సమ్మె నేర్పుతున్న పాఠాలు


Sat,October 6, 2012 04:10 PM

తెలంగాణ ప్రజల సంపూర్ణ భాగస్వామ్యంతో నలభై రెండు రోజులుగా చరివూతాత్మకంగా, విశిష్టంగా, అసాధారణంగా సకల జనుల సమ్మె జరుగుతున్నది. నాలుగు వారాలకుపైగా కట్టుగా, అద్భుతమైన ఆశను రేకెత్తిస్తూ సాగిన సకల జనుల సమ్మె విరమణ పర్వంలోకి ప్రవేశించింది. ఆర్‌టిసి కార్మికులు, ఉపాధ్యాయులు, సింగరేణి కార్మికులు తాత్కాలిక విరామం ప్రకటించడంతో, ప్రభుత్వోద్యోగుల మీద సమ్మె విరమించాలని ఒత్తిడి పెరుగుతుండడంతో తెలంగాణ సమాజంలో ఒక స్థాయిలో నిరాశా నిస్పృహలు వ్యాపిస్తున్నాయి. ఈ విరమణలను ఓటమిగా, వైఫల్యంగా, అపజయంగా కొందరైనా భావిస్తున్నారు. విద్రోహంగా కూడ కొందరు భావిస్తున్నారు. సకల జనుల సమ్మె విశిష్టతను వమ్ము చేసి, దాన్ని అవమానించేలా ప్రచారం జరుగుతున్నది. అలా తెలంగాణ ప్రజలు తమంత తామే నిరాశను, న్యూనతను అనుభవించాలని, చిన్నబుచ్చుకోవాలని కోస్తాంధ్ర, రాయలసీమ పాలకవర్గాలు, ప్రచారసాధనా లు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఆశనిరాశల సంక్లిష్ట సమయంలో అసలు సకల జనుల సమ్మెను ఎలా అర్థం చేసుకోవాలో, ఇవాళ్టి స్థితిని వైఫల్యంగా చూడడం సరైనదో కాదో విశ్లేషించుకోవలసి ఉంది.
ఏ ప్రజా ఉద్యమమైనా ఎల్లప్పుడూ ఒకే స్థాయిలో, ఒకే జోరుతో సరళరేఖలాగనో, ఎప్పుడూ పైకే వెళ్తూ ఉండే గ్రాఫ్ లాగనో సాగదు. సాగాలని కోరుకోవడం ఆదర్శమో, అత్యాశో గాని వాస్తవం కాదు. తప్పనిసరిగా పోరాట మార్గానికి ఎత్తు పల్లాలు ఉంటాయి.

అలలు ఎప్పుడూ ముందుకే కదలవు, వెనక్కి కూడ కదులుతాయి. పోటు ఉన్నట్టే ఆటూ ఉంటుంది. ముందుకు దూకేవారు ఒక అడుగు వెనక్కి వేయవలసి వస్తుంది. ఈ విజృంభణ ఉపసంహరణలు సామాజిక సంక్లిష్టతలో అనివార్యమైన భాగం. ఉద్యమం ఇలా తాత్కాలిక అపజయాన్ని ఎదుర్కొన్నప్పుడు, అలకు ఆటు వచ్చినప్పుడు, వెనుకడుగు వేయవలసి వచ్చినప్పుడు ఆ తాత్కాలిక వెనుకంజ ను సరిగా విశ్లేషించి చెప్పడం, శ్రేణులలో నిరాశను పోగొట్టడం, భవిష్యత్ పునర్విజృంభణకు సమాయత్తం చేయడం నాయకత్వ బాధ్యతలు. ఇవాళ తెలంగా ణ ఉద్యమ నాయకత్వం అటువంటి బాధ్యతలను నిర్వర్తించవలసినంతగా నిర్వర్తించనందువల్ల కూడ నిరాశ పెరుగుతోంది. ప్రతివారూ పక్కవారిని అనుమానించే స్థితి ఉంది. తాము అనుకునేదానికి ఒక్క మిల్లీమీటరు పక్కకు జరిగినా ద్రోహులుగా చూసే, ప్రకటించే స్థితి ఉంది.ఇరవై రెండు నెలలుగా ఉధృతంగా జరుగుతూ, కీలకదశకు చేరిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రస్తుత స్థితి ఒక చౌరస్తాలో ఉన్నట్టుగా ఉన్నది. నిజానికి అప్పటికి నల భై ఏళ్లుగా, కనీసం పదిహేనేళ్ళు గా సాగుతున్న దారి 2009 డిసెంబర్ 9 న ఆ చౌరస్తా దాటి ప్రత్యేక రాష్ట్ర ఏర్పా టు దిశగా సాగుతుందనిపించింది.

