అధికారికంగా విమోచన దినోత్సవం


Fri,September 14, 2012 11:18 PM

CH-Vidyasagarrao
జతీయ జెండాకున్న ప్రాధాన్యం అందరికి తెలుసు. ప్రపంచంలో ఏ దేశమైనా తమ జాతీయ పతాకాన్ని వారి సార్వభౌమిక అధికారానికి చిహ్నంగా భావిస్తుంది. అంతేకాదు దాని ఔన్నత్యం కోసం ప్రజలు ప్రాణాలను తృణవూపాయంగా భావిస్తారు. ఆ పతాకం ప్రజల గుర్తింపుతో పాటు దేశ సరిహద్దులు, భౌగోళిక పరిస్థితులే కాకుండా జాతి మనుగడ, ప్రజల సామాజిక, ఆర్థిక తదితర పరిస్థితులతో ముడిపడి ఉంటుంది. దీంతోపాటు ప్రపంచంలోని ఇతర దేశాల మధ్య తలెత్తుకుని నిలబడేలా చేస్తుంది. ఆ దేశ పతాకాన్ని రూపొందించుకోవడం, దాని చరిత్ర పూర్వాపరాలతో పాటు ఒక దేశంలో తమ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రోజును అత్యంత ప్రాధాన్యమైనదిగా భావిస్తారు. దీని ఆరోహణ, అవరోహణ తదితర పద్ధతులన్నీ నిబంధనలకు లోబడి జరుగుతాయి. అందులో ఏదైనా లోపం జరిగితే బాధ్యులు శిక్షార్హులౌతా రు. జాతీయ పతాకానికి సంబంధించి అత్యున్నతకోర్టు ఉత్తర్వులు వెలువరించి, దాని పవివూతతను కాపాడడానికి ప్రజలను అప్రమత్తం చేసిన సందర్భాలున్నాయి.

మన జాతీయ పతాకం తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు అధికారికం గా ఎగిరింది అంటే.. ఇప్పటికీ చాలామంది అమాయకంగా 1947 ఆగస్టు15 అనే చెబుతారు. అంతేకాదు మీకు స్వాతంత్య్రం ఎప్పుడొచ్చిందని అడిగితే, చిన్న పిల్లలైనా తడుముకోకుండా అదే సమాధానం చెబుతారు. ఈ జవాబు సరైనదేనా? అంటే దానిపైన చర్చించుకోక తప్పదు. ఈ చర్చలను ముగించాలంటే ఆగస్ట్టు15తో పాటు సెప్టెంబర్17 నాడు కూడా ప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరపాలి. ఈ ప్రాంతం 1948 సెప్టెంబర్ 17న విమోచన పొందిందని పాఠ్యాంశాల్లో చేర్చి, పిల్లలను సముదాయించకపోతే చిచ్చరపిడుగులుగా చెలరేగక తప్పదు. ఎందుకంటే దాని ప్రాధాన్యం అంత ఉన్నతమైనది. స్ఫూర్తినిచ్చేది.
సెప్టెంబర్ 17 దగ్గర పడుతుంటే అసలు ఈ రోజుకున్న ప్రాధాన్యం ఏమిటి అనే చర్చ ప్రారంభమైంది. ఒక వర్గాన్ని సంతృప్తి పరిచే ప్రక్రియ ప్రారంభమైంది. అందరూ ఈ దినాన్ని విమోచన దినంగా భావిస్తే, కొందరు విలీన దినంగా, మరికొందరైతే దీన్ని విద్రోహ దినంగా పాటించాలని ప్రకటిస్తున్నారు. అయితే ఆగస్టు పర్వదినాన కూడా నల్లజెండాలు ఎగరేసి మనకు అసలు స్వాతంవూత్యమనేది రాలేదని ఉద్యమించే వారిని కూడా చూస్తుంటాం. అయితే ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వమే జాప్యం చేయకుండా ఈ దినాన్ని అధికారిక ఉత్సవంగా నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. అయి తే ప్రభుత్వం మాత్రం యథావిధిగా ఓటు బ్యాంకు రాజకీయాలు చేసుకుంటూ, తెలంగాణ ఉద్యమకారులకు ఇది తొలిమెట్టు అవుతుందనే భయంతో సమస్యను దాటవేస్తున్నది.

వందలాది మంది స్వాతంత్య్ర సమరయోధులు, అమరులు వందేమాతరం రామచందర్‌రావు, నిజాంపై బాంబు విసిరిన పవార్ తదితరులు ఎలాంటి అభ్యంతరం లేకుండా సెప్టెంబర్ 17 ఉత్సవాల్లో పాల్గొన్నారు. వారి ప్రసంగాల్లో దీని ప్రాధాన్యాన్ని వివరించారు. భారత దేశానికి స్వాతంత్య్రం రాకముందే 1938లో ఉస్మానియా యూనివర్సిటీలో మత ఉన్మాదులపై బావుటా ఎగురవేసి, నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా హైదరాబాద్ సంస్థానంలో వందేమాతరం ఉద్యమాన్ని రగిలించి చరివూతలో నిలిచిపోయారు. ఏది ఏమైనా దీన్ని ఏ దినంగానైనా అధికారికంగా పేర్కొనాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే భారత ప్రభుత్వం ఈరోజును ‘లిబరేషన్ డే’గా చూపింది. బొల్లారంలో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 మాసాల రెండు రోజులకు త్రివర్ణ పతాకాన్ని అధికారికంగా ఎగిరేశారు. అంతవరకు భారత ప్రభుత్వం నిజాంతో 1947 నవంబర్29న కుదుర్చుకున్న ‘యధాతథ’ ఒప్పందం ప్రకారం త్రివర్ణ పతాకం ఎగరేసే అవకాశం లేదు. కాబట్టి ఈ రోజుకు ఏదో ఒక నామకరణం చేయక ఎన్నాళ్లు తప్పించుకుంటారన్నది ప్రశ్న. హైదరాబాద్ సంస్థాన విమోచన కేవలం పోలీస్ చర్యనే కాకుండా, ప్రజల పోరాట ఫలితంగా సాగింది. నాడు ప్రతి గ్రామంలో నిజాం వ్యతిరేక పోరాటాలు జరిగాయి. మారుమూల ప్రాంత ప్రజలు కూడా దృఢచిత్తులై సైనికంగా పోరాడిన చరిత్ర అనన్య సామాన్యం.ఈ తరం వారికే కాకుండా రాబో యే తరాలకు నాటి అమరవీరుల చరిత్ర ప్రేరణదాయకం. ఈ ఉద్యమ చరివూత లో కనిపించే సాహస ఘట్టాలను, కేవలం ఒక పార్టీకో,సిద్ధాంతానికో, వర్గాని కో ఆపాదించి విశ్లేషించుకోలేము. శ్రీ దేశాయ్, సుదర్శన్ గారు రాసిన పుస్త కం ‘ది సాగా ఆఫ్ లిబరేషన్ స్ట్రగుల్’లో ఈ ఉద్యమం బ్రిటిష్-నిజాం ఒప్పం దం 1800 సంవత్సరంలో జరిగినప్పటి నుంచి ప్రారంభమైందని వివరించా రు. హిందువులు, ముస్లింలు, ఆర్యసమాజ్, కాంగ్రెస్, కమ్యూనిస్టులతో పాటు ఏ సిద్ధాంతానికి, ఏ వర్గానికి సంబంధించని సామాన్య ప్రజలు దోపిడీ, నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని నడిపారు. దేశవ్యాప్తంగా ప్రజ్వరిల్లిన స్వాతంత్య్ర పోరాటం అంతర్జాతీయంగా వెల్లివిరిసిన వివిధ విప్లవ పోరాటాల ప్రభావం సహజంగా హైదరాబాద్ విమోచనోద్యమంపైన పడింది.

కాబట్టి ఇది కేవలం పోలీసు చర్య వల్లనే భారతదేశం విలీనమైందని కానీ, ప్రజల అభివూపాయాలకు భిన్నంగా ఈ చర్య జరిగిందని భావించి దాన్ని విద్రోహదినం అనడం సమంజసం కాదు. 1957లో తుర్రేబాజ్‌ఖాన్, అల్లావుద్దీన్ తదితరులు హైదరాబాద్‌లోని రెసిడెన్సీపైన జరిపిన తిరుబాటును, అదే విధంగా రాంజీ గోండు, కొమురం భీంల సాహసోపేత పోరాటాన్ని, ‘ఇవూమోజ్’ పత్రిక సంపాదకుడు షోయబుల్లా ఖాన్ బలిదానాన్ని తక్కువగా అంచనా వేయలేం. పర్కాల, బెహరాన్‌పల్లి, రేణిగుంట, గాలిపెల్లి తదితర ప్రాంతాల్లో స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటాలను, వేలాదిమంది ప్రాణత్యాగాలను పోలీస్‌చర్యతో ముడిపెట్టలేము. అదేవిధంగా ఈ ప్రాంతం విమోచన, భారతదేశంలో విలీనం అనే పదజాలాన్ని అరమరికలు లేకుండా ఉపయోగించాలి. కానీ ఏ విధంగానైనా ‘విమోచన’ అనే పదాన్ని తప్పించాలనే ఆత్రుత మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాల నిర్ణయం తర్వాత సరైంది కాదని స్పష్టమవుతుంది.

రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ జరిగిన తర్వాత హైదరాబాద్ సంస్థానంలోని కొన్ని జిల్లాలు మహారాష్ట్రలోను, కొన్ని జిల్లాలు కర్ణాటకలోనూ కలిశాయి. మహారాష్ట్ర ప్రభుత్వం 2001 మే 4న జీవో 2000/176/సెక్షన్-1 ఉత్తర్వులు జారీచేసింది. మహారాష్ట్రలో కలిసిన ఎనిమిది జిల్లాలలో- సెప్టెంబర్ 17న స్వాతంత్య్ర సమరయోధులు నిజాంకు వ్యతిరేకంగా పోరాడారని, దాన్ని హైదరాబాద్ ముక్తి సంగ్రామ్‌గా గుర్తించారని, తర్వాత పోలీస్‌చర్య ద్వారా విమోచన కలిగిందన్నారు. దీనికి యాభై ఏళ్లు ముగిసిన సందర్భంగా స్వర్ణ మహోత్సవ దివస్‌గా, అన్ని జిల్లాల్లో ‘మరట్వాడా ముక్తి సంగ్రామ్ దివస్’గా అధికారికంగా ఉత్సవాలు జరపాలని, ఆరోజు సెలవుగా ప్రకటించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఔరంగాబాద్, జాల్నా, నాందేడ్, పర్భ ని, లాతూరు, భీడ్, ఉస్మానాబాద్, హాంగోలీ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. అవి అమలవుతున్నాయి. అదే విధంగా కర్ణాటక ప్రభుత్వం 2009 సెప్టెంబర్ 17న తమ రాష్ట్రంలో కలిసిన నాలుగు జిల్లాలు గుల్బర్గా, బీదర్, రాయచూర్, కొప్పల్‌లో సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచన దినంగా ప్రకటించింది. ఉత్సవాలు జరుపుకోవాలని ప్రతి జిల్లాకు నిర్వహ ణకు గాను లక్షలాది రూపాయలు కేటాయించింది. ప్రతి సంవత్సరం ఈ రెండు రాష్ట్రాల్లో ఉత్సవాలు జరుపుకుంటుంటే తెలంగాణలోని జిల్లాల్లో దీనిపై ఇంకా చర్చించుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.

మహారాష్ట్ర, కర్ణాటకలో లేని అభ్యంతరాలు ఇక్కడ ఎందుకు? హైదరాబాద్ సంస్థానంలో పెద్ద ప్రాంతమైన తెలంగాణలో అధికారికంగా విమోచన దినాన్ని ప్రకటించాలని కోరితే సంకోచించడం ఎందుకు? అకారణంగా నిర్ణయాన్ని ఏళ్లతరబడి వాయిదా వేయ డం అప్రజాస్వామికం. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏమంటే, రాష్ట్ర శాసనసభలో 304 కింద ఇచ్చిన నోటీసుకు ముఖ్యమంత్రి 2004 ఆగ స్టు 5న లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. ఆంధ్రవూపదేశ్ అవతరించిన రోజు నుంచి విముక్తి దినం జరుపుకోవడం లేదన్నారు. అయితే కర్ణాటక, మహారాష్ట్రాల్లోని జిల్లాల్లో సెప్టెంబర్ 17నాడు ప్రభుత్వమే ఉత్సవాలు నిర్వహిస్తున్నందని ప్రకటించారు. కానీ ఇక్కడ జరుపకపోవడానికి కారణాలు చెప్పలేదు. నాటి రాష్ట్ర హోంమంత్రి జానాడ్డి ఈ ఉత్సవాలు జరపాలని ముఖ్యమంవూతికి లేఖ రాయడం గమనార్హం. అయితే ఒకటి, రెండు తప్ప అన్ని రాజకీయ పార్టీలు తమ కార్యాలయాల్లో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీచేసి సెప్టెంబర్ 17ను విమోచ న దినంగా ప్రకటించాలి. అధికారికంగా ఉత్సవాలు నిర్వహించి వీర తెలంగాణ పోరా ట ఘట్టాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి.
.

-సీహెచ్. విద్యాసాగర్‌రావు
కేంద్ర మాజీ మంత్రి

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

country oven

Featured Articles