భారత దేశ చరివూతలోనే విశిష్టమైనదైన, ప్రపంచాన్ని ఆకర్షించిన హైదరాబాద్ విమోచన ఉద్యమం ఇంకా ఏదో రూపంలో రగులుతూనే ఉన్నది. అయితే అప్పటి పోరాటం నిరంకుశ నిజాం ప్రభుత్వం మీద అయితే, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో, అదే నిరంకుశ భావజాలంపైన. దోపిడీ విధానాల పైన ప్రజలు పిడికిలి బిగించి మా తెలంగాణ మాకు కావాలంటున్నారు. 1948 సెప్టెంబర్ 17 నాడు విమోచన పొంది భారతదేశంలో విలీనమైన హైదరాబాద్ సంస్థానంలోని కొన్ని జిల్లాలు మహారాష్ట్రంలో, మరికొన్ని జిల్లా లు కర్ణాటకలో కలిశాయి. ఇతర రాష్ట్రాలలో కలిసిన జిల్లాలలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం లేదు. అయినా స్వేచ్ఛా స్వాతంవూత్యాలను సాధించుకున్న సెప్టెంబర్17ను మహారాష్ట్ర- కర్ణాటక ప్రభుత్వాలు అధికారికంగా విమోచన దినంగా జరుపుతున్నాయి. ఉత్సవాలను జరుపుకొని, ఆ పోరాట స్ఫూర్తిని, మధుర క్షణాలను, అందరూ కలిసి పంచుకొంటున్నా రు. భావితరాల వారిని ఆలోచింపజేస్తున్నారు.
కాని మన రాష్ట్రంలో ఆ విమోచనా దినాన్ని అధికారికంగా జరుపుకుంటే, తెలంగాణ ఉద్యమానికి జవసత్వాలు ద్విగుణీకృతమవుతాయని, చరివూతను చెరిపివేసే ప్రయత్నం చేస్తున్నారు. 1948 నుంచి 1956 వరకు ఉన్న చరివూతను మరుగుపరిచారు. చివరికి రాష్ట్ర హైకోర్టు కూడా తమ 50 సంవత్సరాల ఉత్సవాన్ని 1956 నుంచే తీసుకోవడం ఆశ్చర్యా న్ని కలిగిస్తున్నది. ఎప్పుడు ప్రత్యేకవాదం వచ్చినా సామ, దాన, బేధ, దండోపాయాలతో అణచివేస్తున్నది. ఈ ప్రాంత ముస్లిం సముదాయం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తుందని, ఓటు రాజకీయ పాచికలను విసురుతున్నారు. స్థిరపడ కోస్తా, రాయలసీమ ప్రజలు అభవూదతాభావంతో ఉన్నారని అసత్య ప్రచారాన్ని ఢిల్లీ వరకు తీసుకుపోయారు. ఇప్పుడున్న తెలంగాణ... తెలంగాణ, కోస్తా, రాయలసీమ బిడ్డల సమాహారమనే సత్యాన్ని నిస్సిగ్గుగా దాటవేస్తున్నారు.
ఫజల్ అలీ కమిషన్ రూపొందించిన నివేదిక ప్రకారం తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఉంచి దాని భవిష్యత్తు నిర్ణయాన్ని దానికే వదిలిపెట్టాల్సింది. అట్లా చేయకుండా, నిరంతరం వైరుధ్యాలకు నారు పోసి నీరు పోస్తున్నా, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కొత్తపుంతలు తొక్కుతూ నివురు గప్పిన నిప్పులా ఉన్నది. 2004 లో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు నినాదంపై యూపీఏ అధికారంలోకి వచ్చినా, విశ్వాసఘాతకానికి పాల్పడితే ప్రజలు అడుగడుగునా నిలదీస్తున్నారు. చివరికి కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9 నాడు అధికారిక ప్రకటన చేసి తెలంగాణ ఏర్పాటుకు స్పష్టమయిన సంకేతాన్ని ఇచ్చింది. మళ్లీ పారిపోయే ప్రయత్నం చేస్తే 850 మందికి పైగా తెలంగాణ బిడ్డలు ప్రాణాలను పణంగా పెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను చేతులు విరిచి పట్టుకున్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడానికి కావలసిన మద్దతును ప్రధాన ప్రతిపక్షపార్టీలు ప్రకటించి సిద్ధంగా ఉన్నాయి.
ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియ ప్రారంభమయిందని ప్రకటిస్తే ఆ ప్రభుత్వ ప్రధాన భాగస్వామి కాంగ్రెస్ పార్టీయే తన అభివూపాయం చెప్పకుండా, మిగతా పార్టీల అభివూపాయం చెప్పమని పిల్లి మొగ్గలేస్తున్నది. చరివూతలో లేని విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మారుమూల ప్రాంత ప్రజలు సైతం తమదయిన శైలిలో ఉద్యమంలో భాగస్వాములయ్యారు.
అవినీతి ప్రభుత్వాలు ప్రజాస్వామిక విలువలను భ్రష్టుపట్టిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభు త్వం ముక్కలై ఒక భాగం జైల్లోనే చేరిపోయింది. చిరిగిన విస్తరిలా మారిన ప్రభుత్వం ఉద్యమ తుఫానులో కొట్టుకుపోవడం ఖాయమని, మళ్లీ కేంద్రం తెలంగాణపై సంకేతాలు పంపుతున్నదన్న ప్రచారం జోరందుకుంది. అయితే ఈ సంకేతాలు తెలంగాణ ఇవ్వడానికా, లేక ఇవ్వకపోవడానికా అని ఎవరికివారు, వారికనుగుణంగా ఊహించుకుని భరోసాతో ఉన్నారు. డిసెంబర్ 9నాడు ఇచ్చిన బలమైన సంకేతాన్ని నీరుగార్చిన ప్రయత్నాలు మళ్లీ ముమ్మరమవుతున్నాయి. న్యాయానికి, ప్రజలకు సంబంధించినంత వరకు, తెలంగాణ ఏర్పాటు అనేది అతి సాధారణమైన ప్రక్రియ. ఎన్డీఏ ప్రభుత్వం మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు ఎన్నికల హామీ అమలుకు ఎంత ప్రాధాన్యం ఉం టుందో ప్రతిపక్షాలకు కూడా అర్థమై అందరూ సహకరించా రు. విడిపోయిన చిన్న రాష్ట్రాలు అభివృద్ధిపథంలో ఉంటాయనేది, రాష్ట్ర విభజన జరిగితే రెండు ప్రాంతాలు అభివృద్ధి పథంలో నడి చి ప్రజలు కలిసిమెలిసి ఉంటారనేది సుస్పష్టంగా కనబడుతున్న ది. కేవలం కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం అందరినీ బలి చేస్తున్నారని దేశ వ్యాప్తంగా ప్రజలు అభివూపాయపడు తున్నారు.
సంకేతాలు తెలంగాణ ఏర్పాటుకు ప్రతికూలంగా ఉంటే ప్రజాపోరాటం ఏ విధంగా ఉండాలనే చర్చ జరుగుతుంది. గ్రామక్షిగామాలలో కులాలవారీగా తెలంగాణ కోసం ఊరేగింపు లు, సహాయ నిరాకరణ జరిగాయి. రోడ్ల దిగ్బంధం, వంటలు- వార్పులు, బతకమ్మ ఆటలు ప్రపంచ ప్రజల నాకర్షించాయి. పట్ట ణ ప్రజల నుంచి మారుమూల ప్రాంతంలోని గోటీలు ఆడుకునే పిల్లల వరకు జేఏసీలను ఏర్పాటు చేసుకుని ఉద్యమ బావుటా ఎగురవేశారు. రబ్బరు బుల్లెట్లను, టియర్ గ్యాస్‌లను, లాఠీ దెబ్బలను ఎదురొడ్డి అసలు బుల్లెట్ల కోసం ఎదురొడ్డి నిలిచారు మన విద్యార్థి వీరులు. ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేసి ప్రజాకాంక్షను కాలరాస్తుంటే చలించిపోయిన యువతీయువకులు ఆత్మహత్యలు చేసుకొని మరణ వాంగ్మూలాలలో తమ ఆకాంక్షను తెలుపుతూ ఉద్యమకారుల భవిష్యత్ కార్యక్షికమాలను నిర్దేశించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ తప్పుడు సంకేతాలను నిలువరించడానికి అన్ని పార్టీలు, వర్గాల ప్రజలు కలిసికట్టుగా ఉద్యమాన్ని రూపొందించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను స్తంభింపజేసే సంకేతం ఇవ్వాల్సిన సమయం అసన్నమయింది.
ఈ మధ్యన ప్రత్యేక ఆంధ్ర ఉద్యమకారులు లోకసభలో ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్ ను ఢిల్లీలో కలిసినప్పుడు సంకేతాల సంక్షోభానికి తెరపడింది. కేంద్రం నుంచి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి అగస్టు 20 లోపు సంకేతం వస్తుందని ఆశించినవారు నిరాశకు గురికాక తప్పదని, యూపీఏ ప్రభుత్వాన్ని తూర్పార బడుతున్న నేత, కాంగ్రెస్‌పార్టీ నిజస్వరూపాన్ని నిశితంగా పరిశీలిస్తున్న నేత స్పష్టం చేశారు. రాజ్యసభలో తెలంగాణవాదాన్ని సంపూర్ణంగా తలకెక్కించారు. కొందరు తప్ప బి.జె.పి, కాంగ్రెస్, టి.డి.పి.కి చెందిన ప్రజావూపతినిధులు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని, తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను పార్లమెంటు రికార్డులో నిక్షిప్తం చేశారు.
అసోం తదితర ప్రాంతాలలో కొనసాగుతున్న హింసను నిలువరించడానికి, పుకార్లను ఆపడానికి మాస్ ఎస్ఎంఎస్లను హోంశాఖ నిషేధించింది. కాబట్టి అందులో తెలంగాణ సంకేతం గల్లంతయ్యిందని ఢిల్లీలో అపహాస్యం చేస్తున్నారు. తారాస్థాయికి చేరిన ప్రభుత్వ అవినీతిని దృష్టిలో ఉంచుకొని, తెలంగాణ ఏర్పాటుకు ముందు, ప్రత్యేక జైలు ఏర్పాటు చేసే ప్రయత్నంలోనే ఉన్నారని స్వపక్షం వారే వాపోతున్నారు. మరొకవైపు ప్రభుత్వం, ఇంత ఉద్యమం జరిగినా ఈ ప్రాంత చరివూతను ఈ తరం వాళ్లకందించే కనీస ప్రయ త్నం కావాలని చేయడం లేదు. 17 సెప్టెంబర్‌ను విమోచన దినం గా పాటించడం లేదు. దేశమంతా గుర్తించిన ఇద్దరు పాత్రికేయు లు గణేశ్ శంకర్ విద్యార్థి ఉత్తరవూపదేశ్‌లో 1931మార్చి 25న లో దేశ స్వాతంత్య్రం కోసం మత సామరస్యం కోసం ప్రాణాలర్పిస్తే, మన షోయబుల్లాఖాన్‌ను, హైదరాబాద్ సంస్థానం భారతదేశం లో విలీనం కావడానికి ఉద్యమిస్తున్నాడని, మత సామరస్యతను కాపాడుతున్నాడని 1948 ఆగస్టు 21న రజాకార్లు క్రూరంగా చంపారు.
ఆయన వర్ధంతిని అధికారికంగా జరుపుకునే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేకపోగా కనీసం పాఠ్యాంశాలలో ఈయన చరివూతను చేర్చలేదు. రాజకీయాలకతీతంగా ప్రజలను చైతన్యపరిచిన కలంయోధుడు వీరు. ఉత్తరవూపదేశ్‌లో గణేశ్ శంకర్ విద్యార్థి పేరు ఎక్కడ చూసినా ప్రధానంగా కనిపిస్తున్నది. ఆయన పేరిట మెడికల్ కాలేజీతోపాటు ఎన్నో ప్రతిష్టాకరమైన ప్రాంతాలున్నాయి.
ఈ ప్రభుత్వం ఏదీ చేయకుండా కొన్ని సంవత్సరాలు గడిపితే అసలు తెలంగాణవాదాన్నే మరిచిపోతారనే భ్రమలో ఉండి ఈ ప్రాంత వైభవాన్ని, పోరాట ఘట్టాలను శాశ్వతంగా భూస్థాపితం చేసే కుట్రను కొనసాగిస్తున్నది. ఈ సందర్భంగా పోలెండ్ చరివూతలోని ఒక సంఘటనను మననం చేసుకోవాలి. 1614లో రష్యన్లు పోలెండ్‌లోని వార్సా నగరాన్ని ఆక్రమించుకున్నప్పుడు, వారు అక్కడి ప్రధాన కూడలిలో ఈస్ట్రన్ ఆర్ధడాక్స్ క్రిస్టియన్ కేథవూడల్ను నిర్మించారు. 1918లో పోలెండ్ స్వాతంత్య్రం పొందిన తర్వాత అక్కడి ప్రజలు ఈ కేథవూడల్ ను కూల్చివేశారు. వందల సంవత్సరాలు తాము ప్రార్థనలు చేసుకుంటున్న చర్చినే కూల్చుకుంటారా! అని ఆశ్చర్యపోవచ్చు. కాని వారి దృష్టిలో రష్యన్లు చర్చి నిర్మాణం చేసినా అది మతపరమైన కారణాలతో కాదని, కేవలం రాజకీయ కారణాలతో తమను మభ్యపెట్టడానికే అని భావించారు. అందుకే ఆత్మగౌరవం కట్టలు తెంచుకుని కూల్చివేతకు దారితీసింది. ఇప్పుడు మనకు దేన్ని కూల్చేది కాని, కాల్చేది కాని లేకున్నా, సిద్ధాంతాలకతీతంగా పోరాటంచేసి రక్తాన్ని చిందించి సాధించుకున్న 54 సంవత్సరాల కిందటి తెలంగాణ పునఃవూపతిష్టాపనను, స్వయంపాలనను, వంచనకు గురైన ప్రజలు కోరుకుంటున్నారు. ఈ పునర్నిర్మాణం తప్పదని చరివూతలు హెచ్చరిస్తున్నాయి.
-సీహెచ్. విద్యాసాగర్‌రావు,మాజీ కేంద్ర మంత్రి