కాని ప్రధానంగా రాజకీయ విద్రోహం వల్ల ఉద్యమం ఇంకా ఆ చౌరస్తా దాటకుండా ఆగిపోయి ఉన్నది. అక్కడే నిలబడి ఇరవై రెండు నెలలుగా కదం తొక్కుతూ ఉన్నది. కాని చౌరస్తాలో ఎక్కువకాలం కదం తొక్కడం సరైనదీ కాదు, సాధ్యమూ కాదు. అక్కడినుంచి కదిలి గమ్యం వైపయినా వెళ్లాలి. ఎడమకో కుడికో అయినా తిరగాలి. ఎడమకు తిరిగినా కుడికి తిరిగినా ఇతర లక్ష్యాలు నెరవేరుతాయేమో గాని కోరుకున్న పద్ధతిలో ప్రత్యేక రాష్ట్రం మాత్రం రాదు. అలా ఇరవై రెండు నెలలుగా ఎడతెగకుండా కదం తొక్కుతున్న స్థితికి సకల జనుల సమ్మె అంతం పలుకుతుందనీ, దారి ముందుకు సాగుతుందనీ అనిపించింది. సకల జనుల సమ్మె అద్భుతంగా సాగి ఆ ఆశను పెంపొందించింది. తెలంగాణ సాధించేవరకూ కొనసాగిస్తామని శపథం చేసి ప్రారంభించిన సకల జనుల సమ్మెను ఆ ఆశయం నెరవేరకుండానే తాత్కాలికంగానైనా ఆపివేయవలసి వస్తున్నది. అది బాధాకరమే. కాని ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించవలసి ఉంది. ఈ విచారకర పరిణామానికి మూడు నాలుగు కారణాలున్నాయి.


మొట్టమొదటి కారణం ప్రధానంగా రాజకీయ ప్రక్రియ అయిన తెలంగాణ సాధనను సకల జనుల సమ్మె ద్వారా మాత్రమే సాధించలేము. సకల జనుల సమ్మె ఎక్కువలో ఎక్కువ ఆ రాజకీయ ప్రక్రియ త్వరితంగా జరగడానికి అవసరమైన ఒత్తిడి సృష్టించగలదే గాని, దానికదే రాజకీయ ప్రక్రియ కాజాలదు. అందువల్ల సకల జనుల సమ్మెతో పాటు ఆ రాజకీయ ప్రక్రియను నడపవలసిన రాజకీయ శక్తులు కలిసి నడిస్తేనే, తమ వంతు పాత్రను నిజాయితీగా పోషిస్తేనే సకల జనుల సమ్మె సార్థకమయ్యేది. కాని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం రెండూ ఆ బాధ్యత నుంచి తప్పుకున్నాయి. ఆ రెండు పార్టీల రాజకీయ నాయకులు ఆ బాధ్యత తీసుకునేంత హెచ్చుస్థాయి, క్రియాశీల ఒత్తిడిని తెలంగాణ సమాజం సృష్టించలేకపోయింది.
రెండవ కారణం, సకల జనుల సమ్మెలో మొత్తంగా ప్రజలందరూ పాల్గొన్నారనేది నిజమే అయినా, ప్రభావశీలంగా ఉన్నదీ, ప్రచారసాధనాల దృష్టికి వచ్చినదీ ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ వర్గాల సమ్మె మాత్రమే. ఈ వర్గాలలో అత్యధికులు నెలజీతంతో ఏ నెలకానెల అన్నట్టు సగటు జీవితాలు గడిపేవారు. సరిగ్గా రెండు పండుగలు వచ్చిన నెలలోనే వారు జీతాన్ని కూడ లెక్కచేయకుండా ఇన్ని రోజులు సమ్మెలో ఉండడమే అభినందనీయం. ఇటువంటి ఉద్యోగవర్గాలలో ఎక్కువమందికి చాల సహజంగా గృహ రుణాలో, వాహన రుణా లో, చిట్ ఫండ్ రుణాలో, ఇతర రుణాలో ఉంటాయి.

