శ్రీశైలంలోనూ ప్రభుత్వానికి చెంపదెబ్బ


Mon,July 30, 2012 01:48 AM

Nagarjunasagarశ్రీశైలం నీటి విడుదల విషయంలో విజయం సాధించాం.ఈ విజయం వివరాలు చెప్పండి? జీవో మార్చిస్తామని లగడపాటి ప్రకటన గుప్పిస్తున్నాడు. దానిని గురించి కూడా వివరించండి.: -రాజనర్సింహా, రామగిరి, నల్లగొండ
విజయం తాత్కాలికమే అయినా అది నా ఒక్కడిది కాదు. యావత్ తెలంగాణ ప్రజలది. న్యాయం, ధర్మం గెలుస్తాయని చెప్పడానికి ఇదో ఉదాహరణ. ప్రభుత్వం 1996లో జీవో69ని తీసుకొచ్చింది. ఆ జీవో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి విడుదల విషయంలో ప్రాధాన్యతలను సూచించింది. జలాశయాల్లోని నీటి మట్టాలను బట్టి ఏ ఏ ప్రయోజనాలకు, ఎంత పరిమాణంలో నీటిని వదలవచ్చో తెలిపింది. హైకోర్టు కేసుల విషయానికి వచ్చేముందు జీవో 69లోని అంశాల గురించి తెలుసుకుందాం. అంతకు ముందు తెలుసుకోవలసిన మరో కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. ప్రధాన కృష్ణానదీపైన మన రాష్ట్రంలో మెట్టమొదటి జలాశయం జూరాల, దానికి దిగువన శ్రీశైలం, దానికి దిగువన నాగార్జునసాగర్, దానికి దిగువన ప్రకాశం బ్యారేజీ నిర్మితమయి ఉన్నాయి. జూరాల, శ్రీశైలం కట్టడాల మధ్య తుంగభద్ర నది కుడివైపు నుంచి కర్నూలు సమీపంలో కలుస్తున్నది. శ్రీశైలం ప్రాజెక్టు నాగార్జునసాగర్ ప్రాజెక్టుల మధ్య కొత్తగా నీరందించే ఉపనదులు ఏవీ చెప్పుకోదగ్గవి లేవు. నాగార్జునసాగర్‌కు ప్రకాశం బ్యారేజీకి మధ్య పులిచింతల డ్యామ్ ను నిర్మిస్తున్నారు.

శ్రీశైలం ప్రధానంగా విద్యు త్ ఉత్పాదన కోసం నిర్మించబడ్డ ప్రాజెక్టు.అందుకే ఆ డ్యాం నుంచి నేరుగా ఎలాంటి కాలువలు ఏర్పాటు కాలేదు.విద్యుత్తు ఉత్పాదన చేశాక శ్రీశైలం నీటిని నాగార్జునసాగర్‌లోకి వదలాలన్నమాట. నాగార్జునసాగర్ ప్రధానంగా సాగునీటి ప్రాజె క్టు. ఆప్రాజెక్టు నీరు ఎడమ కాలువ ద్వారా 132 టీఎంసీలు, కుడికాలువ ద్వారా 132 టీఎంసీలు పంటపొలాలను సస్యశ్యామలం చేయడం ఆ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. నీటి స్థాయినిబట్టి సాగర్ జలాశయంలోకి వచ్చే ప్రవాహాన్ని బట్టి విద్యుత్ ఉత్పాదన చేసి, నదిలోకి నీరు వదిలే ఏర్పాటు కూడా ఉన్నది. ఈ నీరు ప్రకాశం బ్యారేజీ చేరి కృష్ణా డెల్టా వాసులకు సాగునీటి కోసం ఉపయోగపడుతుంది. నాగార్జునసాగర్‌కు దిగువన మూసి, పాలేరు, మున్నేరు ఎడమ వైపు నుంచి, పిడుగురాళ్లవాగు కుడివైపు నుంచి నీటిని అందిస్తాయి. ఆ నీరంతా ప్రకాశం బ్యారేజీకి చేరుతుంది. దరిమిలా తాగునీటికోసం అటు శ్రీశైలం, ఇటు నాగార్జునసాగర్‌లో కేటాయింపులు, ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. శ్రీశైలం జలాశయంలో నీటిస్థాయిని బట్టి బ్యాక్ వాటర్‌పై తాగునీరే కాక రాయలసీమకు, ప్రకాశం జిల్లాకు, తెలంగాణకు ఉపయుక్తంగా ఉండేట్టు కొన్ని ప్రాజెక్టులను నిర్మించారు.

