రాయల తెలంగాణ ఎవరి కోసం?


Mon,June 25, 2012 12:00 AM

రాయల తెలంగాణ ఏర్పడాలనే వాదన వింటున్నాం. రాయల తెలంగాణ అంటే ఏమిటి? అలాంటిది వాదనకు గల కారణాలు, అవకాశాలు ఏమి టి? రాయల తెలంగాణలో నీటి పంపకాలు, ప్రాజెక్టుల పరిస్థితుల్లో మార్పేమైనా వస్తుందా? అలాంటి దేమైనా వస్తే తెలంగాణకు లాభమా,నష్టమా ?

-సయ్యద్ ఖలీముద్దీన్, నల్లగొండ


రాయల తెలంగాణ ఏర్పడబోతుందని మీడియా, కొందరు రాజకీయ నాయకులు జోస్యం చెప్పడం వింటున్నాం. తెలంగాణ ఏర్పడటం మాత్రం తధ్యం. ఆంధ్రవూపదేశ్‌లో విలీనం కాక పూర్వం అంటే 31-10-1956 నాడు హైదరాబాద్ రాష్ట్రం పేరుతో తెలంగాణ ఏ సరిహద్దులతో ఉండేదో అదే ఏర్పడబోతుందని నా నమ్మకం. రాయల తెలంగాణ అంటే రాయలసీమలోని నాలుగు జిల్లాలైన చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు తెలంగాణతో కలిసి ఏర్పాటు చేసే రాష్ట్రమన్నమాట. అలాంటిది కావాలన్నది రాయలసీమ ప్రాంత నాయకుల కోరిక. రాయలసీమ వారు, ముఖ్యంగా అక్కడి నాయకులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైతే తమకు కూడా ప్రత్యేక రాష్ట్రం రాయలసీమ ఏర్పాటుచేయాలని అనడం చూస్తున్నాం. కానీ ఇది పైపైకి అంటున్నమాటే. ప్రత్యేక రాష్ట్రంగా నాలుగు జిల్లాలను కలిపి ఏర్పాటు చేస్తే అది సా ధ్యం కాదనీ, అంటే మనుగడ సాధించలేదని ఆ నాయకులకు తెలుసు. 1947 అక్టోబర్ 25, 26 తేదీలల్లో నంద్యాలలో జరిగిన రాయలసీమ 5వ మహాసభలో అప్పటి రాజ్యాంగ పరిషత్తు సభ్యుడు, మాజీ రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవడ్డి చేసిన అధ్యక్షోపాన్యాసంలో ఏం మాట్లాడారో చూ ద్దాం. ‘ప్రత్యేక రాష్ట్రం విషయంలో సీమ వారి అభివూపాయాలు నాకు తె లిసి మూడు రకాలుగా ఉన్నవి.

మొదటి అభివూపా యం- మనమిప్పుడుండే విధంగా ఉమ్మడి రాష్ట్రంలో (మవూదాసు)నే ఉందామనడం.ండవ అభివూపాయం- మన రాయలసీమ జిల్లాలే ప్రత్యేక రాష్ట్రంగా ఉండవపూననేవాదం. మూడవ అభివూపాయం-ఏర్పడబోయే ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక రక్షణలను చట్టరీత్యా పొంది అందులో ఉండడం. రెండవవాదం గురించి చెప్తూ.. వారన్నది ఏమంటే ‘ఇప్పటి రాయలసీమ, రాయల నాటి సీమ కాదనేది అందరికి తెలుసు. నాటి తీరు సౌభాగ్యం మనకు ఉండి ఉంటే మనం ప్రత్యేకంగా ఉండడానికి ఏ ఆక్షేపణ ఉండేదికాదు. కాని ఇప్పుడు, మనం బతికి చెడినవాళ్లం. పూర్వోన్నతి ఉద్ఘాటిస్తూ మనం ప్రత్యేకంగా ఉండదలిస్తే మన ప్రస్తుత దైన్యస్థితి విస్మరించిన వారమవుతాము. అందులో మన స్థితి బాగుపడదు. ఆంధ్రరాష్ట్రం రావడమే విశ్వవూపయత్నమైనప్పుడు మనకు ప్రత్యేక రాష్ట్రం రావపూనంటే ఎంత కాలం పడుతుందో ఆలోచించండి.

ఒకవేళ వచ్చేననే అనుకుందాం. అప్పుడైనా ఇప్పటి మన అసహాయస్థితిలో, మనం స్వయంపోషకంగా మనగల మా? అనేది మరో ప్రశ్న. ఎల్లప్పుడు కేంద్ర ప్రభుత్వం, వాటి మీదనే ఆధారపడి సరిహద్దు రాష్ట్రం కన్నా దరివూదదశలో ఉందామనుకుంటే తప్ప ప్రత్యేకంగా మన మనుగడ అంత లాభదాయకం కాబోదు.’ దీన్ని బట్టి ఏం తెలుస్తున్నది? రాయలసీమ నాయకులు రాయలసీమ ప్రాంతం అటు కోస్తాంవూధతోనో, ఇటు తెలంగాణతోనో కలిసి ఉంటే తప్ప తమంతట తాము బతకలేరన్నది అర్థం చేసుకున్నారు. ఇకపోతే రాయలసీమ వారికి కోస్తా వారితో కలిసి ఉండటం ఇష్టం లేదు. కోస్తా వారిని వారు ‘సర్కారు వారు’ అని వ్యవహరిస్తుంటారు. తరతరాల రాయలసీమ అన్న వ్యాస సంపుటిలో ‘రాయలసీమ నాయకులకు అంబారీల ఊరేగింపు, కోస్తా ప్రాంతానికి నీటి తరలింపు’ అన్న వ్యాసంలోని మాటలు చదువుకుంటే సీమ వారికి కోస్తా వారి పట్ల ఉన్న ఏహ్యభావం అర్థం చేసుకోవచ్చు. (కదలిక-సెప్టెంబర్‌89 డిసెంబర్9 ప్రత్యేక సంచిక)‘రాయలసీమ నాయకుల్లోని ముఠా తగాదాలు, పదవీ వ్యామోహం, కీర్తికండూతి కోస్తా జిల్లాల నాయకులకు మరింత అవకాశాన్నిచ్చాయి.

అందల మెక్కిస్తే అన్నింటినీ వదులుకోవడానికి సిద్ధపడే రాయలసీమ నాయకుల బలహీనతను 30 సంవత్సరాలుగా వాడుకుంటూ రాష్ట్ర ఆర్థికవనరులు యావత్తూ కోస్తా జిల్లాలకే వినియోగించారు. రాయలసీమవాసుల మీసాలకు సంపెగనూనెతో సంభావించి, సంపదనంతా సర్కా ర్ జిల్లాలకు పంచిపెట్టారు. 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రాయలసీమ ఎంత నిర్లక్ష్యానికి గురిచేయబడిందో అంచనా వేస్తే రాయలసీమ నాయకులనెవ్వరినీ భావితరాలు క్షమించవు. నదీ జలాల వాటాను పోగొట్టి పైర్లను ఎండగట్టారు. ఉద్యోగ అవకాశాలు చేజార్చి చదువుకున్న వారిని మాడగొట్టారు. విద్యాసౌకర్యాలు నిర్లక్ష్యం చేసి ప్రజాచైతనాన్ని తొక్కిపట్టారు. ప్రతిరంగంలోనూ రాయలసీమను వెనక్కునెట్టి ప్రజాజీవితాన్ని శవవూపాయం చేశారు.’ఇదండీ రాయలసీమ వాసులకు కోస్తాంధ్ర వాసుల పట్ల ఉన్న ప్రేమ. ‘ఆంవూధోద్యమం-రాయలసీమ’ అన్న మరో వ్యాసంలో వెలిబుచ్చిన అభివూపాయాలు చూస్తే వాళ్ల ఏవగింపు మరింత సుస్పష్టమవుతుం ది.‘ఒక వైపు కరువు వేపుకు తింటుంటే మద్రాసులో సర్కార్ కోస్తాంధ్ర వారు రాయలసీమ వారికన్నా తాము నాగరికులమని వివక్ష చూపారు. దీంతో ప్రాంతీయ సోదరత్వానికి అవకాశమే లేకుండాపోయింది.

రాయలసీమ వారిని చిన్నచూపు చూడటం జరుగుతూ వచ్చింది. సీమవాసులకు ఉద్యోగాలలో అటు అరవలో, ఇటు సర్కార్‌వారో అడ్డుపడుతూ వచ్చారు.
చెన్నై రాజధాని నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపడుట లాభకరమైనచో? ఆంధ్ర రాష్ట్రం నుంచి రాయలసీమ విడువడుట మరింత లాభకరముకదా! ఉత్తరాది (కోస్తాంధ్ర, మనలను ఎర్రమలకొండలు వేరు చేయుచున్నవి) వారి భాష, ఆహార వ్యవహారములు వేరు. కావున వారితో పొత్తు కుదరదు. (పప్పారి రామానుచార్యులు, సాధన పత్రిక సంపాదకులు) ‘మా బీద మండల మూలధనము ఉత్తర సర్కారులకు ప్రవహించిపోవుచున్నది. అక్క డ నుంచి పైసా తిరిగి వచ్చుటలేదు.(టి.భుజంగరావు, అనంతపురం)
బళ్ళారిలో సమావేశమైన సీమ మహాసభ కార్యవర్గం ‘సీమ ఆర్థిక అవసరమును, కోర్కెలను పూర్తిగా సంతృప్తి పరిచేంత వరకు, ఆంధ్ర రాష్ట్ర నిర్మాణాన్ని సీమవాసులు వ్యతిరేకిస్తారు’ అని తీర్మానించడం జరిగింది. 5వ రాయలసీమ మహాసభలో నీలం సంజీవడ్డి అధ్యక్షోపన్యాసంలో ‘అందుచేత మనకు రాజ్యం రాముడేలినా, రావణుడు ఏలినా ఒక మనసత్తం ఏర్పడానికి కారణమైంది.

మనకు రాష్ట్ర ప్రసక్తి ఉత్సాహమును రేకెత్తించలేకుండా పోతున్నది. వేరే రాష్ట్రం వచ్చినా మనకు మోక్షం కలుగుతుందనే ఆశ, ఇప్పటి మన ఉత్తరాది సోదరుల(కోస్తాంధ్ర) ఉపేక్షభావం చూస్తే సన్నగిల్లుతోంది.’ ఇవన్నీ చూశాక.. రాయలసీమ వారికి ఏ పరిస్థితుల్లోనూ కోస్తాంధ్ర వారితో కలిసి సహజీవనం సాగించాలన్న ఆలోచన లేదు. ప్లానింగ్ కమిషన్ వారు ఆమోదించిన కృష్ణ, పెన్న ప్రాజెక్టు రాకుండా అడ్డుపడ్డది కోస్తాంధ్ర వారే అని వారి దృఢాభివూపాయం. కోస్తాంధ్ర పట్ల సీమ వారి ఆగ్రహానికి అదికూడా ప్రధాన కారణం. అంటే అటు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డా బతకలేక, ఇటు కోస్తాంధ్ర వారితో మనుగడ సాగించలేని ఇరకాట పరిస్థితులు రాయలసీమ వారికి ఉన్నవి. రెండు ప్రత్యామ్నాయాలు, సమైక్యాంవూధలోనే కొనసాగడం, లేదా తప్పని పరిస్థితుల్లో తెలంగాణతో జతకట్టి రాయలసీమ ఏర్పాటుకు సై అనడం.

మద్రాసు రాష్ట్రంలో కోస్తాంధ్ర వారితో రాయలసీమ వారు చవిచూసిన చేదు అనుభవాన్నే 56 సంవత్సరాల నుంచి తెలంగాణవారు పొందుతున్నారు. కనుకనే ప్రత్యేక రాష్ట్రం గురించి తెలంగాణ వారు నిరంతరం పోరాటం సాగిస్తూ గమ్యం దరిదాపుల్లోకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో రాయలసీమ వారికి ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితి వచ్చింది. కోస్తాంధ్ర వారి తడిగుడ్డతో గొంతుకోసే తత్వం, రాయలసీమ వారి ఫాక్షనిజం రుచి చూసిన తెలంగాణవాదులు ససేమిరా అంటున్నారు. సీమవారితోనూ, ఇటు కోస్తా వారితోనూ కలిసి ఉండలేరన్నది నిజం. తెలంగాణ వారిని ఒప్పించలేమని తెలుసుకున్న కొందరు సీమ నాయకులు (టీజీ లాంటి వారు) కేంద్రంపైన ఒత్తిడి చేసి నాలుగు జిల్లాలు కాకపోతే కనీసం అనంతపురం, కర్నూలునైనా తెలంగాణతో కలిపి విడిగా రాష్ట్రం చేయాలని కోరుతున్నారు. వారి స్వార్థం వారిది. కేంద్రం కూడా తెలంగాణ వారిపై ఒత్తిడి తెచ్చి కర్నూ లు, అనంతపురంతో కలిపి రాయల తెలంగాణ చిత్తూరు, కడపతో కలిపి ‘రాయలాంధ్ర ఏర్పాటు చేసే దిశలో ఆలోచిస్తున్నట్టు సమాచారం.

తప్పనిసరి అయితే తెలంగాణ ప్రజలు ఒప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడితే ‘రాయల తెలంగాణ’ పేరు ఒప్పుకోకయినా ఏర్పడే సరికొత్త తెలంగాణ రాష్ట్రంలో కర్నూలు, అనంతపురం కలిస్తే ఏమవుతుందో పరిశీలిద్దాం. రాజకీయంగా ఆంధ్రవూపదేశ్‌లోని 294 అసెంబ్లీ స్థానాల్లో సరిగ్గా సగం 147 స్థానాలు. ప్రస్తుత తెలంగాణ 119. కర్నూలు,అనంతపురం 28మంది శాసనసభ్యులు. అలాగే 21 పార్లమెంట్ సభ్యులు ఉండటం కలిసి వచ్చే అంశం.అన్నింటికంటే ముఖ్యంగా ప్రస్తుతం రాయలసీమలో బలంగా ఎదిగిపోతున్న కొత్త పార్టీని ముక్కలు చెక్కలు చేయడం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీకి అనుకూలఅంశం. కర్నూలు, అనంతపురం జిల్లాలు రెండు కూడా కృష్ణా బేసిన్‌లోనివే. మిగతా రెండు జిల్లాలు కావు. అనంతపురం జిల్లాలోని 23.6 శాతం వైశాల్యం, కర్నూలు జిల్లాలోని 42.4 శాతం వైశాల్యం కృష్ణా పరీవాహక ప్రాంతంలోనే, అంటే కొత్తగా ఏర్పడే రాష్ట్రంలో కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతం ఎక్కువగా ఉంటుంది.

పెన్నానది కూడా కొత్త రాష్ట్రంలోకి వస్తున్నది. పెన్నాపైన నిర్మించిన జుర్రేరు (కర్నూలుజిల్లా), మూడవది- ఎగువ పెన్నార్ (అనంతపురం) మధ్యతరహా ప్రాజెక్టులు కూడా కొత్త రాష్ట్రం పరిధిలోకి వస్తాయి. అంటే కృష్ణా,గోదావరితోపాటు పెన్నానది కూడా అంత ర్ రాష్ట్ర వివాదాల చట్టం కింద సమస్యల పరిష్కారాలకు లోనవుతాయి. నాగార్జునసాగర్, శ్రీశైలం పూర్తిగా కొత్త రాష్ట్రంలో ఉన్నా సాగర్ నీళ్లు ఆంధ్రకు, శ్రీశైలం కుడి కాలు వ నీళ్లు కర్నూలుతోపాటు, కడపకు అందుతుండటంతో ఈ ప్రాజెక్టులు కూడా, తుంగభవూదలాగా కంట్రోల్‌బోర్డు అధీనంలో ఉంటాయి. ఇక ఆర్‌డీఎస్‌తోపాటు సుంకేశుల కూడా కొత్త రాష్ట్రం పరిధి కిందికే వస్తాయి. ఇక పోతిడ్డిపాడు పంచాయితీ ఉండనే ఉన్నది. కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం నుంచి అనధికారంగా, అక్రమంగా తరలించే నీళ్లకు బ్రేకుపడుతుందా లేదా అన్నది కొత్తరాష్ట్రం తీసుకునే నిర్ణయాలపైన ఆధారపడి ఉం టుంది. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి బయల్దేరే దిగువ ఎగువ కాలువల సమస్యలు, కేసీ కాలువ సమస్యలన్నీ కొత్త రాష్ట్రాన్ని చుట్టు ముట్తాయి. ఇదివరకే సీమాంధ్ర నాయకుల కుట్రలవల్ల కునారిల్లుతున్న తెలంగాణ నెమ్మదిగా వారి పంజా నుంచి అనేక త్యాగాల ఫలితంగా బయటపడినది.

కృష్ణా, గోదావరి నదుల నీటితో తెలంగాణ నేలను సస్యశ్యామలం చేయాలనుకుంటున్న తెలంగాణ ఇంజనీర్ల కలలు కొత్త జిల్లాలు తెలంగాణలో కలిస్తే భగ్నమవుతాయి.1956కు పూర్వం ఉన్న ‘తెలంగాణ’ను యధా స్థితిలో పొంది, దాన్ని పునర్నిర్మాణం చేసి హర్యానా లాగ పదేళ్లలో దేశంలో అగ్రగామిగా నిలుపుదామన్న వారి ఆశలపై నీళ్లు చల్లటమవుతుంది. తెలంగాణ నాయకులు, మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు, సకల జను లు, ఒకవేళ కర్నూలు, అనంతపురం జిల్లాలను కేంద్రం బలవంతంగా తెలంగాణకు జత కలపడానికి ప్రయత్నిస్తే శాయశక్తులా వ్యతిరేకించాలి. కొత్త జిల్లాలు కలపటం వల్ల తెలంగాణకు వీసమెత్తు కూడా లాభం కలగదు. కర్నూలు జిల్లాకు నీటి పారుదల సౌకర్యాలు మెండుగా ఉన్నా, అనంతపురం పూర్తిగా వెనుకబడిన జిల్లా కనుక కొత్త రాష్ట్రానికి గుదిబండగా తయారవడం తథ్యం. కేంద్ర ప్రభుత్వానికి కర్నూలు, అనంతపురం లను తెలంగాణతో కలిపి కొత్త రాష్ట్రం ఏర్పాటు చేస్తే తలనొప్పి తగ్గుతుందేమో కానీ, కొత్త రాష్ట్రంలో వాటి మూలంగా తెలంగాణ వారికి కొత్త తలనొప్పులు వస్తాయి.తస్మాత్ జాగ్రత్త!

-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర