ప్రాంతీయ స్పృహతోనే వివక్ష అంతం


Sun,June 17, 2012 11:38 PM

Pulichinta talangana patrika telangana culture telangana politics telangana cinemaజూన్ 9 నాడు కేసీఆర్ పరకాల బహిరంగసభలో మాట్లాడుతూ ‘జగన్ అధికారంలోకి రాగానే రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెబుతున్నారు. తెలంగాణను ముంచే పోలవరం కడితే మనం ఊరుకుందామా? తెలంగాణకు గోదావరి నీళ్లు ఉండకూడదా? అనడిగారు. అంతకుముందు వికారాబాద్ సభలో మాట్లాడుతూ వైఎస్‌ఆర్ పోతిడ్డిపాడు ద్వారా ‘కృష్ణా జలాలను అక్రమంగా సీమాంవూధకు తరలిస్తూ తెలంగాణకు తీరని అన్యాయం చేశాడు. అన్నారు. అనుమతులు లేకుండా పులిచింతలకు పోలవరం కడుతున్నారని దానికి పూర్తిగా వైఎస్‌ఆర్ బాధ్యుడని అన్నారు. ఈ మాటలన్నీ నిజమే అయితే నిన్నముగిసిన పరకాల ఎన్నికలో ప్రజలు వైఎస్‌ఆర్ పార్టీ అభ్యర్థి సురేఖకు అన్ని వోట్లు ఎందుకు వేసినట్టు? అంటే ప్రజలకు ఇవేమీ పట్టడం లేదా?
-అయితరాజు అనసూయ, వరంగల్

కేసీఆర్ అటు వికారాబాద్‌లో కానీ, ఇటు పరకాలలో గాని తెలంగాణ పట్ల వైఎస్‌ఆర్ చేసిన అకృత్యాల గురించి చెప్పిన మాటలు నూటికి నూరుపాళ్లు నిజాలు అని తెలంగాణ ప్రజలు, మరీ ముఖ్యంగా పరకాల ప్రజలకు అర్థం కాలేదని నేనునకోను. అయినా అన్ని ఓట్లను రాజశేఖర్‌డ్డి కొడుకు జగన్ ప్రతినిధికి కుమ్మరించారు అంటే యదార్థం వేరు, రాజకీయం వేరు అని స్పష్టమవుతోంది. హంతకులు, గూండాలు, దొంగలు కూడాబీహర్ జైళ్లలో మగ్గుతూ కూడా భారీ మెజారిటీతో గెలుస్తూ ఉండటం చూస్తూనే ఉన్నాం. ఎన్నికల రాజకీయం వేరు. అక్కడ సెంటిమెంట్, కుల సమీకరణలు, బంధుత్వాలు, అభ్యర్థి గుణగణాలు, డబ్బు, మద్యం లాంటి అనేక అంశాలు పనిచేస్తాయ న్న విషయం అందరికీ తెలుసు. వచ్చిన ఓట్లు చేసిన తప్పులను కప్పిపుచ్చవు. ఒకవేళ అదే నిజంఅయితే ఇక న్యాయస్థానాలు, చట్టాలు అక్కర్లేదు.
ఇక కేసీఆర్ చెప్పిన విషయాల గురించి కాసేపు చర్చించుకుందాం.

ముందు పోలవరం గురించి ఆలోచిద్దాం.గోదావరి ట్రిబ్యునల్ నివేదికలోనే పోలవరం నిర్మాణం గురించి ఉంది. 2-4-1980 నాడు ఆంధ్రవూపదేశ్, ఓడిషా, మధ్యవూపదేశ్ (ఇప్పటి ఛత్తీస్‌గఢ్) చేసుకున్న ఒప్పందంలో పోలవరం నిర్మాణానికి సంబంధించిన షరతులు ప్రస్తావించబడ్డాయి. అనేక సాంకేతిక కారణాల వల్ల, పోలవరం మూలంగా ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పడే ముంపు ప్రాంతాల విషయంలో పరస్పర అంగీకారం, అవగాహన కుదరక పోవడం వల్ల పోలవరం ముందుకు జరగలేదు. 2004లో ముఖ్యమంవూతిగా పదవీ బాధ్యతలను చేపట్టిన వైఎస్‌ఆర్ దూకుడుగా, మొండిగా, కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ వారి నియమాలను పట్టించుకోకుండా, పర్యావరణ, అటవీ పరిరక్షణకు సంబంధించిన చట్టాలను ఉల్లంఘించి ఎలాంటి అనుమతులు లేకుండా పోలవరాన్ని ప్రారంభించారు. అనుమతులు లేకపోవడం సంగతి అలా ఉంచితే, పోలవరం కట్టడం మూలంగా తెలంగాణలో భారీగా ముంపుకు గురయ్యే భూములు, నిర్వాసితులయ్యే గిరిజనులు, అటవీ క్షేత్రం గురించి తెలంగాణ వాదుల ఆందోళనను వైఎస్‌ఆర్ ఏమాత్రం ఖాతరు చేయకుండా అపహాస్యం చేస్తూ పనులు కొనసాగించడం కూడా యదార్థమే.

కేంద్ర పర్యావరణ చట్టం-1986 ప్రకారం పోలవరానికి ప్రత్యామ్నాయాలు ఆలోచించవలసిన అగత్యం ఉన్నా కూడా అది కూడా అవసరం లేదని, ప్రస్తుతం కడుతు న్న పోలవరమే ఉత్తమమైన సాధనమని తాను బుకాయించడమే కాకుండా, తనకు తాబేదార్లు, తొత్తులుగా వ్యవహరించే కొందరు జలరంగనిపుణుల చేత కూడా చెప్పించే ప్రయత్నం చేసింది వైఎస్‌ఆర్ ప్రభుత్వమే. ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం అన్న విషయానికి వస్తే 36 లక్షల క్యూసెక్కుల వరద అనే లెక్కలు కట్టితే (ఇప్పుడు 50 లక్షల క్యూసెక్కులు) ఏర్పడే ముంపు గ్రామాలు మొత్తం 299 కాగా అందులో 23 గ్రామాలు ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌వి. మిగతా 276 గ్రామాల్లో 206 గ్రామాలు తెలంగాణవి. ఇక ముంపుకు గురయ్యే భూములు ఒక లక్ష 20 వేల ఎకరాలు. ఇందులో 10 వేల ఎకరాలు అటవీ క్షేత్రం. దాదాపు రెండు లక్షల మం ది గిరిజనులు నిర్వాసితులవుతారు. మునిగే భూములైనా, నిర్వాసితులయ్యే గిరిజనులైనా అత్యధిక భాగం తెలంగాణ ప్రాంతమే నష్టపోయేది అని ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. లబ్ధిపొందేది 7లక్షల 20 వేల ఎకరాలు పూర్తిగా కోస్తాంవూధలోనే.

అంటే 7 లక్షల 20 వేల ఎకరాలకు లబ్ధి చేకూర్చేందుకు అంతపెద్ద ఎత్తున 1లక్ష 20 వేల ఎకరాలను ముంచవలసిన అవసరం ఉందా?ండు లక్షల మందిని (గిరిజనులను) నిర్వాసితులను చేయాల్సిన అక్కర ఉందా? పోలవరానికి ప్రత్యామ్నాయాలను అన్వేషించవలసిన అవసరం లేదా? ప్రత్యామ్నాయాలున్నాయని చెప్పిన హన్మంతరావు, ధర్మాడ్డి లాంటి చీఫ్ ఇంజనీర్ల ప్రతిపాదనలను బుట్టదాఖలు చేసిన ఈ సీమాంధ్ర ప్రభుత్వం నిరంకుశంగా, నియంతృత్వ ధోరణినితో వ్యవహరిస్తున్నది. ఇటీవలే లోగడ ఇచ్చిన పర్యావరణ అనుమతులను రద్దు చేశామని ‘ఒడిషా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో ప్రజాభివూపాయ సేకరణ చేపట్టకుండా పనులు మొదలుపెట్టకూడదని కేంద్రం ఖరాఖండిగా చెప్పినా ఆదేశాలు పట్టించుకోకుండా టెండర్ల ప్రక్రియ కొనసాగిస్తూనే ఉన్నది.

పోలవరం భవితవ్యం, సుప్రీంకోర్టులో తేలవలసి ఉందని అందరికీ తెలిసినా జగన్‌పార్టీ తాము అధికారంలోకి రాగానే రెండేళ్లలో పూర్తిచేస్తామని హామీ ఇవ్వడం కాంగ్రెస్, తెదేపా కూడా అదే ట్యూన్‌లో పోలవరం నియోజక వర్గంలో ఉపన్యాసాలిస్తూ మాట్లాడటం గమనిస్తుంటే సీమాంధ్ర నాయకులు తెలంగాణ పట్ల ఎలాం టి వైఖరి అవలంబిస్తున్నారో అర్థం కావడం లేదా? మరి ఈ నాయకులే, పరకాల వచ్చినప్పుడు పోలవరం గురించి ఆ మాటలనే ఎందుకు మాట్లాడలేదు. అంటే వారి ద్వంద్వ వైఖరి అర్థం కావడం లేదా? ఇంత జరిగినా సీమాంధ్ర నాయకుల, వారి పార్టీల గోముఖ వ్యాఘ్రం నైజం బయటపడినా, పరకాల ప్రజల్లో చెప్పుకోదగ్గ సంఖ్య జగన్‌పార్టీకే జైకొట్టడం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం.

ఇక పోతిడ్డిపాడు విషయానికి వస్తే.. తెలంగాణ అమాయకత్వం కోసాంధ్ర చలాకి(గడసరి)తనం, రాయలసీమ జులుం కళ్లకు కట్టినట్టు స్పష్టమవుతుంది. వైఎస్‌ఆర్ పగ్గాలు చేపట్టిన తొలిరోజుల్లోనే ఆయన మనసులోని కోరిక కృష్ణా జలాలను రాయలసీమకు తరలించాలన్న అభీష్టాన్ని నిజం చేసే ప్రక్రియలో మొదటి అడుగు శ్రీశైలం రిజర్వాయర్ కనీస జలస్థాయి ఎండీడీఎల్‌ని 834 అడుగుల నుంచి 854 అడుగులకు పెంచే జీవో107 ను జారీ చేయడం జరిగింది. తద్వారా అన్నివేళలా శ్రీశైలం నుంచి పోతిడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని రాయలసీమకు గ్రావిటీ మార్గం ద్వారా తరలించే వెసులుబాటు కల్పించారన్నమాట. పోతిడ్డి హెడ్ రెగ్యులేటర్ సిల్ట్‌స్థాయి 841 అడుగులు కనుక, కనీసం 13 అడుగుల పైన శ్రీశైలం నీటిమట్టం ఉండే ఏర్పాటన్నమాట. ఇక తన ప్రణాళికలోని రెండో అడుగు- (అత్యంత ప్రమాదకరమైనది) జీవో 170 విడుదల.ఆ వెను జీవో 233, జీవో3 ల జారీ. వీటి సారాంశమేమిటంటే.. పోతిడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కుల నుంచి అదనంగా ద్వా రాలు ఏర్పాటు చేయడం ద్వారా 44 వేల క్యూసెక్కులకు పెంచడం.

30 రోజుల వ్యవధిలో 112 టీఎంసీల కృష్ణాజలాలను వరద జలాల ముసుగు లో రాయలసీమకు తరలించే దుష్టపన్నాగాన్ని అమలు చేయడంలో, తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని నాయకుల అసమర్థతను ఆసరాగా తీసుకుని వైఎస్‌ఆర్ సఫలీకృతులయ్యారు. ఇక కోస్తాంధ్ర ప్రాంత ప్రయోజనాల విషయానికి వస్తే.. మీకు పులిచింతలను కట్టి, కృష్ణా డెల్టాను స్థిరీకరి స్తాం, పోలవరాన్ని కట్టి ఉభయగోదావరి జిల్లాలు, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలకు నీటిని అందిస్తామన్నారు. పైపెచ్చు పోలవరం ద్వారా నీటిని తరలించి కృష్ణాడెల్టాకు అందచేస్తాం కనుక పోతిడ్డిపాడును అడ్డుకోకుండా తాయిలాలు అందిస్తుంటే గడసరితనం ప్రదర్శించి పోతిడ్డిపాడు ప్రాజెక్టు మూలంగా తెలంగాణతోపాటు తమకు నష్టం వాటిల్లుతుందని తెలిసినా గమ్మున ఉండిపోయారు కోస్తాంవూధవారు. ఈ రకంగా తెలంగాణ, కోస్తా ప్రాంతాల మధ్య తెలివిగా మిత్రబేధం పెట్టడంలో కూడా కృతకృత్యులయ్యారు వైఎస్‌ఆర్. ఇంతకీ పోతిడ్డిపాడు వల్ల ఏం జరగనుంది? జూరాల నుంచి కృష్ణా జలాలను ప్రభుత్వ ఆదేశాలననుసరించి విడుదల చేయాల్సి ఉంటుంది.

వాటితో శ్రీశైలం జలాశయం నింపుతారు. నిజానికి బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం శ్రీశైలం జలాశయం నీరు కేవలం విద్యుత్తు ఉత్పాదన కోసమే. దాన్ని సాగునీటి కోసం వినియోగించరాదు. అయితే కాలక్షికమేణ దాన్నిప్పుడు పూర్తిగా సాగునీటి ప్రాజెక్టుగా మార్చారు. వాస్తవానికి శ్రీశైలం, రిజర్వాయర్, నాగార్జునసాగర్‌కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా ఉపయోగపడాలి. అంటే విద్యుత్తు ఉత్పత్తి చేశాక శ్రీశైలం నుంచి విడుదలయ్యే నీరు సాగర్‌లో నిలువచేయబడి సాగునీటికి, విద్యుత్తు ఉత్పాదనకు ఉపయోగపడాలి. కాని ఇప్పుడు వైఎస్‌ఆర్ కుట్రలో అంతా తారుమారయింది. పైకి చెప్పడానికి వరద జలాలు, లేక ఆదనపు జలాలను మాత్రమే పోతిడ్డిపాడు ద్వారా తరలిస్తామని ప్రభుత్వం చెప్తుంది. సాగర్ ఆయకట్టు దారులకు, కృష్ణాడెల్టా రైతులకు చెందవలసిన నికర జలాలను ముట్టు కోం అంటారు. కాని శ్రీశైలంలోకి వచ్చే నీటిపైన, వరదజలాలు ‘ఆదనపు జలాలు’ నికర జలాలు అని రాసిఉండదు కదా!

