నత్తనడకన ఎత్తిపోతలు..


Sun,March 4, 2012 11:31 PM

చేటుపల్లి హన్మంతడ్డి ఎత్తిపోతలు ఏనదిపై ఎక్కడ కడుతున్నరు? కొమురం భీం, కోయిల్‌సాగర్, కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు నడుస్తున్నయా? నెట్టం పాడు, కల్వకుర్తి ప్రాజెక్టుల గురించి వివరంగా చెప్పండి?

-లక్ష్మినర్సింహాడ్డి, సికింవూదాబాద్.


పై ప్రాజెక్టులే గాక సదర్మట్, అప్పర్ మానేర్, మూసీ, డిండి ప్రాజెక్టుల గురించి, ఎస్‌ఎల్‌బీసీ-ఏఎంఆర్ ప్రాజెక్టు గురించి అడిగారు. ఎస్‌ఎల్‌బీసీ-ఏఎంఆర్ ప్రాజెక్టు గురించి 6-2-2012 నాడు ఈ ‘కాలమ్’లోనే వివరంగా చెప్పడం జరిగింది. ఇక పోతే సదర్మట్, అప్పర్ మానేర్ గోదావరి బేసిన్లో, మూసీ, డిండి ప్రాజెక్టులు కృష్ణా బేసిన్‌లో ఇదివరకే నిర్మించబడి అమలవుతున్న ప్రాజెక్టులు. వివిధ కారణాల వల్ల ఆ ప్రాజెక్టుల్లో సక్రమంగా నీరు రాక ఆయకట్టుదారులు అవస్థలు పడుతున్నారు. వాటి గురించి మరోసారి చర్చించుకుందాం. ప్రస్తు తం నిర్మాణంలో ఉన్నకొత్త ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుందాం.

చౌటుపల్లి హన్మంతడ్డి
ఎత్తిపోతల పథకం

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో అంతర్భాగమైన లక్ష్మి కాలువ డిస్ట్రిబ్యూటరీ ‘డి-4’ నీరందించే సేతుపల్లి చెరువుపైన ఈ పథకం ఉంది. నిజామాబాద్ జిల్లాలోని కమ్మరపల్లి, మోర్తాండ్ మండలాలకు చెందిన 1 గ్రామాలలోని 11625 ఎకరాల ఆయకట్టుకు 10 క్యూసెక్కుల నీటిని (1 టీఎంసీ)తోడి పోయడం ద్వారా సాగునీటి సౌకర్యం కల్పించడం జరుగుతుంది. మొత్తం లిఫ్ట్ ఎత్తు 72.90 మీటర్లు. ఇందుకు 5.9 మెగావాట్ల విద్యుత్తు అవసరమవుతుంది. ఈ ప్రాజెక్టుకు పరిపాలనా మంజూరు ₹55.50 కోట్లు. డిసెంబర్ 2010 నాటికి 50 కోట్ల 6 లక్షలు ఖర్చు అయినట్టు 2011-12 సంవత్సరానికి 5 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు ప్రభుత్వ నివేదికలు చెప్తున్నాయి. దాదాపు 95 శాతం పనులు పూర్తయినాయని, మార్చి 2012 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని ప్రభుత్వం సమాచారమిచ్చింది. చౌటుపల్లి హన్మంతడ్డి ప్రాజెక్టు గోదావరి జలాలను ఉపయోగించుకుంటుందని వేరే చెప్పనక్కరలేదు.

కొమురం భీం ప్రాజెక్టు
ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని ఆడ గ్రామం సమీపంలో పెద్ద వాగుపై ఇటీవలే నిర్మించబడ్డ మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు ఇది. ఆసిఫాబాదు, కాగజ్‌నగర్, వాంకిడి, సిరిపూర్ మండలాల్లోని 24,500 ఎకరాల ఆయకట్టు ఈ ప్రాజెక్టు కింద ఉంది. ఈ ప్రాజెక్టు వ్యయం ₹ 274 కోట్ల 14 లక్షలు. ఈ ప్రాజెక్టు పూర్తయినట్టు ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లి వచ్చారు. అయితే పూర్తి కావలసి న పనులు ఇంకా చాలానే ఉన్నాయని భోగట్టా. 2010 డిసెంబర్ నాటికి మొత్తం 355 కోట్ల1 లక్షల రూపాయలు ఖర్చు అయినట్టు, 2011-2012 సంవత్సరానికి మరో 43 కోట్ల బడ్జెటు కేటాయింపు జరిగిందని ప్రభుత్వం నుంచి సమాచారం.

కోయిల్‌సాగర్ ప్రాజెక్టు
నిజానికి ఇది కొత్త ప్రాజెక్టు కాదు. మహబూబ్‌నగర్ జిల్లా అమరచింత నియోజకవర్గంలోని 12వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే ఉద్దేశ్యంతో కోయిల్‌సాగర్ ప్రాజెక్టును 1955లోనే నిర్మించడం జరిగింది. అయితే గత అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతాలలో వర్షాలు లేకపోవడం వల్ల 4500 ఎకరాలకు మించి సాగునీరు అందడం లేదు. ఈ ప్రాజెక్టుకు బచావత్ ట్రిబ్యునల్ 3.90 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించడం జరిగింది. ఈ 3.90 టీఎంసీల నీటిని జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్ తీర ప్రాంతం నుంచి రెండు దశలలో మొత్తం 11 మీటర్లకు ఎత్తడం ద్వారా పాత ఆయకట్టు 12వేల ఎకరాలకు అదనంగా మరో 3,250 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలన్నది ప్రభుత్వ ఆలోచన. తుంపర సేద్యం ద్వారా మొ త్తం 50వేల 250 ఎకరాలకు సాగునీరందించాలన్న ప్రభుత్వ సంకల్పం సిద్ధిస్తుందోలేదో వేచి చూడాల్సిందే. ఈ ప్రాజెక్టుకు 359 కోట్ల రూపాయల పరిపాలనా ఆమోదం లభించింది. 2010 డిసెంబర్ చివరి నాటి 260 కోట్ల 7 లక్షల రూపాయలు ఖర్చయిందని, 2011-12 సంవత్సరానికి 60 కోట్ల రూపాయల బడ్జెటు కేటాయింపు జరిగినట్టు ప్రభుత్వ సమాచారం.

కాళేశ్వరం ప్రాజెక్టు
కరీంనగర్ జిల్లాలోని ముత్తారం, మల్హర్‌రావు, కాటారం, మహదేవపూర్ మండలాల్లో 45వేల ఎకరాల ఆయకట్టు సాగు చేసే ఉద్దేశ్యంతో గోదావరి న ది పైన కన్నెంపల్లి వద్ద ఇన్ కట్టడం (Intake structure) నిర్మించి నాలుగున్నర టీఎంసీల నీటిని ఎత్తిపోతల ద్వారా అందించాలని ప్రభుత్వం సంకల్పించి, ఈ స్కీం గురించి 643 కోట్ల రూపాయలకు పరిపాలక ఆమోదాల్ని తెలిపింది. ఇంతకన్న అదనపు సమాచారం ఈ స్కీం గురించి లభ్యం కాలేదు.

నెట్టంపాడు ప్రాజెక్టు
జూరాల రిజర్వాయర్ తీర ప్రాంతం నుంచి 22 టీఎంసీల నీటిని తోడిపోయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యం. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల, ఆలంపూ ర్ నియోజకవర్గాలలోని మండలాలలో 14 గ్రామాలకు కాలువ వ్యవస్థ ద్వారా మార్గ మధ్యలో తాగు నీటి సదుపాయాలను కల్పించడమే గాక, 2 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు సాగునీటి సౌకర్యం కల్పిస్తుంది. వివరాల్లోకి వెళితే.. జవహర్‌లాల్ నెహ్రూ నెట్టంపాడు ఎత్తిపోతల పథకంలో రెండు దశలున్నాయి. అప్రోచ్ ఛానల్, ‘ఫ్రెజమైన్ టన్నల్’తో పంపింగ్ వ్యవస్థ. రెండు ఆన్ లైన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను గూడెందొడ్డి గ్రామంలో మొదటి ఎత్తిపోతలను, రేలంపాడు గ్రామంలో రెండవ ఎత్తిపోతలను ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు కోసం ₹142 కోట్లకు పరిపాలనా ఆమోదాన్ని ఇచ్చారు. 2010 డిసెంబర్ చివరినాటికి అయిన ఖర్చు ₹1233కోట్ల 2 లక్షలు. 2011-2012 కు..₹ 233 కోట్ల మొత్తాన్ని బడ్జెట్‌లో కేటాయించారు. ఇక పనులలో జరిగిన ప్రగతి విషయానికి వస్తే.. ఇప్పటిదాక సుమారు 0 శాతం పూర్తయినట్టు ప్రభుత్వం చెప్పుతున్నది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ మొత్తం 23 వేల 79 ఎకరాలు. ఇప్పటి వరకు 19425 ఎకరాలు సేకరించారు. ఇక ముంపు విషయానికి వస్తే.. రేలంపాడు, ఆలూరు గ్రామాలు ముంపుకు గురవుతాయని ప్రకటించడం జరిగింది. పునరావాస, సహాయక కేంద్రాల నిమిత్తం అంచనాలు తయారు చేస్తున్నారు.

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం
మహాత్మాగాంధీ కుల్వకుర్తి ఎత్తిపోతల పథకం మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించిన ప్రతిష్ఠాత్మకమైన 3లక్షల 40 వేల ఎకరాలకు సాగునీరు అందివ్వడంతోపాటు కొల్లాపూర్, నాగర్ కర్నూలు, అచ్చంపేట, జడ్చర్ల, వనపర్తి, కల్వకుర్తి నియోజకవర్గాలలోని 22 మండలాలకు సంబంధించిన 303 గ్రామాలకు, తీవ్ర అనావృష్టికి గురైన ప్రాంతాలకు తాగునీరు సదుపాయం కల్పించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. శ్రీశైలం రిజర్వాయర్ తీరవూపాంతం నుంచి 3 దశలలో 244 మీటర్ల స్థాయినుంచి 502 మీటర్ల స్థాయి దాక, అంటే 29 మీటర్ల ఎత్తుకు 25 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం జరుగుతుంది. కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామం, రేగుల మంగడ్డ వద్ద శ్రీశైలం రిజర్వాయర్ తీర ప్రాంతం నుంచి నీటిని తీసుకోవటం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు కోసం ₹ 2990 కోట్ల పరిపాలక మంజూరును ఇచ్చారు. 6 శాతం భూసేకరణ జరిగిందని ప్రభుత్వం చెప్తోంది. డిసెంబర్ 2010 దాక అయిన ఖర్చు ₹ 2072 కోట్ల 16 లక్షలు, 2011 -2012కు గాను 250 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగింది.

ఇప్పటి దాక ఇచ్చింది ప్రభుత్వ సమాచారం. కానీ వాస్తవానికి జలయజ్ఞం అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ప్రాజెక్టులేవీ సాఫీగా కొనసాగడం లేదు. భూసేకరణ ఒక సమస్య అయితే, ఇపీసీ విధానం క్రింద అస్మదీయులకు కాంట్రాక్టులు అప్పచెప్పితే, వారు తమ సబ్ కాంట్రాక్టర్లకు, వారు ఇంకా చిల్లర కాంట్రాక్టర్లకు ఇలా చేతులు మారుతూ, నాణ్యత పరంగా ప్రాజెక్టులు బాగా దెబ్బతినడం మరో సమస్య. ఇది చాలదన్నట్టు అధికార పక్షం ప్రజావూపతినిధుల జోక్యం, తాము నిర్ణయించిన మనుషుల దగ్గరే ఇసుక, కంకర తమ రేట్లకే కొనాలని పట్టుబట్టడం లాంటి జాడ్యాలతో అనేక ప్రాజెక్టులు, ముఖ్యంగా పాలమూరు ప్రాజెక్టులు ఇబ్బందులు పడుతున్నాయి.

పై పెచ్చు కాంట్రాక్టర్లు చేస్తున్న పనులపై అజమాయిషీ, వివిధ ప్యాకేజీల నడుమ సమన్వయం లేకపోవడంతో మరో నాలుగేళ్లకయినా ప్రాజెక్టులు పూర్తవుతాయా? కనీసం పాక్షికంగానైనా ప్రయోజనాలు చేకూరుతాయా? అన్నది అనుమానమే. కుల్వకుర్తి విషయమే తీసుకుందాం.శ్రీశైలం నుంచి నీటిని ఎత్తి ఎల్లూరు జలాశయంలోకి నీరు తరలించాలి. అక్కడ్నుంచి సింగోటం, అక్కడ్నుంచి జొన్నల బోగుడ. అంతిమంగా కృష్ణా జలాలు గుడిపల్లి గట్టు జలాశయం చేరాలి. మొదటి లిఫ్ట్ శ్రీశైలం నీటిని ఎల్లూరుకు చేరుస్తుంది. మార్గమధ్యంలో 13 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. సింగోటం జొన్నల బోగుడ మధ్య రెండవ లిఫ్ట్ ఉంది. సింగోటం జొన్నలబోగుడ మధ్య ఆయకట్టు లేదు. జొన్నలబోగుడ, గుడిపల్లి గట్టు మధ్య మూడో లిఫ్ట్ ఉంది. ఈ రెండు జలాశయాల మధ్య 57 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందాల్సి ఉంది. గుడిపల్లి గట్టు నుంచి 2 లక్షల 7వేల ఎకరాలకు సాగునీరు అందే కార్యక్షికమం ఉంది. గమ్మత్తేమిటంటే రెండో లిఫ్ట్‌లో ఎలాంటి పురోగతి లేదు. మొదటి లిఫ్ట్, మూడో లిఫ్ట్ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. రెండోలిఫ్ట్ పూర్తయితే తప్ప మూడో లిఫ్ట్ పూర్తయినా 3 లక్షల 27 వేల ఎకరాలకు నీరందదు. కానీ ప్రభుత్వం ఈ రెండో లిఫ్ట్ పనులు కొనసాగుతున్న కాంట్రాక్టర్‌పై తేవలసినంత వత్తిడి తేలేకపోతున్నది. ఇలాంటివే సవాలక్ష సమస్యలు ఎదుర్కొంటున్నాయి ప్రాజెక్టులు.

ఇదిలా ఉంటే నెట్టంపాడు ఎత్తిపోతలు జూరాల పైన ఆధారపడి ఉన్నాయి. కల్వకుర్తి, శ్రీశైల పైన ఆధారపడి ఉంది. విచివూతమేమంటే నెట్టం పాడుకు కావలసిన 22 టీఎంసీల కృష్ణా మిగులు జలాలు, కల్వకుర్తికి అవసరమైన 25 టీఎంసీల మిగులు జలాలు, 90 రోజుల్లో తీసుకోవాలి. అదే సీమాంధ్ర ప్రాజెక్టులకు అంటే పోతిడ్డిపాడు హెడ్ రెగ్యురేటర్ ద్వారా శ్రీశైలం నుంచి బేసిన్ ఆవలికి పంపించే కృష్ణా మిగులు జలాలు కేవలం 30 రోజుల్లోనే తరలింపు కార్యక్షికమం పూర్తవుతుంది. ఒకే ప్రభుత్వం క్రింద రెండు ప్రాంతాలలో ఉన్న ప్రాజెక్టులు, తెలంగాణకు చెందిన నెట్టంపాడు, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీలకు 90 రోజుల్లో తరలించడమేమిటి, ఆంధ్ర ప్రాజెక్టులు 30 రోజుల్లో తరలించడమేమిటని అడిగితే, పోతిడ్డిపాడు నుంచి తరలించే నీళ్లను నిలువచేయడానికి బ్యాలెన్సింగ్ జలాశయాలున్నాయి. తెలంగాణకు లేవు కనుక జూరాల, శ్రీశైలం రిజర్వాయర్లే స్టోరేజీగా పనిచేస్తాయని తాము చేసే దుర్మార్గపు చర్యలకు ముసుగు వేసి ఏవో కుంటిసాకులు చెప్పి తప్పించుకుంటున్నారు వలసపాలకులు.

నిజానికి కృష్ణా బేసిన్‌లో పూర్తిగా అంతర్భాగంగా ఉన్న జిల్లా లు, మహబూబ్‌నగర్, నల్లగొండ. వాటి అవసరాల పక్కన బెట్టి కృష్ణా మిగులు జలాలను బేసిన్ అవతలి క్షేత్రాలకు నిరాటంకంగా, దౌర్జన్యంగా తరలించే కార్యక్షికమం ప్రభుత్వం తలపెట్టింది. మొత్తం 227.50 టీఎంసీల మిగులు జలాలను తరలించే వ్యూహంతో ఆంధ్రకు 150 టీఎంసీలు, తెలంగాణకు 77.50 టీఎంసీలు కేటాయించారు. అదికూడా 30రోజుల్లో ఆంధ్రకు మళ్లీస్తే తెలంగాణ 90 రోజుల్లో తరలించాలన్న ప్లాన్ ఇలా ఇష్టం వచ్చినట్టు, ఏం చేసినా చెల్లుతుందనే పొగరుబోతు తనంతో నీటిని అక్రమంగా నిస్సిగ్గుగా తరలించుకుపోతూ ఉంటే చేతులు ముడుచుక్కూర్చున్న తెలంగాణ ప్రజావూపతినిధుల బేల తనాన్ని చూసి జాలిపడటం కన్న చేసేదేముంది! అవగాహనా రహిత్యం, బానిసత్వ లక్షణాలు నరనరాన జీర్ణించుపోవడం, కించిత్తు స్వార్థం ఇవన్నీ కలగా పులగంగా తెలంగాణ నాయకులను పట్టిపీడిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం వస్తే తప్ప ఈ ప్రాంతానికి ప్రజలకు విముక్తి లేదు.

- ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర