అనుమతి లేకున్నా పోలవరం నిర్మాణం


Mon,September 19, 2011 12:08 AM

పోలవరం ప్రాజెక్టును ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లాలో కడుతున్నారు కదా! దీనివల్ల తెలంగాణకు ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో రెండు లక్షల ఎకరాలు ముంపుకు గురవుతాయంటున్నారు ఎందుకు? ఈ ప్రాజెక్టుకు ఎప్పుడో 1948లో శంకుస్థాపన చేసినప్పటికీ నేటికీ పూర్తి కాలేదేమిటి? కేంద్ర పర్యావరణ శాఖ కూడా ఈ పోలవరం ప్రాజెక్టుకు ఇంకా అనుమతి ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి?

-జానపాటి సంధ్యారాణి, మిర్యాలగూడ, నల్గొండ


polavaram-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema పోలవరం ప్రాజెక్టును గోదావరి నదిపైన ఆంధ్రవూపాంతంలో పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం ఎగువన రామయ్యపేట దగ్గర కడుతున్నారు. ఒకవైపు పశ్చిమ గోదావరి మరోవైపు తూర్పు గోదావరి జిల్లాలున్నాయి. పోలవరం డ్యాం మూలంగా ఏర్పడే జలాశయం పూర్థి జలస్థాయి (FRL) అత్యధిక జలస్థాయి (MWL) రెండూ కూడా 150 అడుగులు. ఈ జలాశయం మూలంగా 299 గ్రామాలు ముంపుకు గురవుతాయని ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది. ఈ 299 గ్రామాల్లో 276 ఆంధ్రవూపదేశ్‌లోనివే. మిగిలినవి పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఒరిస్సాలవి. ఆంధ్రవూపదేశ్ లోని 276 గ్రామాల్లో 207 గ్రామాలు ఖమ్మం జిల్లావే. ఈ గ్రామాల్లో నివసించే వారు అత్యధికంగా గిరిజనులు. వీరితో పాటు భారీగా పంట భూములు, అటవీ ప్రాంతం ముంపుకు గురవుతున్నాయి. ఈ లెక్కలన్నీ జలాశయంలోకి అత్యధిక వరద పరిమాణం 36 లక్షల క్యూసెక్కుల ప్రాతిపదికన తయారైనవి.

కానీ ఈ రోజున డ్యాం 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహ ధాటికి తట్టుకునేలా ‘స్పిల్ వే’ను రూపొందిస్తున్నారు. 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నప్పుడు, పోలవరం వద్ద జలాశయస్థాయిని 150 అడుగులకు మించకుండా ఉండేలా చేయాలంటే ఎగువ ప్రాంతంలో ఎంత మేరకు ‘ముంపు’ ఉంటుందో ఇంకా అంచనా వేయలేదు. పొరుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఖమ్మం జిల్లాలో ముంపు భారీగా ఉంటుందన్న కారణంగా భయాందోళనలతో తెలంగాణవాదులు కూడా పోలవరాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం ‘పోలవరం’ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఒరి స్సా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అభ్యంతరాలతో పాటు, ఆంధ్రవూపదేశ్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలోని స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా పిటిషన్లు దాఖలు చేయ డం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు పైనే పోలవరం భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇదిలా ఉండగా ‘పోలవరం’ ప్రాజెక్టులో ‘డ్యాం’ నిర్మాణం చేపట్టకుండానే ముందస్తుగా కాలువల నిర్మాణం జరిగిపోయింది. సుమారు నాలు గు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు తెలుస్తోంది.

ఇటీవలే మరో 4717 కోట్ల రూపాయల టెండర్లు పిలిచారు. ‘డ్యాం’లో అంతర్భాగమైన ‘స్పిల్ వే’ రాక్‌ఫిల్ డ్యాం, పవర్‌బ్లాక్‌ల నిర్మాణం కోసం ఈ టెండర్లను ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుంచి సత్వర సాగునీటి లబ్ధి పథకం (Accelerated Irrigation Benefit Programme AIBP) కింద 25 శాతం గ్రాంటు ప్రాజెక్టుకు లభిస్తోంది. ఈ ప్రాజెక్టును ‘జాతీయ ప్రాజెక్టు’ల కోవలోకి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తే ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో 90 శాతం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.

ఇక ఈ ప్రాజెక్టు పూర్వాపరాల్లోకి వెళితే దానిపేరు వెనకటి రోజుల్లో రామపాదసాగరం. దీన్ని 1941లో దీవాన్ బహదూర్ ఎల్. వెంకటకృష్ణ అయ్యర్ అనే ఇంజనీరు రూపకల్పన చేశారు. ప్రాథమిక క్షేత్ర అధ్యయనాలు, సవివర అధ్యయనాలు, విదేశీ నిపుణుల సలహాలు, సంప్రదింపులు అన్నీ పూర్తయినా అనేక కారణాల వల్ల ప్రాజెక్టు ప్రారంభం కాలేదు. 1980లో ఈ ప్రాజెక్టు నిర్మాణం గురించి ఆంధ్రవూపదేశ్, ఒరిస్సా, మధ్యవూపదేశ్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. అవగాహనా పత్రం ప్రకారం ముంపు తక్కువగా ఉండేటట్టుగా డ్యాం డిజైన్‌ను కేంద్ర జల సంఘం చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రాజె క్టు రిపోర్టును కేంద్ర జల సంఘం పరిశీలించి అనేక లోటుపాట్లను ఎత్తిచూపింది. ఈ లోగా ‘ముంపు’ ఎంత అనే విషయంలో మూడు రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదరలేదు.

అనేక పర్యాయాలు చర్చలు జరిగినా ఫలితం రాలే దు. పొరుగు రాష్ట్రాల అంగీకారం లేకుండా తాము ప్రాజెక్టుకు ఆమోదం తెలుపలేమని కేంద్ర జల సంఘం చేతుపూత్తేసింది. ఇదిలా ఉండగా అప్పటిదాకా ప్రాజెక్టు మూలంగా ముంపుకు గురయ్య ‘అటవీ ప్రాంతం’ గురించి కూడా కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ తీవ్ర అభ్యంతరాలు తెలి యజేసింది. ఇటు కేంద్ర జల సంఘం, అటు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపకపోయినా పొరుగు రాష్ట్రాలైన ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌లతో ముంపు విషయమై అవగాహనకు రాకపోయినా, పోలవరం ప్రాజెక్టు వల్ల నిరాక్షిశయులవబోయే గిరిజనులు ప్రాజెక్టు ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ మేధావులు, ఇంజనీర్లు, తెలంగాణ వాదులు పోలవరానికి ప్రత్యామ్నాయాలు ప్రతిపాదించి, ‘దయచేసి పరిశీలించండి’ అని మొత్తుకున్నా ప్రభుత్వం పెడచెవినపెట్టి మొండివైఖరితో ముందుకు సాగుతోంది.
ఇక అనుమతుల విషయానికి వస్తే ఎవరేం చెబుతున్నారో చూద్దాం

సుప్రీంకోర్టు
‘ప్రణాళికా సంఘం, కేంద్ర జల సంఘం, ఇంకా ఇతర చట్టబద్ధమైన సంస్థలు ఆమోదం తెలుపందే ఏ ప్రాజెక్టు నిర్మాణం కూడా ఏ రాష్ట్రం తలపెట్టకూడదు’అని ఆలమట్టి కేసును విచారించిన సందర్భంలో వెలువరించిన ఆదేశమిది.

ప్రణాళికాసంఘం
అంతరాష్ట్ర చిక్కుముడులున్న ఏ ప్రాజెక్టయినా సరే కేంద్ర జల సంఘం సాంకేతిక ఆర్థిక పరిశీలన జరిపి ఆ తరువాత సాగునీటిపై ఏర్పడ్డ సలహా సంఘం ఆమోదం తెలిపాకే ముందుకు వెళ్లాల్సి ఉంటుందని మార్గదర్శక సూత్రాలను వెల్లడించింది. ఇంతే కాక, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, కేంద్ర సాంఘిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖల నుంచి ప్రాజెక్టుకు చట్టబద్ధమైన అనుమతులు పొందడం తప్పసరి. ప్రణాళికాసంఘం పెట్టుబడి అనుమతి ఇచ్చేముందు, అటవీ సంబంధిత అనుమతి, పునరావాస సహాయం ఇంకా ఇతర అంశాలకు సంబంధించిన అనుమతులు కూడా పొందవలసిన అవసరముంది అని కూడా మార్గదర్శక సూత్రాలు ప్రకటించింది.

కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ
ప్రాజెక్టుకు ప్రతిపాదిత స్థలాన్ని ఖరారు చేసేముందు ఇతర ప్రత్యామ్నాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. నిర్మాణాత్మక చర్యలే కాకుండా నిర్మాణేతర కార్యక్షికమాలను ప్రత్యామ్నాయాలుగా పరిశీలించాలి. కేవలం సాంకేతిక దృష్టితోనే కాకుండా, ముంపు, పరివాహక ప్రాంతం, సాగునీటి ప్రయోజనాలు మొదలైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని మరీ ప్రత్యామ్నాయాలను పరిశీలించి, ఏది ఉత్తమమైనదో ఎంపిక చేసుకోవాలి. అని మార్గదర్శక సూత్రాలను వెలువరించింది.

‘జల వనరుల వికాసం’పై ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్
ప్రకృతిని భంగం చేస్తూ ఏర్పాటు చేసే ఏ ప్రక్రియనైనా ప్రారంభించేముందు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఈ ప్రాజెక్టు అవసరమా? అవసరమైతే ఇదే తరహాలో పూర్తిస్థాయిలో ప్రత్యామ్నాయాలు లేవా? అన్న అంశం తప్పక పరిశీలించవలసి ఉంటుందని తమ సిఫార్సుల్లో పేర్కొంది.

సుప్రీంకోర్టు ఆదేశాలను, కేంద్ర పర్యావరణ శాఖ, జలమంవూతిత్వశాఖ, ప్రణాళిక సంఘం, జాతీయ కమిషన్ ఇలా అనేక సంస్థలు రూపొందించిన నియమావళులు, మార్గదర్శకాలు, సిఫార్సులను తుంగలోకి తొక్కి ఈ రోజున ఘనత వహించిన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి తుది అనుమతులు లేకుండా, కేసు సుప్రీంకోర్టు పరిశీలనలో ఉందని తెలిసి కూడా, మొండిగా, దూకుడుగా, కక్ష సాధింపు చర్యలో భాగంగా పోలవరం ప్రాజెక్టును కట్టితీరతామని ప్రతిజ్ఞ చేసిమరీ సాగుతోంది. దీని వెనక ఓ కథ ఉంది.

1983లో ఈ ప్రాజెక్టు రిపోర్టును కేంద్ర జల సంఘానికి పంపినా, పక్క రాష్ట్రాలు ఒప్పుకోకపోవడంతో, కేంద్ర జలసంఘం సాంకేతిక ఆమోదం తెలపకపోవడంతో, పర్యావరణ అనుమతులు ఇవ్వకపోవడంతో 2004కు పూర్వం రాష్ట్ర ప్రభుత్వం విసిగి వేసారి ఇక లాభం లేదనుకుని పోలవరానికి ప్రత్యామ్నాయంగా దాటిపూడి, పుష్కరం, చాగల్నాడు లాంటి ఎత్తిపోతల పథకాలను చేపట్టింది. 2004లో వైఎస్‌ఆర్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక ఎలాంటి అనుమతులు లేకపోయినా సరే ప్రాజెక్టు ప్రారంభించమని హుకుం జారీ చేశారు. ఫలితంగా హైకోర్టులో కేసులు, స్టేలు, పర్యావరణమంవూతిత్వ శాఖ అనుమతి, మళ్లీ దాని రద్దు, రద్దుపైన కోర్టు స్టేలు చోటుచేసుకున్నాయి. అనేక అనుమతులు, చివరకు ప్రణాళికా సంఘం అనుమతులు, అన్నీ తాత్కాలికంగా, సుప్రీంకోర్టు తుది నిర్ణయానికి లోబడి ఉంటాయన్న షరతులతో కూడిన అనుమతులు పొందడంలో రాష్ట్ర ప్రభుత్వం తన మేనేజ్‌మెంట్, మేనిప్యులేటివ్ టెక్నిక్స్ ద్వారా కృతకృత్యురాలైంది. ప్రస్తుతం పోలవరం కేసు సుప్రీంకోర్టులో సీరియస్‌గా, యుద్ధవూపాతిపదికన చర్చించబడుతోంది. రిజల్ట్ ఏమోస్తుందా అని అందరూ ఉత్కం ఎదురుచూస్తున్నారు.

ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ‘తన ప్రయోజనాలను’ను దృష్టిలో పెట్టుకుని ఇది వరకే పెట్టిన నాలుగు వేల కోట్ల రూపాయల ఖర్చుకు అదనంగా మరో 4717 కోట్లు ఖర్చుపెట్టడానికి నడుం బిగించింది. ప్రభుత్వ అంచనా ప్రకారం ప్రాజెక్టుకు మొత్తం 16200 కోట్ల రూపాయలు ఖర్చుఅవుతుంది. ఇటీవలే సుప్రీంకోర్టు ఆంధ్రవూపదేశ్, ఒడిసా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను ధర్మారావు మాజీ చీఫ్ ఇంజనీర్ తయారుచేసిన ప్రత్యామ్నాయాలను పరిశీలించమని ఆదేశమిచ్చింది. మిగిలిన రాష్ట్రాలు సుప్రీంకోర్టు సలహాలను పాటించాయి. కానీ మన ప్రభుత్వం పెడచెవినపెట్టి ఇప్పుడు కడుతున్న పోలవరం ప్రాజెక్టును యథాతథంగా ఎలాంటి మార్పుల్లేకుండా నిర్మించాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నది. అన్నట్టు పోలవరానికి శంఖుస్థాపన జరిగింది మాజీ ముఖ్యంత్రి టి. అంజయ్య హయాంలో.
ఇదీ సంగతి
నీటి ప్రాజెక్టులు- అనుమతులు

అంతర్ రాష్ట్ర అంశాలు కలిగిన అంతర్ రాష్ట్ర నదులపైన కట్టే భారీ, మధ్యతరహా, బహుళ ప్రయోజనాల ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు విధిగా పొందాలి. ఈ కింది అనుమతులకు తప్పక పొందాలి.
1. జల వనరుల మంత్రిత్వ శాఖ వారి సాంకేతిక సలహా సంఘం అనుమతి
2. పర్యావరణ అనుమతి, అటవీ సంబంధిత అనుమతి (ఈ రెండు అనుమతులను కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఇస్తుంది)
3.కేంద్ర సంక్షేమ మంత్రిత్వశాఖ-ముఖ్యంగా గిరిజనుల పునరావాసానికి సంబంధించిన అంశాలపై గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ, పంచాయితీరాజ్ మంత్రిత్వ శాఖలు తమ అనుమతులు ఇస్తాయి.
ఈ అనుమతులన్నీ పొందాకే అంతిమంగా ప్రణాళికాసంఘం తను పెట్టుబడులకు అనుమతి (Investment clearence) ఇస్తుంది.

ప్రణాళికాసంఘం అనుమతి లేకుంటే ప్రాజెక్టు నిర్వహణకయ్యే ఖర్చు లో కేంద్రం తనవంతు సహకారం ఇవ్వదు. విదేశీ సంస్థలు ఆర్థిక సహా యం ఇవ్వడానికి ముందుకురావు. చివరకు మన జాతీయ బ్యాంకులు కూడా కేంద్రం కౌంటర్ గ్యారంటీ ఇవ్వకపోతే అప్పులు కూడా ఇవ్వవు.
పొరుగు రాష్ట్రాలకు ఎలాంటి అభ్యంతరం లేకపోయినా, తమ సొంత డబ్బులతో ప్రాజెక్టు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినా సరే, ఆ ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగపడకుండా ప్రజాధనం దుర్వినియోగమవుతుందని కేంద్ర భావిస్తే జోక్యం చేసుకునే అధికారాన్ని రాజ్యాంగం కేంద్రానికిచ్చింది.

-ఆర్.విద్యాసాగర్‌రావు
కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర