ఆ పార్టీలు దొందు-దొందే


Sun,March 11, 2012 11:39 PM

adss-talangana patrika telangana culture telangana politics telangana cinemaచంద్రబాబు ప్రభుత్వంలోనే తెలంగాణ బాగా అభివృద్ధి సాధించిందని తెలుగుదేశం వాళ్లు, లేదూ మా రాజశేఖర్‌డ్డి జమానాలోనే బాగా ప్రాజెక్టులు సాంక్షన్ అయి తెలంగాణలో డెవలప్‌మెంట్ జరిగిందని కాంగ్రెసోళ్లు వాదించుకుంటారు. ఈ విషయంలో మీ అభివూపాయం ఏమిటి?
-ఖాజామోహియొద్దీన్, ఆలంపూర్, మహబూబ్‌నగర్
బహుశా మీప్రశ్న తెలుగుదేశం ప్రభుత్వంలో బాగా అభివృద్ధి జరిగిందా లేక కాంగ్రెస్ హయాంలో జరిగిందా అని అనుకుంటాం. ఈ ప్రశ్నకు జవా బు చెప్పే ముందు కాంగ్రెసోళ్లు పాలించిన సమయం, వాళ్లు చేసిన అభివృద్ధి, తెలుగుదేశం పాలన సాగిన టైం, వాళ్ల హయాంలో జరిగిన అభివృద్ధి బేరీజు వేయవలసి ఉంటుంది. మిగిలిన రంగాల జోలికిపోను కానీ సాగునీటికి సంబంధించిన పురోగతిని అంచనా వేయడం, వాటికి మార్కులు వేయడం అంత కష్టం కాకపోవచ్చు.
ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం ఏర్పడక పూర్వమే తెలంగాణలో కడెం, నిజాంసాగ ర్ ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఇవి భారీ ప్రాజెక్టుల కోవలోకి వస్తాయి.

రాజోలిబండ ప్రాజెక్టు హైదరాబాద్ రాష్ట్రంలో ప్రారంభమైనా పూర్తయింది ఆంధ్రవూపదేశ్ అవతరించాక. ఈవేళ తెలంగాణలో చెప్పుకోదగ్గ భారీ ప్రాజెక్టులు నాగార్జునాసాగర్, శ్రీరాంసాగర్, జూరాల. ఈ మూడు ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వం లో మొదలైనవే. కనుక ఈ మూడు ప్రాజెక్టుల క్రెడిట్ కాంగ్రెస్‌కే దక్కుతుంది. కాంగ్రెస్ ప్రభు త్వం మారి తెలుగుదేశం వచ్చి ప్రాజెక్టు నిర్మా ణం కొనసాగించినా, ప్రాజెక్టు ప్రారంభించిన వాళ్లకే క్రెడిట్ దక్కుతుంది. అంతేతప్ప పూర్తిచేసిన వాళ్లకు దక్కదు. అదేవిధంగా శ్రీశైలం హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు పూర్తి చేసిన క్రెడిట్ కూడా కాంగ్రెస్‌దే. కాకపోతే పాలమూరుకు రావలసిన 174 టీఎంసీల కృష్ణా జాలలను సాధించలేకపోవడం, జూరాల నిర్మాణం పూర్తయినా పూర్తిగా నింపక పోవ డం, రాజోలిబండ నిర్ధారిత పరిమాణం (15.9 టీఎంసీల) నీటిని మహబూబ్‌నగర్ జిల్లాకు అందజేయలేకపోవడం, సాగర్ ఎడమకాలువకు జరిగిన అన్యాయం..ఈ లోపాలన్నిటికి కూడా కాంగ్రెస్‌దే బాధ్యత.

ఇదేవిధంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 1963లో మొదలైనా ప్రథమ దశ పనులు పూర్తిగాక నత్తనడకన సాగడానికి ప్రధానంగా కాంగ్రెస్‌దే బాధ్యత. హైదరాబాద్ ప్రభు త్వం ప్రారంభించిన దేవనూరు ప్రాజెక్టును రాకుండా చేయడానికి కూడా కాంగ్రెస్‌దే బాధ్యత. ఈరోజున సింగూరు నిర్మాణం చేసి, తద్వారా ఘనపు రం ఆనకట్ట, నిజాంసాగర్ ఎండిపోవడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత. ‘ఇచ్చంపల్లి’ని సాధించుకోలేకపోవడంలో కూడా కాంగ్రెస్ ప్రధాన బాధ్యత వహించాల్సిందే. శ్రీరాంసాగర్ ద్వితీయ దశకు, వరద కాలువలకు అన్ని రకాల అనుమతులను సాధించినా నిర్మాణం పనులు సకాలంలో చేపట్టకపోవడానికి కూడా కాంగ్రెస్‌దే బాధ్యత. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రాజెక్టు లు సాధించినా, నిర్మాణాలు పూర్తిచేసినా, అనేక జాప్యాలకు, జాడ్యాలకు, ప్రాంతీయ వివక్షకు కాంగ్రెస్ ప్రభుత్వాలు కారణమయ్యాయి.


ఇక తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేపట్టిన చెప్పుకోదగ్గ భారీ నీటిపారుదల ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదు. తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టుల కు శంఖుస్థాపనలు చేయడం, అందమైన తెలుగు పేర్లుపెట్టడం తప్ప తెలంగాణ ప్రాంతానికి ఒరగబెట్టిందేమీలేదు. ఒక్క శ్రీశైలం ఎడమకాలువ పనులను మంజూరు చేసి తెలుగుగంగకు సరిసమానంగా ప్రారంభిస్తున్నట్టు ఆర్భాటంగా ప్రకటించడం జరిగింది. కానీ తెలుగు గంగతో పోలిస్తే ఎస్‌ఎల్‌బీసీ పనులు పూర్తిగా నత్తనడకన సాగడానికి తెలుగుదేశం ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు ఆలస్యమవుతుంటే ప్రత్యామ్నాయంగా నాగార్జునసాగర్ నుంచి ఎలిమినేటి మాధవడ్డి ఎత్తిపోతలు ప్రారంభించిన ఘనత పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వానిదే.

ఒక్క ఏఎమ్‌ఆర్ ప్రాజెక్టు తప్ప తెలుగుదేశం ప్రభుత్వం గర్వంగా చెప్పుకోదగ్గ భారీ ప్రాజెక్టు కనిపించ దు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను కొనసాగించడం, పూర్తిచేయడం వేరే మాట. టీఆర్‌ఎస్ తెలుగుదేశంపైన చేస్తున్న విమర్శలు తట్టుకోలేక హడావుడిగా రాత్రికిరాత్రి గోదావ రి జలాలను ఉపయోగించే దేవాదుల ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేసి కేంద్ర జల సంఘం నుంచి ‘సూవూతవూపాయ అనుమతి’ని తీసుకొచ్చిన క్రెడిట్ కూడా తెలుగుదేశానిదే. అయితే ‘దేవాదుల’ తెలుగుదేశం హయాంలో ఒక్కడుగు కూడా ముందుకు సాగలేదు. ఇచ్చంపల్లి, పోలవరం ప్రాజెక్టుల కోసం కేంద్ర అనుమతులు సాధించడం కోసం తీవ్రంగా కృషి చేశారని చెప్పడంలో ఎలాం టి అనుమానం లేదు. కానీ టీడీపీ ప్రభుత్వానికి కేంద్రం మొండిచేయ్యి చూపింది. వివాదాల నడుమ, తెలంగాణ ప్రజల అభ్యంతరాల మధ్య పులిచింతలను ప్రారంభించింది కూడా చంద్రబాబు హయాంలోనే.

మనం మాట్లాడుకుంటున్నది భారీ ప్రాజెక్టుల విషయం మాత్రమే. మధ్యతరహా, చిన్నతరహా హైదరాబాద్ ప్రభుత్వంలోనూ, అంతకుముందూ, తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నిర్మించబడ్డాయి. వాటి జోలికి వెళ్లడం లేదు. నిజానికి చంద్రబాబు హయాంలో ‘సాగునీటి రంగం’పై పెట్టిన ఖర్చు అతిస్వల్పం. భారీ ప్రాజెక్టులు పూర్తిచేయడం ఎంత కష్టమో అనుభవపూర్వకంగా తెలుసుకున్న చంద్రబాబు దృష్టినంతా ‘నీరు-మీరు’ కార్యక్షికమం పై పెట్టిన విషయం, కుప్పంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన సేద్యం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బాబు హయాంలో సాగునీటి ప్రాజెక్టుల గురించి గొప్పగా చెప్పడానికి ఏమీలేదు. ఇదీ చంద్రబాబు ప్రొగ్రెస్ కార్డు. ఇక మనం మాట్లాడుకోవలసిన విషయం వైఎస్ రాజశేఖర్‌డ్డి ప్రారంభించిన ‘జలయజ్ఞం’ కార్యక్షికమం గురించి. తెలంగాణలో ప్రారంభించిన ప్రాజెక్టుల లిస్టు చాంతాడంత ఉంది.