శ్రీశైలంలోకి నీరువచ్చే రాగానే (అది నికర, అదనం, వరద అన్న వివక్ష లేకుండా) దౌర్జన్యపూరితంగా పోతిడ్డిపాడు గేట్లు తెరుస్తారు. శ్రీశైలం నీటిని కావలసిన మేరకు (తమవూపాంతంలోని జలాశయాలన్నీ అంటే వెలుగోడు, బ్రహ్మంగారి మఠం, సోమశిల, కండలేరు, అవుకు, ఇం కా గండికోట, లాంటివి నింపుకుని అప్పుడు వెలిగొండ టన్నెల్ ద్వారా ప్రకాశం జిల్లాకు నీటిని తరలించి, ఇంకా మిగిలితే అప్పుడు మీరు ఉపయోగించుకోండని, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీకి వదుల్తారు. ఇక సాగర్, కృష్ణా డెల్టా రైతుల సంగతి ఏమవనుందో ఆ భగవంతునికే తెలియాలి. ఈ అన్యాయాలు సరిపోనట్టు దుమ్ముగూడెం నుంచి 160టీఎంసీల గోదావరి జలాలను (ఇక్కడ కూడా వరద జలాలని పైకి చెప్పే నాటకమే) నాగార్జునసాగర్ టైయిల్‌పాండ్‌కు చేరవేసే కుటిల ప్రయత్నం సీమాంధ్ర ప్రభుత్వం చేస్తోంది.

తెలంగాణకు జలవనరుల్లో జరుగుతున్న అన్యాయాన్ని, వనరులు రక్షించుకోవాల్సిన అగత్యాన్ని, ఎప్పటికప్పుడు నీళ్లునిజాల ద్వారా చెప్పినా, కేసీఆర్ తన ఉపన్యాసాల్లో చెప్పినా అర్థం కాకుండా ఉండటానికి అదేం బ్రహ్మపదార్థం కాదు. అయినా తెలంగాణ ప్రజలు ఇంకా సీమాంధ్ర నాయకుల ఉచ్చులోపడుతున్నారంటే వాళ్లను బయటపడేయాల్సిన బాధ్యత తెలంగాణ వాదులందరిపైన ఉన్నది. ఇక తెలంగాణ నాయకులూ ఏ కొద్దిమందో తప్ప నాయకులందరిదీ ఒకే మాట, ఒకేబాట. ఎవడు పదవి ఇస్తే అక్కడ దూకటానికి సై. తెలంగాణ గిలంగాణ జాన్తానై.. ఇదీ నా వైఖరి. తెలంగాణ ప్రజలే వారి ఆట కట్టించాలి. భరతం పట్టాలి.

-ఆర్.విద్యాసాగర్‌రావు
కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

Published: Sun,September 16, 2012 10:48 PM

పడుతూలేస్తూ పాలమూరు ప్రాజెక్టులు

సార్-మా పాలమూరు ప్రాజెక్టుల పరిస్థితేంది? వాటికి నీళ్ల కేటాయింపు ఉన్నదా? కరెంటున్నదా? పైసలున్నయా? అన్ని సక్రమంగా వుంటే మరి ఎందుకు

Published: Fri,September 14, 2012 11:18 PM

అధికారికంగా విమోచన దినోత్సవం

జతీయ జెండాకున్న ప్రాధాన్యం అందరికి తెలుసు. ప్రపంచంలో ఏ దేశమైనా తమ జాతీయ పతాకాన్ని వారి సార్వభౌమిక అధికారానికి చిహ్నంగా భావిస్తుం

Published: Mon,September 10, 2012 12:10 AM

రెండు కోర్టులు, మూడు కేసులు

తెలంగాణతో ముడిపడి ఉన్న కేసులు ప్రస్తుతం కోర్టుల్లో ఎన్ని ఉన్నాయి? వాటి పరిస్థితి ఏమిటో తెలియజేస్తారా? -బారు మధుసూదనశర్మ, హిమాయత్‌

