దుమ్ముగూడెం ఎందుకు వద్దు?


Sun,October 30, 2011 10:59 PM

కంతనపల్లి ముద్దు-దుమ్ముగూడెం వద్దు అని ఆ మధ్యన మీరు ఖమ్మం, వరంగల్‌జిల్లాల్లో పర్యటించినప్పుడు విలేఖర్ల సమావేశంలో ప్రస్తావించినట్టు పత్రికల్లో చదివాను. కంతనపల్లి కావాలని అడగటంలో తప్పులేదు కానీ మా ఖమ్మం జిల్లాకు ఉపయోగపడే దుమ్ముగూడెం వద్దని వాదించడం మీలాంటి తెలంగాణ ఇంజనీరు నుంచి నేనాశించలేదు. మీరలా అనలేదా? అని ఉంటే దానికి తగిన కారణాలేమిటి? వివరించండి.

-సిహెచ్. గిరిజాకుమారి, కొత్తగూడెం ఖమ్మంజిల్లామీరు విన్నది నిజం. కానీ మీరనుకుంటున్నది వాస్తవం కాదు. దుమ్ముగూడెం పేరుతో రెండు పథకాలు వివిధ దశలలో ఉన్నాయి. ఒకటి:దుమ్ముగూడెం-రాజీవ్‌సాగర్. రెండు:దుమ్ముగూడెం-నాగార్జున సాగర్ pond)వూపాజెక్టు. మొదటి ప్రాజెక్టు ఖమ్మం జిల్లాకు ఉపయోగపడేది. ఇక రెండోది ఖమ్మంజిల్లాను, నల్లగొండ జిల్లాను ముంచే ప్రాజెక్టు. యావత్ తెలంగాణకు ద్రోహంచేసే ప్రాజెక్టు. దీన్నే మేము వ్యతిరేకిస్తున్నది.

జ్యోతిరావు పూలే దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ సుజల స్రవంతి పేరు తో తలపెట్టిన ఈ దుర్మార్గపు ప్రాజెక్టు కోరుకున్నది ఎవరు? ఎవరి సంక్షేమం కోసం ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారు? తెలంగాణ ప్రయోజనాలకు గండి కొట్టే ప్రాజెక్టును తెలంగాణ కోవలోకి చేర్చడం ఏం న్యాయం? ఇలాంటి అనేక అనుమానాలు, ప్రశ్నలకు జవాబు ప్రభుత్వం దగ్గర లేదు.

వివరాల్లోకి వెళితే...
ముందుగా, ఎవరి ఆలోచనో తెలియ దు గాని కొందరు సీమాంధ్ర ఇంజనీర్లు ‘గోదావరి’లో నీటి లెక్కలు కట్టి తెలంగాణ ప్రజల అవసరాలు ఇన్ని, కోస్తాంధ్ర అవసరాలు ఇన్ని.. ఇవన్నీ తీరాక కూడా ‘గోదావరిలో వరద జలాలు ‘వర్షాకాలంలో’ (80 రోజుల పాటు) ఇంకా బోలెడున్నాయి. వాటిని కృష్ణా నదికి తరలించవచ్చు’ అని ఒక ప్రతిపాదన చేశారు. అలా తరలించే నీరు 190 టీఎంసీల దాకా ఉండొచ్చని అంచనా వేశారు. పోలవరం నుంచి కృష్ణా బేసిన్‌కు ప్రతిపాదించే 80 టీఎంసీలకు అదనంగా ఈ తరలింపు ఉంటుంది అన్న మాట. ఇంకేముంది ఈ ఐడియా 2004లో కొత్తగా ముఖ్యమంత్రి అయిన వైఎస్‌ఆర్‌కు బోలెడు నచ్చేసింది. ఆయన బొంబాయిలో ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. హైదరాబాద్‌కు వచ్చాక కూడా ఈ ప్రతిపాదనను బాగా అధ్యయనం చేయమని ఆదేశాలిచ్చారు.

ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి. వైఎస్‌ఆర్ మనసులో ఉన్న విషయాన్ని అనేక సందర్భాల్లో బయటికే అనేసేవాడు. ఆయన ఉద్దేశమల్లా ‘కృష్ణా జలాలను’ అత్యధిక మోతాదులో (వీలైనంత మేరకు) రాయలసీమకు తరలించడం. అందు కు ఆయన పోతిడ్డిపాడును ఎంపిక చేసుకున్నారు. రాయలసీమ కడుపు నిండాక, కొంత నీటిని ప్రకాశం జిల్లా టన్నెల్), ఆ తర్వాత మహబూబ్‌నగర్ జిల్లా, ఇంకా కొంత నీటి ని నల్లగొండకు తరలించవచ్చు అన్నది ఆయన ఆలోచన. అంటే కృష్ణా నదిని శ్రీశైలంలో బంధించడం ఆయన ప్రధాన ఉద్దేశం అన్నమాట. ఇక తప్పనిసరి అయితే కొంత నీటిని నాగార్జునసాగర్‌కు వదలాలి. కానీ ఆయన ఉద్దేశం ఏమంటే ‘సాగర్’ కృష్ణా నీటిపై ఆధారపడకూడదు. సాగర్ నీటిపైన ఆధారపడ్డ సాగర్ ఎడమ, కుడి కాలువ, కృష్ణా డెల్టా అవసరాలను ‘పులి చింతల’, ‘పోలవరం’ ‘దుమ్ముగూడెం నాగార్జునసాగర్’ టెయిల్‌పాండ్ ప్రాజెక్టులు తీర్చగలగాలి. ఈ మూడు ప్రాజెక్టులు తీర్చగా ఇంకా మిగిలిన అవసరాల కోసం మాత్రమే ‘కృష్ణా జలాలను’ ‘శీశైలం నుంచి’ spare చేయడం జరుగుతుంది. ఇది వైఎస్‌ఆర్ మాస్టర్ ప్లాన్ వ్యూహం. ఇవి రూపుదాల్చడానికి టిబ్యూనల్ ఆదేశా లు, పర్యావరణ చట్టాలు, అంతర్జాతీయ న్యాయసూవూతాలు, పెసా చట్టాలు, కేంద్ర జల సంఘం మార్గదర్శకాలు, ప్రణాళికా సంఘం ప్రవచనాలు, చివరకు సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు ఏవీ పట్టించుకోలేదు ఆ మహానుభావుడు. ఆయన కృషి, పట్టుదల, దూకుడు వైఖరి ఫలితమే పులిచింతల (నిర్మాణంలో ఉంది) ‘దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్’లు (సర్వేలు జరుగుతున్నాయి) పురుడుపోసుకున్నాయి.ప్రస్తుతం మనం చర్చిస్తున్న ఈ ‘దుమ్ముగూడెం-సాగర్’ ప్రాజెక్టు గురించి ప్రభుత్వం చెబుతున్న నీతులు ఏమిటో చూద్దాం. ‘ప్రతి ఏడు గోదావరి నది లో జూన్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో 80 రోజుల పాటు 165 టీఎంసీ ల గోదావరి వరద జలాలు లభ్యమవుతాయి. వీటిని ఆకలితో నకనకలాడుతున్న ఖమ్మం, నల్లగొండ, కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాలోని నాగార్జునసాగర్ ఆయకట్టులోని కొన్ని ప్రాంతాలకు తరలించేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఇక్కడ గమనించవలసిన విషయాలు రెండు. మొదటిది-లభించే గోదావరి ‘వరద’ జలాలు.

‘వరద’ జలాలంటే ఏమిటో స్పష్టం చేయలేదు. 75 శాతం విశ్వసనీయత ఆధారంగా గోదావరిలో మన వాటాకు లభించే 1480 టీఎంసీల నికర జలాలతో (డిపెండబుల్) ఇది భాగమా? లేక అదనంగా లభించే సర్‌ప్లస్ జలాలా? ఇక రెండోది-ఈ నీళ్లను సాగర్ ఆయకట్టులోని కొన్ని ప్రాంతాలకు సాగర్ నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్న సమయంలో అదనంగా తరలిస్తారా లేక ఇవి తరలిస్తున్నాం కాబట్టి కృష్ణా జలాలను మీకు ఇచ్చేది లేదు అంటారా! అన్న విషయాన్ని స్పష్టం చేయలేదు. అంటే అసలు ఉద్దేశాన్ని మరుగున ఉంచి సాగర్ ఆయకట్టు దారులకు మేలు చేకూర్చే ప్రక్రియ ఈ ప్రాజెక్టును తలపెట్టినట్టు ప్రభుత్వం మాయ మాటలు చెప్తోందన్నమాట.

ప్రభుత్వం వేసిన ప్రణాళిక అనుసరించి ప్రతిపాదిత దుమ్ముగూడెం విద్యు త్ ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసే కట్టడం దగ్గర్నుంచి 24 వేల క్యూసెక్కుల గోదావరి ‘వరద’ జలాలను 80 రోజుల పాటు 217 కిలోమీటర్లు కాలువలు, 37 కిలోమీటర్లు సొరంగం ద్వారా వెరసి 244 కిలోమీటర్ల దూరం ప్రవహింపచేసి మొత్తం ఈ నీటిని 127 మీటర్ల ఎత్తుకు ఆరు విద్యుత్తు కేంద్రాల సహాయంతో ఎత్తి నాగార్జునసాగర్ డ్యాంకు దిగువన కడ్తున్న టెయిల్‌పాండ్‌కు హాలియానది ద్వారా చేరవేస్తారు. మార్గ మధ్యంలో సాగర్ ఎడమకాలువకు సంబంధించిన 21వ మెయిన్ బ్రాంచ్ కాలువకు 4,000 క్యూసెక్కులు (27.5 టీఎంసీలు), ముక్త్యాల బ్రాంచ్ కాలువకు 1000 క్యూసెక్కుల గోదావరి జలాలను సాగర్ టెయిల్‌పాండ్‌లోకి (హాలియా) ద్వారా వదిలిపెట్తారు. నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్‌నుంచి ఈ నీటిని సాగర్ డ్యాం దగ్గర ఏర్పాటు చేసిన రివర్సబుల్ టరై్బన్ల్ ద్వారా పంపు చేసి సాగర్ జలాశయం లోకి పంపిస్తారు. ఈ రకంగా దుమ్ముగూడెం నుంచి సాగర్ జలాశయంలోకి గోదావరి జలాలను తరలించే పథకం. తిరిగి తరలించిన ఆ నీటిని కాలువల ద్వారా (ఎడమ కాలువ, కుడికాలువ) సాగర్ ఆయకట్టుకు అందివ్వాలన్నది ప్రభు త్వం వారి స్కీం.

పైకి ఉదాత్తంగా అద్భుతంగా కనిపించే ఈ దుర్మార్గపు పథకం వెనకాల దాగి ఉన్న మర్మాన్ని బయట పెట్టకుండా కేవలం సాగర్ ఆయకట్టు దారుల శ్రేయస్సు కోసం ఈ పథకం తలపెడుతున్నట్టు నాటకాలు ఆడుతోంది ప్రభుత్వం. ఈ బృహత్ పథకం ద్వారా రెండు ఆశయాలు (రహస్యమైనవి పభుత్వం సాధించాలనుకుంటున్నది. (1)తరలించే గోదావరిజలాలను సాగర్ ఆయకట్టు దారులకు అందించడం ద్వారా సాగర్ ఆయకట్టు దారుల హక్కు భుక్తమైన కృష్ణాజలాలను వారికి దక్కకుండాచేసి, ఆ నీటిని హక్కులు లేని రాయలసీమకు శ్రీశైలం పోతిడ్డిపాడు ద్వారా సంక్రమింపచేయడం. (2) గోదావరి జలాలపైన హక్కులు కలిగి ఉన్న తెలంగాణ ఆరు జిల్లాలు ఆదిలాబా ద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్,వరంగల్, ఖమ్మం నోళ్లు గొట్టి వారి కి చెందవలసిన 165 టీఎంసీల నికర జలాలను వరదజలాల ముసుగులో కాజేయడం.
ఇంకా విచివూతమైన విషయం మేమంటే.. నాగార్జునసాగర్ డ్యాం ద్వారా గ్రావిటీ మార్గంగా హక్కుభుక్తమైన కృష్ణా జలాలను సాగర్ ఆయకట్టు దారు లు (నల్లగొండ, ఖమ్మం తెలంగాణలో) ఇప్పటిదాకా అనుభవిస్తున్నారు. వాలు మార్గంగా వచ్చే ఆ నీటిపై హక్కులు వదులుకొని గోదావరి బేసిన్‌కు చెంది న ఆరుజిల్లాల (తెలంగాణవి)కు న్యాయంగా చెందాల్సిన జలాలను లిఫ్ట్ ద్వారా నీళ్లు పొందడం అంటే నల్లాద్వారా వచ్చే నీళ్లను వదులుకుని, బోరు పైన ఆధారపడటం అన్నమాట. కృష్ణా నీళ్లను వదులుకుని, తమకు చెందిన తమ గోదావరి నీళ్లనే వాడుకోవడం అంటే తెలంగాణ ప్రాంత ప్రజల మధ్యనే చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడం తప్ప మకొకటి కాదు.19521 కోట్ల రూపాయల ఖర్చుతో తలపెట్టిన ఈ ప్రాజెక్టు ఎన్నో చిత్ర విచిత్ర విశేషాలు కలిగి ఉంది. అవి ఏమిటో చూద్దాం.

1. వరద జలాల ముసుగులో తెలంగాణ నికరజలాలను (165 టీఎంసీల విలువైన జలాలు) తెలంగాణకు కాకుండా చేసి గోదావరి బేసిన్‌కు చెందని రాయలసీమకు కృష్ణా బేసిన్ ద్వారా అక్రమంగా తరలించడం.

2. ఈ Substitution (బదిలీ)వూపక్షికియలో గోదావరి బేసిన్ నీటిని కృష్ణా బేసిన్ దిగువ ప్రాంతాలకు తరలించి, బదులుగా కృష్ణా జలాలను ఎగువ ప్రాంతంనుంచి, శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పోతిడ్డిపాడు ద్వారా తరలించడం ద్వారా ఆ విలువైన కృష్ణా జలాలతో ఉత్పత్తి కాగల 1670 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉన్న విద్యుత్ కేంద్రాలను ప్రభావితం చేసి విద్యుత్ కొరతకు కారణం కావడం.

3) తరలించిన గోదావరి జలాలను ముందు సాగర్ టెయిల్‌పాండ్‌కు, ఆ తర్వాత సాగర్ రిజర్వాయర్‌కు ఎత్తిపోతల ద్వారా చేరవేయడానికి మరో 1500 మెగావాట్ల విద్యుత్తు అవసరమేర్పడటం.

4. మొత్తం నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలకు కేటాయింపు 264 టీఎంసీలు. 1972-73 నుంచి 2007-2008 దాకా నాగార్జునసాగర్ ఆయ ట్టు దారులకు సగటున ప్రతి సంవత్సరం 363.00 టీఎంసీల కృష్ణా జలాలు లభ్యమవుతున్నాయని ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి. అంటే దాదాపు 100 టీఎంసీల కృష్ణా జలాలను ప్రతి ఏడూ అదనంగా అనుభవించే సాగర్ రైతాంగం ఆకలితో మలమల మాడిందెప్పుడు? వారి ఆకలిని తీర్చడానికి ప్రభుత్వం 20 వేల కోట్ల రూపాయల ఖర్చుతో గోదావరి జలాలను ఇవి గో..మీ ఆకలి దప్పులు తీర్చడం కోసం అని నిస్సిగ్గుగా ప్రకటించడం.

5. సాగర్ కాలువల ఆధునీకరణ కోసం ప్రపంచబ్యాంకు సాయంతో 4,444 కోట్ల రూపాయల ఖర్చుతో పనులు చకచక కొనసాగుతూ ఉండటం.

6. ఇటీవలే ముసాయిదా తీర్పును ప్రకటించిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 150 టీఎంసీల నీటిని నాగార్జున సాగర్ Carryder Storage గా ఉండాలని నిర్ణయించడం. (వర్షాభావ పరిస్థితుల్లో ఈ 150 టీఎంసీల నీరు సాగర్ ఆయకట్టు దారులకు ఉపయోగపడుతుంది.)

ఇన్ని విశేషాలు కలిగిన ఈ ప్రాజెక్టును హడావుడిగా వలస పాలక ప్రభు త్వం చేపట్టడానికి ప్రబలమైన కారణం, 71 వేల కోట్ల రూపాయల ఖర్చుతో గోదావరి పైన అనేక తెలంగాణ ఎత్తిపోతల పథకాలు రూపొందుతున్నాయి. దిగువన భారీ ఎత్తున పోలవరం ప్రాజెక్టు నిర్మాణమవుతోంది. కనుక ఈ ప్రాజెక్టులు పూర్తి కాకముందే గోదావరి జలాలను తస్కరించి మాయోపాయాలతో ప్రజలను మభ్యపెట్టి బదిలీ ప్రక్రియ ద్వారా కృష్ణాజలాలను పోతిడ్డిపాడు ద్వారా తరలించడం. మరో రెండు గొప్ప విశేషాలేమంటే... (1) ఇంత దుర్మార్గమైన ప్రాజెక్టును తెలంగాణ ప్రాజెక్టుల కోవలో చేర్చడం. (2)అదనంగా తెలంగాణలోని ఒక్క ఎకరాకు కూడా నీరివ్వని ఈ ప్రాజెక్టు తెలంగాణకు చెందిన 16084 ఎకరాల వ్యవసాయ భూమిని, 3902 ఎకరాల అటవీ క్షేత్రాన్ని మింగేయడం. ఇలాంటి దుర్మార్గమైన మహమ్మారి ప్రాజెక్టును వద్దనకుండా తల్లీ.. స్వాగతమనాలా?


సూక్ష్మ సేద్యం
‘శాస్త్రీయమైన నీటి నిర్వహణ’ (Scientific Water Manageme nt) బిందు సేద్యం (Drip Irrigation), తుంపర సేద్యం (Sprinkler Irrigation) చోటుచేసుకున్నాయి. దీన్నే సూక్ష్మ సేద్యం (Micro Irriga tion) అని కూడా వ్యవహరిస్తారు. నీటి ఎద్దడి ఉన్నచోట, పంట పొలాల భూమి ఎగుడు దిగుడుగా ఉండి, బాగా ఇంకుడు స్వభావం కలిగి ఉంటే అక్కడ సూక్ష్మ సేద్యం అనువుగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ‘వాటర్ మేనేజ్‌మెంట్ మాన్యువల్ పేర్కొంది. పండ్లు, కూరగాయల తోటలకు, ముఖ్యంగా వాణిజ్య పంటలకు సూక్ష్మసేద్యం ఉపకరిస్తుందని అనుభవజ్ఞుల మాట అయితే ఇది బాగా ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రక్రియ కాబట్టి మామూలు పరిస్థితుల్లో సాధారణ, సన్నకారు చిన్నకారు రైతులు ఈ పద్ధతివైపు మొగ్గుచూపడం లేదు. పంట కాలువలకు బదులుగా నేరుగా నీటిని మొక్కలకు అందించే ప్రక్రియ బిందు, తుంపర సేద్యం.గత ప్రభుత్వం అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఎత్తిపోతల పథకాలన్నిటికీ సూక్షసేద్యం వర్తింపచేయాలని జీవో 34 విడుదల చేసింది. పైగా ఒక టీఎంసీకి 15 వేల ఎకరాలు సేద్యం చేయాలని షరతు పెట్టింది. చివరకు ప్రతిపక్షాలు, రైతులు ఎదురు తిరగడంతో ప్రభుత్వం వెనకడుగేసింది. ప్రస్తుతం ఎలిమినేటి మాధవడ్డి ప్రాజెక్టు ఆయకట్టులోని కొంత భాగంలో ఈ సూక్ష సేద్యాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని ‘Pilot Scheme’ని ప్రారంభించింది. ఫలితాలు ఆశాజనకంగా ఉంటే తప్ప రైతులు ఈ కొత్త పద్ధతిని స్వీకరించరు. తెలంగాణలోని కొత్త ప్రాజెక్టులన్నీ దాదాపు ఎత్తిపోతలే. వాటికి వీటి ని అమలు చేయాలని చూడడం మూర్ఖత్వం. సూక్ష్మసేద్యం లాభదాయకం గా ఉంటే అది గ్రావిటీ స్కీమైనా, లిఫ్ట్ స్కీమైనా, నీటి ఆదా కోసం అమలు చేయవచ్చు అంతే కాని తెలంగాణకు సూక్ష్మ సేద్యం అని వక్రీకరిస్తే ప్రజలు తిరగబడతారు.

-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర