సాగర్ నీటి దోపిడీ


Sun,July 8, 2012 11:49 PM

అకస్మాత్తుగా డెల్టా ప్రయోజనాల కోసం 15 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పార్టీలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టింది. దొంగచాటుగా సాగర్ నుంచి విడుదల చేసిన నీటిని టీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకున్నారు. అంతా నిబంధనల ప్రకారమే జరిగిందని మంత్రి పార్థసారథి, మరికొందరు కోస్తాంధ్ర నాయకులు చెప్తుంటే, నియమాలకు విరుద్ధమని సీపీఎం నేత రాఘవులు అంటున్నారు. మరోపక్క శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయకూడదని మంత్రి ఏరాసు ముఖ్యమంవూతికి తన నిరసనను తెలియజేశారు. ఏమిటీ గొడవంతా? వాస్తవాలు చెప్తారా?

-సి.నవనీతకృష్ణ, చిక్కడపల్లి, హైదరాబాద్ఈ గొడవ కొత్తదేం కాదు. చంద్రబాబు హయాంలో తగినంత నీరులేనప్పుడు శ్రీశైలం, నాగర్జునసాగర్ జలాశయాలు దాదాపు ఎండిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, నారుమళ్ల కోసం కృష్ణాడెల్టా రైతాంగం సాగర్ నుంచి ఉన్న కాస్త నీటిని విడుదల చేయాలని తీవ్ర ఒత్తిడి తేవడం, కృష్ణా బ్యారేజీపైన పార్టీలకతీతంగా నాయకులు, రైతులు ఏకతాటిపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి తమ డిమాండ్లను సాధించుకోవడం లోగడ జరిగిందే. కాకపోతే అప్పటికీ, ఇప్పటికీ ఉన్న తేడా చంద్రబాబు అధ్యక్షత వహిం చి అఖిల పక్షం నిర్వహించి పరిస్థితిని సమీక్షించి 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న డెల్టాకు నీటి ప్రాధాన్యం ఉన్నదని తేల్చి, మిగిలిన ప్రాజెక్టుల డిమాండ్‌లను పక్కనబెట్టి డెల్టాకు నీటి విడుదల చేయాల్సిన అవసరం ఉందని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ మీటింగ్‌లో తెరాస పక్షాన నరేంవూదతోపాటు నేను కూడా పాల్గొని బచావత్ అవార్డ్ ప్రకారం డెల్టాకు నీటి విడుదలపై ఎలాంటి ప్రాధాన్యం లేదని సాక్ష్యాధారాలతో చూపించడం జరిగింది. కానీ ఎప్పటిలాగే ప్రభుత్వం మొండివైఖరి అవలంబించడం తో టీఆర్‌ఎస్ అఖిల పక్షం నుంచి వాకౌట్ చేసింది. ఆ సమావేశంలోఆనాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ఆర్ నోరువిప్పకుండా, ఖిన్నుడై కూర్చున్నాడు. ఆనాటికి రాయలసీమ డిమాం డ్ తెరపైకి రాలేదు. వైఎస్‌ఆర్ ముఖ్యమం త్రి అయ్యాక పోతిడ్డిపాడు నిర్మాణం, జీవో 107, జీవో170 ,జీవో 233, జీవో3 విడుదల చేసి శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని తరలిం చే వెసులుబాటు కల్పించిన ఘనత వైఎస్‌ఆర్ ప్రభుత్వానిదే.

ఈరగడ కొత్తదేమీ కాదు. 160సంవత్సరాల నుంచి కృష్ణా జలాలు వాడుకుంటున్నాం. తమ డెల్టాకు అగ్రతాంబూలం ఇవ్వాలన్నది కోస్తాంధ్ర నాయకులు, రైతులవాదన. అది మా హక్కు అంటారు. మరో అంశం వారు లేవనెత్తేది ఏమటంటే- జూన్ మాసాంతంలో నారుమళ్లు పూర్తికాకపోతే, ఖరీఫ్ పంట కు ఆలస్యమై...అక్టోబర్, నవంబర్ నాటికి పం టకోతకు రాకపోతే, అప్పుడు పంటలు తుపా ను బారినపడే ప్రమాదముంది. ఫలితంగా అన్నపూర్ణ లాంటి డెల్టా అధోగతి పాలవుతుం ది. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఉన్న నీటిని డెల్టాకు సమర్పించుకోవాలన్నది వారి ఏకైక డిమాండ్. దీనికి రాజకీయంతో ముడిపెట్టకూడదని వారి హితబోధ. అంటే సాగర్ రైతుల డిమాండ్ గురించి మాట్లాడితే రాజకీ యం అన్నది కోస్తాంధ్ర నాయకుల కామెంట్- వాహ్ క్యాబాత్ హై!

మనలో చాలా మంది Riparian rights (రైపేరియన్ హక్కులు) గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. నీటిని ముందు అనుభవిస్తున్న వారికి, ఆ తర్వాత వచ్చిన వారికంటే ఎక్కువ హక్కు ఉంటుంది అన్నది ఆ సూత్రం చెప్పేమాట. అమెరికా చట్టం కూడా అదే చెబుతుంది. నీటిని ముందుగా వినియోగించుకుంటున్న వారికి ఆతరువాత నీటిని వినియోగించుకునే వారికన్నా ప్రాధాన్యత ఉంటుంది. అంతర్జాతీయ చట్ట సంస్థ రూపొందించిన ‘హెల్‌సెంకీ’ నియమాలు కూడా ఈ విషయాన్ని దృవీకరిస్తున్నాయి. వాస్తవానికి కృష్ణాజలాల పంపిణీ కోసం ఏర్పాటైన బచావత్ ట్రిబ్యూనల్ కూడా ఈ నియమాన్ని పరిగణనలోకి తీసుకుంది. కనుకనే ఆంధ్రవూపదేశ్‌కు మిగిలిన రాష్ట్రాల కన్నా అత్యధికంగా నీటిని కేటాయించింది. జరిగిందేమంటే.. ట్రిబ్యూనల్ సెప్టెంబర్ 1960ను ‘కట్‌ఆఫ్’గా ప్రకటించింది. ఆనాటికి అమలులో ఉన్న, నిర్మాణంలో ఉన్న, లేక ప్రణాళికా సంఘం ఆమోదించిన ప్రాజెక్టులను ‘అమలులో ఉన్న వినియోగాల’ శ్రేణిలోకి చేర్చింది. 150 సంవత్సరాల నుంచి నీటిని వాడుకుంటున్న కృష్ణాడెల్టా రైతుల అవసరాలు, 100 సంవత్సరాల పైబడ్డ కేసీ కాలువ రైతాంగం ప్రయోజనాలతో పాటు తెలంగాణ, సీమలోని మరికొన్ని ప్రాజెక్టులు, తుంగభద్ర, నాగార్జునసాగర్ అవసరాలనుకూడా దృష్టిలో పెట్టుకున్న ట్రిబ్యూనల్ మోదటి కేటగిరీలో భారీ నీటి పరిమాణాన్ని అంటే, 749.16 టీఎంసీల నీటిని కేటాయించింది. అలా మొదటి కేటగిరీలో మిగిలిన రెండు రాష్ట్రాలకు కూడా పంచాక, మిగిలిన నీటిలో రెండవ శ్రేణిలో ‘ప్రతిపాదిత వినియోగాల’ కింద శ్రీశైలం రిజర్వాయర్ ఆవిరినష్టం కోసం 33 టీఎంసీలు, జూరాల ప్రాజెక్టు కోసం 17.84 టీఎంసీలు కలపి మొత్తం 50.84 టీఎంసీలను ఆంధ్రవూపదేశ్‌కు కేటాయించింది.

రెండు కేటగిరీల నీటి కేటాయింపులు కలిసి మనకు దక్కింది 800 టీఎంసీలు. మూడు రాష్ట్రాలకు కలిపి కృష్ణానదిలో 75 శాతం విశ్వసనీయత ఆధారంగా అంచనావేసిన 2060 టీఎంసీలలో ఆంధ్రవూపదేశ్‌కు 800 టీఎంసీలు, కర్నాటకకు 700 టీఎంసీలు మాత్రమే దక్కాయి. నిజానికి పరివాహక ప్రాంతం దృష్ట్యా చూసినా, జనాభా వెనుకబాటుతనం వంటి అనేక అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నా మనకు దక్కిన వాటా చాలా ఎక్కువే.

‘రీ-జనరేషన్ ఫ్లోస్’ ను కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 2134 టీఎంసీలు. ఆంధ్రవూపదేశ్‌కు లభించిన నీటి వాటా 811 టీఎంసీలు. ఇందులో నాగార్జునసాగర్ ఎడమ కాలువకు 132 టీఎంసీలు, కుడికాలువకు 132 టీఎంసీలు, ఆవిరి నష్టం 17 టీఎంసీలు కలిపి 281 టీఎంసీలు. కృష్ణా డెల్టాకు మొదటి పంట 161.90 టీఎంసీలు, రెండవ పంట, ఇంకా ఇతర ప్రయోజనాలకు 15.30 టీఎంసీలు. వెరసి 181.20 టీఎంసీలను ట్రిబ్యునల్ కేటాయించింది. మొదటి పంట 10 లక్షల 50 వేల ఎకరాలు, రెండో పంట 37,498 ఎకరాలకు మాత్రమే ట్రిబ్యునల్ ఆమోదించింది. ఈ రోజున అనధికారికంగా ఎంత పంట వేస్తున్నారో కోసాంధ్ర నాయకులే చెప్పాలి.

కృష్ణా డెల్టాకు నీటి కేటాయింపులు చేస్తూ ‘డెల్టా అవసరాలు కృష్ణానదీలో లభించే స్వేచ్ఛా జలాల నుంచి (Free Flows) మాత్రమే ఇచ్చి తీరాలి’ అని ట్రిబ్యునల్ నిర్ణయించింది. ‘ఫ్రీ ఫ్లోస్’ అంటే ఏమిటో ట్రిబ్యునల్ విడమర్చి చెప్పినట్టులేదు. సాగర్‌కు దిగువన ప్రకాశం బ్యారేజీ వరకు లభించే జలాలు ఫ్రీ ఫ్లోస్ (స్వేచ్ఛా జలాలు)గా పరిగణించవచ్చు. అవి 101.20 టీఎంసీలు ఉంటాయని రాజారావు కమిటీ (1985 ఏర్పాటైన నిపుణుల సంఘం) నిర్ధారించింది. కనుక మిగిలిన 80 టీఎంసీలు నాగార్జునసాగర్ ఎగువ నుంచి రావాలి అని అర్థం. నాగార్జునసాగర్ ఎగువ నుంచి రావాలంటే సాగర్ జలాశయంలో సాగర్ ఆయకట్టు కోసం నిలువ ఉంచిన నీటి పరిమాణం నుంచి అని కాదు. సాగర్ పైన శ్రీశైలం నుంచి కానీ, మధ్యలో వచ్చే వాగులు, వంకలు ప్రవహించే (Intermediate) క్యాచిమెంట్ నుంచి కానీ వచ్చే నీటిలో 80 టీఎంసీల వరకు సాగర్ కిందకు వదలాలని అర్థం. ఇక్కడే కోస్తాంధ్ర నాయకులు, రైతులు, మేధావులు చేసే వింత వాదన ఒకటుంది.

‘మాకు మొదటి హక్కు ఉంది, సాగర్, శ్రీశైలం, జూరాల తర్వాత వచ్చాయి కాబట్టి, వాటిని ఖాళీ చేసైనా సరే మాకు మా వాటా నీటిని వదలాల్సిందే’ అని కోస్తాంధ్ర వారు చేస్తున్న వాదన కాసేపటికి సక్రమమే అనుకుందాం. వారు వాదిస్తున్నట్టు వారికి సంక్రమించింది చట్టపరమైన హక్కు అయితే, వారు న్యాయస్థానాలను ఆశ్రయించి సాగర్, శ్రీశైలం, జూరాలేం ఖర్మ.., ఆలమట్టి, నారాయణపురం రిజర్వాయర్లను కూడా ఖాళీ చేయించి తమ హక్కులను కాపాడుకోవచ్చుకదా! కాని విషయమేమంటే వారికి కూడా తెలుసు. డెల్టా కున్నది సంప్రదాయ హక్కు మాత్రమే అని. చట్ట పరమైన హక్కు కాదని. కనుకనే పెద్దన్న వైఖరిని ప్రదర్శించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమ పబ్బం గడుపుకుంటున్నారు. మరో విషయం- బచావత్ ట్రిబ్యునల్ chapter XII లో స్పష్టంగా చెప్పిన మాటలు ఇవి-‘కేటాయింపు తుది పథకంలో చేర్చిన అన్ని ప్రాజెక్టులు, అవి రక్షణ పొందినవైనా, పొందనివైనా లభించిన నీటి మేరకు పొందుతాయి.

రక్షణ కల్పించినంత మాత్రాన ఒక ప్రాజెక్టుకు, ఇతర ప్రాజెక్టు రక్షణ కల్పించని సంపూర్ణంగా, సకాలంలో నీటి సరఫరా విషయంలో ప్రాధాన్యం ఉం టుందని కాదు’. అంటే.. ట్రిబ్యునల్ తన నివేదికలో చేర్చిన అన్ని ప్రాజెక్టులకు సమానమైన ప్రాధాన్యం ఉంటుందని వారి ఉద్దేశం. కనుక కోస్తాంధ్ర నాయకుల పిడివాదం నిజం కాదు. కృష్ణా డెల్టాకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. బచావత్ ట్రిబ్యూనల్ ఏర్పడక పోయి ఉంటే నదీ జలాలపైన ఎలాంటి ఒప్పందాలు జరగకపోయి ఉంటే వారు వాదించినట్టు First come first serve కరెక్ట్ అయ్యి ఉండేదేమో!

బచావత్ ట్రిబ్యూనల్ ఆదేశాలను ఎన్నడు పట్టించుకున్న పాపాన పోలేదు ఈ ప్రభుత్వం. తమకు కావాలనుకున్నప్పుడు ట్రిబ్యూనల్ ఆశ్రయిస్తుంది. అనువుగా లేనప్పుడు పక్కన పెడ్తుం ది. అవసరమనుకుంటే కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వాలని ఏ ఏ రిపోర్టులు ఎలా వల్లె వేస్తున్నాయో తెలుస్తుంది. ఉదాహరణకు నాగార్జునసాగర్ ప్రాజె క్టు రిపోర్టును ‘కోట్’ చేస్తూ మొదటి పంట కోసం 26 టీఎంసీలు, రెండవ, ఇతర పంటల కోసం 15.30 టీఎంసీలు. ఆవిరి నష్టం 4 టీఎంసీలు. వెరసి 45 టీఎంసీలు విడుదల చేయాలని రిపోర్టులో ఉందని చెపుతున్నది. పులిచింతల రిపోర్టును ప్రస్తావిస్తూ.. అందులో సాగర్ నుంచి 131 టీఎంసీలు విడుదల చేయాలని చెప్పుతున్నది నిపుణుల సంఘం. నివేదిక ఎలాగూ 80 టీఎంసీల నీటిని సాగర్ నుంచి విడుదల చేయాలని చెప్పనే చెప్పింది. అంటే నాగార్జునసాగర్, నుంచి డెల్టా కోసం 45 నుంచి 130 టీఎంసీల దాక విడుదల చేయాల్సిందే అన్నట్టు ప్రభుత్వం మాట్లాడుతున్నది. మరి సాగర్‌లో ఉంటేకదా సప్లయ్ చేసేది.

సాగర్‌ని కట్టింది ఆయకట్టు ప్రాంత ప్రయోజనాల కోసం కదా. సాగర్ రైతాంగం ప్రయోజనాలను పణంగా పెట్టి, కింది డెల్టా కోసం నీరు ఎలా వదలగలరన్నది ఆలోచించరు. ఇదిలా ఉండగా ప్రభుత్వం 1996లో జీవో 69ను విడుదల చేసింది. ప్రస్తుతం చెలామణి అవుతున్నది అమలులో ఉన్నదే జీవో 69. ఆ జీవో శ్రీశైలం నుంచి జలాశయ స్థాయిలను బట్టి నీరు ఏ ఏ ప్రయోజనాల కోసం వాడవచ్చునో నిర్దేశిస్తుంది.
శ్రీశైలం జలాశయం పూర్తి జలస్థాయి 885 అడుగులు(FRL). శ్రీశైలం జలాశయం కనిష్ట నీటి విడుదల స్థాయి 834 అడుగులు(MDDL).నాగార్జునసాగర్ జలాశయం పూర్తి జలస్థాయి 590 అడుగులు (FRL) . సాగర్ జలాశయం కనిష్ట నీటి విడుదల స్థాయి 510 అడుగులు (MDDL). శ్రీశైలం జలాశయం నుంచి 834 అడుగులు స్థాయికి దిగువ న ఉన్నప్పుడు ఇతర ప్రయోజనాల కోసం నీటిని విడుదల చేయరాదు. ఇది ప్రథమ నియమం. తీవ్ర అనావృష్టి పరిస్థితుల్లో అత్యవసరమని భావిస్తే తాగు నీటి కోసం 834 అడుగులు కంటే కింది వరకు జలాశయం నుంచి నీటిని విడుదల చేయవచ్చు. శ్రీశైలంలో 854 అడుగులు కింద జలస్థాయి ఉంటే శ్రీశైలం కుడిగట్టు కాలువకు గాని, తెలుగుగంగకు కాని నీటిని విడుదల చేయరాదు. 834 నుంచి 854 మధ్య జలస్ధాయి ఉం 834 అడుగులు వచ్చే వరకు సాగర్, ప్రకాశం బ్యారేజీ అవసరాలకు (సాగర్ తీర్చ గా మిగిలిన భాగం, నీరున్నంత మేరకు) విడుద ల చేయవచ్చు.

ఇక సాగర్ విషయానికి వస్తే- 590, 510 అడుగుల మధ్య జలస్థాయి ఉంటే హైదరాబాద్ తాగునీటికి ప్రకాశం బ్యారేజీకి, సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయవచ్చు. శ్రీశైలం నుంచి వచ్చిన నీరు సాగర్‌లోని నీరు తగినంత లేకపోతే,సాగర్ ఆయకట్టులో కోత పెట్టాలి. హైదరాబాద్ తాగునీటి విడుదలకు ప్రాధాన్యం ఉంటుంది. సాగర్‌లో జలస్థాయి 510 అడుగుల కిందికి పడిపోతే సాగర్ ఆయకట్టు ప్రకాశం ఆయకట్టుకు విడుదల ఉండదు. హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా మాత్రం కొనసాగుతుంది.
ఈ జీవో ఏం చేప్తుంది.. శ్రీశైలంలో 834 అడుగుల కంటే దిగువ, నాగార్జునసాగర్‌లో 510 అడుగులకు దిగువ ఉన్న నీటిని తాగునీటి కోసం తప్ప విడుదల చేయరాదని. కానీ ప్రభుత్వం జీవో 69 కి తిలోదాకాలిచ్చి ఏం నిర్ణయించింది?

శ్రీశైలం నుంచి (అప్పటికీ దాని స్థాయి 790.56 అడుగులు) 760 అడుగుల వరకు ఉ న్న 12టీఎంసీలను అదేవిధంగా సాగర్‌లో (511.80 అడుగుల నుంచి) మరో 3టీఎంసీలను లాగి వెరసి 15 టీఎంసీలను కృష్ణా డెల్టాకు దారాదత్తం చేయాలని. అంటే జీవో69 కు పూర్తిగా తూట్లు పొడిచినట్లే కదా? మరి నిబంధనల ప్రకారమే నీటి విడుదల జరిగిందని సున్నాయి రాగాలు ఆలపించే లగడపాటి, రాయపాటి, కోడెల, పార్థసారథి ఇంకా కోస్తాంధ్ర నాయకులు దీనికి ఏం జవాబు చెప్తారు? సాగర్‌లో ప్రస్తుత జలస్థాయి 510 అడుగుల కంటే దిగువకు పడిపోయినట్టు సమాచారం. అయినా ఈ ప్రభుత్వం నీటిని జలగలా లాగేస్తున్నది. ఇంకా సమైక్యరాగాలు ఆలపించమంటోంది సీమాంధ్ర నాయకత్వం. కేవలం విద్యుత్తుకోసం ఉద్దేశించబడ్డ శ్రీశైలం ప్రాజెక్టులో ముందు మద్రాసుకు నీళ్ల పేరిట, ఆనక ఎస్‌ఆర్‌బీసీ పేరిట పోతిడ్డి పాడు మొదలు పెట్టిందే సీమాంధ్ర నాయకత్వం. దాన్ని దుర్మార్గంగా సైజు పెంచి జీవో 69లోని 834 st MDDL ని అఖిల పక్షం ముసుగులో 854 అడుగులు పెంచి జీవో107 తీసుకొచ్చింది. శ్రీశైలాన్ని సాగునీటి ప్రాజెక్టుగా మార్చిన మహానుభావుడే వైఎస్‌ఆర్. అందుకే 854 అడుగుల దిగువన నీటిని విడుదల చేయకూడదని రంకెలేస్తారు సీమాంధ్ర నాయకులు. కిరణ్‌కుమార్‌డ్డి ఆ ప్రాంతవాడేనన్న ధైర్యం. అటు తడిగుడ్డతో గొంతుకోయించుకోవడమా? లేక ఇటు నాటుకత్తితో మెడనరికించుకోవడమా? ఏదో ఒకటి తేల్చుకోవలసింది తెలంగాణనే. ఏదేమైనా సమైక్యాంవూధలో అన్ని రకాలుగా ఉల్లంఘనలు, అవమానాలు రుచిచూడవలసిందే. ట్రిబ్యునల్ ఆదేశాలను అడిగేనాథుడే లేడు. జీవోలు బుట్ట దాఖలు. కర్ర ఉన్నవాడిదే బర్రె.-అంతే.

-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

country oven

Featured Articles