కంచే చేను మేస్తే...?


Sun,October 23, 2011 11:14 PM

మీరు రాసిన వ్యాసాలు, ఇస్తున్న ఉపన్యాసాలు విన్నాక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల దారుణ వివక్ష చూపెడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. మరి మన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఈ ఆగడాన్ని ఆపడానికి ఏ మార్గమూ లేదా?

-కందుల రాజమౌళి, మహబూబ్‌నగర్neelu-lijalu-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaచేనును కాపడవలసిన కంచే చేను మేస్తే ఇక దిక్కెవరు? అన్ని ప్రాంతాల ప్రజలను సమదృష్టితో చూడవలసిన ప్రభుత్వం నీతిని పక్కనపెట్టి, వివక్ష ప్రదర్శించడమే కాకుండా, అబద్దాలు చెప్పుతూ ప్రజలను మభ్యపెడుతూ తన నియంతృత్వ ధోరణిని అవలంబిస్తుంటే దేవుడా నువ్వే దిక్కు అని నోరు మూసుకొని అయినా కూర్చోవాలి. లేదా ఇతర మార్గమేదైనా ఉంటే అన్వేషించాలి. ఈ విషయం చివరగా మాట్లాడుకుందాం. ఈలోగా ప్రభుత్వం ఎంత మోసపూరితంగా అబద్ధాలు చెప్పుతూ పబ్బం గడుపుకుంటూ ఉందో కొన్ని ఉదాహరణలతో వివరిస్తాను.

రాజోలిబండ
రాజోలిబండ మళ్లింపు పథకానికి కేసీ కాలువతో పాటు సమానమైన ప్రతిపత్తి కలిగి ఉండాలని మద్రాసు, హైదరాబాద్ (నైజాం) ప్రభుత్వాలు 1944 లో ఒప్పందం చేసుకున్నాయి. ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం ఏర్పాడ్డాక ఆ ఒప్పందం కాల గర్భం లో కలిసిపోయింది. బచావత్ ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు కేసీ కాలువకు 39. 90 టీఎంసీలు, రాజోలిబండకు 17.1 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించింది. రాజోలిబండకు కేటాయించిన 17.1 టీఎంసీలలో కర్ణాటక 1.2 టీఎంసీలు(5900 ఎకరాలు), 15.9 టీఎంసీలు మహబూబ్‌నగర్ జిల్లా (87వేల ఎకరాలు )వాడు కోవాలని నిర్ధారించడం జరిగింది. అయితే మహబూబ్‌నగర్ జిల్లా ఎన్నడూ 6,7 టీఎంసీల నీటికన్నా ఎక్కువ అనుభవించలేదన్నది ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. కేసీ కాలువకు నిర్ధారించిన కేటాయింపు కన్నా ఎంతో ఎక్కువగా మొత్తం 50 నుంచి 60 టీఎంసీలు వాడుతున్నట్టు ప్రభుత్వ గణాంకాలే వివరిస్తున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాకు నీరు రాకపోవడానికి ప్రధానమైన కారణం కేసీ కాలువ ఆయకట్టుదారులు అక్రమంగా రాజోలిబండ తూములను బద్దలు కొట్టి తరలిస్తున్నారన్నది అందరికీ తెలిసిన పచ్చినిజం.

ప్రభుత్వం మాత్రం ఎక్కడా అధికారికంగా ఈ విషయం ప్రస్తావించకుండా దీనికి బాధ్యతను రాజోలిబండ కాలువలో ఎగువన ఉన్న కర్ణాటక ప్రభుత్వంపై నెట్టివేసింది. సుప్రీంకోర్టుకిచ్చిన అఫిడవిట్‌లో కూడా ఇదే విషయం ధృవీకరించింది. కర్ణాటక వాడుకోవాలనుకున్నా ఒకటి రెండు టీఎంసీలను మించి ఉపయోగించుకోవడానికి అక్కడ ఆయక అయినా ప్రభుత్వం తన అబద్దాల ఆయుధాన్ని ఇలా ప్రయోగించింది.
nagarjuna-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
సాగర్ ఎడమ కాలువ
ప్రణాళికా సంఘం ఆమోదించినట్టు నాగార్జునసాగర్ ఎడమ కాలువలో మొత్తం 132 టీఎంసీలలో 111 టీఎంసీలు తెలంగాణకు, 21 టీఎంసీలు ఆంధ్రకు (నందిగామ ) కేటాయించబడ్డాయి. ఆరకంగా సర్వేలు చేసి తెలంగాణలో 6 లక్షల 60 వేల ఎకరాల సాగు కు గ్రావిటి మార్గంగా వసతులు కల్పించాలి. అదే విధంగా ఆంధ్రలో 1 లక్ష 30 వేల ఎకరాలు సాగయ్యేట్టు ఆయకట్టు ను గుర్తించాలి. ఇదీ ప్రతిపాదన. అదేవిధంగా ఆదేశాలు కూడా విడుదల అయ్యాయి. కానీ సర్వే చేస్తున్నది ఆంధ్ర అధికారులు. పైన అజమాయిషీ చేస్తున్నది ఆ వర్గమే. వాళ్లకు తెలంగాణకు ఇంత నీరివ్వడం ఇష్టంలేదు. ఆయకట్టు తగినంత తెలంగాణలో లభ్యం కాలేదన్న సాకు చూపి తెలంగాణ ఆయకట్టును 5 లక్షల 32 వేల ఎకరాలకు నగావిటీ ద్వారా) కుదించి ఇందుకోసం 90.20 టీఎంసీల నీరు వినియోగం కావాలని, ఆంధ్ర ప్రాంతానికి 1 లక్ష 30 వేల ఎకరాల ఒరిజినల్ ఆయకట్టు ను 3 లక్షల 70 వేలకు పెంచి ఇందుకోసం 32.25 టీఎంసీల నీరు అవసరమవుతుందని కొత్త ప్రతిపాదన పెట్టడం, ఓకే చేయడం చకచకా జరిగాయి.

1969లో తెలంగాణ ఉద్యమం ఉపందుకున్న సందర్భంలో తెలంగాణ నీటి కేటాయింపును ఆయకట్టును యథాతథంగానే ఉంచాలని, ఎలాంటి కోత విధించకూడదని తిరిగి ఆయకట్టు కోసం పునః సర్వే చేయాలని ఆదేశించడం జరిగింది. ఉద్యమం చల్లారడంతో అధికారులు మళ్లీ తమ పాత పాటే పాడి, ఆయకట్టు తగినంతగా లేకపోవడంతో కుదించడం తప్పనిసరి అని చెప్పి నీటి కేటాయింపులో మిగిలిన తెలంగాణ వాటాను ఆంధ్రకు బదిలీ చేసి తమ తెలుగు పక్షపాత బుద్ధిని ప్రదర్శించుకున్నారు ఆంధ్ర అధికారగణం. ఈలోగా కొంత గొడవ అవుతే తప్పని సరి పరిస్థితుల్లో తెలంగాణకు మరో 9.80 టీఎంసీల నీరు ఎత్తిపోతలకు (70 వేల ఎకరాలకు ) ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం మెహర్బానీ ప్రదర్శించింది. అంటే చివరకు తెలంగాణకు చెందవలసిన 111 టీఎంసీలలో అధికారికంగా 100 టీఎంసీలు మాత్రమే కేటాయించి, ఆంధ్ర వాటాను 21 టీఎంసీలనుంచి 32 టీఎంసీలకు పెంచడం జరిగింది. దీన్నేమందాం? ఇది నీతివంతమైన, నిజాయితీతోకూడిన సక్రమమైన చర్యేనా? ఈ ప్రభుత్వం జిత్తులమారిది, పక్షపాత ధోరణి అవలంబించేది అంటే తప్పేమైనా ఉందా?

సింగూరు
గోదావరికి ఉపనదియైన మంజీరా చిన్న నది. దానిలో ఉన్నవి 75 శాతం విశ్వసనీయత ఆధారంగా 98.90 టీఎంసీలు మాత్రమే. ఆ నీటిని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రవూపదేశ్‌లు పంచుకోవాలి. మంజీరా నీటిపైన ఆధారపడే ఘనపురం ఆనికట్, పోచారం ప్రాజెక్టు, ఇంకా చిన్న తరహా పథకాలు, ప్రధానమైన నిజాంసాగర్ కట్టడాలు రూపొందాయి. వాటికే నీళ్లు సరిపోలేదు. అప్పటికే హైదరాబాద్‌కు తాగునీటి కోసం ఒక మంజీరా స్కీం అమలులో ఉంది. అలాంటి పరిస్థితుల్లో జంటనగరాల తాగునీటి కోసం కృష్ణా, గోదావరి నదులలో ఎక్కడి నుంచి ఎంత నీరు తీసుకురాగలము అన్న విషయం తేల్చడానికి కె.వి. శ్రీనివాసరావు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అన్ని విషయాలను లోతుగా అధ్యయనం చేసిన ఆ కమిటీ ‘కృష్ణా’ నది నుంచే జంట నగరాల అవసరాలు తీర్చే స్కీం చేపట్టడం శ్రేయస్కరమని, ఏ పరిస్థితుల్లోనూ ‘మంజీరా’ నుంచి తేవొద్దని గట్టిగా సిఫార్సు చేసింది.

‘ఎంత కాలం’ కృష్ణా జలాలను సీమ ప్రాంతానికి తరలించాలన్న దుష్ట ఆలోచన ఉన్న ప్రభుత్వం నిష్ణాతుడైన ‘శ్రీనివాసరావు’ సిఫార్సును పక్కనపెట్టి, తనకు అనువైన ‘ఆంధ్ర’ అధికారుల చేత మరో దొంగ రిపోర్టు తయారు చేయించింది. ‘అందులో జంటనగాలకు సరిపడా నీరు మంజీరాలో లభిస్తుందని, ఇప్పటికే అమలులో ఉన్న నిజాంసాగర్ లాంటి ప్రాజెక్టులకెలాంటి ఢోకా ఉండదని’ఆ రిపోర్టులో ఉంది. ప్రభుత్వం దానిని ఆమోదించి, వెంటనే ఆ స్కీంను చేపట్టింది. అదే నేటి ‘సింగూరు’. కేవలం కృష్ణా నదిని సీమకు తరలించే కుట్రలో భాగంగా వెలసిన సింగూరు, ఈ వేళ రాజధాని తాగునీటి అవసరాలకు మాత్రమే రిజర్వ్ చేయబడి, అటు మెదక్, ఇటు నిజామాబాద్ జిల్లా రైతాంగం నోళ్లు కొట్టి ఉసురుపోసుకుంటున్నది. ప్రభుత్వం చేపట్టిన ఈ దుర్మార్గపు చర్యను ఎలా అర్థం చేసుకోవాలి. తన పక్షపాత బుద్ధిని చూపించుకోవడమే కాదు, ఇందు కోసం ఎంతటి ‘దిగజారుడు’తనానికైనా సిద్ధమవుతుందనడానికి మరో నిదర్శనమేం కావాలి?

పులిచింతల
కేవలం ‘కృష్ణా డెల్టా’ స్థిరీకరణ కోసమే ఈ ప్రాజెక్టును కడ్తున్నారు. సాగర్ దిగువన సమువూదానికి వృథాపోయే నీటిని ఒడిసి పట్టుకుని ఉపయోగించుకుంటామని నిజాయితీగా ప్రకటిస్తే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఈ ప్రాజెక్టు మూలంగా నష్టపోయే నల్లగొండ పంటభూములు, సున్నపురాళ్ల నిక్షేపాలు, సిమెంటు పరిక్షిశమలు, నిర్వాసితులయ్యే ప్రజల ఇక్కట్లను, బాధలను పట్టించుకోకుండా ఈ ప్రాజెక్టుకు బదులుగా చిన్న చిన్న ప్రాజెక్టులు కట్టుకుని నీటిని ఉపయోగించుకోండి అని అర్థించినా ఆ మాటల్ని పెడచెవిన పెట్టి, మెండిగా తాను అనుకున్న చోటనే ప్రాజెక్టును కట్టుతోంది ప్రభుత్వం. ఈ ఏకపక్ష ధోరణి సరిపోదన్నట్టు ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు, రాయలసీమకు లాభం. ఈ ప్రాజెక్టు నుంచి కృస్ణా డెల్టాకు వదిలే నీరు సాగర్‌లో ‘ఆదా’ అవుతుంది. ఆ నీటినే పైన ‘తెలంగాణ’, ‘సీమ’ వాళ్లు అనుభవించవచ్చు అన్న అబద్ధ ప్రచారాన్ని ప్రభుత్వం కొనసాగిస్తోంది. అసలు సంగతేమంటే బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా డెల్టాలో రెండు పంటలకే పూర్తిస్థాయిలో నీటిని కేటాయించలేదు. ‘పులిచింతల’కు నీటిని అస్సలు కేటాయించలేదు. మొదటి పంట, రెండో పంట కాదు అవసరమైతే మూడో పంట వేసుకోవడానికి ఉపయోగపడే పులిచింతలను కట్టుకుంటూ ‘పుండు మీద కారం చల్లినట్టు మంత్రులు, ఎమ్మెల్యేల చేతనే డబ్బా కొట్టించడం ఎంత దురదృష్టకరం?

పోతిడ్డిపాడు, పోలవరం,
దుమ్ముగూడెం- సాగర్ టెయిల్‌పాండ్

ఈ మూడు స్కీంల లక్ష్యం ఒకటే. ‘కృష్ణా’ జలాలను తస్కరించి (ఈ మాట ఘాటుగా ఉంటే అక్రమంగా తరలించి అందాం) ఆ ప్రభావం కృష్ణా బేసిన్ లో దిగువన ఉన్న సాగర్ ప్రాజెక్టు, కృష్ణా డెల్టా పైన పడకుండా ఉండేందు కు, ‘గోదావరి’ నీటిని అక్రమంగా కృష్ణా బేసిన్‌కు తరలించడం. వీటి గురించి విపులంగా వేరే వ్యాసంలో ప్రస్తావిస్తాను.

తెలంగాణ ప్రజావూపతినిధుల పాత్ర
ఇన్ని ఘోరాలు జరుగుతుంటే తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారన్న ప్రశ్న. వాళ్లకు తెలిసి జరుగుతుందా? తెలియక జరుగుతోందా? అన్నది ముఖ్యం కాదు. వాళ్లకు తెలిసినా వాళ్లు ఏమీ చేయలేని పరిస్థితి. అంత అర్భక స్థితి. తమకు మంత్రి పదవులు రావేమో? ఇతర రాజకీయ ప్రయోజనాలు చేకూరవేమో అన్న దుగ్ధ ఒక్కటే వారిని పీడిస్తోంది. ఉన్న పదవులు ఊడుతాయేమో అన్న భయం మరికొందరిని వెంటాడుతోంది.

ఇంతమంది విద్యార్థులు, యువకులు ‘తెలంగాణ’ కోసం రాలిపోతుంటే ఎలాంటి చలనం లేని ఈ ప్రజావూపతినిధులు ప్రాజెక్టుల కోసం, నీళ్ల కోసం ఆందోళన చేస్తారని, పదవులు వదులుకుంటారని అనుకోవడం కేవలం భ్రమ. ఒకరిద్దరు తప్ప అందరికీ ఒకటే రంది. ‘మళ్లీ ఎన్నికల్లో నాకు సీటొస్తుందా? గెలుస్తానా? మంత్రి పదవి వస్తుందా? పది తరాలకు సరిపడా ఆస్తి సంపాదించుకుంటామా? లేదా? అన్న చింత ఒక్కటే వారికి ఉంటుంది. ‘కృష్ణా, గోదావరి నీళ్లు ఎటుపోతే మనకేంటి, ఏ ఉద్యోగం ఎవడికొస్తే నాకేంటి?’ ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో అందరికీ తెలుసు. ‘తెలంగాణ రాష్ట్ర సాధన’ ఈ రాజకీయ రాబందుల, స్వార్థపరుల భరతం పడితే తప్ప మనకు పట్టిన ఈ ‘శని’వదలదు.

ఇదీ సంగతి
ప్రాజెక్టులకు కేంద్ర నిధులు

1996లో కేంద్ర ప్రభుత్వం AIBP అంటే Accelerated Irriga tion Benefit Programme (సత్వర సాగునీటి లబ్ధి పథకం) ప్రవేశపెట్టింది. నిర్మాణం చాలా వరకు సాగి, ప్రాజెక్టు చాలా Advanced stage లో ఉండిపోయి, కొంత ధనం అందిస్తే పూర్తయ్యే ప్రాజెక్టులకు సాయం చేసే కేంద్ర పథకం ఇది. తొలుత 1000 కోట్లకు పైబడ్డ ప్రాజెక్టులు మాత్రమే ఈ సాయానికి అర్హత పొందుతాయి అని ప్రకటించారు. దరిమిలా వేయికోట్లను 500 కోట్లకు కుదించారు. రానురాను షరతులను సడలిస్తూపోయారు. ఇప్పుడు భారీ, మధ్య తరహా ప్రాజెక్టులే కాకుండా చిన్న నీటి తరహా పథకాలు కూడా ఈ లబ్ధి పొందడానికి అర్హత ఉన్నవే. కరువు పీడిత/గిరిజన ప్రాంతాలు/ వరద తాకిడికి గురయ్యే ప్రాంతాల ప్రాజెక్టులకు 90 శాతం, అలాగే వెనుకబడిన ప్రత్యేక శ్రేణి గల రాష్ట్రాలలో ప్రాజెక్టులకు కూడా 90 శాతం, మిగతా చోట్ల నిర్మింపబడ్డ ప్రాజెక్టులకు 25 శాతం AIBP గ్రాంటు లభిస్తుంది. AIBPకి అదనంగా వ్యవసాయ పరంగా వెనుకబడ్డ ప్రాంతాలలోని కొన్ని ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్యాకేజీలో చేర్చి 90 శాతం గ్రాంటుని అందిస్తున్నారు.

అంతర్జాతీయ, అంతర్ రాష్ట్ర ప్రాజెక్టులకు, ఐదు లక్షల ఎకరాల కంటే ఎక్కువ ఆయకట్టుకు నీరందించే మెగా ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందిం చే మరో బృహత్తర కేంద్ర పథకం National Project‘జాతీయ ప్రాజెక్టు’ దేశంలోని 14 మెగా ప్రాజెక్టులను ఈ జాబితాలో చేర్చారు. 2008లో మొదలైన ఈ స్కీం, ప్రాజెక్టులకు 90 శాతం కేంద్ర గ్రాంటు ఇస్తుంది. ‘పోలవం’ ‘ప్రాణహిత-చే ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టుల జాబితాలో చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది.


-ఆర్.విద్యాసాగర్‌రావు
కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్


35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర