నీళ్లు నిజాలు


Mon,September 12, 2011 06:12 PM

వారం వారం జలవిజ్ఞానం

neelu-lijalu-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaబిరబిరా కృష్ణమ్మ తరలిపోతుంటుంది. జలజలా గోదారి ధవళేశ్వరం ఆనకట్టవుతుంది. ముక్కారు పంటలు కాలువలకు కాలడ్డం పెట్టి మళ్లించుకునేవారు నీళ్ల తీర్పరులవుతారు. ఆంధ్రవూపదేశ్ జలవిధానం మొత్తం డెల్టా చుట్టూ తిరుగుతుంటుంది. గోదావరి బేసిన్ కృష్ణలోకి, కృష్ణ బేసిన్ పెన్నలోకి ప్రవహించడం వెనక నీళ్లలో దాగిన నిజాపూన్నో ఉంటాయి. అసత్యాలు, అర్థసత్యాలు ప్రవహించి నదీ జలాలను కలుషితం చేస్తుంటాయి. తెలంగాణ రెండు వేపులా కృష్ణా గోదావరుల జలసిరి పారుతుంటుంది. కానీ, స్తన్యం దక్కని శిశువు మాదిరి తెలంగాణ నీళ్లకు నోచుకోదు. పడావు భూములు పారవు. పాలమూరు తల్లుల పాలెండిపోయే కరువు పక్కన నదిని వెక్కిరిస్తుంది.

తెలంగాణకు నీటి కేటాయింపుపూన్ని? దక్కిన దక్కాల్సిన కట్టిన ప్రాజెక్టుపూన్ని? కట్టని ఆనకట్టపూన్ని? నీళ్లంటే నిప్పే. నీరు పల్లమెరుగు.. నిజం తెలంగాణకు తెలుసు.. ఏది నిజం? ఏది నిప్పు? ఆర్డీఎస్ తూము బద్దలు కొడ్తాందుకు? వెల్లోడి పాలనలో పంచవర్ష ప్రణాళికలో నమోదైన ప్రాజెక్టులేవీ? ఎడమకాలువ ఎందుకు కాదు? కుడి కాలువ ఎందుకు నిండుగా పారుతుంది? నల్లగొండ ఫ్లోరైడ్ దుఃఖానికి హేతువు ఏమిటి? నిప్పు లాంటి నీళ్ల నిజాల లెక్కలు తేలాలిప్పుడు. దుమ్ముగూడెం లోగుట్టు విప్పాలిప్పుడు? తెలంగాణ నిప్పును రాజేసింది.. రాజేసేది నీళ్లే.. జీవికకు మూలమైన నీటి నిజాలను వెలుగులోకి తేవడానికి ఇక నుంచి వారం వారం.. మీరు అడగండి. ఆర్ విద్యాసాగర్‌రావు చెబుతారు.. వారం.. వారం ఇక ‘నీళ్లు-నిజాలు’

జల సాగరం
ఆర్ విద్యాసాగర్‌రావు పేరులో సాగరం ఉంది. సాగరం అంటేనే అపార జలరాశి. జల విజ్ఞానంలో ఆర్. విద్యాసాగర్‌రావు అపార విజ్ఞాన రాశి. మూడు దశాబ్దాలకు పైగా ఆయన నీటి వనరుల్లో మునిగి తేలారు. దేశదేశాల నదీనదాలు, జలాలు, వాడకం, ప్రణాళిక, నిర్వహణ, అభివృద్ధి రంగాల్లో ఆయన నిపుణులు. చిటికెన వేళ్లపై నీటి లెక్కలు కట్టగలిగిన జల మేధావి. తెలంగాణ సాగునీటి రంగంలో జరిగిన, జరుగుతున్న అన్యాయాలను, నీటి వనరుల వివక్షను సాకల్యంగా ఎత్తిచూపిన వారు రామరాజు విద్యాసాగర్‌రావు. కేంద్ర జలసంఘం చిరునామాగా ఆయన అనుభవం జలవనరులపై సాధికారత సాధించి పెట్టింది.

ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన ఈ జలతరంగం ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్షికమానికి సలహాదారు దాకా ఎదిగిన శిఖరం. ఆయన కవి, నాటకకర్త, నాటక ప్రయోక్త కూడా. అందుకే కష్టతరంగా ఉండే జలదోపిడీ పదజాలాన్ని సరళతరం చేసి, జల రాజకీయాలను సూటిగా, స్పష్టంగా, ఆకర్షణీయంగా అనేక పత్రికలలో వివరించ గలిగారాయన. అందుకే జలవనరుల మీద పాఠకుల నుంచి ప్రశ్నలు కోరుతున్నాం. క్యూసెక్కు అంటే ఏమిటి నుంచి, ఇచ్చంపల్లి ప్రాజెక్టు లాంటి భారీ ప్రశ్నల దాకా..పశ్నలు మీవి. మీ సమస్త సందేహాలను తీర్చే పని ఆర్. విద్యాసాగర్‌రావుది. వారం వారం.

‘నమస్తే తెలంగాణ’ పాఠకుల కోసం.. నీళ్లు-నిజాలు
-ఎడిటర్
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా: 8-2-603/1/7,8,9 కృష్ణాపురం, రోడ్‌నెం 10 బంజారాహిల్స్, హైదరాబాద్-34
ఈ మెయిల్: editpage@namasthetelangaana.com

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

country oven

Featured Articles