అవహేళన తగదు


Tue,October 9, 2012 12:49 AM

యూపీఏ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీకి అల్లుడైన రాబర్ట్ వాద్రా తనపై వచ్చిన ఆరోపణలకు సూటిగా, వివరంగా జవాబు ఇవ్వకుండా, ఆరోపణలు చేసిన వారిని అవహేళన చేయడం సబబు కాదు. సోనియాగాంధీ నిర్వహిస్తున్న పదవుల రీత్యా, పార్టీపైనా, ప్రభుత్వంపైనా ఆమెకున్న ప్రాబల్యం దృష్ట్యా దేశంలోని అత్యం త శక్తిమంతురాలు. సోనియా కుమార్తె ప్రియాంకకు భర్త అయిన వాద్రా ఏదైనా వ్యాపార సంస్థ నుంచి అనుచితమైన రీతిలో, అసంబద్ధమైన పద్ధతిలో లబ్ధి పొందినప్పుడు తప్పనిసరిగా వివాదాస్పదం అవుతుంది. సోనియా కుటుంబ సభ్యులు, సమీప బంధువులు తమ ఉద్యోగ, వ్యాపారాలు సాగించడం తప్పేమీ కాదు. కానీ అధికార పీఠానికి దగ్గరగా ఉన్నవారు అభ్యంతరకర లావాదేవీలలో ఉన్నట్టు ఆరోపణలు వస్తే తక్షణం నివృత్తి చేయాలె. కానీ వాద్రాపై ఆరోపణలు వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రముఖులు, కేంద్ర మంత్రులు ఆయనకు మద్దతుగా మాట్లాడడం వల్ల ప్రయోజనం ఉండదు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వమే కాదు, నెహ్రూ కుటుంబం కూడా అప్రతిష్ట పాలవుతుంది.

రాబర్ట్ వాద్రా ప్రియాంకను వివాహమాడిన నాటి ఆస్తులను, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పెరిగిన ఆస్తిపాస్తులను గమనిస్తే అనుమానాలు రావడం ఖాయం. ప్రైవేటు కంపెనీల నుంచి ఆయన లబ్ధి పొందిన తీరు కూడా హేతుబద్ధంగా లేద ని వ్యాపార లావాదేవీలు తెలిసిన వారెవరైనా అంగీకరిస్తారు. 1997లో (పెళ్ళయినప్పు డు) ఆయన ఇత్తడి హస్తకళాఖండాల వ్యాపారాన్ని సాదాసీదాగా ప్రారంభించాడు. కానీ 2007లో అనూహ్యమైన రీతిలో రియల్ ఎస్టేట్, హోటల్, ట్రేడింగ్ రంగాలలో అడుగు పెట్టాడు. 2007-08లో యాభై లక్షల రూపాయల ప్రమోటర్ ఫండ్స్‌తో వాద్రా ఆరు కంపెనీలను ప్రారంభించాడు. ఈ కంపెనీలు చెప్పుకోదగిన వ్యాపార లావాదేవీలు ఏవీ సాగించినట్టు కనబడదు. అయినా వాద్రా అనతికాలంలోనే వందల కోట్ల రూపాయల ఆస్తులను పోగు చేసుకున్న తీరు ఆశ్చర్యకరమే. ఆయన గొప్ప వ్యాపారవేత్తగా ఈ ఆస్తులను సంపాదించుకుంటే అభ్యంతరం ఉండదు. వ్యాపార కౌశలం కాదు కదా అసలు వ్యాపారాలే జరిగిన దాఖలాలు లేవు. దీని వల్ల ఆయన కుటుంబ రీత్యా లభించిన పలుకుబడి వల్ల కొన్ని కంపెనీలకు ఉపయోగపడ్డాడనీ, తద్వారా ఆయనకు ఆయా కంపెనీల నుంచి లబ్ధి చేకూరిందని అనుకోక తప్పడం లేదు. ఉదాహరణకు డిఎల్‌ఎఫ్ అనేది దేశంలోనే అతి పెద్ద వాణిజ్య భవన నిర్మాణ కంపెనీ. ఈ కంపెనీ వాద్రాకు 65 కోట్ల రూపాయల మేర రుణాన్ని ఎటువంటి తాకట్టు, వడ్డీ లేకుండా ఇచ్చిందనేది ఆరోపణ. ఇది రుణం కాదు, వ్యాపార అడ్వాన్స్ అని కంపెనీ అంటున్నది. అయితే ఆ వ్యాపార అడ్వాన్స్ దేనికి అనేది కూడా అంతు పట్టదు. మరోవైపు ఇదే కంపెనీ ఏడు ఫ్లాట్‌లను మార్కెట్ ధరకన్నా అతి తక్కువకు వాద్రాకు అమ్మింది. ఒక్కో ఫ్లాట్ విలువ మార్కెట్‌లో కనీసం ఐదు కోట్ల రూపాయలు. కానీ ఏడు ఫ్లాట్‌లను కేవలం 5.2 కోట్లకు వాద్రాకు కట్టబెట్టింది. హర్యానాలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి సమీపంగా ఉండే గూడ్‌గాంలో ప్రజలను ఖాళీ చేయించి 350 ఎకరాల భూమిని డిఎల్‌ఎఫ్‌కు కట్టబెట్టినందుకే వాద్రాకు ఈ ప్రతిఫలం ముట్టిందనేది ఆరోపణ. ఇటువంటి వాద్రా లావాదేవీలు నిబంధనల ప్రకారం సజావుగా కనిపిస్తున్నప్పటికీ, సహేతుకంగా లేవు. వాద్రా ఢిల్లీ పొలిమేరల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఎకరాల కొద్ది భూములు సంపాదించుకున్న తీరు గమనిస్తే ఈ ఆరోపణలన్నిటిపై దర్యాప్తు జరిపించడం అవసరమనిపిస్తుంది.

వాద్రా లావాదేవీలపై వచ్చిన ఆరోపణలకు ‘అధికార శిబిరం’ వివరణ ఇచ్చుకున్న తీరు ఏ మాత్రం సంతృప్తికరంగా లేదు. వాద్రాకు, వ్యాపార సంస్థలకు మధ్య లావాదేవీలు నిబంధనల ప్రకారం వెల్లడై ఉన్నందున, మళ్ళీ దర్యాప్తు ఎందుకని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానిష్ తివారీ అంటున్నారు. లావాదేవీలు వెల్లడించి ఉన్నప్పటికీ, వాటి తీరు తెన్నులే అనేక సందేహాలకు తావిస్తున్నాయి. ఆరోపణలు చేసిన అవినీతి వ్యతిరేక ఉద్యమకారులు కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్‌లను బీజేపీ ‘బి టీమ్’ అని ఆయన ముద్ర వేశా రు. ఆరోపణలు చేసిన వారు ఎవరని కాదు, అందులో వాస్తవం ఎంత అనేది ప్రజలకు తెలపాల్సిన బాధ్యత అధికార పార్టీకి ఉంటుంది. ఆరోపణలు చేసిన వారికి చట్టం గురించి పాఠాలు చెబుతామని కేంద్ర న్యాయశాఖా మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యానించాడు. వాద్రా తన కుటుంబ సంబంధాల వల్ల ఆకలితో అలమటించాలా అని మరో మంత్రి వెటకారమాడారు. తనపై ఆరోపణలు చేసిన వారిపై ‘మ్యాంగో పీపుల్ ఇన్ బనానా రిపబ్లిక్’ అంటూ రాబర్ట్ వాద్రా ఫేస్‌బుక్‌లో చేసిన వ్యాఖ్య అత్యంత అభ్యంతరకరమైనది.

హిందీ లో ఆమ్ ఆద్మీ (సామాన్య ప్రజలు) అనే పదానికి ఇంగ్లీషులో నవ్వులాటకు మాంగో పీపుల్ అనే వాడుక ఒక సినిమా మూలంగా మొదలైంది. అమెరికా అవలంబించిన నయా వలసవాద విధానాల వల్ల ఆర్థికంగా నాశనమై, అస్థిర ప్రభుత్వాలతో కొట్టుమిట్టాడే లాటిన్ అమెరికా దేశాలే బనానా రిపబ్లిక్‌లుగా పేరొందాయి. ప్రతిపదార్థం అని కాకుండా వాద్రా వాడిన తీరు గమనిస్తే అలగా దేశంలోని అలగా జనం అనే అర్థాన్ని ఈ వ్యాఖ్య జనింపచేస్తున్నది. సోనియా కుటుంబంతో ఉన్న సంబంధం మూలంగా తనపై వచ్చిన ఆరోపణలకు వినవూమంగా సమాధానం ఇవ్వాల్సింది పోయి ఇంత అవహేళన చేయడం అహంకారమే. రాజీవ్‌గాంధీ హయాంలో బోఫోర్స్ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం ఎంత అప్రతిష్ట పాలైందో తెలిసిందే. ఆ అనుభవం దృష్ట్యా వాద్రా లావాదేవీలపై తక్షణం దర్యాప్తుకు ఆదేశించడం కాంగ్రెస్ పార్టీకే శ్రేయస్కరం. వాద్రా నిజాయి తీ పరుడైతే అదే విషయం దర్యాప్తులో తేలుతుంది. దీని వల్ల పార్టీ ప్రతిష్టకు నష్టమేమీ వాటిల్లదు. ఇప్పుడున్న వాస్తవ పరిస్థితి గమనిస్తే వాద్రాపై మన్మోహన్ సర్కారు దర్యాప్తునకు ఆదేశిస్తుందనేది సందేహమే. అందువల్ల సోనియా గాంధీయే చొరవ తీసుకుని దర్యాప్తునకు ఆదేశించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలె. ప్రజాస్వామ్యం లో ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం ఉండడమే ప్రధానం. నిజాయితీగా ఉండడమే కాదు, ఉన్నట్టు ప్రజలకు కనిపించాలె. అనుమానాలకు తావు లేని పాలన సాగించాలె. అందుకోసం వాద్రాపై ప్రజ ల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయడం పాలకుల బాధ్యత.

35

VIJAYKUMAR GATIKA

Published: Mon,October 8, 2012 12:19 AM

బతుకమ్మ మీదా వివక్ష!

ఆంధ్ర పాలకులు తెలంగాణ అస్తిత్వ ఉద్యమాన్ని ‘వేర్పాటు ఉద్యమం’ అంటూ ఆడిపోసుకుంటుంటారు. కానీ వేర్పాటు ధోరణితో ఇంతకాలం పాలించింది ఆంధ్ర