మరికొన్నింటిని నిర్మిస్తున్నారు. చెప్పొచ్చేదేమంటే శ్రీశైలం ముందులాగ ఇప్పుడు కేవలం విద్యుత్తు ఉత్పాదన కోసమే లేదు. బహుళార్థక ప్రాజెక్టుగా ప్రభుత్వాలు దాని రూపురేఖలను మార్చాయి. 1979లో బచావత్ ట్రిబ్యూనల్ ఇచ్చిన తీర్పులో ఎలాం టి కేటాయింపులు చేయకపోయినా, ఆ ట్రిబ్యూనల్ కేవలం నికర జలాల కేటాయింపే జరిపినా, మిగులు జలాలను ఉపయోగించుకునే స్వేచ్ఛను రాష్ట్రానికి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేయడం, మిగులు జలాల సాకుతో కొంత అధికారికంగా, మరికొంత అనధికారికంగా నికర జలాలను కూడా ఈ కొత్త ప్రాజెక్టులకు కేటాయించడం, ఉపయోగించడం కొనసాగుతున్నది.

ఇక జీవో 69 వివరాలు- ఈ జీవో శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల విషయంలో ఈ క్రింది ప్రాధాన్యతలను పాటించాలని ఆదేశించింది.
1)15 టీఎంసీల వరకు మద్రాసుకు తాగు నీటిసరఫరా 2) హైదరాబాద్ తాగునీటి సరఫరా 3) శ్రీశైలం కుడిపక్కన ఉన్న విద్యుత్ కేంద్రానికి ఉపయోగించుకుంటూ హైడ్రోపవర్ ఉత్పత్తి 90 శాతం విశ్వసనీయతన కనీసం 1170 ఎంకేడబ్ల్యుహెచ్ (మిలియన్ కిలోవాట్ అవర్) విద్యుత్త్ ఉత్పత్తి సాలీనా చేయాలి. 4) ప్రకాశం బ్యారేజీకి, నాగార్జునసాగర్‌కు సాగునీటి అవసరాలు 5) నాగార్జునసాగర్ నుంచి సాగునీటి కోసం విడుదలయ్యే నీటితో జరిగే పరిమిత విద్యుత్తు ఉత్పాదన. (అంటే సాగర్‌లో విద్యుత్తు ఉత్పాదన సమయానుకూలంగానే ఉంటుంది). 6) శ్రీశైలం కుడిగట్టు కాలువ సాగునీటి అవసరాలు 7) తెలుగుగంగ ప్రాజెక్టు సాగునీటి అవసరాలు 8) శ్రీశైలం ఎడమగట్టు కాలువ సాగునీటి అవసరాలు.

ఈ జీవో శ్రీశైలం, సాగర్ జలాశయాల నీటిమట్టాలను బట్టి అటు నికర జలాలు, ఇటు మిగులు జలాలను ఎంత పరిమాణంలో ఏ ఏప్రయోజనాల కోసం విడుదల చేయాలో నిర్దేశిస్తుంది. అంటే ఈ రెండు జలాశయాల నీటిని నిర్వహణ విధి విధానాలు ఈ జీవోలో పొందుపరిచారన్నమాట.ఈ జీవోను పాలకవర్గాలు కొన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడడం కోసం అనేక సంవత్సరాలుగా అభాసుపాలు చేస్తూనే ఉన్నాయి. హైకోర్టుకు సమర్పించిన ప్రభుత్వ డాక్యుమెంట్లను 1984 నుంచి శ్రీశైలం నీటి విడుదల వివరాలు పరిశీలిస్తే ఏ సంవత్సరం కూడా ఈ జీవోను సక్రమంగా పాటించలేదన్న విషయం బయటపడింది. జీవోను అడుగడుగునా అతిక్షికమించిన అధికారుల వికృత చేష్టలు ఆ రికార్డు చదివితే బయటపడుతాయి. శ్రీశైలం జలాశయంలో కనీస నీటిమట్టం 834 అడుగులు. ఆ స్థాయిలో కాని అంతకన్న తక్కువ స్థాయిలో కానీ ఎలాంటి ప్రయోజనాలకు నీటిని విడుదల చేయకూడదు. కేవలం తాగునీటి కోసం మాత్రమే అవసరమైన మేరకు మినహాయింపు ఉంటుంది. ఇదే మాదిరిగా నాగార్జునసాగర్ జలాశయంలో కనీస నీటిమట్టం 510 అడుగులు. ఆ స్థాయి కన్న తక్కువ స్థాయిలో నీటిని నాగార్జునసాగర్‌నుంచి ప్రకాశం బ్యారేజీకి విడుదల చేయరాదు. హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా కోసం జూన్ నెలలో 510 అడుగుల కంటే కిందిస్థాయిలో కూడా నీటిని విడుదల చేయొచ్చు.

మరో విషయమేమంటే నీటిస్థాయి, కనీస నీటిమట్టం 510 అడుగులు. పూర్తిజలస్థాయి 590 అడుగుల మధ్య ఉన్నప్పుడు సాగర్ నీటిని హైదరాబాద్ తాగునీటికి, ప్రకాశం బ్యారేజీకి, నాగార్జునసాగర్ ఆయకట్టుకు విడుదల చేయాలి. ఒకవేళ నీరు సరిపడినంత పరిమాణంలో లేకపోతే నాగార్జునసాగర్ ఆయకట్టుకు మొదట కోతపెట్టాలి. అంటే సాగర్ నుంచి విడుదలయ్యే నీటిలో ప్రాధాన్యతాపరంగా హైదరాబాద్ తాగునీటి, ప్రకాశం బ్యారేజీ అవసరాలు, సాగర్ ఆయకట్టు అవసరాలు అని స్పష్టం చేయబడింది.

జీవో 69లో అటు శ్రీశైలం జలాశయంలో కానీ, ఇటు నాగార్జునసాగర్ జలాశయంలో కాని నీటిమట్టం కనీసస్థాయికి చేరినప్పుడు తాగునీటి కోసం తప్ప సాగునీటి కోసం కానీ మరే ఇతర ప్రయోజనాలకు కానీ నీటిని విడుదల చేయరాదని ఆదేశాలు ఉన్నాయి కదా! మరి ప్రభుత్వం ప్రతిసారీ కృష్ణా డెల్టా రైతాంగం ప్రయోజనాలను కాపాడటానికి నీటిని యథేచ్ఛగా తరలించేందుకు అనుమతి ఇవ్వడం ఏరకంగా సమర్థనీయం ? ఇది హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లావాసులకు తాగునీటి విషయంలో అన్యా యం చేసినట్టు కాదా? నాగార్జునసాగర్ రైతాంగం పట్ల ద్రోహం చేసినట్టు కాదా? తెలంగాణ కన్నా కోస్తాంవూధులు బలవంతులు. ఎప్పటిలాగానే ఈ ఏడు కూడా శ్రీశైలం నుంచి కనీస నీటి మట్టం 799 ఉన్నప్పుడు, సాగర్‌లో కూడా నీటిమట్టం 510 అడుగుల స్థాయి చేరుకున్నప్పుడు, కృష్ణా డెల్టా ప్రాంత రైతుల ఒత్తిడికి లొంగి 15 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో ఏర్పాటైన రివర్ స్లూసెస్ ద్వారా శ్రీశైలంలో 760 అడుగులు వచ్చేవరకు సాగర్‌లో 507 అడుగుల దాక నీటిని విడుదల చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. శ్రీశైలం నుంచి 12 టీఎంసీలు, సాగర్‌నుంచి 3 టీఎంసీలు దాచుకోవచ్చని పచ్చజెండా ఊపింది. ఇంకేముంది? అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి శ్రీశైలం, సాగర్ స్లూస్ గేట్లను ఎత్తి డెల్టాకు నీటి తరలింపు కార్యక్షికమాన్ని ఆరంభించారు. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ‘తెరాస’ కార్యకర్తలు, తెలంగాణ ఇంజనీర్లు, ప్రజలు ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు సైతం మొద్దునిద్ర నటించారు. గత్యంతరంలేని పరిస్థితిలో నల్లగొండ రైతులు ఓ ప్రముఖ విద్యుత్తు ఇంజనీరు, మరికొందరు హైకోర్టు గడప తొక్కారు. అయితే పిటిషనర్లు జీవో 69 విషయం ప్రసావించకుండా నాగార్జునసాగర్ రిపోర్టు ఆధారంగా సాగర్‌లో 525 అడుగుల నీటిమట్టం ఉంటేతప్ప సాగునీటి కోసం విడుదల చేయరాదని ఉన్న నియమాన్ని ఆధారంగా చేసుకుని దాన్ని ఉల్లంఘించారన్న కారణంగా హైకోర్టును ఆశ్రయించారు. అయితే ప్రభుత్వం సాగర్‌లో నీటి మట్టం 525 అడుగులు కాదని, 510 అడుగులని స్పష్టం చేసి తాము డెల్టాకు విడుదల చేయడం సక్రమమేనని వాదించింది. హైకోర్టు ప్రభుత్వ వాదనను అంగీకరించక 510 అడుగులకు దిగువన నీటిని విడుదల చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంలో ప్రభుత్వం మరో జిత్తులమారి ఎత్తుగడ వేసింది.

సాగర్‌లో కనీస నీటి మట్టం 510అడుగులు మెయిన్‌టెయిన్ చేస్తూనే ఇందుకో సం శ్రీశైలం నుంచి భారీ ఎత్తు న నీటి విడుదలకు ఉపక్షికమించింది. ఆ క్రమంలో శ్రీశైలం నీటి మట్టాలు ప్రభుత్వం పట్టించుకోక, బాహాటంగానే జీవో 69కి తూట్లు పొడిచింది. ప్రభుత్వం అనుమతి తీసుకోకుండానే (ఇంజనీర్ ఇన్ చీఫ్) శ్రీశైలం రిజర్వాయర్ రివర్ స్లూస్ గేట్లు తెరిచి డెల్టాకు నారుమళ్ల కోసం నీటిని విడుదల చేయమని సంబంధిత చీఫ్ ఇంజనీర్‌కు ఆదేశాలివ్వ డం జరిగింది.ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నేను, కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, మరికొందరం సంయుక్తంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.

సాగర్ నీటి విడుదల విషయంలో మధ్యంతర ఉత్తర్వులిచ్చిన ధర్మాసనమే ఈ కేసును కూడా విచారించి శ్రీశైలంలో 834 అడుగుల కనీస నీటిమట్టానికి దిగువన నీటిని విడుదల చేయరాదని మధ్యంతర ఉత్తర్వులిస్తూ ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని ఆదేశించింది. హైకోర్టు తీర్పును క్షణాల మీద ఎలక్ట్రానిక్ మీడియా ప్రసా రం చేసినా, మరిసటి రోజు ప్రింట్ మీడియా ప్రచురించినా హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ మాకు నీటి నిలువుదల విషయంలో ఆర్డర్లు లేవని అధికారులు మూడు రోజుల వరకు నీటిని వదులుతూనే ఉండటం తెలంగాణ పట్ల అనుసరిస్తున్న పక్షపాత వైఖరికి నిదర్శనం.
దీంతో అనుకున్నట్టే డెల్టా రైతాంగం చిందులు వేసింది. 150 ఏళ్ల చరిత్ర కలిగిన డెల్టాకు కృష్ణా జలాలపై వినియోగపు ప్రథమ హక్కుందని, కాదనే అధికారం ఎవరికీ లేదని రంకెలు వేసింది. నేనున్నానని జీవో 69నే మార్పిస్తాను అని లగడపాటి వారికి అభయమిచ్చి తెలంగాణవాదులను ఛాలెంజ్ చేసి ప్రభుత్వంలో తన కుయుక్తులకు ఉపక్షికమించారు.

ఇంత జరగుతున్నా పాలకపక్షంలోని తెలంగాణ నాయకులు స్పందించలేదు. ఎందుకైనా మంచిదని విశ్రాంత తెలంగాణ ఇంజనీర్లు, తెరాస ఎమ్మెల్యేలు డెలిగేషన్‌గా భారీ నీటిపారుదల శాఖామంత్రి, నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులను కలిసి యధార్థస్థితిని చెప్పి జీవో 69 ను రద్దు చేయడం కాని మార్పించడం కాని చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను చెప్పి, తెలంగాణకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేయడం జరిగింది. ఏదేమైనా, ఎప్పటికప్పుడు తెలంగాణ మేధావులు. జాగరూకులై, అటు ప్రభుత్వంపై ఒత్తిడి పెడుతూ అవసరమయితే కోర్టులో కేసులు వేస్తేతప్ప ఈ ప్రాంతానికి న్యాయం జరగదు.సమైక్యరాష్ట్రంలో తెలంగాణకు అన్నిరంగాల్లో అన్యాయం కొనసాగుతూనే ఉంటుంది అన్నది అక్షరాల నిజం. ఇందుకు సజీవ సాక్ష్యం శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి సాగుతున్న నీటి దోపిడీయే.

- ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

country oven

Featured Articles