పోలవరం - పాలమూరు


Sun,August 26, 2012 11:45 PM

ఈ మధ్య ముఖ్యమంత్రి గోదావరి జిల్లాల్లో ఇందిరమ్మ బాట సందర్భంగా పర్యటిస్తూ గోదావరిలో వరదలొస్తూ వందలాది టీఎంసీల నీళ్లు వృధాగా సమువూదంలోకి కలుస్తున్నాయని చెప్తూ, పోలవరం నిర్మించి ఉంటే గోదావరి నీటిని ఉపయోగించుకునేవాళ్ళమని చెప్పారు. పోలవరం కట్టకుండా కేసీఆర్ అడ్డుపడుతున్నారని ఆయన ప్రాతినిధ్యం వహించే మహబూబ్‌నగర్ జిల్లాకు పోలవరం కడితే నీళ్లు అంది ఎడారి కాకుండా ఉండేదని, కేసీఆర్‌కు ఈ విషయంలో అవగాహన లేదని అన్నారు. పోలవరానికి, గోదావరి వరదలకు- కృష్ణాబేసిన్‌లోని మహబూబ్‌నగర్ ఎడారిగా మారడానికి ఏం సంబంధమో అర్థం కావడం లేదు. వివరించండి.
-నంబి గోపాలాచార్యులు, అమనగల్లు, మహబూబ్‌నగర్ జిల్లా లింకులకేం! తలచుకుంటే దేన్నుంచి దేనికైనా ముడిపెట్టొచ్చు. వినేవాడు అదేదో ఐతే చేప్పేవాడు చేట భారతం చెప్తాడని సామెత. గోదావరి వరదలకు పాలమూరు జిల్లా కరవుకు లింకు ఉన్నదంటే ఉన్నది. లేదంటే లేదు. ప్రత్యక్షంగా లేదు. పరోక్షంగా ఉన్నది. విషయానికి వస్తే, గోదావరి నదిలో ప్రతి సంవత్సరం వరదలు వస్తూ ఉంటాయని భద్రాచలం దగ్గర ప్రమాద ఘంటికలు మోగిస్తూ ఉంటారని, ప్రతిఏటా మూడు వేల టీఎంసీల నీరు సమువూదంలోకి వృధాగా పోతున్నదని చెప్తారు. ఒక వైపు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు తాగు, సాగునీరు లేక కటకట పడుతూంటే, ఏటా విలువైన జలరాశి సముద్రం పాలవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. గోదావరిలో మూడువేల టీఎంసీలు, కృష్ణాలో వేయి టీఎంసీలు వృధా అవుతున్నాయని ప్రకటనలు గుప్పిస్తూంటాయి.

గోదావరిలో ప్రవహించే నీళ్ళు, సమువూదంలో కలిసే నీళ్లు అన్నింటినీ ఒక్క చుక్క కూడా వృధా కాకుండా ఒడిసిపట్టుకోవడం సాధ్యంకాదని అర్థం చేసుకోవాలి. మనం వినియోగించుకోగలిగే జలాల గురించి మాత్రమే మాట్లాడుకుంటే అర్థవంతంగా ఉంటుంది. గోదావరిలో 75 శాతం విశ్వసనీయత ఆధారంగా లభించే మన రాష్ట్ర వాటా సుమారు 1480 టీఎంసీలు. ఇందు లో సగం నీళ్లను వాడుకోవడానికి మనం వసతులు ఉంటే భారీ, మధ్యతరహా, చిన్నతరహా ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకున్నాం. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, నిజాంసాగర్, కిన్నెరసాని, సింగూరు, కడెం ధవళేశ్వరం బ్యారేజీ వంటి భారీ ప్రాజెక్టులు, ఘనపురం, కౌలాసనాల, నల్లవాగు, పోచారం, ఖానాపూర్, స్వర్ణ, సాత్‌నాల నామడుగు, శనిగరం, రామప్ప చెరువు, శాలివాగు, అప్పర్‌మానేరు, బొగ్గులవాగు, చెలమలవాగు, వట్టివాగు, లక్నవరం, పెద్దవాగు వంటి మధ్యతరహా ప్రాజెక్టులు కట్టుకున్నాం. ఇవిగాక అనేక చెరువులు, ఎత్తిపోత పథకాలు నిర్మించుకుని సుమారు 700 టీఎంసీలు దాక వినియోగించుకోవడానికి అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నామని ప్రభుత్వ గణాంకాలే వివరిస్తున్నాయి. సమస్యల్లా మిగతా 780 టీఎంసీల వినియోగ విషయమే. దీని గురించే ప్రభుత్వం అనేక పథకాలను రూపొందించింది. అవి వివిధ దశల్లో ఉన్నాయి. ఇవన్నీ పదేళ్లకో, ఇరవై ఏళ్లకో పూర్తవుతే గోదావరిలో లభించే 75 శాతం విశ్వసనీయత కలిగిన జలాలను ఉపయోగించుకో గలుగుతాం.

మరప్పుడు గోదావరిలో వచ్చే వరదనంతటినీ మనం వాడుకుంటామనుకోవచ్చా? అప్పుడింక గోదావరిలో వరదలు రావా? ఉధృతి ఉండదా? జననష్టం, ఆస్తి నష్టం ఉండదా? ఉంటే అప్పుడూ వరదలు వస్తాయి. కాకపోతే ఒడిసిపట్టుకోవడానికి మన దగ్గర నికర జలాలుండవు కాబట్టి వరద నీటిని వీలైనంత మేరకు, ఇతర కొరత ఉన్న నీటి బేసిన్ల (కృష్ణా, పెన్నా, కావేరి)కు తక్కువ ఖర్చుతో, చట్టపరమైన, పర్యావరణ, సామాజిక ఆర్థిక వగైరా సమస్యలు తలెత్తకుండా, ఆధునిక పరిజ్ఞానంతో తరలించేందుకు ప్రయత్నాలు జరగవలసి ఉంటుంది. అయితే ఈ నీళ్ళను పూర్తిగా ఒడిసిపట్టుకోవడం అంత తేలికగా సాధ్యం కాదు. ప్రస్తుతం మనం ఆలోచించవలసింది ఆంధ్రవూపదేశ్ ఏర్పడి 56 సంవత్సరాలైనా, బచావత్ అవార్డు (గోదావరి నీటి పంపకం జరిగి) 40 సంవత్సరాలు పూర్తికావొచ్చినా మనకు లభించిన 1480 టీఎంసీల నికర జలాలను ఇప్పటిదాక ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నామనేది మాత్రమే. కట్టుకున్న శ్రీరాంసాగర్, నిజాంసాగర్, అప్పర్‌మానేరు ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయా? అనుకున్నట్టుగా 700 టీఎంసీల వినియోగమవుతుందా అన్నది వేరేమాట. అవి ఎండిపోవడానికి, నీరు సక్రమంగా రాకపోవడానికి, వచ్చినా పూర్తి ఆయకట్టుకు నీరందకపోవడానికి గల కారణాలు వేరు. ప్రస్తుతం మనం చర్చించు కుంటున్నది ఇంకా మిగతా నీటిని వాడుకోవడానికి, ప్రభుత్వం హమీలు గుప్పించి, కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టినా, సంవత్సరాలు గడిచినా ఏర్పడని వసతుల మాట.

ఇప్పటి పరిస్థితి ఏమిటంటే- మహారాష్ట్ర నుంచి శ్రీరాంసాగర్‌లోకి చుక్కనీరు రావడంలేదు. కనుక పోచంపాడు ఎండిపోయి ఉన్నది. మంజీరకు నీళ్ళులేవు కాబట్టి సింగూరులోకి నీళ్ళు రాలేదు. నిజాంసాగర్ వెల ఉన్నది. శ్రీరాంసాగర్ దిగువన ఎల్లంపల్లి పూర్తికాలేదు. కనుక నీటిని నిలువుదల చేసే ప్రసక్తిలేదు. దేవాదుల అపసోపాలు పడుతూ ఉంది. శ్రీరాంసాగర్ వరదకాలువ కొంత మేరకు పూర్తయినా నీటిని నిలువ ఉంచే మిడ్‌మానేరు ప్రాథమిక దశలోనే ఉన్నది. శ్రీరాంసాగర్ ద్వితీయ దశ కాలువలు పూర్తి కాలేదు. ఇప్పుడు వచ్చే వరదలు, ఆదిలాబాద్ జిల్లా నుంచి. అవన్నీ అంతిమంగా ప్రాణహిత ద్వారా గోదావరిలో కలుస్తాయి. మహారాష్ట్రలో, ఛత్తీస్‌గఢ్‌లో కురిసే భారీవర్షాల వల్ల గోదావరికి ప్రధానమైన మూడు ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరిలలో వరదలు వచ్చి వాటిని ఒడిసిపట్టుకోవడానికి ఎలాంటి రిజర్వాయర్లు లేక నీరంతా సమువూదంలో కలుస్తోంది. సుమారు 350 టీఎంసీలు ప్రాణహిత ద్వారా, 300 టీఎంసీలు ఇంద్రావతి ద్వారా, 200 టీఎంసీలు శబరి ద్వారా నికర జలాలు గోదావరిలో మన రాష్ట్రవాటాకు అందుతున్నాయి. వీటిని ఉపయోగించుకునే విషయంలో ఇప్పటిదాక మనం చేసిన ప్రయోగాలు, ప్రయత్నాలు ఏ మేరకు ఫలితాన్నిచ్చాయి?

మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఆదిలాబాద్ జిల్లాలో కడుతున్న మధ్యతరహా ప్రాజెక్టులను వదిలేసి తలపెట్టిన భారీ ప్రాజెక్టుల గురించి మాత్రమే ముచ్చటించుకుందాం. మొదట 160 టీఎంసీలు వినియోగించుకునే ప్రాణహిత, చేవెళ్ల ఎత్తిపోతల పథకం, తర్వాత దేవాదుల పథకం 50 టీఎంసీలు వినియోగంతో ప్రారంభించి ఈ ప్రాజెక్టును 38 టీఎంసీలకే కుదించారు. ఆతర్వాత కంతనపల్లి ప్రాజెక్టు-100 టీఎంసీల వినియోగించుకోగల ఈ ప్రాజెక్టును ప్రథమ దశగా 50 టీఎంసీలకే ప్రభుత్వం అమోదం తెలపటం విశేషం. కిందికి వస్తే దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం, పోలవరం ఎత్తిపోతల పథకం-ఇవి ఒక్కొక్కటి 16.50టీఎంసీల సామర్థ్యం. ఇవి నిర్మాణంలో ఉన్న తెలంగాణ ప్రాజెక్టులు.

అంతిమంగా అన్నిప్రాజెక్టులను మొదట అనుకున్న విధంగా పూర్తిచేస్తే 343 టీఎంసీలను మాత్రమే వినియోగించుకోగలం. కంతనపల్లి, దేవాదుల వచ్చాయి కాబట్టి, ఇచ్చంపల్లి ప్రసక్తి ఉండదు. ఇకపోతే ఆంధ్రలో పోలవరం 301 టీఎంసీల వినియోగంలో తలపెట్టుతున్నారు. దీన్ని కూడా కలుపుకుంటే సుమారు 645 టీఎంసీల వినియోగమవుతుంది. మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్నతరహా ప్రాజెక్టులు, పారిక్షిశామిక అవసరాల కోసం ఏర్పాటు చేసే వసతులు వగైరా అన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే లభ్యమయ్యే మొత్తం, నికర జలాలను వాడుకున్నట్టవుతుంది. ఇక ప్రభుత్వ చిత్తశుద్ధి గురించి ఆలోచిస్తే- ప్రాణహిత ప్రాజెక్టును వైఎస్‌ఆర్ స్వయంగా స్వాగతించి వెంటనే చర్యలు తీసుకొమ్మని ఆదేశిస్తే దేవుడు వరమిచ్చినా పుజారి వరమివ్వలేదు అన్న చందంగా వలస పాలకులు ఎన్నో అడ్డంకులు సృష్టించారు. ముందు 27-6-2005 నాడు జారీ చేసిన జీవో 657 ద్వారా ఆయకట్టును సగానికి సగం తగ్గించి (12 లక్షల ఎకరాలకు బదులు 5.50 లక్షల ఎకరాలకు కుదించడం) అదే షరతులతో కూడిన పథకానికి ఇన్వెస్టిగేషన్ కు అనుమతులు జారీ చేయడం ద్వారా పథకాన్ని పురిట్లోనే గండికొట్టే ప్రయత్నం చేశారు. వీళ్ల కుట్రలను బహిర్గతం చేసి ముఖ్యమంత్రి దృష్టికి తెస్తే ఆయన సంబంధిత అధికారులను చీవాట్లు వేస్తే, ఆ కుటిల జీవోను మార్చి 15-7-2005న కొత్త జీవో 623 విడుదల చేశారు.

అంతటితో ఆగలేదు సీమాంధ్ర పాలకుల కుట్రలు. 160 టీఎంసీలు నీళ్ళులేవని, పథకానికి గండికొంటే ప్రయత్నాన్ని స్కీం పై ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసే WAPCOS అధికారులను లొంగదీసుకోవడం ద్వారా కొనసాగించాలనుకున్నారు. ఎప్పటి కప్పుడు వీరి ఆగడాలను ఎదుర్కొన్న తెలంగాణ ఇంజనీర్లు ఎట్టకేలకు పథకానికి జీవో 124, కు 16-5-2007 ద్వారా ప్రభుత్వ పరిపాలనా ఆమోదం పొందారు. అప్పటికీ దీన్ని దుమ్ముగూడెం- నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ (తెలంగాణ వ్యతిరేకిస్తున్న ప్రాజెక్టు)తో జతచేసి రెండు పథకాలకు ఒకేరోజు ఒకే సమయంలో జీవో125 ద్వారా మరో దుష్ట పన్నాగానికి తెరతీయడం జరిగింది. 42 వేలకోట్ల రూపాయలు ఖర్చయే ఈ ప్రాజెక్టును 28 ప్యాకేజీలుగా విభజించి కాంట్రాక్టర్లకు అప్పచెప్పినా ఖర్చుపెట్టింది నామమావూతమే. అసలు ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా? అనుమానమే.
ఇక దేవాదుల పరిస్థితి- దేవాదుల సక్రమంగా పనిచేయాలంటే కంతనపల్లి కట్టాలి. కంతనపల్లికి మొత్తం 20 వేలకోట్ల రూపాయలు కావాలి. మొద టి దశకు పదివేల కోట్లు మంజూ రు చేశారు. కంతనపల్లి డ్యాం పనులకు సుమారు 1400 కోట్లకు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. మరో నాలుగైదు వందల కోట్లకు పెంచి సవరించిన అంచనాను ముఖ్యమంత్రి తొమ్మిది నెలలు ఫైల్ అట్టిపెట్టుకుని ఈ మధ్యనే క్లియర్ చేశారు.

ఇక దుమ్ముగూడెం ‘పోలవరం’ ఎత్తిపోతల పథకాల సంగతి ఎంత తక్కువ మాట్లాడితే అంతమంచిది. అంటే ప్రాణహిత చేవెళ్ల నుంచి పోలవరం ఎత్తిపోతల దాక ఏ తెలంగాణ ప్రాజెక్టు గురించి కూడా మన ముఖ్యమంవూతికి చిత్తశుద్ధిలేదు. కానీ లక్ష 80 వేల ఎకరాలు ముంచి, రెండు లక్షల మంది గిరిజనులను నిరాక్షిశయులను చేసి కేవలం 7 లక్షల 20 వేల ఎకరాలు ఉభయగోదావరులు, కృష్ణా, గుంటూరు జిల్లాలలోని ఆయకట్టు గురించే ఆలోచిస్తరు. పక్క రాష్ట్రాల అభ్యంతరాల గురించి మాట్లాడరు. ప్రత్యామ్నాయాల గురించి, సుప్రీంకోర్టులోని కేసుల గురించి, పర్యావరణ అనుమతుల రద్దు గురించి మాట్లాడరు.

పోలవరం వస్తే తెలంగాణకు అదే మహబూబ్‌నగర్ కు లాభం అని, దీన్ని టీఆర్‌ఎస్ నాయకుడు కేసీఆర్ అడ్డుకుంటున్నాడని అర్థం లేని వ్యాఖ్యలు మీడియాలో చేస్తుంటారు. పోలవరం సాకారమవుతే 80 టీఎంసీల గోదావరి జలాలు, ప్రకాశం బ్యారేజీ కి చేరుతాయి. అందులో 35 టీఎంసీలు మహారాష్ట్ర, కర్ణాటకల వాటా. మిగిలిన 45టీఎంసీల నికర జలాలు మనకు దక్కుతాయి. పోలవరం సాంక్షన్ అయిన మరుక్షణమే 35 టీఎంసీల కృష్ణాజలాలను పై రాష్ట్రాలు మనకు రాకుండా అపుతాయి. పోలవరం నిర్మాణమయ్యాక ప్రకాశం బ్యారేజీకి గోదావరి జలాలు ప్రయాణించాక, ఆనీటిని ఉపయోగించుకునే కృష్ణా డెల్టాకు సాగర్ నుంచి విడుదల చేయాల్సిన 45 టీఎంసీల నీటిని ఆపుకోవడం జరిగితే ఆ నీటిని శ్రీశైలం దగ్గర బంధించి రాయలసీమకు 30 టీఎంసీలు, తెలంగాణకు 15 టీఎంసీలు కేటాయించడం జరుగుతుంది. తెలంగాణకు పదో, పదిహేనేళ్ల తర్వాత వస్తే గిస్తే 15 టీఎంసీలు వీటిలో అదనంగా సాగులోకి వచ్చే లక్ష ఎకరాల తరి, లేక లక్షన్నర ఎరకాల ఖుష్కీ. కాని ఇప్పుడే ఖమ్మం జిల్లాలోని లక్షా యాభై వేల ఎకరాలు పోలవరంలో మునిగితే అసంగతి మాత్రం మాట్లాడరు. రాగల ఆ పదిహేను టీఎంసీలలో నల్లగొండకు సగం, మహబూబ్‌నగర్ సగం విభజించవచ్చు. అంటే ఎప్పుడోవచ్చే ఆరేడు టీఎంసీల నీటికి ఆశపడి పోలవరాన్ని అడ్డుకోకూడదని, ఖమ్మంలోని గిరిజనుల భూములు, ఇళ్లు మునిగినా నోరుమూసుకోవాలని , అలా చేయకపోతే మహబూబ్‌నగర్ జిల్లా ఎడారవుతుందని ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నారు. ఇప్పుడర్థమయిందా? ఎవరికి అవగాహన లేదో ఈ లింకు భాగోతమేమిటో?

-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్
vsrao2010@gmail.com

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర