నదుల అనుసంధానం-తెలంగాణకు నష్టం


Mon,April 30, 2012 12:07 AM

నదుల అనుసంధానం గురించి చాలా కాలంగా వింటున్నాం. ఏ నదులను అనుసంధానిస్తారు.దానివల్ల తెలంగాణకు ఏం లాభం? వివరించండి?

- రావుల బ్రహ్మయ్య, ఆశ్వరావుపేట, ఖమ్మం జిల్లా


ఎక్కువగా నీరున్న నది నుంచి తక్కువ నీరున్న నదికి నీటిని తరలించే కార్యక్షికమాన్ని నదుల అనుసంధానం అంటారు.ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో మన గోదావరి నదిలో అక్కడి అవసరాలకు మించి పుష్కలంగా నీరుందని, కృష్ణా, పెన్నా, కావేరీ వంటి నదులలో అక్కడి అవసరాలకు సరిపడా నీరులేదనీ, కనుక గోదావరిలో లభ్యమయ్యే మిగులు జలాలను కృష్ణా, పెన్నా, ఇంకా దక్షిణాది నదులకు తరలించవచ్చన్నది అభివూపాయం. ఇదేవిధంగా మధ్యవూపదేశ్, ఒరిస్సా, రాష్ట్రాలలో ప్రవహించే మహానదిలో కూడా ఆబేసిన్ అవసరాలకు మించి నీరుందని, ఆ నదిలో ఉన్న మిగులు జలాలను గోదావరిలోని మిగులు జలాలతోపాటు దక్షిణం వైపు తరలించాలన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. ఉత్తర భారతం విషయానికి వస్తే బ్రహ్మపుత్ర నదిలో అవసరానికి మించి నీరుంది కనుక దాన్ని గంగానదిలో కలిపి, మిగులు జలాలను మహానదికి నీరు ఇవ్వవచ్చు అన్నది కేంద్ర ప్రభుత్వం ప్లాన్. ఈవిధంగా చే స్తే బ్రహ్మపుత్ర నుంచి దక్షిణాన తమిళనాడులోనిగుండార్ వరకు నదుల అనుసంధానం సాధ్యమంటున్నారు.

పశ్చిమంగా అరేబియా సమువూదంలో కలుస్తు న్న నదులలోని అదనపు జలాలను తూర్పు వైపు మళ్ళించవచ్చని కూడా కేం ద్రం రూపొందించిన ప్లాన్‌లో ఉన్నది. ‘నదుల అనుసంధానం’ను తొలిసారి ప్రాచుర్యంలోకి తెచ్చింది 1972లో కేఎల్ రావు ప్రతిపాదించిన గంగా- కావేరి పథకం. దాని ప్రకారం పాట్నా వద్ద లభించే 60 వేల క్యూసెక్కుల గంగాజలంలో 10వేల క్యూసెక్కులు గంగా బేసిన్‌లోనే వాడుకొని, మిగతా 50 వేల క్యూసెక్కులను 1800 అడుగుల ఎత్తుకు లిఫ్ట్ చేసి సోన్, నర్మద,వైన్‌గంగ, ప్రాణహిత, గోదావరి, కృష్ణానదులను దాటించి కావేరిలో కలుపుతారు. దీనివల్ల కోటి ఎకరాలకు నీరందుతుంది. గంగా-కావేరి లింకుతోపాటు మరికొన్ని లింకులను కూడా కేఎల్ రావు ప్రతిపాదించారు. ఈ పథకం అమలుకు 12,500 కోట్లు అవుతుందని ఆయన అంచనా. దీనికి 70 వేల కోట్లు ఖర్చువుతుందని, ఎకరంపై విద్యుత్ ఖర్చే రు.12,500 ఉంటుందని, ఆరేడు వేల మెగావాట్ల విద్యుత్ అవసరముంటుందని కేంద్రం బుట్ట దాఖలు చేసింది. ఆ తర్వాత కెప్టెన్ దస్తూర్ ప్రతిపాదించిన గార్లెండ్ స్కీం కూడా అమలుకు యోగ్యమైనది కాదని కేంద్రం కొట్టివేసింది. కాలక్షికమేణ కేంద్రం నేషనల్ పెర్‌స్పెక్టివ్ ప్లాన్‌ను ఖరారు చేసింది.అందులో ఒకటి హిమాలయ నదుల అభివృద్ధి పథకం,ండవది ద్వీపకల్ప నదుల అభివృద్ధి పథకం.

హిమాలయ నదుల అభివృద్ధి పథకం :గంగ, బ్రహ్మపుత్ర నదులపైన, మనదేశం, నేపాల్‌లో ఉన్న వాటి ఉపనదులపైన జలాశయాలు నిర్మించి, వర్షాకాలపు నీటిని భద్రపరిచి, సాగునీరు, విద్యుత్పాదన వరద నియంవూతణ సాధించడంతోపాటు గంగా ఉపనదులైన కోసీ, గండక్, ఘాగ్రా లోని మిగులు జలాలను కాలువల అనుసంధానం ద్వారా పశ్చిమ ప్రాంతాలకు తరలించే ప్రతిపాదిన ఒకటి. అదేవిధంగా బ్రహ్మపుత్రను గంగానదికి అనుసంధానం చేసి దారిలో గంగా బేసిన్‌లోని క్షేత్రాలకు సాగునీరు అందచేయడమే కాక, హర్యానా,రాజస్ధాన్, గుజరాత్‌లోని కరువు పీడిత క్షేత్రాలకు నీటిని తరలించడం ఈ పథకంలోని మరో ప్రతిపాదన.

ద్వీప కల్పపు నదుల అభివృద్ధి పథకం : ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినంత వరకు ఈ పథకం ముఖ్యమైనది. ఇందులో ప్రధానమైన లింకు మహానది- గోదావరి- కృష్ణ- కావేరీ- వైగై -గుండార్ ఇందుకోసం తొమ్మిదిలింకులను ప్రతిపాదించారు. ఈ తొమ్మిది కాక, ముంబయికి ఉత్తరాన ఉన్న నదులను, తపతికి దక్షిణాన ఉన్న నదులతో కలిపే రెండు లింకు లు,యమునకు దక్షిణాన ఉన్న ఉపనదులు కే ఎన్‌చంబల్ నదులను అనుసంధానం చేసే రెండు లింకులు,అదనంగా పశ్చిమ దిశవైపు ప్రవహించే కొన్ని నదులను తూర్పువైపు తరలించే మరో మూడు లింకులు మొత్తం 16 లింకులు ఈ ద్వీపకల్పపు పథకంలో చోటు చేసుకున్నాయి.తెలంగాణకు సంబంధించినంతవరకు గోదావరిలో రాష్ట్ర అవసరాలకు పోను మిగతా 532 టీఎంసీలున్నట్టు కేంద్రం అభివూపాయపడుతున్నది.అదేవిధంగా మహానది నుంచి మరో 230 టీఎంసీల అదనపుజలాలు కూడా గోదావరిలో లభ్యమవుతాయి 762 టీఎంసీల మహానది గోదావరి మిగులు జలాలను ఇచ్చంపల్లి, నాగార్జునసాగర్, ఇచ్చంపల్లి-పులిచింతల, పోలవరం అనే మూడు లింకుల ద్వారా కృష్ణానదికి గోదావరి-కృష్ణా అనుసంధానం పథకం ద్వారా తరలిస్తారు.

అలా తరలించిన 762 టీఎంసీలలో కొంతఆవిరినష్టం, కృష్ణాలో కొంతఉపయోగం, మొత్తం 263.60 టీఎంసీలు కాగా కృష్ణా నుంచి మిగతా 498.40 టీఎంసీలను పెన్నాకు, ఆల్మట్టి-పెన్నార్, శ్రీశైలం-పెన్నార్, నాగార్జునసాగర్- సోమశిల లింకు ద్వారా తరలించడం జరుగుతుంది.పెన్నా నుంచి 303.18 టీఎంసీలు సోమశిల నుంచి సాలార్‌క్షిగాండ్ ఆనకట్ట ద్వారా కావేరీ నదివైపు మళ్ళుతుంది.మార్గమధ్యంలో నీటి వాడకం జరిగాక అంతిమంగా 79.72 టీఎంసీల నీరు కట్టలాయ్ రెగ్యులేటర్ ద్వారా కరువు పీడిత క్షేత్రాలకు తరలించాలన్నది ప్లాన్.

హిమాలయ నదుల అభివృద్ధి పథకం అమలయితే 5 కోట్ల 60 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 30 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ద్వీప కల్పనదుల అభివృద్ధి పథకం ద్వారా 3 కోట్ల 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఈ పథకం అమలుకు 3698 మెగావాట్ల విద్యుత్తు ఎత్తిపోతల కోసం అవసరం అవుతుంది. మొత్తం ప్రాజెక్టు అమలుకు 5 లక్షల60 కోట్లు ఖర్చు అనేది అప్పటి అంచనాపాజెక్టు అధ్యయనాలు ద్వీప కల్పపు పథకం విషయంలో పూర్తయినయి. హిమాలయ నదుల విషయంలో వివిధ దశలలో ఉన్నయి. అంతర్జాతీయ సమస్యలు ఉండటంతో హిమాలయ నదుల అధ్యయనం పూర్తి కావడానికి మరింత సమయం పట్టవచ్చు.కాకపోతే ప్రాజెక్టు మొత్తంలో పర్యావరణ సమస్యలు అధికంగా ఉన్నాయి. తమిళనాడు, రాజస్తాన్, వంటి రాష్ట్రాలు తప్ప మిగిలిన రాష్ట్రాలు నదుల అనుసంబంధానాన్ని కోరుకోవడం లేదు. ఒకవైపు రాష్ట్రాలు పర్యావరణవేత్తలు నదుల అనుసంధానాన్ని వ్యతిరేకించడం, మరో వైపు సుప్రీంకోర్టు నదుల అనుసంధానం ప్రక్రియను వేగవంతం చేయమని పదే పదే తాఖీదులు ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం పని ‘కుడితిలోపడ్డ ఎలుకమాదిరి’ అయింది. సుప్రీంకోర్టు డెడ్‌లైన్లు పెట్టడంతో కెన్- బేత్వా, కాలీసింద్- చంబల్ లింకుల ప్రారంభించే దిశలో సంబంధిత రాష్ట్రాలైన మధ్యవూపదేశ్, ఉత్తరవూపదేశ్‌ను కొంతమేరకు ఒప్పించగలిగి ఒప్పందాలు చేసుకోవడం మటుకు జరిగింది.

మహారాష్ట్ర , గుజరాత్ రాష్ట్రాలకు ఉపయోగపడే పార్, తాపీ, నర్మద లింకు, దామన్ గంగా- పింజాల్ లింకుల విషయంలో కొంత పురోగతి కనిపిస్తున్నది. అంతేగాని దక్షిణాది రాష్ట్రాలలో ఇంతవరకు పురోగతి లేదు. పై పెచ్చు ఒడిషా (మహానది విషయంలో) ఆంధ్రవూపదేశ్ (గోదావరి విషయంలో) అభ్యంతర పెడుతున్నాయి. అటు మహానదిలోనూ, ఇటు గోదావరిలోనూ, అవసరాలకు మించి నీరుందని ఒడిషా, ఆంధ్రవూపదేశ్ అంగీకరించడం లేదు. లోగడ సుప్రీంకోర్టు ఒత్తిడికి లొంగి 2016 లోగా నదుల అనుసంధానాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా, కేంద్రానికి స్పష్టంగా తెలుసు అది అసంభవమని. అసలు ఈ పథకం అమలుకు ముఖ్యమైన అవరోధం చట్టపరమైనదే . ఒక బేసిన్‌లోని నీటిని ఆ బేసిన్‌ఉన్న రాష్ట్రం అంగీకరించకుండా మరో బేసిన్‌కు తరలించే అధికారం కేంద్రానికి లేదు. బేసిన్ అవసరాలు తీరాకే మరో బేసిన్‌కు తరలించాలని అంతర్జాతీయ న్యాయ సూత్రాలు, మన జాతీయ జలవిధానం ఇదే చెప్తున్నాయి. కనుక మిగులు జలాలున్నాయని భావిస్తున్న బ్రహ్మపుత్ర, మహానది, గోదావరి బేసిన్‌ల నుంచి నీటిని సంబంధిత దేశాల, రాష్ట్రాల అనుమతి లేకుండా మరో బేసిన్‌కు తరలించడం అసాధ్యం.అందుకే నదులను జాతీయం చేయాలని నదుల అంశాన్ని ఉమ్మడి జాబితాలోకి తీసుకొని రావాలని అంతర్ రాష్ట్ర నదులపై కేంద్రానికి హక్కు కల్పించాలని కొందరు వాదిస్తున్నారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పార్లమెంటు అలాంటి చట్టం చేయడం అసాధ్యం. అలాగే హిమాలయ నదుల విషయంలో నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ దేశాలను ఒప్పించడం కూడా తేలికకాదు. చట్టపరమైన,సాంకేతిక,పర్యావరణ, ఆర్థిక పరమైన ఇబ్బందులు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే సుప్రీంకోర్టు కొరడా ఝుళిపించి నదుల అనుసంధానం ప్రక్రియను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేసేందుకు ఒక ఉన్నత న్యాయ సంఘా న్ని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది.‘ఒకటి రెండు రాష్ట్రాలు తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో నదుల అనుసంధానం అత్యంత లాభదాయకం అన్న విషయంలో ఏకాభివూపాయం ఉంది. ఈ పథకం పట్ల ఉన్న అపోహలను నిపుణుల అభివూపాయాలు సమర్థవంతంగా తొలిగించాయి. ఈ పథకం అమలయితే వ్యవసాయరంగంతోపాటు ఇతర రంగాలలో కూడా గణనీయమైన అభివృద్ధి, సగటు ఆదాయంలో పెంపు ఇంకా స్వల్ప కాలిక దీర్ఘకాలిక ప్రయోజనాలు అనేకం కలుగుతాయి అని సుప్రీంకోర్టు అభివూపాయపడింది. కేంద్రం నదుల అను సంధానాన్ని చేపట్టడంలో గల ఇబ్బందులను సుప్రీంకోర్టు దృష్టికి ఎలా తేగలుగుతుం దీ, ఈ జటిల సమస్య ను పరిష్కరించడానికి ఏం వ్యూహం అనుసరిస్తుంది అన్నది వేచి చూడాలి.

ఆంధ్రవూపదేశ్ అభ్యంతరాలు : బచావత్ ట్రిబ్యునల్ తీర్పు అనుసరించి గోదావరిపై ఆంధ్రవూపదేశ్‌కు శ్వాశత హక్కు ఉంది. తీర్పును తిరగదోడే హక్కు పార్లమెంట్‌కు తప్ప ఇతరులకు లేదు. కనుక తన వాటాను కోల్పోవడానికి రాష్ట్రం సిద్ధంగా లేదు.ఇంతవరకు గోదావరి నీటిపై ఆధారపడ్డ గోదావరి డెల్టా ఇక ముందు పాక్షికంగా మహానదిపై ఆధారపడవలసి వస్తుంది. సాగర్ ఆయకట్టు గోదావరి నీటిపైన అదీ ఎక్కువ భాగం లిఫ్ట్ చేస్తే వచ్చిన నీటిపైన ఆధారపడవలసి వస్తుంది.గోదావరి నీటిని ఇచ్చంపల్లి, సాగర్, శ్రీశైలం జలాశయాల పైభాగం నుంచే తరలించడం వల్ల 3300 మెగావాట్ల విద్యుతు ఉత్పత్తిని కోల్పోయింది. గోదావరి మిగులు జలాలతో రాష్ట్రంలో తలపెట్టిన తెలంగాణ,రాయలసీమలోని అనేక ప్రాజెక్టులు దెబ్బతింటాయి. ఈ కారణాలు చెప్పి రాష్ట్రప్రభుత్వం ఈ స్కీంకు పాతిక సంవత్సరాల నుంచి, కేంద్రానికి అభ్యంతరం తెలియచేస్తూ వచ్చింది.కానీ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడుతున్నది.తెలంగాణను నష్టపరిచే ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నది. మహానది నీళ్లను గోదావరి బ్యారేజీకి వాడుకోవడానికి తీవ్ర ఆక్షేపణలు చెప్పిన ప్రభుత్వం, దుమ్ముగూడెం నుంచి గోదావరి జలాలు సాగర్ ఆయకట్టుకు, అదీ ఎత్తిపోతల ద్వారావాడుకోవడానికి సై అంటుంది.

నదుల అనుసంధానం మాకు వద్దు అన్న రాష్ట్ర ప్రభుత్వం ఇదిగో పోలవరం ప్రాజెకు ్టనుంచి కృష్ణాకు నీళ్లు, దుమ్ముగూడెం నుంచి కృష్ణాకు నీళ్లు మా అంతట మేమే తరలిస్తున్నాం.ఇవన్నీ నదుల అనుసంధానంలో భాగమే కనుక, మాకు పోలవరం, దుమ్ముగూడెం టెయిల్‌పాండ్‌కు మద్దతివ్వండి అని కేంద్రానికి దొంగ మాటలు చెప్తున్నది.

ఇదే పద్ధతిన రేపు పోతిడ్డిపాడు ద్వారా తరలించే అక్రమ జలాలను కూడా నదుల అనుసంధానం ప్రక్రియలో భాగంగానే భావించి వాటిని క్రమబద్ధీకరించమని కేంద్రాన్ని అడగటానికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడక పోవచ్చు. విద్యుత్తు నష్టం గురించి మాట్లాడే రాష్ట్ర ప్రభుత్వం, పోతిడ్డిపాడు నుంచి కృష్ణా జలాలను తరలిస్తే జరిగే విద్యుత్తు నష్టం గురించి మాట్లాడడం లేదు. ఇతర రాష్ట్రాల కివ్వడానికి మా గోదావరిలో నీళ్లెక్కడివి అని గోలపెట్టే వలసవాద ప్రభుత్వం గోదావరి జలాలను తెలంగాణకు దక్కకుండా సీమాంధ్ర ప్రాంతాలకు నదుల అనుసంధానం ముసుగులో తరలించడానికి వెనకాడటం లేదు. వాస్తవానికి గోదావరిలో తెలంగాణ అవసరాలకు మించి అధిక జలాలు లేవు. అవి ఇతర రాష్ట్రాలకు గాని, ఆంధ్రవూపదేశ్‌లోని ఇతర ప్రాంతాలకు గాని తరలించే సమస్యే లేదు. కాబట్టి నదుల అనుసంధానం మనకు పనికిరాదు.

- ఆర్. విద్యాసాగర్‌రావు , కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్

35

Vidyasagar Rao

Published: Sat,June 6, 2015 12:18 AM

కొత్తరాష్ట్రంలో సాగునీటి ప్రయాణం

తెలంగాణలో మొదటిసారిగా చిన్న నీటిపారుదల వనరుల లెక్కింపు జులై 2014లో చేపట్టారు. చిన్న నీటి పారుదల శాఖ నిర్మించి నిర్వహిస్తున్న

Published: Tue,December 3, 2013 06:14 AM

కొత్త ట్రిబ్యూనల్ తీర్పుతో రాష్ట్రానికి తిప్పలే!

బిజేశ్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న తుది తీర్పును వెల్లడించింది.దీనిపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు హర్షాన్ని ప్రకటించగా,

Published: Sat,November 2, 2013 12:35 AM

నిర్వచించబడని సెక్యులరిజం!

1947లో పాకిస్థాన్ ఇస్లాం దేశంగా ఆవిర్భవించినప్పుడు, భారతదేశం కూడా భగవంతుణ్ణే సర్వాధికారిగా ఎంచుకున్న రాజ్య వ్యవస్థగా వెలిస్త

Published: Sun,August 18, 2013 11:59 PM

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?

తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్

Published: Fri,March 22, 2013 02:40 AM

గిరిజనులకు పోరాటమే మార్గం

గిరిజనులను కొండకోనల్లోకి తరిమికొట్టారు. ఇప్పుడు ఆస్థలాల నుంచి కూడా అటవీ అధికారు లు వేరే ప్రాంతాలకు తరలిపోవాలంటారు. చట్ట ప్రకారం గి

Published: Mon,March 4, 2013 12:26 AM

బాబ్లీ తీర్పు, నిట్టూర్పు? ఓదార్పు?

ఫిబ్రవరి 28, 2013న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తుది తీర్పు వెల్లడించింది. అది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని,‘శ్రీరాంసా

Published: Tue,February 5, 2013 12:02 AM

పాదయాత్రలు ఫలించేనా?

రాష్ట్రంలో వివిధ పార్టీల పాదయావూతల గమ్యం అగమ్యగోచరంగా ఉంది. ఎక్కడనుంచి యాత్ర ప్రారంభించినా అసెంబ్లీ చేరుకొని ముగిస్తే దానికి అర్

Published: Thu,January 24, 2013 11:40 PM

పతాక రూపకర్తను స్మరించుకుదాం

ఒక జాతి స్వాతంత్య్రం, సౌభాగ్యం ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తాయని ప్రతీతి. అలాంటి జాతీయ పతాకాన్ని భారతజాతికి అందించిన మహత్తర రూపశిల్

Published: Sun,December 30, 2012 11:53 PM

అబద్ధాల మాటలు- దోపిడీ చేతలు

ఈమధ్య మీరు చాలా కాలంగా అటు ‘నమస్తే తెలంగాణ’లోగానీ, ఇటు ‘టీ-న్యూస్’లోగానీ మరే ఇతర ఛానల్‌లోనూ కనిపించకపోవడంతో ఏమైందా అని కొంత ఆందోళన

Published: Mon,November 26, 2012 12:19 AM

జలదోపిడీయే హంద్రీ నీవా

హంద్రీనీవా ప్రాజెక్టుకు ఇటు తెలంగాణ నాయకులు అటు కోస్తాంధ్ర నాయకులు నీళ్లు వదలడం అక్రమమంటున్నారు. ప్రాజెక్టు కట్టుకున్నాక నీళ్లు వ

Published: Sun,November 18, 2012 10:42 PM

బాబ్లీ- భిన్న వాదనలు

సుప్రీంకోర్టులో 8-11-2012 నాడు బాబ్లీపై సుదీర్ఘమైన వాదనలు జరిగినట్టు, సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు టీవీల్లో చూశాను. మ

Published: Mon,November 12, 2012 12:13 AM

ప్రాణహిత- చేవెళ్లకు అన్నీ అవాంతరాలే!

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుపై నాయకులు ఇదిగో కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు ఆమోదం త్వరలో రాబోతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమ

Published: Mon,November 5, 2012 12:14 AM

సద్దుమణిగిన సింగూరు జలవివాదం

ఈ మధ్య సింగూరు జలవివాదం ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్య బేధాభివూపాయాలకు దారి తీసిందని అది చివరకు, ఇందిరమ్మ బాట వాయిదా పడటానికి

Published: Mon,October 29, 2012 12:05 AM

రైతులు ఇకనైనా కళ్లు తెరవాలి

ఒక పక్కన వానలు తగ్గుతూ ఉన్నయి. మరో పక్కన వచ్చిన వరదను పై రాష్ట్రాలు అడ్డుకుని మన రాష్ట్రానికి నీరు రాకుండా చేస్తున్నయి. ఇలాంటి పరి

Published: Tue,October 23, 2012 12:22 AM

జీవ వైవిధ్యం:ఆచరణలో విరుద్ధం

ప్రముఖుల ప్రకటనల మద్దతుతో, ఇతరులిచ్చిన వందలకోట్ల రూపాయల నిధుల తో, అంతరించిపోయిన జీవుల తీపి గుర్తులుగా తీర్చిదిద్దిన బొమ్మల సమాహారం

Published: Mon,October 22, 2012 04:41 AM

బాబ్లీ బాగోతం

బాబ్లీ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 8న వెల్లడించే అవకాశముందని మీడియా తెలిపింది. ఇటీవల సుప్రీంకోర్టులో జరిపిన వాదనలను

Published: Sun,October 14, 2012 11:29 PM

ముదురుతున్న జలవివాదాలు

కావేరీ జలజగడమేంది? దీనిపైన కర్ణాటక, తమిళనాడు కొట్టుకు చస్తున్నంత పనిచేస్తున్నాయి. ఇట్లా నీళ్లకోసం ప్రజలు తన్నుకు చస్తుంటే కేంద్ర

Published: Mon,October 8, 2012 12:18 AM

కలిసుంటే ఎవరికి సుఖం?

కలిసుంటే కలదు సుఖమని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి అని, తెలుగువారంతా కలిసే ఉండాలని, రాష్ట్రం పెద్దదిగా ఉంటే కేంద్రంతో బాగా

Published: Mon,October 1, 2012 01:12 AM

న్యూ(టో)టన్(పురో)గమన సూత్రాలు

ఈమధ్య సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ కర్ణాటక ఆలమట్టిని నిర్మించి ఆంధ్రవూపదేశ్‌కు నీళ్లు రాకుండా చేసిందని, ఒడిషా ఛత్తీస్

Published: Mon,September 24, 2012 12:36 AM

బాబ్లీ: మహారాష్ట్ర నీటి చౌర్యం

బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్లది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మనది. మన ప్రాజెక్టు జలాశయ పరిధిలో మహారాష్ట్ర వాళ్లెట్లా కట్టారో అర

Featured Articles