Published: Sun,September 2, 2012 11:43 PM

బలవంతునిదే రాజ్యం

బచావత్ ట్రిబ్యూనల్ రాష్ట్రాలకు కేటాయింపులు జరిపింది. ఇంతవరకు బాగానే ఉన్నది. ఆ కేటాయించిన నీరు రాకుండా ఆయా రాష్ట్రాలు అడ్డుకుంటే ట్

Published: Sun,August 26, 2012 11:45 PM

పోలవరం - పాలమూరు

ఈ మధ్య ముఖ్యమంత్రి గోదావరి జిల్లాల్లో ఇందిరమ్మ బాట సందర్భంగా పర్యటిస్తూ గోదావరిలో వరదలొస్తూ వందలాది టీఎంసీల నీళ్లు వృధాగా సమువూదంల

Published: Thu,August 23, 2012 12:24 AM

ఒడువని తెలంగాణ తండ్లాట

భారత దేశ చరివూతలోనే విశిష్టమైనదైన, ప్రపంచాన్ని ఆకర్షించిన హైదరాబాద్ విమోచన ఉద్యమం ఇంకా ఏదో రూపంలో రగులుతూనే ఉన్నది. అయితే అప్పటి ప

Published: Sun,August 19, 2012 11:19 PM

కోర్టే శరణ్యం-అన్యధా నాస్తి

శ్రీశైలం నాగార్జునసాగర్ నీటి విడుదల విషయంపై కోర్టు స్టే విధించింది కదా! మరేమైంది? నీటి విడుదల ఆగిందా? ఇది తెలంగాణ ప్రజల విజయంగా భా

Published: Mon,August 13, 2012 12:02 AM

చక్రబంధంలో పోలవరం

నాలుగువేల కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చయ్యాయని, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి ఖమ్మంలో శుక్రవా

Published: Mon,August 6, 2012 11:38 PM

పుట్టెడు దుఃఖంలో పుట్టంగండి

పుట్టంగండి సిస్టర్న్ మరమ్మతులకు నోచుకుందని, అది కూడా తూతూమంవూతంగా చేపట్టారని, సిస్టర్న్‌కు ఏదైనా జరగరానిది జరిగితే కొంపలు మునుగుతా

Published: Mon,July 30, 2012 01:48 AM

శ్రీశైలంలోనూ ప్రభుత్వానికి చెంపదెబ్బ

శ్రీశైలం నీటి విడుదల విషయంలో విజయం సాధించాం.ఈ విజయం వివరాలు చెప్పండి? జీవో మార్చిస్తామని లగడపాటి ప్రకటన గుప్పిస్తున్నాడు. దానిని గ

Published: Sun,July 22, 2012 11:13 PM

కోర్టు ఉత్తర్వుల స్ఫూర్తికి భంగం

ఈమధ్య తెలంగాణ ఇంజనీర్లు, మరికొందరు కృష్ణా డెల్టాకు నాగార్జునసాగర్ జలాశయం నుంచి అక్రమంగా నీళ్లు తరలించడంపై హైకోర్టులో ప్రజాహిత వ్య

Published: Sun,July 15, 2012 11:12 PM

జనం నోళ్లు కొడుతున్న పరిక్షిశమలు

జీవో146, జీవో 94 గురించి చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే జీవో 23 ద్వారా ఉదయసముద్రం నుంచి రోజుకు 5 లక్షల గ్యాలన్ల నీటిని సీమాం ధ్ర

Published: Sun,July 8, 2012 11:49 PM

సాగర్ నీటి దోపిడీ

అకస్మాత్తుగా డెల్టా ప్రయోజనాల కోసం 15 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పార్టీలు, ప్రాంతాల మధ్య చిచ

Published: Sun,July 1, 2012 11:52 PM

మా నీళ్లు మాకు దక్కనీయరా..?

తెలంగాణ నుంచి సీమాంవూధలోనికి ప్రవహిస్తున్న నదులు, వాటి ఉపనదులు ఏమిటి? వాటి నదీ పరీవాహక ప్రాంతాలు, జిల్లాలు మొత్తం ఆంధ్రవూపదేశ్‌లో

Published: Mon,June 25, 2012 12:00 AM

రాయల తెలంగాణ ఎవరి కోసం?

రాయల తెలంగాణ ఏర్పడాలనే వాదన వింటున్నాం. రాయల తెలంగాణ అంటే ఏమిటి? అలాంటిది వాదనకు గల కారణాలు, అవకాశాలు ఏమి టి? రాయల తెలంగాణలో నీటి

Published: Mon,June 11, 2012 12:42 AM

జనం నోళ్లు కొట్టి పరిశ్రమలకు నీళ్లు..!

తాగడానికి నీళ్లు లేక ఒక పక్క గిలగిల కొట్టుకుంటూ ఉంటే, కృష్ణా నది నుంచి సిమెంట్ ఫ్యాక్టరీలకు నీటి కేటాయింపులు చేస్తూ ఈ జీవో లేమిటి

Published: Sun,June 3, 2012 11:50 PM

జలయజ్ఞంపై సీబీ‘ఐ’

జలయజ్ఞం పూర్తిగా జలగల యజ్ఞంగా మారిందని, కాగ్ తీవ్రంగా ఆక్షేపించిందని తెలిసింది. కోట్లకొద్దీ ప్రజాధనం గుత్తేదారులు, ఇతర ప్రజావూపతిన

Published: Tue,May 29, 2012 12:02 AM

పట్నం దూప తీరే మార్గం ఏది?

గండికోట ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేస్తున్న ప్రభుత్వం ఎల్లంపెల్లిని ఎందుకు నానబెడ్తున్నది? ‘ప్రాణహిత-చే ప్రాజెక్టు అంతర్భాగమైన హ

Published: Mon,May 21, 2012 02:57 AM

నీటికోసం నిరసన దీక్ష

కృష్ణా నీళ్లలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, కావాలనే సీమాంధ్ర పాలకులు ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ ప్రయోజనాలను నీరుకార్చే ప్రయత్నం చే

Published: Sun,May 13, 2012 11:58 PM

అభీ దిల్లీ దూర్ హై

ఇటీవలే ఢిల్లీలో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుపై మహారాష్ట్ర, ఆంధ్రవూపదేశ్ రాష్ట్రాల ముఖ్యమంవూతులు ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. అంతవర

Published: Fri,August 31, 2012 05:49 PM

శుష్కవాదాలు-శూన్యహస్తాలు

ఈ మధ్య కేసీఆర్ ముఖ్యమంత్రికి ఓ లేఖ రాస్తూ అందులో కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట మన వాళ్లు సరిగ్గా వాదనలు వినిపించలేకపోయారని, తత్ఫలితంగా త

Published: Mon,April 30, 2012 12:07 AM

నదుల అనుసంధానం-తెలంగాణకు నష్టం

నదుల అనుసంధానం గురించి చాలా కాలంగా వింటున్నాం. ఏ నదులను అనుసంధానిస్తారు.దానివల్ల తెలంగాణకు ఏం లాభం? వివరించండి? - రావుల బ్రహ్మయ

Published: Mon,April 23, 2012 01:51 AM

చిన్న ప్రాజెక్టులంటే చిన్న చూపు

పెద్ద ప్రాజెక్టుల గురించే మీరు చెప్పుతున్నారు. తెలంగాణలోని చెరువులు, కుంటలు, బావుల మీద ఆధారపడి బతుకుతున్న వాళ్లు చాలామంది ఉన్నారు.

Published: Mon,April 16, 2012 05:16 AM

ఆధునీకరణలోనూ పక్షపాతమే..

సదర్మట్,అప్పర్ మానేరు,మూసీ,డిండీ ప్రాజెక్టుల గురించి వివరించండి. -లక్ష్మినర్సింహాడ

Published: Mon,April 9, 2012 12:03 AM

గొంతెండిపోతంది సారూ..

గోదావరి పక్కనే ఉన్నా మా గొంతు లెండిపోతున్నయి సారూ- మా బతుకులిట్లా తెల్లారవలసిందేనా కనీసం గుక్కెడు నీల్లకయినా మేం నోచుకోలేదా? చెప్ప

Published: Mon,April 2, 2012 12:11 AM

పోలవరం బంగారం- లెండి వెండి

ఇదిగో అదిగో అని ఎంతకాలం నుంచో ఊరిస్తూ వస్తున్న లెండి, ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది? ఇంత జాప్యానికి కారణాలు ఏమిటి? పోలవరంపైన పా

Published: Mon,March 26, 2012 01:56 AM

పెనుగంగకు మోక్షమెప్పుడు?

లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు గురించి నా చిన్నతనం నుంచి వింటున్నాను. మా ఆదిలాబాద్ జిల్లాకు లాభించే ప్రాజెక్టుపై ప్రభుత్వానికి చిన్న చ

Published: Sun,March 18, 2012 11:45 PM

కంతనపల్లి కోసం ఉద్యమిద్దాం

కంతనపల్లి ప్రాజెక్టు పూర్తిచేయనిదే, దేవాదుల ప్రాజెక్టు నిరుపయోగంగా ఉంటుందని పేపర్‌లో చదివాను ఇది ఎట్లా? దేవాదుల ఇదివరకే కొంత భాగం

Published: Sun,March 11, 2012 11:39 PM

ఆ పార్టీలు దొందు-దొందే

చంద్రబాబు ప్రభుత్వంలోనే తెలంగాణ బాగా అభివృద్ధి సాధించిందని తెలుగుదేశం వాళ్లు, లేదూ మా రాజశేఖర్‌డ్డి జమానాలోనే బాగా ప్రాజెక్టులు స

Published: Sun,March 4, 2012 11:31 PM

నత్తనడకన ఎత్తిపోతలు..

చేటుపల్లి హన్మంతడ్డి ఎత్తిపోతలు ఏనదిపై ఎక్కడ కడుతున్నరు? కొమురం భీం, కోయిల్‌సాగర్, కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు నడుస్తున్నయా? నెట్టం

Published: Sun,February 26, 2012 11:59 PM

సింగూరు దీనగాథ

భవిష్యత్తులో అక్కంపల్లి సింగూరుగా మారుతుందని, ఎల్లంపల్లి సింగూ రుగా మారినా ఆశ్చర్యపోనక్కరలేదని తెలంగాణ ఇంజనీర్లు అంటూ ఉండ టం విన్న

Published: Mon,February 20, 2012 02:01 AM

వివాదాల(నాగార్జున) సాగరం

నాగార్జునసాగర్ డ్యాంను ఇప్పుడున్న చోట కాకుండా ఎగువన కట్టవలసి ఉండెనని మా పెద్దలు చెప్తూ ఉంటరు. అలా చేయకుండా కావాలని కిందకి తీసుకు

Published: Mon,February 13, 2012 12:29 AM

పాలమూరు వెనుకబాటు పాలకుల కుట్రే!

ఎ)కృష్ణా నదిలోని 10 శాతం నీటిని ఇచ్చినా పాలమూరు సస్యశ్యామలం అవుతుంది. జూరాల నీటి నిలువ సామర్థ్యం పెంచే అవకాశం ఉందా? బి)జలవనరులను

Published: Mon,February 6, 2012 12:40 AM

ఎస్‌ఎల్‌బీసీ - ఎఎంఆర్ ప్రాజెక్టులు

పోతిడ్డిపాడు, కెసీ కాలువకు శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు కడప, కర్నూలు జిల్లాలో సాగుకు ఉపయోగపడినప్పుడు, ఎస్‌ఎల్‌బీసీ ఎం

Published: Mon,January 23, 2012 12:07 AM

డిండీ ఎత్తిపోతల పథకం

డిండీ ఎత్తిపోతల పథకం అమలవుతే నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లా కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు అందుతుందని విన్నాను. నిజమా? వివరించండి

Published: Mon,January 9, 2012 12:00 AM

జూరాల-పాకాల

కృష్ణా నీటిని జూరాలనుంచి పాకాల దాక ఎటువంటి లిఫ్ట్ (ఎత్తిపోతల పథకం) లేకుండా గ్రావిటీ ద్వారా మళ్లించవచ్చని కేసీఆర్ ప్రతిపాదించారు.

Published: Mon,December 26, 2011 12:10 AM

బాబ్లీపైన కిమ్మనరేం?

మహారాష్ట్రలోని గోదావరి నదిపై నిర్మితమవుతున్న బాబ్లీ ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి నీటి పంపకంలో ఏమైనా నష్టం ఉన్నదా? తెలంగాణ

Published: Sun,December 18, 2011 11:06 PM

ఎత్తిపోతలకు సొంత విద్యుత్తు

గోదావరినదిపైన ఎన్నో ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం చేపట్టిందని మీరు అంటున్నారు. మరి వీటన్నింటికి విద్యుత్తు ఎక్కడ్నుంచి వస్తుంది? ప

Published: Sun,December 11, 2011 11:56 PM

‘ప్రాణహిత-చేవెళ్ల ’ తెలంగణ మణిహారం

ప్రాణహిత-చే ప్రాజెక్టును లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంటారు. అది నిజమా? ఒకవేళ నిజమైతే ఈ ప్రాజెక్టుకు ఎంత విద్యుత్తు అవసరమవుతుంది. ఇ

Published: Sat,December 10, 2011 06:17 PM

ఇచ్చంపల్లి-దేవాదుల-కంతనపల్లి

ఇచ్చంపల్లి ప్రాజెక్టును ఇక మరిచిపోవలసిందేనా? ప్రత్యామ్నాయంగా ఏ ప్రాజెక్టును చేపట్టారు? వివరాలు తెలపండి. -జి. హర్షవర్ధన్, నర్సంపేట

Published: Mon,November 14, 2011 12:02 AM

తెలంగాణ ప్రాజెక్టులు-పాలకుల వివక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచే తెలంగాణ ప్రాజెక్టులకు సరైన బడ్జెట్ కేటాయించకుండా, ఇచ్చిన బడ్జెట్‌ను కూడా పూర్తిగా వినియోగ

Published: Mon,November 7, 2011 04:45 PM

పోలవరం-గోల గరం

పోలవరం కట్టాలని ఒకరు, వద్దని మరొకరు, తక్కువ ఎత్తుతో కట్టాలని వేరొకరు. తెలంగాణకే ‘పోలవరం’ లాభం అని ఇంకొకరు ఇలా రకరకాలుగా మాట్లాడుతు

Published: Sun,October 30, 2011 10:59 PM

దుమ్ముగూడెం ఎందుకు వద్దు?

కంతనపల్లి ముద్దు-దుమ్ముగూడెం వద్దు అని ఆ మధ్యన మీరు ఖమ్మం, వరంగల్‌జిల్లాల్లో పర్యటించినప్పుడు విలేఖర్ల సమావేశంలో ప్రస్తావించినట్టు

Published: Sun,October 23, 2011 11:14 PM

కంచే చేను మేస్తే...?

మీరు రాసిన వ్యాసాలు, ఇస్తున్న ఉపన్యాసాలు విన్నాక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల దారుణ వివక్ష చూపెడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది

Published: Mon,October 17, 2011 12:20 AM

ప్రాంతాల వారీగా ప్రాజెక్టులు

తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలలో ఎన్ని ప్రాజెక్టులున్నాయి? ఎప్పుడు వాటిని పూర్తి చేశారు? ఒక్కొక్క ప్రాజెక్టు కింద ఎంత సాగవుతోంది? పై ప్రశ

Published: Sun,October 9, 2011 11:06 PM

తెలంగాణ ఎందుకు వెనుకబడింది?

తెలంగాణ వెనుకబడిన ప్రాంతమా? తెలంగాణ బంగారు తునక ఎట్లా అవుతుంది? -మంత్రి కరుణ, హైదరాబాద్ ఏదైనా దేశం లేక రాష్ట్రం లేక ప్రాంతం అభివ

Published: Mon,October 3, 2011 04:39 PM

మన నీళ్లు మనకు దక్కుతాయా?

జలవనరుల విషయంలో మనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించండి?మన నీళ్లు మనకు దక్కకపోవడానికి కారణం?తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మనకు జలవనరుల

Published: Sun,September 25, 2011 11:24 PM

వలస గ్రహణం పట్టిన మన ప్రాజెక్టులు

1956 నుంచే కృష్ణా, గోదావరి జలాలను వీలైనంత మటుకు పూర్తిగా హరించాలన్న దుష్ట పన్నాగాలతోనే తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డు తగులుతూ వచ్చారు

Published: Mon,September 19, 2011 12:08 AM

అనుమతి లేకున్నా పోలవరం నిర్మాణం

పోలవరం ప్రాజెక్టును ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లాలో కడుతున్నారు కదా! దీనివల్ల తెలంగాణకు ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో రెండు లక్షల ఎకరాలు

Published: Fri,September 23, 2011 12:46 PM

రాష్ట్రం విడిపోతే ఎవరికెన్ని నీళ్లు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి తెలంగాణ, సీమాంధ్ర లేక తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ రాష్ట్రాలుగా ఏర్పడితే కృష్ణా, గోదావరి నదులలో ఎవర

Published: Mon,September 12, 2011 06:05 PM

ఎత్తున ఉంటే తెలంగాణకు నీళ్లు రావా?

‘తెలంగాణ ఎత్తు మీద ఉండటం మూలాన ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా తెలంగాణకు నీళ్లు రావు’ అని సీమాంవూ

Published: Mon,September 12, 2011 06:09 PM

తెలంగాణ ప్రాజెక్టులు-సీమాంధ్రకు నీళ్ళు

తెలంగాణ వస్తే మాకు నీళ్లు రావు అని అమాత్యులు జె.సి. దివాకర్‌డ్డి సెలవిచ్చారు. మీ కామెంట్? -గొట్టిపర్తి యాదగిరి,

Published: Mon,September 12, 2011 06:10 PM

శ్రీశైలం ఎవరిది ?

-ఆర్. విద్యాసాగర్‌రావు కేంద్ర జలవనరుల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్ ఈ మధ్య మంత్రి టి.జి. వెంక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమవుతే శ్రీశ

Published: Mon,September 12, 2011 06:12 PM

నీళ్లు నిజాలు

వారం వారం జలవిజ్ఞానం బిరబిరా కృష్ణమ్మ తరలిపోతుంటుంది. జలజలా గోదారి ధవళేశ్వరం ఆనకట్టవుతుంది. ముక్కారు పంటలు కాలువలకు కాలడ్డం

Featured Articles