వివాదాల(నాగార్జున) సాగరం


Mon,February 20, 2012 02:01 AM

నాగార్జునసాగర్ డ్యాంను ఇప్పుడున్న చోట కాకుండా ఎగువన కట్టవలసి ఉండెనని మా పెద్దలు చెప్తూ ఉంటరు. అలా చేయకుండా కావాలని కిందకి తీసుకువచ్చారని, దీనివల్ల తెలంగాణ భారీగా నష్టపోయిందని చెప్తారు. సాగర్ విషయంలో ఆంధ్ర, తెలంగాణ మధ్య చాలా విభేదాలు పొడసూపాయని కూడా చెప్పారు. ఇది ఎంతవరకు నిజం?

గుమ్మడి సుశీలాదేవి, హుజూర్‌నగర్ (నల్లగొండ జిల్లా)


SAGAR talangana patrika telangana culture telangana politics telangana cinema
నాగార్జునసాగర్ సైట్ మొదలుకొని ఎడమకాలువ, కుడి కాలువ నిర్వహణ దాక అనేక వివాదాలు చర్చల్లో ఉన్నమాట నిజం. కనీసం ఎనమిది మోసాలు, వివాదాలు నా దృష్టికి వచ్చాయి. అయితే వీటిలో కొన్నింటికి దాఖలాలు ఉన్నాయి. కొన్నింటికీ లేవు. మొదట సైట్ విషయం మాట్లాడుకుందాం. నాగార్జునసాగర్ డ్యాం కట్టడానికి పూర్వం అనేక స్థలాలను పరిశీలించారు. అందులో ఉత్తమమైన వాటిగా రెండు స్థలాలను 1.ఏలేశ్వరం 2. నందికొండ గ్రామాల దగ్గర ఎంపిక చేశారు. ఏలేశ్వరం సైట్ నందికొండ సైట్‌కు ఎగువన ఉంది. అయితే ఏలేశ్వరం దగ్గర నది వెడల్పు 1400 అడుగులు పైగా మామూలుగా ఉండవలసిన V ఆకారానికి బదులుగా U ఆకారంలో ఉంది. రెండువైపుల ఎత్తెన కొండలు ఉన్నాయి. కృష్ణా వరదను తరలించడానికి కొండలు, పక్కన అనువైన తక్కువ ఎత్తు ప్రాంతం (Saddles) లేవు. కనుక తప్పనిసరిగా వరదను నది గుండానే పంపవల్సి ఉంటుంది.

ఇందుకోసం ఎతైన గేట్లు అమర్చవలసి ఉంటుంది. ఏలేశ్వరం డ్యాం చాలా ఎత్తుగా ఉండాల్సిన అవసరం ఉండటంతో దాన్ని తప్పక ‘కాంక్షికీట్‌డ్యాం’గానే కట్టవలసి ఉంటుందని ఆంధ్ర, హైదరాబాద్ ప్రభుత్వాలు 1954లో ఉమ్మడిగా తయారు చేసిన నందికొండ (అప్పట్లో దీనికి నాగార్జునసాగర్ అన్న పేరు లేదు) ప్రాజెక్టు రిపోర్టు 3 వ అధ్యాయంలో 3.04 పేరాలో ఉటంకించడం జరిగింది.
పై విషయాలను ధృవీకరిస్తూనే అదనంగా మరి కొన్ని విషయాలను సాగర్ డ్యాం సైట్‌లో ప్రారంభం నుంచి చివరి దాక పనిచేసిన మాటూరు గోపాలరావు ( ఖమ్మం జిల్లా) తన పుస్తకం నాగార్జున సాగర్ పేజీ 52లో ఇలా తెలియచేశారు. వరదను బయటికి పంపడానికి అవసరమైన అదనపు గేట్లును అమర్చడానికి లోతట్టు ప్రాంతం(Saddles) లేకపోవడం, ఏలేశ్వరం డ్యాం సైట్‌లో నది నిడివి చాలా కొద్దిగా ఉండటంతో వరద పంపే ఏర్పాట్లు, విద్యుత్తు కేంద్రం ఏర్పాటుకు అనువైన స్థల లభ్యత లేని కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.

పైగా కాలువలను చాలా దూరం సొరంగ మార్గాన పయనింప చేసాకే సాగునీటి భూములకు నీరందించే వీలుంటుంది. ఇక్కడ ఆనకట్ట కట్టాలంటే చాలా ఖర్చవుతుంది. 1954 లో తయారైన ఉమ్మడి ప్రభుత్వాల నివేదిక గోపాలరావు రాసిన ‘నాగార్జునసాగర్ ప్రాజెక్టు’ పుస్తకం చెప్పే విషయం ఒక్కటే. సాంకేతిక, ఆర్థిక కారణాల వల్ల ఏలేశ్వరం డ్యాం సైట్ ను నందికొండకు మార్చడం జరిగిందని. కాని తెలంగాణ ప్రజలు మాత్రం కావాలనే డ్యాం సైట్ ను దిగువకు మార్చారని విశ్వసిస్తున్నారు.

కేంద్ర జల విద్యుత్తు సంఘంలో 1950 లో డైరెక్టర్‌గా పదవి చేపట్టి నాగార్జునసాగర్ డిజైన్, సాంక్షన్, ప్లానింగ్‌లో ముఖ్యమైన పాత్ర వహిస్తూ, ప్రణాళిక సంఘాన్ని ప్రభావితం చేసిన డాక్టర్ కేఎల్‌రావు ఉద్దేశపూర్వకంగానే ఈ సైట్‌ను మార్చడానికి బాధ్యులని ఇప్పటికీ ఇంజనీర్లు, తెలంగాణ రాజకీయ నాయకులు, మేధావులు, ప్రజలు భావిస్తున్నారు. సైట్‌మార్చడంలో డాక్టర్ కేఎల్ రావు పాత్ర ఉందని చెప్పడానికి మన దగ్గర కచ్ఛితమైన దాఖలా ఏమీ లేదు. కాకపోతే ఎడమ కాలువ సాంక్షన్, ప్రాజెక్టులో లేని నూజివీడు, తిరువూరు ప్రాంతాలకు నీరు తీసుకు వెళ్ళడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారన్న సంగతి జగమెరిగిన సత్యం. డాక్టర్ కేఎల్ రావు కృష్ణా జిల్లాకు చేసిన మహోపకారానికి ప్రతిఫలంగా, పార్లమెంట్‌కు అన్ని పార్టీలు ఏకక్షిగీవంగా ఎంపిక చేసి పంపారని చెప్పకుంటుంటారు.

రెండవ వివాదం: ఆయకట్టు విషయానికి వస్తే ప్రణాళికా సంఘం 1956 లో ఆమోదించిన ప్రాజెక్టు రిపోర్టు ప్రకారం ఎడమ కాలువకు 132 టీఎంసీలు, కుడికాలువకు 132 టీఎంసీలు కేటాయింపులున్నయి. ఎడమకాలువ తెలంగాణ జిల్లాలైన నల్లగొండ, ఖమ్మంలో ఆరు లక్షల 60 వేల ఎకరాలకు, ఆంధ్రలో 1లక్ష 30 వేల ఎకరాల ఆయనట్టుకు నీరందించాలి. కానీ వలస పాలకులు అనేక కుట్రలు చేసి ఈ రోజు అధికారికంగా తెలంగాణకు ఆయిదు లక్షల 32 వేల ఎకరాలకు వాలు మార్గంగా, 70 వేల ఎకరాలకు ఎత్తిపోతల మార్గంగా వెరసి ఆరు లక్షల రెండు వేల ఎకరాల ఆయకట్టుకు సుమారు 100 టీఎంసీలను, ఆంధ్ర ఆయకట్టును 3 లక్షల 0వేల ఎకరాల పెంచి నీటి కేటాయింపును 111 టీఎంసీలుగా మార్చడం జరిగింది. అంటే తెలంగాణ ఆయకట్టు 5 వేల ఎకరాలకు కుదించి, నీటి కేటాయింపును 11 టీఎంసీలు తగ్గించి, ఆంధ్ర ప్రాంతానికి ఈ 11 టీఎంసీల కేటాయింపును బదిలీ చేసి తిరువూరు,నూజివీడు ప్రాంతాలకు ఎడమ కాలువను పొడిగించి, ఆయకట్టును 1లక్ష 30వేలకు బదులుగా మూడు లక్షల 0 వేల ఎకరాలకు పెంచడం జరిగింది. ఇది పూర్తిగా డాక్టర్ కేఎల్‌రావు చలువే అనడంలో ఎలాంటి అనుమానం లేదు. బాగా గొడవ జరిగినాక తెలంగాణ ఆయకట్టును పెంచారు. కానీ నీటి కేటాయింపులు పెంచలేదు.

మూడవ వివాదం: కాలువల సైజులు ఎడమ కాలువ, కుడి కాలువ రెండూ కూడా 132 టీఎంసీలే మోసుకెళ్లాలి. రెండింటి సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు, రెండు తూముల హెడ్ రెగ్యులేటర్ స్థాయి కూడా 49 అడుగులే. కానీ కుడి కాలువ తూముకు 9 గేట్లు ఉంటే ఎడమ కాలువ తూముకు 3 గేట్లు అమర్చారు. కుడి కాలువ వెడల్పు (Bed width)అత్యధికంగా241 అడుగులుండగా, ఎడమ కాలువ వెడల్పు అత్యధికంగా 95 అడుగులే. మరోమాటలో చెప్పాలంటే ఎడమ కాలువ పూర్తి సామర్థ్యంతో (11 వేల క్యూసెక్కుల నీటిని మోసుకు వెళ్లగలగటం) పనిచేయాలంటే నాగార్జునసాగర్‌లో తప్పనిసరిగా 520 అడుగుల నీరు ఉండాలి. అదే కుడి కాలువకు కేవలం సాగర్‌లో 502 అడుగులుంటే చాలు పూర్తి సామర్థ్యంతో అంటే 11 వేల క్యూసెక్కుల నీటిని మోసుకు వెళ్లగలుగుతుంది.

నాగార్జునసాగర్ జలాశయ స్థాయి 16 అడుగుల క్రింద ఉన్నా కూడా కుడి కాలువ పూర్తి సామర్థ్యంతో పనిచేయగలగటం, అదే ఎడమ కాలువ విషయానికి వస్తే పాక్షికంగా అదీ స్వల్పంగానే నీటిని విడుదల చేయగలగడం ఏరకంగా న్యాయ సమ్మతమో, సమంజసమో వలస పాలకులే సమాధానం చెప్పాలి.
నాలుగో వివాదం: ఎడమ కాలువను పాలేరు జలాశయంలో నింపి అక్కడ్నునుంచి దిగువ స్థాయిలో కాలువను తీసుకెళ్లిన క్రమంలో కాలువ స్థాయి 13 అడుగులు కోల్పోవడం జరిగింది. అలా 13 అడుగుల స్థాయి పడిపోవడం వల్ల తెలంగాణకు భారీగా నష్టం వాటిల్లిందని ఐదవ శాసనసభ అంచనాల కమిటీ ఈ మాటల్లో వ్యక్తం చేసింది. ‘By letting the main canal in to Palair river the level seems to be reduced by five feet and also the off-take is again reduced by eight feet which also results in considerable reduction in the ayacut beyond’ (పాలేరు నదిలో ప్రధాన కాలువ (ఎడమ కాలువ) ను వదలటం మూలంగా 5 అడుగుల స్థాయి తగ్గినట్టు కానవస్తున్నది.

అలాగే కాలువను (పాలేరు జలాశయం నుంచి) తీసుకెళ్లినప్పుడు మరో అడుగుల స్థాయిని తగ్గించడం మూలంగా, ఆయకట్టు భారీగా తగ్గింది. ఇందుకు డొంక తిరుగుడు సమాధానమిచ్చింది ప్రభుత్వం. ‘any change at this juncture would create complications lower down where major works are in progress and they would get effected .’ ఈ నేపథ్యంలో ఏ మాత్రం మార్పులు చేసినా దిగువన నిర్మాణంలో ఉన్న భారీ పనులకు అంతరాయం కలుగుతుంది అని సమాధానమివ్వడం ప్రభుత్వం తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని అంచనాల కమిటీ అంగీకరించడం బాధాకర విషయం.

1952లో హైదరాబాద్ ప్రభుత్వం రూపొందించిన పథకం ప్రకారం నాగార్జునసాగర్ ప్రధాన కాలువ నల్లగొండ జిల్లా రేపాల, సిరికొండ చెరువులు దాటుకుంటూ జల్లేపల్లి, ముల్కలపల్లి, గార్ల, బయ్యారం, ఇల్లెందు, అన్నాడ్డిపల్లి, సత్తుపల్లి క్షేత్రాలకు నీరందించాలని ఉండేదని, ఉమ్మడి రిపోర్టులో ఈ పథకాన్ని మాయం చేసి పాలేరు జలాశయంలో పడవేసేట్టుగా మార్పులు చేశారని అంటారు. ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిన కాలువ కనీసం ఉమ్మడి రిపోర్టులో (1954) రాసినట్టుగా కూడా లేక భిన్నంగా ఉంది. ఉమ్మడి రిపోర్టు ప్రకారం పాకాల జలాశయంలో డ్రాప్ చేసే ముందు ఎడమ కాలువ పూర్తి సరఫరా స్థాయి (FRL) 445.20 అడుగులు. పాలేరు జలాశయం పూర్తి జల స్థాయి FRL 444.16 అడుగులు. దిగువ నుంచి తీసుకు off-take పూర్తి సరఫరా స్థాయి (FSL) 442.16 అడుగులు. అంటే 3.04 అడుగుల స్థాయి నష్టమన్నమాట. కానీ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిన (levels)స్థాయిలు ఇలా ఉన్నాయి. పాలేరు జలాశయంలో పడేసే ముందు ఎడమ కాలువ పూర్తి సరఫరా స్థాయి(FSL) 445.37 అడుగులు. పాలేరు జలాశయం పూర్తి జలస్థాయి(FRL) 439.31అడుగులు. పాలేరు నుంచి ఆఫ్ టెక్ సాగర్ కాలువ పూర్తి సరఫరా స్థాయి(FSL) 432.36 అడుగులు. స్థాయి నష్టం(head loss) 13.01 అడుగులు .

అయిదో వివాదం: ప్రాజెక్టు రిపోర్టు ప్రకారం నాగార్జునసాగర్ జలాశయం నుంచి 30 వేల ఎకరాలకు, కాలువల నుంచి 70 వేల ఎకరాలు వెరసి ఒక లక్ష ఎకరాలకు ఎత్తిపోతల ద్వారా అదనంగా తెలంగాణ ఆయకట్టుకు నీరివ్వాలని ఉంది. దా న్ని 50 వేలకు కుదించటం జరిగింది. అలా ఎందుకు చేశారని అంచనాల కమిటీ అడిగితే దానికేదో డొంక తిరుగుడు సమాధానం చెప్పి 70 వేల ఎకరాలకు ఎత్తిపోతల ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కమిటీని సంతృప్తి పర్చడం జరిగింది.

ఆరో విషయం ఎడమ కాలువ, కుడి కాలువ రైతాంగం మధ్య ప్రభుత్వం చూపించే వివక్ష- ఎడమ కాలువ రైతాంగం ఎత్తిపోతల విద్యుత్తు ఖర్చును తాము భరించవలసి ఉండగా, కుడి కాలువ రైతాంగం కరెంట్ ఖర్చు ప్రభుత్వం భరిస్తున్నది. దీనికి కూడా ఏదో కుంటిసాకు ప్రభుత్వం చెప్పుతున్నది.
ఏడో వివాదం: నాగార్జునసాగర్ రైతాంగం అవసరాలకన్నా ప్రభుత్వం కృష్ణా డెల్టా రైతాంగం అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడం మరో బాధకలిగించే విషయం. నీటి కేటాయింపులు జరిగేంతవరకు మొదటి రెండో జాబితాలో ప్రాజెక్టులు చేర్చడం జరిగింది. కానీ ఒకసారి నీటి కేటాయింపులను ఖారారు చేశాక అన్ని ప్రాజెక్టులకు సహజమైన అర్హత ఉంటుందని బచావత్ ట్రిబ్యునల్ స్పష్టం చేశాక కూడా, మన ప్రభుత్వం మొదటి నుంచి కృష్ణా డెల్టాకే అగ్ర తాంబూలం ఇచ్చి ఆ తర్వాత నాగార్జునసాగర్‌కు నీరు కేటాయిస్తున్నది.

