బాబ్లీపైన కిమ్మనరేం?


Mon,December 26, 2011 12:10 AM

మహారాష్ట్రలోని గోదావరి నదిపై నిర్మితమవుతున్న బాబ్లీ ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి నీటి పంపకంలో ఏమైనా నష్టం ఉన్నదా? తెలంగాణ ప్రాంతంలో ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు బాబ్లీ వల్ల తెలంగాణకు నష్టమని బస్సుయాత్ర చేపట్టి హంగామా చేశాడు. మరి ఇప్పుడు చంద్రబాబు కిమ్మనరేం?
-జానపాటి శ్రీనివాస్,మిర్యాలగూడ, నల్లగొండ జిల్లా
మీరు రెండు రకాల ప్రశ్నలడిగారు. మొదటిది: బాబ్లీ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు వాటిల్లే నష్టం? రెండు: బాబ్లీకి వ్యతిరేకంగా నాడు అంత హడావిడి సృష్టించిన చంద్రబాబు ఈ రోజున కిమ్మనకుండా ఉండిపోయారేం? అని. ముందు బాబ్లీ ప్రాజెక్టు గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు 6-10-75 నాడు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అందులోని ప్రధాన అంశాలు ఇవి.
1పధాన గోదావరిపైన పైథాన్ (దయక్వాడీ) డ్యాం వరకు నీటినంతటినీ మహారాష్ట్ర ఉపయోగించుకోవచ్చు. 2.పూర్ణా ఉపనదిపైన సిద్ధేశ్వర్ డ్యాం వరకు జలాలన్నింటినీ మహారాష్ట్ర ఉపయోగించుకోవచ్చు. 3. మం జీరా ఉపనదిపైన నిజాంసాగర్ వరకు 22 టీఎంసీలు మించకుండా మహారాష్ట్ర ఉపయోగించుకోవచ్చు. (ఈ నీరు అప్పటికే ఆ మోదం పొందిన వినియోగానికి అదనం) 4.పైథాన్, సిద్ధేశ్వర్, నిజాంసాగర్‌లకు దిగువన ప్రతిపాదిత నిజాంసాగర్ వరకు 60 టీఎంసీలు మించకుండా మహారాష్ట్ర ఉపయోగించుకోవచ్చు. (ఇది వరకే ఆమోదం పొందిన ప్రా జెక్టుల వినియోగానికి అదనం)ఇవి పోను మిగిలిన జలాలన్నీ ఆంధ్రవూపదేశ్‌వే. 5.ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోచంపాడు (శ్రీరాంసాగర్) ప్రాజెక్టును పూర్తి జలస్థాయి 1091 అడుగులతోనూ, అత్యధిక జలస్థాయి 1093 అడుగులతోనూ నిర్మించుకోవ చ్చు. ఈ ప్రాజెక్టు మూలంగా ముంపుకు గురయ్యే భూమి, కట్టడాలు, పునరావాసం కొరకు అయ్యే ఖర్చును ఆంధ్రవూపదేశ్ భరిస్తుంది. ఈ ముంపును మహారాష్ట్ర అంగీకరిస్తుంది.

ఒప్పందం ప్రకారం శ్రీరాంసాగర్ రిజర్వాయర్ ఏర్పడింది. 1091 అడుగుల పూర్తి జలాశయం స్థాయితో నీరు శ్రీరాంసాగర్‌లో ఉన్నట్టయితే అది మొత్తం 126 కిలోమీటర్ల దూరం వరకు పరుచుకుని ఉంటుంది. ఇందు లో 55 కి.మీ. మహారాష్ట్ర భూభాగం. తమ భూభాగంలో జలాశయం ముంపు వల్ల కొన్ని కట్టడాలను మహారాష్ట్ర కోల్పోవలసి వచ్చింది. దీనికి నష్ట పరిహారంగా ఆంధ్రవూపదేశ్ 601 లక్షల రూపాయలను మహారాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించింది. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రవూపదేశ్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల దిగువన బాబ్లీ బ్యారేజీ నిర్మాణం చేస్తోంది. గేట్లు అమర్చడం మినహా ప్రాజెక్టు పూర్తిగా అయిపోయింది. గేట్లు కూడా అమర్చి ట్రయల్ రన్ చేసి సుప్రీంకోర్టు అనుమతించని కార ణంగా పక్కన పెట్టారు. అంటే.. 45 కి.మీ. శ్రీరాంసాగర్ నీటిని బాబ్లీ బ్యారేజీ ఉపయోగించుకోగలదన్నమాట.
ఇక్కడ వివాదాస్పద అంశాలు రెండు: మొదటిది: మహారాష్ట్ర, ఆంధ్రవూపదేశ్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అప్పటికే ఆమోదం పొందిన ప్రాజెక్టుల వినియోగానికి అదనంగా కొత్త ప్రాజెక్టుల కోసం 60 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చు. అప్పటికే ఆమోదం పొందిన వినియోగం ఎన్ని టీఎంసీలో ఒప్పందంలో రాయబడలేదు. మహారాష్ట్ర ఆ వినియోగాన్ని 42 టీఎంసీలు గా చూపుతుంటే అదంతా తప్పని, 6-10-75 నాటికి మహారాష్ట్రకు ఆమోదం పొందిన వినియోగం 19 టీఎంసీలు మాత్రమేనని ఆంధ్రవూపదేశ్ వాదిస్తోంది. అంటే మహారాష్ట్ర 102 టీఎంసీల నీటిని వినియోగించుకునే హక్కు (కొత్త ప్రాజెక్టుల పైన)ఉందని వాదిస్తుంటే..79 టీఎంసీలే న ని ఆంధ్రవూపదేశ్ వాదిస్తోంది.

పైగా మహారాష్ట్ర కొత్త ప్రాజెక్టులకోసం వినియోగించుకోవలసిన 60 టీఎంసీలను ఇదివరకే పూర్తిగా వాడేసుకుందని, ఇప్పుడు బాబ్లీ ప్రాజెక్టు కట్టడం వల్ల తన హక్కునుంచి అనధికారంగా నీటిని వాడుకోచూస్తుందని ఆంధ్రవూపదేశ్ వాదిస్తున్నది. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం తనకు కొత్త ప్రాజెక్టుల కోసం సంక్రమించిన 60 టీఎంసీల హక్కులో అంతర్భాగమేనని,ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని మహారాష్ట్ర చెబుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం ప్రకారం తనకు లభించిన నీటి హక్కును మాత్రమే వినియోగించుకుంటుందా? లేక ఒప్పందం ఉల్లంఘించి ఎక్కువనీటిని వాడుకోవాలని చూస్తోందా? అన్నది ముఖ్యమైన వివాదాస్పద అంశం. దీన్ని కేంద్ర జలసంఘం నిర్ణయించాలి. అప్పటిదా కా ఈ గొడవ ఉంటుంది.

ఇక రెండవ అంశం: బాబ్లీ శ్రీరాంసాగర్ జలాశయపు నీటి పరిధిలో నిర్మించబడటం. ఇది ఏమేరకు సమ్మతం. ఒక రిజర్వాయర్‌లో మరో రిజర్వాయర్‌ని నిర్మించడమన్నది కనీవినీ ఎరుగని విషయం. రెండు రాష్ట్రా లు చేసుకున్న ఒప్పందం (ఇదే గోదావరి ట్రిబ్యునల్ లేక బచావత్ ట్రిబ్యునల్ రిపోర్ట్) ప్రకారం శ్రీరాంసాగర్ జలాశయం మూలంగా ఏర్పడే ముంపు (భూభాగం, నదీ వాగులలో ఉంది)నకు మహారాష్ట్ర అంగీకారాలు హామీ కా కుండా కట్టడాల పునఃనిర్మాణం, పునరావాసం గురించి నష్టపరిహారం స్వీకరించింది కనుక ముంపు ప్రాంతంలో మహారాష్ట్ర నిర్మాణం చేపట్టడం అనైతికమే కాకుండా, బచావత్ తీర్పు (ఒప్పంద నిర్ణయం) ఉల్లంఘన అని ఆంధ్రవూపదేశ్ వాదిస్తోంది. శ్రీరాంసాగర్ జలాశయం తమ భూభాగంలో జొరబడి పరుచుకోవడానికి తాము అంగీకరించినంత మాత్రాన తమ భూ భాగాన్ని ఆంధ్రవూపదేశ్‌కు అమ్ముకున్నట్టు కాదని తమ భూభాగంపైన సంపూర్ణ హక్కులు తాము కలిగి ఉన్నామని, తమ భూభాగంలో ఎలాంటి నిర్మాణానై్ననా తాము చేపట్టే హక్కు తమకుందని, కాదనే అధికారం ఎవరికీ లేదని మహారాష్ట్ర అంటోంది. పైపెచ్చు 6-10-75 నాటి ఒప్పందాన్ని నిశితంగా పరిశీలిస్తే కొత్త ప్రాజెక్టుల కోసం శ్రీరాంసాగర్ వరకు తమకు 60 టీఎంసీల వినియోగించుకునే హక్కున్నదని మహారాష్ట్ర వాదిస్తోంది.

ఇప్పుడీ సమస్య సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సుప్రీంకోర్టు బాబ్లీ నిర్మాణాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం తమ రిస్కు పైన నిర్మించుకోవచ్చని, అయితే గేట్లు అమర్చరాదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీంకోర్టు వివాదం తుదిపరిష్కారమయ్యేవరకు, పరిస్థితి యథాతథంగా ఉండాలని ఆదేశించిం ది. అంటే గేట్లు అమర్చకుండానే బ్యారేజీ నిర్మాణం పూర్తయ్యింది.

బాబ్లీ వల్ల శ్రీరాంసాగర్‌కు ఎలాంటి నష్టం వాటిల్లుతుందన్న ప్రశ్న: బాబ్లీ బ్యారేజీ అడుగు (sill level)1070 అడుగులు, ఎత్తు 1109 అడుగులు. బ్యారేజీలో 13 గేట్లు 15 మీటర్ల పొడవు, 11 మీటర్ల ఎత్తులో అమర్చడాని కి అనువుగా నిర్మాణమయింది. మహారాష్ట్ర ఈ బ్యారేజీవల్ల కేవలం 2.74 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకుంటామంటున్నది. అందులో శ్రీరాంసాగర్ నీటి పరిమాణం 0.60 టీఎంసీలే కనుక ఆ నష్టపోయే నీటిని తాము బాబీ ్లనుంచి ఆంధ్రవూపదేశ్‌కు వదులుతామని చెప్పుతోంది. దీని కోసమే ఇంత రాద్ధాంతమా?

ఇక్కడే ఉంది కిటుకు. బ్యారేజీ నిర్మాణం వల్ల 2.74 టీఎంసీల నీటిని బ్యారేజీలో నిలుపుదల చేయటం నిజమే కావచ్చు. కానీ వర్షాభావ పరిస్థితు ల్లో గోదావరి వరదలో 2.74 టీఎంసీల నీటిని శ్రీరాంసాగర్ లోకి రాకుండా అడ్డుకోవడం ఒక వంతయితే, వర్షాకాలంలో బ్యారేజీ నుంచి కనీసం రెండు సార్లయినా పూర్తి నీటి వినియోగమవుతుందని భావిస్తే మొత్తం 5.48 టీఎంసీల నీటిని ఉపయోగించడం జరుగుతుంది. అసలైన ప్రమాదం మరొకటుం ది. వర్షాలు బాగా పడి శ్రీరాంసాగర్ 1091 అడుగుల వరకు (పూర్తి స్థాయివరకు) అట్లాగే బాబ్లీ బ్యారేజీ 1109 అడుగులు (పూర్తి స్థాయి) నిండి ఉన్నాయనుకోండి. బాబ్లీ బ్యారేజీ నీటిని ఎత్తిపోతల ద్వారా సాగు, తాగు నీటికో సం ఉపయోగించుకునే నిమిత్తం వేలాది పంపుసెట్లను గట్లమీద అమర్చుకున్నారు. బ్యారేజీలో నీటి వాడకం మొదలైతే (గేట్లు అమర్చి closed positionలో ఉంచాక)ముందు 1109 అడుగులనుంచి 1091 అడుగుల వరకు నీటిని వాడుకోవడం జరుగుతుంది(2.4 టీఎంసీలు). ఆతర్వాత గేట్ల ను ఎత్తి వేస్తే 1091 అడుగులనుంచి 1070 అడుగుల వరకు బాబ్లీ శ్రీరాంసాగర్ జలాశయంలో భాగమవుతుంది. శ్రీరాంసాగర్ జలాశయం నుంచి ఆ 21 అడుగుల పరిధిలో 70 టీఎంసీల నీరు నిలిచి ఉంటుంది. శ్రీరాంసాగర్ నీటిని ఏ కారణంగానైనా ఆంధ్రవూపదేశ్ వాడుకోకుండా ఉంటే మహారా ష్ట్ర ప్రభుత్వం పంపుల ద్వారా ఆ మొత్తం నీటిని లాగేసుకునే అవకాశం సాంకేతికంగా ఉంది. వాస్తవంగా 70 టీఎంసీలు దొంగిలిస్తారని కాదు. 70 టీఎంసీల దాకా పరిస్థితులను బట్టి ఎంతైనా వాడుకునే అవకాశం బాబ్లీ గేట్ల ఎత్తడం వల్ల ఏర్పడుతుంది. మహారాష్ట్ర చెప్పే 0.60 టీఎంసీలు గేట్లు మూసి ఉంటేనే, కానీ గేట్లు తెరిచాక ఇక బాబ్లీ , శ్రీరాంసాగర్ విడివిడిగా ఉండవు. అంతా ఒకటే. శ్రీరాంసాగరమే.
బాబ్లీకి ఎగువన మరో 11 చిన్న చితక కట్టడాలు వెలిశాయి. ఇవన్నీ మహారాష్ట్ర అక్రమంగా కట్టుతున్నవే అని ఆంధ్రవూపదేశ్ వాదిస్తోంది. లేదు సక్రమమేనని మహారాష్ట్ర మొండికేస్తున్నది. శ్రీరాంసాగర్, ఇసుక మేటల కారణంగా భారీగా నీటిని నిలుపుకునే శక్తిని కోల్పోయింది. నీటి నిలువ సామ ర్థ్యం112 టీఎంసీల స్థానంలో 82 టీఎంసీలు మాత్రమే ఉన్నట్లు ప్రభు త్వం చెప్తోంది. మొత్తం 196 టీఎంసీల నీరు శ్రీరాంసాగర్ వినియోగించుకోవలసి ఉండగా మహారాష్ట్ర అక్రమ కట్టడాలు, ఇతర కారణాల వల్లనైతేనేమీ 150 టీఎంసీలు కూడా నీరు రావడం లేదు. శ్రీరాంసాగర్ పైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాలు ఆధారపడిఉన్నాయి. మొత్తం 17 లక్షల ఎకరాల దాకా సేద్యపు నీరుకోసం శ్రీరాంసాగర్ జలాలపై ఆశలు పెట్టుకొని ఉంది. కనుక బాబ్లీ, మరో 11 ప్రాజెక్టులు మున్ముందు మరిన్ని ప్రాజెక్టులు అడ్డు అదుపు లేకుండా మహారాష్ట్ర కట్టుకుని పోతూ ఉంటే శ్రీరాంసాగర్ వట్టిపోతుందని, తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు.

ఇకపోతే.. చంద్రబాబు వైఖరి: రాష్ట్రంలో ఏప్రాంతానికైనా ఇబ్బంది కలిగించే పని ఆయన ఒప్పుకోనంటాడు. పోతిడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, పనులను తెలంగాణ వాదులు ఎంత వ్యతిరేకిస్తున్నా ఆయన వారికి మద్ద తు ఇవ్వరు. ఎందుకంటే.. తెలంగాణకు నష్టం కలిగించినా అది సీమాంధ్ర ప్రాంతం వాళ్లకు లాభం చేకూరుస్తాయి కాబట్టి. అయితే ఇతర రాష్ట్రాల చర్యల మూలంగా మన రాష్ట్రానికి నష్టం కలిగే అవకాశం ఉన్నప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ రొమ్ము విరుచుకొని ముందుకొస్తుంది. ఉదాహరణకు, పరగోడు, ఆల్మట్టి, విషయాలలో కర్ణాటకతో, బాబ్లీ విషయంలో మహారాష్ట్రతో ఏమేరకైనా యుద్ధానికి టీడీపీ సిద్ధమవుతుంది. ఎందుకం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ లేదు. అక్కడ కూడా ఈ పార్టీ శాఖ ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అయితే బాబ్లీ విషయంలో తెలుగుదేశం పార్టీ చేసిన పోరాటం కృత్రిమమని కాదు. ఆ పార్టీ మొదట్నుంచీ ఉప ఎన్నికలకు ముందు కూడా సీరియస్‌గానే బాబ్లీ విషయంలో మన ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టింది. సుప్రీంకోర్టులో బాబ్లీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మాదిరిగానే రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే మధ్యంతర ఎన్నికల విషయం వేరు. కేవలం తెలంగాణ ప్రజలను టీఆర్‌ఎస్ వైపు మళ్లకుండా ఓట్లను చీల్చి లబ్ధి పొందాలన్న వ్యూహంతోనే మహారాష్ట్ర లోకి చొరబడి నానా యాగీ చేసి దెబ్బలుతిని తామొక్కరమే తెలంగాణ ప్రాంత ప్రజల కోసం కట్టుబడి ఉన్నామన్న అభివూపాయం కలిగిం చే విధంగా బాబ్లీయాగం చేసి ఘోరంగా దెబ్బతిన్నది. వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు. కేవలం రాజకీ య లబ్ధి కోసం చేసిన డ్రామా కాబట్టి అంతటితో పరిసమాప్తమయింది. ఇప్పుడు బాబ్లీ కానీ మరో ప్రాజెక్టుపైన కానీ పోరాడే టైం ఎక్కడుంది? ప్రస్తు తం గొడవంతా ప్రత్యేక రాష్ట్రం పైన కదా? రెండు కళ్ల సిద్ధాంతంతో టీడీపీ ఎంత ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలను మెప్పించలేకపోతోంది. తెలంగాణ ప్రజలను ఆకట్టుకోవడానికి బాబ్లీని వదిలిపెట్టి పోలవరం టెండర్లను తెరపైకి తెచ్చినా లాభం లేకపోయింది. ఎన్ని ఫీట్లు చేసినా చంద్రబాబు ఛత్రఛాయ కింద టీడీపీ పనిచేస్తున్నంత కాలం తాటిచెట్టుకింద పాలు తాగిన వ్యవహారంలాగానే ఉంది. అలాగని తెలుగుదేశంలో నిఖార్సయిన తెలంగాణ వాదులు లేరని కాదు. కానీ తెలంగాణవాదుపూవరూ చంద్రక్షిగహణం కారణంగా టీడీపీని విశ్వసించే పరిస్థితుల్లో లేరు.

కాగ్ నివేదికలు
‘కాగ్’ దేశంలోని అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థ. స్వయంవూపతిపత్తి కలిగిన వ్యవస్థ. ప్రభుత్వం చేసే వ్యయంలోని లోటుపాట్లను ఎత్తిచూపుతూ ప్రతి సంవత్సరం ఒక రిపోర్టు ఇస్తుంది. కాగ్ చేసే విమర్శలను చాలా తీవ్రంగా పరిగణించడం ఆనవాయితీ. కేంద్ర ప్రభుత్వం కాగ్‌నివేదిక ఆధారంగా 2జీ స్కాంలో జరిగిన అవకతవకల ఆధారంగా కేంద్రమంవూతులను బర్తరఫ్‌చేయడం, జైళ్లో పెట్టడం చూస్తున్నాం. దురదృష్టవశాత్తు మన రాష్ట్ర ప్రభుత్వం కాగ్ నివేదికలను చిత్తు కాగితాల మాదిరిగా చూస్తోంది. ఇదేదో ప్రతి ఏడూ జరిగే తంతులాగానే వ్యవహరిస్తోంది. నీటి పారుదల రంగంలో ప్రతి సంవత్సరం తీవ్రమైన వ్యాఖ్య లు చేసినా ప్రభుత్వంపైన ఎలాంటి ప్రభావం కనిపించలేదు. జలయజ్ఞంలో జరిగిన భారీ అవినీతిని బయట పెట్టినా ఎలాంటి కదలిక లేదు సరికదా ఎదురుదాడికి దిగింది. ‘జలయజ్ఞమే కాదు గత ప్రభుత్వం తలపెట్టిన ‘నీరు-మీరు’ కార్యక్షికమాలపైన కూడా కాగ్ వ్యాఖ్యలు చేసింది. ఇదంతా పరిపాటే అని జవాబు చెప్తోంది. జలయజ్ఞం కింద 68వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. భూసేకరణ జరగకుండా ప్రాజెక్టులను తలపెట్టడమేమిటి? జలయజ్ఞం ప్రారంభమైన నాటి నుంచి కుదుర్చుకున్న ఒప్పందాల వివరాలు కావాలని కాగ్ ఉత్తరాలు రాసినా దున్నపోతు మీద వాన పడ్డట్టే ప్రవర్తిస్తోందీప్రభుత్వం. కాని ఒక బాధ్యతాయుత ప్రభుత్వంలాగా దిద్దుబాటు చర్యలకు పూనుకోవడం లేదు.

-ఆర్.విద్యాసాగర్‌రావు
కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

country oven

Featured Articles