కోర్టే శరణ్యం-అన్యధా నాస్తి


Sun,August 19, 2012 11:19 PM

Nagarjunasagarశ్రీశైలం నాగార్జునసాగర్ నీటి విడుదల విషయంపై కోర్టు స్టే విధించింది కదా! మరేమైంది? నీటి విడుదల ఆగిందా? ఇది తెలంగాణ ప్రజల విజయంగా భావించవచ్చా?:గాదె నిర్మల, నల్లకుంట, హైదరాబాద్
నాగార్జునసాగర్ జలాశయం, శ్రీశైలం జలాశయంలలో కనీస నీటిమట్టా న్ని కాపాడవలసిందిగా ఇటీవల హైకోర్టు ఆదేశాలిచ్చిన మాట నిజమే. హైకోర్టు ఆదేశాల ప్రకారం నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం 510 అడుగులు, శ్రీశైలం నీటిమట్టం 834 అడుగులకు దిగువన నీటిస్థాయి చేరితే తాగునీటి అవసరాలకు తప్ప ఇతర ప్రయెజనాల కోసం విడుదల చేయరాదు. కాస్త ఆలస్యంగాననైనా ఈ ఆదేశాలు అమలులోకి వచ్చాయి. ఫలితంగా 510 అడుగుల కంటే సాగర్ నీటిమట్టం క్రిందికి పోయినప్పుడు, అదేవిధంగా శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 834 అడుగుల కంటే దిగువన ఉన్నప్పుడు సాగు నీటికోసం నీటివిడుదలను ఆపివేసింది. ఈ ఆర్డర్‌లు వచ్చినప్పుడు శ్రీశైలంలో నీటిస్థాయి 800అడుగుల కంటే కూడా తక్కువగా ఉన్నది. కనుక నీటి విడుదల చేయకూడదు. అయితే వారం రోజుల దాక మాకు ఎలాంటి ఆర్డర్లు రాలేదన్న సాకుతో నీటిని వదులుతూ వెళ్లారు. చివరకు కోర్టు ఉల్లంఘన కేసు వేస్తానని బెదిరిస్తే తప్ప నీటి విడుదలను అధికారులు ఆపలేదు.

సాగర్‌లో 510 అడుగుల కంటే కాస్త నీరు ఎక్కువగా ఉంటే దాన్ని కృష్ణా డెల్టా సాగునీటి కోసం వదలడం జరిగింది. మధ్యంతర ఉత్తర్వులిచ్చిన హైకోర్టు తదుపరి విచారణకు వాయిదా వేసింది. వాయిదా ముగిసే లోపు కృష్ణాడెల్టా ఆయకట్టు రైతుల తరఫున రైతాంగ సమాఖ్య అనే సంస్థ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ప్రభుత్వం తరఫున అడ్వకేట్ ఇచ్చిన గడువులోపల తను కౌంటర్ దాఖలు చేయకపోవడంతో న్యాయమూర్తులు కేసు విచారణను మరో మూడు వారాలు వాయిదా వేశారు. సదరు రైతాంగ సమాఖ్య తను అభ్యర్థనలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయపు నీటిమట్టాలపై విధించిన ఆంక్షలను తొలగించాలని కోరుతూ అందుకు మద్ధతుగా తమవాదనలను సమర్పించింది. ఆ వివరాల్లోకి వెడితే.. ముందుగా కృష్ణాడెల్టా ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలలోని 66 మండలాలకు చెందిన 13 లక్షల 8వేల మాగాణిని కలిగి ఉందని, ప్రతిసంవత్సరం డెల్టాలో 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, 20 లక్షల ఎట్రిక్ టన్నుల చెరకు, రెండున్నర లక్షల మెట్రిక్ టన్నుల పప్పుదినుసులకు అదనంగా, డెలా ్ట6 లక్షల టన్నుల చేపలను, 50 వేల టన్నుల రొయ్యలను వందశాతం ఎగుమతి చేసే సరుకును ఉత్పత్తి చేస్తుందని నివేధించడం జరిగింది.

రాష్ట్ర వ్యవసాయ రంగానికి సంబంధించిన జీడీపీలో 12శాతం పాల ఉత్పత్తుల భాగస్వామ్య ఉందని, 2007-08 లో రాష్ట్రంలో 89 లక్షల టన్నుల పాల ఉత్పత్తి జరిగిందని, అత్యధికంగా పాల ఉత్పత్తి జరిగే జిల్లాలు చిత్తూరు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం అని, ఇందులో మూడు జిల్లాలు కృష్ణా డెల్టా పరిధిలోనివే అని తెలియజేయడం జరిగింది. ఇంత మహత్తు ఉన్న కృష్ణా డెల్టా ప్రాంతానికి కృష్ణా జలాలను సకాలంలో విడుదల చేయడం ఎంత ఆవశ్యకమో వివరించారు. కృష్ణాడెల్టా భూములు కేవలం వరి, చెరకు పండించటానికి మాత్రమే అనువుగా ఉన్నా యి. వరిపంటకు 110 నుంచి 130 రోజుల దాకా నీరు అవసరమవుతుంది. ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో తుపానులు సంభవిస్తాయి. కనుక నవంబర్‌కుముందే కోతలు పూర్తికావలసిన అవసరముంటుంది.

ఈ నేపథ్యంలో జూలై నెలలో విధిగా నారు మళ్ల కోసం నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. వర్షాకాలం మొదలయ్యాక నారు మళ్లు సాధ్యం కాదు. ఆగస్టు నుంచి వర్షాలు బాగా పడి, ప్రకాశం బ్యారేజినుంచి నీరు వృధాగా నిష్ప్రయోజనంగా సము ద్రం పాలవక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతున్నది.

అట్లా కృష్ణా డెల్టా విశిష్టతను పేర్కొన్నాక 1984నుంచి 2012 దాకా శ్రీశైలం, సాగర్ రిజర్వాయర్లకు సంబంధించిన ప్రవాహాలు, జలాశయ నీటి మట్టాలు,సామర్థ్యాలు మొదలైన వివరాలు కలిగిన డేటాను పొందుపరుస్తూ , గత 25 సంవత్సరాల నుంచి శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 25-30 టీఎంసీల నీటిని, శ్రీశైలం నీటి మట్టాలు 714 అడుగుల నుంచి 822 అడుగుల మధ్యలో ఉన్నా కూడా విడుదల చేయడం జరిగిందని, అలా ప్రభుత్వం చేసిన విధానం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగలేదని చెప్పారు. అదేవిధంగా నాగార్జునసాగర్ విషయంలో నీటిమట్టం 496 అడుగులనుంచి 510 అడుగుల మధ్యలో ఉన్నప్పుడు సైతం 1982, 1985, 1989, 1992... 1996 దాకా, 2001నుంచి 2005, 2009లో కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయడం జరిగిందని, అప్పట్లో నీటి విడుదలకు ఎలాంటి అభ్యంతరాలు వెలువడలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

రెండు నెలలకు హైదరాబాద్ తాగునీటి కోసం రోజుకు 335 క్యూసెక్కుల చొప్పున 1.6 టీఎంసీల దాకా అవసరమవుతుందని , నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువలకు రోజుకు 1500 క్యూసెక్కుల చొప్పున 8 టీఎంసీల నీరు అవసరమవుతుందని, కృష్ణా డెల్టాకు, సాగు, తాగు నీటికోసం ఈ వ్యవధిలో 12.5 టీఎంసీల నీరు అవసరమని కూడా చెప్పడం జరిగింది.

అలాగే ఎండీడీఎల్ అనబడే కనీస నీటిమట్టం (మినిమమ్ డ్రా డౌన్ లెవల్) కేవలం మార్గదర్శకం మాత్రమే. దానికి ఎలాంటి చట్టబద్ధత కానీ, సాంకేతిక ప్రామాణికతలేదని కూడా ఆ పిటిషన్లో నేవేధించడం జరిగింది. గత చరిత్ర పరిశీలిస్తే ముప్పై ఏళ్లలో జూన్, జూలై, ఆగస్టునెలల్లో ఎండీడీఎల్ కి దిగువన నీటిని విడుదల చేయడం అనేకమార్లు జరుగుతునే ఉందని, అది ఎలాంటి ఇబ్బంది సృష్టించలేదని కూడ తెలుపడం జరిగింది. ఇంకా జీవో-69లో ప్రభుత్వం నిర్ధేశించిన కనీస నీటి మట్టాలను, 25-8-2004నాడు అఖల పక్ష నేతలను సంప్రదించిన అనంతరం జీవో-107 ద్వారా మార్చడం జరిగింది. అంటే శ్రీశైలం కనీస నీటిమట్టం జీవో- 69లో 834 అడుగులు ఉండగా, జీవో-107లో 854 అడుగులుగా మార్చడం జరిగింది. అలాగే ఆ జీవో లోనే ‘కనీస నీటిమట్టం కంటే నీటిని ప్రభుత్వం అవసర సమయాల్లో విడుదల చేయవచ్చు’ అని చెప్పిన వాక్యాన్ని నొక్కి చెప్పడం జరిగింది.

బచావత్ ట్రిబ్యూనల్ కూడా కృష్ణాడెల్టాకు నీటి విడుదలకు ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరాన్ని గుర్తించిందని పిటిషన్లో పేర్కొనడం జరిగింది. పిటిషన్ మొత్తం చదివాక అర్థమయ్యేదేమంటే కృష్ణా డెల్టాకు చారివూతక ప్రాధాన్యం గుర్తించి సాగర్, శ్రీశైలం రిజర్వాయర్ల నుంచి నీటిని కనీస నీటి మట్టాల జోలికి పోకుండా, గతంలో లాగా విడుదల చేసే ప్రక్రియను కొనసాగించవలసిందిగా కోర్టును వేడుకోవడం జరిగిందన్నమాట.

ఇందులో రెండు వాస్తవాలను పిటిషనర్లు కావాలని దాచి పెట్టినట్టు స్పస్టంగా కనిపిస్తుంది. ఒకటి: బచావత్ ట్రిబ్యూనల్ నీటి కేటాయింపులు చేసినప్పుడు ప్రథమ ప్రాధాన్యం అమలులో ఉన్న వినియోగాలు, కేటగిరీ లో సెప్టెంబర్ 1960 నాటికి అమలులోఉన్న ఆమోదం పొందిన ప్రాజెక్టుల వినియోగాన్ని చేర్చింది. అలా అర్హత పొందిన ప్రాజెక్టులు కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ అదనంగా ఇంకా మరికొన్ని రెండవ శ్రేణిలో 1960 సెప్టెంబర్ తర్వాత వినియోగంలోకి వచ్చే రెండు ప్రాజెక్టులు శ్రీశైలం, జూరాల ఉన్నా యి. ఇవి ప్రతిపాదిత వినియోగాల కోవలోకి వస్తాయి. ట్రిబ్యూనల్ మొదట ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరిపాక, రెండవ శ్రేణి ప్రాజెక్టులకు నీటిని కేటాయించింది. మొదటి ప్రాధాన్యం కలిగిన శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రత్యేకమైన ప్రాముఖ్యం ఇవ్వలేదు. అంటే ట్రిబ్యూనల్ రిపోర్టులో నాగార్జునసాగర్ అవసరాల కంటే కృష్ణాడెల్టా అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎక్కడా సూత్రీకరించలేదు. రెండు: జీవో 107ను ఆ తరువాత విడుదలచేసిన జీవో 3 పాక్షికంగా మార్చివేసింది. జీవో 3 లో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నీటి విడుదల విషయంలో ఏర్పాటు చేసిన నియమ నిబంధనలు జీవో-69 ప్రాకారంగానే అమలు అవుతాయని స్పష్టం చేయడం జరిగింది. అంటే జీవో-69లో ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాలే యధావిధిగా కొనసాగుతున్నాయన్నమాట.

ఇకపోతే గత 25 ఏళ్లుగా కృష్ణాడెల్టాకు అవసరమైనప్పుడల్లా ప్రభుత్వం జీవో-69కి తూట్లు పొడుస్తూ శ్రీశైలం , నాగార్జున సాగర్ జలాశయాలను ఖాళీ చేస్తూ కనీస నీటి మట్టాలు పట్టించుకోకుండా నీటి విడుదలను కొనసాగిస్తూనే ఉన్నది. కనుక ఈ ఏడాది కూడా అలాగే కొనసాగాలని కృష్ణా డెల్టా రైతులు కోరడం స్వార్థం తప్ప మరోటి కాదు. పైగా ఇన్నేళ్లు లేని అభ్యంతరాలు కొత్తగా లేవనెత్తడంపై కూడా డెల్టా రైతులు తమ ఆగ్రహావేశాల్ని వెలిబుచ్చుతున్నారు. ఇంతకాలం మన నాయకులు రైతులు, యథేచ్ఛగా అక్రమాలు కొనసాగుతూ ఉంటే ఎందుకు ఊరుకున్నారు? ఇది నిజంగా ఏ తెలంగాణ వాది అయినా వేసే ప్రశ్నే. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? మన అసమర్థనాయకులా? అమాయక తెలంగాణ రైతాంగమా? ఏయే జీవోలలో ఏముందో ఎన్నడూ చదివిన పాపానపోకుండా నాయకుల భజనలు చేస్తూ, పబ్బం గడుపుకుంటున్న నీటిపారుదల అధికారులా? ఎవరు బాధ్యులు? ఇక నీటిని ఆపాలని కోర్టులు ఆర్డరు చేయడం తెలంగాణ విజయమా? అని అడిగారు. ఇది తాత్కాలిక విజయమే. పూర్తిగా విచారణ జరిగాక కోర్టు ఏం నిర్ణయిస్తుందో భవిష్యత్తు మాత్రమే తేల్చగలుగుతుంది.

కృష్ణా బేసిన్లో ఎగువ పరివాహక ప్రాంతంలో భారీగా వర్షాలు కురిసి ఆలమట్టి, నారాయణపురం రిజర్వాయర్లు నిండి, నీటిని మన రాష్ట్రంలోకి విడుదల చేయడం జరిగింది. జూరాల కూడా పూర్తిగా నిండి, మిగులు జలాలను కిందకు వదలడంతో ఆ వరద శ్రీశైలంలోకి చేరింది. మరో పక్కన తుంగభద్ర నుంచి కూడా నీరు శ్రీశైలంలోకి చేరుతుంది. శ్రీశైలం నీటి స్థాయి 820 అడుగుల దరిదాపులకు చేరింది. ఇంకా కనీస నీటి మట్టం చేరాలంటే మరో పధ్నాలుగు అడుగులు పెరగాలి. లోగడ శ్రీశైలంలో 800 అడుగుల స్థాయి పైన నీరుంటే విద్యుత్తు ఉత్పాదన జరిగేది.

కాని ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం 834 అడుగులకు దిగువగా ఉన్నప్పుడు అది సాగునీరైనా, విద్యుత్తు ఉత్పాదన కోసం అయినా నీటిని విడుదల చేయరాదు. కనుకనే విద్యుత్తు ఉత్పాదన చేయబోమని జెన్‌కో కరాఖండిగా చెప్పింది. ఆదనంగా చూస్తే ఆలస్యంగానైనా మనం కళ్లు తెరచి మానవహక్కుల కోసం న్యాయస్థానాలను ఆశ్రయించడం వల్ల లబ్ధి చేకూరింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. మనకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరినా, చేకూరకపోయినా సాంప్రదాయపరంగా కొనసాగుతున్న అనైతిక అక్రమాలకు అడ్డుకట్ట(తాత్కాలికంగానైనా సరే!) వేయగలిగామని మనం సంతృప్తి చెందవచ్చు. ఇందుకు మనం హైకోర్టు న్యాయమూర్తులకు ధన్యవాదాలు చెప్పాలి. కృష్ణా డెల్టా ఆయకట్టుకు నీటి విడుదలలో ప్రభుత్వం కాలయాపనే చేస్తుందని రాజకీయ అజెండా కోసం తెలంగాణ ప్రాంత ఓట్ల కోసం ప్రభుత్వం డెల్టా ప్రజలకు అన్యాయం చేస్తుందని రైతాంగ సమాఖ్య ఆరోపించింది. డెల్టాకు నీరు విడుదల చేయకుంటే ఈ నెల 27 న కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించింది.

ఒక్కటి మాత్రం నిజం- తెలంగాణకు నీటి విషయంలోనే కాదు అనేక రంగాల్లో అన్యాయాలు జరుగుతూనే ఉన్నవి. వీటిని అడ్డుకోవడం కోసం ధర్నాలు నిరసనలు ఎన్నో చేపడ్తున్నా, సీమాంధ్ర నాయకులు పట్టించుకోవడం లేదు. అసెంబ్లీలో తెలంగాణ నాయకులు కొందరు అరచిగీపెట్టినా ప్రభుత్వం తన దమననీతిని, వివక్షను కొనసాగిస్తూనే ఉన్నది.

ప్రత్యేక రాష్ట్ర సాధన ఒక్కటే పరిష్కార మార్గం కావచ్చు. అప్పటిదాక ఉపేక్షించకుండా, ఎన్ని శ్రమలకైనా ఓర్చి తెలంగాణ మేధావులు, ప్రజాసంఘాలు, న్యాయవాదుల సహకారంతో వీలైనన్నీ వ్యాజ్యాలు వేసి కోర్టుల ను ఆశ్రయిస్తే తప్ప మనకు న్యాయం దొరకదు. దీనికి మరోమార్గం లేదనిపిస్తున్నది. కొన్ని విషయాల్లోనైనా మనకు న్యాయం జరగవచ్చు. శ్రీశైలం, నాగార్జునసాగర్ నీరు విడుదల విషయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వ్యులు ప్రభుత్వాన్ని ఎంత ఇరకాటంలో పెట్టాయో డెల్టా రైతాంగాన్ని ఎంత ఆవేదనకు గురిచేస్తాయో మనకి తాజా పరిణామాల ద్వారా స్పష్టంగా కనిపిస్తున్నది.

-ఆర్.విద్యాసాగర్‌రావు, కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్
vsrao2010@gmail.com

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

country oven

Featured Articles