోని వెనుకబడిన, గిరిజన ప్రాంతాలలోని 61 గ్రామాలకు సాగునీరు అందిస్తుందని,ఆయకట్టు 27309 హెక్టార్లు అని (సుమారు 6 వేల ఎకరాలు) తెలియజేశారు. మహారాష్ట్ర, ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వాలు 6-10-75 నాడు పరస్పరం అంగీకరించినా, ఈ ఉమ్మడి ప్రాజెక్టు గురించి సాంకేతిక, ఆర్థిక విషయాల గురించి చర్చలు 197-4 మధ్యలో జరిగాయని తెలిపారు. అందులో మహారాష్ట్ర 37.55 టీఎంసీలు, ఆంధ్రవూపదేశ్ 5.12 టీఎంసీలు వాడుకుంటాయని, బ్యారేజీ నిర్మాణం అక్కడ్నుంచి నీటిని మోసుకెళ్లే కాలువపైన ఖర్చును నీటి వినియోగాల నిష్పత్తిలో అంటే :12లో పంచుకుంటాయి. ఆంధ్రవూపదేశ్ కోసం మహారాష్ట్రలో ప్రత్యేకం గా తీసే కాలువ, అలాగే ఆంధ్రవూపదేశ్‌లో ప్రవహించే కాలువపై ఖర్చును ఆంధ్రవూపదేశ్ భరించాలి. ఇవీ స్థూలంగా నాటి అగ్రిమెంట్‌లో పొందుపరిచిన విషయాలు.

నిర్మాణం పనులను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ‘ఉమ్మడి నియంవూతణ మండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగింది’. అయితే ఇంతవరకు ఈ మండలి ఏర్పాటు విషయం మహారాష్ట్ర ఖరారు చేయలేదని కూడా రిపోర్టులో ప్రస్తావించడం జరిగింది. ఈ పథకానికి 1356.2 కోట్ల రూపాయల ఖర్చు కాగలదని, అందుకోసం పరిపాలక ఆమోదాన్ని ఇవ్వవలసిందిగా కోరామని, ఇంతవరకు ఆమోదం రాలేదని ఆ డాక్యుమెంట్ తెలుపుతూ 2010-11కు గాను 10 కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయించాలని డిమాండ్ చేయడం చూపింది. అంటే 2010-11 దాకా ‘లోయర్ పెన్‌గంగ’ కు పరిపాలక ఆమోదం లేదని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇకపోతే 2011-12 డిమాండ్ డాక్యుమెంట్‌ను పరిశీలిస్తే ‘లోయర్ పెన్‌గంగ’ ప్రస్తావనే లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే సంవత్సరం గడిచినా పరిపాలక ఆమోదం లభించలేదా లేక ఆ విషయాన్ని ప్రస్తావించడం అమాత్యులు మరిచారా? 2010-2011 మాదిరిగానే 2011-12 సంవత్సరానికి కూడా బడ్జెట్ డిమాండ్ 10 కోట్ల రూపాయలుగా చూపించారు. దీన్నిబట్టి స్పష్టమవుతున్నదేమంటే ఊరికే బడ్జెట్ డిమాండ్ చూపెట్టడం తప్ప లోయర్ పెన్‌గంగ విషయంలో ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం చేసింది శూన్యమని కాకపోతే ప్రాజెక్టు క్షేత్రస్థాయి నివేదిక (డీపీఆర్) తయారవుతోందని అంటూ సక్రమంగా కొనసాగితే వచ్చే సంవత్సరం పని ప్రారంభం కావొచ్చని ప్రభుత్వ భోగట్టా.
ఇదిలా ఉంటే ప్రాణహిత ప్రాజెక్టు విషయానికి వస్తే 2005- 06 సంవత్సరపు సాగు నీటి డిమాండ్ పై వివరణ పుస్తకంలో ఈ విధంగా రాసి ఉంది. 6-10-1975 న కుదుర్చుకున్న అంతర్ రాష్ట్ర ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్టును ఉమ్మడి ప్రాజెక్టుగా చేపట్టడానికి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దరిమిలా మహారాష్ట్ర ప్ర భుత్వం మొగు ్గచూపలేదు. అందుచేత ఆదిలాబాద్ జిల్లాలోని 50 గ్రామాలను కలుపుకొని దాదాపు 50 వేల ఎకరాలకు సాగునీటిని అం దించడానికి నదిపై ఆనకట్ట నిర్మించకుండా నదీ జలాలను నేరుగా మళ్ళించడానికి ప్రాణహిత ప్రాజెక్టును ప్రతిపాదించడం జరిగింది. సవరించిన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి.