చాల అప్పులకు ఎలక్షిక్టానిక్ బదిలీ ద్వారా నెల వాయిదాలు చెల్లించే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే అక్టోబర్ మొదటి వారంలో అటువంటి ఎలక్షిక్టానిక్ బదిలీ వాయిదాలు అందక అపరాధ రుసుములు పడి ఉంటాయి. ఈ ఆర్థిక ఇబ్బందులవల్ల కుటుంబాల్లో ఒత్తిడి పెరిగినా, సకల జనుల సమ్మెను కొనసాగించడానికే ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ వర్గాలు ప్రయత్నించాయి. మూడవ కారణం సకల జనుల సమ్మె వల్ల విద్యార్థులకు, సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు కలుగుతున్నాయనే అభివూపాయాన్ని పాలకులు, తెలంగాణ వ్యతిరేకులు పెంచి పోషించారు. మధ్యతరగతి ఈ ప్రచారానికి బలి అయింది. ఉద్యమకారులు జవాబు చెప్పుకోవలసిన స్థితిలో పడ్డారు. యాభై ఐదు సంవత్సరాలుగా సాగుతున్న పాలక విధానాల వల్ల విద్యార్థులకు, ప్రజలకు, మొత్తం గా రెండు తరాల తెలంగాణ ప్రజానీకానికి ఎన్ని ఇబ్బందులు కలిగాయో, ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే ఎన్ని ఇబ్బందులు కలుగుతాయో, వాటితో పోలిస్తే ఈ ఆరువారాల ఇబ్బందులు ఎట్లా అనివార్యమైనవో చెప్పడంలో మనం విఫలమయ్యాము. అంతేకాదు, ఈ ఇబ్బందులు రావడానికి పూర్తి బాధ్యత డిసెంబర్ 9 ప్రకటన వెనక్కి తీసుకున్నవాళ్లదేనని ఎత్తి చూపడం లో కూడ విఫలమయ్యాము.

నాలుగవ కారణం, సకల జనుల సమ్మెకు వ్యతిరేకంగా మాట్లాడే దళారులు, అవకాశవాదులు తెలంగాణ సమాజంలోనే పుట్టుకొచ్చారు. సకల జనుల సమ్మె ఏ ఆశయం కోసం జరుగుతున్నదో గుర్తించి, ఆ ఆశయం వల్ల దాన్ని ప్రస్తుతం విమర్శించడం ఉచితం కాదనే ఇంగితం కూడ లేకుండా కొందరు తెలంగాణ బిడ్డలే ఏవో కొన్ని సరైనవీ, తప్పుడువీ కారణాల మీద విమర్శిస్తూ తెలంగాణ వ్యతిరేకుల బృందగానంలో గొంతు కలిపారు. ఇన్ని బలమైన అవరోధాల మధ్య కూడ అద్భుతంగా సకల జనుల సమ్మెను కొనసాగించిన, పాల్గొన్న కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులందరికీ, ప్రజలందరికీ అభినందనలు తెలియజేయాలి. ఆ అభినందనలతో పాటే ఈ నలభై రోజుల సమ్మె ఇంకా ఏం చేసి ఉంటే అర్థవంతమైన ముగింపుకు, గౌరవవూపదమైన విరామానికి వచ్చేదో గుర్తించ డం కూడ చాల అవసరం.


సకల జనుల సమ్మె అంతకు ముందరి ఆరు దశాబ్దాల ఆకాంక్షలను, ఐక్యతా ప్రకటనను, నలభై సంవత్సరాల నిరసన ప్రకటనను ఒక మెట్టు పైకి ఎక్కించి ప్రతిఘటనను ప్రదర్శించింది. ఐతే ప్రతిఘటనకు సాధారణంగా మూడు దశలు ఉంటాయి. మొదటి దశ ఎదుటివారి దాడికి చెయ్యి అడ్డుపెట్టడం. రెండో దశ ఆ దాడి సాగని స్థితి కల్పించడం. మూడో దశ ఎదురుదాడి చేయడం. తెలంగాణ విషయంలో కోస్తాంధ్ర, రాయలసీమ కుబేరుల, రాజకీయ నాయకుల రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల మీద దాడి చేయడమే ఆ మూడో దశ ప్రతిఘటన. తెలంగాణ వనరులను ఈ ఆరు దశాబ్దాలలో దోచుకోవడం మాత్రమే కాదు, ఉద్యమం నడుస్తున్న ఈ ఇరవై రెండు నెలల్లో కూడ యథేచ్ఛగా దోచుకోగలిగారంటే కోస్తాంధ్ర, రాయలసీమ కుబేరుల దుర్మార్గం ఎంతటిదో అర్థమవుతుంది. ఆ దుర్మార్గాన్ని క్రియాశీలంగా అడ్డుకోవడం, వారి దోపిడీ సాగని స్థితి కలిగించడం, ఆ దోపిడీ రూపాల మీద దాడిచేయడం సాగినప్పుడే సకల జనుల సమ్మె బలోపేతమయి ఉండేది. కాగా, సకల జనుల సమ్మెలో ప్రతిఘటన మొదటి, రెండు దశలలో మాత్రమే సాగింది. అక్కడక్కడా చెదురుమదురుగా మూడవదశలోకి సాగినా అది క్రమబద్ధంగా కొనసాగలేదు. ఉద్యమం ఆ మూడో దశ ప్రతిఘటనకు చేరినప్పుడే తెలంగాణ ప్రత్యర్థులకు నిజమైన వేడి తగులుతుంది. తెలంగాణకు అడ్డుపడుతున్నవారు, తెలంగాణ విషయంలో తాత్సారం చేస్తున్నవారు, నీళ్ళు నములుతున్నవారు, రెండు కళ్లూ రెండు దిక్కుల చూస్తున్నవారు కదలాలంటే ఆ మూడో దశ ప్రతిఘటన జరగక తప్పదు.

తెలంగాణ ప్రజల ఐక్యతను, శక్తిని, పట్టుదలను, విజయాకాంక్షను అద్భుతంగా ప్రకటించిన సకల జనుల సమ్మె ఒక తాత్కాలిక వెనుకంజకు గురయిన ఈ దశలో కొంత ఆలోచనకూ మౌనానికీ అవకాశం ఇచ్చి రెండడుగులు ముందుకు దూకి తెలంగాణ సాధించగల మార్గాలను అన్వేషించాలి. గడిచిన దినాల పోరాట రూపాలను నిజాయితీగా సమీక్షించుకుని, తెలంగాణను సాధించగల పోరాటరూపాలను గుర్తించి, ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.

-ఎన్ వేణుగోపాల్

35

VENUGOPAL N

Published: Fri,January 31, 2014 12:29 AM

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆఖరిరోజు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించడానికి పార్లమెంటుకు, కేంద్రప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, నాద

Published: Fri,August 2, 2013 01:12 AM

ఆనందం, అయినా అనుమానాలు

అరవై ఏళ్ల తెలంగాణ ప్రజా ఆకాంక్ష సాకారమైంది. తెలంగాణ ప్రజలు అపూర్వమైన, అసాధారణమైన విజయం సాధించారు. 1952లో నాన్ ముల్కీ గో బ్యాక్ అ

Published: Thu,June 27, 2013 11:44 PM

రాయల తెలంగాణ: అనవసరం, అక్రమం

కాంగ్రెస్ అధిష్ఠానం మళ్లీ ఒకసారి తనకు బాగా తెలిసిన క్రీడ మొదలుపెట్టింది. ప్రజలను వంచించడం, ప్రజలు కోరినదాన్ని ఇవ్వకపోవడం, ప్రజలు

Published: Wed,October 10, 2012 06:04 PM

మహాజనాద్భుతం సాగరహారం

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపువూతుల దేహాల స

Published: Wed,October 10, 2012 06:51 PM

న్యాయాన్వేషణకే, హింసను ఆపడానికే సాగరహారం

నమస్త తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రకటనకు మరొక మహత్తర చరివూతాత్మక రూపంగా రోజురోజుకూ బలపడుతున్న సాగరహారం ఆలోచనను, జనజీవనాచరణను అడ్డుకోవ

Published: Sat,October 6, 2012 04:04 PM

రాష్ట్రపతి ఎన్నిక తెలంగాణ ప్రబోధం

రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థి నీలం సంజీవడ్డికి వోటు వెయ్యవద్దని, స్వతంత్ర అభ్యర్థి వివి గిరికి వేయమని కాంగ్

Published: Sat,October 6, 2012 04:04 PM

పెద్దకూర పండుగ రాజకీయాలు

ఆహార రాజకీయాల గురించి మాట్లాడవలసిన సమయం ఇది. ఒక వ్యక్తి తనకు ఇష్టమైన ఆహారాన్ని స్వేచ్ఛగా తినవచ్చునా లేదా అనేది రాజకీయంగా మారిపోయి

Published: Sat,October 6, 2012 04:09 PM

సకల జనులకు నీరాజనం

సకల జనుల సమ్మెలో భాగంగా చరివూతాత్మకమైన, విశిష్టమైన, నిర్ణయాత్మకమైన పోరాటం సాగిస్తున్న తెలంగాణ కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు న

Published: Sat,October 6, 2012 04:09 PM

ధవంసమైన స్వప్నం నిర్మాణమయ్యేదెట్లా?

పది సంవత్సరాలకు పైగా అరుంధతీరాయ్ ఈ దేశపు శక్తిమంతమైన మేధో ప్రతిపక్షంగా ఉన్నారు. అంతకుముందు ‘గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ నవలతో బుకర్ ప

Published: Sat,October 6, 2012 04:08 PM

సమ్మె కర్తవ్యం ప్రతిఘటన

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో కీలక ఘట్టంగా ఈ వారంలో సకల జనుల సమ్మె ప్రారంభం కాబోతున్నది. ఆగస్ట్ మొదటి వారం నుంచీ స

Published: Sat,October 6, 2012 04:07 PM

మతి తప్పిన తలకిందుల మేధో మథనం

-ఎన్. వేణుగోపాల్ కనీసం ఈ పదిహేను సంవత్సరాలలో వెలువడిన రెండువందలకు పైగా పుస్తకాలలో ఏ ఒక్కటి చదివినా జాహ్నవికి ఈ విషయం తెలిసి

Published: Sat,October 6, 2012 04:05 PM

మరుపురాని తెలంగాణ బిడ్డ..

- ఎన్ వేణుగోపాల్ జయశంకర్ అరవై సంవత్సరాల పాటు భావజాల వ్యాప్తి, మేధో కృషి సాగించారు. మూడు దశలలోనూ ప్రజా ఉద్యమాలు వెల్లు వాటిలో పాల్