జనం నోళ్లు కొట్టి పరిశ్రమలకు నీళ్లు..!


Mon,June 11, 2012 12:42 AM

తాగడానికి నీళ్లు లేక ఒక పక్క గిలగిల కొట్టుకుంటూ ఉంటే, కృష్ణా నది నుంచి సిమెంట్ ఫ్యాక్టరీలకు నీటి కేటాయింపులు చేస్తూ ఈ జీవో లేమిటి? ఆ కంపెనీలు జగన్ సంస్థల్లో పెట్టుబడులేమిటి? ఏంటి సార్ ఈ గందరగోళమంతా? తెలంగాణ మంత్రే ఈ జీవోలు ఇచ్చి, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడం ఎంతవరకు సబబు? కాస్త వివరంగా చెప్తారా? కోల మంగళగౌరి, వికారాబాద్, రంగాడ్డి
మీరు మాట్లాడుతున్నది ఇటీవల పొన్నాల లక్ష్మయ్యను సీబీఐ విచారణ చేసిన జీవోలు 146, 94 గురించి అనుకుంటా! నిజమే. ఈ రెండు జీవోలు మీడియా పుణ్యమా అని వెలుగులోకి వచ్చి కలకలం సృష్టించాయి. ముందు ఈ జీవోల గురించి తెలుసుకుందాం.
జీవో 146
దీన్ని సాగునీటి శాఖవారు 22-7-2008న జారీ చేశారు. ప్రభుత్వం 21-6-1979న జీవో 408 ద్వారా రాశి సిమెంట్ లిమిటెడ్ కంపెనీకి కృష్ణా నదిలో నాగార్జునసాగర్ ఆనకట్టకు దిగువనున్న వజీరాబాద్ (వాడపల్లి) గ్రామ సమీపం నుంచి రోజుకు మూడు లక్షల గ్యాలన్ల చొప్పున తమ సిమెం ట్ ఫ్యాక్టరీ (నల్లగొండ) వినియోగం కోసం కృష్ణా జలాల వాడకానికి అనుమతి ఇవ్వడం జరిగింది. రాశి సిమెంట్ కంపెనీ కాలక్షికమేణా ‘దిఇండియా సిమెంట్స్ లిమిటెడ్’ గా రూపాంతరం చెందింది. ఆ కంపెనీ 10-12-2007 నాడు తమ కంపెనీ విస్తరణ జరుగుతున్న దృష్ట్యా మరో ఏడు లక్షల గ్యాలన్ల నీరు ఉంటే వెరసి పది లక్ష ల గ్యాలన్ల రోజు వారీ నీటిని కృష్ణా నది నుంచి ఎత్తిపోతల ద్వారా తీసుకోవడానికి అనుమతించవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకొంది. ఇంత వరకు బాగానే ఉన్న ది. ఇక్కడ్నుంచి అసలు తమాషా జరిగింది. దాన్ని గమనించాలి.1) చీఫ్ ఇంజనీర్ (మైనర్ ఇరిగేషన్) అంటే చిన్న నీటి పారుదల వ్యవహారాలు చూసే చీఫ్ ఇంజనీర్ కృష్ణా నదిలో ఎత్తిపోతల స్థలం దగ్గర తగినంత నీరు లభ్యమవగలదని ధృవీకరించారు. కంపెనీ వారి అర్జీ ని సానుకూలంగా పరిశీలించి మూడు లక్షల గ్యాలన్ల నుంచి 10 లక్షల గ్యాలన్ల చొప్పున ప్రతిరోజు నీటిని సిమెంట్ ఫ్యాక్టరీకి తరలించేందుకు అవసరమైన ఆదేశాలు జారీ చేయవలసిందిగా ప్రభుత్వం వారికి సిఫారసు చేయడం మొదటి అంశం. 2) అంతర్ రాష్ట్ర జలవనరుల వ్యవహారాలను పరిశీలించే చీఫ్ ఇంజనీర్ ఇండియా సిమెంట్స్ వారి దరఖాస్తును పరిశీలించి, కంపెనీ వారు కోరిన నీటి పరిమాణం (అదనపు ఏడు లక్షల గ్యాలన్లు ప్రతిరోజు) బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల పరిధిలోని వినియోగాల మొత్తంలో సంక్రమించే ఆదా నుంచి తీసుకోవచ్చని సిఫారసు చేశారు. అంతేకాక ఆ సిమెంట్ కంపెనీ తా ము ఉపయోగించుకునే ఈ అదనపు నీటి వల్ల ఎగువ, దిగువ ప్రయోజనాలకు సంక్రమించిన రైపీరియన్ హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చూసే బాధ్యత ఆ కంపెనీదే అని చెప్పడం రెండో అంశం.3) ఇద్దరు చీఫ్ ఇంజనీర్ల సిఫారసులను జాగ్రత్తగా పరిశీలించిన నేపథ్యంలో ప్రభుత్వం కంపెనీ వారి అభ్యర్థనను మన్నించి షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. ఇది మూడోఅంశం. ఫలితంగా ఇండియా సిమెంట్స్ కంపెనీకి కృష్ణా నది నుంచి అదనంగా రోజుకు ఏడు లక్షల గ్యాలన్ల నీరు వెరసి రోజుకు పది లక్షల గ్యాలన్ల నీరు వాడుకునేందుకు అనుమతి లభించింది.
జీవో 94
దీన్ని కూడా సాగునీటి శాఖ వారే 12 ఆగస్టు, 2009 న జారీ చేశారు. ప్రభుత్వం 19 డిసెంబర్ 1996 నాడు విశాఖ సిమెంట్ కంపెనీకి రంగాడ్డిజిల్లా, తాండూరు మండలం, మల్కాపూర్ గ్రామంలో స్థాపించబడిన సిమెంట్స్ కంపెనీ వినియోగార్థం రోజుకు 10 లక్షల లీటర్లు (0.013 టీఎంసీ) ని కేటాయించింది. ఈ నీరు కృష్ణానదికి ఉప నది అయిన కాగ్నా నుంచి లభ్యమవుతోంది. రంగాడ్డి జిల్లా, తాం డూరు మండలం చిట్టిఘన్‌పూర్ గ్రామానికి 0.75 కిలోమీటర్ల దూరంలో కాగ్నా నదిపైన ఉన్న ఎత్తిపోతల పథకం వద్ద ఇండియా సిమెంట్స్ కంపెనీ (పాత విశాఖ సిమెంట్స్ కంపెనీ)కి ఏడాదిలో అవసరమైన ఒకకోటీ ముప్ఫై లక్షల ఘనపు అడుగుల అదనపు నీరు లభ్యమవుతుందని, అలా అదనపు నీటిని సిమెంట్ కంపెనీకి తరలించడం వల్ల బచావత్ ట్రిబ్యునల్ విధించిన షరతు ‘కాగ్నా నుంచి ఆరు టీఎంసీల కంటే ఎక్కువ ఆంధ్రవూపదేశ్ వాడుకోరాదు’ అన్న నిబంధనను ఉల్లంఘించడం లేదని, ఎగువ, దిగువ ప్రాజెక్టులకు ఉన్న హక్కులకు ఎలాంటి నష్టం వాటిల్లదని, ఈ అదనపు నీటి తరలింపు మూలంగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదించిన ఏ పథకానికి ఎలాంటి హానీ కలగదని, చిన్నతరహా ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ హామీ ఇచ్చారు.సిమెంట్ ఫ్యాక్టరీకి నిక్షేపంగా ఈ అదనపు నీటి ని కేటాయించేందుకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా సిఫారసులు చేశారు. ప్రభుత్వం చీఫ్ ఇంజనీర్ వారి సిఫారసులను జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకుని, ఇండియా సిమెంట్స్‌కు కాగ్నా నదినుంచి సాలీనా 13 మిలియన్ క్యూబిక్ ఫీట్ నీటిని వినియోగించుకునేందుకు షరతులతో కూడిన అనుమతి జారీ చేసింది.

పై రెండు జీవోలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకే పరిస్థితిలో, ఒకే నేపథ్యం లో ఇది జారీ చేయబడిందని తెలుస్తోంది. జీవో 146 విషయంలో ‘ఇంటర్ స్టేట్ సి.ఇ.’ అభివూపాయం తీసుకున్నారు. కానీ జీవో 94 విషయంలో అది కూడాలేదు. ఈ జీవోల విడుదల, లబ్ధిదారు ఒకే కంపెనీ కావడం, అది జగన్ కంపెనీలలో భారీగా పెట్టుబడులు (135 కోట్లు) పెట్టడం వేరే విషయం. మొత్తం జీవోల ప్రహసనం గమనిస్తే ఇదంతా మాయా, కట్టుకథలాగా కనిపిస్తుంది. ‘కృష్ణానది’ జల వినియోగం చాలా సున్నితమైన అంశం. అసలు C.E (Minor Irrigation) పరిధిలోకి నదులు, ప్రాజెక్టులు, కేటాయింపులు, వినియోగం రానేరాదు. ఆయన పరిధిలో ఉన్నది కేవలం మైనర్ ఇరిగేషన్ చెరువులు, ప్రభుత్వ ఎత్తిపోతల పథకాలు, ఓపెన్‌హెడ్ ఛానల్స్ వగైరా మాత్రమే సిమెంట్ కంపెనీ అభ్యర్థనను ఆయనకు పంపడమేమిటి? కృష్ణానదిలో కాగ్నా నదిలో తగినంత నీరు లభ్యమవుతుందని ఆయనెలా ధృవీకరిస్తారు? ఆ నీటి తరలింపు వల్ల ఎగువన, దిగువన ప్రాజెక్టు వినియోగదారులకు ఎలాంటి నష్టం వాటిల్లదని ఆయనెలా చెప్తారు? బచావత్ ట్రిబ్యునల్ నిబంధనలు ఉల్లంఘించలేదని, నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదిత ప్రాజెక్టుల వినియోగానికి కూడా ఈ తరలింపు ఎలాంటి అవరోధం కాదని ఆ పెద్ద మనిషికి ఏం తెలుసు? ఏమిటీ నాటకమంతా? ఆయన రికమెండ్ చేయడం, ప్రభుత్వం దాన్ని ఆమోదించడం అంతా ఫార్స్. జీవో 146 విషయంలో అంతపూరాష్ట్ర జల వ్యవహారాలను చూసే చీఫ్ ఇంజనీర్ ఒకవేళ వినియోగంలో మిగులు ఉంటే, దాన్ని ఉపయోగించుకునే హక్కు ప్రభుత్వానికుందని బచావత్ ట్రిబ్యునల్ చెప్పినట్టు స్పష్టం చేయడం జరిగింది. అంతవరకు కరెక్టే. వినియోగంలో మిగులు ఉందా? ఉంటే ఆ మిగులును కొత్త ప్రాజెక్టులకు ఉపయోగించుకోవాలి. కానీ ప్రైవేట్ ప్రాజెక్టులకు ఎలా కేటాయిస్తారు? గూడుపురాణీలా కనిపిస్తోంది.

అసలు విషయమేమంటే బచావత్ ట్రిబ్యునల్ రాష్ట్రానికి కేటాయించిన 800 టీఎంసీలలో (రీ జనరేషన్ 11 టీఎంసీలు అదనం) 116.26 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేటాయించింది. ఇందులో రాయలసీమ వాటా 13.90 టీఎంసీలు.కోస్తాంధ్ర వాటా 11.54 టీఎంసీలు పోను మిగతా భారీవాటా 90.82 టీఎంసీలు. ఈవేళ అనేక కారణాల వల్ల, ముఖ్యంగా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల చిన్ననీటి తరహా వ్యవసాయం పూర్తిగా దెబ్బతిన్నది. చెరువులు, కుంటలు, కబ్జాలకు గురై ఆదరణకు నోచుకోక, పట్టించుకునే నాథుడు లేక మైనర్ ఇరిగేషన్‌కు కేటాయించిన నీరు ఇతర ప్రయోజనాలకు, ఇతర ప్రాంతాలకు తరలిపోతోంది. ఉదాహరణ తెలంగాణయే. ప్రభుత్వమే మొత్తం రాష్ట్రంలో 71.50 టీఎంసీలు మాత్రమే చిన్నతరహా ప్రాజెక్టులు వినియోగించుకుంటున్నాయని చెప్తోంది. తెలంగాణలో 12, 66,000 ఎకరాల ఆయకట్టుకు గాను 2,20000 వేల నుంచి 70, 15000 ఎకరాల దాకా నీటి వినియోగమవుతున్నట్టు ప్రభుత్వం చెప్తోంది.అంటే ప్రభుత్వం కావాలనే మైనర్ ఇరిగేషన్‌లో వినియోగం, కాకుండా అదా చేస్తోంది. ప్రభుత్వం చేయవలసింది చిన్నతరహా నీటి వనరులను అభివృద్ధి చేసి, వినియోగాన్ని పెంచడం.అంతేకాని కావాలని చిన్ననీటి వనరులను ధ్వంసం చేసి ‘వినియోగం’లో ‘ఆదా’ ఉందని నిర్ధారణకు వచ్చి, ఆ వినియోగపు జల పరిమాణాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసి, ప్రతిఫలంగా ప్రభుత్వం వారి ఆశ్రీతులకు లబ్ధి చేకూర్చడం కాదు. పూర్తిగా చెరువులు, కుంటలను,ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించి, నీటి వినియోగాన్ని పెంచి, అప్పటికీ మైనర్ ఇరిగేషన్ కోటాలో ఆదా ఉంటే, దాన్ని ప్రాంతాల వారీగా ( ఏ ప్రాంతం కోటా లో ఆదా అయితే ఆప్రాంతం వారికి లబ్ధి చేకూరేలా) ప్రభుత్వ పథకాల (కొత్తవి)ను మంజూరు చేయవలసి ఉంటుంది.

