నిర్వచించబడని సెక్యులరిజం!


Sat,November 2, 2013 12:35 AM

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్తే ఎవరూ ఆశ్చర్యపోయేవారు కాదు. కాని మన సంస్కృతి, సంప్రదాయాలకు ఈ వ్యవస్థ అన్యమయినదని భారత ప్రజలు అప్పుడే భావించారు. పశ్చిమదేశాలలో ‘సెక్యులరిజం’అనే పదానికి మతంతో సంబంధం లేదని మాత్రమే అనుకుంటారు. కానీ భారతదేశం దీన్ని ‘సర్వమత సమభావన’ అని అన్వయించింది.

న రేంవూదమోడీ కన్నా సుష్మాస్వరాజే భారత ప్రధాని కావడానికి యోగ్యురాలని దిగ్విజయ్‌సింగ్ స్థాయికి తగ ని ప్రకటన చేయడాన్ని అర్థం చేసుకోలేని వారుం డరు. ఆయనకు బీజేపీ పట్ల ఉన్న వ్యతిరేకత, మోడీ ప్రభంజనాన్ని తట్టుకోలేక చేస్తున్న కుటిల ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. ఈ ప్రకటనతో బీజేపీలో ప్రధాని అభ్యర్థిత్వంపై ప్రభా వం చూపదు. ఏదో విధంగా తమపార్టీ లబ్ధి కొరకు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికైనా వెనుకాడని ప్రవృత్తిలో ఇదొక భాగం. రాహుల్ గాంధీ కన్నా దిగ్విజయ్‌సింగే ప్రధానమంత్రి పదవికి అర్హుడని సుష్మాస్వరాజ్ ప్రకటించారు. దేశ విచ్ఛిన్నానికి స్వతంత్ర భారతంలో నిరంతరంగా జరుగుతున్న, రాజకీయ, ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నం సామాన్య ప్రజలు చేయలేకపోతున్నారు. దానికి నాయకత్వ లోపం కనిపిస్తుంది. వందల, వేల సంవత్సరాలనుంచి సంసృ్కతిపైన, ప్రజలపైన దండయావూతలు జరుగుతుంటే, ప్రజలు సమైక్యంగా లేకపోవడం వల్ల, పట్టించుకోకపోవడం వల్ల దేశం సర్వనాశనమైంది.

ఆ పరిస్థితే మళ్ళీ పునరావృతం అవుతుందా? ఈ సమస్యకే ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించుకోవాలనే తపన మొదలయింది. లౌకిక జపంతో రాజ్యమేలుతుంటే ఉగ్రవాద చర్యలు, అప్రకటిత యుద్ధా లు, బాంబు విస్ఫోటనాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ తదితర సంఘటనలతోపాటు దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల ఘటనలు కళ్లముందే ఉన్నాయి. సెక్యులర్ ప్రభుత్వం వీటిని పట్టించుకోదు. ఇది సర్వసాధారణమనే రీతిలో మసులుతుంది. బాధితులకు బాసటగా నిలబడడంలో ఘోరంగా వైఫ ల్యం. సమాజం అంటీముట్టనట్టు తయారయింది. రాజకీయ పార్టీలయితే, సెక్యులరి జం అనుకూల, ప్రతికూల ప్రకటనలకు పరిమితమై, సమిధలవుతున్న సామాన్యుల దుస్థితికి పరిష్కారం చూపడంలేదు.
బీహార్‌లోని పాట్నాలో పేలుళ్ళ మధ్యన జరిగిన నరేంవూదమోడీ బహిరంగ సభ ఈ కుహనా లౌకికవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించివేసే దిశగా నడిచింది. పేలుళ్ళకు భయపడకుండా నిశ్చలంగా వున్న జనసముద్రం ప్రజలలో నమ్మకాన్ని కలిగించిం ది. బాంబు విస్ఫోటనాలను అధిగమించి భారత జాతి గత వైభవాన్ని ప్రపంచానికి చాటారు ప్రజలు. నరేంవూదమోడీ కానీ, వేదికపైన ఉన్న వారెవరూ ఈ ఉగ్రవాదుల గురించి స్పందించకుండా హుందాతనాన్ని ప్రదర్శించి ఈ ముష్కర మూకలకు చరమగీతం పాడుదాం అనే సంకేతాన్నిచ్చారు. ఇదే రాబోయే ప్రభుత్వానికి యువత ప్రతిపాదించే ఎజెండాగా కనిపిస్తున్నది.


సెక్యులరిజం పేరిట ఈ దేశ ముస్లిం, హిందువులను విభజించి పాలించాలనే దుర్మార్గపు ఆలోచనలు, పతాకస్థాయికి చేరుకున్నాయి. కేంద్ర మంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంవూతులకు, ఉగ్రవాదుల కేసుల పేరిట ముస్లిం యువతను వేధించవద్దని లేఖలు రాయడం అసహ్యం వేస్తున్నది.దేశంపైన పలుమార్లు యుద్ధం చేసి మట్టి కరిచిన పాకిస్తాన్, అనుక్షణం పరోక్షంగా నిరంతర యుద్ధాన్ని కొనసాగించి వేలాదిమంది ప్రాణాలను బలి తీసుకుంటున్నది. దారితప్పిన ముస్లిం యువతను భారతదేశంపైకే పురిగొలిపి భారతదేశాన్నే కబళించాలని చూస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ సంతుష్టీకరణ చర్యలు చేస్తున్నది. ఒక వర్గానికి ఓట్ల కోసం మేలు చేసినట్టే చేసి యావత్ భారతదేశానికి కీడు చేస్తున్నది. సెక్యులరిజం అనే పదాన్ని పాతరేసి అన్ని మతాల వారు కలిసిమెలిసి సహజీవనం చేసే ప్రాతిపదికను అమలుచేయాల్సిన అవసరం ఉంది.సమాజం కూడా ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే తరతరాల చరివూతను పరిగణనలోకి తీసుకోవాలనే ప్రతిపాదనను మోడీ స్సష్టం చేస్తున్నారు. దీనితోపాటు పాకిస్తాన్‌పై మన వ్యవహారం ఏ విధంగా ఉండాలనేది కూడా చర్చాంశంగా మారుతుంది. 1947,1965,1971,1999లో మనం పాకిస్తాన్‌తో పూర్తిస్థాయి యుద్ధం చేశాం. పాకిస్థాన్ కొందరు ఉగ్రవాదులకు భారతదేశంపైన వైషమ్యాన్ని నూరిపోసి, ఆయుధాలను, డబ్బులను సమకూర్చి దేశంలో హింసాయుత చర్యలను ప్రేరేపించి దేశ విచ్ఛిన్నానికి పాల్పడుతున్నారు. యుద్ధాలలో జరిగిన ప్రాణనష్టం కన్నా, ఈ పరోక్ష యుద్ధంలో సామాన్యులు,సాయుధ బలగాలు ప్రాణాలు కోల్పోతున్నారు. సరిహద్దులో వీరమరణం పొందిన మన జవాన్ల మృతదేహాలు వారి గ్రామాలకు చేరుకుంటున్న హృదయవిదారక సంఘటనలు తరచుగా చూస్తున్నాము. 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్‌ను ఓడించడమే కాకుండా బంగ్లాదేశ్ ఆవిర్భావానికి మన వీర జవాన్లు మొక్కవోని ధైర్య సాహసాలను ప్రదర్శించి ఎంతోమంది దేశం కోసం త్యాగం చేశారు. ఆ యుద్ధంలో పట్టుబడ్డ పాకిస్థాన్, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, పోలీస్ ఇతర పదాతిదళాలు కలిసి మొత్తం 90,368 మంది యుద్ధఖైదీలను, కడుపునిండా భోజనం పెట్టి తిరిగి వారి దేశానికి పంపిస్తే.. దాని ఫలితాన్ని రోజూ చవిచూస్తున్నాం. ఈ మధ్యన మన సైనికులను వధించి వారి తలలను తెగకోసి, తీసుకుపోయిన సంఘటన యువత రక్తాన్ని ఉడికిస్తున్నది. వివాదాస్పదమైన సెక్యులరిజం అనే భావనను అటు పాకిస్థాన్, ఇటు దేశంలో ఉన్న ఉగ్రవాద సంస్థలు కవచంగా మార్చుకుంటున్నాయి.

దీన్ని నిర్వచించి తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇతరులను ఓర్చుకునే క్షమాగుణాన్ని వారసత్వంగా పొందిన సంసృ్కతి మనది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఇష్టపడని వారు ఈ సంసృ్కతిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు. చరివూతలో అభివూపాయాలు భిన్నంగా ఉన్నా ఓర్చుకునే స్వభావాన్ని కొన్ని సందర్భాలలో మతానికి భిన్నంగా ఉన్నాయని ఆపాదించి శాస్త్రీయతను పక్కకు నెట్టారు. గొప్ప శాస్త్రవేత్త ‘గెలీలియో’ లాంటివారు విమర్శకు గురి అయ్యారు. ఆయన పరిశోధనలన్నీ ప్రశ్నార్థకం కానప్పటికీ మత గ్రంథాలలో చెప్పబడలేదన్న నెపం మీద ఆయనను దోషిగా చిత్రీకరించారు. దీనికి భిన్నంగా మన దేశంలో అత్యధికులు దేవున్ని నమ్మేవాళ్ళున్నా, నమ్మని వాళ్ల సంఖ్య కూడా వుండడమే కాకుండా, దేవుడు లేడని, మళ్ళీ పుట్టుక హాస్యాస్పదమని జీవించినంతవరకు సుఖ భోగాలతో తులతూగాలని నాస్తికవాది అయిన చార్వాకున్ని సహించడమే కాకుండా ఆయనను ఈ సమాజం ‘రిషి చార్వాక’ అని గౌరవించింది.


న్యూస్‌వీక్ ఇంటర్నేషనల్ ఎడిటర్ ఫరీద్ జకారియా ఈ మధ్య రాసిన ‘ది పోస్ట్ అమెరికన్ వరల్డ్’ అనే పుస్తకంలో ‘హిందూయిజం’ ఒక మతం కాదని, దీనిలో ఉన్న శాఖలు, ఉపశాఖలు, వారి ఇష్టానుసారము ఏ దేవతనైనా పూజించవచ్చునని చెప్పారు. ప్రతి కుటుంబం తనదైన ప్రత్యేకతను కనబరుస్తుందని, ఎవరి నమ్మకం వారిదని, దేవున్ని నమ్మువచ్చును, నమ్మకపోవచ్చని, ఎవరయినా శాకాహారి, మాం సాహారి కావచ్చని అన్నారు. వీటి కారణంగా హిందువని గుర్తింపు పొందారని, ఒక మతపరమైన సిద్ధాంతం గానీ, ఆజ్ఞాపించడం గానీ లేదు కాబట్టి, ఇందులో భిన్న మతావలంబన, స్వమత త్యాగం అనే ప్రసక్తి రాదని కాబట్టి అందరినీ దరికి చేర్చుకుని తనలో విలీనం చేసుకునే శక్తి దాగి వుందని స్పష్టం చేశాడు. ఈ హిందూ ఆచార విచారమే ఈ దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థ సెక్యులరిజం సాఫల్యానికి కారణమ ని రచయిత అంటాడు. అయితే ఎన్నో ఏళ్ల క్రితమే సుప్రీంకోర్టు హిందూయిజం అనేది జీవన విధానమని స్పష్టం చేసింది.

మతం అనేది ఈ సమాజాన్ని శాసించదు కాబట్టి విశృంఖలంగా ఉండటానికి వీలులేదని, ప్రతివ్యక్తిని సన్మార్గంలో పెట్టే సం స్కృతీ పరంపర ప్రతి కుటుంబ జీవనంలో నిరంతరంగా ప్రవహిస్తూనే వుంటుంది. అందుకే, ఈ జాతి ఎన్ని దాడులనైనా ఎదుర్కొని గర్వంగా ప్రపంచ దేశాల ముందు నిలబడి మంచిని పంచే స్థాయిలో ఉందని అతిసామాన్యునికి తెలుసు.భారతదేశంలోని ఇస్లాం సిద్ధాంత కర్త మౌలానా వహిదుద్దిన్ ఖాన్ తన మాటల్లో ‘నేను ఒక ముస్లింను, ఇస్లాం నా మతం, కాని నేను ఇతర మతాలను గౌరవిస్తాను. అంతేకాకుండా భారతదేశంలో ముస్లింలు, ఇతర ఇస్లామిక్ దేశాలలో ఉన్నవారికన్నా మంచి స్థితిలో వున్నారు. సుఖసంతోషాలతో వున్నారు. ఆ ఇస్లామిక్ దేశాలలోని ముస్లింలకు శాంతికాని,స్వేచ్ఛకాని లేవు. భారతదేశంలో ఆ రెండూ వున్నా యి’ అని చెప్పడం ఆలోచించవలసిన విషయం.

పేరు పొందిన బీబీసీ విలేకరి, భారతదేశంలో 25 ఏళ్లు పనిచేసి, ఢిల్లీలో స్థిరపడి ఎన్నో పుస్తకాలు రాసి, సెక్యులరిజం మీద ఎంతోమందిని ప్రభావితం చేశాడు. భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ మూల భావనలకు అత్యంత ప్రాధాన్యమిచ్చాడు. మహాత్మాగాంధీ ‘నా హిందూయిజం,ఇతర మతాలను గౌరవించాలని నేర్పుతుందని’ చెప్పాడని అందుకే ఆయన మనుమడు గోపాల్ గాంధీ బెంగాల్ గవర్నర్‌గా, కోల్‌కత్తాలోని ఆయన నివాసంలో పిల్లలతో క్రిస్‌మస్ వేడుకలు చేసుకుంటూ గాంధీ అడుగుజాడల్లో నడవడాన్ని ప్రముఖంగా పేర్కొన్నాడు. కేవలం క్రిస్టియన్ కార్యవూకమాలకే పరిమితం కాకుండా సర్వత్రా వ్యాపించి వున్న దేవుని గురించి ఆలోచించడంలోనే అర్థం ఉందని, అనుమానం ఉన్నప్పుడు ప్రశ్నించే తత్వం ఉండాలని ఈ దేశం తనకు నేర్పిందని పేర్కొన్నాడు.


1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్యవ్యవస్థగా వెలిస్తే ఎవరూ ఆశ్చర్యపోయేవారు కాదు. కాని మన సంస్కృతి, సంప్రదాయాలకు ఈ వ్యవస్థ అన్యమయినదని భారత ప్రజలు అప్పుడే భావించారు. పశ్చిమదేశాలలో ‘సెక్యులరిజం’ అనే పదానికి మతంతో సంబంధం లేదని మాత్రమే అనుకుంటారు. కానీ భారతదేశం దీన్ని ‘సర్వమత సమభావన’ అని అన్వయించింది. అందుకే పాట్నాలో జరిగిన హుంకార ర్యాలీ సభావూపాంగణంలో, బయట పేలుళ్ళు జరుగుతున్నా వీటి గురించి ఒక్క మాటయినా మాట్లాడకుండా పాట్నా గత వైభవాన్ని, సహనాన్ని చాటి, ప్రజలు సమన్వయం పాటించారు.

-సిహెచ్.విద్యాసాగర్‌రావు
కేంద్ర మాజీ మంత్రి

130

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

Published: Sun,September 16, 2012 10:48 PM

పడుతూలేస్తూ పాలమూరు ప్రాజెక్టులు

సార్-మా పాలమూరు ప్రాజెక్టుల పరిస్థితేంది? వాటికి నీళ్ల కేటాయింపు ఉన్నదా? కరెంటున్నదా? పైసలున్నయా? అన్ని సక్రమంగా వుంటే మరి ఎందుకు