ఇలా ఎందుకు చేస్తున్నారంటే కృష్ణా డెల్టా సాగర్ కంటే ముందు అమలులో ఉంది. కింద వాటికి మొదట నీరు వాడుకునే హక్కు ఉందని ప్రభుత్వం వింత వాదన ముందుకు తెస్తున్నది. మరి ఆ లెక్కన ఇటీవలే కట్టిన ఆల్మట్టికి నీటి ప్రాధాన్యం ఉండకూడదు కదా! అని అంటే, అది మన రాష్ట్రంలో లేదు కదా అంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టిలో భారతదేశానికంతటికీ ఒకే చట్టం, రాష్ట్రంలో మరో చట్టం. సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి కూడా డెల్టాకు నీరు వదిలే తూములు ఏర్పాటయ్యాయి.

ఎనిమిదో వివాదం: నాగార్జునసాగర్ డ్యాంకు దిగువన టెయిల్‌పాండ్ నిర్మాణానికి 1972లో అనుమతి వచ్చింది. విద్యుత్తు ఉత్పత్తి చేశాక డ్యాం నుంచి విడుదలయ్యే నీటిని ఈ టెయిల్‌పాండ్‌లో తాత్కాలికంగా నిలువరించి, రాత్రి పూట విద్యుత్తు ఉపయోగించే జనరేటర్లు రివర్స్‌మోడ్‌లో పంపుల్లాగా పనిచేసి ఆ నీటిని తక్కువ విద్యుత్తు డిమాండ్ ఉన్న సమయంలో తిరిగి నాగార్జునసాగర్ జలాశయానికి పంపుచేయాలన్న ఉద్దేశంతో సాంక్షన్ అయిన ఈ ప్రాజెక్టును పక్కనబెట్టి, ఇష్టారాజ్యంగా సాగర్ జలాలను విద్యుత్తు ఉత్పత్తి పేరుతో ఇంతకాలం సమువూదంలోకి వృధాగా వదిలారు. సడెన్‌గా ఇప్పుడు మేల్కొని టెయిల్‌పాండ్ నిర్మాణానికి పూనుకున్నారు. అది కూడా మరో దురుద్దేశంతో.

విలువైన గోదావరి జలాలను దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టు ద్వారా కృష్ణా బేసిన్‌కు తరలించి, ఈ నీటిని సాగర్ కాల్వలకు మళ్లించి, సాగర్‌కు కృష్ణా జలాలను ఆ మేరకు వదల వలసిన అవసరం లేకుండా, ఆ మిగిలిన నీటిని శ్రీశైలం, పోతిడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గుండా సీమకు తరలించాలన్నది ప్రభుత్వం కుట్ర.

ఇప్పటికీ ఎనిమిది కుట్రలను, మోసాలను సాగర్ విషయంలో చూశాం. కొన్నింటికి దాఖలాలు లేవు. అయినా చేసిన ప్రతిదానికి దాఖలాలుండవు. హంతకులు కూడా ఎలాంటి ఆనవాళ్లు వదలకుండా జాగ్రత్త పడతారు. అదేవిధంగా నాగార్జునసాగర్ ప్లానింగ్, డిజైన్, నిర్వహణ అన్ని విషయాల్లోనూ తెలంగాణకు ఎన్ని రకాలుగా అన్యాయాలు చేయాలో అన్నీ చేశారు వలసపాలకులు . వీళ్ల కుట్రలు ఇలాగే కొనసాగితే నల్లగొండ, ఖమ్మం జిల్లా రైతాంగం సమీప భవిష్యత్‌లోనే సాగర్ నుంచి ప్రవహించే గ్రావిటీ నీళ్లకు బదులుగా, దుమ్ముగూడెం నుంచి ఎత్తిపోతల మార్గంలో వచ్చీరాని గోదావరి జలాలపై ఆధారపడ వలసి రావచ్చు. ఏం చేస్తాం... బంగారం లాంటి హైదరాబాద్ రాష్టాన్ని వదిలి, అంధకార బంధురమైన ఆంధ్ర వూపదేశ్‌లో విలీనమయిన పాపానికి శిక్ష అనుభవించవలసిందే. దీనికి తెలంగాణ సాధించుకోవడమే పరిష్కారం

- ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

country oven

Featured Articles