మా నీళ్లు మాకు దక్కనీయరా..?


Sun,July 1, 2012 11:52 PM

Rajolibanda talangana patrika telangana culture telangana politics telangana cinemaతెలంగాణ నుంచి సీమాంవూధలోనికి ప్రవహిస్తున్న నదులు, వాటి ఉపనదులు ఏమిటి? వాటి నదీ పరీవాహక ప్రాంతాలు, జిల్లాలు మొత్తం ఆంధ్రవూపదేశ్‌లో ఏవి? జలయజ్ఞానికి ముందు ఈ నదుల నుంచి నదీ పరీవాహక ప్రాంతంలో లేని ప్రాంత్రాలకు ఎంతనీటిని వాడుతున్నారు. అంటే తెలంగాణకు చెందవలసిన నీటిని సీమాంవూధవాళ్లు ఎంత దోచుకున్నారు! దోచుకుంటున్నారు?

-గిన్నారపు నర్సింహారావు, విద్యానగర్, హైదరాబాద్దోచుకున్న, దోచుకుంటున్న వివరాల్లోకి వెళ్లే ముందు ఆంధ్రవూపదేశ్‌లోని జలసంపద గురించి తెలుసుకుందాం. రాష్ట్రంలో మొత్తం 40 నదీ బేసిన్లున్నాయి. ఇందులో పెద్దవీ ఉన్నాయి. చిన్నవీ ఉన్నాయి. ఒక రాష్ట్రం కంటే ఎక్కువ రాష్ట్రాల గుండా ప్రవహించే నదులను అంతర్‌రాష్ట్ర నదులంటాం. అలాంటివి 12 ఉన్నాయి. రాష్ట్రంలోని వనరులన్నీ కలిసి సాలీనా 75 శాతం విశ్వసనీయత ప్రాతిపదికన 2746 టీఎంసీల నీటిని అందిస్తున్నాయి. ఒక్క టీఎంసీ అంటే శత కోటి ఘనపు అడుగులు.

ఒక్కో బేసిన్, అందులో లభ్యమయ్యే నీటి వివరాలు టీఎంసీలలో- బహుథ(2.29),మహేంవూదతనయ(4.876),పూండి మైనర్ డ్రైనేజి (1.444), నేపాడు మైనర్ డ్రైనేజి(4.599), వంశధార (46.002),నాగావళి (48.400), పెద్దగెడ్డ (2,533),కందివలసగెడ్డ(1.917), చంపావతి (8.350), గోస్తని (8.616) మధురవాడ (1.148), నర్వగెడ ్డ(1.610), అనకాపల్లి మైనర్ (1.235), శారద (12.506), వరాహ (7,218), తాండవ(10.717), పంపా(3.415), సుద్దగెడ్డ (3.642), ఏలేరు (20.379), గోదావరి (1480), ఎర్రకాలువ (32.415), తమ్మిలేరు (9.644), రామిలేరు (2.080), బుడమేరు (10.800), కృషా ్ణ(811.00), రొంపేరు (6.603), గుండ్లకమ్మ (20.479), గుండ్లకమ్మ మూసీ మధ్యగల మైనర్ డ్రైనేజీలు (2.125),మూసీ (5.133), పాలేరు (5.817), మున్నేరు (11.450), కండలేరు (4.425), పెన్నార్ (98.649), ఉప్పు (16.580), స్వర్ణముఖి (17.331), కాలంగి (8.689), అరన్వార్ (6.379), కొర్తాల్లార్ (5.233), పాలార్ (16.596), పొన్నయ్యార్ (0.179).
Mapp talangana patrika telangana culture telangana politics telangana cinema
మొత్తం 40 నదీబేసిన్లు 2764. 504 టీఎంసీలు. గమనించవలసిందేమంటే మూసీ, పాలే రు, మున్నేరు, స్వతంత్ర నదీ బేసిన్లు. కృష్ణానది ఉపనదులు కూడాఇవే పేర్లతో ఉన్నాయి. ఇకపోతే కృష్ణా, గోదావరిబేసిన్లు రెండే తెలంగాణ గుండా ప్రవహిస్తున్నాయి. వంశధార, నాగావళి వంటి నదులను ఆంధ్రవూపదేశ్‌తోపాటు ఒడిషా, పంచుకుంటున్నవి. ఒడిషా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రవూపదేశ్‌తోపాటు గోదావరి నదిని, అట్లాగే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రవూపదేశ్‌లు కృష్ణానదిని పంచుకుంటున్నాయి. ఇంకా పెన్నానదిని ఆంధ్రవూపదేశ్‌తోపాటు కర్ణాటక, పాలార్ వంటి చిన్ననదీ బేసిన్లను ఆంధ్రవూపదేశ్‌తోపాటు తమిళనాడు పంచుకుంటున్నాయి.

ఇకపోతే అన్ని నదీ బేసిన్లలోకి గోదావరి పెద్దది. ఇందులో 1480టీఎంసీలు లభ్యమవుతాయి. ఆ తర్వాత కృష్ణా 811 టీఎంసీలు. మిగతావన్నీ వందలోపే. గోదావరి మహారాష్ట్రలోని నాసిక్ మహారాష్ట్రలో బయలుదేరి బంగాళాఖాతం చేరుతున్నది. దీన్ని 12 నదీ సబ్‌బేసిన్లు గా విభజించారు. అవి జి1- అప్పర్‌గోదావరి, జి2- ప్రవర, జి3- పూర్ణ, జి4-మంజీర, జి5- మిడిల్ గోదావరి, జి6-మానేరు, జి7 పెన్‌గంగ, జి8- వార్ధా, జి9- ప్రాణహిత, జి10- లోయర్ గోదావరి, జి11 ఇంద్రావతి, జి12శబరి- కృష్ణానది మహాబలేశ్వర్( మహారాష్ట్ర నుంచి బయల్దేరి బంగాళాఖాతంలో కలుస్తుంది) కృష్ణా బేసిన్‌ను కూడా 12 సబ్ బేసిన్లుగా విభజించడం జరిగింది. అవి కె1-అప్పర్, కె2-మిడిల్ కృష్ణ, కె3-ఘట్టవూపభ, కె4-మాలవూపభ, కె5-అప్పర్ భీమ, కె6- లోయర్ భీమ, కె7- లోయర్ కృష్ణ, కె8- తుంగభద్ర, కె9-వేదవతి, కె10-మూసి, కె11-పాలేరు, కె12-మున్నేరు. గోదావరి బేసిన్లో ఆంధ్రవూపదేశ్ వాటా 1480 టీఎంసీలు. గోదావరి బేసిన్లో తెలంగాణ 79 శాతం పరీవాహక ప్రాంతం కలిగి ఉన్నది.

కృష్ణ బేసిన్లో ఆంధ్రవూపదేశ్ వాటా 811 టీఎంసీలు, తెలంగాణ 68.5 శాతం పరీవాహక ప్రాంతం కలిగి ఉన్నది. జిల్లాల వారీగా కృష్ణా, గోదావరి బేసిన్లలో ప్రాంతాల వివరాలు పట్టికలో చూడవచ్చు.
తెలంగాణ నుంచే గోదావరి, కృష్ణా నదులు ఆంధ్రకు ప్రవహిస్తున్నాయి. కాని ఆంధ్ర నుంచి నేరుగా తెలంగాణకు ప్రవహించేనదులు లేవు. గోదావరి నదిని తెలంగాణ 79శాతం, కోస్తాంధ్ర 21 శాతం పరీవాహక ప్రాంత నిష్పత్తితో పంచుకుంటున్నాయి. కృష్ణానదిలో తెలంగాణ 68.5 శాతం పరీవాహక ప్రాంత కలిగి ఉన్నాయి.

అయితే బచావత్ ట్రిబున్యల్ ప్రాజెక్టుల వారీగా బేసిన్ల కేటాయింపులను బట్టి తెలంగాణకు 34.73 శాతం నీళ్లు, కోస్తాంవూధకు 48.56 శాతం నీళ్లు, రాయలసీమకు16.71 శాతం నీళ్లు లభ్యమయ్యాయి. తర్వాత కాలంలో కోస్తాంధ్ర వాటా కాస్త తగ్గించి, తెలంగాణకు, సీమకు పంచినా అది నామమావూతమే. అంటే అధికారపూర్వకంగానే కోస్తాంవూధకు నీళ్లు పరీవాహక ప్రాంతం కంటే ఎన్నోట్లు ఎక్కువ లభించాయన్నమాట. ఇది అధికారపూర్వకంగా. ఇక అనధికారపూర్వకంగా కోస్తాంధ్ర అనుభవిస్తున్న నీరు ఎంతో ఎక్కువ ఉదాహరణకు వలసపాలకులు నాగార్జునసాగర్ ఎడమకాలువలో11 టీఎంసీల తెలంగాణ వాటాను అధికారపూర్వకంగా ఆంధ్రకు తరలించారు. తెలంగాణకు బచావత్ ట్రిబ్యునల్ ఆమోదించిన 90.82 టీఎంసీల చిన్నతరహా నీటిపారుదల వాటాలో చాలాభాగం ఆంధ్రకు అనధికారికంగా తరలించడం జరుగుతున్నది.

తెలంగాణలోని చెరువులు, కుంటలు పూర్తిగా విధ్వంసం అయినయి. నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురయినయి. విద్యుత్తు ఉత్పత్తి పేరుతో నాగార్జునసాగర్ నుంచి విడుదల అయ్యే నీరంతా కృష్ణా డెల్టాకే పోతున్నది. ఇక సీమకు తరలి నీటి విషయం చెప్పాలంటే ఒక మహాభారతమే అవుతుంది. రాజోలిబండను ఎండబెట్టి దుర్మార్గంగా తుంగభద్ర నీటిని కేసీ కాలువకు తరలించిన దోపిడీ ప్రహసనం నిరంతరంగా జరుగుతున్నది. మహబూబ్‌నగర్‌కు రావలసిన 15.9 టీఎంసీలలో 6లేక 7 టీఎంసీలకు మించి ఎప్పుడూ రాలేదు. 39.9 టీఎంసీలు అనుభవించవలసిన కేసీ కాలువ 70 టీఎంసీలు ఎలా పొందుతుందో అర్థమయ్యే విషయమే.

ఇవన్నీ 75 శాతం విశ్వసనీయత లెక్కలు కట్టిన నికర జలాలు. కృష్ణా నదిలోని సర్‌ఫ్లస్ అంటే అదనపు లేక వరద జలాల మాటకొస్తే. దోపిడీకి నిలు సజీవసాక్ష్యం. పోతిడ్డిపాడు హెడ్‌గ్యులేటర్ ఎలాంటి అనుమతులు లేకపోయినా తెలుగుగంగ, కేసీ కాలువకు ఈ నీటిని తరలిస్తున్నారు. తెలుగుగంగపైన వెలిసిన వెలుగోడు, బ్రహ్మంగారి మంఠం. సోమశిల, కండలేరు రిజర్వాయర్లు సుమారు 180 టీఎంసీల సామర్థ్యంతో కళకళలాడుతున్నాయి. వీటిని నింపుతున్నది కృష్ణాలో దోచిన జలాలతోనే. ఇవి సరిపోనట్టు, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ నిర్మిస్తున్నారు. ఇవన్నీ కలిపితే 110 టీఎంసీల పైనే. అంతర్జాతీయ సూత్రాల ప్రకారం నదీపరివాహకవూపాంతం లో ఉన్న ప్రాంత అవసరాలు తీరాకే ఇతరవూపాంతాలకు నీటిని తరలించాలి. రాయలసీమలో ఉన్న కడప, చిత్తూరు కృష్ణా బేసిన్లో లేనివి అయినా యధేచ్ఛగా తరలిస్తున్నా రు. ఎంతనీటిని దోస్తున్నారు? అని మీరడిగారు.

ఎంతని చెప్పమంటారు? మన బలహీనతను ఆసరాగా తీసుకుని సీమాంవూధవారు అధికార, ధన, కండబలంతో ఇష్టం వచ్చిన మేరకు అక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇవి సరిపోనట్టు గోదావరి పైన వెలిసిన ధవళేశ్వరం బ్యారేజీకి నీరు అవసరమయినప్పుడల్లా శ్రీరాంసాగర్, కిన్నెరసానుల నుంచి బాజాప్తాగా నీటిని తరలిస్తారు. కొత్త దుమ్ముగూడెం నుంచి 160టీఎంసీల గోదావరి జలాలను తస్కరించేందుకు ప్లాన్ లు తయారుగా ఉన్నాయి.

నాగార్జునసాగర్ కాలువల గురించి పట్టించుకు నే నాథుడే లేడు. (అందులో ఎడమకాలువ మరీ అధ్వాన్నం. కాని కృష్ణా డెల్టాకు నీరు వదలాలని ప్రస్తుతం ఆందోళనలు నడుస్తున్నాయి. పార్టీల కతీతంగా రాయలసీమవాళ్లు కోస్తాంధ్ర వారు నీటి విడుదల కోసం సర్కారుపై ఒత్తిడి చేసి మెడలు వంచి సాధిస్తారు. మనవాళ్లు హక్కుభుక్తంగా రావలసిన నీటి కోసం బిచ్చగాళ్ల మాదిరిగా యాచిస్తారు. ఎందుకంటే సీమాంధ్ర నాయకులలోఉన్న ఐక్యత తెలంగాణ నాయకులలో లేదు. కనుక యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి వస్తే తప్ప మనం బాగుపడం.

-ఆర్.విద్యాసాగర్‌రావు
కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

country oven

Featured Articles