చక్రబంధంలో పోలవరం


Mon,August 13, 2012 12:02 AM


నాలుగువేల కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చయ్యాయని, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి ఖమ్మంలో శుక్రవారం నాడు తెగేసి చెప్పాడు. చిన్న చిన్న సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించుకుంటామని అంటూ.., ఈ ప్రాజెక్టు కడితే తెలంగాణకు లాభమని కూడా సెలవిచ్చాడు. మీ కామెంట్?

-కోట్ల సూర్యవూపభ, తిరుమలగిరి, సికింవూదాబాద్ఆయన ముఖ్యమంత్రి. అధికారం ఉన్నది. ఆయన ఏది చెప్పినా రాసుకోడానికి విలేకర్లు ఉన్నారు. ప్రచురించడానికి పత్రికలున్నాయి. ప్రసారం చేయడానికి ఛానళ్లు ఉన్నాయి. ఆయన ఏది చెప్తే అదే‘వేదం’. పాపం ముఖ్యమంవూతికి పోలవరం పుట్టుపూర్వోత్తరాలు తెలిసినట్టు లేదు. చెప్పడానికి ఏ ఇంజనీరు అయినా, అధికారి అయినా సాహసించాడో లేదో తెలియదు. కనీసం ప్రతిపక్షం వాళ్లైనా డిజైన్ ఎందుకు మార్చలేరు, మారిస్తే నాలుగు వేల కోట్ల రూపాయలు గంగలో కలుస్తాయా’ అని అడగరు. ప్రజల పక్షాన, ముఖ్యంగా గిరిజనుల సంక్షేమానికే మా పార్టీ కట్టుబడి ఉందని రొమ్ములు విరుచుకునే వామపక్షాలు సైతం అంతే. ‘డిజైన్‌ను మాత్రమే మార్చమని అడుగుతున్నాం,పోలవరానికి వ్యతిరేకులం కాము’ అని కేంద్ర నాయకులతో తీర్మా నం చేయించి ప్రధాని, రాష్ట్రపతిని కలి సి మెమోరాండం అందించిన సీపీఎం కూడా- ముఖ్యమంత్రి అట్లా మాట్లాడుతుంటే, ఏమీ మాట్లాడడం లేదు. ఈ పార్టీయే మాజీ చీఫ్ ఇంజనీర్ ధర్మారావు ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చి పోలవరానికి ప్రత్యామ్నాయాలు పరిశీలించాలని సభలు, సమావేశాలు పెట్టింది. కాకపోతే రాజ్యసభ సభ్యులు గోవర్దన్‌డ్డి అప్పట్లో మాజీ ఇంజనీర్ ఇన్-చీఫ్ టి. హన్మంతరావు పోలవరం ప్రత్యామ్నాయం ప్రతిపాదనను ముఖ్యమంత్రి దృష్టికే కాక కేంద్రంలో కాంగ్రె స్ పెద్దలందరి దృష్టికి తీసుకొచ్చి చాలా హడావుడి చేశారు. ఇప్పుడు కూడా డిజైన్ మార్చవలసిందేనని గొడవ చేస్తున్నారు.

ఇక విషయానికి వస్తే- నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి, కనుక ఇప్పుడు ప్రభుత్వం తలపెట్టిన పోలవరం డ్యాంను యథాస్థితిగా ఎలాంటి మార్పు లేకుండా కడ్తామని చెప్పడం ఏ పరిస్థితుల్లోనూ సమంజ సం కాదు. అటు చట్టపరంగా ఆమోదయోగ్యం కాదు. నాలుగువేల కోట్ల రూపాయలు ఖర్చయింది ప్రధానంగా కాలువల నిర్మాణంపైన. డిజైన్ మార్చవలసింది డ్యాం. అంటే నాన్ ఓవర్‌ఫ్లో, ఓవర్ ఫ్లో (స్పిల్‌వే) వగైరా కట్టడాల నిర్మాణంలో. ఇప్పటి వరకు వాటి కట్టడం మొదలు పెట్టలేదు. కనుక నిర్మించిన కాలువలను వాడుకునే వీలుంది. అసలు కాలువలను ఎందుకు మొదలుపెట్టారు? డ్యాం ప్రారంభించకుండా కాలువలు మొదలుపెట్టడం సబబే నా? పైగా కేంద్రం నుంచి ఆమోదం పొందిన కాలువల సైజులను అమాంతంగా పెంచి 7,20,000 ఎకరాల సాగుకు సరిపడా నీరందించవలసిన కాలువల సైజును 23లక్షల 20 వేల ఎకరాలకు సరిపడేంత భారీగా ఎందుకు పెంచారు? కేంద్ర ప్రభుత్వానికి చూపి, అనుమతులు పొందిన సైజులకు భిన్నంగా అక్రమ పద్ధతిలో కేంద్రం కన్నుగప్పి ఎందుకు చేస్తున్నారు? దీనివల్ల ఖర్చు పెరగలేదా? ఇవేవీ చూడకుండా కాలువలపైన నాలుగువేల కోట్ల ఖర్చు పెట్టారు. మరి అనుమతులు లేకుండా ఇప్పుడు 4,717 కోట్ల రూపాయలు వెచ్చించడానికి టెండర్లు ఎందుకు పిలిచారు? ఎవరి బాగుకోసం ఈ పని చేస్తున్నారు? అని ప్రశ్నిస్తే బావుండును. ఆ పనీ చేయడం లేదు. ఇటు అధికార పక్షం వాళ్లు కానీ, అటు ప్రతిపక్షం వాళ్లు కానీ అడగడంలేదు. ఒక్క తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే పోలవరం వద్దని, అనుమతులు లేకుం డా, ప్రత్యామ్నాయాలు ఆలోచించకుండా టెండర్లు పిలవొద్దని అంటున్నది. న్యాయస్థానాల గడపలు తొక్కుతోంది. ప్రధాన ప్రతిపక్షానికి ఎంత కాలం ‘పోలవరం కట్టండి. కానీ ఆ కాంట్రాక్టు మా వర్గం కాంట్ట్రాక్టరుకివ్వండి లేకపోతే టెండర్ల ప్రక్రియ అంతా కుంభకోణం అని ప్రచారం చేస్తాం, అవసరమైతే మోకాలికి బోడి గుండుకు ముడి వేసినట్టు సకల జనుల సమ్మె విరమణకు, పోలవరం టెండరుకు లింకుపెట్టి టీఆర్‌ఎస్‌ను అప్రతిష్టపాలు చేస్తాం అన్న వైఖరే.

చరిత్ర పుటలు తిరగేస్తే-ఆంవూధుల చిరకాల స్వప్నం ఈ పోలవరం. పూర్వాక్షిశమంలో దీనిపేరు శ్రీరామపాదసాగరం. తొలిసారిగా 1946-47లో రామపాదసాగరాన్ని రూపొందించినప్పుడు దీని లక్ష్యం పది లక్షల 34 వేల ఎకరాలకు సాగునీరు, 150 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి. లోగడ ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును సిద్ధింప చేసుకోవడానికి చేసిన అనేక ప్రయత్నాలు వివిధ కారణాల వల్ల నిష్ఫలమయ్యాయి. 19pandu0లో అటవీ పరిరక్షణ చట్టం, 19pandu6లో పర్యావరణ పరిరక్షణ చట్టం, ఇంకా గిరిజనుల హక్కు ల పరిరక్షణకు సంబంధించిన చట్టాలు మొదలైనవి అవతరించి ఈ ప్రాజెక్టు ముందుకు సాగడానికి అవరోధంగా నిలిచాయి. చివరకు గోదావరి జల వివా ద ట్రిబ్యునల్ (బచావత్ ట్రిబ్యునల్) పోలవరం ప్రాజెక్టుకు ఓ పరిష్కార మార్గం చూపింది. ఆంధ్రవూపదేశ్, మధ్యవూపదేశ్, ఒరిస్సా రాష్ట్రాలు 2-4-19pandu0నాడు ఓ అవగాహన పత్రంపై సంతకం చేయడంతో ప్రాజెక్టు అవతరణ ఇక నల్లేరుపై నడకే అనిపించింది. ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలైతేనేం, ఒడిషా, మధ్యవూపదేశ్ (ఇప్పుడు ఛత్తీస్‌గఢ్) రాష్ట్రాల ఒప్పందం మేరకైతేనేం ఈ ప్రధానాంశాలు ‘పోలవరం’ ప్రాజెక్టు రూపకల్పనలో ముఖ్యభూమికను పోషించాయి.పోలవరం డ్యాం దగ్గర నీటి స్థాయి ఏ పరిస్థితిలోనూ 150 అడుగులకు మించకూడదు. 36 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం మించరాదు. ఆ దశలోనూ పోలవరం వద్ద నీటిస్థాయి 150 అడుగులే ఉండి తీరాలి. అలాం టి పరిస్థితుల్లో ఒడిషా, ఛత్తీస్‌గఢ్(మధ్యవూపదేశ్)లో ఏర్పడే ముంపునకు పరిహారనష్టం గానీ, ముంపు వద్దనుకుంటే కరకట్టలను నిర్మించాలి. పరిహార మా? కరకట్టలా? నిర్ణయించుకునే అధికారం ఆయా రాష్ట్రాలకు ఉం టుం ది. 36 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తే రాసుకున్న ఒప్పందం చెల్లదు. మళ్లీ ఆయా రాష్ట్రాలను సంప్రదించాలి. (ఇప్పుడు గరిష్ఠ వరద పరిమాణం 50 లక్షల క్యూసెక్కులవుతుంది)

డ్యాం డిజైన్ కేంద్ర జల సంఘం ఆధీనంలో ఖరారవుతుంది. పోలవరం ద్వారా pandu0 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు తరలించవచ్చు. అలాంటప్పుడు 35 టీఎంసీల వాటాను మహారాష్ట్ర, కర్ణాటక లకు వదలాలి.
19pandu3లో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం డ్యాం, ఎడమ కాలువల ప్రతిపాదనను కేంద్ర జల సంఘానికి పంపింది. ఇక నాటి నుంచి మొదలైంది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య ఎడతెగని సంప్రదింపులు, ఉత్తరవూపత్యుత్తరాల పర్వం. సాంకేతిక విషయాలపై అధ్యయనం ఒకవైపు సాగుతూ ఉండగానే, పర్యావరణ నివేదికలు తయారై పర్యావరణ మంత్రిత్వశాఖ గడప చేరాయి. అంతిమంగా పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ‘పోలవరం’ ప్రాజెక్టుతో పాటు ‘ఇచ్చంపల్లి’ ప్రాజెక్టును కోల్డ్ స్టోరేజీలో పెట్టిం ది. కారణం ఈ ప్రాజెక్టుల మూలంగా ముంపుకు గురయ్యే అటవీక్షేత్రం, భారీసంఖ్యలో నిర్వాసితులవుతున్న గిరిజనులు. చంద్రబాబు హయాంలో పక్క రాష్ట్రాలను ఒప్పించే యత్నాన్ని కేంద్ర జలసంఘం సహకారంతో నిరంతరం కొనసాగించినా ఎలాంటి ఫలితం లేకపోయింది. చివరికి విసిగిపోయిన తెలుగుదేశం అధినేత తాత్కాలికంగా ‘తాటిపూడి’, ‘పుష్కరం’ ‘చాగల్నాడు’ లాంటి ఎత్తిపోతల పథకాలు చేపట్టి గోదావరి నీటిని ఉపయోగించుకునే ప్రయత్నానికి నాంది పలికారు. వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే ‘రూల్స్ గీల్స్ జాన్తా నై’ అంటూ, పోలవరం ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పర్యావరణ చట్టం అనుసరించి మొదట సైట్ క్లియన్స్ అనుమతి, పర్యావరణ అనుమతి, విడిగా అటవీ మంత్రిత్వ శాఖ అనుమతి, ప్రత్యేకంగా గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ అనుమతి, ‘పక్క రాష్ట్రాల ముంపు’నకు సంబంధించి వారి ఆమోదం, నీటి లభ్యత విషయం, అంతర్ రాష్ట్ర ఒప్పందం ప్రకారం సవ్యంగా ఉంటేనే ముందుకుపోవాలన్న నియమ నిబంధన, సాంకేతిక సంఘం అనుమతి వంటి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర జల వనరుల మంత్రిత్వశాఖ వారి సాంకేతిక సలహా సంఘం (టీఏసీ) అనుమతి, చిట్టచివరగా ప్రణాళికాసంఘం పెట్టుబడి క్లియన్స్ అనుమతి- అన్ని అనుమతులు కావాలి ప్రాజెక్టు ముందుకు సాగాలంటే- అనుమతులకేం-అవే వస్తాయి. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ మన ప్రభుత్వమే ఉంది అన్న ధీమాతో, మెండిగా, దూకుడుగా పచ్చజెండా ఊపడంతో ఈ చిక్కులు దాపురించాయి. న్యాయమూర్తుల దృష్టికి మొదట 500కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, అనుమతి ఇవ్వండి అని మొరపెట్టుకున్నప్పుడు ‘ఎవరినడిగి మొదలుపెట్టారు’ అని తీవ్రంగా కామెంట్ చేసిన సందర్భం.

1200 కోట్ల రూపాయలు ఖర్చయ్యా యి డ్యాంను ఆపకుండా, సాగడానికి అనుమతులివ్వండి అని మరోసారి విన్నవించుకున్నప్పుడు ‘ఇదే విషయాన్ని మేం రికార్డు చేసుకోమంటారా?’ అని బెంచ్ హెచ్చరించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తమ విన్నపాన్ని ఉపసంహరించుకున్న వైనం గతంలో జరిగినవే. అంటే డబ్బు ఖర్చు చేశాం కనుక అనుమతి ఇవ్వండని బ్లాక్ మెయిలింగ్ టెక్నిక్‌ను ఉపయోగించుకుని, కోర్టు సానుభూతిని ప్రజల సానుభూతిని సంపాదించవలసిన దౌర్భాగ్య పరిస్థితిని ఎదుర్కొంటుందే తప్ప, సాంకేతిక,చట్టపరమైన అంశాలతో సాధించే శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇక చట్టపరమైన అవసరాల విషయానికి వస్తే- Environmental Act 19pandu0 అనుసరించి పక్క రాష్ట్రాల్లో ముంపు ఉంటే విధిగా ప్రజాభివూపాయ సేకరణ జరపాలి. జరపలేదు కనుక ప్రాజెక్టు ఆపమని కేంద్రం సలహా ఇచ్చినా, మన ప్రభుత్వం పనులు ఆపే ప్రయత్నం చేయకుండా 4717 కోట్ల రూపాయల పనులకు గతంలో ఓసారి, మళ్లీ ఈసారి టెండర్లు పిలిచింది. ఒకవేళ సుప్రీంకోర్టు అంతిమంగా ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వకపోతే’ ఇదివరకే ఖర్చుపెట్టిన 4 వేల కోట్ల రూపాయలకు తోడు కోర్టు నిర్ణయం వచ్చేలోపు మళ్లీ పెట్టబోయే అదనపు ఖర్చు మాటేమిటి? అన్న విషయం ఆలోచించడంలేదు. ఎట్లాగూ సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వాలు ఇంత జరిగాక మనకు చచ్చినట్లు అనుమతులు ఇస్తాయన్న మొండిధైర్యం. చివరకు ఇవ్వకపోతే పోయేది ప్రజల సొమ్మే కదా. మన సొంత డబ్బు కాదు అన్న ఆలోచన కూడా కావచ్చు. ఇక ప్రత్యామ్నాయాల విషయానికి వస్తే- పర్యావరణ చట్టం కింద రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం ఏనమూనా అయినా ఖరారుచేసే ముందు ప్రత్యామ్నాయాలను శోధించి, అన్నీ పరిశీలించాకే ఉత్తమమైన ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకోవాలి. పోలవరంకన్నా గుజరాత్‌లో చిన్న ప్రాజెక్టు ‘హెరాన్’ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. పోలవరంలో దాదాపు పదో వంతు సైజు హెరాన్‌ది. గిరిజన ప్రాంతాలు, అటవీ ప్రాంతం ముంపుకు గురవుతుంటే విషయం ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దృష్టిని సైతం ఆకర్షించింది. ఆమె ప్రమేయంతో హెరాన్‌కు ప్రత్యామ్నాయంగా చిన్న చిన్న స్టోరేజీల ప్రతిపాదనను గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అన్వేషించింది. సోనియా గాంధీ దృష్టికి పోలవరం తెచ్చినప్పుడు వెంటనే ప్రత్యామ్నాయాలు పరిశీలించమని వైఎస్‌ఆర్‌కు తాఖీదులందినప్పుడు తూతూ మంత్రంగా వెంకవూటావ్ అధ్యక్షతన కమిటీ వేసి పోలవరానికి అనువుగా ఉండే టర్మ్స్ అండ్ కండీషన్స్ కమిటీకి రూపొందించి నాటకీయంగా పోలవరమే బెస్ట్ అని తేల్చిన దుర్మార్గ ప్రభుత్వం ఇది. పోలవరం ముందుకు కదిలితేనే ప్రజల ఓట్లు , కాంట్రాక్టర్ల నుంచి నోట్లు దండిగా ఒళ్లో పడతాయి. ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తుంటే ఎన్నికల కాలం 2014 ముంచుకువస్తున్నది. కాంగ్రెస్ ప్రజల ముందుకు వచ్చి ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతుంది. అందుకనే ఆరునూరైనా సరే, పోలవరం కట్టవలసిందే అని అటు కిరణ్ కుమార్, ఇటు చిరంజీవి, చంద్రబాబు అందరూ కోరస్ పాడుతున్నారు. వారికి గిరిజనుల సంక్షేమం, అటవీ క్షేత్రం మునక, పాపికొండల పరిరక్షణ పట్టలేదు. ఓట్ల చక్రబంధంలో ఇరుక్కున్న ప్రభుత్వం ఇట్లాగే ప్రకటనలు గుప్పిస్తూ గందరగోళం సృష్టిస్తూ ఉంటుంది. అంతిమంగా సుప్రీం కోర్టు ఏం చెబితే అదే వేదం. కిరణ్‌కుమార్ చెప్పింది కాదు.

-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్
Vsrao2010@gmail.com

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర