మహాజనాద్భుతం సాగరహారం


Wed,October 10, 2012 06:04 PM

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపువూతుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది. తెలంగాణ బిడ్డ అయినందుకు సంపూర్ణంగా సంలీనం కావలసిన సన్నివేశం అది. తెలంగాణ బిడ్డ కాకపోయినా న్యాయం కోసం గళమెత్తుతున్న ఆ లక్షలాది గొంతులలో కలగలిసి ముక్తకంఠం కావలసిన వేళ అది.ఆదివారం సాయంకాలం హుస్సే న్ సాగరతీరంలో అనేక ఆంక్షలనూ, ఆటంకాలనూ, నయవంచనలనూ, హామీల ఉల్లంఘనలనూ అధిగమించి జరిగిన సాగరహారం జీవితంలో అత్యంత అరుదుగా అనుభవమయ్యే మహాద్భుత ఉద్వేగభరిత జన కావ్యం. నిజంగా అది ఒక మహాకావ్యానికి వస్తువు. అక్కడ ఎగసిన భావోద్వేగాలు ఒక రోమాంచకారి నవలా ఇతివృత్తం. మూడు నాలుగు ప్రత్యేకమైన అనుభవాలను మాత్రం పంచుకోవాలి.

అక్కడ రాజకీయపక్షాల జెండాలు కనబడి ఉండవచ్చు, రాజకీయవాదుల గళాలూ నినాదాలూ వినబడి ఉండవచ్చు. కాని రాజకీయాలంటే ఎన్నికల రాజకీయ పక్షాలనే అర్థంలో చూస్తే అది ప్రధానంగా రాజకీయ ప్రదర్శన కాదు. అది తెలంగాణ బిడ్డ ల స్వచ్ఛంద ప్రదర్శన. తెలంగాణ తల్లికి నీరాజనాలు సమర్పించడానికి, సగౌరవ హారతి ఎత్తి పట్టడానికి తమంతట తామే లక్షలాది తెలంగాణ బిడ్డలు కూడిన మహా సందోహం. ఒక జాతర. ఒక పండుగ. ఒక అంగడి. ఒక బతుకమ్మ. ఒక జమ్మి ఆకు యాత్ర. ఒక ఉత్సవం.

అది రాజకీయ పక్షాల సభ కాదంటే రాజకీయ పక్షాలు ప్రజలను తోలుకు వచ్చిన సభ కాదని. నిజానికి ఒక రాజకీయ పక్షం సాగరహారం పట్ల ఒకింత దూరాన్ని పాటించింది. అయినా జనం కదిలివచ్చారు. మూడు రాజకీయపక్షాలు అంతా తామేనన్నట్టు, ఒక మనిషి, రెండు జెండాలుగా హడావుడి చేశాయి. కాని వాటి లో ఒక రాజకీయపక్షం పదమూడేళ్ల కింద చేసిన మోసాన్ని ప్రజ లు ఇంకా మరచిపోలేదు. మరి రెండు రాజకీయపక్షాలు ఇప్పుడు కొత్తమురిపెంలో పొద్దెరగనట్టు ప్రవర్తిస్తున్నప్పటికీ నిన్నమొన్నటి దాకా అవి తెలంగాణ వద్దన్న సంగతి చరిత్ర ఇంకా గుర్తుంచుకున్నది. కనుక ఆ హడావుడి చేసిన రాజకీయపక్షాలు పిలిచాయని కూడ కాదు.

రాజకీయపక్షాల ఎన్నికల తతంగాలతో సంబంధం లేని ఐక్య కార్యాచరణ సమితి పిలుపు ఇచ్చిందని జనం వచ్చారు. రాజకీయపక్షాల వల్ల కాదు, రాజకీయపక్షాలు ఉన్నప్పటికీ తమ ఆకాంక్ష కోసం జనం తరలి వచ్చారు. తెలంగాణ సాధించడానికి అన్ని మార్గాలూ ప్రయత్నించాం, ఇంకా ఏం చేయాలి అని నిరాశతో, నిస్పృహతో కాదు, మరొకసారి ఆశను కూడగట్టుకునేందుకు వచ్చారు. ఎవ రో తీసుకొస్తే కాదు, ఎవరో తోసుకొస్తే కాదు, ప్రతి వ్యక్తీ తనంతట తాను కదిలివచ్చారు. గుండె రవరవలాడితే తోసుకుని వచ్చారు. ఒక్కసారి ఆ నాలుగు లక్షల ముఖాల్లోకి చూస్తే ఎవరికయినా ఆ బలవత్తరమైన ఆకాంక్ష అర్థమయి ఉండేది. ఆ రెండు మూడు కిలోమీటర్లు అటు చివరి నుంచి ఇటు చివరి దాకా రెండు సార్లు తిరిగితే వేలాది మంది పరిచయస్తులూ మిత్రులూ కలిశారు. సొంత పూనిక మీద, సొంత ఖర్చుతో, అక్కడికి వెళ్లకపోతే గొప్ప అనుభవం ఒకటి పోగొట్టుకుంటామన్నంత ఆర్తితో తరలివచ్చిన వారు.

రాజకీయ గుర్తింపు కోసమో, లైవ్ టెలివిజన్‌లో కనిపించాలనే యావతోనో వేదిక మీదికి అవసరం లేనివాళ్లు కూడ ఎక్కడం, వారిని దిగమని చేసిన విజ్ఞప్తు లే సగం సమయాన్ని ఆక్రమించడం, వేదిక మీదికి రావలసిన, మాట్లాడవలసి న రాజకీయ నాయకులు రాకపోవడం, వేదిక మీద కార్యక్షికమాలు క్రమబద్ధంగా జరగకపోవడం వంటి లోపాపూన్ని ఉన్నా, వాటన్నిటినీ విస్మరించదగినంత గొప్ప స్ఫూర్తిని ఆ జనసందోహం అందించింది.

సాగరహారంలో హింస, విధ్వంసాల మీద ముందూ తర్వాతా చాల చర్చ, రచ్చ జరుగుతున్నది. కాని సాగరతీరంలో దృశ్యంవేరు. ఐదు-ఐదున్నర సమయంలో అప్పటికి గంట సేపటినుంచి వేదిక వెనుకవైపు నుంచి ఆకాశంలోకి ఎగస్తున్న పొగలు చూసి, ఉండీ ఉడిగీ వినిపిస్తున్న తుపాకి కాల్పుల శబ్దాలు విని అక్కడ ఏం జరుగుతున్నదో చూద్దామని వేదిక వెనుకవైపు వెళ్లాం. అక్కడ కనిపించినది ఒక అద్భుత దృశ్యం. 1969 జై తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులకూ సి ఆర్ పి దళాలకూ జరిగిన పిచ్‌డ్ బ్యాటిల్స్ ఎదురుబొదురు యుద్ధాల గురించి చదివి మాత్రమే ఉన్నవారికి అది కళ్ల ముందర పునరావృతమైన అద్భుత సంద ర్భం. వేదికకు యాభైగజాల వెనుకనే పోలీసులు ముళ్లకంచెల అడ్డుకట్టలు కట్టి ఉన్నారు.

ఆ ముళ్లకంచెలను తొలగించి, అక్కడి పోలీసుల లాఠీచార్జిలనూ, టియ ర్ గ్యాస్ కాల్పులనూ ఎదిరిస్తూ రాళ్లతో జవాబు చెపుతూ ప్రజలు పోలీసులను అక్కడి నుంచి దాదాపు ఒక కిలోమీటర్ అవతలి దాకా వెనక్కి నెడుతూ వెళ్లారు. పోలీసులు ఆ కోల్పోయిన స్థలాన్ని తిరిగి ఆక్రమించడానికి లాఠీచార్జిలతో, టియర్‌గ్యాస్‌తో, హింసాకాండతో మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ ఉండడం కళ్లారా చూశాను.

అక్కడ అప్పటికే తగలబడిపోయిన, తగలబడుతున్న వాహనాల దగ్గర వందలాది మంది మూగి వాటిని తమ సెల్ ఫోన్లలో చిత్రించుకుంటున్నారు. వాళ్లు వాటి ని హింసాకాండ అనో, విధ్వంసమనో అనుకోవడం లేదు. ఏదో ఒక పవిత్ర తీర్థయాత్రా స్థలానికి వచ్చినట్టు వస్తున్నారు. ఆ జనం కళ్లలోని తృప్తినీ, సంతోషా న్నీ చూస్తే వారెవ్వరూ దాన్ని హింస అనుకోవడం లేదని, తెలంగాణ ధర్మాక్షిగహ ప్రకటనకు ప్రతీక అని అనుకుంటున్నారని అర్థమయింది. అలాగే ముందుకు వెళుతుండగా అటునుంచి వందలాది మంది గుంపుగా పరుగెత్తుకువస్తూ వాటర్ క్యాన న్ల సాయంతో పోలీసులు వస్తున్నారు పరుగెత్తండి అన్నారు. వారితోపాటు నేనూ గోడ దూకి రైలు కట్టమీదికి ఎక్కాను.

ఒక ఫర్లాంగు వెనక్కి వచ్చాక హుస్సేన్ సాగర్‌లోకి వచ్చే నాలా మీద వంతెన. పట్టాల మధ్య ఒక్క మనిషి మాత్రమే నడవగల దారి. వందలాది మంది ఒకరి ఒకరు క్రమశిక్షణతో చీమలదండులా ఆ వంతెన దాటి సభవైపు వచ్చారు. అప్పటికే రైలు వంతెనకు సమాంతరంగా ఉన్న రోడ్డు వంతెనమీది దాకా జనాన్ని తరుముతూ వచ్చిన వాటర్ కానన్లు రైలు కట్టమీదికి కూడ నీటి జల్లులు కొట్టాయి. కాని ఒక్క నిమిషంలో దృశ్యం మారిపోయింది. కొన్నివందల మంది జనం ఆ వాటర్ కానన్ల మీదికి రాళ్లు విసురుతూ వాటిని బెదిరిస్తున్నట్టుగా ముందుకు కదులుతుంటే ఆ మహారాక్షస యంత్రం వెనక్కి వెనక్కి పారిపోవడం మొదలుపెట్టింది.

అంతకన్న నయనానందకర సుందర ఉజ్వల దృశ్యం మరేముంటుంది?
తర్వాత సభకు తిరిగి వస్తే కొద్ది నిమిషాల్లోనే భోరున వాన. ఇటీవలి కాలంలో ఎప్పుడూ కురవనంత పెద్ద వాన. అది కూడ ఐదో పదో నిమిషాలు కురిసి ఆగిపోయిన వాన కాదు. అయినా జనం కదలలేదు. తెలంగాణ కోసం దేన్నయినా ఎదిరిస్తాం, దేనికయినా సిద్ధపడతాం అని జనం అక్షరాలా మనోవాక్కాయకర్మలా ప్రకటించిన అద్భుత సన్నివేశం అది. ఆ వర్షం నేలనంతా బురదమయం చేయకపోతే, రాజకీయ వాదవివాదాలు అడ్డురాకపోతే పివి ఘాట్ తెహ్రీర్ స్క్వేరో, జకోటి పార్కో అయి ఉండేదా? సాగరహారం మిలియన్ మార్చ్‌తోనో ఆక్యుపై వాల్ స్ట్రీట్‌తోనో భుజం కలిపి ఉండేదా? వారాలో నెలలో కాకపోయినా కనీసం కొన్ని రోజులయినా సాగి ఉండేదా? మహా ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ సర్కా రు తాను హోస్నీ ముబారక్ కన్న, బారక్ ఒబామా కన్న అనాగరికమైనదాన్నని రుజువు చేసుకుని ఉండేదా? ఆ జరగని పని ఎలా ఉన్నా జరిగిన పని అద్భుతమైనది. సకల అవరోధాల మధ్య ఆ పని సాధించిన తెలంగాణ మహాజనానికి జేజేలు.

-ఎన్. వేణుగోపాల్

35

VENUGOPAL N

Published: Fri,January 31, 2014 12:29 AM

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆఖరిరోజు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించడానికి పార్లమెంటుకు, కేంద్రప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, నాద

Published: Fri,August 2, 2013 01:12 AM

ఆనందం, అయినా అనుమానాలు

అరవై ఏళ్ల తెలంగాణ ప్రజా ఆకాంక్ష సాకారమైంది. తెలంగాణ ప్రజలు అపూర్వమైన, అసాధారణమైన విజయం సాధించారు. 1952లో నాన్ ముల్కీ గో బ్యాక్ అ

Published: Thu,June 27, 2013 11:44 PM

రాయల తెలంగాణ: అనవసరం, అక్రమం

కాంగ్రెస్ అధిష్ఠానం మళ్లీ ఒకసారి తనకు బాగా తెలిసిన క్రీడ మొదలుపెట్టింది. ప్రజలను వంచించడం, ప్రజలు కోరినదాన్ని ఇవ్వకపోవడం, ప్రజలు

Published: Wed,October 10, 2012 06:51 PM

న్యాయాన్వేషణకే, హింసను ఆపడానికే సాగరహారం

నమస్త తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రకటనకు మరొక మహత్తర చరివూతాత్మక రూపంగా రోజురోజుకూ బలపడుతున్న సాగరహారం ఆలోచనను, జనజీవనాచరణను అడ్డుకోవ

Published: Sat,October 6, 2012 04:04 PM

రాష్ట్రపతి ఎన్నిక తెలంగాణ ప్రబోధం

రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థి నీలం సంజీవడ్డికి వోటు వెయ్యవద్దని, స్వతంత్ర అభ్యర్థి వివి గిరికి వేయమని కాంగ్

Published: Sat,October 6, 2012 04:04 PM

పెద్దకూర పండుగ రాజకీయాలు

ఆహార రాజకీయాల గురించి మాట్లాడవలసిన సమయం ఇది. ఒక వ్యక్తి తనకు ఇష్టమైన ఆహారాన్ని స్వేచ్ఛగా తినవచ్చునా లేదా అనేది రాజకీయంగా మారిపోయి

Published: Sat,October 6, 2012 04:10 PM

సమ్మె నేర్పుతున్న పాఠాలు

తెలంగాణ ప్రజల సంపూర్ణ భాగస్వామ్యంతో నలభై రెండు రోజులుగా చరివూతాత్మకంగా, విశిష్టంగా, అసాధారణంగా సకల జనుల సమ్మె జరుగుతున్నది. నాలుగు

Published: Sat,October 6, 2012 04:09 PM

సకల జనులకు నీరాజనం

సకల జనుల సమ్మెలో భాగంగా చరివూతాత్మకమైన, విశిష్టమైన, నిర్ణయాత్మకమైన పోరాటం సాగిస్తున్న తెలంగాణ కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు న

Published: Sat,October 6, 2012 04:09 PM

ధవంసమైన స్వప్నం నిర్మాణమయ్యేదెట్లా?

పది సంవత్సరాలకు పైగా అరుంధతీరాయ్ ఈ దేశపు శక్తిమంతమైన మేధో ప్రతిపక్షంగా ఉన్నారు. అంతకుముందు ‘గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ నవలతో బుకర్ ప

Published: Sat,October 6, 2012 04:08 PM

సమ్మె కర్తవ్యం ప్రతిఘటన

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో కీలక ఘట్టంగా ఈ వారంలో సకల జనుల సమ్మె ప్రారంభం కాబోతున్నది. ఆగస్ట్ మొదటి వారం నుంచీ స

Published: Sat,October 6, 2012 04:07 PM

మతి తప్పిన తలకిందుల మేధో మథనం

-ఎన్. వేణుగోపాల్ కనీసం ఈ పదిహేను సంవత్సరాలలో వెలువడిన రెండువందలకు పైగా పుస్తకాలలో ఏ ఒక్కటి చదివినా జాహ్నవికి ఈ విషయం తెలిసి

Published: Sat,October 6, 2012 04:05 PM

మరుపురాని తెలంగాణ బిడ్డ..

- ఎన్ వేణుగోపాల్ జయశంకర్ అరవై సంవత్సరాల పాటు భావజాల వ్యాప్తి, మేధో కృషి సాగించారు. మూడు దశలలోనూ ప్రజా ఉద్యమాలు వెల్లు వాటిలో పాల్