తెలంగాణ ఎందుకు వెనుకబడింది?


Sun,October 9, 2011 11:06 PM

తెలంగాణ వెనుకబడిన ప్రాంతమా? తెలంగాణ బంగారు తునక ఎట్లా అవుతుంది?

-మంత్రి కరుణ, హైదరాబాద్


ఏదైనా దేశం లేక రాష్ట్రం లేక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే వనరులు సమృద్ధిగా ఉండాలి. సారవంతమైన భూమి, పుష్కలంగా నీరు, వన సంపద, ఖనిజ సంపద, కష్టపడే మనుషులు ఇవన్నీ ఉంటే అభివృద్ధి చెందుతుంది. అయితే అన్నీ ఉండి కూడా అభివృద్ధి చెందని దేశాలు, ప్రాంతాలు ఉన్నాయి. కారణం ఆ వనరులను వివిధ కారణాల చేత ఆ ప్రాంతానికి చేరవేయలేకపోవడం. లేదా ఆ వనరులను ఆ ప్రాంతం నుంచి మరో చోటికి తరలించుకపోవడం.

మన దేశంలోనే పక్కపక్కనున్న రెండు రాష్ట్రాల గురించి మాట్లాడుకుందాం. ఒకటి మధ్యవూపదేశ్ రెండు రాజస్థాన్. మధ్యవూపదేశ్‌లో అద్భుతమైన వనరులున్నాయి. మధ్యవూపదేశ్‌లోనుంచి ప్రవహించే నీరు దేశంలోని అత్యధిక నదీ బేసిన్లలో భాగమై ఉంది. గంగా, మహానది, నర్మద, గోదావరి, తాపి(తపతి) మాహి, బ్రాహ్మణీ అనే ఏడు ప్రముఖ బేసిన్లకు మధ్యవూపదేశ్ నీరందిస్తుంది. ఇక అటవీ, ఖనిజ సంపద గురించి చెప్పక్కర్నే లేదు. సారవంతమైన భూములున్నాయి. అయినా ఆ రాష్ట్రం ఎందుకు వెనుకబడి ఉంది? కార ణం ఆ రాష్ట్రాన్ని బాగుపరచాలన్న కాంక్ష ఎవరికీ లేదు. నిన్న మొన్నటిదాకా ఆ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులంతా బయటి రాష్ట్రాల వాళ్లు. నేటికీ ప్రముఖ వాణిజ్య వ్యాపార సంస్థలన్నీ పంజాబీ, రాజస్థానీ ఇంకా ఇతర ప్రాంతాల వాళ్లవే. సరైన ప్రాజెక్టులు, రోడ్లు, పాఠశాలలు లేవు. ప్రగతి పథాన పయనించడానికి తంటాలు పడుతోం ది. ఎక్కడైనా డబ్బు సంపాదించి తమ ప్రాంతాలకు పంపాలనుకునే అధికారులు, వ్యాపారులు ఉన్నంత కాలం ఆ ప్రాంతాన్ని బాగు చేయడం కష్టం. రాజస్థాన్ విషయానికి వస్తే ఎడారి ప్రాంతం. నీటి వనరులు మృగ్యం. కనుక రాజస్థాన్ వెనుకబడటానికి బలమైన కారణముంది.
ఇక మన రాష్ట్రం పరిస్థితి గమనిస్తే తెలంగాణ, మధ్యవూపదేశ్‌ను పోలి ఉంది.
రాయలసీమ రాజస్థాన్‌ను పోలి ఉంది. తెలంగాణలో కృష్ణా నది, గోదావరి నది బేసిన్లు ఉన్నాయి. కృష్ణా నదిలో 68.5 శాతం, గోదావరి నదిలో 79 శాతం పరీవాహక ప్రాంతం తెలంగాణదే. నల్ల బంగారం సిరుల గని సింగరేణి. ఆదిలాబాద్ అడవులు, బయ్యారం గనులు మొదలైన ఖనిజాలు, సారవంతమైన భూములు. కష్టించి పనిచేయడానికి ఎల్లవేళలా సిద్ధపడే అమాయక రైతులు- ఇవన్నీ తెలంగాణ ఆస్తి, సంపద. ఇన్నీ ఉండి కూడా తెలంగాణ ఎందుకు వెనుకబడింది? ఎందుకంటే తెలంగాణను బాగు చేయాలన్న తపన కన్నా తెలంగాణ సిరులు దోచుకోవాలన్న వలసవాదుల దృష్టి మిన్న. కనుక తెలంగాణ వెనుకబడలేదు. ఉద్దేశపూర్వకంగా వెనుకవేయబడింది.

ఇక రాయలసీమ. ఆ సీమను రాయలవారు పాలించిన రోజుల్లో పురవీధుల్లో రత్నా లు పోసి అమ్మేవారని చెప్పుకుంటూ ఉంటారు. నాటి పరిస్థితిని పుస్తకాల్లో చదివి, గొప్ప గా ఊహించుకోవడం సహజమే. కాని నేటి రాయలసీమ పరిస్థితి కడుదైన్యం. ప్రకృతి కరుణించలేదు. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల కన్నా వర్షపాతం తక్కువ. కోస్తాంవూధలో 1037 మిల్లీ మీటర్లు. తెలంగాణలో 956 మిల్లీ మీటర్లు, రాయలసీమలో కేవలం 677 మిల్లీ మీటర్ల వర్షపాతం ఉంది. ఇక పెన్నా బేసిన్ తప్ప చెప్పుకోదగ్గ బేసిన్ రాయలసీమలో లేదు. 75 శాతం విశ్వసనీయత ఆధారంగా దానిలో లభించే నీరు 98 టీఎంసీలు (గోదావరిలో 1480, కృష్ణలో 811 టీఎంసీలు) లేకపోతే కృష్ణా బేసిన్‌లో 18.39 శాతం పరీవాహక ప్రాంతం రాయలసీమకుంది. చిన్నాచితకా నదులు, వాగులు రాయలసీమ నుంచి ప్రవహిస్తున్నా అవి రాయలసీమ వాసుల అవసరాలు తీర్చలేవు. కనుక రాయలసీమను తెలంగాణ గాటన కట్టలేం. కాని దురదృష్టవశాత్తు తెలంగాణ, రాయలసీమను రెంటిని కూడా వెనుకబడిన ప్రాంతాలని పాలకులు అభివర్ణిస్తుంటారు.


రాయలసీమను బాగు పరచాలనుకోవడంలో తప్పులేదు. అది చట్ట సమ్మతంగా లేక మూడు ప్రాంతాల ప్రతినిధులను ఒప్పించి, కోస్తాంధ్ర, తెలంగాణకు అధికార పూర్వకం గా లభించిన నీటిలోకొంత మేరకు తరలిస్తే తప్పులేదు. కాని నేటి పాలకులు కుట్రపూరితంగా తెలంగాణకు చెందిన న్యాయమైన వాటాను బలవంతంగా, దౌర్జన్యంగా తరలించడమే నేటి తెలంగాణ ఉద్యమానికి బలమైన కారణం. ఉదాహరణకు రాజోలిబండ, పోతిడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ లాంటి వెన్నింటినో పేర్కొనవచ్చు. అందుకే ఈ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ బాగుపడదు, వెనుకబడే ఉంటుంది అని పదేపదే చెప్పుతున్నది. ప్రత్యేక రాష్ట్రమొస్తే తప్ప తెలంగాణకు న్యాయం జరగదు.

ఇక రెండవ ప్రశ్న. ‘తెలంగాణ బంగారు తునక’ ఎలా అవుతుందన్నది? తెలంగాణ లో లభించే మిగిలిన వనరుల విషయం మాట్లాడదలుచుకోలేదు. నీటి విషయానికి వస్తే ‘కృష్ణ’ బేసిన్లో తెలంగాణకు జరగవలసిన అన్యాయమేదో ఇప్పటికే జరిగిపోయింది. 68.5 శాతం పరీవాహక ప్రాంతం కలిగినా, 811 టీఎంసీల మొత్తం నీటిలో కేవలం 277 టీఎంసీలను మాత్రమే కేటాయించడం జరిగింది. మరో 20 టీఎంసీలను భీమా ప్రాజెక్టు కోసం కేటాయించడంతో ఇప్పుడు తెలంగాణ వాట 297 టీఎంసీలు అయింది. ఇది సుమారు 300 టీఎంసీలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ నీళ్లలో సగం కూడా తెలంగాణకు దక్కడం లేదు. కనుక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అధికారికంగా లభించిన మొత్తం నీటిని తెలంగాణ కోసం ఉపయోగించుకోవచ్చు. ఇది మొదటి అంశం. ఇక రెండవ అంశం అతి ప్రధానమైనది. గోదావరి జలాల వినియోగం. ప్రభుత్వం కేటాయించిన లెక్కల ప్రకారమే తెలంగాణకు సుమారు 900 టీఎంసీల నీరు దక్కనుంది.

ఇప్పుడు వినియోగించుకుంటున్న కొద్దిపాటి నీటిని మినహాయించుకుని, మిగతా నీటిని తెలంగాణ భూములకు తరలించవలసిన అవసరముంది. ఇందుకోసం ప్రాణహిత-చే శ్రీరాంసాగర్ ద్వితీయ దశ, వరద కాలువ, ఎల్లంపెల్లి, దేవాదుల, కంతనపల్లి, రాజీవ్‌సాగర్ దుమ్ముగూడెం, ఇందిరాసాగర్ రుద్రంకోట పథకాలు, ఇంకా ఆదిలాబాద్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న మధ్యతరహా ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన అవసరముంది. వచ్చిన చిక్కేమిటంటే దాదాపు ఇవన్నీ ఎత్తిపోతల పథకాలే. ఈ పథకాలు విజయవంతంగా పనిచేయాలంటే సుమారు ఆరువేల మెగావాట్ల విద్యుత్తు అవసరం. ఇంత భారీ ఎత్తున విద్యుత్తు ఉత్పాదన ఒక ఎత్తయితే, మరో పక్కన విద్యుత్తును రైతులకు తక్కువ ఖర్చుతో, వారు భరించే విధంగా అందజేయాల్సిన అగత్యం ఏర్పడుతుంది. ఇవీ ప్రస్తుతం ఇంజనీర్లు ఎదుర్కొంటున్న సవాళ్లు. దీని కోసం అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.

ఇక తెలంగాణలోని పంట భూముల గురించి కొన్ని మాటలు చెప్పాలి. తెలంగాణలో సాగునీటి వసతిపై ఆంధ్రవూపదేశ్ ప్రాంతీయ కమిటీ వెలిబుచ్చిన అభివూపాయమిది. ‘తెలంగాణలోని నేలలు అధికంగా ఎర్రనేలలు (Red soils), ఇసుక, బంకమట్టి నేలలు (Loamy soils), ఇవి సాగు నీటికి అనువైన నేలలు. తక్షణం సాగునీటి వసతులు కల్పిస్తే ఉపయోగించుకోవడానికి రైతులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. పంజాబ్‌లో ఒక కోటి 60 లక్షల ఎకరాల సాగుకు యోగ్యమైన భూమిలో 80 లక్షల ఎకరాలకు కాలువల ద్వారా సాగునీటి వసతులున్నాయి. అంటే 50 శాతం అన్న మాట. ఇది రెండవ ప్రణాళికాంతం మాట. తెలంగాణ పరిస్థితి పూర్తిగా భిన్నం. అక్కడ కేవలం సాగునీటి వస తి ఉన్నది రెండు శాతం భూములకే. విచివూతమేమంటే పంజాబ్ కంటే కూడా తెలంగాణలో ఎక్కువ నీరు లభ్యమవుతోంది’. ఇదే విషయాన్ని డాక్టర్ మర్రి చెన్నాడ్డి కూడా కేంద్రం దృష్టి కి తీసుకు ‘పోచంపాడు ప్రాజెక్టు’ను అర్జెంటుగా ఆమోదించవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

చెప్పొచ్చేదేమంటే తెలంగాణలో అత్యధికంగా నీటి వనరులున్నాయి. సారవంతమైన భూములున్నాయి. నల్ల బంగారం ఒడిలోనే ఉంది. కష్టపడి పనిచేసే అమాయకులు స్వచ్ఛమైన సహృదయం గల రైతాంగం ఉంది. నూటికి నూరుపాళ్లు చిత్తశుద్ధి ఉండి, ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ గడ్డన పుట్టిన రుణం తీర్చుకునే అవకాశం కోసం పరితపిస్తున్న ఇంజనీర్ల మేథో సంపద ఉంది. ఇంకేం కావాలి? తెలంగాణను బంగారు తునకగా మార్చడానికి?

ఈ సందర్భంగా ఓ విషయం గుర్తించుకోవాలి. పంజాబ్ నుంచి హర్యానా వేరుపడ్డ రోజు పంజాబ్ హర్యానాను ఎద్దేవా చేసింది. అవహేళనగా మాట్లాడింది. అయితే కసితో, పట్టుదలతో హర్యానా వాసులు శ్రమించి పదేళ్లలో హర్యానాను అగ్రస్థానాన నిలబెట్టారు. తెలంగాణ ఏర్పడ్డాక జరగబోయేదదే. కావలసింది తక్షణ రాష్ట్ర ఏర్పాటు. ఆ తర్వాత రాష్ట్ర పునర్ నిర్మాణం. ఇందుకోసం అందరూ నడుం బిగించాలి. ఇంతకాలం పోరు తెలంగాణ చూశాం. ఇక చూడాల్సింది హరిత తెలంగాణయే.

-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్


35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

country oven

Featured Articles