పట్నం దూప తీరే మార్గం ఏది?


Tue,May 29, 2012 12:02 AM

raj0 talangana patrika telangana culture telangana politics telangana cinemaగండికోట ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేస్తున్న ప్రభుత్వం ఎల్లంపెల్లిని ఎందుకు నానబెడ్తున్నది? ‘ప్రాణహిత-చే ప్రాజెక్టు అంతర్భాగమైన హైదరాబాద్ నీటి సరఫరా పథకాన్ని ఎల్లంపెల్లి నుంచి ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకంత ఉత్సాహం చూపెడుతున్నది? ఒకసారి ఎల్లంపల్లి నుంచి 30 టీఎంసీల నీటిని హైదరాబాద్‌కు అందివ్వడం ప్రారంభిస్తే మిగిలిన ప్రయోజనాలు దెబ్బతినవా? జాతీయ జల విధానం ప్రకారం తాగునీటికి అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది కదా? మన తెలంగాణ మంత్రులు, నాయకులు ఎందుకు దీన్ని వ్యతిరేకించడం లేదు? హైదరాబాద్‌కు దగ్గర ఉన్న కృష్ణా నది నుంచి ఇవ్వడం సమంజసం కాదా? హైదరాబాద్‌కు నీరు తరలించే క్రమంలో మార్గమధ్యంలో ఉన్న గ్రామస్తుల నీటి అవసరాలు తీరుస్తున్నారా?

-ఎస్. రచన, హైదరాబాద్



మీరు తాడిపూడి, పుష్కర, పోలవరం, కల్వకుర్తి, భీమా, ప్రాణహిత, పెన్‌గంగ, లెండి ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం గురించి కూడా అడిగారు. వీలు వాటి గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి జంట నగరాల నీటి సరఫరా విషయమే మాట్లాడుకుందాం. జాతీ య జల విధానంలో తాగునీటికి అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నది ముమ్మాటికి నిజం. పైపెచ్చు ప్రతి పౌరుడికి తాగునీటిని అందివ్వవలసిన బాధ్యత ప్రభుత్వానిదని సుప్రీంకోర్టు అనేక కేసుల్లో నొక్కివక్కాణించింది.
ఇకపోతే హైదరాబాద్ మూసీ బేసిన్లో ఉన్నది. మూసీ కృష్ణానదికి ఉపనది. కనుక అంతర్జాతీయ సూత్రాలు, సహజ న్యాయ సూత్రాలననుసరించి జంటనగరాల తాగునీటి అవసరాలను తీర్చే బాధ్యత కృష్ణా బేసిన్‌దే. కనుక నే కృష్ణా నదీ జలాలలను వివిధ రాష్ట్రాలకు పంచిన బచావత్ ట్రిబ్యూనల్ జంటనగరాల తాగునీటి అవసరాల నిమిత్తం 3.90 టీఎంసీలను కేటాయించింది.

ఆంధ్రవూపదేశ్ వాటాకు లభించిన 00 టీఎంసీలలో ఈ 3.90 టీఎంసీలు ఉన్నాయన్న విషయం గమనించదగ్గది. అయితే ఆంధ్రవూపదేశ్ రాష్ట్రానికి రాజధాని కావడం మూలంగా జంట నగరాల అవసరాలు రోజురోజుకూ పెరిగిపోవడంతో అదనపు నీటిని ఎక్కడి నుంచి తేవాలన్న ప్రశ్న తలెత్తింది. జంటనగరాలకు సమీపంలో గోదావరి బేసిన్‌కు చెందిన ఉపనది మంజీరా ఉన్నది. అవసరాల రీత్యా మంజీరా నదికి అడ్డంగా బ్యారేజీ నిర్మించి రెండు దశలలో మొత్తం మూడు టీఎంసీల నీటిని అందజేశారు. అవి కూడా సరిపోకపోవడంతో ప్రభుత్వం ప్రముఖ ఇంజనీర్ శ్రీనివాసరావు అధ్యక్షతన ఓ కమిటీ వేసి, ఈ సాగునీటి సమస్యకు పరిష్కారం సూచించమని కోరింది. కమిటీ గోదావరి నదిపైన కట్టిన శ్రీరాంసాగర్, గోదావరికి ఉప నది అయిన మంజీరా, కృష్ణా నదుల నుంచి నీటిని తరలించే వివిధ మార్గాలపైన దృష్టి సారించింది.

శ్రీరాంసాగర్ తన నిర్ధారిత ఆయకట్టుకే నీటిని సక్రమంగా అందించలేకపోవడం ఒక కారణమైతే, దూరభారం మరో కారణంగా ఉన్న దృష్ట్యా దాన్ని తిరస్కరించారు. సిటీకి దగ్గర మంజీరా ఉండడం, పంపింగ్ చేసే ఎత్తుకూడా తక్కువగా ఉండడం వల్ల కమిటీ మంజీరావైపు మొగ్గుచూసే అవకాశం ఎక్కువగా కనిపించింది. అయితే మంజీరాలో పరిమిత నీటి లభ్య త, దానిపైన ఆధారపడ్డ ఘనపురం ఆనకట్ట ఆయకట్టు, నిజాంసాగర్ ఆయకట్టు దృష్ట్యా, ఇదివరకే మంజీరా నుంచి మూడు టీఎంసీల నీటిని సరఫరా చేస్తున్న దృష్ట్యా కమిటీ మంజీరా ప్రత్యామ్నాయాన్ని కూడా తిరస్కరించింది. చివరకు కృష్ణా నదిలో అనువైన చోటు నుంచి జంటనగరాలకు నీటిని సరఫరా చేయడమే ఉత్తమమని శ్రీనివాసరావు కమిటీ తేల్చి చెప్పిం ది. అయితే అప్పటికే కృష్ణా జలాలపైన కన్నేసిన రాయలసీమ నాయకులకు శ్రీనివాసరావు కమిటీ సిఫారసులు మింగుడు పడలేదు. అప్పటి సంబంధిత మంత్రి చల్లా సబ్బారాయుడు కనుసన్నల్లో మరో కమిటీ చేత మంజీరా నది లో అవసరాలు పోను పది టీఎంసీల నీరు మిగిలి ఉంటుందని లేనినీటిని సృష్టించి భేషుగ్గా మంజీరా జలాలను సిటీకి తరలించడమే మంచిదని చెప్పించి, వెన్వెంటనే ప్రభుత్వం చేత ఒప్పించి, ‘సింగూరు’ జలాశయానికి అంకురార్పణ జరిగేట్టు చేశారు.

బేసిన్‌లో ఉన్న జంటనగరాలకు కృష్ణా నీటిని కాదని, నిపుణుల కమిటీ సిఫారసులను కూడా తోసిరాజని, గోదావరి బేసిన్ నీటిని తరలించే కార్యక్షికమానికి పూనుకోవడం వెనక సీమాంధ్ర నాయకుల కుట్ర దాగుంది. ఆ విధంగా మంజీరా నది నుంచి ప్రతిఏటా సుమారు ఏడు టీఎంసీలను నిరాఘటంగా సరఫరా చేయడం జరుగుతోంది. ఉస్మాన్‌సాగ ర్, హిమాయత్‌సాగర్ జలాశయాలు అందించే 40 ఎంజిడి (రోజుకు మిలియన్ గ్యాలన్లు)తో పాటు, మంజీరా ద్వారా 105 ఎంజిడిలు కలి పి వెరసి 145 మిలియన్ గ్యాలన్లు రోజుకు జంటనగరాలకు సరఫరా అవుతున్నాయి. వీటికి తోడు భూగర్భ జలాలు మరో 25 మిలియన్ గ్యాలన్ల నీరు అందిస్తున్నాయి. జంట నగరాలతో పాటు పరిసర ప్రాంతాలకు నీటి సరఫరా చేయాల్సిన అవసరం రోజురోజుకు పెరుగుతున్నది. జనాభా పెరుగుదల కారణంగా నీటి సరఫరాపై ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వానికి కృష్ణా జలాలను తరలించక తప్పని పరిస్థితి ఏర్పడింది. 197లో కృష్ణా జలాలను అందించే ‘కృష్ణా పథకాన్ని’ రూపొందించడం జరిగింది.

నాగార్జునసాగర్ జలాశయం నుంచి 16.5 టీఎంసీల నీటిని తరలించడానికి వేసిన నాటి ప్రాజెక్టుకు ప్రణాళికా సంఘం ఆమోదం తెలిపింది. నాటికి దీని వ్యయం అంచనా 1500 కోట్లు. ఆ డబ్బును ప్రపంచ బ్యాంకు సమకూర్చడానికి అంగీకరించింది. అయితే ప్రభుత్వ అధికారం కాంగ్రెస్, టీడీపీ చేతుల్లోకి తరచుగా మారడంతో ప్రభుత్వం ఈ పథకం అమలు, టెండర్లు పిలిచే విధాన నిర్ణయాలలో భిన్నాభివూపాయాలు వ్యక్తమయి, పథకం అమలులో విపరీతమైన జాప్యం చోటు చేసుకున్నది. చివరకు పాక్షికంగా అంటే మూడు దశలలో ఈ ప్రాజెక్టు అమలు చేయాలి. ముందనుకున్నట్టు సుంకిశాల నుంచి కాకుండా ఎఎంఆర్‌పీ (ఎలిమినేటి మాధవడ్డి ప్రాజెక్టు) నుంచి ప్రారంభించడం, పూర్తి చేయడం జరిగింది. అంటే మరో 90 ఎంజిడిల నీరు జంటనగరాలకు అందించే ఏర్పాటు జరిగిందన్న మాట. ఇక రెండవ స్టేజీలో మరో 5.5 టీఎంసీల తరలింపు ప్రసక్తి వచ్చే సరికి నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ తీవ్రంగా అడ్డుకున్నారు. ఆయన కు కృష్ణా జలాలను అటు జంటనగరాలకు గానీ, ఇటు తెలంగాణకు తరలించడం ఇష్టం లేదు.

కృష్ణా జలాలను సీమకు, ఆంధ్రకు తరలించడం ప్రధాన కర్తవ్యంగా భావించి, ఆ ఆలోచనల అమలులో భాగంగా ‘పులిచింతల’, ‘పోలవరం’, ‘దుమ్ముగూడెం-నాగార్జునసాగర్’ ‘ప్రాణహిత-చే ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు జీవో 107, 170లు విడుదల చేసి పోతిడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను సీమాంధ్రకు తరలించే కుట్రలో ప్రధాన పాత్ర వహించారు. కనుక ఈ నాటకంలో భాగంగా సీమ ప్రాజెక్టులను త్వరతిగతిన పూర్తిచేసి తెలంగాణ ప్రాజెక్టుల గురించి పంచ రంగులలో తెలంగాణ నాయకులను, ప్రజలను భ్రమింప చేశారు. ఇక కృష్ణా జలాలను సిటీకి తరలించే ప్రసక్తి వచ్చేసరికి రెండవ స్టేజీకి మోకాలడ్డడమే కాకుండా ‘జంటనగరాల’ దాహార్తిని తీర్చే ‘శాశ్వత పథకం’ ‘ప్రాణహిత-చే అని 30 టీఎంసీల గోదావరి నీటిని సిటికీ తరలించే మాస్టర్‌ప్లాన్ వేసి, తాత్కాలిక ప్రాతిపదికన ఎల్లంపల్లి నుంచి 10 టీఎంసీల నీటిని తరలించేందుకు అవసరమైన అనుమతులు జారీ చేసిన మహానుభావుడు వైఎస్. అయితే సిటీ కార్పొరేట ర్ల ఒత్తిడి పెరగడంతో ఇష్టం లేకుండానే కృష్ణా రెండవ దశ పథకం అమలుకు తల ఒగ్గక తప్పలేదు.

