మేడారం నేర్పిన పాఠం


Sat,October 6, 2012 03:19 PM

ఏదైనా కార్యం కోసం ఓ భారీ జన సమూహం ఒక్కచోట చేరితే.. వచ్చిన జనాల సంఖ్యను బట్టి అది విజయవంతమైందని చెప్పాలా? లేక వచ్చినజనం వెళ్లేటప్పుడు సరికొత్త కార్యాచరణకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటే లక్ష్యం నేరవేరినట్టా? రాజకీయ పార్టీ సమావేశానికైనా.. దైవ సంబంధ కార్యక్షికమానికైనా ఎక్కువ మంది హాజరైతే అది విజయవంతమైందనే ప్రచారం జరుగుతుంది. మేడా రం జాతరలో కూడా ఇదే జరుగుతోంది. కానీ మేడారానికి భక్తులు ఎందుకెళ్లారు? అక్కడ ఏం చేశారు? ఏం చూశారు? ఆ జాతర ఇచ్చిన సందేశం ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు జవాబులు వెతికితే.. నాగరిక సమాజంగా చెప్పుకుంటున్న ఈ త రం, నాగరికతకు దూరంగా కొండాకోనల మధ్య నివసిస్తున్న ఆదివాసీల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.

మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మ అనే ఇద్దరు మహిళలను దేవతలుగా పూజించారు. మాతృస్వామిక కుటుంబాలతోనే ఆరంభమైన మానవ జాతి మూల లక్షణాలను ఆదివాసీ లు ఇంకా మర్చిపోలేదనడానికి ఇదే నిదర్శనం. మహిళలను పూజించాలనే సందేశం జాతరలో వినిపిస్తుంది, కనిపిస్తుంది. మహిళలను అంగడి సరుకుగా, బోగ వస్తువుగా, బానిసగా చూసే సమాజం ఆదివాసీల నుంచి నేర్చుకోవాల్సిందదే.
జాతరలో ఎక్కడా మతాచారాలు కనిపించవు. ఏ మత ప్రబోధాలు వినిపించ వు. మత గురువుల ఆర్భాటం ఉండదు. విగ్రహారాధన కనిపించదు. ఆధ్యాత్మిక పునాది లేదు. ఎవరికీ కనీస ముఖ పరిచయం కూడా లేని కోయ పూజారులు తమ ముఖం కూడా కనిపించకుండా ఎర్రటి దుప్పట్లు కప్పుకు ని వచ్చి సమ్మ క్క సారలమ్మలను ప్రతిష్టించిపోతారు. అంతే. తర్వాత ఎవరి పూజలు వారివే. ఎవరి పద్ధతులు వారివే.

ఎలా మొక్కాలి? ఏ దుస్తులు ధరించాలి? ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి? మెడ లో ఏం వేలాడదీసుకోవాలి? ఇలాంటి విషయాలు ఎవరు చెప్పరు. భక్తులు ఎవరికి తోచినట్టు వారు పూజించుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే భక్తుడికి భగవంతుడికి ఎవరూ అనుసంధానకర్తలుండరు. కోయ గిరిజను లు ఏ మతానికి చెందిన పద్ధతులు పాటించరు. కానీ వారి ఆచారాన్ని మాత్రం జాతర మొత్తం అన్ని మతాల వారు గౌరవిస్తా రు, పాటిస్తారు. పరమత సహనం అంటే ఏమిటో? సర్వమత సమానత్వం అంటే ఏమిటో జాతర నేర్పుతోంది. అసలు మతంతో సంబం ధం లేకుండానే ఇష్ట దేవుళ్లను కొలుచుకోవచ్చనే సత్యం బోధిస్తున్నది. పెద్దగా చదువు సంధ్యలులేని ఆదివాసీల నుంచి మతం పేర మారణహోమం సృష్టిస్తున్న వారు నేర్చుకోవాల్సిం ది ఎంతో ఉంది.

మేడారం సమ్మక్క సారలమ్మ చరివూతకు సంబంధించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నప్పటికీ, ఎక్కువ మంది నమ్మే విష యం వారు కాకతీయులతో జరిగిన యుద్ధంలో చనిపోయారని. వీర మరణం పొందిన వారిని స్మరించుకుంటూ అర్పించే నివాళి కార్యక్షికమమే ప్రతీ రెండేళ్లకోసారి జరిగే మేడారం జాత ర. యుద్ధంలో గెలిచిన కాకతీయులకు వీరులనే పేరు ఉంది. చాలా ఏళ్ల పాటు రాజ్యమేలిన ఖ్యాతి ఉంది. దక్షిణ భారతదేశంలోనే పెద్ద సామ్రాజ్యం నిర్మించిన చరిత్ర ఉంది. కానీ మేడరాజులు అలా కాదు. వారు కేవలం కాకతీయులకు సామంతు లు. ప్రస్తుతమున్న రెడు మూడు మండలాల పరిధి కూడా దాటని మేడరాజ్యం.

కానీ తమ వారిని పన్నుల పేరిట వేధించే కాకతీయులపై పోరాడారు. అత్యంత శక్తిమంతమైన కాకతీయులతో గెలవలేమని తెలిసి కూడా, వారితో రాజీ పడితే సామంత రాజులుగా తమకు ఢోకా లేకున్నా, వారు వెనుకడుగు వేయలేదు. నమ్మిన జనం కోసం అవసరమైతే తల నరుక్కోవాలే తప్ప తల వంచకూడదనుకున్నారు. అందుకే యుద్ధంలో గెలిచిన కాకతీయులు వీరులయ్యారు. చివరి రక్తంబొట్టు వరకు పోరాడిన సమ్మక్క, సారలమ్మలు జనం దృష్టిలో దేవుళ్లయ్యా రు. ఓట్లేయించుకున్న తెల్లారే ప్రజాకాంక్షకు విరుద్ధంగా పదవులు, పైసలు, పైరవీల కోసం తిరిగే నేటి తరం నాయకులు ఈ ఆదివాసీలను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. పోరాడి తే జనం గుండెల్లో గుడి కట్టుకుని పూజిస్తారనే వాస్తవం కళ్లముందు కనబడుతున్నుది. సమ్మక్క సారలమ్మలు జాతి విము క్తి కోసం పోరాడుతున్న నేటి ఉద్యమకారులకు ఎంతో స్ఫూర్తి.

-గటిక విజయ్‌కుమార్
టీ న్యూస్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్

35

VIJAYKUMAR GATIKA

Published: Sun,February 2, 2014 01:56 AM

పెద్దల సభ స్ఫూర్తి...?

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, మన్మోహన్‌సింగ్, లతామంగేష్కర్, సచిన్ టెండూల్కర్, సుజనా చౌదరి, కనిమొళి, సుబ్బిరామిరెడ్డి, సీఎం రమేష్, హరిక

Published: Sun,October 6, 2013 01:48 AM

మన సాంస్కృతిక ప్రతీక

పెళ్లినాడు తద్దినం మంత్రమేంది’ అని విసుక్కోవద్దు. కీడెంచి మేలెంచమని పెద్దలు చెప్తరు. అందుకే బతుకమ్మ పండుగ ముచ్చట వచ్చినప్పుడు మనం

Published: Thu,February 14, 2013 03:55 PM

నూటొక్క అబద్ధాలు.. ఓ పిచ్చి వాదన

‘తెలంగాణ వేర్పాటువాదుల నూటొక్క అబద్ధాలు, అసంబద్ధ ఆరోపణలు’ పేరుతో సీమాంవూధులు ఇటీవలే ఓ పుస్తకం ప్రచురించి ఢిల్లీలో విడుదల చేశారు

Published: Thu,January 3, 2013 01:44 PM

ఓరుగల్లు ఎందుకు?

ఉరుములేని మెరుపులా వరంగల్ పేరును ఓరుగల్లుగా మార్చుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాకు చెందిన మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాకతీ

Published: Thu,November 8, 2012 02:22 AM

కాకతీయ ఉత్సవాలుపభుత్వ కుట్ర

వెయ్యేళ్ల చరిత్ర ఉన్న కాకతీయుల వైభవాన్ని ప్రపంచానికి చాటి చెబుతాం... ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహి స్తాం. అంతర్జాతీయ స్థాయిలో సదస్సు

Published: Sat,October 6, 2012 03:18 PM

గిరిజనం ఐక్యతే విముక్తికి బాట

సరిగ్గా పదిహేడేళ్ల కిందట హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బీఎస్పీ బహిరంగసభలో అప్పటి ఆ పార్టీ అధ్యక్షుడు కాన్షీరా

Published: Sat,October 6, 2012 03:18 PM

పతకాల వేటలో పతన బాట

విజయ్ కుమార్, మేరీ కోమ్, గగన్ నారంగ్, సైనా నెహ్వాల్...ఎన్నిసార్లు చెప్పుకున్నా.. ఎంతసేపు పొగిడినా.. ఎన్ని పేజీలు రాసినా... ఎన్ని బ

Published: Sat,October 6, 2012 03:19 PM

ఈ చైతన్యం కనబడదా?

సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ ప్రజలు ప్రపంచానికి సరికొత్త పోరాట రూపాలను అందించారు. ఈ ఉప ఎన్నికల్లో ఓటు హక్కు విలువను, పవివూతతను క

Featured Articles