శుష్కవాదాలు-శూన్యహస్తాలు


Fri,August 31, 2012 05:49 PM

ఈ మధ్య కేసీఆర్ ముఖ్యమంత్రికి ఓ లేఖ రాస్తూ అందులో కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట మన వాళ్లు సరిగ్గా వాదనలు వినిపించలేకపోయారని, తత్ఫలితంగా తెలంగాణకు సముచిత నీటి వాటా దక్కలేదని, అలాగే దీనిపై వెంటనే ఓ అఖిలపక్షం ఏర్పాటు చేయాలని కోరినట్లు పత్రికలలో చదివాను. ఈ గొడవ ఏమిటి? వివరించండి.

-పి. హరివల్లభ శర్మ, గానుగబండ, నల్లగొండ జిల్లా

waterకృష్ణానది మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రవూపదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తోంది. కృష్ణా జలాలను మూడు రాష్ట్రాలకు పంచిన ట్రిబ్యునల్‌ను బచావత్ ట్రిబ్యునల్‌గా పేర్కొంటాము. దీన్నే KWDT-I గా కూడా అంటాము. మూడు రాష్ట్రాలకు కృష్ణా జలాలను పంచిన బచావత్ ట్రిబ్యునల్ 78 సంవత్సరాల నీటి లభ్యతను ఆధారంగా తీసుకుని లెక్కలు కట్టింది. కేటాయింపులు రెండు రకాలు. 75 ఏళ్ల విశ్వసనీయత ఆధారంగా జరిపే కేటాయింపులను నికర జలాలు అని, అంతకన్న తక్కువ విశ్వసనీయ కలిగిన జలాలను మిగుల జలాలుఅని పరిగణించడం జరిగింది. మొత్తం కృష్ణా నదిలో 2060 టీఎంసీలు నికరజలాలున్నవని, అందులో 560 టీఎంసీలు మహారాష్ట్రకు, 700 టీఎంసీలు కార్ణాటకకు, మిగిలిన 800 టీఎంసీలను ఆంధ్రవూపదేశ్‌కు KWDT-I పంచింది. ఇవి నికర జలాలు.

ఇక మిగులు జలాల విషయానికి వస్తే .. వాటిని పై రాష్ట్రాలకు పంచలేదు. మిగలు జలాలను సంపూర్ణంగా వినియోగించుకునే స్వేచ్ఛని ట్రిబ్యునల్ ఆంధ్రవూపదేశ్‌కు కల్పించింది.ఇది కేవలం స్వేచ్ఛ మాత్రమే ఇచ్చామని, హక్కు ఇవ్వలేదని ట్రిబ్యునల్ అంటున్నది. ఇవి సుమారుగా 333 టీఎంసీలుగా అంచనా వేయడం జరిగింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పును తిరగ వేయడం జరిగింది. బచావత్ ట్రిబ్యునల్ తిరుగదోడే అవకాశం ట్రిబ్యునల్ కలిగించింది. మరో మాటలో చెప్పాలంటే 2000 సంవత్సరం మే 31వ తేదీ తరువాత పాత ట్రిబ్యునల్ తీర్పును పునః సమీక్షించే అవకాశం ఉందన్నమాట. పాత ట్రిబ్యునల్ తీర్పు సుమారు 25 సంవత్సరాల పాటు కొనసాగింది. ఈలోగా ఆంధ్రవూపదేశ్ మిగులు జలాలను ఉపయోగించుకునే దిశలో తెలుగు గంగ, గాలేరునగరి, హంద్రీనీవా, వెలిగొండ (సీమాంధ్ర), నెట్టం పాడు, కల్వకుర్తి, ఎస్‌ఎల్ బీసీ (తెలంగాణ) ప్రాజెక్టులను చేపట్టింది. హక్కులేకుండా మొదపూట్టిన ఈ ప్రాజెక్టులను కేంద్రం ఆమోదించలేదు.

ఆంధ్రవూపదేశ్‌కు వ్యతిరేకంగా కర్ణాటక సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. తన వంతుగా కర్ణాటక ఆలమట్టి డ్యాం ఎత్తును 524. 256 మీటర్ల వరకు అంగీకరిస్తూ, కొత్త ట్రిబ్యునల్ ఈ డ్యాం ఎత్తు వైపు దృష్టి సారిస్తుందని సుప్రీంకోర్టు చెప్పింది. అదే మాదిరిగా మిగులు జలాల ఆధారంగా నిర్మించే ప్రాజెక్టుల విషయం కూడా కొత్త ట్రిబ్యునల్ చూసుకుంటుందని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల కోరిక మేరకు కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. దాన్నే KWDT-II గా వ్యవహరిస్తారు. దానిపేరే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. ఈ ట్రిబ్యునల్ ముందుగా ఆంధ్రవూపదేశ్ నుంచి ఒక హామీపత్రం పొందింది. తాము నీటి కేటాయింపులు లేకుం డా మిగులు జలాల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు హక్కు భుక్తంగా ఎలాంటి డిమాండ్ చేయమని, ట్రిబ్యునల్ తమకు కేటాయించే నీటితోనే సంతృప్తి పడతామని రాత పూర్వకంగా తెలియజేయడం జరిగింది. కొత్త ట్రిబ్యునల్ ముందున్న ప్రధానమైన అంశాలు రెండు. ఒకటి: మిగలు జలాల పంపకం , రెండు: ఆలమట్టి ఎత్తు మిగులు జలాల పంపకానికి ముందు కొత్త ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకున్న 78 సంవత్సరాల డేటాను పక్కన పెట్టి కొత్తగా 47 సంవత్సరాల డేటా ఆధారంగానే లెక్కలు కట్టింది. ఈ 47 సంవత్సరాలలో పాత డేటాలోని 11 సంవత్సరాలు యథాతథంగా ఉన్నాయి. మిగిలిన 36 ఏళ్ల డేటా కొత్తది. దీని ఆధారంగా 75 శాతం విశ్వసనీయత ప్రకారం కృష్ణానదిలో 2173 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు తేల్చింది. పాత ట్రిబ్యునల్‌తో పోలిస్తే 13 టీఎంసీలు మాత్రమే ఎక్కువ.ఇక పోతే మిగులు జలాలు 505 టీఎంసీలు (పాత ట్రిబ్యునల్ 333 టీఎంసీలుగా అంచనా వేసింది)గణనీయంగా పెరిగాయి. అంటే మొత్తం 2393 టీఎంసీలుగా తేలిస్తే, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 2578 టీఎంసీలుగా తేల్చింది. అంటే 185 టీఎంసీ అధిక జలాలుగా తేలుస్తూ మొత్తం మిగులు జలాలను పంపకానికి పెట్టిందన్నమాట.

పాత ట్రిబ్యునల్ నికర జలాలను 2060 టీఎంసీలుగా చూపెడుతూ మరో 70 టీఎంసీల ‘రిటర్న్ ఫ్లోస్’ కూడా నికరంగా లభ్యం కాగలవని, వాటిని కూడా మహారాష్ట్రకు 25 టీఎంసీలు, కర్ణాటకకు 34 టీఎంసీలు, ఆంధ్రకు 11 టీఎంసీలుగా పంచడం జరిగింది. అంటే నికర జలాలమొత్తం 2060 కి బదులుగా 2130 టీఎంసీలు, అందులో మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734 టీఎంసీలు, ఆంధ్రవూపదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయింపులు జరిగాయి.

కొత్త ట్రిబ్యునల్ , పాత ట్రిబ్యునల్ చేసిన నికర జలాల కేటాయింపులు 2130 టీఎంసీలను ఎలాంటి మార్పు చేయకుండా, యథాతథంగా ఉంచింది. అది చేసిన పనల్లా మిగతా (2578-2130)టీఎంసీలు అంటే 448 టీఎంసీలను రెండు వర్గాలుగా విభజించింది. 65 విశ్వసనీయత ఆధారంగా163 టీఎంసీలను ఒక కేటగిరిగా చేసి దాన్ని అదనపు నికర జలాలుగా అభివర్ణించింది. మిగిలిన 285 టీఎంసీలను మిగులు జలాలుగా పేర్కొంది. ఇక వీటి కేటాయింపుల విషయానికి వస్తే.. అదనపు నికరజలాలను మహారాష్ట్రకు 46 టీఎంసీలు, కర్ణాటకకు 72 టీఎంసీలు, ఆంధ్రవూపదేశ్‌కు 45 టీఎంసీలుగా కేటాయిస్తూ వీటిలో మహారాష్ట్ర 3 టీఎంసీలను, కర్ణాటక 7 టీఎంసీలను, ఆంధ్రవూపదేశ్6 టీఎంసీలను నదిలో కనీస ప్రవాహంగా వదలాల్సి ఉంటుందని షరతు విధించింది. అటు అదనపు నికర జలాలు, ఇటు మిగులు జలాలను వివిధ రాష్ట్రాలకు పంచారు.

నికర జలాలు, అదనపు నికరజలాలు,, మిగులు జలాలు కలిపి మహారాష్ట్రకు 666 టీఎంసీలు, కర్ణాటకకు 911, ఆంధ్రవూపదేశ్‌కు1001 టీఎంసీలు దక్కాయిబిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాలను పై రాష్ట్రాలకు పంచడంతో పాటు, ఆలమట్టిడ్యాంకు 130 టీఎంసీల నీటిని కేటాయించడమే కాకుండా , 524.256 మీటర్ల ఎత్తుకు అనుమతించింది. ఈ తీర్పు ఆంధ్రవూపదేశ్‌కు మింగుడు పడలేదు. అఖిలపక్షాన్ని సంప్రదించి, ట్రిబ్యునల్‌కు పునః సమీక్షనిమిత్తం తమ అభ్యంతరాలను తెలియజేయడమే కాక, సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసింది.

ముఖ్యమంత్రి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన ప్రాథమిక నివేదికను అఖిలపక్షం సమావేశాలలో చర్చించిన దరిమిలా ఒక విషయం సస్పష్టంగా తేలిపోయింది. ట్రిబ్యునల్ మిగులు జలాలను కాని అదనపు నికర జలాలను కానీ కేటాయించినప్పుడు వాటిని కృష్ణా బేసిన్‌లో ఉన్న దుర్బిక్ష క్షామపీడిత ప్రాంతాల అవసరాలను తీర్చే ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇచ్చిందని, ఆ పద్దతిన ట్రిబ్యునల్ కర్ణాటక రాష్ట్రంలోని క్షామపీడిత ప్రాంతాల అవసరాలను తీర్చేనిమిత్తం ఆలమట్టికి 130 టీఎంసీలు , అప్పర్‌తుంగకు 12, అప్పర్‌భవూదకు 10, సింగటలూర్‌కు 18 టీఎంసీలు మొత్తం 170 టీఎంసీలు కేటాయించింది. ఇక మన రాష్ట్ర విషయానికి వస్తే.. కృష్ణా బేసిన్‌లో ఉన్న నెట్టంపాడు, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీకి 77 టీఎంసీలు కావాలని, కృష్ణాబేసిన్ బయట ఉన్న ప్రాజెక్టులకు అంటే.., గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ, తెలుగుగంగకు 150.5 టీఎంసీలు, వెరసి 227. 50 టీఎంసీలు కావాలని మనం డిమాండ్ పెడితే జూరాలకు 9 టీఎంసీల అదనపు నికరజలాలు, తెలుగు గంగకు 25 టీఎంసీలు తప్ప అదనంగా ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా ట్రిబ్యునల్ కేటాయింపులు జరుపలేదు. కర్ణాటక రాష్ట్రంలోని క్షామపీడిత ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణలోని మహబూబ్‌నగర్,నల్లగొండ జిల్లాలోని మూడు ప్రాజెక్టులకు సంబంధించిన బేసిన్‌లోని క్షామపీడిత క్షేత్ర వైశాల్యం 5% మాత్రమే తక్కువ. కానీ కర్ణాటకకు 170 టీఎంసీలు కేటాయించిన ట్రిబ్యునల్, తెంగాణకు దాదాపు మొండిచేయి చూపడం కేవలం వివక్ష తప్ప మరొకటి కాదు.

దీనికి పూర్తిగా మన రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ట్రిబ్యునల్ ఎదుట సక్రమంగా వాదనలు వినిపించకపోవడం ఒక కారణమయితే, బేసిన్ బయట ప్రాంతాల అవసరాలను ట్రిబ్యునల్ ఎదుట పెట్టి శుష్కవాదనలు చేసి, తెలంగాణ ప్రాజెక్టుల డిమాండ్‌ను నీరు కార్చడం మరో కారణం. అందుచేతనే ముఖ్యమంత్రి దృష్టికి తేరాస పక్షాన ఈ రచయిత, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఈ లోపాన్ని తెచ్చినప్పుడు కనీసం రివ్యూ పిటిషన్, సుప్రీంకోర్టులో వేసిన ఎస్‌ఎల్‌పీ లో నైనా ఈ తప్పును సరిదిద్దుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

ట్రిబ్యునల్ పోకడలు చూస్తుంటే వారు తమ తీర్పును మారుస్తున్నట్లు కనపడుటలేదు. అసలు ట్రిబ్యునల్‌లో మన వకీళ్లు ఏం వాదిస్తున్నారు? తెలంగాణకు కర్ణాటకతో పోలిస్తే జరిగిన అన్యాయం , కనిపిస్తున్న స్పష్టమైన వివక్షను తేట తెల్లం చేశారా? చేస్తే వారి స్పందన ఏమిటి? అన్న విషయం తెలియదు. అందుకే కేసీఆర్ ఆందోళనతో సీఎంకు లేఖ రాశారు. ఏదేమైనా ఒకసారి ట్రిబ్యునల్‌రిపోర్టు ఖరారు అయిందంటే మనం చేయగలిగిందేమి లేదు. 68.5 శాతం పరీవాహక ప్రాంతమున్న తెలంగాణకు నికర జలాల్లో 34.73 శాతం లభిస్తే, మిగులు జలాలలో లభించింది శూన్యం. ఈ రోజు మనం అటు కేంద్రం ఎదుట గానీ, ట్రిబ్యునల్ ఎదుట గానీ సుప్రీంకోర్టు ఎదుటగానీ తెలంగాణకు జరిగిన నష్టాన్ని ఎత్తి చూపే అవకాశం లేదు. ఏం చేసినా రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే జరగాలి. ‘ఆయనే ఉంటే ఎదురింటివాడెందుకు’ అన్నట్టు ఈ సమైక్య పాలనే బాగుంటే మనకీవస్థలు దేనికి? ఎంత సేపటికీ సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాల గురించి ఆలోచించే ఈ వలసవాద ప్రభుత్వానికి తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరిపితే ఏమిటి? జరుపక పోతే ఏమిటి? What difference does’ nt make? తప్పదు. సమైక్య రాష్ట్రంలో మనకీ కష్టాలు తప్పవు.

-ఆర్. విద్యాసాగర్ రావు,
కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

country oven

Featured Articles