కంతనపల్లి కోసం ఉద్యమిద్దాం


Sun,March 18, 2012 11:45 PM

కంతనపల్లి ప్రాజెక్టు పూర్తిచేయనిదే, దేవాదుల ప్రాజెక్టు నిరుపయోగంగా ఉంటుందని పేపర్‌లో చదివాను ఇది ఎట్లా? దేవాదుల ఇదివరకే కొంత భాగం పూర్తిచేయబడింది కదా? దీనిపై వివరణ ఇవ్వగలరు. కంతనపల్లి ప్రాజెక్టు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కెనాల్‌కు చాలా ముఖ్యమైనదని తెలుపబడింది ఇది ఎట్లా? దేవాదుల, కంతనపల్లి రెండు ఎత్తిపోతల పథకాలు ఏటూరునాగారం పరిధిలోకి వస్తున్నప్పుడు, వాటి మధ్య దూరమెంత వివరించగలరు?

చొల్లేటి శ్రీశైలం, హుజురాబాద్, కరీంనగర్



మీరు చదివింది నూటికి నూరుపాళ్లు నిజం. దేవాదుల ప్రాజెక్టు సక్రమం గా పనిచేయాలంటే, నిర్ధారిత లక్ష్యమైన 6,21,000 ఎకరాలకు నీరందించాలంటే కంతనపల్లి కట్టడం తప్పనిసరి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అదేవిధంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువలు గలగలా ప్రవహించాలంటే, నీళ్లతో కళకళలాడాలంటే కంతనపల్లి కట్టితీరవలసిందే. అయితే దురదృష్టవశాత్తు ఈరోజు వలసపాలకులు జీవో ఒకటి అనే కాలనాగును వదిలారు. అది కంతనపల్లిని కాటేయబోతోంది. కాటేయకుండా కాపాడి, కాటే స్తే ఆ విషాన్ని వదిలించి కంతనపల్లిని బతికించుకోవాల్సిన ఆపత్సమయం వచ్చింది. అదెలాగో వివరిస్తాను. నవంబర్ 2, 2011 నాటి ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో దేవాదుల కంతనపల్లి గురించి విపులంగా వివరించాను. ఇప్పుడు మీరు అడగడమే కాకుండా దరిమిలా జీవో ఒకటి అవతరించింది. కాబట్టి మరోసారి చర్చించుకోవడం సమంజసంగా ఉంటుంది.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మొదటి దశలో మొత్తం 9,6,000 ఎకరాల ఆయకట్టు ఉంది. రెండవ దశలో 4,40,000 ఎకరాల ఆయకట్టు ఉంది. మొదటి దశలో 5,00,000 మించి సాగునీరు అందడం లేదని చీఫ్ ఇంజనీర్ల కమిటీయే తేల్చి, తమ నివేదికలో ఆ విషయాన్ని స్పష్టం చేసింది. కాకతీయ కాలువలు, వాటి ఉప కాలువల వ్యవస్థ ద్వారా మిగతా ఆయకట్టుకు కావలసిన నీటిని ఇతర స్కీంల ద్వారా అందజేయాల్సిన అగత్యాన్ని ప్రభుత్వానికి నొక్కిచెప్పింది. ఆ నేపథ్యంలోనే ‘కంతనపల్లి’ ఆవశ్యకతను ప్రభు త్వం గుర్తించింది. కంతనపల్లి ప్రాజెక్టు మొత్తం రెండు దశలలో 100టీఎంసీల గోదావరి నీటిని వినియోగంలోకి తెస్తుంది. అయితే ప్రభుత్వం మొదటి దశకు మాత్రమే పరిపాలక ఆమోదాన్ని తెలిపింది. మొదటి దశ ద్వారా 50 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా కాకతీయ కాలువలకు అందజేయడం కంతనపల్లి ప్రధాన లక్ష్యం. ఇందుకోసం 10,409 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రభుత్వం పరిపాలక ఆమోదాన్ని తెలియజేసింది. గోదావరినదిపై ఏటూరు నాగారం (వరంగల్ జిల్లా) మండలంలోని కంతనపల్లి గ్రామం దగ్గర బ్యారేజీ నిర్మాణం జరగవలసి ఉంది. ఇందులో 22.51 టీఎంసీల నీటిని నిలువచేస్తారు. బ్యారేజీ నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా దారి మధ్యలో సొరంగాలు, కాలువలు, జలాశయాలను ఉపయోగించుకుంటూ అంతిమంగా కాకతీయ కాలువలోకి చేరుస్తారు. అలా కాకతీయ కాలువలోకి వదిలిన నీరు, కాకతీయ కాలువలు, ఉప కాలువలు వంటి పంపిణీ వ్యవస్థను ఉపయోగించుకుని శ్రీరాంసాగర్ ప్రథమ దశలోని 3,10,000 ఎకరాల ఆయకట్టు, ద్వితీయ దశలోని 4,40,000 ఎకరాల ఆయకట్టును సస్యశ్యామలం చేస్తుంది. మరోమాటలో చెప్పాలంటే దేవాదుల ఎత్తిపోతల ద్వారా అందించే ఈ నీరు కొత్త ఆయకట్టుకు అందడం లేదు. కేవలం శ్రీరాంసాగర్ ఆయకట్టును స్థిరీకరిస్తుందన్న మాట. అలా స్థిరీకరింపబడే మొత్తం ఏడున్నర లక్షల ఎకరాల ఆయకట్టులో నల్లగొండ జిల్లాలోని 2,75,50 ఎకరాలు, ఖమ్మం జిల్లాలోని 3,914 ఎకరాలు పోను మిగతా 4,23,57 ఎకరాలు వరంగల్ జిల్లాకు చెందినదే. కంతనపల్లి కట్టకపోతే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఒరిజినల్‌గా నీరు అందివ్వవలసిన ఈ ఏడున్నర లక్షల ఆయకట్టు గతేమవుతుందో ఒక్కసారి ఆలోచించండి.

కంతనపల్లి రెండవదశలో మరో 50 టీఎంసీల గోదావరి జలాల వినియోగముంది. అది నల్లగొండ జిల్లా, హైదరాబాద్ తాగునీటి సరఫరా మొదలైన వాటికి ఉపయోగపడుతుంది. అయితే ప్రభుత్వం మొదటి దశకే పరిపాలన ఆమోదం తెలిపింది. కాబట్టి ప్రస్తుతం రెండవ దశ గురించి మాట్లాడడం సమంజసం కాదు. ఇదిలా ఉంటే ఇచ్చంపల్లికి ప్రత్యామ్నాయంగా ప్రతిపాదిత ‘కంతనపల్లి’కి సుమారు 22 కిలోమీటర్ల ఎగువన ‘దేవాదుల’ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఏటూరునాగారం మండలం గంగారం గ్రామం దగ్గర ఈ ప్రాజెక్టు హెడ్‌వర్క్స్, ఎత్తిపోతలకు అవసరమ య్యే విద్యుత్తు లిఫ్ట్ పరికరాలను అమర్చారు. ఈ పథ కం అంచ నా వ్యయం 9427.73 కోట్ల రూపాయలు. ఈ పథకం ద్వారా 3.16 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా సుమా రు 71 మీటర్ల స్థాయి నుంచి 540 మీటర్ల స్థాయికి చేరవేయడం జరుగుతుంది. ఈ పథకం వరంగల్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాలోని మొత్తం 6,21,000 ఎకరాలకు సాగునీరందించడమేకాక 1.920 టీఎంసీల నీటిని తాగునీటి కోసం, 0.012 టీఎంసీల నీటిని పారిక్షిశామిక అవసరాల కోసం సరఫరా చేస్తుంది. ఇంతటి మహత్తరమైన పథకం సక్రమంగా పనిచేయాలంటే గోదావరిలో కనీస నీటిమట్టం 73-74 మీటర్లు ఉంటే తప్ప కుదరదు. దురదృష్టవశాత్తు పాలకులకు ముందు చూపులేకుండా, దేవాదుల స్కీంకు దిగువన ఎలాంటి కట్టడం నిర్మించకపోవడంతో గోదావరిలో నీటిస్థాయి తగ్గినప్పుడల్లా స్కీం పనిచేయని దుస్థితిని ప్రభుత్వం ఆలస్యంగా గుర్తించింది. తమ తప్పును తెలుసుకుని, ఆ లోపాన్ని సరిదిద్దే ప్రయత్నంలో ‘కంతనపల్లి’ నిర్మాణంవైపు మొగ్గుచూపింది. కంతనపల్లి బ్యారేజీ పూర్తి జలస్థాయి 5 మీటర్లు. అంటే కంతనపల్లి నిర్మాణం జరిగితే ఎగువన దేవాదుల దగ్గర అత్యధికంగా 14 మీటర్ల నీరు ఉండే అవకాశం ఉంటుంది. కనుక నీటిస్థాయి పడిపోయి దేవాదుల ఆగిపోయే ఇబ్బంది ఏర్పడదు. కాబట్టి శ్రీరాంసాగర్ ఆయకట్టు 7,50,000 ఎకరాలు స్థిరీకరింపబడాలన్నా, దేవాదుల సక్రమంగా పనిచేయాలన్నా కంతనపల్లి బ్యారేజీ నిర్మాణం అవసరం.

ఇక ఈ ప్రాజెక్టుల నిర్మాణ పరిస్థితుల గురించి తెలుసుకుందాం... శ్రీరాంసాగర్ ప్రథమ దశ పనులు పూర్తయినయి, ప్రభుత్వం దృష్టిలో దాదాపు సగం ఆయకట్టుకు నీరందడం లేదన్న సంగతి ప్రభుత్వమే ఒప్పుకుంటున్నది. ద్వితీయ దశ పనులు కొనసాగుతున్నాయి. ‘భూసేకరణ’ సమ స్య జాప్యానికి కారణమని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందించే సత్వర సాగునీటి లబ్ధి పథకం(ఏఐబీపీ)నిధులు పుష్కలంగా స్కీంకు లభిస్తున్నా యి. కనుక నిధుల కొరత ఉండకూడదు. దేవాదుల పనులు కూడా కొనసాగుతున్నాయి. నాణ్యత కొరవడిన ఉదంతాలు మీడియాలో వచ్చినయి. ఏదేమైనా మరికొంత కాలానికైనా దేవాదుల పనులు పూర్తవుతాయని ఆశించవచ్చు.దేవాదుల ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం15-07-2011 నాడు ప్రణాళికాసంఘం పెట్టుబడి క్లియన్స్ ఇవ్వడం ద్వారా ఏఐబీపీ కింద గ్రాంటులు లభిస్తున్నాయి. కనుక ఈ పథకానికి కూడా డబ్బు సమస్య ఏమీ లేదు. ఉన్న సమస్యల్లా కంతనపల్లికే. ఈ పథకానికి 10,409 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2009 ఫిబ్రవరి 19 నాడు ఈ ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేశారు. మూడు కోట్ల రూపాయలు వెచ్చించి డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయించారు. 56 లక్షలు ఖర్చు పెట్టి పర్యావరణ నివేదికలు తయారు చేయిస్తున్నారు. భూసేకరణ కార్యక్షికమాలు చురుగ్గా సాగుతున్నాయి. బ్యారేజీ నిర్మాణం అంచనా 1147 కోట్ల రూపాయలు అవుతుందని IBM (Internal Bench Mark) నిర్ధారణ చేసి పనులకు 2010 సెప్టెంబర్ 15న టెండర్లు పిలిచారు. అయితే అంచనా విలువ లోపభూయిష్టంగా ఉండడంతో ఏ కాంట్రాక్టరూ ముందుకు రాలేదు. ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా ఫలితం దక్కలేదు. తమ తప్పు తెలుసుకున్న ప్రభుత్వం పనుల విలువను సమీక్షించి, సవరించి, ఐబీఎం విలువను సుమారు నాలు గు అయిదు వందల కోట్ల రూపాయలు పెంచి, తిరిగి టెండర్లు పిలిచేందుకు సంబంధించిత అధికారులు, సచివులు, అమాత్యుల ఆమోదం పొంది దస్తా న్ని అంతిమంగా ముఖ్యమంత్రి సంతకం కోసం పంపి ఏడు నెలలు కావొచ్చినా, దస్త్రం ముందుకు కదలడం లేదు. తెలంగాణ అమాత్యులు పొన్నల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, శ్రీధర్‌బాబులు ప్రత్యేకంగా విన్నవించుకున్నా ముఖ్యమంత్రి మనసు కరగలేదు. ముఖ్యమంవూతికి తీరిక దొరకటం లేదా, తెలంగాణ ప్రాజెక్టు కాబట్టి వివక్ష ప్రదర్శిస్తున్నారా అర్థం కావడం లేదు. ఎన్ని విన్నపాలు చేసినా, పత్రికలలో మీడియాలో ఎందరు మేధావు లు మొత్తుకున్నా ప్రయోజనం లేదు. వరంగల్ జిల్లాలో ‘కంతనపలి’్ల నిర్మా ణం వెంటనే చేపట్టాలని తెరాస, సీపీఐ పార్టీలు ఉద్యమాలు చేపట్టినా ఫలి తం కానరావడం లేదు.

ఇదిలా ఉండగా జీవో నెంబర్ ఒకటి అని ఇటీవలే ప్రభుత్వం వారు విడుదల చేసిన ఉత్తర్వులు కంతనపల్లి పాలిట ఉరితాళ్లయినయి. ఈ జీవో 2012 ఏప్రిల్ 25న విడుదలైంది. ఈ జీవో ఇచ్చిన నేపథ్యం వేరు. వివిధ కారణాల వల్ల ప్రాజెక్టుల అమలులో జరుగుతున్న జాప్యం, నిర్వహణ లోపాలను సమీక్షించి, సవరించే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ జీవోలోని కొన్ని అంశాలు కచ్చితంగా అమలు చేస్తే మటుకు ‘కంతనపల్లి లాంటి ప్రాజెక్టులు’ గోవిందా అవుతాయి. ఈ జీవోలోని పేరా 2(3)(ఎ)లోని అంశం. పరిపాలక ఆమో దం తెలిపి రెండు సంవత్సరాలు గడిచాక కూడా పనులు కాంట్రాక్టరుకు అప్పగించకపోతే ఆ పథకాన్ని Poorly performing works (అధ్వాన్నంగా కొనసాగే పనులు) శ్రేణిలోకి చేరుస్తారు.అంటే దీనిపైన గొడ్డలి వేటుపడే ప్రమాదముందని ఆ జీవో చెప్పకనే చెప్పుతున్నది. కంతనపల్లి పథకానికి పరిపాలక ఆమోదం ఇచ్చి రెండేళ్లకు పైగానే అయ్యిం ది. ఇంతవరకు పనులను కాంట్రాక్టరుకు అప్పచెప్పలేదు. కనుక జీవో ఒకటి ప్రకారం కంతనపల్లి poorly performing works కోవలోకి వచ్చి రద్దయ్యే అవకాశం ఉంది. ఇక్కడ గమనించవలసిన అంశమేమిటంటే కంతనపల్లి పనులు కాంట్రాక్టర్లకు అప్పచెప్పకపోవడానికి ఈ జాప్యానికి కారకులు ఎవరు? లోపభూయిష్టంగా ఎస్టీమేటును తయారు చేసిన అధికారులు కారా? సవరించిన అంచనా Revised Estimates కు ఇంతవరకు ఆమోదం తెలపని ముఖ్యమంత్రి కాదా? కారకులు ప్రభుత్వాధినేతలవుతే పాపం కంతనపల్లి ఏం చేసింది? దాన్ని రద్దు చేసే విషయం ఆలోచించడమేమిటి?

ఏదేమైనా ఏడున్నర లక్షల శ్రీరాంసాగర్ ఆయకట్టును స్థిరీకరించడమే కాకుండా ఆరు లక్షల 21 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించే దేవాదుల ప్రాజెక్టు సక్రమంగా పని చేసేందుకు ఉపయోగపడే ఇంతటి మహత్తరమైన కంతనపల్లి ప్రాజెక్టును కాటేస్తే,వేటు పడితే చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణ ప్రజలు దద్దమ్మలు కాదు- ఇప్పటికే తెలంగాణ ప్రజలను మోసం చేసే గారడీలు అనేకం చెలామణి అవుతున్నాయి. ఎత్తిపోతలకు అవసరమ య్యే విద్యుత్తుకు Captive power Stations(సొంత విద్యుత్ కేంద్రం) ఏర్పాటు విషయంలో ఇప్పటిదాక ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. కంతనపల్లి దస్త్రంపై సీఎం హస్తాక్షరం పడలేదు. జీవో ఒకటి కత్తిపై నుంచి వేలాడుతున్నది. దుమ్ముగూడెం నుంచి 165 టీఎంసీలు తరలించి నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ కు తరలించే దుర్మార్గపు చర్యను శాశ్వతంగా విరమించుకోలేదు. పోలవరం పనులకే సుప్రీంకోర్టు స్టే ఆదేశాలివ్వలేదు. అన్న మిష తో టెండర్లు పిలిచే కార్యక్షికమాలు వేగవంతం చేయాలన్న దృక్పథంలో ప్రభు త్వం ముందుకుపోత్నుది.

ఒకవైపు తెలంగాణకు లబ్ధి చేకూర్చే కంతనపల్లి ప్రాజెక్టు విషయంలో నీళ్లు నములుతూ, మరోవైపు తెలంగాణకు హాని తలపెట్టే పోలవరం దుమ్ముగూడెం సాగర్ టెయిల్‌పాండ్ పనులకు పచ్చజెండా ఊపే ఈ ప్రభుత్వపు దుశ్చర్యలను, దుర్మార్గపు పనులను చూస్తూ ఊరుకోవాలా? ఏం చేస్తే ఈ ప్రభుత్వం తన వివక్ష ధోరణిని మానుతుంది? ప్రత్యేక రాష్ట్రం వచ్చేలోపు అటు కృష్ణతోపాటు ఇటు గోదావరి జలాలను అక్రమంగా తరలిస్తూ శాశ్వతంగా తెలంగాణ ప్రయోజనాలకు గండి కొట్టే ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటే మన అమాత్యులు ప్రజావూపతినిధులు మౌనవత్రం దాలుస్తూ పేక్షకులా ఉండిపోవాలా? ఆలోచించండి. తెలంగాణ ప్రజలారా, మేల్కొనండి.

-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

Published: Sun,September 16, 2012 10:48 PM

పడుతూలేస్తూ పాలమూరు ప్రాజెక్టులు

సార్-మా పాలమూరు ప్రాజెక్టుల పరిస్థితేంది? వాటికి నీళ్ల కేటాయింపు ఉన్నదా? కరెంటున్నదా? పైసలున్నయా? అన్ని సక్రమంగా వుంటే మరి ఎందుకు

Published: Fri,September 14, 2012 11:18 PM

అధికారికంగా విమోచన దినోత్సవం

జతీయ జెండాకున్న ప్రాధాన్యం అందరికి తెలుసు. ప్రపంచంలో ఏ దేశమైనా తమ జాతీయ పతాకాన్ని వారి సార్వభౌమిక అధికారానికి చిహ్నంగా భావిస్తుం

Published: Mon,September 10, 2012 12:10 AM

రెండు కోర్టులు, మూడు కేసులు

తెలంగాణతో ముడిపడి ఉన్న కేసులు ప్రస్తుతం కోర్టుల్లో ఎన్ని ఉన్నాయి? వాటి పరిస్థితి ఏమిటో తెలియజేస్తారా? -బారు మధుసూదనశర్మ, హిమాయత్‌

Published: Sun,September 2, 2012 11:43 PM

బలవంతునిదే రాజ్యం

బచావత్ ట్రిబ్యూనల్ రాష్ట్రాలకు కేటాయింపులు జరిపింది. ఇంతవరకు బాగానే ఉన్నది. ఆ కేటాయించిన నీరు రాకుండా ఆయా రాష్ట్రాలు అడ్డుకుంటే ట్

Published: Sun,August 26, 2012 11:45 PM

పోలవరం - పాలమూరు

ఈ మధ్య ముఖ్యమంత్రి గోదావరి జిల్లాల్లో ఇందిరమ్మ బాట సందర్భంగా పర్యటిస్తూ గోదావరిలో వరదలొస్తూ వందలాది టీఎంసీల నీళ్లు వృధాగా సమువూదంల

Published: Thu,August 23, 2012 12:24 AM

ఒడువని తెలంగాణ తండ్లాట

భారత దేశ చరివూతలోనే విశిష్టమైనదైన, ప్రపంచాన్ని ఆకర్షించిన హైదరాబాద్ విమోచన ఉద్యమం ఇంకా ఏదో రూపంలో రగులుతూనే ఉన్నది. అయితే అప్పటి ప

Published: Sun,August 19, 2012 11:19 PM

కోర్టే శరణ్యం-అన్యధా నాస్తి

శ్రీశైలం నాగార్జునసాగర్ నీటి విడుదల విషయంపై కోర్టు స్టే విధించింది కదా! మరేమైంది? నీటి విడుదల ఆగిందా? ఇది తెలంగాణ ప్రజల విజయంగా భా

Published: Mon,August 13, 2012 12:02 AM

చక్రబంధంలో పోలవరం

నాలుగువేల కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చయ్యాయని, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి ఖమ్మంలో శుక్రవా

Published: Mon,August 6, 2012 11:38 PM

పుట్టెడు దుఃఖంలో పుట్టంగండి

పుట్టంగండి సిస్టర్న్ మరమ్మతులకు నోచుకుందని, అది కూడా తూతూమంవూతంగా చేపట్టారని, సిస్టర్న్‌కు ఏదైనా జరగరానిది జరిగితే కొంపలు మునుగుతా

Published: Mon,July 30, 2012 01:48 AM

శ్రీశైలంలోనూ ప్రభుత్వానికి చెంపదెబ్బ

శ్రీశైలం నీటి విడుదల విషయంలో విజయం సాధించాం.ఈ విజయం వివరాలు చెప్పండి? జీవో మార్చిస్తామని లగడపాటి ప్రకటన గుప్పిస్తున్నాడు. దానిని గ

Published: Sun,July 22, 2012 11:13 PM

కోర్టు ఉత్తర్వుల స్ఫూర్తికి భంగం

ఈమధ్య తెలంగాణ ఇంజనీర్లు, మరికొందరు కృష్ణా డెల్టాకు నాగార్జునసాగర్ జలాశయం నుంచి అక్రమంగా నీళ్లు తరలించడంపై హైకోర్టులో ప్రజాహిత వ్య

Published: Sun,July 15, 2012 11:12 PM

జనం నోళ్లు కొడుతున్న పరిక్షిశమలు

జీవో146, జీవో 94 గురించి చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే జీవో 23 ద్వారా ఉదయసముద్రం నుంచి రోజుకు 5 లక్షల గ్యాలన్ల నీటిని సీమాం ధ్ర

Published: Sun,July 8, 2012 11:49 PM

సాగర్ నీటి దోపిడీ

అకస్మాత్తుగా డెల్టా ప్రయోజనాల కోసం 15 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పార్టీలు, ప్రాంతాల మధ్య చిచ

Published: Sun,July 1, 2012 11:52 PM

మా నీళ్లు మాకు దక్కనీయరా..?

తెలంగాణ నుంచి సీమాంవూధలోనికి ప్రవహిస్తున్న నదులు, వాటి ఉపనదులు ఏమిటి? వాటి నదీ పరీవాహక ప్రాంతాలు, జిల్లాలు మొత్తం ఆంధ్రవూపదేశ్‌లో

Published: Mon,June 25, 2012 12:00 AM

రాయల తెలంగాణ ఎవరి కోసం?

రాయల తెలంగాణ ఏర్పడాలనే వాదన వింటున్నాం. రాయల తెలంగాణ అంటే ఏమిటి? అలాంటిది వాదనకు గల కారణాలు, అవకాశాలు ఏమి టి? రాయల తెలంగాణలో నీటి

Published: Sun,June 17, 2012 11:38 PM

ప్రాంతీయ స్పృహతోనే వివక్ష అంతం

జూన్ 9 నాడు కేసీఆర్ పరకాల బహిరంగసభలో మాట్లాడుతూ ‘జగన్ అధికారంలోకి రాగానే రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెబుతున్న

Published: Mon,June 11, 2012 12:42 AM

జనం నోళ్లు కొట్టి పరిశ్రమలకు నీళ్లు..!

తాగడానికి నీళ్లు లేక ఒక పక్క గిలగిల కొట్టుకుంటూ ఉంటే, కృష్ణా నది నుంచి సిమెంట్ ఫ్యాక్టరీలకు నీటి కేటాయింపులు చేస్తూ ఈ జీవో లేమిటి

Published: Sun,June 3, 2012 11:50 PM

జలయజ్ఞంపై సీబీ‘ఐ’

జలయజ్ఞం పూర్తిగా జలగల యజ్ఞంగా మారిందని, కాగ్ తీవ్రంగా ఆక్షేపించిందని తెలిసింది. కోట్లకొద్దీ ప్రజాధనం గుత్తేదారులు, ఇతర ప్రజావూపతిన

Published: Tue,May 29, 2012 12:02 AM

పట్నం దూప తీరే మార్గం ఏది?

గండికోట ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేస్తున్న ప్రభుత్వం ఎల్లంపెల్లిని ఎందుకు నానబెడ్తున్నది? ‘ప్రాణహిత-చే ప్రాజెక్టు అంతర్భాగమైన హ

Published: Mon,May 21, 2012 02:57 AM

నీటికోసం నిరసన దీక్ష

కృష్ణా నీళ్లలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, కావాలనే సీమాంధ్ర పాలకులు ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ ప్రయోజనాలను నీరుకార్చే ప్రయత్నం చే

Published: Sun,May 13, 2012 11:58 PM

అభీ దిల్లీ దూర్ హై

ఇటీవలే ఢిల్లీలో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుపై మహారాష్ట్ర, ఆంధ్రవూపదేశ్ రాష్ట్రాల ముఖ్యమంవూతులు ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. అంతవర

Published: Fri,August 31, 2012 05:49 PM

శుష్కవాదాలు-శూన్యహస్తాలు

ఈ మధ్య కేసీఆర్ ముఖ్యమంత్రికి ఓ లేఖ రాస్తూ అందులో కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట మన వాళ్లు సరిగ్గా వాదనలు వినిపించలేకపోయారని, తత్ఫలితంగా త

Published: Mon,April 30, 2012 12:07 AM

నదుల అనుసంధానం-తెలంగాణకు నష్టం

నదుల అనుసంధానం గురించి చాలా కాలంగా వింటున్నాం. ఏ నదులను అనుసంధానిస్తారు.దానివల్ల తెలంగాణకు ఏం లాభం? వివరించండి? - రావుల బ్రహ్మయ

Published: Mon,April 23, 2012 01:51 AM

చిన్న ప్రాజెక్టులంటే చిన్న చూపు

పెద్ద ప్రాజెక్టుల గురించే మీరు చెప్పుతున్నారు. తెలంగాణలోని చెరువులు, కుంటలు, బావుల మీద ఆధారపడి బతుకుతున్న వాళ్లు చాలామంది ఉన్నారు.

Published: Mon,April 16, 2012 05:16 AM

ఆధునీకరణలోనూ పక్షపాతమే..

సదర్మట్,అప్పర్ మానేరు,మూసీ,డిండీ ప్రాజెక్టుల గురించి వివరించండి. -లక్ష్మినర్సింహాడ

Published: Mon,April 9, 2012 12:03 AM

గొంతెండిపోతంది సారూ..

గోదావరి పక్కనే ఉన్నా మా గొంతు లెండిపోతున్నయి సారూ- మా బతుకులిట్లా తెల్లారవలసిందేనా కనీసం గుక్కెడు నీల్లకయినా మేం నోచుకోలేదా? చెప్ప

Published: Mon,April 2, 2012 12:11 AM

పోలవరం బంగారం- లెండి వెండి

ఇదిగో అదిగో అని ఎంతకాలం నుంచో ఊరిస్తూ వస్తున్న లెండి, ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది? ఇంత జాప్యానికి కారణాలు ఏమిటి? పోలవరంపైన పా

Published: Mon,March 26, 2012 01:56 AM

పెనుగంగకు మోక్షమెప్పుడు?

లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు గురించి నా చిన్నతనం నుంచి వింటున్నాను. మా ఆదిలాబాద్ జిల్లాకు లాభించే ప్రాజెక్టుపై ప్రభుత్వానికి చిన్న చ

Published: Sun,March 11, 2012 11:39 PM

ఆ పార్టీలు దొందు-దొందే

చంద్రబాబు ప్రభుత్వంలోనే తెలంగాణ బాగా అభివృద్ధి సాధించిందని తెలుగుదేశం వాళ్లు, లేదూ మా రాజశేఖర్‌డ్డి జమానాలోనే బాగా ప్రాజెక్టులు స

Published: Sun,March 4, 2012 11:31 PM

నత్తనడకన ఎత్తిపోతలు..

చేటుపల్లి హన్మంతడ్డి ఎత్తిపోతలు ఏనదిపై ఎక్కడ కడుతున్నరు? కొమురం భీం, కోయిల్‌సాగర్, కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు నడుస్తున్నయా? నెట్టం

Published: Sun,February 26, 2012 11:59 PM

సింగూరు దీనగాథ

భవిష్యత్తులో అక్కంపల్లి సింగూరుగా మారుతుందని, ఎల్లంపల్లి సింగూ రుగా మారినా ఆశ్చర్యపోనక్కరలేదని తెలంగాణ ఇంజనీర్లు అంటూ ఉండ టం విన్న

Published: Mon,February 20, 2012 02:01 AM

వివాదాల(నాగార్జున) సాగరం

నాగార్జునసాగర్ డ్యాంను ఇప్పుడున్న చోట కాకుండా ఎగువన కట్టవలసి ఉండెనని మా పెద్దలు చెప్తూ ఉంటరు. అలా చేయకుండా కావాలని కిందకి తీసుకు

Published: Mon,February 13, 2012 12:29 AM

పాలమూరు వెనుకబాటు పాలకుల కుట్రే!

ఎ)కృష్ణా నదిలోని 10 శాతం నీటిని ఇచ్చినా పాలమూరు సస్యశ్యామలం అవుతుంది. జూరాల నీటి నిలువ సామర్థ్యం పెంచే అవకాశం ఉందా? బి)జలవనరులను

Published: Mon,February 6, 2012 12:40 AM

ఎస్‌ఎల్‌బీసీ - ఎఎంఆర్ ప్రాజెక్టులు

పోతిడ్డిపాడు, కెసీ కాలువకు శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు కడప, కర్నూలు జిల్లాలో సాగుకు ఉపయోగపడినప్పుడు, ఎస్‌ఎల్‌బీసీ ఎం

Published: Mon,January 23, 2012 12:07 AM

డిండీ ఎత్తిపోతల పథకం

డిండీ ఎత్తిపోతల పథకం అమలవుతే నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లా కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు అందుతుందని విన్నాను. నిజమా? వివరించండి

Published: Mon,January 9, 2012 12:00 AM

జూరాల-పాకాల

కృష్ణా నీటిని జూరాలనుంచి పాకాల దాక ఎటువంటి లిఫ్ట్ (ఎత్తిపోతల పథకం) లేకుండా గ్రావిటీ ద్వారా మళ్లించవచ్చని కేసీఆర్ ప్రతిపాదించారు.

Published: Mon,December 26, 2011 12:10 AM

బాబ్లీపైన కిమ్మనరేం?

మహారాష్ట్రలోని గోదావరి నదిపై నిర్మితమవుతున్న బాబ్లీ ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి నీటి పంపకంలో ఏమైనా నష్టం ఉన్నదా? తెలంగాణ

Published: Sun,December 18, 2011 11:06 PM

ఎత్తిపోతలకు సొంత విద్యుత్తు

గోదావరినదిపైన ఎన్నో ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం చేపట్టిందని మీరు అంటున్నారు. మరి వీటన్నింటికి విద్యుత్తు ఎక్కడ్నుంచి వస్తుంది? ప

Published: Sun,December 11, 2011 11:56 PM

‘ప్రాణహిత-చేవెళ్ల ’ తెలంగణ మణిహారం

ప్రాణహిత-చే ప్రాజెక్టును లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంటారు. అది నిజమా? ఒకవేళ నిజమైతే ఈ ప్రాజెక్టుకు ఎంత విద్యుత్తు అవసరమవుతుంది. ఇ

Published: Sat,December 10, 2011 06:17 PM

ఇచ్చంపల్లి-దేవాదుల-కంతనపల్లి

ఇచ్చంపల్లి ప్రాజెక్టును ఇక మరిచిపోవలసిందేనా? ప్రత్యామ్నాయంగా ఏ ప్రాజెక్టును చేపట్టారు? వివరాలు తెలపండి. -జి. హర్షవర్ధన్, నర్సంపేట

Published: Mon,November 14, 2011 12:02 AM

తెలంగాణ ప్రాజెక్టులు-పాలకుల వివక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచే తెలంగాణ ప్రాజెక్టులకు సరైన బడ్జెట్ కేటాయించకుండా, ఇచ్చిన బడ్జెట్‌ను కూడా పూర్తిగా వినియోగ

Published: Mon,November 7, 2011 04:45 PM

పోలవరం-గోల గరం

పోలవరం కట్టాలని ఒకరు, వద్దని మరొకరు, తక్కువ ఎత్తుతో కట్టాలని వేరొకరు. తెలంగాణకే ‘పోలవరం’ లాభం అని ఇంకొకరు ఇలా రకరకాలుగా మాట్లాడుతు

Published: Sun,October 30, 2011 10:59 PM

దుమ్ముగూడెం ఎందుకు వద్దు?

కంతనపల్లి ముద్దు-దుమ్ముగూడెం వద్దు అని ఆ మధ్యన మీరు ఖమ్మం, వరంగల్‌జిల్లాల్లో పర్యటించినప్పుడు విలేఖర్ల సమావేశంలో ప్రస్తావించినట్టు

Published: Sun,October 23, 2011 11:14 PM

కంచే చేను మేస్తే...?

మీరు రాసిన వ్యాసాలు, ఇస్తున్న ఉపన్యాసాలు విన్నాక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల దారుణ వివక్ష చూపెడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది

Published: Mon,October 17, 2011 12:20 AM

ప్రాంతాల వారీగా ప్రాజెక్టులు

తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలలో ఎన్ని ప్రాజెక్టులున్నాయి? ఎప్పుడు వాటిని పూర్తి చేశారు? ఒక్కొక్క ప్రాజెక్టు కింద ఎంత సాగవుతోంది? పై ప్రశ

Published: Sun,October 9, 2011 11:06 PM

తెలంగాణ ఎందుకు వెనుకబడింది?

తెలంగాణ వెనుకబడిన ప్రాంతమా? తెలంగాణ బంగారు తునక ఎట్లా అవుతుంది? -మంత్రి కరుణ, హైదరాబాద్ ఏదైనా దేశం లేక రాష్ట్రం లేక ప్రాంతం అభివ

Published: Mon,October 3, 2011 04:39 PM

మన నీళ్లు మనకు దక్కుతాయా?

జలవనరుల విషయంలో మనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించండి?మన నీళ్లు మనకు దక్కకపోవడానికి కారణం?తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మనకు జలవనరుల

Published: Sun,September 25, 2011 11:24 PM

వలస గ్రహణం పట్టిన మన ప్రాజెక్టులు

1956 నుంచే కృష్ణా, గోదావరి జలాలను వీలైనంత మటుకు పూర్తిగా హరించాలన్న దుష్ట పన్నాగాలతోనే తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డు తగులుతూ వచ్చారు

Published: Mon,September 19, 2011 12:08 AM

అనుమతి లేకున్నా పోలవరం నిర్మాణం

పోలవరం ప్రాజెక్టును ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లాలో కడుతున్నారు కదా! దీనివల్ల తెలంగాణకు ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో రెండు లక్షల ఎకరాలు

Published: Fri,September 23, 2011 12:46 PM

రాష్ట్రం విడిపోతే ఎవరికెన్ని నీళ్లు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి తెలంగాణ, సీమాంధ్ర లేక తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ రాష్ట్రాలుగా ఏర్పడితే కృష్ణా, గోదావరి నదులలో ఎవర

Published: Mon,September 12, 2011 06:05 PM

ఎత్తున ఉంటే తెలంగాణకు నీళ్లు రావా?

‘తెలంగాణ ఎత్తు మీద ఉండటం మూలాన ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా తెలంగాణకు నీళ్లు రావు’ అని సీమాంవూ

Published: Mon,September 12, 2011 06:09 PM

తెలంగాణ ప్రాజెక్టులు-సీమాంధ్రకు నీళ్ళు

తెలంగాణ వస్తే మాకు నీళ్లు రావు అని అమాత్యులు జె.సి. దివాకర్‌డ్డి సెలవిచ్చారు. మీ కామెంట్? -గొట్టిపర్తి యాదగిరి,

Published: Mon,September 12, 2011 06:10 PM

శ్రీశైలం ఎవరిది ?

-ఆర్. విద్యాసాగర్‌రావు కేంద్ర జలవనరుల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్ ఈ మధ్య మంత్రి టి.జి. వెంక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమవుతే శ్రీశ

Published: Mon,September 12, 2011 06:12 PM

నీళ్లు నిజాలు

వారం వారం జలవిజ్ఞానం బిరబిరా కృష్ణమ్మ తరలిపోతుంటుంది. జలజలా గోదారి ధవళేశ్వరం ఆనకట్టవుతుంది. ముక్కారు పంటలు కాలువలకు కాలడ్డం

Featured Articles