అభీ దిల్లీ దూర్ హై


Sun,May 13, 2012 11:58 PM

ఇటీవలే ఢిల్లీలో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుపై మహారాష్ట్ర, ఆంధ్రవూపదేశ్ రాష్ట్రాల ముఖ్యమంవూతులు ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. అంతవరకు బాగానే ఉంది. కాని నిజంగా ప్రాజెక్టు ఇప్పట్లో సాధ్యమవుతుందంటారా? కాంగ్రెస్ నేతల మాటలు చూస్తుంటే ప్రాజెక్టు వచ్చినట్టు, మనగడపలోకి నీళ్లు రావటమే ఇక ఆలస్యమన్నట్లు ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇదంతా డ్రామానా, లేక తొందరలో అమలయ్యే ఛాన్సేమయినా ఉందా?

-చిత్రం సూర్యవూపభ, నక్కలగుట్ట, హన్మకొండ.


ప్రభుత్వమే దశలవారీగా ప్రాజెక్టు 2019కి పూర్తవుతుందని చెప్తోంది. అంటే మరో ఏడేళ్లన్నమాటపాజెక్టు ప్రకటించిన తొలినాళ్లలో ఇదే ప్రభు త్వం 2012కి పూర్తి ్తచేస్తామని పూర్తి పేజీ ప్రకటనలు అన్ని పేపర్లలో చేసింది. మహారాష్ట్ర-ఆంవూధవూపదేశ్ రాష్ట్రాల ముఖ్యమంవూతులు సంతకం చేయడంతో ఒక ప్రధాన ఘట్టం పూర్తయింది. మన ముఖ్యమంత్రి మహారాష్ట్ర ముఖ్యమంవూతికి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పడంతో తతంగం పూర్తయితే బాగుండును. పుంఖాను పుంఖాలుగా ముఖ్యమంత్రి నుంచి మొదలుకుని, కాంగ్రెస్ సాధారణ కార్యకర్త దాక ప్రాణహిత గురించి అవాకులు చెవాకులు మాట్లాడుతూ, ఇంకేముంది, మా వల్లనే ప్రాజెక్టు వచ్చేసింది అన్నట్టుగా వ్యవహరించడం బాధగా ఉంది. జరుగుతున్నది వాస్తవానికి పూర్తిగా భిన్నంగా ఉన్నది.

‘ ప్రాణహిత - చేవెళ్ల’ ప్రాజెక్టు ఒక మెగా ప్రాజె క్టు.160 టీఎంసీల ప్రాణహిత నీరు, 20 టీఎంసీల గోదావరి నీరు వెరసి 180 టీఎంసీల నీరు ఉపయోగించుకుంటూ 30 టీ ఎంసీల నీరు రాజధానికి, 10 టీఎంసీల నీరు గ్రా మాలకు, పట్టణాలకు, 16 టీఎంసీలనీరు పారిక్షిశామి క అవసరాలకు, 124 టీఎంసీల నీరు సాగునీరుకు వినియోగిస్తూ,16 లక్షల 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే బృహత్ పథకం ఈ ప్రాజెకు.్ట దీనికి ఇప్పుడున్న అంచనాల ప్రకారమే 40 వేల కోట్ల పైచిలుకు ఖర్చువుతుంది. (పూర్తయ్యే నాటికి ఎంతవుతుందో ఎవరూ చెప్పలేరు). దీంతో సాగయ్యే ఆయకట్టు ఆదిలాబాద్ జిల్లాలోని బెజ్జూరు, దహెగావ్, కౌటాలా, చెన్నూరు, జయపూర్, కోటిపల్లి, నెన్నెల వేమనపల్లి, దివాలర్‌పూర్, లక్ష్మణచందా, మామడ, సారంగపూర్, నిర్మల్, ముథోల్, లోహెసా, లూనూరు, కుబేర్, బైంసా, కుంటాల (19) మండలాల్లోని 306 గ్రామాలకు చెందిన 1,56, 500 ఎకరాలు: కరీంనగర్ జిల్లాలోని గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లాడ్డిపేట, సిరిసిల్లా, ఇల్లంతకుంట, బెజ్జంకి, కోనరావుపేట, వేములవాడ, కోహెడ, మెట్‌పల్లి (10) మండలాల్లోని 159 గ్రామాలకు చెందిన 1,71, 449 ఎకరాలు సాగవుతుంది.

అలాగే మెదక్ జిల్లాలోని సిద్దిపేట, చినకొండూరు, నంగునూరు, దుబ్బా క,మీర్‌దొడ్డి, దౌల్తాబాద్, చేగుంట, గజ్వేల్, కొండపాక, జగదేవ్‌పూర్, ములుగు, రామాయంపేట, వెల్దుర్తి, కౌడిపల్లి, హత్నూరు, కొండపూర్, సదాశివపేట, మనిపల్లి, రాయికోడ్, ఝరాసంగం, కోహిర్, న్యాల్కల్ కు చెందిన 22 మండలాలోని 539 గ్రామాల్లోని 5, 19, 152 ఎకరాలు; నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్, డిచ్‌పల్లి, దారేపల్లి, సిరికొండ, జక్రాన్‌పల్లి, ఆర్మూర్,మాక్లూర్, భీమగల్, వేల్యూలు, బాల్కొండ, కమ్మర్‌పల్లి, మోర్తాడ్, తాడ్వాయి, గాంధారి, సదాశివనగర్, కామాడ్డి, భిక్నూరు, దోమకొండ, మాచాడ్డి (19) మండలాల్లోని 275 గ్రామాలకు చెందిన 3,04,500 ఎకరాలు; నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్, భువనగిరి, వలిగొండ, ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, ఎం.తుర్కపల్లి, ఆత్మకూర్(ఎం), రామన్నపేట, నార్కట్‌పల్లి, చిట్యాల (11)మండల్లాలోని 171 గ్రామాలకు చెందిన 2,29, 832 ఎకరాలు; రంగాడ్డి జిల్లాలోని వికారాబాద్, దారూర్, మారేపల్లి,మోమిన్‌పేట,బంట్వారం,పరిగి,దోమ,తాండూరు,పెద్దెముల్,యాలాల, బషీర్‌బాద్,చేవెళ్ల,శంకరపల్లి,నవాబుపేట,(14)మండలాలోని 283 గ్రామానికి చెందిన 2,46,704,ఎకరాలు; వరంగల్ జిల్లాలోని చేర్యాల, మద్దూరు, (2) మండలాల్లోని 11 గ్రామాలకు చెందిన 11, 863 ఎకరాలు, మొత్తం ఏడు జిల్లాలోని 97 మండలాలకు చెందిన 2039 గ్రామాల్లోని 16 లక్షల 40వేల ఎకరాలు ఈప్రాజెక్టు ద్వారా సాగులోకి రాగలవన్నది అంచనా. అంటే తెలంగాణకు అత్యంత లాభదాయకమైన వరవూపసాదిని వంటి ప్రాజెక్టు. మణిహరం అనదగ్గ ప్రాజెక్టు ఇది. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ ప్రాజెక్టు అమలయితే తెలంగాణ రైతులు కృష్ణ, గోదావరి, జిల్లాలోని రైతాంగం లాగ రెండు, మూడు పంటలు తీసి సంపన్నులవుతారని కాదు. కనీసం ఒక పంటకైనా నీరొస్తుందన్న ఆశ. రోజురోజుకీ అడుగంటిపోతున్న భూగర్భ జలాలు పైకొచ్చి రైతుల ఆత్మహత్యలు, వలసలు ఆగుతాయన్న నమ్మకం. తెలంగాణ ఆదృష్టమేమంటే అద్భుతమైన వనరులున్నాయి. కృష్ణ,గోదావరి నదులు తెలంగాణ నుంచి ప్రవహిస్తున్నాయి. నల్లబంగారం సింగరేణి ఉంది. అటవీ సంపద ఉంది. చక్కదనాల భూములు ఉన్నాయి. కష్టపడేందుకు రైతాంగం ఉంది. ఒకే ఒక సమస్య ఏమిటంటే భూములు పైస్థాయిలో ఉన్నాయి.

నదులు కిందిస్థాయిలో ఉన్నాయి. గ్రావిటీ(వాలు) మార్గంగా పొలాలకు నీళ్లందించే అవకాశాలు దాదాపు శూన్యం. ఇప్పుడున్న శ్రీరాంసాగర్, జూరాల, కడం, నాగార్జునసాగర్, నిజాంసాగర్ మరికొన్ని ప్రాజెక్టులు మినహాయిస్తే రూపొందించిన ప్రాజెక్టులన్నీ ఎత్తిపోతలే. వాడుకోవడానికి తెలంగాణకు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకోవడానికి రెడీగా బీళ్లున్నాయి. కావలసింది, ఈనీళ్లను ఎత్తిపోతల ద్వారా పొలాలకు అందించడం. మనకు ఇష్టమైనా కష్టమైనా తెలంగాణకు ఎత్తిపోతలు మినహా మరో మార్గం లేదు. తెలంగాణ భవిష్యత్తు పూర్తిగా ఎత్తిపోతల పథకాల సక్రమ నిర్వహణ పైనే ఆధారపడి ఉన్నది.

ఈ ప్రాజెక్టును ప్రభుత్వం (వైఎస్‌ఆర్ హయాంలో) ఆర్భాటంగా ప్రకటించి, హడావిడిగా 28 ప్యాకేజీలుగా విభజించి అస్మదీయులకు కాంట్రాక్టులు కట్టబెట్టింది. ఎవన్ని కబుర్లు చెప్పినా ఈప్రాజెక్టు రూపకల్పన చేసిం ది విశ్రాంత తెలంగాణ ఇంజనీర్ల బృందం. అందులో ప్రధాన పాత్రదారులు వెంకటరామారావు, అనంతరాములు నాతో సహా మారుతి, భీమయ్య, ప్రభాకర్,ఉమాకాంత్ ప్రభృతులు. ఈప్రాజెక్టు రూపకల్పన దశలో సారథ్యం వహించి తెలంగాణ ప్రాంత ప్రజావూపతినిధుల సమావేశం నిర్వహించి, ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల దృష్టికి తీసుకు వెళ్ళిన క్రెడిట్ ‘ది ఇనిస్టిట్యూ ఆఫ్ ఇంజనీర్స్’ సంస్థది.

‘దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడు’ అన్నట్టుగా ఈ ప్రాజెక్టుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ పచ్చజెండా ఊపినా సీమాంధ్ర మంత్రులు, ఇంజనీర్లు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఈ ఆయకట్టును అయిదున్నర లక్షలకు కుదించడం నుంచి, ఈ ప్రాజెక్టుకు 160 టీఎంసీల నికర జలాలు లేవని, ఈ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసే బాధ్యత తీసుకున్న WAPCOS సంస్థ అధికారులను లొంగదీసుకుని ప్రాజెక్టుకు గండి కొట్టే ప్రయత్నాలు చేశారు. ఇంత పెద్ద ప్రాజెక్టు తెలంగాణకు రావడం ఓర్వలేని తనంతో పాటు ఈ ప్రాజెక్టు అమలవుతే అమలులో ఉన్న ధవళేశ్వరం బ్యారేజీ (సర్ ఆర్థర్ ఆయకట్టు), కట్టబోయే పోలవరం నీరురాక సమస్యల పాలవుతాయేమోనన్న భయాందోళన వారిది. ఏదేమైనా ఈ సీమాంధ్ర గణం ఎత్తుగడలను ఎప్పటికప్పుడు సమర్థంగా ఎదుర్కొంటూ, తిప్పికొడుతూ, తెలంగాణ ఇంజనీర్లు(రిటైర్డ్ వారి అండదండలతో) ఈ ప్రాజెక్టును ఈదశకు తీసుకురావడం ముదావహం.

ఇప్పటి పరిస్థితి ఏమిటంటే.. ప్యాకేజీలుగా ప్రభుత్వం తమ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం హడావిడిగా పనులను కాంట్రాక్టర్లకు అప్పగించి ఇప్పటివరకు 1664 కోట్లు ఖర్చు పెట్టింది. ఇంత భారీ ప్రాజెక్టును 40వేల కోట్ల రూపాయల ఖర్చుతో పూర్తిచేయడం ఈ ప్రభుత్వమే కాదు, మరే ప్రభుత్వానికీ సాధ్యం కాదు. అందుకోసమే దీనికి జాతీయ హోదా సాదించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. జాతీయ హోదా లభిస్తే ప్రాజెక్టు కోసం ఇప్పటిదాకా ఖర్చయిన మొత్తం మినహాయించి, మిగతా ఖర్చులో 90 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అది సాధ్యపడకపోతే AIBP(సత్వర సాగునీటి లబ్ధి పథకం) కింద కరువు పీడిత ప్రాంతాలలో ఆయకట్టు ఉంటే 90 శాతం ప్రధానమంత్రి పథకం కింద గ్రాంటు వస్తుంది. కరువు పీడిత ప్రాంతం కాకపోతే 25 శాతం గ్రాంటు వస్తుంది. 16 లక్షల 40వేల ఎకరాలలో కొంత ఆయకట్టు కరువుపీడిత ప్రాంతాలలో ఉంది. కాబట్టి దామాషా పద్ధతిన AIBP కింద 57 శాతం నిధులు కేంద్రంనుంచి రాబట్టుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. అంటే వీలయితే 90 శాతం గ్రాంటు, లేకపోతే కనీసం 57 శాతం గ్రాంటు అయినా లభిస్తే తప్ప ఈ ప్రాజెక్టు ముందుకు కదలదన్నమాట.అటు జాతీయహోదా లభించాలన్నా, ఇటు AIBPకింద పీఎం ప్యాకేజీ లబ్ధి పొందాలన్నా లేక మామూలు AIBసైపయోజనం పొందాలన్నా ముందు కేంద్ర జలసంఘం అనుమతి ,పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ అనుమతి, గిరిజన మంత్రిత శాఖ అనుమతి, అవసరమయితే ఆ తరువాత ప్రణాళిక సంఘం పెట్టుబడి అనుమతి అవసరం. ఇవేవీ లేకుండా పత్రికలలో, చానల్స్‌లో బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేయ డం ఘోరం.

వాస్తవ పరిస్థితి ఏమంటే.. సవివర క్షేత్ర అధ్యయన నివేదిక (DPR)తయారు చేసేందుకో సం అవసరమైన సూత్రవూపా య అనుమతిని కేంద్ర జలసంఘం ఇవ్వడం తప్ప ఇతరత్రా ఎలాం టి అనుమతులు ఇంతవరకు ఈ ప్రాజెక్టుకు రాలేదు. పర్యావరణ అనుమతులకు అవసరమైన ప్రజాభివూపాయ సేకరణ మాత్రం జరుగుతోంది. ఇంకా అటవీశాఖ అనుమతి కూడా రాలేదు. భూసేకరణ కార్యక్షికమాలు కొనసాగుతున్నాయి. అంటే మరోమాటలో చెప్పాలంటే ‘ఆలులేదు సూలు లేదు-అల్లుడిపేరు సోమలింగం’ అన్నట్టుగా ఉంది ఈ ప్రాజెక్టు వ్యవహారం. కాకపోతే దీనికి అత్యవసరమయిన మహారాష్ట్ర అంగీకారం పొందడం ఒక ముందడుగు. పక్కరాష్ట్రాల అనుమతులు రాక పోలవరం ఎంత అవస్థపడుతుందో అందరికీ తెలిసిన విషయమే. అన్ని అనుమతులు లభించాక చివరకు ప్రణాళికాసంఘం Investment clearence సాధించి అంతిమంగా కేంద్ర ప్రభు త్వం ఆర్థిక వ్యయంలో ఈ ప్రాజెక్టు బతికి బట్టకడుతుందనే అనుకుందాం. సమస్యల్లా ఈ ప్రాజెక్టుకు అవసరమైన 3466 మెగావాట్ల విద్యుత్తు (8701 మిలియన్ల యూనిట్లు). ప్రస్తుతం పథకం సాంక్షన్‌కోసం జెన్‌కో ‘మేం సప్లయిచేస్తాం’ అని హామీపత్రం ఇచ్చినాపతీయేటా ఇంత పెద్దమొత్తం విద్యుత్తును ఉచితంగా ప్రభుత్వం రైతులకు అందజేయగలదా? అన్నది ప్రధాన సమస్య. ఈ సమస్యను పరిష్కరించకుండా, రైతుల నెత్తిన విద్యుత్తు ఖర్చు వేయని పద్ధతిని ఆలోచించకుండా ముందుకుపోవడం శ్రేయస్కరం కాదు.

అందుకే రిటైర్డ్ ఇంజనీర్లు ప్రాణహితకు dedicated power house లేక captive power station(సొంత విద్యుత్ కేంద్రం)ఏర్పాటు చేసే ప్రతిపాదనకు జమా ఖర్చులతో సహా ప్రభుత్వానికి అందచేశారు. కానీ దురదృష్టమేమంటే ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పక్కన పెట్టింది.పాలకుల మనసులో ఏముందో అర్థం కావడం లేదు.

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తెలంగాణకు అత్యవసరం. ఏదైమైనా ప్రాణాలడ్డం పెట్టి అయినా సరే దీన్ని సాధించడం ప్రతి తెలంగాణ పౌరుడి కర్తవ్యం. అయితే పరకాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునో, ఈప్రాజెక్టును తెలంగాణకు తెస్తున్నాం కనుక పోలవరాన్ని అడ్డుకోకండి అని చెప్పడానికో ఈ పథకాన్ని తెరమీదకు తెస్తున్నామని సీమాంధ్ర నాయకులు అనుకుంటే అంతకన్నా అమాయకత్వం మరోటి లేదు. ప్రాణహిత మాకేమీ భీక్(బిచ్చం)కాదు.మానీళ్లు ,మా పొలాలకు ఈ వేళ కాకపోతే రేపు అయినా ఈ ప్రాజెక్టుతో తెచ్చుకుంటాం. మీరేదో దయాదాక్షిణ్యాలు చూపిస్తున్నట్టు నటిస్తే తెలంగాణ ప్రజలు సహించరు. ఇల్లలకగానే పండుగ కాదు.పునాది రాయి వేయగానే అయిపోలేదు. ‘అభీ దిల్లీ బహుత్ దూర్ హై’.

-ఆర్. విద్యాసాగర్ రావు
కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

country oven

Featured Articles