‘ప్రాణహిత-చేవెళ్ల ’ తెలంగణ మణిహారం


Sun,December 11, 2011 11:56 PM

ప్రాణహిత-చే ప్రాజెక్టును లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంటారు. అది నిజమా? ఒకవేళ నిజమైతే ఈ ప్రాజెక్టుకు ఎంత విద్యుత్తు అవసరమవుతుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో కరెంట్‌ఉత్పత్తి ఎంత? గృహ అవసరాలకు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు, సరిపోను విద్యుత్తు అందుబాటులో ఉందా? ఉంటే ఈ మూడు రంగాలకు సరిపోను ఎంత మిగులుతుంది? అట్టి మిగులు ప్రాణహిత-చే ప్రాజెక్టుకు సరిపోతుందా? సరిపోనిచో ప్రత్యామ్నాయం ఏమిటి?

-ఎ. సుదర్శన్, అడిక్‌మెట్, హైదరాబాద్


pranahitha-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaమీరు అడిగిన ప్రశ్నల్లో కొన్నిటికి ఇది వరకే సమాధానం ఇచ్చాను. ఇతర పాఠకుల ప్రశ్నలకు జవాబు ఇచ్చిన సందర్భంలో మిగతా వాటికి వీలు జవాబు ఇస్తాను. ‘ప్రాణహిత-చే గురించి వివరాలు మీరు అడగలేదు. సూటిగా కరెంటు విషయమే అడిగారు. ప్రాజెక్టు వివరాలతో పాటు మీరడిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రాణహిత ప్రాజె క్టు తెలంగాణకు ప్రాణవూపాదమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా కాలం కిందట కెప్టెన్ దస్తూర్ ‘గ్లాండ్ కెనాల్ స్కీం’ అనే ఒక పథకాన్ని కె.ఎల్.రావు ప్రతిపాదించిన గంగా-కావేరీ అనుసంధాన పథకానికి ప్రత్యామ్నాయం గా ప్రతిపాదించారు.

ప్రాణహిత-చే ప్రాజెక్టు ఆ గార్లెండ్ స్కీంను గుర్తుకు తెస్తుంది. అది ఎలాగూ అమలు కాలేదు. కాబట్టి అమలైన ‘రాజస్థాన్ కాలువ’ను గుర్తుకు తెచ్చే పథకమవుతుంది ప్రాణహిత-చే పూర్తయిన రోజు. ఇటీవలే జరిగిన శాసనసభ మండలి సమావేశంలో ఈ ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయవలసిన ఆవశ్యకతను గుర్తిస్తూ ఏకక్షిగీవ తీర్మానం చేశారు. ఆ సందర్భంలో ఈ ప్రాజెక్టును ‘తెలంగా ణ మణిహారం’ అని అభివర్ణించారు. ఇది నూటికి నూరు పా ళ్లు నిజం. ఈ ప్రాజెక్టు పూర్తయి గోదావరి జలాలు 16,40,000 ఎకరాల తెలంగాణ భూములను సస్యశ్యామలం చేస్తాయనడంలో సందేహం లేదు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత-చే సుజల స్రవంతి ప్రాజెక్టుగా చెలామణి అవుతున్న ఈ పథకం గురించి సంక్షిప్త వివరాలు ఇవి: 160 టీఎంసీల (శతకోటి ఘనపు అడుగుల ప్రాణహిత గోదావరి నదికి ప్రధానమైన ఉపనది). జలాలను తరలించి, దారిలో మరో 20 టీఎంసీల గోదావ రి జలాలను ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి స్వీకరించి, మొత్తం 180 టీఎంసీల నీటిని ఉపయోగించి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, రంగాడ్డి, నల్లగొండ జిలాలలోని అనేక నీటి కొరత క్షేత్రాలను సస్యశ్యామలం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సాగునీటితో పాటు జంటనగరాల ప్రజల దాహార్తిని తీర్చడం, మార్గమధ్యంలో గల గ్రామాలకు తాగునీటిని అందజేయడం. పారిక్షిశామిక అవసరాలకు నీటిని సరఫరా చేయడం కూడా ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యాలు. వివరాలలోకి వెళితే లక్ష్యాలు ఇవి.

తెలంగాణలోని ఏడు జిల్లాల్లో నీటి కొరతను అనేక క్షేత్రాలలోని 16,40,000 ఎకరారాలకు సాగునీటి వసతి కల్పించడం. లబ్ధి పొందే జిల్లాల వారీ వివరాలు ఇవి. 10 టీఎంసీల తాగునీటిని మార్గమధ్యంలోని గ్రామాలకు సరఫరా చేయడం.30 టీఎంసీల తాగునీటిని హైదరాబాద్, సికింవూదాబాద్ జంట నగరాలకు అందజేయ డం.16 టీఎంసీల నీటిని పారిక్షిశామిక అవసరాల కోసం వినియోగించడం.2010-2011 సంవత్సరపు బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ పథకం ఖర్చు 38,500 కోట్లుగా పేర్కొన్నది.

ఆదిలాబాద్ జిల్లా కౌతల మండలం, తుమ్మడి హెట్టి గ్రామ సమీపంలో ప్రాణహిత నదిపై బ్యారేజీ నిర్మించి అక్కడ్నుంచి 160 టీఎంసీల నీటిని తరలించాలన్నది ప్రాజెక్టు ఉద్దేశం. బ్యారేజీకి ఎగువన కుడి గుట్ట నుంచి తరలించిన నీటిని ఎల్లంపల్లి (శ్రీపాద సాగర్)కు మళ్లిస్తారు. అక్కడ్నుంచి ‘కంపోజిట్ లింక్ ఛానెల్’ ద్వారా వివిధ జిల్లాల్లోని ఆయకట్టు ప్రాంతాలకు నీటిని తీసుకుపోతారు. ప్రస్తుతం లభ్యంగా ఉన్న రిజర్వాయర్లు, చెరువులను ఉపయోగించుకునే విధంగా ఆయకట్టు ప్రాంతం ఆధారంగా లింకులు, ప్రెదర్ పైపులైన్లు, సొరంగాలు, గ్రావిటీ ఛానెళ్లు, తగిన కలెక్టింగు ట్యాంకులతో ప్రణాళికను రూపొందించారు. మొత్తం ప్రాణహిత-చే పథకానికి సంబంధించిన 19 వివిధ పంపు హౌజులను 3,300 మెగావాట్ల విద్యుత్తును ఉపయోగించుకుంచుకోవాలి.

ప్రాణహిత బ్యారేజీ నుంచి 20,765 క్యూసెక్కుల నీటి మళ్లింపు సామర్థ్యం కలిగి ఉన్న కాలువల వ్యవస్థను రూపొందించడం జరిగింది. ప్రాజెక్టులోని లింకు కాలువలు, సంబంధిత ఆయకట్టు వివరాలు ఇవి.
ఇక నిర్మాణ కార్యక్షికమం ప్లానింగ్ గురించి తెలుసుకుందాం. ప్రాజెక్టు వ్యయం 38,500 కోట్లకు ప్రభుత్వం సవరించిన పరిపాలనా ఆమోదాన్ని ఇచ్చింది. ఈ ప్రాజెక్టును దశలవారీగా 2013-14కు పూర్తిచేయాలని ప్రభు త్వం ప్రతిపాదించినా, వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి.ఇక వాస్తవ పరిస్థితు ల గురించి తెలుసుకుందాం. 2009 ఎన్నికల ప్రయోజనాలను దృష్టితో ప్రభుత్వం ఈ మెగా ప్రాజెక్టును 28 ప్యాకేజీలుగా విభజించి కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది.

గమ్మత్తేమంటే అప్పటికి ప్రాజెక్టు డీటైల్డ్ రిపోర్టు అంటే సవివర ప్రాజె క్టు అధ్యయన నివేదిక కూడా తయారు కాలేదు. కాంట్రాక్టర్లకు మొబిలైజేష న్ అడ్వాన్స్‌గా 354 కోట్లు, ఇన్వెస్టిగేషన్‌కు 727కోట్లు వెరసి 1141 కోట్లు కోట్లు చెల్లించారు. జనవరి 2010 వరకు ఈ ప్రాజెక్టు పైన 79692 కోట్లు ఖర్చు పెట్టామని, 2010-2011 సంవత్సరం కోసం 700 కోట్ల రూపాయ లు బడ్జెట్ పెట్టామని ప్రభుత్వం ప్రకటించింది.
కేంద్ర జల సంఘం నుంచి ప్రాజెక్టు సవివర అధ్యయన నివేదిక తయారు చేసేందుకు ప్రాథమిక అనుమతి లభించింది. ఇటీవలే WAPEOS తయారుచేసి పంపిన అధ్యయన నివేదిక కేంద్ర జల సంఘం పరిశీలనలో ఉంది. అన్ని అనుమతులు వచ్చి, చిట్ట చివరకు ప్రణాళిక సంఘం అనుమతి వస్తే తప్ప ప్రాజెక్టు సాంక్షన్ అయినట్టు కాదు. అప్పుడే ఆ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి గ్రాంటులు లభిస్తాయి. విదేశీ రుణ సంస్థల నుంచి అప్పు పొందాల న్నా కేంద్రం అనుమతులు తప్పనిసరి.

ఇక జాతీయ ప్రాజెక్టుగా అనుమతి పొందాలంటే (90 శాతం గ్రాంటు పొందాలంటే) ముందు ప్రణాళిక సంఘం అనుమతి, ఆ తరువాత కేబినెట్ అప్రూవల్ అవసరం. సాధారణం గా రాష్ట్రం నుంచి ఒక ప్రాజెక్టు మాత్రమే ఈ వసతి పొందే అవకాశం ఎక్కు వ. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా (ఆంధ్ర, తెలంగాణ) పోలవరంతో పాటు ప్రాణహిత-చే జాతీయ హోదా కల్పించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న మాట వాస్తవం. ఆ ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అన్నది వేచిచూడాలి. ప్రాణహితపైన కట్టబోయే బ్యారేజీ మూలంగా మహారాష్ట్రలో కొన్ని గ్రామాలు ముంపుకు గురవుతాయి. కనుక ముందుగా మహారాష్ట్రతో ఒప్పం దం చేసుకోవాలి. ఇంతవరకు ఒప్పందం చేసుకున్న సమాచారం లేదు.

పర్యావరణ అనుమతులు చట్టరీత్యా అవసరం. ఇందుకోసం ప్రజాభివూపా య సేకరణచేపట్టి ప్రజ ల విస్తృత అంగీకారం పొందవలసి ఉంటుంది. ఈ ప్రక్రియ ప్రస్తుతం మందకొడిగా కొనసాగుతున్నది. ఒకవైపు ప్రాజె క్టు డీపీఆర్ (సవివర అధ్యయన నివేదిక) పరిశీలన కేంద్ర జల సంఘంలో కొనసాగుతోంది. మరోవైపు ప్రజాభివూపాయ సేకరణ, పర్యావరణ అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ఇంకోవైపు మహారాష్ట్ర ప్రభుత్వంతో వారి అనుమతి కోసం చర్చలు కొనసాగుతున్నాయి. మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్న గుత్తేదార్లు, మరో విడుత అడ్వాన్స్ కోసం (700 కోట్ల రూపాయలు) తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అక్కడక్కడా జేసీబీలను ప్రయోగించి ట్రాక్టర్లు భూమిని గీకుతూ, పనులు జరుగుతున్నట్టు సీన్లు సృష్టిస్తున్నా రు.

ఇదిలా ఉంటే ప్రతి రాజకీయ నాయకుడు (కిరణ్, బొత్స, చిరంజీవి, చంద్రబాబు, జగన్) ఊతపదంగా ప్రాణహిత పేరెత్తి జాతీయ హోదా వచ్చేస్తుందని హామీలు కురిపిస్తారు. వాళ్ల భయమల్లా ప్రాణహిత పేరెత్తకుండా పోలవరం గురించి మాట్లాడితే వాళ్ల ఉనికికే ప్రమాదమొస్తున్నది. నిజానికి వీళ్లెవరకీ ప్రాణహిత గురించి ఆందోళన లేదు. ఆదుర్దా పూర్తిగా పోలవరం గురించే. నిజంగా ప్రాణహిత గురంచి చిత్తశుద్ధి ఉన్నవారైతే ఈ ప్రాజెక్టు కోసం అంటే 38,500 కోట్ల ఖర్చు చేయగలరా? ప్రాజెక్టుకుకేవలం పదకొండువందల కోట్లు బడ్జెట్ కేటాయిస్తారా?అదీ కాంట్రాక్టర్లకు అడ్వాన్స్‌లు చెల్లించడానికి.10,287.80 కోట్ల పోలవరంలో 3,500 కోట్లు ఖర్చుపెట్టారు. 4,717 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. ఇంతవరకు అటు మహారాష్ట్రగానీ, ఇటుకేంద్ర ప్రభుత్వంతో గానీ సీరియస్‌గా చర్చించిందీ లేదు.

అన్నిటికంటే ముఖ్యం ఈ భారీ ఎత్తిపోతల పథకానికి 3,300 మెగావాట్ల విద్యుత్తు అవసరం. ఈ విద్యుత్తు ఎక్కడ్నుంచి వస్తుంది? ఎంత ఖర్చవుతుంది? విద్యుత్తును రైతులు భరించుకునే స్థితిలో ఉన్నారా? వారు భరించే విధంగా విద్యుత్తును ఏ విధంగా సరఫరా చేయాలి? ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి అధ్యయనం చేయలేదు. పైగా పుండు మీద కారం చల్లినట్టు లోక్‌సత్తా నాయకులు జేపీ లాంటి ‘మేధావులు’ ఈ ప్రాజెక్టును వైట్ ఎలిఫెంట్‌గా అభివర్ణించి దీన్ని ఆపడానికి ప్రయత్నించారు. ఇక ఆంధ్ర ప్రాంత ఇంజనీర్లు అడుగడుగునా ఈ ప్రాజెక్టు రాకుండా, వచ్చినా పూర్తిస్థాయి ఆయకట్టు కాకుండా ఆయకట్టును 5.50 లక్షలకు కుదించి దానికి ఎక్కడ లేని అభ్యంతరాలు సృష్టించి కాలయాపనకు తోడ్పడ్డారు. వీటికి జీవోలు 557,623లు (2005 సంవత్సరంలో ఇచ్చినవి) సజీవ సాక్ష్యాలు. ఏమాటకామాటే చెప్పుకోవాలి.

