నీటికోసం నిరసన దీక్ష


Mon,May 21, 2012 02:57 AM

కృష్ణా నీళ్లలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, కావాలనే సీమాంధ్ర పాలకులు ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ ప్రయోజనాలను నీరుకార్చే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే తాను దీక్ష ప్రారంభించనున్నట్లు కేసీఆర్ ప్రకటన చేశారు విషయమేమిటి?

- జి. కుమారస్వామి, హబ్సీగూడ, హైదరాబాద్



కృష్ణా గోదావరి నదులు రెండు తెలంగాణ నుంచే సాగుతున్నాయి. పరీవాహక ప్రాంత దృష్ట్యా చూస్తే ఆంధ్రవూపదేశ్‌లో తెలంగాణ, కృష్ణానదిలో 68.5 శాతం, గోదావరినదిలో సుమారు 80శాతం కలిగి ఉన్నాయి. ఏ ప్రాతి పదికన చూసినా తెలంగాణ వాటా కృష్ణా, గోదావరి నదులలో ఆ మాత్రం రావాలె. కాని సీమాంధ్ర పాలకులు అనేక డ్రామాలు చేసి ,అవసరమయిన చోట మొసలికన్నీరు కార్చి కృష్ణానది జలాల్లో తెలంగాణకు 34 శాతం కంటే తక్కువే వచ్చేట్టు చేశారు. అంటే బచావత్ న్యాయపీఠం ఆంధ్రవూపదేశ్‌కు మొత్తం కృష్ణా జలాల నికరజలాల పరిమాణం 2060 టీఎంసీలయితే అందులో 800 టీఎంసీలను కేటాయించింది. మరో 70 టీఎంసీల వినియోగనంతర పునరుత్పత్తి జరుగుతుందని (Regeneration flows) అందులో ఆంధ్రవూపదేశ్‌కు 11టీఎంసీల వాటా ఉంటుందని తేల్చింది.
అంటే మొత్తం 2130 టీఎంసీల నికర జలాల కేటాయింపులో ఆంధ్రవూపదేశ్‌కు లభించిన వాటా 811 టీఎంసీలన్నమాట. ఇందులో తెలంగాణ ప్రాజెక్టులకు లెక్కలు కట్టి తేల్చిన వాటా 275.26 టీఎంసీలు.

ట్రిబ్యునల్1976లో తీర్పును వెల్లడించింది. ఆ తర్వాత కాలంలో ప్రాజెక్టుల వినియోగ పరిమాణంలో కొంత మార్పులు చేసి కొత్త ప్రాజెక్టులకు కేటాయించటం జరిగింది. అంటే బచావత్ ట్రిబ్యునల్ నిర్ణ యం వెలువడ్డ తదుపరన్నమాట. ఆక్రమంలో కృష్ణా డెల్టా వినియోగంలో 29 టీఎంసీలు తగ్గించి 9 టిఎంసీలను కొత్తగా ప్రతిపాదించిన పులిచింతల ప్రాజెక్టుకు, 20 టీఎంసీలను భీమా ప్రాజెక్టుకు కేటాయించారు. అదే పద్ధతిన కొత్త ప్రాజెక్టు శ్రీశైలం గట్టు కాలువ (SRBC)కి అవసరమైన 19 టీఎంసీల కోసం కేసీ కాలువ వినియోగంలో ఆధునీకరణ ప్రక్రియ ద్వారా 8 టీఎంసీల మిగులు చూపి, దాన్ని,తోడుగా ‘రీజనరేషన్ ఫ్లోస్’ ద్వారా లభించే 11 టీఎంసీల జోడించి నీటి లభ్యత ఉన్నట్టు చూపి కేంద్ర జలసంఘాన్ని ఒప్పించి భీమా (తెలంగాణ), పులిచింతల(కోస్తాంధ్ర), ఎస్‌ఆర్‌బీసీ(రాయలసీమ)కు ప్రాణ ప్రతిష్ట చేయడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ వాటా మరో 20 టీఎంసీలు పెరిగి 295.26 టీఎంసీలు అయింది. అంటే పరీవాహక ప్రాంతం దృష్ట్యా అనుభవించవలసిన వాటాలో దాదాపు సగమే నికర జలాలలో తెలంగాణకు లభించిందని అర్థం చేసుకోవాలి.

కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, 2004 ఎన్నికలకు పూర్వం శాసనసభలో తెలంగాణ వాటా గురిం చి, తెలంగాణ ప్రాజెక్టులకు జరుగుతున్న అన్యాయం గురించి సుదీర్ఘ ప్రసం గం చేసినప్పుడు అప్పటి భారీ నీటి పారుదల శాఖామాత్యులు కడియం శ్రీహరి లిఖితపూర్వకంగా శాసనసభలో ఇచ్చిన సమాధానం గురించి తెలుసుకోవాల్సిన అవసరముంది.

‘మూడు రాష్ట్రాల మధ్య పంపిణీ కోసం, 75 శాతం డిపెండబిలీటి పై విజయవాడ వద్ద కృష్ణానదిలో లభ్యమయ్యే నీరు 2060 టీఎంసీలుగా కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ నిర్ధారించింది. ప్రారంభంలో 1960 సెప్టెంబర్ నాటికి గల ప్రాజెక్టుల కోసం 1696 టీఎంసీల నీటిని ఈ ‘కేడబ్ల్యుడీటీ’ ప్రత్యేకించింది. మిగిలిన నీటిని మూడు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసింది. ప్రత్యేకించిన నీటిలో ఆంధ్రవూపదేశ్ వాటా 749.16 టీఎంసీలుగా ఉంది. మిగిలిన నీటినుంచి శ్రీశైలం రిజర్వాయర్ వద్ద ఆవిరి నష్టాల రూపంలో 33 టీఎంసీలను జూరాల ప్రాజెక్టు కోసం 17.84 టీఎంసీలను కేడబ్ల్యుడీటీ కేటాయించింది. ఆవిధంగా ఆంధ్రవూపదేశ్‌కు మొత్తం 800 టీఎంటీల నీటిని కేటాయించింది. ప్రత్యేకించిన 749.16 టీఎంసీల నీటినుంచి 245.12 టీఎంసీల పరిమాణం గల నీటిని (సుమారు 33శాతం) తెలంగాణ ప్రాంతంలో గల ప్రాజెక్టుల కోసం ప్రత్యేకించడమయింది. ఎగువ కృష్ణా ప్రాజెక్టు, తుంగభద్రా ప్రాజెక్టు విస్తరణ కోసం ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం చేసిన డిమాండ్లను కెడబ్యుడీటీ తోసిపుచ్చింది.మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు కోసం 17.84 టీఎంసీల ఆదనపు నీటిని కేడబ్ల్యుడీటీ కేటాయించింది. దరిమిలా మహబూబ్‌నగర్ జిల్లాలోని అనావృష్టి పీడిత ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసం 20టీఎంసీల నీటిని వ్యవస్థను ఆధునీకరించి కృష్ణా డెల్టాలో నీటిని ఆదా చేయడం ద్వారా వినియోగించుకుంటూ ప్రభుత్వం భీమా ఎత్తిపోతల సాగునీటి పథకాన్ని చేపట్టింది.


కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్‌లు మొత్తం 811 టీఎంసీల నీటిని కేటాయించగా(11 టీఎంసీల రీజనరేషన్‌తో సహా)ఈ ప్రాంతంలో ప్రాజెక్టు కోసం వినియోగించుకునే మొత్తం నీరు 295.26 టీఎంసీలు. ఇది మొత్తం కేటాయింపులో 36 శాతం కంటే కాస్త ఎక్కువగా ఉంది. కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్ తన తీర్పులో కృష్ణా నదీజలాల కేటాయింపు కోసం ప్రమాణాలుగా కేవలం డ్రైనేజీ ప్రాంతాల విరాళం అనే సూత్రాన్ని తోసిపుచ్చుతూ, మహారాష్ట్ర, కర్ణాటక ఆంధ్రవూపదేశ్ మూడు పరీవాహక ప్రాంతాల మధ్య లభ్యంగా ఉన్న నీటిని కేటాయించడానికి ప్రస్తుత వినియోగాలు, జనాభా, సాగు విస్తీర్ణం, ప్రజల అవసరాలు ఆ ప్రాంతం వెనుకబాటుతనం, ఆ ప్రాం తంలో నీటి ఎద్దడి వంటి ఇతర అంశాలను పరిగణనలోనికి తీసుకున్నది.

నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత ప్రాంతాల నీటి అవసరాలు, డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని త్రాగునీరు, సాగునీరు కోసం ప్రభుత్వం శ్రీశైలం ఎడమ గట్టు కాలువ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం 26.22 టీఎంసీల కృష్ణా నదీ మిగులు జలాలను వినియోగించుకోవడం జరుగుతున్నది. నల్లగొండ జిల్లాలో రక్షిత మంచినీటిని అందించడంతోపాటు సాగునీటి సౌకర్యాలను కల్పించడానికి శ్రీశైలం ఎడమగట్టు కాలు వ ప్రాజెక్టును ఉద్దేశించడమయింది. అంతేకాకుండా కృష్ణానదీ మిగులు జలాలు వరుసగా 20 టీఎంసీలు, 25 టీఎంసీల ప్రతిపాదిత వినియోగంతో మహబూబ్‌నగర్ జిల్లాలో నెట్టంపాడు ఎత్తిపోతల సాగునీటి పథకం, కల్వకుర్తి ఎత్తిపోతల సాగునీటి పథకాలను అతి త్వరలో చేపట్టడమవుతుంది. వీటికి కేంద్ర ఏజెన్సీల నుంచి అవసరమయిన ఆమోదాలు అందవలసి ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టులకు ఆమోదాలు పొందిన తరువాత, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మంలో మొత్తం నీటి కేటాయింపు దాదాపు 367. 58 టీఎంసీలుగా ఉంటుంది.

ఇదండీ కడియం శ్రీహరి, నాటి భారీ, మధ్య తరహా సాగునీటి శాఖా మంత్రి తెలంగాణ ప్రాంతంలో సాగునీటి కోసం కృష్ణా జలాల వినియోగం గురించి శాసనసభ నియమావళి లోని 304 వ నియమం క్రింద శాసనసభ్యులు కె. చంద్రశేఖర్‌రావు, ఆర్. పాపారావు లు ఇచ్చిన నోటీసుకు సమాధానంగా చేసిన వివరణ. అంటే శాసనసభ సాక్షిగా ప్రభుత్వం చేసిన ప్రకటన ఏమిటంటే తెలంగాణ కోసం 367.58 టీఎంసీలు కృష్ణా జలాలను వినియోగిస్తామని. మంత్రి ప్రకటనలో, లేక ఇచ్చిన వివరణలో కేడబ్ల్యుడీటీ (బచావత్ ట్రిబ్యునల్‌తోసిపుచ్చిన డిమాండ్లలో ఎగువ కృష్ణా ప్రాజెక్టు తుంగభద్ర ప్రాజెక్టుల గురించి మాత్రమే ప్రస్తావించారు. కాని, తంగడి వద్ద భీమా ప్రాజెక్టు గురించి చెప్పలేదు. దాన్ని కూడా ట్రిబ్యునల్ తిరస్కరించింది.సరే గాని విషయం వదిలేసి మిగులు జలాల ఆధారంగా కొనసాగుతున్న ప్రాజెక్టులు 72.32 టీఎంసీలు అని ప్రభుత్వమే నవ్వుకుంటున్నది. ఇక్కడ ప్రధాన సమస్య ఏమిటంటే నికర జలాల ఆధారంగా మొదటి కేటగిరీ ప్రాజెక్టుల కేటాయింపులో 295.26 టీఎంసీలలో వాస్తవంగా తెలంగాణకు అందుతున్న జలాపూన్ని? నాగార్జునసాగర్ 106. 26 టీఎంసీలు గాని ఆర్‌డీఎస్15.90 టీఎంసీలుగాని, జూరాల 17.84 టీఎంసీలుగాని, మూసీ 9.40 టీఎంసీలుగాని పోను ఏ ఒక్క ప్రాజెక్టుయినా కేటాయించిన నీటిని వాడుకుంటుందా? వాడుకోకపోతే బాధ్యుపూవరు? కేటాయించినా, వాడుకోకపోతే, ఆ నీరు సీమాంధ్ర కు ఉపయోగపడడటం లేదా?

అన్నింటికంటే ఘోరం చిన్నతరహా సాగునీటి కోసం 90.82 టీఎంసీల వినియోగం. ఇందులో చెరువులు, కుంటలు ఉపరితల చిన్న ఎత్తిపోతల పథకాలుంటా యి. 90.82 టీఎంసీలతో కనీసం 10 లక్షల ఎకరాలుయినా సాగుకావలసి ఉండే కృష్ణా బేసిన్‌లో, ఇందులో 25 టీఎంసీలకు మించి వాడకం జరగడం లేదని రైతు సంఘాలు చెప్పుతున్నాయి. ఆ మిగిలిన నీరు ఎక్కడికిపోతోంది? ప్రభుత్వ గణాంకాల ప్రకారమే గోదావరిలో తెలంగాణ వాటా క్రింద మైనర్ ఇర్రిగేషన్ కేటగిరిలో మరో 110 టీఎంసీల వాడకం ఉంది. అంటే వెరసి తెలంగాణలో చిన్నతరహా సాగు క్రింద 200 టీఎంసీల వినియోగం ఉంది. సుమారు 20 లక్షల ఎకరాలకు నీరందాలి. ప్రభుత్వం (2001-2009)లో చిన్న నీటిపారుదల శాఖా ఇచ్చిన వివరాలు చూస్తే 100 ఎకరాలపైగా సేద్యపు నీరిచ్చే M.I.Sources (చిన్నతరహా సాగునీటి వనరులు) తెలంగాణలో5063 ఉన్నాయి. అవి మొత్తం 12 లక్షల 66 వేల 377 ఎకరాలకు నీరందిచాలి.కాని అవి సాగు అం దించినవి 2 నుంచి 7 లక్షల ఎకరాల దాకా నే. అలాగే పంచాయితీరాజ్ చెరువులు (ఇటీవలే ఇర్రిగేషన్‌కు బదిలీ అయినవి) తెలంగాణలో 30820. అవి చేయాల్సిన సాగు 6లక్షల 68 వేల 141 ఎకరాలు. చేస్తున్నదెంతో ప్రభుత్వం చెప్పలేదు.

చెప్పొచ్చేదేమంటే భీమా ప్రాజెక్టు ఇంతవరకు అవతరించనేలేదు. మిగిలిన 275. 26 టీఎంసీల వినియోగంలోకృష్ణా నదీ జలాల్లో కనీసం సగమైనా తెలంగాణ వాడుకుంటూ ఉందా? వాడుకోకపోక ఆ నికర జలాలు ఎక్కడికి పోతున్నాయి. గుంజుకుంటున్నారా? దొంగిలిస్తున్నారా? మరి ఏమౌతున్నాయి? అసలు రాయలసీమకు, తెలుగుగంగకు నీటి కేటాయింపు ఉన్నదా? పోతిడ్డిపాడు ద్వారా నిజంగా తరలించవలసింది ఎస్‌ఆర్‌బీసీకి చెందిన 19 టీఎంసీలు, మద్రాసు తాగునీటి కోసం 15 టీఎంసీలు (మన5 టీఎంసీలు). 34 టీఎంసీల నీటిని మాత్రమే. మరి కేవలం తెలుగు గంగ ద్వారానే ఎన్నినీళ్లు తరలిస్తున్నారు? తెలుగుగంగపైన వెలసిన వెలుగోడు, బ్రహ్మంగారి మఠం, సోమశిల, కండలేరు వంటి జలాశయాలలో నింపుతున్న వందలాది టీఎంసీలు కృష్ణానది నుంచి తరలిస్తున్న నీరా? లేక ఎండిన పెన్నానదినీరా? తెలంగాణ నోరు కొట్టి అక్రమంగా రాయలసీమకు కోస్తాంవూధకు తరలిస్తున్న నీరెంత? ఇక కొత్త ప్రాజెక్టులుగా గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ, ఇంకా ఎస్‌ఆర్‌బీసీ పై వెలసిన అసంఖ్యాక ప్రాజెక్టుల మాటేమిటి?
ఇదిలావుండగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ ప్రయోజనాలను నీరుకార్చే విధంగా మన ఘనత వహించిన ప్రభుత్వ వకీళ్లు చేసిన శుష్కవాదాల గురించి నమస్తే తెలంగాణ పత్రిలో ‘శుష్కవాదాలు- శూన్యహస్తాలు’ పేరిట 6-5-2012 న వివరంగా తెలియచేయడం జరిగింది.

నికర జలాల తో ఎలాగు న్యాయం చేయలేకపోయారు. కనీసం మిగులు జలాల్లోనైనా తెలంగాణకు న్యాయం చేయాలావద్దా? 150.5 టీఎంసీల నీటిని సీమాంధ్ర ప్రాజెక్టులకు అడిగి, తెలంగాణకు 77 టీఎంసీలు అడగటంలో అంతరార్థమేమిటి?

బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా బేసిన్ అంతర్భాగమైన ప్రాజెక్టుల కోసమే నీటిని అడగమని చెప్పుతున్నా మన ప్రభుత్వం బేసిన్ బయట ఉన్న సీమాంధ్ర ప్రాజెక్టుల వినియోగం కోసం 150 టీఎంసీలను డిమాండ్ చేయడమేమిటి? తద్వారా తెలంగాణలో నల్లగొండ, మహబూబ్‌నగర్ కరువు పీడిత ప్రాంతాల కోసం చేపట్టిన నెట్టంపాడు, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుల వినియోగపు డిమాండ్ బలపడలేదా? బేసిన్ బయట ఉన్న తెలుగుగంగకు 25 టీఎంసీల నీరిచ్చి తెలంగాణలోని మూడు ప్రాజెక్టుల కోసం ఒక్క చుక్క నీరివ్వని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీరుపైన మన ప్రభుత్వం ఏం చేస్తున్నది? నిద్రపోతున్నదా? ఇవన్నీ చెప్పాలని కేసీఆర్ ప్రభుత్వానికి ఉత్తరం రాస్తే పక్కన పడేస్తుందా? తెలంగాణ ప్రజలన్నా ప్రాజెక్టులన్నా, ఇంత నిర్లక్ష్యమా? అందుకే కేసీఆర్ చేపడుతున్న ‘నీటి కోసం నిరసన దీక్ష’.

- ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర