ఎత్తిపోతలకు సొంత విద్యుత్తు


Sun,December 18, 2011 11:06 PM

water talangana patrika telangana culture telangana politics telangana cinema
గోదావరినదిపైన ఎన్నో ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం చేపట్టిందని మీరు అంటున్నారు. మరి వీటన్నింటికి విద్యుత్తు ఎక్కడ్నుంచి వస్తుంది? ప్రభుత్వం దగ్గర అంత విద్యుత్తు ఉందా? రైతులు విద్యుత్తు ఛార్జీలను భరించగలరా వివరించగలరు?

-గట్టిగొల్ల సైదులు, జాజిడ్డిగూడెం, నల్లగొండ జిల్లా


ఎత్తిపోతల పథకాలు గోదావరినదిపైనే కాదు, కృష్ణా నదిపైన కూడా ఉన్నా యి. ఇంకా ఇతర నదులపైన కూడా ఉన్నాయి. ఇవన్నీ పనిచేయాలంటే భారీ గా విద్యుత్తు అవసరమవుతుందన్న మాట నిజమే. విద్యుత్తు ఛార్జీలు రైతులు భరించలేరన్న మాట కూడా వాస్తవమే. ఈ పరిస్థితి నుంచి గట్టేక్కేందుకు పదవీ విరమణ చేసిన ఇంజనీర్లు కొందరు ‘ది ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్’ (ఇండియా) వారి సహకారంతో ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించారు. దాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఒక ‘అవూపోచ్‌పేపర్’ని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షునికి కూడా సమర్పించినట్టు ఆయన ఎంతో ఆసక్తి కనబరిచినట్టు కూడా సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలోని ప్రధాన అంశాలు ఇవి.

వాలు మార్గంగా నగావిటీ పద్ధతిన) మన రాష్ట్రంలో సాగుచేయలేని 64 లక్షల ఎకరాల ఆయకట్టును ఎత్తిపోతల ద్వారా సాగు చేసేందుకు రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు 12 వేల కోట్ల రూపాయలు కాగలవని అంచనా వేయడం జరిగింది. ఈ ఎత్తిపోతల అమలుకు 8500 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో 16,200 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుండగా, అవసరాలు 15,000 మెగావా ట్ల దాకా ఉన్నాయి. కనుక ఎత్తిపోతలకవసరమయ్యే అదనపు విద్యుత్తు లభించే అవకాశం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రాంతాల వారీగా ఏర్పాటు చేసే ఎత్తిపోతల పథకాలకు అవసరమయ్యే విద్యుత్తు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నదులలో నీరు సమృద్ధిగా ఉన్నప్పుడు, ఆ నీటిని వినియోగించుకుని ఎత్తై ప్రాంతాలకు సరఫరాచేయడానికి విద్యుత్తు తప్పనిసరి అవుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఎత్తిపోతల అవసరాలు తీర్చే నిమిత్తం అదనపు విద్యుత్తు ఉత్పాదనకు అవకాశాలు అంత ఆశాజనకంగా లేవు. ఈ పరిస్థితుల్లో ఆయా ఎత్తిపోతల పథకాలు సక్రమంగా, స్థిరంగా, విజయవంతంగా అమలు జరగాలంటే ‘క్యాప్టివ్ పవర్ ప్లాంట్స్’ అంటే సొంత విద్యుత్తు కేంద్రాల ఏర్పాటు అవసరం. ఇలాంటి సొంత విద్యుత్తు కేంద్రాలు ఈజిప్టు, అమెరికా లాంటి దేశాలలో పనిచేస్తున్నయి.రాష్ట్రంలో చిన్నాచితకా ఎత్తిపోతల పథకాలు మొత్తం 31 ఉన్నాయి. విద్యుత్తు వినియోగం ఆధారంగా వాటి వర్గీకరణ ఈ విధంగా ఉంది.

50 మెగావాట్ల దాకా అవసరమయ్యే విద్యుత్తు పథకాలు 17
50 మెగావాట్ల నుంచి 100 మెగావాట్ల దాకా అవసరమయ్యే విద్యుత్తు పథకాలు 2
100 మెగావాట్ల పైబడి 500 మెగావాట్ల దాకా అవసరమయ్యే విద్యుత్తు పథకాలు 9
500 మెగావాట్ల కన్న ఎక్కువ విద్యుత్తు అవసరమయ్యే పథకాలు 3
మొత్తం 31
panahitha talangana patrika telangana culture telangana politics telangana cinema
ఎత్తిపోతల పథకాలు విజయవంతంగా పనిచేయాలంటే వాటి కోసం 120 రోజుల పాటు ఇరవై నాలుగు గంటలూ విద్యుత్తు లభించాలి. అంటే ప్రత్యేకంగా ఎత్తిపోతల పథకాల కోసమే పనిచేసే విద్యుత్తు కేంద్రాలను ఏర్పా టు చేస్తే సంవత్సర కాలంలో నాలుగునెలల పాటు విద్యుత్తును ఎత్తిపోతల పథకాలకు మాత్రమే కేటాయించి మిగతా ఎనిమిది నెలల పాటు ఉత్పత్తి చేసే విద్యుత్తును మార్కెట్‌లో అమ్ముకోవడం జరుగుతుంది. ఆ ఎనిమిది నెలల్లో అమ్మే విద్యుత్తు వల్ల గడించే లాభం ఎత్తిపోతలకయ్యే ఖర్చు మొత్తా న్ని భరించడమే కాక, ఆ విద్యుత్ కేంద్ర పెట్టుబడిని కూడా పరిమితకాలంలో తీర్చగలుగుతుందన్న ప్రాతిపదికనే ఈ captive power స్టేషన్ పనిచేస్తుం ది. అమలులో ఉన్న 31 ఎత్తిపోతల పథకాల కోసం నాలుగు విద్యుత్తు కేంద్రాలను 1)కరీంనగర్ 2)వరంగల్ 3) మహబూబ్‌నగర్ 4) అనంతపురంలో ఏర్పాటు చేయవలసి ఉంటుంది.

ప్రతిపాదించిన క్యాప్టివ్ పవర్ ప్లాంటులు బొగ్గు ఆధారిత కేంద్రాలుగా పనిచేస్తాయి. గ్యాస్ పుష్కలంగా లభించినట్టయితే మరింత చవకగా విద్యు త్తు అందించే అవకాశముంటుంది.
అధ్యయనంలో పొందుపరిచిన లబ్ధి, వ్యయ, విశ్లేషణ వివరాలు ఇలా ఉన్నాయి.
1)విద్యుత్తు కేంద్రం ఏర్పాటుకయ్యే ఖర్చు మెగావాటు ఒక్కంటికి అయిదు కోట్ల రూపాయలు
2) వడ్డీ రేటు 7.20 నుంచి 7.50 శాతం
3) ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 85 శాతం
4) డిప్రిసియేషన్ రేట్ 3.6 శాతం
5) ఇన్స్యున్స్ ఛార్జీలు 0.5 శాతం
6) నిర్వహణ ఛార్జీలు 1.5 శాతం
7) వేరియెబుల్ ఖర్చు ఒక్కో యూనిట్‌కు 1.78 కోట్లు
8) విద్యుత్తు అమ్మకం రేటు ప్రతి యూనిట్
(కెడబ్ల్యూహెచ్)కు నాలుగు రూపాయలు
పై వివరాల ఆధారంగా 2,500 మెగావాట్లు, 3,300 మెగావాట్ల బొగ్గు ఆధారిత ప్రత్యేక విద్యుత్ కేంద్రానికి అయ్యే ఖర్చు వాటిపై వచ్చే ఆదాయాన్ని ఆ నివేదిక తెలియజేసింది.

ఈ నివేదిక ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఏదేమైనా ఒకటి మాత్రం స్పష్టం. ప్రత్యేకమైన విద్యుత్ కేంద్రాలను ఎత్తిపోతలకు కేటాయిస్తూ ఏర్పాటు చేస్తే తప్ప ఇంత భారీఎత్తున 64 లక్షల ఎకరాలకు నీరందివ్వడం కుదరదు. 8 నెలలపాటు ఆ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును మార్కెట్‌లో అమ్మగా వచ్చిన లాభాలను ఎత్తిపోతల పథకాలకు మళ్లించి రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తే తప్ప రైతాంగం బతికి బట్ట కట్టదు. మామూలుగా కృష్ణా, గోదావరి నదులలో నాలుగు నెలలపాటు వరద జలాలు లభిస్తాయి. ఈ నాలుగు నెలల్లో క్యాపిటల్ స్టేషన్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఉపయోగించి ఎత్తిపోతల మార్గంగా ఆ జలాలను ఆయకట్టుకు బ్యాలెన్సింగ్ జలాశయాలకు మళ్లించవలసి ఉంటుంది.
క్యాపిటల్ పవర్ స్టేషన్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తు ఆధారంగా ప్రాణహిత-చే లబ్ధి-వ్యయ నిష్పత్తిని లెక్కవేయడం జరిగింది. అది 1.46గా తేలింది. కనుక దీన్ని ప్రణాళికాసంఘం ఆమోదించి కేంద్ర సహాయం అందించగలుగుతుందని ఆశించవచ్చు.

తెలంగాణలో శతాబ్దాల పాటు సరిపడే బొగ్గు నిల్వలు సింగరేణి రూపం లో ఉన్నాయి. అపారమైన జలసిరులు గోదావరి, కృష్ణమ్మల రూపంలో ఉన్నాయి. నీటిని వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్న సారవంతమైన భూములు, కష్టించే రైతులున్నారు. ఈ ఎత్తిపోతల పథకాలను విజయవంతంగా అమలు చేయడానికి అహర్నిశలు తమ మేధస్సులను కరగదీసేందుకు రెడీగా తెలంగాణ ఇంజనీర్లున్నారు. ఇక కావలసిందల్లా ప్రభుత్వానికి చిత్తశుద్ధి.Captive Power Station ఏర్పాటు విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో తొందర్లోనే తేలిపోతుంది.

-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్



అక్రమ ఇసుక క్వారీలు- తీవ్ర ప్రభావాలు


మన ఊళ్లో చుట్టు పక్కల ఉన్న నదులు, ఉపనదులు, వాగులు, వంకలలో ప్రతిరోజూ ఇసుకను తవ్వి రవాణా చేసే పనులను మనం చూస్తూనే ఉన్నాం.వాటికి అనుమతులున్నాయా? లేవా? అని పట్టించుకున్న నాథుడు లేడు. మా ఊరి పక్కన ఉన్న మూసీ బొందలగడ్డలా తయారైంది సార్ . దీన్ని ఆపలేమా? అని కొందరు యువకులు అడుగుతుంటే ఏం జవాబు చెప్పాలో అర్థం కాదు. ఇసుక క్వారీ వల్ల ప్రజా ప్రతినిధు లు, అధికారులు, కాంట్రాక్టర్లు, జెసిబి టాక్టర్ల యజమానులు , ఊళ్లోని కూలీనాలి జనం, మధ్యవర్తులు అందరూ సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. అలా నదులలో ఇసుకను భారీగా తరలించడం వల్ల ఏం ఉపవూదవం వస్తుందో, దాని ప్రభావం ఇతరత్రా ఎలా ఉంటుందో ఎవరిక్కావాలి? జనాలకు కావలసింది వాళ్ల తాత్కాలిక ప్రయోజనాలు, అవసరాలు తీరడం ముఖ్యం.కానీ దీర్ఘకాలిక నష్టాలను పట్టించుకునే పరిస్థితి లేదు. జనం ఏమో తెలియక పట్టించుకోరు. నాయకులేమో తమ జేబులు నిండడమే చూసుకుంటున్నారు. సహజవనరులను కాపాడవలసిన ప్రభుత్వం ఉదాసీనంగా ప్రవర్తించడం వల్లే ఈ విపత్తు. వి.ఆర్. కృష్ణఅయ్యర్ లాంటి ప్రముఖ న్యాయమూర్తులు నదులలో ఇష్టమొచ్చిన రీతిలో ఇసుకను తరలించే చర్య మనుషుల మనుగడపైన ఎలా ప్రభావితం చూపుతుందో ఓ వ్యాసంలో వివరించారు. మద్రాస్ హైకోర్టు తీర్పు , సుప్రీంకోర్టు తీర్పులు, ఐక్యరాజ్యసమితి మానవ పర్యావరణంపైన నిర్వహించిన స్టాక్ హోం సమావేశపు సారాంశాన్ని మన రాజ్యాంగంలోని జీవించే హక్కు గురించి ఉద్ఘాటించే 21వ అధికరణాన్ని ఆయన తన వ్యాసంలో ఉల్లేఖించారు. నదీ పర్యావరణ సమతుల్యాన్ని భంగపరిచే ఇసుకతరలింపు ప్రక్రియ భూగర్భ జలాలపైనే కాకుండా చెరువులు, కాలువలపై కూడా తీవ్రంగా ప్రభావం చూపుతుందని తెలిపారు. అలాగే ఇసుక తరలింపు ద్వారా తాగే నీటిలోని తీయదనం మాయమై పోతుందని , సముద్ర తీర ప్రాంతంలో ఇది జరిగితే.. సమువూదపు నీరు నదుల్లోకి చొరబడి ఉప్పునీరు ప్రబలుతుందని, ఇలా అనేక దుష్పరిణామాలు వాటిల్లుతాయని ఆవేదన చెందుతూ రాశారు. ఇలాంటి ఎన్ని హెచ్చరికలు చేసినా ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందా?

appulu talangana patrika telangana culture telangana politics telangana cinema

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర