మన సాంస్కృతిక ప్రతీక


Sun,October 6, 2013 01:48 AM

పెళ్లినాడు తద్దినం మంత్రమేంది’ అని విసుక్కోవద్దు. కీడెంచి మేలెంచమని పెద్దలు చెప్తరు. అందుకే బతుకమ్మ పండుగ ముచ్చట వచ్చినప్పుడు మనం బతుకమ్మ పండుగ ఆయుష్షు గురించి కూడా ఆందోళన చెందాలె.ఆలోచించాలె. అట్లయితెనే దాని బతుకు గురించి జాగ్రత్త పడతాం. బతుకమ్మ ఇప్పుడు ఉద్యమ పతాక అయి ఎగురుతుండొచ్చు గాక. దేశ విదేశాల్లో బతుకమ్మను తెలంగాణ బిడ్డలు ఆత్మీయంగా నెత్తికొంటున్నరు కూడా.కానీ ఈ వైభవం శాశ్వతంగా ఉం టుందా?
ప్రకృతిలో దొరికే పూలు, ఆకులతోనే ఈ పండుగ చేసుకుంటం. అట్లాంటి పూలలోనే జౌషధ గుణాలున్నాయి కాబట్టి అవి చెరువులోని నీటిని శుద్ధి చేసి మంచినీరుగా మారుస్తాయనే శాస్త్రీయ కారణం కూడా ఉంది. బతుకమ్మను గుమ్మడి ఆకులో పేరుస్తారు. తంగేడు,గునుగు, కట్లపూలు, బంతి, సీతజెడ, లిల్లి,తామర, కలువ, తీగమల్లె, బొడ్డుమల్లె, మందార పూలను బతుకమ్మలో పేర్చి చెరువుల్లో నిమజ్జనం చేస్తాం. కానీ ఈ పూలే లేకపోతే పండుగ ఉంటదా? జరుగుతున్న పరిణామాల ను గమనిస్తే బతుకమ్మ మనుగడకు ప్రమాదం ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. తంగేడుపూలు సమశీతోష్ణ మండల వాతావరణంలో పెరు గుతాయి.


ఎర్రనేలలు, పొదలు, గుట్టలు, చిట్టడువులు తంగేడు చెట్లు పెరగడానికి అనుకూలమైన ప్రాంతాలు. కానీ గుట్టలన్నీ క్వారీలుగా మారుతున్నాయి. చిట్టడవులు, ఎర్రనేలలు రియల్ ఎస్టేట్ ప్లాట్లవుతున్నాయి. ఇంతకుముందు దారిపొడవునా తంగేడు పూవు కనిపించేది. ఇప్పుడు కనిపిస్తున్నయా? ఇంకొన్నాళ్లకు కనుమరుగు కావా? వేరుశనగ,కంది, జొన్న, పెసర లాంటి మెట్ట పంటల్లో మాత్రమే అంతరమొక్కలకు గునుగుపూలు పూస్తయి. కానీ మనమిప్పుడు వరి, పత్తి, మిర్చి తప్ప మెట్ట పంటలు పండిస్తున్నమా? నల్లరేగడి భూములన్నీ వాణిజ్య పంటలకే పోతే గునుగు పూలకు స్థానమెక్కడుంటుంది? కట్లపూలను కూడా ఎవ రూ ప్రత్యేకంగా పెంచరు. చిత్తడి నేలల్లో, ఇంటి ఆవరణలో, ఎనుగుల వెంట వాటంతటవే పెరుగుతాయి. అసలిప్పుడు ఎక్కడన్న ఖాళీ జాగా ఉన్నదా? ఇండ్ల చుట్టూ కాంక్రీట్ గచ్చులే కదా? కట్లపూలకు చోటెక్కడుంది. చెరువులు, కుంటల్లో మాత్రమే కలువ, తామర, లిల్లిపూలు సహజసిద్ధంగా పూస్తాయి.

కానీ చెరువులే కనుమరుగు అవుతున్నయ్ కదా. పట్టణాలు, నగరాల్లో అయితే ఒకటీ అరా చెరువులు మాత్రమే మిగిలాయి. వరంగల్ పద్మాక్షమ్మ చెరువు దగ్గరికి సద్దుల బతుకమ్మ నాడు వేలాది మంది మహిళలు బతుకమ్మలు పట్టుకుని వస్తారు. కానీ ఆ బతుకమ్మలను వేయడానికి కావాల్సినంత నీరు ఆ చెరువులో ఉండదుపతీ చోట ఇదే పరిస్థితి. బతుకమ్మను నిమజ్జనం చేయడానికే చెరువులుండడం లేదు.అలాంటి చెరువులో ఈ పూలకు చోటుంటదా? ఒకప్పుడు ఏ చెరువును చూసినా రకరకాల పూలు తేలుతూ అందంగా కనిపించే ది.ఇప్పు డు ఏ చెరువుల్నన్న పూలు కనిపిస్తున్నయా? ఇంటి పెరట్ల గుళ్ల అయిన భూమిల మాత్రమే గుమ్మడి మొక్క పెరుగుతది. ఆ గుమ్మడాకులనే బతుకమ్మ పేరుస్తరు.అసలిప్పు డు ఇండ్లల్ల పెంటలుంటున్నయా? పండుగొచ్చిందంటే పిల్లలు అడవికి పోయి సాయంత్రం వరకు బస్తా నిండ పూలు తెచ్చేడ్ది. కానీ ఇప్పుడు మార్కెట్‌కు పోయి పూలు కొనుక్కురావాల్సి వస్తున్నది. కొంతకాలం తర్వాత..?


దేశంలో ఉన్నన్ని పండుగలు మరే దేశంలో లేవని చాలామంది అంటారు. ఈ మాట మంచి ఉద్దేశ్యంతో అన్నా, వెక్కిరించడానికన్నా అ ది నిజం.ఎందుకంటే మనది వ్యవసాయిక దేశం. వ్యవసాయానికి పండుగలకు సంబంధం ఉంటది. రుతువును బట్టి వ్యవసాయం సాగుతది. వ్యవసాయంలో వివిధ దశల్లో వివిధ పండుగలుంటయి. కానీ రానురాను వ్యవసాయం దెబ్బతింటున్నది. రైతులు వ్యవసాయం వదిలిపెట్టే పరిస్థితి వచ్చింది. వ్యవసాయమే నరకమైనప్పుడు వ్యవసాయదారులు పండుగపూట్ల చేసుకుంటరు? బతుకమ్మ పండుగ నాడు కురుకురేలు, లేసులు,లాలీపాపులు, బర్జర్లు, పిజ్జాలు తినే పిల్లలే కనిపిస్తున్నరు. బతుకమ్మ పాట రాని మహిళ తెలంగాణలో ఒక్కరు కూడా ఉండరని మనం గర్వంగా చెప్పుకుంటున్నం. మరి మరో పదేళ్ల తర్వాత ఇదే మాట చెప్పగలమా? ఇంగ్లిషు చదువుల్లో రైమ్స్ వల్లె వేసే మన పిల్లలు ఒక్క బతుకమ్మ పాటైనా నేర్చుకున్నరా? మన బతుకు, మన సంస్కృతి, మన పల్లెల గురించి తెలుసుకుంటున్నరా? బతుకు గురించి తెలిసి బతుకమ్మ పాట పాడాలి. బంధాల గురించి తెలుసుకుని పదాలు అల్లుకుపోవాలి. అరమెరికలు లేకుండా అందరితో కలిసిపోవాలి. ఆ పరిస్థితుందా?


బతుకమ్మ మన సంస్కృతితో పెనవేసుకుపోయిన పండుగ. మన సం స్కృతికి ప్రతీకగా మనం బతుకమ్మను కొలుస్తున్నం. నిలబెడుతున్నం. సంస్కృతిని రక్షించుకోవడం,బతుకమ్మను రక్షించుకోవడం వేర్వేరు కాదు. మన వ్యవసాయాన్ని వదిలేసి, మన చెరువులను ముం చేసి, మన పొలాలను ప్లాట్లుగా మార్చి, మన బతుకును పరాయీకరణ చేసి, మన ఆహారపు అలవాట్లను ఆధునికీకరణ పేరుతో అధ్వాన్నం చేసుకుని కేవలం బతుకమ్మను మాత్రమే నెత్తినపెట్టుకుని ఊరేగడం కృత్రిమంగా కనిపిస్తుం ది. పరాయిపాలనలో మన బతుకుల మాదిరిగానే బతుకమ్మ కూడా నిర్లక్ష్యానికి గురైంది.కానీ రేపు మన పాలన మనకొచ్చాక మన పద్ధతిలో మనం బతికితేనే బతుకమ్మకు మనుగడ. లేకుంటే ఈ ప్రకృతి పండుగ కాస్తా కృత్రిమ వేడుక అవుతుంది. బతుకమ్మ మన వారసత్వ పండుగ. మన వారసత్వాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్జ చేసిన నాడే మన మూలా లను, సంస్కృతిని నిలబెట్టుకోగలం.

-గటిక విజయ్‌కుమార్

247

VIJAYKUMAR GATIKA

Published: Sun,February 2, 2014 01:56 AM

పెద్దల సభ స్ఫూర్తి...?

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, మన్మోహన్‌సింగ్, లతామంగేష్కర్, సచిన్ టెండూల్కర్, సుజనా చౌదరి, కనిమొళి, సుబ్బిరామిరెడ్డి, సీఎం రమేష్, హరిక

Published: Thu,February 14, 2013 03:55 PM

నూటొక్క అబద్ధాలు.. ఓ పిచ్చి వాదన

‘తెలంగాణ వేర్పాటువాదుల నూటొక్క అబద్ధాలు, అసంబద్ధ ఆరోపణలు’ పేరుతో సీమాంవూధులు ఇటీవలే ఓ పుస్తకం ప్రచురించి ఢిల్లీలో విడుదల చేశారు

Published: Thu,January 3, 2013 01:44 PM

ఓరుగల్లు ఎందుకు?

ఉరుములేని మెరుపులా వరంగల్ పేరును ఓరుగల్లుగా మార్చుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాకు చెందిన మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాకతీ

Published: Thu,November 8, 2012 02:22 AM

కాకతీయ ఉత్సవాలుపభుత్వ కుట్ర

వెయ్యేళ్ల చరిత్ర ఉన్న కాకతీయుల వైభవాన్ని ప్రపంచానికి చాటి చెబుతాం... ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహి స్తాం. అంతర్జాతీయ స్థాయిలో సదస్సు

Published: Sat,October 6, 2012 03:18 PM

గిరిజనం ఐక్యతే విముక్తికి బాట

సరిగ్గా పదిహేడేళ్ల కిందట హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బీఎస్పీ బహిరంగసభలో అప్పటి ఆ పార్టీ అధ్యక్షుడు కాన్షీరా

Published: Sat,October 6, 2012 03:18 PM

పతకాల వేటలో పతన బాట

విజయ్ కుమార్, మేరీ కోమ్, గగన్ నారంగ్, సైనా నెహ్వాల్...ఎన్నిసార్లు చెప్పుకున్నా.. ఎంతసేపు పొగిడినా.. ఎన్ని పేజీలు రాసినా... ఎన్ని బ

Published: Sat,October 6, 2012 03:19 PM

ఈ చైతన్యం కనబడదా?

సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ ప్రజలు ప్రపంచానికి సరికొత్త పోరాట రూపాలను అందించారు. ఈ ఉప ఎన్నికల్లో ఓటు హక్కు విలువను, పవివూతతను క

Published: Sat,October 6, 2012 03:19 PM

మేడారం నేర్పిన పాఠం

ఏదైనా కార్యం కోసం ఓ భారీ జన సమూహం ఒక్కచోట చేరితే.. వచ్చిన జనాల సంఖ్యను బట్టి అది విజయవంతమైందని చెప్పాలా? లేక వచ్చినజనం వెళ్లేటప్పు