జైత్రయాత్ర కెరటం ‘కోటి’


Sat,October 6, 2012 03:23 PM

కో టన్న ఎమ్జన్సీ చీకటి రోజుల్లో తన ఇంటికన్నా ఎక్కువగా బంధువుల ఇళ్లనూ, మిత్రుల ఇళ్లనూ, వారి మిత్రుల ఇళ్లనూ తనకూ, తన తోటి రహస్యపార్టీ కార్యకర్తలకూ షెల్టర్‌గానే కాకుండా బంధుమివూతుల నుంచి ఆర్థిక సహాయం కూడా పొంది, సమర్థవంతమైన కమ్యూనిస్టు ఆర్గనైజర్‌గా నిరూపించుకున్నారు. వేములవాడ స్వాతంత్య్ర సమరయోధుడైన గుమ్మి పుల్లయ్య-రుక్కమ్మ మాటల్లో‘కోటన్న మరణం మా స్వంత కొడుకును కోల్పోయినంత బాధగా వుంది. కచ్చితంగా బూటకపు ఎన్‌కౌంటర్ చేసి వుంటారు’అని బాధపడ్డారు.ఎమ్జన్సీ చీకటి రోజుల్లో గిరాయిపల్లి అడవుల్లో నలుగురు విద్యార్థి నాయకులను (సూరపనేని జనార్దన్, మురళీమోహన్, ఆనందరావు, సుధాకర్) పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌లో కాల్చిచంపారు. గూడా అంజయ్యతోపాటు కరీంనగర్‌లో నారదాసు లక్ష్మణరావు (చిన్న లక్ష్మణరావుపస్తు త ఎమ్మెల్సీ)ను ఎమ్జన్సీలో అరెస్టు చేసి చిత్రహింసల పాలుచేశారు. ఈ ఫాసిస్టు పోలీసుచర్యలు యువతలో బాగా ప్రచారమయ్యాయి. తీవ్రమైన భయోత్పాతాన్నీ సృష్టించాయి. కానీ కోటన్న ఆ యువతనే ఆధారం చేసుకొని కార్యకలాపాలు కొనసాగిస్తూ జిల్లాలోని పలువూపాంతాల రైతాంగంతో విప్లవ సంబంధాలను ఏర్పర్చుకోవడానికి ఎంతో శ్రమపడ్డారు. అతివాద పంథా నుంచి పార్టీని విప్లవపంథాలోకి తీసుకరావడానికి ఆంధ్రవూపదేశ్ విప్లవ పార్టీ నాయకత్వం ఆ ఎమ్జన్సీ పరిస్థితులలోనే చేసిన ప్రయత్నాల్లో భాగంగా 1976 చివర్లో నాగపూర్‌లో జరిగిన తెలంగాణ ప్రాంతీయ కాన్ఫన్స్ ఒక మలుపు లాంటిది. ఆ కాన్ఫన్స్‌కు హాజరైన అతికొద్దిమంది పార్టీ కార్యకర్తల్లో కోట న్న ఒకరు. ఆ కాన్ఫన్స్ ఆమోదించిన ‘విప్లవానికి బాట’ (వ్యూహం- ఎత్తుగడలు) డాక్యుమెంట్ పార్టీ కార్యకర్తల్లో బోల్షివిక్ స్ఫూర్తిని నింపింది. ఆ మోటివేషన్‌తో జిల్లా రైతాంగంలో పని చేయడానికి వెళ్లినవాళ్లలో అమరుడు కంది లచ్చిడ్డి (కాచాపురం), కోటన్నలు సిరిసిల్లా ప్రాంతానికీ వెళ్లారు. ఒకరు నిమ్మపల్లి ప్రాంతాన్ని, మరొకరు మరిగడ్డ ప్రాంతాన్నీ కేంద్రం చేసుకొని విప్లవ కార్యకలాపాలు ప్రారంభించారు. కోటన్న తక్కువ కాలంలోనే పోలీసులకు పట్టుపడ్డాడు. ఆయన అరెస్టు, ఎమ్జన్సీ ఎత్తివేత ఏకకాలంలోనే జరిగి ఆయనకు ప్రాణాపాయం తప్పింది. వరంగల్ కేంద్ర కారాగారంలో దాదాపు మూడు నెలలు గడిపి వచ్చేసరికి బయటి వాతావరణంలో పెద్ద మార్పులే చోటు చేసుకున్నాయి. జైళ్లోనూ ఖైదీల హక్కుల కోసం పెద్ద పోరాటమే జరిగింది. జైళ్లో ముప్పాళ లక్ష్మణరావు, కోటేశ్వర్లు, మల్లా రాజిడ్డి సహా మరెందరో జైలు పోరాటాలకు నాయకత్వం వహించి తమ న్యాయమైన డిమాండ్లు సాధించుకున్నారు. ఈ పరంపర ఈనాటికీ ఆంధ్రవూపదేశ్ జైళ్లలో కొనసాగుతున్నది. ‘జైళ్లను కూడా విప్లవ పాఠశాలలుగా మలచాల’ని లెనిన్ చెప్పిన విషయాన్ని కోటన్న అక్షరాల ఆచరించారు.

జైలునుంచి విడుదలైన కోటన్న మారిన పరిస్థితుల్లో మరింత ఉన్నతమైన బాధ్యతల తో జిల్లా వ్యాప్త విప్లవ కార్యక్షికమాల్లో పూర్తిగా మునిగిపోయాడు. జిల్లాలో ఒకవైపు సీపీ రెడ్డి వాళ్లకు సిరిసిల్లా, మరో వైపు ‘కేఎస్’కు జగిత్యాల కేంద్రాలుగా మారినప్పటికీ రెండు వూపాంతాల్లో రెండు పార్టీలకూ మిత్ర సంబంధాలే ఉండేవి. సిరిసిల్లా తాలూకాలోని మానా ల అటవీ ప్రాంత ఆర్గనైజర్‌గా వెళ్లిన కంది లచ్చిడ్డి 197లో బస్సు దుర్ఘటనలో మరణించగా ఆయన వెంట ప్రయాణిస్తున్న కోటన్న సహచరుడి శవాన్ని ఆయన స్వగ్రామం కాచాపురం తరలించి విప్లవ సంప్రదాయాలతో అంత్యక్షికియలు పూర్తి చేశాడు. అలా జరపడం తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత బహుశా తొలి ఘటన అయి వుంటుంది. ఎమ్జన్సీ ఎత్తివేసిన తర్వాత జగిత్యాల ప్రాంతంలో ఉద్యమం ఊపందుకుంది. జిల్లా వ్యాప్తంగా రైతాంగం సంఘటితం కాసాగింది. ఆ సంఘటిత రైతాంగం ఉప్పెనవలె తరలి వచ్చి జరుపుకున్నదే జగిత్యాల జైత్రయాత్ర. జిల్లా పార్టీ నాయకత్వం ముందుండి ఆ సభ ను నడిపించింది. అప్పటికీ జననాట్యమండలి సాంస్కృతిక కార్యక్షికమాల్లో వీధి బాగోతం మంచి గుర్తింపు పొందింది. పాముల రాంచందర్, అల్లం నారాయణ పట్వారి వేషం కడితే, మల్లా రాజిడ్డి భూస్వామిగా పాత్ర పోషిస్తే..ఎంతో రక్తిక జగిత్యాల సభలో అల్లం నారాయణ పట్వారిగా, రాజిడ్డి భూస్వామిగా పాత్రలు పోషించి రైతాంగం మనసులపై చెరగని ముద్రవేశారు. కోటన్న, ముప్పాళ లక్ష్మణరావు, సాయిని ప్రభాకర్ తదితర వక్తలు జగిత్యాల రైతాంగ పోరాటాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలని పిలుపు నిచ్చారు. ఎమ్జన్సీ ఎత్తివేసిన తర్వాత పార్టీ చేపట్టిన విప్లవ ప్రజాసంఘాల బహిరంగ కార్యక్షికమాలలో అంత పెద్ద ఎత్తున రైతాంగాన్ని సమీకరించింది బహుశా ఆనాటికి అదేనేమో. ఆ తర్వాత కరీంనగర్- ఆదిలాబాద్ జిల్లాల్లో రైతాంగ ఉద్యమాలు మరింత ఊపందుకున్నాయి. ఆదిలాబాద్‌లో పొరకల సార్లుగా పార్టీ కార్యకర్తలు గుర్తింపు పొంది తే, కరీంనగర్ జిల్లాలో అన్నలుగా, సార్లుగా గుర్తింపు పొందారు. పల్లె పల్లెన రైతాంగ పోరాటాలు పల్లె దొరలకు ‘అగ్గి-నీళ్లు’ బందన్నాయి. పల్లె మంట పది పల్లెలకు అంటిం ది. 197లో ప్రారంభమైన ‘గ్రామాలకు తరలండి’ విద్యార్థుల వేసవి క్యాంపెయిన్‌లకు వారి పోరాటాలు ప్రాణవాయువులా పనిచేశాయి. ఆనాటి విద్యార్థి యువజనులకు సాయిని ప్రభాకర్,

కోటన్నలు పెద్ద ఆకర్షణ. రోల్‌మోడల్
జిల్లాలో పెంపొందుతున్న రైతాంగ ఉద్యమానికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా విప్లవ మేధావులు, ప్రజాస్వామికవాదులు, రచయితలు, కళాకారులు, వకీళ్లు చెప్పుకోదగిన పాత్ర పోషించారు. జననాట్యమండలి కార్యక్షికమాలు ప్రజానీకాన్ని ఊర్రూతలూగించేవి. జిల్లాకు చెందిన అల్లం సోదరుల పాటలు, కథలు, నవలలు ఆనాటి ఉద్యమానికి అద్దం పట్టేవి. ఆదిలాబాద్‌లో సుధ పాటలు శ్రోతలను లోతుగా ఆలోచింపజేసేవి. జననాట్యమండలితో పాటు స్థానికంగా అనేక పాటల పుస్తకాలను జిల్లాలో ప్రచురించారు. పెద్దపెల్లి ప్రెస్‌లో మూడొంతుల ‘అచ్చు’ పనులు విప్లవ సాహిత్యానికి చెందినవి కోటన్న ఆధ్వర్యంలో సాగాయి. వేలాదిమంది విప్లవ ప్రజానీకం పాల్గొన్న ఆయన అంతిమయాత్రలో అన్ని కులాలు, మతాలు, వర్గాలకు చెందినవాళ్లు ఉండడం, ఆయన ప్రజల మనిషిగా వెలుగొందాడనడానికి నిదర్శనంగా నిలుస్తుంది.

190లో ఆంధ్రవూపదేశ్‌లో ఏర్పడిన సీపీఐ(ఎం.ఎల్) పీపుల్స్‌వార్‌కు ఆయన తొలి కార్యదర్శిగా 26 ఏళ్ల వయసులోనే ఎన్నిక కావడం విశేషం. ఆయనకు ఆ గౌరవాన్ని తెచ్చిపెట్టింది కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల రైతాంగ ఉద్యమమేనని ఆయనకు తెలుసు. ఆయనను ఎన్నుకున్న వాళ్లకూ తెలుసు. అప్పటికీ ‘గంగదాటి ఎలిపోయె చెల్లెమ్మా-కంట నీరెట్టకే చెల్లెమ్మా’ శివసాగరుడి కలం నుంచి పరిస్థితులను ఎత్తిపడుతూ పాట వచ్చింది. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంత రైతాంగం పోలీస్ నిర్బంధాన్ని తట్టుకోలేక గోదావరి (తెలంగాణ పల్లెల్లో దీన్ని గంగ అంటారు )దాటి ఆదిలాబాద్ వెళ్లడాన్ని పాటలో చెప్పుతూ, ఉన్నతస్థాయి యుద్ధానికి తయారు కావాలని రైతాంగాన్ని కోరడం ఆ నాటి నిర్ణయాన్ని సాహితీకరించడమే. అప్పటికే అల్లం రాజయ్య కొలిమిమంటుకుంది వెలుగు చూసింది. ‘పల్లె- పల్లెన పోరుబాట ఎర్రనీ శ్రీకాకుళాలు, నాడు అక్కడ రగిలి- రగిలి నేడు ఇక్క డ మండుతున్నవి.’ అని ఒక కలం గానం చేస్తే, ‘పప్లూపూట్లా కదులుతున్నయంటే, సిరిసిల్లా- జగిత్యాల-చిన్న మెట్‌పల్లి, లొత్తునూర్-మద్దునూర్-పండితపురం-పైడిపల్లి-షాకిళ్ల మరెన్నో’ అంటూ అల్లం వీర య్య పల్లె పోరాటాలను పదిలపరిచారు. దొరలతో పందెం కాసిన పల్లె జనం, దొరల గడీలకూ- గుండాలకూ నెత్తుర్లు ధారపోసిన పోశెట్టి- లక్ష్మీరాజంలు ఒకవైపు, మరోవైపు రాజ్యం కొత్తగా ప్రకటించిన సిరిసిల్లా-జగిత్యాల కల్లోలిత ప్రాంతాలు; అలాగే గోపి రాజన్న లాంటి వాళ్లను హత్య చేసి, బాలగోపాల్‌పై చేయి చేసుకున్న కాషాయగూండాగిరి, పోలీసు నల్లదండు (రష్యా విప్లవోద్యమంలోని బ్లాక్ హండ్రెడ్స్‌ను పోలిన ఈ పేరును నేను మొదట విన్నది కోటన్న ద్వారానే) దుశ్చర్యలు పెరిగి పోయాయి. ఈ పరిస్థితిల్లో కరీంనగర్- ఆదిలాబాద్ జిల్లాల ఉద్యమాన్ని మరో మెట్టు ముందుకు తీసుకు వెళ్లకుండా నిలబెట్టుకోలేమని యావత్తు పార్టీ గ్రహించి కాన్ఫన్స్‌లో ఆ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ అక్కడక్కడ భిన్న చర్చలు వినవచ్చేవి.

తెలంగాణ పల్లెల్లో భూస్వామ్యంతో తలపడిన పార్టీ, తుపాకులు వదలకుండానే ‘సాయుధ పోరాట విరమణ’ ప్రకటించి (1977 ఆగస్టు తీర్మానం)పార్టీ రాజ్యంతో తలపడతతడానికి తయారవ్యాలి. ఇది మినహా భారత నూతన ప్రజాతంత్ర విప్లవ పురోగమనానికి మరో దగ్గరి దారి ఏది లేకుండింది. అదే సరైందనీ గత ముప్ఫైయేళ్ల విప్లవాచరణ నిరూపించింది. రాజ్యంతో తలపడడం అంటే విప్లవ క్యాంపులో పెద్ద చర్చే జరిగింది. బలహీనమైన విప్లవ శక్తులకు బలపరీక్షగా ఆ నిర్ణయం ముందుకొచ్చింది. వ్యవస్థాగత స్వాభావిక లక్షణాలపై వారు మల్లగుల్లాలు పడ్డారు. రాజ్యంతో తలపడాలంటే దండకారణ్యానికి దండుగట్టాలని నిర్ణయమైంది. నిర్ణయం అమలులో భాగంగా ఒక సెక్షన్ కామ్రేడ్స్ తమ అసమర్థతకు నిజాయితీగానే ప్రకటిస్తూ క్రియాశీల విప్లవోద్యమానికి దూరమమయ్యారు. నేను అప్పటికి ఒక రకంగా అవుట్ సైడర్‌గానే ఉండి కోటన్న ద్వారా ఆయన సహచరుల ద్వారా వింటూ ఉండిన రిపోర్టులివి. కిషన్‌జీ అంతిమ యాత్ర లో చాలా మంది పాల్గొని తమ గౌరవవూపదమైన, ప్రియమైన నాయకుడికి అశ్రు నివాళులు అర్పించి ఆయనతో గడిపిన రోజులను గుర్తుచేసుకున్నారు.

-మల్లోజుల వేణుగోపాల్
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు
(మిగతా...రేపు)

35

VENUGOPAL MALLOJULA

Published: Sat,October 6, 2012 03:21 PM

అదే చివరి వీడుకోలు..

అల్లుకున్న ‘కోటి’ జ్ఞాపకాలు-6 కిషన్‌జీ ప్రపంచానికి పరిచయం చేసింది లాల్‌గఢ్. ఆ లాల్‌గఢ్ ఉద్యమాన్ని ప్రపంచం ముందుంచడానికి ఆయన మ

Published: Sat,October 6, 2012 03:21 PM

అందరినీ వెన్ను తట్టిన ‘అన్న’

అల్లుకున్న ‘కోటి’ జ్ఞాపకాలు-5 రాం జీ నక్సల్‌బరీకి పుట్టినిల్లయిన పశ్చిమబెంగాల్‌ను కేంద్రం చేసుకొని విప్లవ కారుల ఐక్యతకు చాలా కృష

Published: Sat,October 6, 2012 03:22 PM

ప్రజాసైన్యాన్ని నిర్మించిన సేనాని

అల్లుకున్న ‘కోటి’ జ్ఞాపకాలు-4 కిషన్‌జీ తన స్వప్నం‘దండకారణ్యాన్ని విముక్తి ప్రాంతంగా’ చేయడమేనని చెప్పుకున్నారు. ఇందుకోసం ఆయన 196-9

Published: Sat,October 6, 2012 03:22 PM

ఫలించిన ప్రహ్లాద్ స్వప్నం...

అల్లుకున్న ‘కోటి’ జ్ఞాపకాలు-3 1977-80 మధ్య కిషన్ జీ (అప్పడప్పుడే ప్రహ్లాదయ్యాడు) చాలా కాలంగా లీగల్‌గా, మరికొంత కాలం సెమీ-లీగల్‌గా

Published: Sat,October 6, 2012 03:23 PM

అల్లుకున్న ‘కోటి’ జ్ఞాపకాలు

కిషన్‌జీ జ్ఞాపకాలు 2011 నవంబర్ 24 నుంచి ఇప్పటివరకూ నిరంతరం నాస్మృతిపథంలో మెదులుతూనే ఉన్నాయి. 54 సంవత్సరాల నా జీవితం ఆయన నుంచి ఒక్