వైఎస్‌ఆర్ చొరవ తీసుకుని ఉండకపోతే ప్రస్తుత స్థితిలో కూడా ఉండేది కాదు. ఒక్కటి మాత్రం నిజం పోలవరం, పులిచింతల, పోతిడ్డిపాడు పైన వలసవాదులకున్న అభిమానంలో వందోవంతైనా ప్రాణహితపైన చూపి ఉంటే ఈపాటికి ఈ ప్రాజెక్టు చాలా ముందుండేది. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి, వాళ్ల ఓట్లు దండుకోవాలన్న రాజకీయ ప్రయోజనం, ఈ ప్రాజెక్టు మూలంగా కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చి, తద్వారా సొంత ప్రయోజనాలు పొందాలన్న దుగ్ధ తప్ప నిజంగా ఈ ప్రాజెక్టును నిర్మించి తెలంగాణ ప్రజలను ఉద్ధరించాలన్న ఆలోచన వలస పాలకులకు లేదు. కనుక మిత్రమా మీకొన్ని ప్రశ్నలకు సమాధానం లభించిందనుకుంటాను.

ఇక విద్యుత్తు గురించి మీరడిన ఇతర ప్రశ్నలకు జవాబు కోసం వచ్చే వారం ‘నమస్తే తెలంగాణ’లోని ‘నీళ్లు నిజాలు’ చూడండి. సొంత విద్యుత్తు కేంద్రం ప్రాణహిత ప్రాజెక్టుకు అంకితం చేయడమొక్కటే ఈ ప్రాజెక్టు సఫలం కావడానికి పరిష్కారమార్గం.

ఇదీ సంగతి
భూగర్భ జలాలు

దేశంలో ప్రతి ఏడూ వర్షం మూలంగా లభించే Replenishable (పునః పునః లభించే పరిమాణం) నీరు 432 ఘనపు కిలోమీటర్లు. ఇందులో 396 ఘనపు కిలోమీటర్లనే మనం ఉపయోగించుకోగలం అని అంచనా వేయడం జరిగింది. దీనికి అదనంగా భూగర్భంలో బాగా లోతున లభించే నిశ్చల భూగర్భ జలాలు 10812 ఘనపు కిలోమీటర్లు ఉన్నట్టు లెక్కలు కట్టారు. అత్యవసర పరిస్థితులలో, దుర్భర క్షామ పరిస్థితుల్లో, తాగునీటికి కటకటలాడే పరిస్థితుల్లో మాత్రమే దీన్ని వాడుకోవాలని నిపుణుల సలహా.

భూగర్భ జలాల పరిమాణం నానాటికీ తగ్గడం, క్రమక్షికమంగా అవి కలుషితమయ్యే అవకాశం హెచ్చడం మనని తీవ్రంగా కలచివేస్తున్న సమస్య. భూగర్భ జలాలు కలుషితమయితే బాగు చేయడం చాలా కష్టం. జల కాలుష్యానికి సంబంధించి 1974లో The water (prevention and control of pollution) Act, 1977లో The water (prevention and control of pollution) less Act,1986లో The environment (protection Act)లో వెలువడ్డాయి. నీటిని కలుషితం చేసే దోషులను ఈ చట్టాలు శిక్షిస్తా యి. జల కాలుష్యంపైన హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు అనేకం వెలువడ్డాయి. ఇంత జరిగినా పరిస్థితిలో చెప్పకోదగ్గ మార్పేమీ లేదు.


-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్
భారత ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లోనే ఉంది. అంటే.. దీనర్థం మన్ను తినే స్థితిలో ఉన్నామని కాదు.

పణబ్‌ముఖర్జీ, కేంద్ర ఆర్థిక మంత్రితమ అంతర్గత శక్తియుక్తులను బయటకి తీసిన వారే ఛాంపియన్లుగా నిలుస్తారు.
చివరి క్షణం వరకు తమశక్తిని ప్రదర్శించిన వారే విజేతలు. నైపుణ్యం కన్నా
మనో సై్థర్యమే విజేతగా నిలుపుతుంది.

-మహమ్మద్ అలీ, మాజీ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

country oven

Featured Articles