గుండె తెలంగాణ ‘గొంతుకలోన కొట్టాడుతున్నది’


Sun,April 7, 2013 11:13 AM

గుండెబోయిన శ్రీనివాస్ స్వశిక్షితుడో, సుశిక్షితుడో గానీ అతనిలో మంచి కాలమి స్టు లక్షణాలున్నాయి. కాలమిస్టు అంటే పత్రికల్లో ‘కప్పెంతో కాలంత చాపే’ సంయమనం పాటించే పత్రికా రచయిత అని మాత్రమే కాదు, స్పృహ, చైతన్యంగల పత్రికారచయిత అద్దం లో కొండను చూపగల విశ్లేషకుడయి ఉండాలి. దృక్పథం ఉండాలి. విషయ పరిజ్ఞానం ఉండాలి. వ్యక్తీకరణ సామర్థ్యం ఉండాలి. సాహసం ఉండా లి.
శ్రీనివాస్‌కు చంద్రబాబునాయుడు గురించి చాలా స్పష్టమైన, సరియైన అవగాహన ఉంది. అతడు సామ్రాజ్యవాద దళారీ, ప్రపంచబ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని తెలుసు. మొదటిమాట ఆయన వాడకపోయినప్పటికీ ఈ వ్యాసాలు చదివితే మనకా అభివూపాయం కలుగుతుంది. అప్పటికే మనకా అభివూపాయం ఉంటే ఇతడూ మనవపూనే ఆలోచిస్తున్నాడు అని సంతృప్తి కలుగుతుంది. తెలంగాణ వస్తే చాలు, ఎవరు వస్తే ఏమిటి? ఎట్లా వస్తేనేమిటి అనుకునే తెలంగాణ దేశభక్తులకు, దేశమంటే ప్రజలనుకునే గుండెబోయిన శ్రీనివాస్‌కు కూడా ఒక మంచి తేడా ఉన్నది. అది ఈ వ్యాసాల్లో పరచుకున్నట్లుగా తెలంగాణ అంటే భౌగోళిక తెలంగాణ కాదు. భౌగోళికమే కానీ ఈ భూమితో సహా ఈ భూమి మీద, భూగర్భంలో నదులు, కొండలు, అడవులు, ఖనిజాలు ఉన్నా యి. అవి ప్రజలవి. అవి విధ్వంసమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం అవి కాపాడుకునే స్వావలంబన పోరాటం కావాలని శ్రీనివాస్ స్పష్టంగా రాశాడు.

మన ప్రజాస్వామ్యం ఎంత ప్రహసనంగా మారిందంటే ప్రజలకు కావల్సింది ప్రజ లు తెచ్చుకుంటారు. ఇచ్చుకుంటారు అని కాదు. ప్రజలకోసం తెచ్చేవాళ్లు, ఇచ్చేవాళ్ళు ఉన్నారని. ఆ సంరక్షకుని పని కాంగ్రెస్ చేస్తుందని కాంగ్రెస్ నాయకులు చెప్తారు. ‘చిన్న రాష్ట్రాల విషయంలో గతంలో మేమే చేశాం. తెలంగాణ విషయంలో మేమే చేస్తాం’ అని చెప్తుంది బిజెపి. ఈ బిజెపి ‘ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు’ అనే కాకినాడ తీర్మానంలో దాగిన రహస్యాన్ని, కుట్రను శ్రీనివాస్ ‘ఒక్క ఓటు రెండు నాల్కల ధోరణి’ని మొత్తం వ్యాసాల్లో సోపపత్తికంగా (ఉదాహరణలతో) బట్టబయలు చేశాడు. బిజెపి పట్ల ఏమాత్రం భ్రమలు లేని ఈ ధోరణి, బిజెపి అవకాశవాదాన్ని స్పష్టంగా ఆకళింపు చేసుకున్న ఈ ధోరణి తెలంగాణవాదుల్లో రానురాను అరుదయిపోతున్నది. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు ఒకే మాట మాట్లాడారు-మాట్లాడుతున్నారు అని చాలా వ్యంగ్యంగా అద్వానీ మొదలు కిషన్‌డ్డి దాకా బిజెపిలో ఉన్న అవకాశవాద ధోరణి గురించి శ్రీనివాస్ వాళ్ల మనసులో దూరి విశ్లేషణ చేసినంత అద్భుతంగా చెప్పాడు. ఈ అవకాశవాద ధోరణి వెనుక ఉన్న తాత్విక ధోరణి ఏమిటి? అది హిందుత్వ బ్రాహ్మణీయ భావజాలం.

ఈనాటి సందర్భంలో అది దళారీ వ్యాపార సంస్కృతి. గణేశ్ ఉత్సవాలు మొదలు ప్రతి హిందువుల పండుగలో అది వ్యక్తమవుతున్నది. అది ఫాసిజం. బిజెపి తెలంగాణవాదం-విమోచనవాదం- ముస్లింల నుంచి విమోచనవాదం. కేవలం ఢిల్లీ నుంచి, ఆంధ్ర పాలన నుంచి కాదు. ఆనాడు పటేల్ తెలంగాణను కమ్యూనిస్టుల నుంచి, ముస్లింల పాలన నుంచి ‘విముక్తం’ చేసినట్లుగా ఇవ్వాళ ముస్లింలను మినహాయించిన హిందూ తెలంగాణ కావాలి వాళ్లకు. తెలంగాణపై సైనిక దురాక్షికమణను వాళ్లు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆమోదం చాటున ‘విమోచన దినం’గా అట్టహాసంగా జరుపుకుంటున్నారు. అందుకు తెరాస మొదలు సిపిఐ వరకు వంతపాడుతున్నా యి. వాళ్లు రజాకార్లు చంపిన షోయబుల్లాఖాన్ విగ్రహాలు పెట్టి, సంస్మరించుకొని సిపిఐ మొదలు విప్లవపార్టీలను కూడా పిలుస్తారు (వీళ్లు పొలోమని పోతారు) కానీ నిజంగా తెలంగాణపై ప్రేమ గల వారయితే బందగీ, మగ్దూమ్‌లను కూడా ఎందుకు తలవరు అని అడగరు. తెలంగాణ సంస్కృతి పేరుతో బిజెపి మొదలు తెరాస వరకు, విమర్శనాత్మక విశ్లేషణలేని తెలంగాణవాదుల వరకు నెత్తికెత్తుకుంటున్నది హిందూ బ్రాహ్మణీయ సంస్కృతి కాదా? బిజెపి తెలంగాణ కోసం నిస్వార్థంగా పోరాడుతుందా? బిజెపి అధికారానికి వస్తే తెలంగాణ ఇస్తుందా అనే దానికన్నా అది ఎటువంటి తెలంగాణ అనేది మనం మహబూబ్‌నగర్ ఉప ఎన్నికల్లో చూశాం. తెలంగాణ మోడీ కిషన్‌డ్డి ఉపన్యాసాల్లో చూశాం. మనకు గుజరాత్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ వంటి మారణకాండ తెలంగాణ కావాలా?
తెలంగాణ దక్కన్ పీఠభూమి గదా. ఇక్కడ సముద్రం ఎక్కడుంది? హైదరాబాదు నడిబొడ్డున, చుట్టూ ఉన్నాయి. కాదు ఉండేవి! హుస్సేన్‌సాగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ (గండిపేట), మీరాలం చెరువు మొదలైనవి. నిజమే కాని ఇవ్వాళ ఏవి? హుస్సేన్ సాగర్‌ను దిగ్బంధం చేసి, హుస్సేన్ సాగర్ తూములపై వైస్రాయి హోటల్ కట్టి, దాని నోరు కట్టేసి, బాహువులు కత్తిరించి నెక్లెస్ రోడ్ నిర్మాణం చేసి చుట్టూ ఉండే కొండలమీంచి హుస్సేన్‌సాగర్‌లోకి జలధారలు రాకుండా సిమెంట్ ఏమి మిగిల్చారని హుస్సేన్‌సాగరాన్ని. ట్యాంక్‌బండ్ మిగిల్చారనుకున్నా దాని మీద కాటన్‌దొర వలసపాలనను, ఎన్టీఆర్ ఆకృతిగల ప్రభువుల పాలనను మిగిల్చారు. ‘మిలియన్ మార్చ్’కు కోపం వస్తే రాపిడ్ యాక్షన్ ఫోర్స్ పేల్చే బాష్పగోళీల కన్నీళ్లు మిగిల్చారు. కనుక దక్కన్ పీఠభూమి మీద, తెలంగాణ గడ్డమీద సాగరహారం ఏమిటి? అని ఆశ్చర్యపోయాను. అప్పుడనిపించింది. అవునుగదా! శ్రీనివాస్ అన్నట్లే ఇంకా పాదాల కింద నిలబడి పోరాడడానికి నేల మిగలకపోతే, ప్రవాసం నుంచైనా పోరాడాల్సిందే కదా! నర్మదా డ్యాం కింద, కూడంకుళం అణువిద్యుత్ కేంద్రం కింద విధ్వంసమవుతున్న ఆదివాసులు, మత్స్యకారులు నీళ్లలో కాళ్ళూ, చేతులు పుళ్లయి, కుతుక బంటిగా రోజుల తరబడి మునిగి తేలుతూ పోరాడుతున్నట్లు తెలంగాణ ప్రజలు సాగరహారమై పోరాడాల్సిందే కదా! పాలస్తీనా పోరాటమంటే అది మరి. అరవై ఏళ్లుగా తాము కోల్పోయిన తమ మాతృభూమిలో పాదాల కింద నేల లేకుండా వాళ్లు ఇజ్రాయిల్ జియోనిస్టు దళారీలతోనూ, వాళ్లకు అండగా నిలిచిన అమెరికన్ సామ్రాజ్యవాదంతోనూ పోరాడుతున్నారు. తెలంగాణ పోరాటం అటువంటిదే.

అమరుడు శాకమూరి అప్పారావు సంస్మరణ సందర్భంగా ఖానాపురం వెళ్తూ శ్రీనివాస్ రాసినట్లుగా వెంకవూటామా టాకీసు దాటిన తర్వాత కుడివైపు చూడడానికి భయపడ్డాను. చూస్తే మాత్రం ఏముంది. ఏవో ఎత్తైన ఆటంకాలు పెట్టారు. ఆ వెనుక ఏ విధ్వంస మాల్స్ నిర్మాణం జరుగుతున్నదో.! ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారం రాజకీయనాయకుల కనుసన్నల్లో కొనసాగుతున్నదో! ఇప్పుడింక మిల్స్ ఎక్కడివి? అన్నీ మాల్సే. ఆజంజాహీ మిల్స్ నుంచి వాల్‌మార్ట్ దాకా మనం ఫ్యూడల్ రాచరిక పాలన నుంచి సామ్రాజ్యవాద దళారీ పాలనలోకి పురోగమించినట్లా? మన చేతిలోని దారమే కాదు, మన పాదాలకింద నేలను కూడా కోల్పోయి నిర్వాసితులమైనట్లా? తెలంగాణ వస్తే మనకు, అంటే ఉపాధి కోల్పోయిన కార్మికులకు, ప్రజలకు పునరావాసం వస్తుం దా? ఇప్పటికింకా ఎడమవైపు తోట మిగిలినట్లున్నది. అక్కడ కూడా చెట్ల స్థానంలో ఏ చేటు రాబోతున్నదో. మనుషులు, ప్రకృతి సహజీవనం చేసే శ్రమైక జీవన సందేశాన్ని వినిపించే భవిష్యదాకాంక్షగా తెలంగాణ తిరిగి వస్తుందా? వస్తుందనే ఆశిద్దాం.

-వరవరరావు
(నవంబర్ 25 ఆదివారం హన్మకొండలో గుండెబోయిన శ్రీనివాస్‌రాసిన ‘ఆకాంక్ష’ ఆవిష్కరణ సందర్భంగా.., ఆ సంకలనానికి వి.వి.రాసిన ముందుమాటలోని కొంత భాగం)

37

VARAVARA RAO

Published: Wed,April 10, 2013 10:31 PM

నుస్రుత్ మొహియుద్దీన్ కోసం.. అల్విదా సాథీ

మూసీనదిలో నీళ్లున్న రోజుల్లో ఆ నది మీద ఇన్ని వంతెనలు లేవు. ప్రేమ ఉన్నచోట జీమూత అంధకారంలోను, వరద బీభత్సంలోను ఎదురీది దాటిన నది. స్న

Published: Sun,April 7, 2013 12:04 PM

తెలంగాణ నాగేటి చాళ్లల్లో ..

బురద పొలం కాని,చెలక కాని ఒకసారి అడ్డంగా,మరొకసారి నిలువుగా దున్నడాన్ని ’ఇరువాలు’ అంటాము. అంటే రెండుసార్లు అని అర్థం. బురద పొలంలో ఇర

Published: Sun,April 7, 2013 10:21 AM

ఆళ్వారు -తెలంగాణ జీవనం

ఆళ్వారు ఏదో ఒక మనిషి పేరు కాదు, అదో విధానము. విధానమంటే ఏదో ఒక కార్యవిధానము కాదు. అదొక జీవన విధానము’ అన్నాడు వట్టికోట ఆళ్వారు స్వామ

Published: Sun,April 7, 2013 08:19 AM

జయశంకర్‌తో వొడవని ముచ్చటే

జూన్ 27 బుధవారం ‘చెలిమె’లో జయశంకర్ గారి ‘వొడవని ముచ్చట’ పై సమీక్ష రాస్తూ డాక్టర్ కాసుల లింగాడ్డి నా ప్రస్తావన తెచ్చి నా మీద బాధ్యత

Published: Sun,April 7, 2013 08:13 AM

కత్తి వ్యాసానికి వీవీ వివరణ

శివసాగర్ గురించి, గద్దర్ గురించి రాసిన సందర్భాలలో కత్తి పద్మారావు నాగురించి, విరసం గురించి తనకు తోచిన రీతిలో నిందాపూర్వక ఆరోపణలు చ

Published: Sat,April 6, 2013 08:04 PM

‘మట్టి మనిషి’ జ్ఞాపకం

తెలంగాణ వైతాళికులలో ఒకరు పొట్లపల్లి రామారావుగారు (1917-2001) చనిపోయినపుడు 2001 సెప్టెంబర్ 10న ప్రజాతంవూతలో రాసిన వ్యాసం యిది. దాదా