పాలమూరు ఎత్తిపోతల పథకం


Mon,January 30, 2012 02:48 AM

పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి రెండు మూడేళ్ళ క్రితం అనేక సభలు, సెమినార్లు జరుగుతూ ఉండేవి. ఆతర్వాత ఏమయింది? ఈ పథకం పరిస్థితి ఏమిటి? కాస్త వివరిస్తారా?

- కె. సంతోష్‌కుమార్, జడ్చర్ల, మహబూబ్‌నగర్


మీరన్నది నిజమే. రెండు మూడేళ్ల క్రితం పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి పాలమూరు జిల్లాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం చర్చలేదు. ‘తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం’ వారు ఈ పథకం గురించి ప్రాథమిక అధ్యయనం చేసి జిల్లాలోని మేధావులను ప్రజావూపతినిధులను చైతన్యపరిచారు. పలు సదస్సులలో సంబంధిత ఇంజనీర్ల చేత ఈ పథకంపైన ‘ప్రజెం ఇప్పించి ప్రజల్లో కి తీసుకు అంతిమంగా ఈ పథకంపైన జిల్లా ప్రజావూపతినిధులు కదలివచ్చి నాటి ముఖ్యమంవూతికి ఈ పథకం అవసరం, ప్రాధాన్యం వివరించి దీన్ని వెంటనే దర్యాప్తు చేయించమని కోరారు. ముఖ్యమంత్రి స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా నీటిపారుదల శాఖ కార్యదర్శికి ఆదేశాలు ఇవ్వడం, ప్రతిపాదన ఇంజనీర్ల కమిటీ ముందుకు రావడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈ కమిటీలో ఉన్న ఇంజనీర్లలో అత్యధికులు సీమాంవూధులు. ఎత్తిపోతలంటే వారికి గిట్టదు. పైగా కృష్ణ జలాలను తెలంగాణకు తరలించడమంటే వారికి ఏవగింపు. ఇప్పటికే అనేక ఎత్తిపోతల పథకాలు అమలుల్లోఉన్నాయి. వాటి ఫలితాలు చూసా కే ఈ పథకంపై తగు నిర్ణయం తీసుకోవచ్చు అన్న వాయిదా మంత్రా న్ని సూచించినట్టు సమా చారం.ఫలితం.. పెండిం గ్. ఇక సాంకేతిక వివరాల్లోకి వెడితే.. జూరాలలో లభ్యమయ్యే కృష్ణా మిగులు జలాల ను, రోజుకు 2 టీఎంసీల చొప్పన 35 రోజులపాటు వెరసి 70 టీఎంసీలను ఈ పథకం తరలిస్తుంది. జూరాల పూర్తిస్థాయి 31 మీటర్లు. 310 మీటర్ల స్థాయి నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా కోయిల్‌సాగర్ జలాశయానికి చేరవేయడం జరుగుతుంది.

కోయిల్‌సాగర్ జలాశయంలోకి 420 మీటర్ల స్థాయికి ఈ నీరు ఎత్తబడుతుంది. ఇది మొదటిదశ లిఫ్ట్. రెండవ దశ ఎత్తిపోతలలో కోయిల్‌సాగర్ జలాశయంలో 410 మీటర్ల స్థాయినుంచి మొహమ్మదాబాద్ జలాశయం (కొత్త) 520 మీటర్ల స్థాయికి, మూడోదశలో 510 మీటర్లస్థాయి నుంచి ఇప్పలపల్లి జలాశయం(కొత్త) 605 మీటర్ల స్థాయికి, అంతిమంగా నాలుగవ ఎత్తిపోతల దశలో ఇప్పలపల్లి జలాశయం 595 మీటర్ల స్థాయినుంచి పద్మారం(కుసుమ సముద్రం) జలాశయం(కొత్త) లోని 675 మీటర్ల స్థాయికి నీరు చేరుతుంది. అంటే 310 మీటర్ల స్థాయినుంచి 675 మీటర్ల స్థాయికి నీరు ఎత్తబడుతుందన్న మాట. మొదటి దశ లో జూరాల ప్రాజెక్టు నుంచి 24 వేల క్యూసెక్కుల కృష్ణా జలాలను 6 కిలోమీటర్ల కాలువ, 32 కిలోమీటర్ల సొరంగం ద్వారా మొత్తం 110 మీటర్ల ఎత్తు కోయిల్‌సాగర్ జలాశయంలోకి, అక్కడ నుంచి అదే నీటిని 110 మీట వర్ల ఎత్తుకు 2 కిలోమీటర్ల కాలువ , 15 కిలోమీటర్ల సొరంగం ద్వారా మొహమ్మదాబాద్ జలాశయంకు చేర్చడం జరుగుతుంది. మొహమ్మదాబాద్ జలాశయం నుంచి 26 టీఎంసీల వినియోగంతో 3 లక్షల 50 వేల ఎకరాల ఆయకట్టు రెండు పక్కలా సాగు జరుగుతుంది.

అలా వినియోగం కాగా మిగిలిన నీటిని మూడవ దశలో 2 కిలోమీటర్ల కాలువ 10కి.మీ. సొరంగం ద్వారా ప్రవహింపచేసి రంగాడ్డి జిల్లా కులకచర్ల మండలంలోని ఇప్పలపల్లి గ్రామంలోని కుసుమ సముద్రం జలాశయానికి చేరుస్తారు. కుసుమ సమువూదంలోకి ప్రవహించే నీరు 16450 క్యూసెక్కులు. దీని ద్వా రా 23 టీఎంసీల నీటి వినియోగంతో 3 లక్షల 40వేల ఎకరాల భూమి ఇరు పక్కలా సాగయ్యే అవకాశముంది. మిగతా 21 టీఎంసీల నీరు నాలుగవ దశ లిఫ్ట్‌తో 3.5 కి.మీ కాలువ, కి.మీ. సొరంగ ప్రయాణం చేసి మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గు మండలంలోని పద్మారం జలాశయంకు చేరి, తద్వారా 3 లక్షల 10 వేల ఎకరాలను సాగు చేస్తుంది. ఈ రకంగా మహబూబ్‌నగర్, రంగాడ్డి జిల్లాల్లో ప్రధానంగా నల్లగొండ జిల్లాలో మొత్తం 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది ఈ పథకం. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ పథకం అమలుకు 2300 మెగావాట్ల విద్యుత్తు అవసరమవుతుంది. ప్రాజెక్టు మొత్తం ఖర్చు సుమారు 9 వేల కోట్లు. ప్రతి ఎకరానికి 90 వేల రూపాయల ఖర్చవుతుంది. ‘ప్రాణహిత-చే పథకంలో ఎకరం సాగుకోసం 2 లక్షల 75 వేల రూపాయల ఖర్చవుతుంది. కనుక ఈ పథకం అమలు చాలా చవక. కనుక తప్పక ఈ పథకాన్ని స్వాగతించాల్సిన అవసరముందని ఈ నివేదిక తయారు చేసిన ఇంజనీర్ల ఫోరం అభివూపా యం. ఈ పథకం వల్ల ప్రయోజనం పొందగల మండలాలు మహబూబ్‌నగర్‌లో 3, రంగాడ్డిలో 13, నల్లగొండలో 2 ఉన్నాయి.

మహబూబ్‌నగర్ జిల్లాలోని మండలాల వివరాలు: కొడంగల్, బొ మ్మాస్‌పేట, దౌలతాబాద్, కోస్గి, దామెరగిద్ద, మద్దూర్, హన్వాడ, కోయిల్‌కొండ, నారాయణపేట, ధన్వాడ, ఊట్కూరు, మక్తల్, మాగనూర్, దేవరకద్ర, అడ్డావల్, ఘనపూర్, పెద్దమామిడి, కొత్తపేట, వనపర్తి, పానగల్లు, గోపాలపేట, తిమ్మాజిపేట, మహబూబ్‌నగర్, నవాబుపేట, జడ్చర్ల, బిజినేపల్లి, బాలానగర్, షారూఖ్‌నగర్, మిడ్జిల్, కల్వకుర్తి, వెల్దండ, కేశంపేట, తల కొండపల్లి, ఆమనగల్లు, మాడ్గుల, కొందుర్గు, భూత్పూర్, వంగూర్.
రంగాడ్డి జిల్లాలోని మండలాలు: పెద్దముల్, మార్పల్లి, తాండూరు, దోమ, గండివీడు, ధారూర్, యాలాల, బషీరాబాద్, పరిగి కులకచర్ల.

నల్లగొండ జిల్లాలోని మండలాలు : చింతపల్లి, మర్రిగూడెం.
ఇంజనీర్ల ఫోరం వారు జరిపింది ప్రాథమిక అధ్యయనం కాబట్టి, పథకం వల్ల లబ్ధి పొందే ఆయకట్టు , ఖర్చు, ఎత్తిపోతలు, విద్యుత్తు అవసరాలు పూర్తిగా క్షేత్ర అధ్యయనం చేస్తే తప్ప కచ్చితంగా తేలదు. కనుక ఈ పథకం దర్యాప్తు వెంటనే జరిపించాల్సిన అవసరముంది.ఈ పథకం నుంచి లబ్ధి పొందగల మొత్తం 10 లక్షల ఎకరాల ఆయకట్టులో మహబూబ్‌నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలు, రంగాడ్డి, నల్లగొండ జిల్లాల్లో 3 లక్షల ఎకరాలున్నాయి. ఈ సందర్భంగా గుర్తుంచుకోవలసిన ప్రధానమైన అంశం ఒకటుంది. మహబూబ్‌నగర్, రంగాెరెడ్డి, నల్లగొండ జిల్లాలు కృష్ణా బేసిన్‌లో ఉన్నాయి. అంతర్జాతీయ జల సూత్రాలను అనుసరించి బేసిన్‌లో ఉన్న ప్రాంతాలకు బేసిన్ నీటిని అనుభవించే అధికారం సంపూర్ణంగా ఉంటుంది. వారు అనుభవించాక మిగిలిన నీటిని ఇతర ప్రాంతాలకు తరలించవచ్చన్నది అన్ని న్యాయసూవూతాలు, జలవిధానాలు చెపుతున్నాయి. అయితే మన ప్రభుత్వం ఈ న్యాయసూవూతాలు, విధానాలను పక్కనపెట్టి ‘కర్ర ఉన్నవాడిదే బర్రె’అన్న విధానం అవలంబిస్తూ, బేసిన్‌లోని ప్రాంతాల అవసరాలను కాదని, కృష్ణా బేసిన్ ఆవలి క్షేత్రాలకు దౌర్జన్యంగా తరలిస్తున్నది. తెలుగుగంగ, తెలుగుగంగ కాలువపై వెలసిన వెలుగోడు, బ్రహ్మంగారి మఠం, సోమశిల, కండలేరు, ఇందుకు నిదర్శనాలు. వెలుగోడు సామర్థ్యం 17 టీఎంసీలు, బ్రహ్మంగారి మఠం 17 టీఎంసీలు, సోమశిల 7 టీఎంసీలు, కండలేరు6 టీఎంసీలు. వాస్తవానికి పెన్నాపై కట్టిన సోమశిలకు తప్ప వేటికీ చెప్పుకోదగ్గ నీటి సామర్థ్యం ఉండకూడదు. కానీ కృష్ణ జలాలను అక్రమంగా తరలించి నిలువ చేయడానికే అంతంత కెపాసిటీతో ఒక్కో జలాశయాన్ని నిర్మించారు. ఇవి సరిపోవన్నట్లు గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ స్కీంలను కృష్ణా మిగులు జలాలపై ఆధారపడి శరవేగంగా నిర్మిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎత్తిపోతల పథకాలను సాంక్షన్ చేయడం మాట దేవుడెరుగు, కనీసం దర్యాప్తు జరపడానికి కూడా ఈ వలసవాదులు ఇష్టపడరు . ఈ పరిస్థితుల్లో ఏం చేయాలన్నది మనముందున్న ప్రశ్న. తెలంగాణలో ప్రస్తుతం కృష్ణా మిగులు జలాలపై ఆధారపడి నిర్మిస్తున్న పథకాలు మూడున్నాయి. ఒకటి: నెట్టంపాడు, రెండు: కల్వకుర్తి, మూడు: ఎస్‌ఎల్‌బీసీ. ఈ మూడు పథకాలకు 77టీఎంసీల నీటి కేటాయింపు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ పథకాలు అమలులోఉన్నాయి. ఇవికాక ఎస్‌ఎల్ బీసీ టన్నెల్ ద్వారా 35 టీఎంసీల తరలింపుకు పనులు జరుగుతున్నాయి. అయితే నీటి వినియోగం కోసం ఉదయ సముద్రం ఎత్తిపోతలు నిర్మాణం జరుపుతూ ఉండగా, డిండీ ఎత్తిపోతల పథకం మాత్రం దర్యాప్తు జరిగి ఆమోదం కోసం ప్రభుత్వ ఆదేశాలు వెలువడాల్సిన అవసరముంది. అదనంగా 60 టీఎంసీలు ఉపయోగించుకునే ‘జూరాల-పాకాల’ పథకం, 70 టీఎంసీలు ఉపయోగించుకునే పాలమూరు ఎత్తిపోతల పథకాల దర్యాప్తు చేయించడం కోసం ప్రభుత్వంపై వత్తిడి తేవలసి ఉంది.

ఇదివరకే దర్యాప్తు జరిగి రెండేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్న డిండీ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం పరిశీలించి, అమలుకు సాంక్షన్ చేస్తుందా? ఇంజనీర్ల కమిటీ పక్కన బెట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశిస్తుందా? అత్యంత ఆకర్షణీయమైన జూరాల-పాకాల గ్రావిటీ పథకం ప్రతిపాదనను రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం ప్రభుత్వానికి సమర్పిస్తే పరిశీలించి దర్యాప్తు చేయమని ఆదేశిస్తుందా? వేచి చూడవలసిందే.
నామటుకు నాకు తనంతట తానుగా ప్రభుత్వం ఈ పథకాలకు అనుకూలంగా స్పందించదు. కారణం తెలిసిందే. ఈ పథకాలు కృష్ణా మిగులు జలాలపై ఆధారపడ్డవి. పైగా ఒక్క ‘జూరాల -పాకాల’ తప్ప మిగిలినవి ఎత్తిపోతలు. అంటే.. ఖర్చుతో కూడినట్టివి. నీటి లభ్యత కారణంగానో, పై రాష్ట్రాలు అభ్యంతరం తెపుతాయనో, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు జరుగుతున్నాయి కాబట్టి ఇది సందర్భం కాదనో ఏవో సాకులు చెప్పి ప్రభుత్వం తప్పించుకుంటుంది. పథకాలు సాంక్షన్ అయి అమలు కావడం తరువాత కనీసం డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులయినా తయారయి సిద్ధంగా ఉంటే అనువైనప్పుడు వీటి అమలు గురించి ఆలోచించవచ్చు. కనుక దర్యాప్తు చేయించడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు. మన ప్రజా ప్రతినిధులు కనీసం ఈ పనిఅయినా చేయించగలగాలి. ఇందుకోసం మనం మన ప్రతినిధులపై వత్తిడి తేవాలి. ప్రత్యేక రాష్ట్రం వచ్చేలోపు మన ప్రజా ప్రతినిధులు కళ్లు తెరిచి రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం వారు కష్టపడి తయారు చేసిన ఈ ప్రతిపాదనలను సాకారం చేసేందుకు తమ వంతు కృషి చేస్తారని ఆశిద్దాం.

-ఆర్ విద్యాసాగర్‌రావు
కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్

35

Vidyasagar Rao