ఇక జాతీయ జలవిధానం కానీ రాష్ట్ర జల విధానం కానీ, చూసినా అందులో తాగునీటికి, ఆ తర్వాత సాగునీటికి ప్రాధాన్యం ఉన్నది. పారిక్షిశామిక అవసరాలలో కూడా వ్యవసాయానికి పనికొచ్చే పరిక్షిశమలకే అధిక ప్రాధాన్యం ఉంది. సిమెంట్ పరిక్షిశమ లాంటి పరిక్షిశమల అవసరాలకు ప్రాధాన్యత పరంగా నీటి కేటాయింపులు అధమ స్థానంలోనే ఉంది. ఇలాంటి పరిక్షిశమల కు నీటిని కేటాయించాలన్నా, ఒక పాలసీ ప్రకారంగా, బహిరంగ ప్రకటన చేసి, వివిధ పరిక్షిశమ ల నుంచి అర్జీలు అందుకుని పారదర్శకంగా కేటాయింపులు జరపాలి. కానీ తమ ఇష్టమొచ్చిన కం పెనీలకు, తమకు అనుకూలమైన పద్ధతిలో నీటిని కేటాయించడం కాదు.
దురదృష్టమేమంటే తెలంగాణ మంత్రులు సీమాంధ్ర ముఖ్యమంవూతుల తాబేదార్లుగా మారి, వారి చేతిలో కీలుబొమ్మలుగా వ్యవహరిస్తున్నారు. సిమెంట్ కంపెనీలకు నీరు కేటాయించాలంటే, తెలంగాణ ప్రాజెక్టుల వినియోగంలో ఆదా చూపిస్తారు.రాయలసీమకు నీరు కావాలంటే ‘పోతిడ్డిపాడు’ ను వెడల్పు చేసుకోవచ్చని, తద్వారా తెలంగాణకు ఎలాంటి ముప్పు లేదంటారు. ‘పోలవరం’,‘పులిచింతల’ మూలంగా తెలంగాణకే లాభమంటారు. దుమ్ముగూడెం-నాగార్జునాసాగర్ టెయిల్‌పాండ్ ద్వారా గోదావరి నీటిని తరలించినా తెలంగాణకు నష్టమేమీ లేదని ధృవీకరిస్తారు. ఇలా ఎన్న ని చెప్పమంటారు.తెలంగాణ మంత్రుల భుజాలపై నుంచే సీమాంధ్ర ముఖ్యమంవూతులు కాల్పులు జరుపుతారు. ఈ ప్రాంత మంత్రులు అంతా నియమ నిబంధనల ప్రకారమే జరిగిందంటారు. తాగడానికి నీళ్లు లేక విలవిలలాడుతుంటే నీటిని నిక్షేపంగా సిమెంట్ పరిక్షిశమలకు తరలించేందుకు వీలుగా ప్రభుత్వం జీవో జారీలు చేయడం గర్హనీయం.

-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

country oven

Featured Articles