కాకతీయ ఉత్సవాలుపభుత్వ కుట్ర


Thu,November 8, 2012 02:22 AM

వెయ్యేళ్ల చరిత్ర ఉన్న కాకతీయుల వైభవాన్ని ప్రపంచానికి చాటి చెబుతాం... ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహి స్తాం. అంతర్జాతీయ స్థాయిలో సదస్సులు జరుపుతాం. ప్రపంచ నలుమూలల నుంచి కళాకారులు, చరివూతకారులు, ప్రముఖులను రప్పిస్తాం. ప్రపంచ పర్యాటక చిత్రంలో వరంగల్ పేరు ప్రముఖం గా ఉండేట్లు చేస్తాం. కాకతీయలు పరిపాలించిన ప్రాంతమంతా పండుగ చేస్తాం అని చెప్పింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి, పర్యాటకమంత్రి, సాంస్కృతిక మంత్రులతో సహా వరంగల్ జిల్లా మంత్రులంతా ఏడాది కాలంగా ఊదరగొట్టిన ప్రకటనలివి. కానీ అవన్నీగాలిలో కలిసిపోయాయి. కేవలం మూడంటే మూడు రోజు లు. అదీ వరంగల్ జిల్లాలో.. 25లక్షల బడ్జెట్‌తో చేయాల్సిందేనని ప్రభుత్వం తేల్చింది. అంటే ఇప్పుడు కాకతీయ ఉత్సవాల స్థాయి భద్రకాళీ గుడిలో ప్రతీ ఏటా నిర్వహించే దేవీ నవరాత్రి ఉత్సవాల కన్నా, శివరాత్రి సందర్భంగా వేయిస్తంభాల గుడిలో జరిపే బ్రహ్మోత్సవాల కన్నా తక్కువన్న మాట.

వాస్తవానికి కాకతీయ ఉత్సవాలకు భారీ ప్రణాళికే ఉంది. కాకతీయ హెరి ట్రస్టు ఏడాది కాలం గా ప్రతిపాదనలు రూపొందించి, ఏం చేయాలనే విషయంలో నిర్ధారణకు కూడా వచ్చింది. ఏడాదిపాటు ఉత్సవాలు నిర్వహించడం కోసం ట్రస్టు ప్రతిపాదనలు పంపింది. ముఖ్యమంవూతితో కూడా చర్చించింది. సమగ్ర కార్యచరణ రూపొందించింది. వివిధ దేశాల నుంచి ప్రఖ్యాత కళాకారులను పిలిపించి కళా ప్రదర్శనలు నిర్వహించాలని, అన్ని యూనివర్సిటీల్లో సెమినార్లు పెట్టాలని, రాష్ట్రపతి, ప్రధానిలను కూడా పిలిపించాలని ముఖ్యమంత్రి సమక్షం లో జరిపిన సమీక్షలో నిర్ణయం కూడా తీసుకున్నారు. ఢిల్లీలో కూడా ఉత్సవాలు జరపాలని అనుకున్నారు. కానీ అవేమీ ఇప్పు డు జరగడం లేదు. వరంగల్ జిల్లాలోని వరంగల్ కోట, వేయిస్తంభాల గుడి, రామప్ప దేవాలయాల్లో మాత్రమే మూడు రోజు లు పండుగ చేస్తారు. అంటే ప్రభుత్వం కాకతీయ సామ్రాజ్యాన్ని వరంగల్ కే పరిమితం చేసే కుట్ర కూడా చేస్తోంది.

వాస్తవానికి కాకతీయులు ప్రస్తుతం ఆంధ్రవూపదేశ్ ఉన్న ప్రాంతాన్నే కాక, దక్షిణాన తమిళనాడులో ఉన్న కంచి వరకు, ఉత్తరాన ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న బస్తర్ దాకా, ఈశాన్యాన ఒరిస్సాలో ఉన్న బరంపురం వర కు, పశ్చిమాన మహారాష్ట్రలో ఉన్న ఔరాంగాబాద్, వాడి వరకు పరిపాలన సాగించారు. దక్షిణ భారతదేశంలోనే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎవరూ పాలించలేదు. కాకతీయ ఉత్సవాలు నిర్వహించాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా కలిసి వచ్చి ఐదు రాష్ట్రాల్లో ఉత్సవాలు జరపాలి. కానీ అవి వరంగల్ జిల్లాకే పరిమితం చేయ డం కాకతీయుల వైభవాన్ని తక్కువ చేయడమే. కాకతీయులంటే వరంగల్‌కే పరిమితం అనే భ్రమ కలిగించే కుట్ర మాత్రమే.

ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించడానికి కాకతీయులు నిర్మించిన దేవాలయాలన్నింటినీ పునరుద్ధరిస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. కానీ అదీ జరగలేదు. ప్రసిద్ధ వేయిస్తంభాల గుడిలో మంటపాన్ని కూల్చి ఏడేళ్లు పూర్తయినా ఇంకా పునర్నిర్మాణం పూర్తి కాలేదు. రామప్ప గుడిలో మూడు వైపులా ప్రహారీ గోడ గతంలోనే కూలింది. తాజాగా తూర్పు ముఖం ద్వారం కూడా నేలమట్టమయింది. గుడి అంతా పగుళ్లే. వరంగల్ కోట గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. శిల్పకళ నేలమట్టమయింది. మట్టి కొట్టుకుపోతోంది. పురావస్తు సంపదకు దిక్కు లేకుండాపోయింది. ఘనపురం, కోట గుళ్లు లాంటి చారివూత క దేవాలయాలు శిథిలమైపోయాయి. చాలా గుళ్లలో శిల్పాలు పగుళ్లు చూపాయి. రక్షణ లేక దొంగల పాలవుతున్నాయి. చరివూతకు ఆనవాళ్లయిన స్తంభాలు పునాది రాళ్లుగా మారుతున్నాయి. ఒక్క వేయిస్తంభాల దేవాలయం మంటపానికి 1323 స్తంభాలుండాల్సి ఉండగా, ప్రస్తుతం 119 మాత్రమే ఉన్నాయి.

500 ఏళ్ల చరిత్ర కలిగిన రాయల ఉత్సవాలకు ప్రభుత్వం ఎంతో హంగామా చేసింది. వందకోట్లతో ఉత్సవాలు నిర్వహించింది. రాష్ట్రపతిని పిలిపించింది. ఐదు స్టాంపులు విడుదల చేసిం ది. వందేళ్ల చరిత్ర ఉన్న చిత్తూరు ఉత్సవాలకు కూడా నూట నలభై కోట్లు ఖర్చు పెట్టింది. వైఎస్ ముఖ్యమంవూతిగా ఉన్పప్పుడు కడప ఉత్సవాలకు కూడా కోట్లు వెచ్చించింది. తెలుగు మహాసభల పేరి ట తాజాగా తిరుపతికి నిధుల వరద పారిస్తోంది. కానీ దక్షిణ భారతదేశంలోనే మరే రాజవంశానికి లేనంత చరిత్ర, వైభవం, ఖ్యాతి ఉన్న కాకతీయుల విషయంలో ప్రభుత్వం కావాలనే కుట్ర చేస్తోం ది. కాకతీయ ఉత్సవాలు నిర్వహిస్తే, వరంగల్‌తో పాటు తెలంగాణ ప్రాంతానికి ప్రపంచ స్థాయిలో పేరు రావడమే కాకుండా ఈ ప్రాంత కట్టడాలు, నిర్మాణాలకు ఎంతో కొంత మేలు జరుగుతుంది. అది ఇష్టం లేకే ప్రభుత్వం వెనకడుగు వేసింది.

ఏ ప్రాంత నాయకుడికైనా ఆ ప్రాంతం పట్ల ప్రేమ, బాధ్యత ఉండాలి. రాయల ఉత్సవాల విషయంలోనైనా, కడప, చిత్తూరు ఉత్సవాల విషయంలోనైనా అక్కడి ప్రజా ప్రతినిధులు ప్రభుత్వాన్ని ఒప్పించి ఘనంగా నిర్వహించుకోగలిగారు. కానీ తెలంగాణ మంత్రులకు మాత్రం ఆ సోయి లేదు. కేంద్ర పర్యాటకమంత్రి హోదాలో చిరంజీవి భిక్షమేసినట్టు 25 లక్షలు కేటాయిస్తే మన మంత్రులు చంకలు గుద్దుకున్నారు. తెలంగాణ మంత్రుల బానిస మనస్తత్వం వల్లే కాకతీయ ఉత్సవాలకు అన్యాయం జరిగింది. తెలంగాణలో పండుగలు జరపవద్దనే ఏకైక కుళ్లు తప్ప కాకతీయ ఉత్సవాలను ఘనంగా నిర్వహించకపోవడానికి వేరే కారణమే లేదు.

-గటిక విజయ్‌కుమార్
టీన్యూస్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్

35

VIJAYKUMAR GATIKA

Published: Sun,February 2, 2014 01:56 AM

పెద్దల సభ స్ఫూర్తి...?

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, మన్మోహన్‌సింగ్, లతామంగేష్కర్, సచిన్ టెండూల్కర్, సుజనా చౌదరి, కనిమొళి, సుబ్బిరామిరెడ్డి, సీఎం రమేష్, హరిక

Published: Sun,October 6, 2013 01:48 AM

మన సాంస్కృతిక ప్రతీక

పెళ్లినాడు తద్దినం మంత్రమేంది’ అని విసుక్కోవద్దు. కీడెంచి మేలెంచమని పెద్దలు చెప్తరు. అందుకే బతుకమ్మ పండుగ ముచ్చట వచ్చినప్పుడు మనం

Published: Thu,February 14, 2013 03:55 PM

నూటొక్క అబద్ధాలు.. ఓ పిచ్చి వాదన

‘తెలంగాణ వేర్పాటువాదుల నూటొక్క అబద్ధాలు, అసంబద్ధ ఆరోపణలు’ పేరుతో సీమాంవూధులు ఇటీవలే ఓ పుస్తకం ప్రచురించి ఢిల్లీలో విడుదల చేశారు

Published: Thu,January 3, 2013 01:44 PM

ఓరుగల్లు ఎందుకు?

ఉరుములేని మెరుపులా వరంగల్ పేరును ఓరుగల్లుగా మార్చుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాకు చెందిన మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాకతీ

Published: Sat,October 6, 2012 03:18 PM

గిరిజనం ఐక్యతే విముక్తికి బాట

సరిగ్గా పదిహేడేళ్ల కిందట హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బీఎస్పీ బహిరంగసభలో అప్పటి ఆ పార్టీ అధ్యక్షుడు కాన్షీరా

Published: Sat,October 6, 2012 03:18 PM

పతకాల వేటలో పతన బాట

విజయ్ కుమార్, మేరీ కోమ్, గగన్ నారంగ్, సైనా నెహ్వాల్...ఎన్నిసార్లు చెప్పుకున్నా.. ఎంతసేపు పొగిడినా.. ఎన్ని పేజీలు రాసినా... ఎన్ని బ

Published: Sat,October 6, 2012 03:19 PM

ఈ చైతన్యం కనబడదా?

సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ ప్రజలు ప్రపంచానికి సరికొత్త పోరాట రూపాలను అందించారు. ఈ ఉప ఎన్నికల్లో ఓటు హక్కు విలువను, పవివూతతను క

Published: Sat,October 6, 2012 03:19 PM

మేడారం నేర్పిన పాఠం

ఏదైనా కార్యం కోసం ఓ భారీ జన సమూహం ఒక్కచోట చేరితే.. వచ్చిన జనాల సంఖ్యను బట్టి అది విజయవంతమైందని చెప్పాలా? లేక వచ్చినజనం వెళ్లేటప్పు