జనం నోళ్లు కొడుతున్న పరిక్షిశమలు


Sun,July 15, 2012 11:12 PM


జీవో146, జీవో 94 గురించి చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే జీవో 23 ద్వారా ఉదయసముద్రం నుంచి రోజుకు 5 లక్షల గ్యాలన్ల నీటిని సీమాం ధ్ర వారు స్థాపించే ఓ పరిక్షిశమకు తరలించేందుకు ప్రభుత్వం అనుమతించినట్టు,దానిపైన తెలంగాణ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారనీ, ప్రభుత్వం దీనిపై పునరాలోచిస్తున్నట్టు తెలిసింది. ఓపక్కన నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులకు తాగు నీళ్లు లేక అల్లాడుతుంటే, స్పీకర్ ఆధ్వర్యంలో అభిలపక్షం యాత్రలు చేస్తుంటే ఈ దారుణమేమిటి? ఈ జల దోపిడీకి అంతం లేదా? ఖైరున్నిసాబేగం, ప్రకాశం బజారు, నల్లగొండ
మీరు అన్నట్టు సమైక్యరాష్ట్రంలో జల దోపిడీకి అంతూ పొంతూలేదు. జీవో 146 విడుదలయింది 22-7-2008న. జీవో 94 జారీ చేసింది 12-8-2009 నాడు. జీవో 23 రిలీజ్‌యింది 17-3-2010 తేదిన. మన దృష్టికి వచ్చిన జీవోలు ఈ మూడే. ఇలాంటివి లోగడ ఎన్ని జారీ అయినవో జగన్ గొడవల మూలంగా బయటపడ్డవి జీవో146, 94 అయితే, నల్లగొండ నాయకులు, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల పుణ్యమా అని ప్రజల దృషికి వచ్చింది జీవో 23. ఈ మూడు జీవోలను పరిశీలిస్తే అన్నీ ఒకే మూసలో పోసినట్టు ఒకే పద్ధతిని అనుసరించాయి. జీవో 23 వ్యవహారం గమనిస్తే చాలా విషయాలు తేటతెల్లమవుతాయి. యునైటెడ్ సీమ్‌పూస్ ట్యూబ్యులర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారు జూలై 2007లో తాము నల్లగొండ జిల్లాలోని నార్కట్‌పల్లి మండలం శ్రీపురం గ్రామంలో ‘సీమ్ లెస్ పైపు’లు తయారు చేసే ఫ్యాక్టరీని స్థాపించదలిచామని, దాని అంచనా వ్యయం 565 కోట్లని చెప్పారు. వెనుకబడ్డ నల్లగొండ జిల్లాలోని పారిక్షిశామిక అభివృద్ధికి తమ ప్రయత్నం ఎంతో దోహదం చేస్తుంది కనుక ఉదయసముద్రం బ్యాలెన్సింగ్ జలాశయం నుంచి ప్రతి ఏడు 29మిలియన్ల క్యూబిక్ ఫీట్ల కృష్ణా జలా లు (రోజుకు 5 లక్షల గ్యాలన్లు) ఉపయోగించుకునేందుకు అనుమతి ంచాల్సిందిగా కోరారు. ఈ కోరికకు స్పందించిన శ్రీశైలం ప్రాజెక్టు చీఫ్‌ఇంజనీర్ మార్చి 2008న, వారుకోరిన నీటి పరిమాణం, ప్రాజెక్టు వినియోగం 30 టీఎంసీలతో పోలిస్తే స్వల్పం కనుక తగు అనుమతులు ఇవ్వాల్సిందిగా సిఫారసు చేశా రు. ఇది సరిపోదన్నట్టు చీఫ్ ఇంజనీర్ హైడ్రాలజీ వారు ఎలిమినేటి మాధవడ్డి ఎస్‌ఎల్‌బీసీ పథకానికి కేటాయించిన 30 టీఎంసీల కృష్ణా జలాల్లో శ్రీశైలం చీఫ్ ఇంజనీర్ సిఫారసు చేసిన 29 మిలియన్ క్యూబిక్ ఫీట్ల నీరు అంతర్భాగం కనుక కేటాయించిన నీటిలోని ఒక భాగాన్ని (29 మిలియన్ క్యూబిక్ ఫీట్లు) ఉపయోగించుకోవడం కొత్త కృష్ణా ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధం కాదు కాబట్టి అవసరమైన అనుమతులు ఇవ్వవలసిందిగా అనుమతులు జారీచేశారు.

ఆ తర్వాత 25-2-2009 నాడు సాగునీటిశాఖ ఇంజనీర్-చీఫ్ అంతరాష్ట్ర వ్యవహారాలు, హైడ్రాలజీ, శ్రీశైలం చీఫ్ ఇంజనీర్ల సమావేశం జరిపి సభ్యులందరి ఆమోదంతో సదరు సంస్థకు అనుమతులు మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వం 2-4-2002 నాడు జారీ చేసిన జీవో 39 అనుసరించి తగిన చార్జీలు ఇంకా ప్రభుత్వం విధించే ఇతర సుంకాలు చెల్లించే షరతుపైన సిఫారసులు చేయడం జరిగింది. ఈరకంగా పది సంవత్సరాల కోసం 29 మిలియన్ క్యూబిక్ ఫీట్ల నీరు సాలీనా, అంటే రోజుకు 5 లక్షల గ్యాలన్ల నీటిని ఉపయోగించుకునే నిమిత్తం ప్రభుత్వం అనుమతులు ఇస్తూ 17 మార్చి 2010న జీవో 23 జారీచేసింది. ఇది పైకి కనిపించే కథ. అంటే ప్రభుత్వం వారు విడుదల చేసిన జీవో 23 చదివితే అర్థమయ్యే కథ. ఇది చదివిన వారికి అంతా సాఫీగానే జరిగింది కదా అనిపిస్తుంది. విషయాన్ని సమక్షిగంగా పరిశీలించి సంబంధిత ఇంజనీర్ల అభివూపాయం తీసుకున్నాకే జీవో జారీ చేశారు కనుక ఇందులో తప్పేముందని అనిపిస్తుంది. జరిగిందేమంటే.. సంస్థవారు జూలై 2007లో చీఫ్ ఇంజనీర్ కార్యాలయానికి అర్జీ పెట్టుకుంటే, ఆ అర్జీని సీఇ-ఎస్‌ఇకి, ఎస్ ఇ-ఇఇకి పంపటం జరిగింది. ఈ అర్జీపైన సంబంధిత ఇఇ తన 24-11-2007 నాటి ఉత్తరంలో ఏ అభివూపాయం వెలిబుచ్చారో చూద్దాం. నార్కెట్‌పల్లి దగ్గర ఎస్‌ఎల్‌బీసీ కాలువ, ఉపకాలువలు లేవు. ప్రాజెక్టు నుంచి లభ్యమయ్యే నీరు 3 లక్షల 70 వేల ఎకరాల సేద్యానికి, ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగుకోసం ఉద్దేశింపబడింది. నార్కెట్‌పల్లి పరిసర ప్రాంతాలకు బ్రాహ్మణ వద్ద ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం పూర్తి అయ్యాక నీరు లభ్యం కానుంది. ఈ పథకం పూర్తికావడానికి మరో 4-5 ఏళ్లు పట్టొచ్చు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక కూడా రిజర్వాయర్ నుంచి రోజుకు 5 లక్షల గ్యాలన్ల నీటిని తరలించడం జరిగితే, ప్రాజెక్టు నుంచి ఉద్దేశింపబడ్డ సాగునీటి సౌకర్యం, పరిసర గ్రామాలకు తాగునీరు అందించడం సాధ్యపడదు. ఏదేమైనా ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే విషయంపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలివ్వవలసుంటుంది. ఈ లేఖను ఎస్‌ఇకి పంపారు. ఇఇ బహుశా ఎస్‌ఇ కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అభివూపాయంతో ఏకీభవించి ఉంటారు. అదే విషయాన్ని 29-11-2007 నాడు అంటే మరో అయిదు రోజుల తర్వాత చీఫ్ ఇంజనీర్ కార్యాలయం పంపినట్టు సమాచారం. దీంతో సదరు సంస్థ ఆలోచనలన్నీ తలకిందులయ్యాయి. తమ ఆశలపైన నీళ్లు కుమ్మరిచ్చినట్టు కావడంతో పై నుంచి పైరవీ మొదలయింది. చీఫ్ ఇంజనీర్ 8-1-2008 నాటి తన ఉత్తరంలో ఎస్‌ఇకి తన మనసులోని మాటను ఎంత తెలివిగా తెలియచేశాడో ఈ ఉత్తరం చూస్తే తెలుస్తున్నది.

యునైటెడ్ సీమ్‌పూస్ ట్యూబ్యులర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు కోరిన నీరు ఏటా 29 మిలియన్ ఘనపు అడుగులు అంటే రోజుకు 5 లక్షల గ్యాలెన్లు. ప్రాజెక్టు వినియోగించుకునే 30 టీఎంసీల పరిమాణంతో పోలిస్తే ఇది అతి స్వల్పం. పైపెచ్చు పరిక్షిశమకు ప్రాజెక్టుల నుంచి విడుదలయ్యే నీటిలో 10 శాతం కేటాయించేటట్టుగా ప్రాజెక్టు రిపోర్టులు రూపొందించాలని ప్రభుత్వం ఆదేశాలున్నట్టు గుర్తు చేయడం జరుగుతున్నది. కనుక కంపెనీ వారి అభ్యర్థనను పరిశీలించి, తగు ప్రతిపాదనలు చేయవలసిందిగా ఎస్‌ఇని కోరుతున్నది. ఇది వై అబ్దుల్ బషీర్ ఆనాటి చీఫ్ ఇంజనీర్ 8-1-2008 నాడు సంతకం చేసి ఎస్‌ఇ కి పంపిన లేఖ. ఏదేమైతేనేం, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్‌ఇ లు ఇద్దరూ ప్రాజెక్టులోని నీరు ఫ్లోరైడ్ పీడిత ప్రాంత ప్రజల తాగుకు సాగుకు నోచుకోని భూముల సేద్యం కోసమని స్పష్టంగా నివేదించినా ఈ నేపథ్యంలో పరిక్షిశమలకు తరలించడం అసాధ్యమని ధైర్యంగా చెప్పినా పైనుంచి వచ్చిన ఆదేశాలతో కంపెనీకి నీళ్లు తరలించేందుకు అనుమతులు ఇచ్చారు.రోజుకు 5లక్షల గ్యాలన్ల నీరు అతిస్వల్పమట. ఒక గ్యాలను కు 4.546 లీటరు.్ల అంటే రోజుకు 22 లక్షల 73 వేల లీటర్ల నీరు. రోజుకు 40 లీటర్లు గ్రామ ప్రజలకు అందవలసిన నీరు రోజుకు చొప్పున 57 వేల మందికి సరిపోతుంది. సగటున వేయి మంది జనాభా ఉంటే 60 గ్రామాలకు తాగునీరు. ఇదీ ఫ్లోరైడ్ పీడిత గ్రామాల విషయంలో ప్రభుత్వం చేసే నిర్ధాక్షిణ్య సిఫారసు. ఓ పక్కన స్పీకర్ స్వయంగా అఖిల పక్షాన్ని తీసుకుని ఫ్లోరైడ్ పీడిత ప్రజల దురవస్థ గమనించి కంటతడిబెట్టి పరిష్కార మార్గాలు ఆలోచిస్తుంటే, మరో పక్కన అధికార పక్షానికి వంతపాడే సంబంధిత సంస్థ ఎవరి చేతులు తడిపిందోకాని ఇలాంటి దుర్మార్గపు జీవో పట్టుకొచ్చింది. తరలించదలిచిన 29 మిలియన్ క్యూబిక్ ఫీట్ల నీరు ఎస్‌ఎల్‌బీసీ కి కేటాయించిన 30 టీఎంసీల నీటిలో అంతర్భాగం. కనుక అలా తరలించడం కొత్త కృష్ణా ట్రిబ్యునల్ ఆదేశాలను ఉల్లంఘన కాదు అని సీఇ హైడ్రాలజీ వారి సిఫారసు. ఇది పచ్చి అబద్ధం. అసలు ట్రిబ్యునల్ ఆదేశాల గురించి మాట్లాడే అర్హత ఆయనకున్నదా? అది చీఫ్ ఇంజనీర్ అంతర్ రాష్ట్ర వ్యవహారాల పరిధిలోనిది. కొత్త ట్రిబ్యునల్ అంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. అది ఇంకా అవార్డు ఎక్కడ ప్రకటించింది? ఇచ్చిన ప్రాథమిక అవార్డులో కూడా ఎస్‌ఎల్‌బీసీ కి నీరెక్కడ కేటాయించింది? అసలు ఎస్‌ఎల్‌బీసీకి నీటి కేటాయింపు ఎవరు చేశారు? పోనీ పాత ట్రిబ్యునల్ (బచావత్) అయినా చేసిందా? లేదు. మన ప్రభుత్వం అటు తెలుగుగంగకు, ఇటు ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులకు సర్‌ఫ్లస్‌ను మాత్రమే కేటాయించింది. అసలు సర్‌ఫ్లస్ (అదనపు జలాల)పైనే మనకు హక్కులేనప్పుడు ట్రిబ్యునల్‌కు సంబంధం లేని అంశాన్ని జీవోలో పేర్కొనడం దేనికి? అంటే అంతా గూడుపుఠాణీ, గోల్‌మాల్ జరిగిందన్నమాట. ప్రభుత్వం నీటిని కేటాయించదలచుకున్నది. కేటాయించింది. తన చర్యను సమర్థించుకోవడానికి అధికారులను ఇ లా ఉపయోగించుకున్నది.

ఇక్కడితో కథ ముగియ లేదు . ‘రక్తాన్ని రుచి చూసిన పులిలాగ ’ నీటి రుచి ఎరిగిన పారిక్షిశామికవేత్తలు సులభంగా జలాశయంలోని నీటిని సంపాదించే మార్గముందని కనిపెట్టగానే జీవో 146, జీవో 94ల అడుగుజాడల్లోనే వ్యవహరించి, అదనపు పరిక్షిశమల కోసం అదనపు నీటి కేటాయింపుల కోసం వ్యూహం పన్నారు. కామినేని గ్రూప్ వారు తమ అనుబంధ సంస్థలైన యునైటెడ్ సీమ్‌పూస్ ట్యూబ్యులర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి జీవో 23 ద్వారా రోజుకు 5లక్షల గ్యాలన్ల నీరు సంపాదించిన పద్ధతిలోనే తమ సంస్థలైన కామినేని స్టీల్ కంపెనీకి రోజుకు 5లక్షల గ్యాలెన్లు (ఏడాదికి 29 మిలియన్ క్యూబిక్ ఫీట్లు) కామినేని పవర్ ప్లాంట్ కంపెనీకి రోజుకు (సుమారు 21 లక్షల 30 వేల గ్యాలె న్లు(124 మిలియన్ క్యూబిక్ ఫీట్లు) వెరసి 182 మిలియన్ క్యూబిక్ ఫీట్లు నీరు తరలించడానికి ప్లానులు వేసి, అనుకూలంగా ఆర్డర్లు వేయించుకుని, ఇం కా జీవోలు విడుదల కాకముందే భారీ సైజుల్లో ఉదయసముద్రం నుంచి పైపులు వేస్తున్నారు. దీంతో ‘నమస్తే తెలంగాణ’ పత్రిక, తెరాస నాయకులు, రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం వారు ఇతర ప్రజాసంఘాలు కల్పించుకోవడంతో మొత్తం వ్యవహారం బట్టబయలైంది. పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు కొనసాగించాక అసలు తాగటానికే నీరు లేక అవస్థలు పడుతున్న నల్లగొండ జిల్లాలో ఈ అక్రమాలేమిటని మీడియా, ప్రతిపక్ష నాయకులు ధ్వజమెత్తుతే, ప్రభుత్వం ఎప్పటి మాదిరిగానే దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. తాజాగా 5-3-2012 నాడు ప్రభుత్వం ఇంజనీర్ చీఫ్ సాగునీటి శాఖకు ఆయకట్టుకు ఎంతనీరు కావాలి? ఆయకట్టుకు నీరందించాక నీటిలో ఏమైనా ఆదా అయ్యే అవకాశముందా తెలియచేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీన్ని బట్టి అర్థమయ్యేదేమంటే సమైక్యాంవూధలో నీటి దోపిడీ యధేచ్ఛగా సాగుతూ ఉంటుంది. ఎంతో పోరాటం చేస్తే ఆగడాలు కాస్త ఆగుతాయి. అదీ తాత్కాలికంగా సద్దుమణిగాక మళ్లీ పాతపాటే. తెలంగాణ వచ్చేదాక తప్పవు ఈ తిప్పలు.

-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర