డిండీ ఎత్తిపోతల పథకం


Mon,January 23, 2012 12:07 AM

డిండీ ఎత్తిపోతల పథకం అమలవుతే నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లా కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు అందుతుందని విన్నాను. నిజమా? వివరించండి.

-కె సువర్ణ, అచ్చంపేట, మహబూబ్‌నగర్ఈడిండీ ఎత్తిపోతల పథకం గురించి నల్లగొండ నుంచి కోమటిడ్డి జనార్దన్‌డ్డి కూడా అడిగారు. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలలో మూడు లక్షల ఎకరాలకు సాగు నీటి సదుపాయం కల్పించడానికి, ప్రస్తుతమున్న డిండీ జలాశయంలోకి ఎస్‌ఎల్‌బీసీ సొరంగ పథకానికి చెందిన ప్రతిపాదిత డిండీ బ్యాలెన్సింగ్ జలాశయం నుంచి ఎత్తిపోతలను ఏర్పాటు చేయడానికి, గాను సర్వే జరిపి సవివరమైన ప్రాజెక్టు నివేదికను తయారు చేయడం కోసం ప్రభుత్వం పరిపాలన ఆమోదాన్ని తెలియజేసింది. డీపీఆర్ చేసే పనిని ఎస్ అండ్ హెచ్ రిస్సోస్ ఇన్ఫర్మేటిక్స్ లిమిటెడ్ సంస్థకు అప్పగించారు. పని జరుగుతున్నది. ఇది 2009-2010 సంవత్సరపు నివేదికలో భారీ,మధ్యతరహ సాగునీటి డిమాండ్ పై భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఇచ్చిన వివరణ.

DAM-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema అయితే విచివూతంగా 2010-2011, 2011-2012 సంవత్సర నివేదికలలో డిండీ ఎత్తిపోతల పథకం ప్రస్తావన లేదు. అంటే సదరు సంస్థ దర్యాప్తు పూర్తి చేసి ప్రభుత్వానికి సమర్పించిందా లేదా అన్న విషయం ప్రభుత్వం స్పష్టం చేయలేదు. కాకపోతే తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం వారు ఈ పథకంపైన అవసరమైన సమాచారాన్ని అందచేశారు. తాజా సమాచారం ప్రకారం S&H RESOURCE సంస్థ వారు సమగ్ర నివేదికను తయారు చేసి సంబంధిత చీఫ్ ఇంజనీర్‌కు సమర్పించారు. అయితే ఆ నివేదికపై ఎలాంటి తదుపరి చర్యలు లేవు. అంటే ఉద్దేశపూర్వకంగా ఈ స్కీంను ప్రభుత్వం పక్కన పెట్టింది. అందునా తెలంగాణకు ఉపయోగపడే ప్రాజెక్టు కనుక ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కూడా భావించవలసి వస్తోంది.

నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు నియోజక వర్గాల్లోని కొన్ని ప్రాంతాలు, మహబూబ్‌నగర్ జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి నియోజక వర్గాల్లోని కొన్ని ప్రాంతాలకు ముఖ్యంగా ఫ్లోరైడ్ , కరువు పీడిత ప్రాంతాలకు సాగు, తాగు నీరు కల్పించేందుకు వీలుగా డిండీ ఎత్తిపోతల పథకాన్ని అధ్యయనం చేయడం కోసం 130 లక్షల రూపాయల ఖర్చుకు అనుమతిస్తూ 7-7-2007నాడు జీ.వో. 159 విడుదల చేసింది. శ్రీశైలం జలాశయం నుంచి ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అంటే ‘టనెల్ బోరింగ్ మెషీన్’ ఉపయోగించి మొదట సొరంగాన్ని తవ్వుతున్నారు. ఈ సొరంగం శ్రీశైలం నీటిని డిండీపై ప్రతిపాదించిన దిగువ డిండీ (నక్కల గండి) జలాశయంలోకి తరలిస్తుంది.

అక్కడినుంచి రెండవ సొరంగం సంప్రదాయ ‘డ్రిల్ అండ్ బ్లాస్ట్’ పద్ధతిలో తవ్వడం పూర్తయ్యింది. శ్రీశైలం జలాశయం నుంచి 30 రోజులపాటు 5600 క్యూసెక్కుల చొప్పున 4.15 టీఎంసీల నీటిని, మరో 60 రోజులపాటు 4 వేల క్యూసెక్కుల చొప్పున 31.10 టీఎంసీల నీటిని వెరసి 35.25 టీఎంసీల కృష్ణా మిగులు జలాలను మొదటి సొరంగం( Tunnel-1) నక్కల గండి జలాశయానికి తరలివస్తుంది. అందులో 28.65 టీఎంసీల నీటిని నక్కలగండి జలాశయం నుంచి డిండీ నదిపై కొత్తగా ప్రతిపాదించే మధ్యడిండీ జలాశయం లోకి ఎత్తిపోతల ద్వా రా చేరుస్తారు. మిగతా 6.60 టీఎంసీల నీరు రెండవ సొరంగ మార్గం ద్వారా అం తిమంగా ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం చేరుతుం ది. ప్రతిపాదిత దిగువ డిండీ లేక నక్కలగండి జలాశయా న్ని 7.64 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తారు. అక్కడి నుంచి 2.30 కిలోమీటర్ల కాలువ ద్వారా 1.550 కి.మీ.నిడివి గల సొరంగ మార్గంగా నీరు ప్రయాణం చేసి 5 పంపుల ద్వారా పంప్ హౌజ్ నుంచి 70 మీటర్ల ఎగువకు ఎత్తబడి మధ్యడిండీ జలాశయంలో చేరుతుంది.

మధ్యడిండీ జలాశయం సామర్థ్యం 11 టీఎంసీలు. ఆ జలాశయం నుంచి ఎడమ వైపు ఒక కాలువను సుమారు వేయి ఎకరాలకు నీరు అందించేట్టు తవ్వుతారు. కుడి వైపు తవ్వే కాలువ 90వేల 500 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ఈ కుడి కాలువపైన కాచారం, దేవరకొండ, సోనులపల్లి గ్రామాల దగ్గర మూడు ఆఫ్‌లైన్ రిజర్వాయర్లను ఏర్పాటు చేస్తారు. ఈ మూడు జలాశయాల మొత్తం సామర్థ్యం 8.713 టీఎంసీలు. సాగునీరు, తాగునీరు కూడా ఈ రెండు కాలువల ద్వారా అందుతుంది. సుమారు 10 టీఎంసీల నీరు మధ్యడిండీ వినియోగించుకునేది పోను, మిగతా నీటిని 1.25 కి.మీ. కాలువ, ఆనక 12.75 కి.మీ.సొరంగం ద్వారా పంపు హౌజ్‌కు చేర్చి అక్కడి నుంచి ఆరు పంపుల ద్వారా 132 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేసి ఎగువ డిండీ జలాశయానికి చేరుస్తారు. ఎగువ డిండీ జలాశయం నుంచి రెండు కాలువలు ఒకటి ఎడమ వైపు, మరొకటి కుడివైపు ఏర్పాటు చేస్తారు.

ఎడమ కాలువ మూడు వేల ఎకరాలకు, కుడి కాలువ 2 లక్షల 47 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాయి. మధ్యడిండీ మాదిరిగానే , ఎగువ డిండీ నుంచి విడుదలయ్యే నీరు తాగు,సాగు నీరు,పారిక్షిశామిక అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది. కుడికాలువ పైన నాలుగు ఆఫ్‌లైన్ రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తారు. ఇవి జిగవలి తండా, అరకపల్లి, కొండూరు తండా, వెంకపల్లి తండా (శివన్న గూడెం చెరువు సమీపంలో)దగ్గర ఏర్పాటు అవుతాయి. ఈ నాలుగు జలాశయాల మొత్తం సామర్థ్యం 6.389 టీఎంసీలు. ఎగువ డిండీ జలాశయం సామర్థ్యం 7.248 టీఎంసీలు. 3 లక్షల 41 వేల 500 ఎకరాల కరువు పీడిత ప్రాంతాలలోని భూమిని సాగు చేయడానికి 28.65 టీఎంసీల కృష్ణా మిగులు జలాలను ఉపయోగించే ఈ పథకంపైన సుమారు 4377 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా. 266 మెగా వాట్ల విద్యుత్తు అవసరమవుతుంది.

90 రోజులపాటు అవసరమయ్యే విద్యుత్తు 51 మిలియన్ యూనిట్లు. ఒక్కో యూనిట్‌కు 2.60 రూపాయల చొ ప్పున లెక్కవేస్తే మొత్తం 3లక్షల 42 వేల ఎకరాలకు గాను విద్యుత్తుకు అయ్యే ఖర్చు 137.78 కోట్ల రూపాయలు. అంటే ప్రతి ఎకరం పైన సుమారు 4029 రూ.ల విద్యుత్తు ఖర్చు అవుతుంది. అంటే ప్రతి ఎకరంపైన 1 లక్ష 28 వేల రూపాయల పెట్టుబడి వ్యయం అవుతుంది. లబ్ది పొందే మండలాలు, నల్లగొండ జిల్లాలో 14, మహబూబ్‌నగర్ జిల్లా లో 5 ఉన్నా యి. జిల్లా వారి గా చూస్తే మహబూబ్‌నగర్ జిల్లాలో 3,15,550 ఎకరాలు, నల్ల గొండ జిల్లాలో 3,09, 950 ఎకరాలకు సాగునీరు అందుతుంది.కానీ ఈ రిపోర్టు పైన ప్రభుత్వం మొద్దు నిద్ర నటించడమే. శ్రీశైలం నుంచి మిగులు జలాలను తరలించడం ప్రభుత్వానికి ఇష్టం లేదా? లేక డబ్బు కోసం వెనకడుగు వేస్తోందా? ఏమిటి కారణం? ఈ రిపోర్ట్ ఇప్పటికీ శ్రీశైలం చీఫ్ ఇంజనీర్ వారి కార్యాలయంలోనే మూలుగుతోంది. ఇంత ముఖ్యమైన నివేదికను సదరు చీఫ్ ఇంజనీర్ ఎందు కు అట్టిపెట్టికున్నట్టు? పై నుంచి ఏమైనా రహస్య ఆదేశాలున్నాయా? ఇలాంటి సవాలక్ష అనుమానాలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. 23-10-2008నాడు ముఖ్యమంత్రి నల్లగొండ జిల్లాలోని దేవరకొండను సందర్శించిన సందర్భంలో ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్న కరువు పీడిత నల్లగొండ జిల్లా ప్రాంతాలను నక్కలగండి జలాశయం నుంచి ఎత్తిపోతల ద్వారా నీరందించి సస్యశ్యామలం చేస్తానని హామీలు గుప్పించారు. సస్యశ్యామలం చేయడం మాట దేవుడెరుగు, తయారైన డీపీఆర్ గురించి పట్టించుకున్న నాథుడు లేడు. నాకు తెలిసినంత మటుకు కృష్ణా మిగులు జలాలను ఉపయోగించుకునే ఏ తెలంగాణ ప్రాజెక్టుపైనా సీమాంధ్ర పాలకులకు శ్రద్ధ ఉండవు. పైగా కొత్త ప్రాజెకు, ఎత్తిపోతల పథకం. ఏదో సాకు చెప్పి తప్పించుకుంటారు.

2009కి ముందు పాలమూరు ఎత్తిపోతల పథకం విషయంలో వైఎస్‌ఆర్, బచావత్ ట్రిబ్యునల్ అనుమతించదని పై రాష్ట్రాలు గొడవ పెడ్తాయని ఏవో కథలు చెప్పి దర్యాప్తు చేయడానికి కూడా అంగీకరించలేదు. వలస పాలకుల రాజ్యంలో తెలంగాణ ప్రాజెక్టులకు మోక్షం కలగదు. జలయజ్ఞం ఆర్భాటంగా మొదపూట్టిన భీమా, నెట్టంపాడు, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీలే పూర్తి కాలేదు. కొత్త ప్రాజెక్టులైన పాలమూరు, ఎత్తిపోతలపథకం జూరాల-పాకాల గ్రావిటీ పథకం డిండీ ఎత్తిపోతల పథకాల గురించి మనం ఆవేదన పడ్డా, ఆత్రుత పడ్డా లాభముండదు. మన ప్రజా ప్రతినిధులపైన మనం వత్తిడి తెచ్చి వారు ప్రభుత్వం పైన వత్తిడి తెస్తే తప్ప ఈ పథకాలేవీ సమైక్యాంధ్ర ప్రదేశ్‌లో సాక్షాత్కరిస్తాయనుకోవడం భ్రమే. ప్రత్యేక రాష్ట్రంలో తప్ప మన ప్రాజెక్టులు పూర్తి కావు. మన కలలు ఫలించవు.

-ఆర్ విద్యాసాగర్ రావు
కేంద్ర జలవనరుల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర