తెలంగాణ ప్రాజెక్టులు-సీమాంధ్రకు నీళ్ళు


Mon,September 12, 2011 06:09 PM

తెలంగాణ వస్తే మాకు నీళ్లు రావు అని అమాత్యులు జె.సి. దివాకర్‌డ్డి సెలవిచ్చారు. మీ కామెంట్?

-గొట్టిపర్తి యాదగిరి, ఆలేరు, నల్లగొండ జిల్లాneelu-lijalu-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaఇది పూర్తిగా నిరాధారం- అసత్యం-పైన ప్రాజెక్టులు కట్టితే కిందికి నీళ్లు రాకపోతే, మనపైన (ఆంధ్ర రాష్ట్రంపైన) మహారాష్ట్ర, కర్ణాటకలున్నాయి. మరి కృష్ణా, గోదావరి నదుల్లో మన రాష్ట్రంలోకి ప్రవహించకుండా ఉండాలి. అలా జరుగుతోందా? ఇది కేవలం ‘తెలంగాణ’ అవతరణాన్ని అడ్డుకోవడానికి, సీమాంవూధలోని సామాన్య ప్రజానీకాన్ని భయవూభాంతులకు గురిచేసే ప్రచారం మాత్రమే- పుట్టిస్తున్న పుకార్లు మాత్రమే. అంతర్‌రాష్ట్ర నదులపైన ఒడంబడికలుంటాయి. అవగాహన పత్రాలుంటాయిటిబ్యునల్ ఆదేశాలుంటాయి. కట్టుదాటి ప్రవర్తిస్తే జోక్యం చేసుకోవడానికి కోర్టులుంటాయి. ఇష్టారాజ్యంగా ప్రవర్తించడానికి ఇదేమన్న నియంతృత్వ పరిపాలనా? మన రాష్ట్ర విషయానికి వస్తే తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మన రాష్ట్రంలో ఉన్నాయి.

Supreme-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema మూడు ప్రాంతాలకు సంబంధించిన నది కృష్ణానది. కోస్తాంధ్ర, తెలంగాణకు సంబంధించి గోదావరిపైన ప్రధానమైన ప్రాజెక్టులు జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీ. ఈ నాలుగు అమలులో ఉన్నవి. కృష్ణానదికి ముఖ్యమైన ఉపనది తుంగభద్ర పైన తుంగభవూద ప్రాజెక్టు (కర్ణాటకలో ఉన్నది)- దిగువన రాజోలిబండ ఆనకట్ట (ఎడమ గట్టు కర్ణాటకలో కుడిగట్టు), ఆంధ్రవూపదేశ్‌లో దాని కింద సుంకేసుల ఆనకట్ట (ఇప్పుడు బ్యారేజీ) ఉన్నాయి. గోదావరి విషయానికి వస్తే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, చిట్ట చివరన ధనళేశ్వరం (సర్ ఆర్థర్ కాటన్) బ్యారేజీ ఉన్నాయి. ఇటీవలే నాగార్జునసాగర్ జలాశయం నీటినుపయోగించుకుని కొంతమేరకు నీటినందిస్తూ ఇంకా నిర్మాణం పూర్తి కాని ఎలిమినేటి మాధవడ్డి ప్రాజెక్టు ఉంది.

ఇది ఎత్తిపోతలుమగావిటీ కాలువ (బాగా వరదలు వచ్చినప్పుడు) ప్రాజెక్టు-వీటి కి అదనంగా జూరాలపైన ఆధారపడ్డ భీమా, నెట్టంపాడు, శ్రీశైలంపైన ఆధారపడ్డ కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ, వెలిగొండ, ఎస్‌ఆర్‌బీసీ, హంద్రీనీవా, గాలేరు, నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులు, వీటి అనుబంధ రిజర్వాయర్ కాలువ ప్రాజెక్టులు. అలాగే గోదావరి నదికి సంబంధించిన శ్రీరాంసాగర్ ద్వితీయ దశ, వరదకాలువ, ప్రాణహిత చేవేళ్ల, ఎల్లంపల్లి, దేవాదుల, రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ఎత్తిపోతల పథకాలు, కంతనపల్లి, దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. పోలవరం నిర్మాణంలో ఉన్నా, సుప్రీంకోర్టు అంతిమ తీర్పుపైన దాని భవిష్యత్తు ఆధారపడి ఉంది. పోలవరం రాదేమో అని చేపట్టిన పుష్కరం, తాటిపూడి, వెంకటనగరం పంపింగ్ స్కీం లు పాక్షికంగా అమల్లో ఉన్నాయి.

ఇక గమనించవలసిన విషయమేమంటే అంతర్‌రాష్ట్ర నదులే కాదు, అంతర్ దేశాల నదులపైన ఆయా దేశాల మధ్య జరుగుతున్న ఒప్పందాల మేరకు వాటి నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఒడంబడికలను ఉల్లంఘించి పై దేశాలు కాని, రాష్ట్రాలు కాని తమ ఇష్టం వచ్చినట్లు జలాశయాలు నింపుకుంటే కింది దేశాలకు- రాష్ట్రాలకు నీళ్లు రావు. కనుకనే అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా అంతర్ దేశ, రాష్ట్ర నదుల నిర్వహణకు చట్టబద్ధమైన కంట్రోల్ బోర్డులు ఉంటాయి. ఉదాహరణకు మనదేశంలో సట్లెజ్, బియా స్, రావి నదుల నిర్వహణ కోసం భాక్రా-బియాస్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు జరిగింది. ఏదైనా ఒక ప్రాజెక్టు నుంచి రెండు లేక అంతకుమించి రాష్ట్రాలు లబ్ధిపొందుతూ ఉంటే విధిగా అన్ని రాష్ట్రాల ప్రతినిధులు సభ్యులుగా, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఆధ్వర్యంలో బోర్డును ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆయా రాష్ట్రాల కేటాయింపుల ఆధారంగా ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం, సక్రమంగా ఆ నీరు ఆ రాష్ట్రాలకు చేరేట్టు చూసే బాధ్యత ఆ కంట్రోల్ బోర్డుది.

ఉదాహరణకు తుంగభద్ర ప్రాజెక్టు ద్వారా అటు కర్ణాటకకు, ఇటు ఆంధ్రవూపదేశ్‌కు నీరు సరఫరా అవుతుంది. తుంగభద్ర కంట్రోల్ బోర్డు నీటి బట్వా డా బాధ్యతలను చేపట్టింది. ఈ బోర్డును కేంద్ర వూపభు త్వం ఏర్పాటు చేసింది. కేంద్ర జలసంఘం ఛీఫ్ ఇంజనీ ర్ అధ్యక్షులుగా, కర్ణాటక, ఆంధ్రవూపదేశ్ ప్రతినిధులు సభ్యులుగా ఈ బోర్డు పనిచేస్తోంది.

పంజాబ్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ 1966 లోని సెక్షన్ 79 అనుసరించి ఏర్పాటైన భాక్రా, బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డులో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అధ్యక్షులుగా, పంజాబ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతం, ఢిల్లీ ప్రతినిధులు సభ్యులుగా వ్యవహరిస్తారు. సట్లెజ్, రవి, బియాస్ నదుల వినియోగం తోపాటు భాక్రానంగల్, బియాస్ ప్రాజెక్టులద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు బట్వాడా విషయాలపై బోర్డు చర్చించి నిర్ణయాలు చేస్తుంది. ఇదే విధంగా మనదేశంలో అనేక కంట్రోల్ బోర్డులు, అథారిటీలు అంతర్‌రాష్ట్ర నదీ జలాల బట్వాడా అంశాల అమలు విషయమై ఏర్పాటయ్యాయి. నదీజలాలపై నెలకొనే తగాదాల పరిష్కార నిమిత్తం రాజ్యాంగంలోని 262 అధికరణం ప్రకా రం కేంద్రం జోక్యం చేసుకుని, అవసరమైన పక్షంలో ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయడంలో దోహదపడుతుంది. కృష్ణానది జలాల కేటాయింపుల నిమిత్తం లోగడ బచావత్ ట్రిబ్యునల్ ఏర్పడి తమ ఆదేశాలను వెలువరించిన విష యం పాఠకులకు విదితమే- ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పా టు అయింది. అంతిమ తీర్పు ఇంకా వెలువడవలసి ఉంది.

అదే విధంగా గోదావరి జలాల వినియోగ విషయంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రవూపదేశ్, మధ్యవూపదేశ్, (ఇప్పుడు ఛత్తీస్‌గఢ్), ఒరిస్సా రాష్ట్రాలు పరస్పరం చేసుకున్న ఒడంబడికల ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ తమ అవార్డును ప్రకటించింది. ట్రిబ్యునల్ అవార్డు అంటే సుప్రీంకోర్టు డిక్రీతో సమానం. దానిపైన ఎలాంటి అప్పీలు ఉండదు. అయితే ఏరాష్ట్రమైనా ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా నడుచుకోకుండా, ఆదేశాలను ఉల్లంఘిస్తే సుప్రీంకోర్టు తలుపు తట్టవచ్చు. ఉదాహరణకు అలమట్టి ఎత్తు విషయంలో మన రాష్ట్రం కర్ణాటక పై, మిగులు జలాల ఆధారంగా మనం నిర్మిస్తున్న ప్రాజెక్టులపైన కర్ణాటక సుప్రీంకోర్టు తలుపు తట్టడం, మధ్యంతర ఉత్తర్వులు వెలువరించి, ఈ సమస్యను తేల్చవలసిన బాధ్యతను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌పైన సుప్రీంకోర్టు పెట్టడం జరిగింది.

ఇదేవిధంగా, మహారాష్ట్ర నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు ఇంకా ఇతర కట్టడాలు శ్రీరాంసాగర్‌పై దుష్ప్రభావం చూపెట్టాయని మనం సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఆ కేసుపైన అంతిమ నిర్ణయం ఇంకా వెలువడలేదు. ఇంతకూ చెప్పొచ్చేదేమంటే అంతర్ రాష్ట్ర నదుల నీటి కేటాయింపులు, కేటాయింపుల ప్రకారం అమలు జరిగేట్టు చూడటం వగైరా విషయాల బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఏర్పాటయ్యే సంస్థలు నిర్వహిస్తాయి. ఉల్లంఘించిన సందర్భాల్లోనే కోర్టులు జోక్యం చేసుకుంటాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయితే శ్రీశైలం, నాగార్జున్‌సాగర్ రాజోలిబండ కాలువ ప్రాజెక్టుల నిర్వహణకు విధిగా కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది. (రాజోలిబండపైన కంట్రోల్‌బోర్డు ఏర్పాటు విషయంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇదివరకే నిర్ణయం తీసుకుంది) ఎందుకంటే ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా నీరు ఇటు తెలంగాణకు, అటు సీమాంధ్ర రాష్ట్రాలకు చెందిన ప్రాజెక్టుల కేటాయింపుల ఆధారంగా నీటి బట్వాడా జరుగుతుంది. కేటాయింపులకు మించిగాని ఎక్కువగా గాని ఆయా రాష్ట్రాలకు నీరు బట్వాడా జరుగదు. ఒకవేళ ఉల్లంఘన జరిగితే కోర్టుల జోక్యం తప్పనిసరి అవుతుంది. ఇప్పుడు దేశంలో ఉన్న వ్యవస్థ ప్రకారం ఉమ్మడి ప్రాజెక్టులు కాకుండా కేవలం ఒక రాష్ట్రానికే నీరందిస్తున్న ప్రాజెక్టుపైన అజమాయిషీ కంట్రోల్ బోర్డు అధీనంలో లేదు. కాని అంతర్ రాష్ట్ర నదులపైన వెలసిన ప్రాజెక్టుల విషయంలో ఆయా రాష్ట్రాలు కేవలం తమ అజమాయిషీలో ఉండటం మూలంగా ఒడంబడికలు, ట్రిబ్యునల్ ఆదేశాలు ఉల్లంఘిస్తున్న ఫిర్యాదులు ఎక్కువవుతున్న పరిస్థితులను గమనించి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మొత్తం బేసిన్ లోని అన్ని ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత కోసం చట్టబద్ధమైన సంస్థ ఉండాలని ప్రతిపాదించింది.

ట్రిబ్యునల్ ఆదేశాలు అంతిమంగా వెలువడితే కృష్ణానదిలోని అన్ని ప్రాజెక్టులపై అజమాయిషీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఏర్పాటయ్యే చట్టబద్ధమైన సంస్థదే అవుతుంది. చాలా సమస్యలకు ఇది పరిష్కారమని నిపుణులు భావిస్తున్నారు. మన రాష్ట్రంలో నీటి విషయంలో ఏర్పడ్డ అనేక అవకతవకలు దోపిడీ, దౌర్జన్యాలు, అన్యాయాలను దృష్టిలో వుంచుకొని ఆంధ్రవూపదేశ్ సమైక్యంగా ఉన్నా, లేక తెలంగాణ ఏర్పడ్డ రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి నదులపైన అన్ని ప్రాజెక్టుల నిర్వహణ కోసం చట్టబద్ధమైన సంస్థ ఏర్పాటు చేయాలని శ్రీ కృష్ణ కమిటీ కూడా సిఫార్సు చేసింది. త్వరలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని, తెలంగా ణ, సీమాంధ్ర ప్రాజెక్టుల నీటి కేటాయింపుల విషయంలో ఎవరికీ అన్యా యం జరుగకుండా, నియమనిబంధనల ప్రకారం ట్రిబ్యునల్ ఆదేశాలననుసరించి అంతర్ జాతీయ న్యాయసూవూతాలు, జాతీయ జలవిధానం, సహజ న్యాయసూవూతాల ప్రకారం కృష్ణా, గోదావరి జలాలు సక్రమంగా రైతుల పంటపొలాలకు అంది ఆయా రాష్ట్రాలను సుభిక్షం కావిస్తాయని ఆశిద్దాం. అనవసరంగా నీటి విషయంలో అపోహలు సృష్టించవద్దని రాజకీయ నాయకులకు, కుహనా మేధావులకు వినవూమంగా వినతి.

జలవివాదాలు
రాజ్యాంగంలోని 262 అధికరణంలో అంతర్ రాష్ట్ర నదీ జలాల తగాదాల పరిష్కారం కోసం రెండు అంశాలను పొందుపరచటం జరిగింది.

ఒకటి-అంతర్‌రాష్ట్ర నదీ జలాల వినియోగం, పంపకం, నియంవూతణ విషయంలో ఏదైనా తగాదా ఏర్పడితే దాన్ని పరిష్కరించే నిమిత్తం పార్లమెంట్ చట్టం చేయవచ్చు. రెండు- పైన చెప్పిన తగాదాల విషయంలో సుప్రీంకోర్టుగానీ, ఇతర కోర్టులుగానీ జోక్యం చేసుకోరాదని పార్లమెంట్ చట్టం చేయవచ్చు. ఈ 262 అధికరణం కింద పార్లమెంట్ 1956 సంవత్సరంలో అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం (ఇంటర్ స్టేట్ వాటర్ డిస్‌ప్యూట్ యాక్ట్) రూపొందించింది.

ఆ చట్టంలోని సెక్షన్ 3 ఏం చెప్పుతోందంటే..
‘పరాయిరాష్ట్రం చేసే లేక చేయపోయే చట్టం వల్ల కానీ అధికారిక చర్యల మూలంగా కానీ అంతర్ రాష్ట్ర జలాల వినియోగం, పంపకం నియంవూతణ విషయంలో తమ అధికారాలను అమలు చేయడంలో ఒక రాష్ట్రం లేక ఆ రాష్ట్ర సంబంధిత సంస్థ విఫలంకావడం కారణంగా కానీ, తమతో ఆ పరా యి రాష్ట్రం చేసుకున్న ఒప్పందం ప్రకారంగా కార్యక్షికమాలు అమలు జరగని సందర్భం కానీ, ఆ పరాయి రాష్ట్రంతో తమ రాష్ట్రానికి నీటి తగదా ఏర్పడిందని లేక ఏర్పడబోతుందని, ఆ తగాదా మూలంగా తమ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లే అవకాశముందని అనిపించినప్పుడు ఆ రాష్ట్రం నీటి తగాదాని పరిష్కరించేందుకు న్యాయమండలి ఏర్పాటు చేయమని కేంద్రాన్ని కోరవచ్చు.

సెక్షన్ 4లో ఏముందంటే ...
సెక్షన్ 3 కింద ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం నీటి తగాదాని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తేస్తే, చర్చలు, సంప్రదింపుల ద్వారా తగాదా పరిష్కారం సాధ్యం కాదని కేంద్రానికి అనిపిస్తే కేంద్ర ప్రభుత్వం అధికార పత్రం (official gazette)ద్వారా ఆ నీటి తగాదా పరిష్కార నిమిత్తం న్యాయమండ లిటిబ్యునల్)ని ఏర్పాటు చేయవచ్చు. ఇప్పటివరకు మనదేశంలో ఐదు జలవివాద ట్రిబ్యునల్స్ ఏర్పడ్డాయి. అవి కృష్ణా, గోదావరి, నర్మద, కావేరి, రావి- బియాస్ ట్రిబ్యునళ్లు.

-ఆర్ .విద్యాసాగర్ రావు
కేంద్ర జల సంఘం మాజీ ఛీఫ్ ఇంజనీర్


35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

country oven

Featured Articles