ఇచ్చంపల్లి-దేవాదుల-కంతనపల్లి


Sat,December 10, 2011 06:17 PM

ఇచ్చంపల్లి ప్రాజెక్టును ఇక మరిచిపోవలసిందేనా? ప్రత్యామ్నాయంగా ఏ ప్రాజెక్టును చేపట్టారు? వివరాలు తెలపండి.

-జి. హర్షవర్ధన్, నర్సంపేట, వరంగల్


పోలవరం ప్రాజెక్టును కోస్తాంవూధకు ఏ విధంగా ప్రతిష్టాత్మకంగా భావిస్తూ వచ్చారో ఇచ్చంపల్లిని తెలంగాణకు అదే మాదిరిగా అనుకుంటూ వచ్చారు. రెండు ప్రాజెక్టుల గురించి గోదావరి జలవివాద పరిష్కారం చేసిన బచావత్ ట్రిబ్యునల్ రిపోర్టులో వివరంగా ఉటంకించడం జరిగింది. ట్రిబ్యునల్ రిపోర్టు ప్రకారం ఇచ్చంపల్లి ఆంధ్రవూపదేశ్,మహారాష్ట్ర, మధ్యవూపదేశ్ (ఇప్పుడు ఛత్తీస్‌గఢ్) రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. అది ప్రధానంగా విద్యుత్ ఉత్పాదన కోసం నిర్దేశింపబడింది. ఇచ్చంపల్లి రిజర్వాయర్ నుంచి కేవలం 85 టీఎంసీల నీటిని మాత్రమే ఆంధ్రవూపదేశ్ సాగునీటి కోసం ఉపయోగించుకోవచ్చు. ఇది నిజానికి పోలవరానికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా తోడ్పడుతుంది. ఈ డ్యాం నుంచి 975 మెగావా ట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. దాన్ని మూడు రాష్ట్రాలు నిర్ధారించిన నిష్పత్తిలో పంచుకుంటా యి. తొలుత ఈ డ్యాంను 112. 77 మీటర్ల పూర్తి జలస్థాయిలో నిర్మించాలని మూడు రాష్ట్రాలు ఒప్పుకున్నాయి. ఈ డ్యాం పూర్తి అయివుంటే గ్రావిటీ మార్గంగా 1,75,000 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని, నల్లగొండ, ఖమ్మం జిల్లాలు లబ్ధి పొందుతాయని భావించారు. దురదృష్టవశాత్తూ ఇచ్చంపల్లి వల్ల ఏర్పడే ‘ముంపు’కు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో పై డ్యాం ప్రతిపాదన మరుగునపడి, తక్కువ ఎత్తులో 95 మీటర్ల పూర్తి జలస్థాయితో కట్టాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీని మూలంగా ఛత్తీస్‌గఢ్‌లోని ఏడు గ్రామాలు, 31,305 ఎకరాల భూమి (అందులో 2,404 ఎకరాల అటవీ భూమి) మంపుకు గురవుతాయి. దీన్ని కూడా ఛత్తీస్‌గఢ్ ఒప్పుకోలేదు. కనుక ఇచ్చంపల్లి ప్రతిపాదన మూలపడిపోయింది. ఇంతకంటే తీవ్రమైన అభ్యంతరాలున్నా ‘పోలవరం’ విషయంలో ఒడిషా, ఛత్తీస్‌గఢ్ ఎంత ప్రతిఘటించినా, తెలంగాణవాదులు ఎంత ఉద్యమించినా, మనన ఘనత వహించిన ప్రభు త్వం లెక్కపెట్టకుండా పోలవరాన్ని కట్టితీరాలన్న దృఢ సంకల్పంతో ముందు కు సాగుతోంది. కాని ఇచ్చంపల్లి విషయంలో ఎలాంటి చొరవ, చిత్తశుద్ధి చూపలేదు. తెలంగాణ నాయకులు కూడా కిమ్మనకుండా ఊరుకుండిపోవ డం అత్యంత దురదృష్టకరం. శ్రీరాంసాగర్ తరువాత ‘ఎత్తిపోతలు’ అవస రం లేకుండా ఎంతో కొంత సాగునీరు అందించే ప్రాజెక్టు ఇచ్చంపల్లి. దాన్ని కేవలం మన చేతకానితనంతో కోల్పోయామని చెప్పక తప్పదు. కనుక సోదరా! ఇచ్చంపల్లిని మరిచిపోక చేసేదేముంది?

ఇచ్చంపల్లి రావడం లేదు కనుక ప్రత్యామ్నాయంగా దేవాదుల అవతరించింది. దేవాదుల ఎత్తిపోతల పథకం అన్న సంగతి మరచిపోకూడదు. మొద ట నీలంపల్లి అనేచోట ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలని చూశారు. కానీ అది వీలుపడలేదు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రసమితి, ఏర్పా టు అయిన దరిమిలా ఒత్తిడికి లొంగి దేవాదుల అనేచోట, ఎలాంటి క్షేత్ర అధ్యయనం లేకుండా 50 టీఎంసీల నీటిని ఎత్తిపోతల ద్వారా 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చంద్రబాబు ప్రభుత్వం శిలాఫలకం వేసింది. రెండేళ్లలో పూర్తిచేస్తామని, కేసీఆర్ నియోజకవర్గమైన సిద్దిపేటకు నీళ్లందిస్తామని హామీలు గుప్పించింది. కేంద్ర జల సంఘం నుంచి ఈ పథకానికి సూత్రవూపాయమైన ఆమోదం కూడా సాధించి, డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు సీడీపీడబ్ల్యూను తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన WAPCOSను నియమించింది. అన్ని అవరోధాలు దాటిన అనంతరం 15-7-2011 నాడు దేవాదులకు (దీని అధికారిక నామం జె. చొక్కారావు ఎత్తిపోతల పథకం) ప్రణాళికా సంఘం ఆమోదాన్ని తెలియజేసింది. దీని అంచనా వ్యయం 9427.73 కోట్ల రూపాయలు. ఈ పథకం 38.16 టీఎంసీల గోదావరి జలాలను వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం గంగారం గ్రామం సమీపంలోని గోదావరి తీరంలో సుమారు 70 మీటర్ల కనిష్ఠ స్థాయి నుంచి 470 మీటర్ల నికర ఎత్తుకు అంటే లాసెస్‌ను కలుపుకుని 581 మీటర్ల స్థాయికి చేరవేస్తుంది. ఈ పథకం ద్వారా సుమారు 6,21,000 ఎకరాల భూమికి సాగునీరు అందిస్తుంది. ఈ పథకంలో 1.920 టీఎంసీల నీరు తాగునీటి కోసం 0.012 టీఎంసీల నీరు పారిక్షిశామిక అవసరాల కోసం కేటాయించబడింది.

లబ్ధి పొందే జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి
వరంగల్ 5,61,229 ఎకరాలు
కరీంనగర్ 14,100 ఎకరాలు
నల్లగొండ 45,671 ఎకరాలు
మొత్తం 6,21,000 ఎకరాలు
ఈ పథకాన్ని అమలు చేయాలంటే 484 మెగావాట్ల విద్యుత్తు అవసరం అవుతుంది. మూడు దశలలో ఈ పథకాన్ని అమలు చేస్తారు. మొదటి దశలో 5.18 టీఎంసీల నీటిని నాలుగు లిఫ్ట్‌ల ద్వారా 268 మీటర్ల ఎత్తుకు చేరవేస్తారు. ఈ దశలో 77,700 ఎకరాలకు నీటి సదుపాయం కల్పిస్తారు. భీమఘనపురం, పులుకుర్తి, ధర్మసాగరం, ఆర్‌ఎస్‌ఘనపురం చెరువులను ఉపయోగించుకుంటారు. స్టేజి 1 పనులు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 2009 లో ధర్మసాగర్‌కు పంపు చేసిన గోదావరి జలాలను 6562 ఎకరాలకు సరఫరా చేసి పంటను రక్షించినట్టు ప్రభుత్వం ప్రకటించుకుంది. రెండవ దశలో 7.25 టీఎంసీల నీటిని 470 మీటర్ల ఎత్తుకు చేరవేయడం జరుగుతుంది. ఈ దశలో 1,08,750 ఎకరాలకు నీరు అందిస్తారు. ఈ దశలో నీటిని ఆర్‌సీ ఘనపురం, అశ్వరావుపల్లి, చిత్తకోడూరు, గండిరామారం, బొమ్మకూరు, తపాస్‌పల్లి, నర్సింగపూర్, వెల్దండ చెరువులను అవసరం మేరకు పునరుద్ధరణ చేసి ఉపయోగించుకుంటారు. ఇక మూడవ దశలో 25.69 టీఎంసీల నీటిని 510 మీటర్ల ఎత్తుకు చేరవేస్తారు. ఈ దశలో 3,57,300 ఎకరాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ దశలోనే భీమఘనపూర్ నుంచి రామప్ప చెరువుకు, రామప్ప చెరువు నుంచి ధర్మసాగరం చెరువుకు, ధర్మసాగరం చెరువు నుంచి ఆర్‌సీఘనపురం చెరువుకు సొరంగాల ఏర్పాటు ఉంది. రెండవదశ పనులు, మూడవ దశ పనులు మందకొడిగా కొనసాగుతున్నాయి.

జలయజ్ఞంలో అన్ని ప్రాజెక్టులకున్న ‘భూసేకరణ’ లాంటి సమస్యలు ఈ ప్రాజెక్టుకున్నా, దీనికి కొన్ని ప్రత్యేకమైన సమస్యలున్నాయి. ప్రధాన సమస్య ఏమిటంటే గోదావరి జలాలు తీసుకునే ఇంటేక్ కట్టడం దగ్గర నదిపైన నీటిని నిలువచేసే ఎలాంటి కట్టడం లేదు. అంటే గోదావరినదిలో ఉన్న కనీస నీటి స్థాయి 71 మీటర్ల నుంచి ఎత్తాలంటే సరైన నీటిస్థాయి నదిలో ఉండాలి. (లిఫ్ట్ చేయడానికి కనీస మట్టం గోదావరినదిలో 73-74 మీటర్లు ఉండా లి). గోదావరి నదిలో తగినంత నీటి మట్టం లేకపోతే లిఫ్ట్ పనిచేయదు. ఈ విషయం గ్రహించిన తెలంగాణ ఇంజనీర్లు, మేధావులు ప్రాజెక్టు ప్రాంతం నుంచే దేవాదులకు దిగువన కట్టడం ఏర్పాటు చేసి, తగిన నీటిస్థాయిని మెయిన్‌టెయిన్ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేసినా స్పందించలేదు. ఇన్ వద్ద పంపులు పనిచేయడానికి అవసరమైన కనిష్ఠ నీటిస్థాయి నదిలో ఉంటుందని బుకాయించింది. వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉండి, నీటిస్థాయి కొన్ని సందర్భాలలో పడిపోయి పంపులు పనిచేయని పరిస్థితి ఏర్పడనప్పుడు ప్రత్యామ్నాయం గురించి ఆలోచించడం మొదలుపెట్టింది.
ఈలోగా తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ‘ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్’ (ఇండియా) వారి సహాయసహకారాలతో ‘కంతనపల్లి’ ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. అనేక శ్రమలకోర్చి ఈ ప్రతిపాదనను ఇంజనీర్ల సంఘం ప్రభుత్వం చేత ఆమోదింపచేసింది. ప్రభుత్వం కంతనపల్లి దగ్గర బ్యారేజీ నిర్మాణానికి 16-2-2009 నాడు 27 జీవో ద్వారా 10,409 కోట్ల ఖర్చుతో శాఖాపరమైన ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా 50 టీఎంసీల గోదా వరి జలాలను ఎత్తిపోతల ద్వారా కాకతీయ కాలువకు చేరవేస్తారు. శ్రీరాంసాగర్ ప్రథమ, ద్వితీయ దశలలోని 71/2 లక్షల ఆయకట్టు ఈప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందుతుంది. ఆయకట్టు వివరాలు ఇవి.

ప్రాజెక్టు వివరాలు:కంతనపల్లి ప్రాజెక్టులో గోదావరినది పై ఏటూరు నాగారం (వరంగల్ జిల్లా) మండలంలోని కంతనపల్లి గ్రామం దగ్గర బ్యారేజీ నిర్మాణం జరగనుంది. ఇందులో 22.51 టీఎంసీల నీటిని నిలువు ఉంచుతారు. 182 క్యూసెక్కుల నీటిని (6425 క్యూసెక్కులు) తొమ్మిది మీటర్ల వ్యాసం 201/2 కిలోమీటర్ల సొరంగం ద్వారా తరలించి ఆనక ఆ నీటిని 63 మీట ర్లు ఎత్తి మేడారం గ్రామం దగ్గర తమ్మలవాగు అనే కొత్త జలాశయం నిర్మాణం చేసి తరలిస్తారు. అక్కడి నుంచి 23.475 కిలోమీటర్ల సొరంగం (తొమ్మిది మీటర్ల వ్యాసం) ద్వారా ఆ నీటిని తరలించి 120మీటర్ల ఎత్తుకు ఎత్తి జాగలపల్లి అనే నీటికొలను లాంటి cistern నుఏర్పాటు చేసి తరలిస్తారు. అక్కడి నుంచి 10.30 కిలోమటర్ల కాలువ ద్వారా గ్రావిటీ మార్గంగా పులిగూడెం, అక్కడి నుంచి తొమ్మిది మీట ర్ల వ్యాసపు సొరంగం (14.90 కి.మీ దూరం) ద్వారా నీటిని మల్లంపల్లి, అక్కడ నుంచి 8.30 కిలోమీటర్ల గ్రావిటీ కాలువ ద్వారా పెగడపల్లికి చేరుస్తారు. పెగడపల్లి నుంచి ఈనీటిని తొమ్మిదిమీటర్ల వ్యాసపు 21.725 కిలోమీటర్ల సొరంగం ద్వారా తరలించి మరో 66 మీటర్ల ఎత్తుకు ఎత్తి కాకతీయ కాలువలోకి 261.90 మీటర్ల స్థాయికి చేరుస్తారు.

పదివేల కోట్ల రూపాయలకు పై చిలుకు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టుకు కేవలం 1140 కోట్లు ఖర్చవుతుందని అంచనావేసి బ్యారేజీ పనులకు నిరుడు టెండ ర్లు పిలిచింది. ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. తమ అంచనాలోని పొరపాట్లను గ్రహించిన సాగునీటిశాఖ వాటిని సవరించి 1500-1600 కోట్ల రూపాయల ఖర్చుతో కొత్త ప్రతిపాదనలను ఆమోదం కోసం మఖ్యమంవూతికి సమర్పించింది. దురదృష్టవశాత్తు ‘కంతనపల్లి’కి మోక్షం లభించలేదు. కంతనపల్లి ప్రాజెక్టు పూర్తయితే తప్ప దేవాదుల సక్రమంగా పనిచేయదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు నీళ్లందవు. తెలంగాణ రైతులు, ప్రాంత ప్రతినిధులు మేధావులు, ఇంజనీర్లు ఎంత అలజడి ఆందోళన చేసినా మఖ్యమంత్రి మనసు కరగలేదు. ఫైలు కదలడం లేదు.

‘తెలంగాణ ప్రాజెక్టు కనుక ఈ ప్రాజెక్టు కదలడం లేదా? తెలంగాణకు భారీగా నష్టం కలిగించే దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్‌పై ఉన్న శ్రద్ధ ఈ ప్రాజెక్టుపైన ఎందుకు లేదు? ‘కంతనపల్లి ముద్దు-దుమ్ముగూడెం వద్దు’ అన్న నినాదంతో తెలంగాణ అంతటా ఉద్యమాలు చేస్తే తప్ప ప్రాజెక్టు బతికిబట్టకట్టదేమో?

సాగునీటి ప్రాజెక్టులలో ప్రైవేట్‌రంగ భాగస్వామ్యం
దేశంలోని వివిధ ప్రాంతాలలో విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణకు ప్రైవేట్‌రంగం ముందుకొస్తోంది. అలాగే రోడ్ల నిర్మాణం, నిర్వహణకు కూడా సిద్ధపడుతోంది. కానీ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేట్ రంగం ముందుకు రావడం లేదు. సాగునీటి ప్రాజక్టుల నిర్మాణం అనేక చిక్కులతో ముడిపడి ఉండడం, నిర్మాణకాలం అనేక సంవత్సరాలు కావడం, తమ పెట్టుబడిని సకాలంలో వడ్డీతో రాబట్టుకోవడానికి అవకాశాలు లేకపోవడం, దేశంలో ప్రస్తుతం చెలామణిలో ఉన్న నీటి తీరువా స్వల్పంగా ఉండడం ప్రైవేటురంగం ఉత్సాహం చూపకపోవడానికి ప్రధాన కారణాలు. అయితే భూగర్భ జలాన్ని వెలికితీసే ప్రాజెక్టులలో ప్రైవేటు రంగం చురుగ్గా పాల్గొంటున్నది. కారణం ఆ నీటిని తేలికగా లాభదాయకంగా అమ్ముకుని సొమ్ము చేసుకోవడానికి అవకాశం అధికంగా ఉండడమే. సాగునీటి ప్రాజెక్టులలో ప్రైవేటు రంగం భాగస్వామ్యం అన్న అంశాన్ని పరిశీలించిన జాతీయ కమిషన్ పారిక్షిశామిక రంగం, తాగునీటి అవసరాలు పూర్తిచేసే ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టడానికి ప్రైవేటు రంగం సిద్ధపడవచ్చు. కానీ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చొరవ చూపదన్న అభివూపాయం వ్యక్తం చేసింది. 1995లో కేంద్ర జలవనరుల సహా య మంత్రి రంగయ్య నాయుడు అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ప్రైవేట్ రంగ భాగస్వామ్యంపై కొన్ని ముఖ్యమైన సిఫార్సులు చేసింది. కానీ అవేవీ అమలు కాలేదు. కనుక సాగునీటి ప్రాజెక్టు ల్లో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం సాకారమయ్యే అవకాశం సుదూరంలో కనిపించడం లేదు.

దేశంలో మద్యం జోరు..
దేశంలో దేనికైనా కొరత ఉందేమో గానీ.. మన పాలకులు మద్యానికి కొదువలేకుండా చూస్తున్నారు. మారుమూల పల్లెటూరు మొదలు పట్టణాల దాకా.. బజార్లన్నింటినీ.. మద్యం దుకాణాలతో నింపేస్తున్నారు. పాలకులు మద్యం అమ్మకాలనే ప్రధాన ఆర్థిక వనరుగా భావిస్తున్నారు. కాబట్టే ప్రయత్న పూర్వకంగా మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారు. ఒకానొక దశలో ప్రజలు మద్య వ్యతిరేక పోరాటం చేసిన సందర్భాలున్నాయి. ఆ సమయంలో పోలీస్ స్టేషన్లలో మద్యం అమ్మించిన ఘనత మన పాలకులది. ఈ నేపథ్యంలోనే మద్యం అమ్మకాలల్లో దేశం శరవేగంగా దూసుకుపోతోంది. ఒక వైపు నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్నా.. మద్యం అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఓ గణాంకాల నివేదిక ప్రకారం దక్షిణాసియాలోనే భారత్ అతి ఎక్కువ బీర్లు అమ్ముతున్న దేశంగా ఘనతకెక్కింది. మద్యం అమ్మకాల జోరు ఈ విధంగానే కొనసాగితే.. 2015 కల్లా 1.4 లక్షల కోట్ల రూపాయల బీర్లను ఇండియన్లు తాగుతారని ఓ సర్వేలో తేలింది. ఇప్పుడు 50,700 కోట్ల రూపాయల బీర్లను తాగుతున్నారు.

ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

country oven

Featured Articles