మరుసటి సంవత్సరం 2006-07 బడ్జెట్ పుస్తకం చూస్తే ప్రాణహిత ప్రాజెక్టు ఎగిరిపోయింది. కొత్తగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తెరపైకి వచ్చిం ది. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 2006-07 నుంచి ప్రతి సంవత్సర ప్రభుత్వ పుస్తకాలలో ప్రసంగాలలో వెలుగుతూనే ఉంది. దాని గురించి అనేక సార్లు చర్చించుకున్నది. చెప్పొచ్చేదేమంటే 1975 సంవత్సరం (6-10-1975)లో కుదుర్చుకున్న రెండు పథకాలు, లోయర్ పెన్‌గంగ, కేవలం 5 టీఎంసీల జలాల వినియోగం, ప్రాణహిత ప్రాజెక్టు 12 టీఎంసీల జలాల వినియోగంతో గ్రావిటీ మార్గంగా (ఎత్తిపోతలు కాదు) ఆదిలాబాద్ జిల్లాలో లక్షపైగా ఎకరాల సాగు చేసే అవకాశం ట్రిబ్యునల్ కల్పిసే-్త ఒక పథకానికి పాణహితకు) గండికొట్టారు. రెండవ పథకానికి ఇంతవరకు అతీగతీ లేదు. మరి పోలవరం విషయంలో ఇదే ట్రిబున్యల్ జత పరిచిన 197, 190 సంవత్సరాల ఒప్పందాల ఆధారంగా ఈ ప్రాజెక్టును పొరుగు రాష్ట్రాలు ఎన్ని అభ్యంతరాలు చెపుతున్నా ప్రభుత్వం ప్రారంభించింది. 4 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కాలువలు తవ్వడం పూర్తిచేసింది. అదే తెలంగాణకు చెందిన ఇచ్చంపల్లి విషయంలో ట్రిబ్యునల్ ఆదేశాలు ఏమవుతున్నాయి. పక్క రాష్ట్రాలు ఒప్పకోవడం లేదని ఇచ్చంపల్లిని ఎగరగొట్టడం జరిగింది. వలసపాలకులకు కావలసిన సింగూరును దేవనూరును బలిపెట్టి ట్రిబ్యునల్‌లో చేర్చి సాధించారు.

ఒక్క మాటలో చెప్పాలంటే లోయర్ పెన్‌గంగ’ ఇంకా ప్రారంభమే కాలేదు. ప్రాణహితను ప్రాణహిత- చేవెళ్ల ముసుగులో, దేవనూరును సిం గూరు మాయలో ‘ఇచ్చంపల్లి’ ని పక్కరాష్ట్రాలు ఒప్పుకోవడం లేదన్న మిష తో ఖతం పట్టించారు. పక్క రాష్ట్రాల అభ్యంతరాలు వలస పాలకులకు అవసరమనుకున్న ప్రాజెక్టుల విషయంలో బేఖాతరవుతయి. ఉదాహరణః గోదావరిలో పోలవరం కృష్ణాలో తెలుగుగంగ, గాలేరు, నగరి, హందీనీవా, వెలిగొండ వగైరా..

గ్రావిటీ మార్గంగా తెలంగాణకు నీరందించే ప్రాజెక్టులే తక్కువ. అందులో కేవలం 5 టీఎంసీల నీటిని ఉపయోగించే లోయర్ పెన్‌గంగ విషయంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం, ఉదాసీన వైఖరి గమనిస్తుంటే 36 ఏళ్లయినా పూర్తయినా ప్రారంభం గానీ ఈ ప్రాజెక్టు సమైక్యాంవూధలో బతికిబట్టకడుతుందా అన్నది అనుమానమే. ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టు జాప్యానికి చెప్పే కారణమొక్కటే ‘పొరుగు రాష్ట్రాలు అభ్యంతరాలు చెప్పుతున్నాయి’ అని. ఇక ఈ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే తెలంగాణ ప్రాజెక్టుల గతి అంతే. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే పరిష్కార మార్గం.

- ఆర్. విద్యాసాగర్‌రావు, కేంద్రజల సంఘ మాజీ చీఫ్ ఇంజనీర్

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

Featured Articles