తెలంగాణలో మొదలుపెట్టిన భారీ ప్రాజెక్టులు కృష్ణా బేసిన్‌లో కోయిల్‌సాగర్, భీమా, నెట్టంపాడు, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ సొరంగం, ఉదయ సముద్రం, గోదావరి బేసిన్‌లో శ్రీరాంసాగర్ ద్వితీయదశ, శ్రీరాంసాగర్ వరదకాలువ, ఎల్లంపల్లి, ప్రాణహిత-చే దేవాదుల, కంతనపల్లి, రాజీవ్‌సాగర్ దుమ్ముగూడెం, ఇందిరాసాగర్ దుమ్ముగూడెం, అలీసాగర్, గుత్ప, కాళేశ్వరం, సింగూరు కాలువ ప్రాజెక్టు లు. ఇవిగాక అదనంగా ఆధునీకరణ ప్రాజెక్టులు. సుమారు 90వేల కోట్ల రూపాల వ్యయంతో భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను చేపట్టడం జరిగింది. ఇవన్నీ చూశాక తెలంగాణలో ఎంతో అభివృద్ధి జరిగిందనిపించడం సహ జం. కానీ వాస్తవానికి గుత్ప, అలీసాగర్ (ఇవి కూడా స్థిరీకరణ ప్రాజెక్టులు మాత్రమే) తప్ప ఏ ప్రాజెక్టూ పూర్తికాలేదు.

ఖర్చు సగానికిపైగానే అయ్యింది. రెండేళ్లలో పూర్తిచేస్తామన్న ఏ ప్రాజెక్టూ పూర్తికాలేదు. ఐదేళ్లలో పూర్తిచేస్తామన్న ప్రాజెక్టూ పూర్తికాలేదు. కాంట్రాక్టులు చేపట్టిన అస్మదీయులు బాగుపడ్డారు. కానీ రైతులకు ప్రయోజనం కలిగింది శూన్యమని ‘కాగ్’ నివేదికలే వెల్లడించాయి. ప్రచారం కోసం, ఓట్లు దండుకోవడానికి పనికొస్తే రావొచ్చేమోగాని అనేక వివాదాల మధ్య ఈ ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయి? తెలంగాణ రైతులకు నీళ్లు అందుతాయన్నది అనుమానమే.


ఇదిలా ఉంటే తెలంగాణకు భారీనష్టం చేకూర్చే అనేక ప్రాజెక్టులు జలయజ్ఞం కార్యక్షికమంలో భాగంగా వద్దని చెప్తున్నా మొండిగా చేపట్టారు. ఉదాహరణకు పోలవరం, పులిచింతల. పోలవరం విషయంలో ఒడిషా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ఖమ్మం జిల్లా గిరిజనులు రెండు లక్షల మంది నిర్వాసితులవడం, వారి జీవనోపాధి, ఉనికి కోల్పోవడం జరుగుతున్న కారణంగా ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని చెప్తున్నా.. ఇవేమీ పట్టించుకోకుండా తెలంగాణ ప్రజల ఉసురుపోసుకుంటున్న పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిది.

అన్నిటికన్నా ఘోరం తెలంగాణ భవిష్యత్ తరాలకు గోదావరి, కృష్ణా నదులను దూరం చేసే కుట్రకు ప్రధాన సూత్రధారి నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్. ‘పోతిడ్డిపాడు’ హెడ్ రెగ్యులేటర్ సైజును నాలుగింతలు పెంచి 30 రోజుల్లేనే 120 టీఎంసీల కృష్ణా జలాలను ‘వరద జలాల’ పేరిట రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు తరలించే ప్రయత్నానికి ఆద్యుడు వైఎస్. ఇందుకోసం ముందుగా శ్రీశైలం రిజర్వాయర్‌ను విద్యుత్ ప్రాజెక్టుల నుంచి బహుళార్థసాధక ప్రాజెక్టుగా మార్చి జీవో 107 ద్వారా శ్రీశైలం రిజర్వాయర్ కనీస నీటి మట్టాన్ని 54 అడుగులకు పెంచడం లాంటి అనేక చర్యలతో తన పన్నాగం పారడానికి దారి సుగమం చేసుకున్నాడు. కృష్ణా జలాలను క్రమం గా తెలంగాణకు దక్కకుండా చేసే మరో ప్రయత్నమే అవసరంలేని దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ ‘టెయిల్‌పాండ్’. 165 టీఎంసీల గోదావరి జలాలను వరదజాలాల ముసుగులో కృష్ణా బేసిన్‌కు తరలించి, వాటితో సాగర్ అవసరాలు తీర్చి, కృష్ణా జలాలను సునాయసంగా ‘పోతిడ్డిపాడు’ ద్వారా తరలించడంలో భాగంగా జరిగిన ఈ కుట్ర వెనకాల ఉన్న ఏకైక వ్యక్తి వైఎస్. ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాబట్టి ఆ పార్టీయే తెలంగాణ వనరుల దోపిడీకి బాధ్యత వహించవలసి ఉంటుంది. నేడు జంట నగరాల తాగునీటిని కృష్ణా నది నుంచి కాకుండా, గోదావరి నుంచి తీసుకు వస్తామనడానికి అసలైన కారణం కృష్ణా జలాలను సీమాంవూధకు తరలించాలన్న ఏకైక లక్ష్యమే.


ఎంత తెలివిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను మోసం చేసిందంటే ‘కృష్ణా బేసిన్‌లో ఉన్న నల్లగొండ, మహబూబ్‌నగర్ ప్రాజెక్టులకు కేవలం 77.50 టీఎంసీల అదనపు జలాలను కేటాయించి, 150 టీఎంసీలను బేసిన్‌లో లేని సీమాంవూధకు తరలించే ప్లాన్‌కు అనుమతి ఇచ్చింది.
ఆయన సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులకు శ్రీశైలం నుంచి 30రోజుల్లో నీరు వదలాని, తెలంగాణ ప్రాజెక్టులకు 90 రోజుల్లో వదలవచ్చని రూలు పెట్టింది. బయటి ప్రపంచానికి తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నామని ప్రాజెక్టుల సందడి వినిపించి ‘కాసుల పంట’ పండించుకుని, వెనకాల కృష్ణా, గోదావరి జాలలను సీమాంధ్ర ప్రాంతాలకు తరలిస్తూ, తెలంగాణను ఎడారిగా మార్చే కుట్రకు పాల్పడింది. దీనికి కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాలి. చేసింది వైఎస్ అయినా, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఈ పాపంలో భాగస్వాములే. కనుక వైఎస్‌ఆర్ హయాంలో తెలంగాణకు జరిగిన లాభం కంటే హాని ఎంతో ఎక్కువ. కాబట్టి వైఎస్ ప్లస్‌ల కంటే మైనస్‌లే ఎక్కువ.

నా దృష్టిలో వనరులను దోచి, తెలంగాణను వెనుకబడేయటానికి చంద్రబాబు ఎంత బాధ్యుడో, తెలంగాణను శాశ్వతంగా ఎడారిగా మార్చడానికి ‘జలయజ్ఞం’ ముసుగులో నాటకాలాడిన వైఎస్ అంతకన్నా రెట్టింపు బాధ్య త వహించాల్సిందే. తెలంగాణ విషయంలో ఇటు తెలుగుదేశం, అటు కాంగ్రెస్ పార్టీలు రెండూ ద్రోహం చేశాయి. అందుకే ‘దొందు-దొందే’.

-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్




నదుల అనుసంధానం-సువూపీంకోర్టు ఆదేశం
ఇటీవలే సుప్రీంకోర్టు నదుల అనుసంధానం ప్రక్రియను సాకారంచేయడం కోసం అవసరమైన చర్యలు చేపట్టవలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. అందులోభాగంగా ఒక ‘ప్రత్యేకమైన కమిటీ’ని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రాన్ని పురమాయించింది. ‘నదుల అనుసంధానం ఎంతో ప్రయోజనం కలిగిస్తుందన్న కేంద్రం అభివూపాయంతో ఒకటి రెండు రాష్ట్రాలు తప్ప అన్నీ ఏకీభవిస్తున్నాయి. అనుసంధానం వల్ల కలిగే దుష్పరిణామాల అపోహలను నిపుణులు ఎంతో సమర్థవంతంగా తిప్పికొట్టారు. వ్యవసాయ, ఇతర రంగాలలో ఈ అనుసంధాన ప్రక్రియ ఎంతో పురోగతిని సాధించగలుగుతుంది.’ సుప్రీంకోర్టు అభివూపాయం ఎలా ఉన్నా వాస్తవానికి తమిళనాడు, రాజస్థాన్ వంటి ఒకటి రెండు రాష్ట్రాలు తప్ప నదుల అనుసంధానాన్ని ఏ రాష్ట్రమూ సమర్థించడం లేదు. తమ అవసరాలకు మించి తమ నదులలో జలాలున్నాయని ఏ రాష్ట్రమూ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. బయటికి ఏం చెప్తున్నా బాగా నీళ్లున్నాయని కేంద్రం నమ్మే బ్రహ్మపుత్ర, గంగానదులకు సంబంధించి, ఈశాన్య, ఉత్తర భారత రాష్ట్రాలు కానీ, మహానదికి సంబంధించిన ఒడిషా కాని, గోదావరికి సంబంధించిన ఆంధ్రవూపదేశ్ కానీ, అరేబి యా సమువూదంలో కలిసే నదీ బేసిన్లు కలిగిన కేరళ కానీ ఈ నదుల అనుసంధాన ప్రక్రియను అంగీకరించే స్థితిలో లేవు. రాజ్యాంగ పరంగా నీళ్లపైన కేంద్రానికి హక్కు లేనంత కాలం ఇలాంటి ఎన్ని కమిటీలు వేసినా, సుప్రీంకోర్టు ఎన్ని ఆదేశాలు జారీ చేసినా ఒరిగేది శూన్యమే.

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

country oven

Featured Articles