ఫలితంగా మరో 90 ఎంజీడిల కృష్ణా జలాలు (5.5 టీఎంసీలు) సిటీకి లభించే అవకాశాలు దక్కాయన్న మాట. ఆరు నూరైనా సరే మరింక కృష్ణా జలాలను సిటీకి తరలించే ప్రశ్నే లేదని భీష్మించుకు కూర్చున్నారు ఆయన. ఆయన కాలం చేశాక, కొత్త సీఎంలు వచ్చాక ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకు కూర్చున్నారు. ఒక్క పక్క సాంక్షన్ అయిన మూడో దశ అమలు ఆపి జంటనగరాల అవసరాలను పక్కనపెట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టుపై దృష్టి పెట్టడమా? లేక సిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజావూపతినిధుల ఒత్తిడికి లొంగడమా? అయినా పక్కకున్న కృష్ణమ్మను వదిలి గోదావరి కోసం పరుగులు పెట్టడంలో ఔచిత్యమేమిటని తెలంగాణవాదులు చేస్తున్న విమర్శలకు జవాబివ్వలేని పరిస్థితి. ఎట్టకేలకు ప్రభుత్వం కృష్ణా మూడో దశ అమలు చేస్తామని హామీ ఇచ్చింది.

ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే సిటీకి కావలసిన నీరు 495 ఎంజిడిలు. ఇప్పుడు అన్ని మార్గాల ద్వారా అందుతున్న నీరు 340 ఎంజిడిలు. దాదాపు 120 ఎంజిడిల కొరత. కృష్ణా ఫేజ్-3 అమలు చేస్తే 90 ఎంజిడిలు వస్తాయి. దీనికయ్యే ఖర్చు 1670 కోట్లు. ఈలోగా గోదావరి నుంచి (ఎల్లంపల్లి నుంచి) 10 టీఎంసీలు తరలించడానికి పనులు ప్రారంభించారు. దాని ఖర్చు 3375 కోట్లు. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు 16 కిలోమీటర్ల పైపులైన్లు వేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 70 కిలోమీటర్లు పూర్తి చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో కృష్ణా మూడోదశ అమలు చేయమని తీవ్ర ఒత్తిడి ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం కేవలం 30 కోట్ల రూపాయాలు మాత్రమే బడ్జెట్‌లో కృష్ణా పథకానికి కేటాయించింది. 30 కోట్లతో పనుపూలా చేపడ్తామని ప్రజావూపతినిధులు ప్రశ్నిస్తున్నారు. 1500 కోట్ల రుణాలిస్తామని హడ్కో సంస్థ ముందుకొచ్చినా 12 శాతం వడ్డీ అని ప్రభుత్వం అప్పుతీసుకోవడానికి తటపటాయిస్తున్నది. హడ్కోకు బదులు JICA జపాన్ సంస్థనుంచి అప్పుతీసుకుంటే వడ్దీ భారం తగ్గుతుందని ప్రభుత్వ యోచన.

సిద్ధంగా ఉన్న హడ్కో రుణం వదిలేసి రెండు మూడేళ్ల తర్వాత లభించే JICA కోసం పరుగులు పెడ్తే ఈలోగా ద్రవ్యోల్బణం వల్ల స్కీం వ్యయం 20 నుంచి 30 శాతం పెరుగుతుంది. కనుక హడ్కో నుంచి అప్పు తీసుకోవడమే మేలని నిపుణులు వాదిస్తున్నారు. ఏ నిర్ణయం తీసుకోలేక ఇంకా ఆలోచిస్తు న్నది ప్రభుత్వం. అసలు ప్రభుత్వానికి కృష్ణాజలాలు తరలించాలన్న ప్రతిపాదన పట్ల చిత్తశుద్ధిలేదు. ఇదండీ సీటీ దాహార్తి తీర్చే పథకం పట్ల ప్రభుత్వం వ్యవహారించేతీరు. 12 శాతం జనాభా కలిగిన జంటనగరాల పట్ల (అందు లో గణనీయంగా సీమాంవూధులు) ప్రభుత్వ వైఖరి ఇలా ఉంటే.., 40 శాతం జనాభా కలిగిన తెలంగాణ పట్ల ఏమేరకు ప్రేమాభిమానాలు ఈ ప్రభుత్వానికి ఉంటాయో ఊహించడం కష్టం కాదు. ఇక గండికోట పరిగెత్తడానికి ఎల్లంపల్లి నత్తనడకన సాగటానికి కారణాలు ఇంకా వేరే చెప్పాలా? నాగార్జునసాగర్ పరుగెత్తడానికి , పోచంపాడు ఎడ్లబండిలా సాగడానికి, తెలుగుగంగ పరుగుపూత్తడానికి, ఎస్‌ఎల్‌బీసీ గూడ్స్‌లా సాగడానికి, ఇలా సీమాంధ్ర ప్రాజెక్టులతో పోలిస్తే తెలంగాణ ప్రాజెక్టుల గతి ఎలా సాగుతుందో చెప్పడానికి ప్రత్యేకించి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు.

హైదరాబాద్‌కు పైపు ల ద్వారా నీటిని తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యంలో గ్రామస్తులకు నీళ్లందించడం న్యాయం. అయితే వాటికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. ఆందోళన చేస్తే తప్ప ఈ ప్రభుత్వం అంత తేలిగ్గా కదుల్తుందా?

ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు నీరు తరలిస్తే ఇతర ప్రయోజనాలు దెబ్బతినవా? అని అడిగారు. దెబ్బతినడమే కాదు, జంటనగరాల నీటిసరఫరాయే ప్రధాన ప్రాధాన్యమై కూర్చుంటుంది. సింగూరు గతేమయింది? ఈ వేళ సింగూరు పైన ఆధారపడ్డ మెదక్, నిజామాబాద్ రైతుల గతేమైంది? క్రమక్షికమంగా ఎల్లంపల్లికూడా మరో సింగూరవుతుంది. కృష్ణా అందించే అక్కంపల్లి పరిస్థితి కూడా అంతే అవుతుంది. ప్రత్యేకంగా జంటనగరాల నీటి సరఫరా కోసం ఓ స్కీంను రూపొందిస్తే ఫరవాలేదు. కానీ బహుళార్థక ప్రాజెక్టు నుంచి జంటనగరాల నీటిసరఫరా ఉంటే తప్పక అది క్రమక్షికమంగా తాగునీటి ప్రాజెక్టుగా మారుతుందనడంలో అనుమానం లేదు. ఇకపోతే మీరడగిన మరో ప్రశ్న-తెలంగాణ ప్రజావూపతినిధులు దీన్ని ఎందుకు వ్యతిరేకించడంలేదు? అని. సమైక్యాంవూధలో తెలంగాణ మంత్రులు అంత దమ్ము, ధైర్యం ప్రదర్శించే అవకాశం లేదు. కనుకనే ప్రత్యేక తెలంగాణ కోసం ఇంత ఉద్యమం చేయాల్సి వస్తున్నది.

తాజా సమాచారం : 26-5-12 రాత్రి ముఖ్యమంత్రి కృష్ణా మూడోదశ పథకానికి ఆమోద ముద్ర వేశారని, హడ్కోనుంచి అప్పుతీసుకోవడానికి అంగీకరించారని, డిసెంబర్ 2013 నాటికి సిటీకి కృష్ణా జలాలు 5.5 టీఎంసీలు తరలింపబడుతాయని తెలిసింది. శుభం. ఇది హైదరాబాద్ ప్రజల, ప్రతినిధుల విజయం. సీమాంధ్ర నాయకులు, మరీ ముఖ్యంగా రాయలసీమ నాయకులు, వైఎస్ అభీష్టానికి వ్యతిరేకంగా కేవలం ఆందోళన మూలం గా కలిగిన సత్ఫలితం. రేపు తెలంగాణ సాధించుకోవాలన్నా ఇదేమార్గం. ఉద్యమిస్తే తప్ప తెలంగాణ ప్రజలకు న్యాయం చేకూరదన్నది కటిక సత్యం.

-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్


35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

country oven

Featured Articles