విప్లవ స్వాప్నికుడు ‘అలిశెట్టి’


Sat,October 6, 2012 03:34 PM

47470-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaఈసారి 2011 సెప్టెంబర్ 29న కామ్రేడ్ సూర్యం సంస్మరణ సభ గుంటూరులో అపూర్వంగా జరిగింది. నేను వెళ్లాల్సింది. ఆ సభ జరుపుతామని తెలిసినప్పటి నుంచి సూర్యంతో పాటు నిరంతరం నా స్మృతుల్లో మెదిలిన వ్యక్తి కామ్రేడ్ అలిశెట్టి ప్రభాకర్. సూర్యం అంటే చింత ల వెంకటస్వామి. గుంటూరులో లారీ డ్రైవర్‌గా జీవితాన్ని ప్రారంభించి విప్లవోద్యమంలోకి ఆకర్షింపబడి, క్రమంగా పీపుల్స్‌వార్‌లో రాష్ట్రస్థాయికి ఎదిగి, కామ్రేడ్ పులి అంజయ్యతో పాటు కార్యదర్శి వర్గ సభ్యుడై 94 సెప్టెంబర్ 29న పద్మతో పాటు ఎన్‌కౌంటర్ అయిన అమరుడు.

సూర్యం 89లో జైలు నుంచి విడుదలైన దగ్గరి నుంచి అజ్ఞాత జీవితానికి మళ్లీ తిరిగి వెళ్ళేదాక, హైదరాబాద్‌లోను, తాను ఎక్కడ ఉన్నా.. అలిశెట్టి ప్రభాకర్‌తో అవిభాజ్యమైన స్నేహం ఏర్పాటు చేసుకొని ఆయనను బతికించుకోవాలని ప్రయ త్నం చేసిన సహృదయ సాహిత్య కళా ప్రేమికుడు. అంతకు ముందు అలిశెట్టి ప్రభాకర్‌తో పరిచయం లేదు. కానీ కవిత్వంతో పరిచయం వుంది. ఆ పరిచయమే విడుదలై కాగానే ఆయనను ప్రభాకర్ దగ్గరికి తీసుకెళ్లింది. ప్రభాకర్ అప్పటికే మృత్యువును సమీపిస్తున్నాడు. ఆయనలో క్షయ ముదిరిందని, ఆయనను బతికించుకోవాల ని, ఆయనను బతికించుకోవడమనేది కేవలం మనిషిగా బతికించుకోవడం కాదు, ఆయనను విప్లవోద్యమంలో భాగంగా బతికించుకోవాలని, మళ్లీ విప్లవ సాహిత్య సాంస్కృతిక ఉద్యమంలోకి తీసుకు రావాలని కలలు కన్నవాడు సూర్యం. అందుకనే వరంగల్‌లో ఆయన నాయకత్వంలో జరిగిన రైతుకూలీ సభల్లో అలిశెట్టితో ఫోటోలు తీయించాడు. ఆయన ఆరోగ్యం కోసం పార్టీ తరఫున, విప్లవోద్యమం తరఫున చేయగలిగినంత చేశాడు. ప్రభాకర్ ఒక్క సూర్యం సంస్మరణ సభ సందర్భంగానే గుర్తు వచ్చాడా.., ప్రభాకర్ గుర్తుకు రాని రోజు అంటూ ఉంటుందా.!

ప్రభాకర్ ఆరోగ్యం బాగాలేదని హైదరాబాద్‌లో ఉన్న మిత్రులు ఆయన ఆరోగ్యం బాగు చేయించాలని ప్రయత్నం చేస్తున్నారని.. విప్లవోద్యమంలో ఉన్న ఆయన జగిత్యాల మిత్రుడు ముప్పాళ్ల లక్ష్మణరావు (మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి గణపతి)కు తెలిసినపుడు.. ‘ప్రభాకర్ ఆరోగ్యం బాగు చేయాడానికి, బాగు కావడానికి ఇంత దూరంలో అజ్ఞాతంలో ఉన్న నేను ఏ సహాయం చేయగలను. నేను ఆయనకు ఏమి ఇవ్వగలను. ఇక్కడ నాదంటూ ఏమున్నదని ఆయనకు ఏమి ఇవ్వగలను. నాకు ‘టీ’ కొరకు దొరికేటటువంటి ‘అల ఆయన మందులు కొనుక్కోవడానికి ఉపయోగపడితే పంపించే ఆలోచన చేయవచ్చును. గాని అవి ఆయనకు చేర్చడం ఏలా’? అని ఆవేదన చెందుతూ గణపతి ఉత్తరం రాశాడు. నిజానికి హైదరాబాదు ఛెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ భాస్కర్‌రావు గారు అలిశెట్టి ప్రభాకర్ చిత్రాలతో, కవిత్వంతో ఆకర్షితుడై ఆయనకు ప్రాణ స్నేహితుడుగా మారిన తర్వాత, వాస్తవానికి ఆయన ఆరోగ్య చికిత్స విషయంలో గానీ, మందుల విషయంలో గానీ సమస్య రాలేదు.

ఇవన్నీ ..ఆయన అనంతపురం సానిటోరియంలో చేరిన తర్వాత ఉండటానికి నిరాకరించి, చేర్చిన వారంలోనే తిరిగి వచ్చిన తర్వాత.. తీసుకున్నటువంటి, చేసినటువంటి ఏర్పాట్లు. ఆయన అనంతగిరి సానిటోరియంలోఉండలేకపోతున్నడంటే, వికారాబాదులో ఉన్నటువంటి దేవకి శంకరయ్యలు తమ ఇంట్లో పెట్టుకుంటామని, ఆయనకు ఇష్టం అయినప్పుడే సానిటోరియానికి తీసుకవచ్చి చూపెడతామని లేదా ఆయన సానిటోరియంలో ఉంటే తాము కూడా అక్కడ ఆయనతో పాటు ఉండి ఆయనకు సేవలు చేస్తామని.. శంకరయ్య గారు అయితే.. రోజూ ఆయన ఇంటి చుట్టూ తిరిగి బతిలాడి, బామాలాడు. ప్రభాకర్ స్వభావం ఒకచోట ఉండేది కాదు.

అలలు ఎలా నిరంత రం ఎంత చలనంలో ఉంటాయో.. అలిశెట్టి ప్రభాకర్ అంతటి చలనంలో ఉండేవాడు. నిజానికి ఆయనను తినేసింది నగరం. అప్పటికి ఆయన జగిత్యాల నుండి కరీంనగర్‌కు మారిన తర్వాత ఆ మారడాన్ని మేము ఎవరం ఆమోదించలేదు. జగిత్యాలలో నిర్బంధం పెరిగిన మాట వాస్తవమే. జగిత్యాలలో ఉండలేని పరిస్థితి వచ్చినమాట వాస్తవమే. అయినా కరీంనగర్‌కు మారిన తర్వాత విరసం యూనిట్ సమావేశం అక్కడ జరిగినపుడు కరీంనగర్ విరసం యూనిట్ మొత్తంగా ప్రభాకర్‌ను ‘జగిత్యాలను ఎట్లాగు వదిలిపెట్టి వచ్చినవ్. కరీంనగర్‌ను అన్నా వదలకుండా వుండు’ అని ప్రాధేయపడింది.

జాపా లకా్ష్మడ్డి లాంటి పెద్ద దిక్కు మొదలు సహచరులైనటువంటి విజయ్‌కుమార్ దాక కూడా ‘మేమందరం కష్టాలు పడడం లేదా, నిర్బంధం రీత్యానే కాదు, ఆర్ధికవిషయం లో కూడా ఇబ్బందులు పడడం లేదా.., నువ్వు మాత్రం కరీంనగరం విడి చి వెళ్లకు, నగరం నిన్ను తినేస్తుంది’ అని చెప్పారు. అయినా ప్రభాకర్‌ది ఒకచోట నిలిచి వుండే స్వభావం కాదు కనుక..అట్లా హైదరాబాదుకు చేరుకున్నాడు. 1985నుంచి 89దాకా జైల్లో ఉండి విడుదలై వచ్చిన తర్వాత వ్యాధి ముదిరిన స్థితిలో ఆయనను చూశాను. అప్పుడు ఏ ప్రయత్నం చేసినా.. ఏం చేయలేని పరిస్థితి. అయితే కరీంనగర్‌లో విరసం ఆఖరి యూనిట్ సమావేశంలో ఆయనను ‘హైదరాబాదు వెళ్లొద్ద’ని బతిమాలిన రోజులు గుర్తొస్త్తున్నాయి. గుడివాడలో విరసం సాహిత్య పాఠశాల నిర్వాహణలో ఉన్నప్పుడు ప్రభాకర్ మరణవార్త విన్నాం.

ఆ సభల్లో చాలా చురుకుగా పాల్గొని ఆ సభ నిర్వహణ బాధ్యుడై సభల ఖర్చుల కోసం తిరిగినటువంటి గంగాధర్ అనే విరసం సభ్యుడు ఆ సభలు ముగిసి ముగియగానే.. అక్కడి సభలో విరసం సభ్యులు ఇచ్చిన విరాళాలు తీసుకొని హైదరాబాద్ బయలు దేరాడు. నిజానికి ఆయన అవిటి వాడు . విరసం మిత్రుల కన్నీళ్ళు కర్తవ్యాలు ప్రతిజ్ఞలు మొదట మోసుకొని వచ్చినవాడు. ఆ గంగాధర్ (శారీరకంగానే) ‘అవిటి’ విసరసం సభ్యుడు. ప్రభాకర్ జ్ఞాపకం రావాడానికి ఏన్నో సందర్భాలు.. అసలు ప్రభాకర్ జ్ఞాపకం రాని రోజు ఉంటుందా! ఇటీవల అవార్డులు, సన్మానాలకు ఎగబడుతున్నటు వంటి కవుల సందర్భంలో.. చెరబండరాజు స్మరణ సందర్భంలో మళ్లీ అలిశెట్టి ప్రభాకర్ గుర్తువచ్చాడు. ప్రభాకర్ కూడా నగర సంస్కృతిలో, చుట్టూ ఉన్న వాళ్ల ప్రభావానికిలోనై అవార్డులు తీసుకొని కవితలు రాసినప్పుడు, అవార్డులు తీసుకున్నావని అలిగి చూడని రోజులు అప్పుడప్పుడు ఉన్నవి.

‘కానివి’ రాస్తున్నావని ఆవేశంగా మందలించిన రోజులూ ఉన్నవి. ఆరోగ్యం మళ్లీ క్షీణిస్తే...అదుర్దాగా... దుఃఖంతో.. ఆగ్రహించిన రోజులు. ‘అన్నీ మరచిపోతానయ్యా.. మళ్లీ నీవు కండ్లు తేరుస్తానంటే. అరాచకత్వం మాని ఆరోగ్యం చూసుకుంటానంటే..’ అని రాసుకున్న రాతలు మళ్లీ జ్ఞాపకానికి వస్తున్నాయి. ప్రభాకర్‌ను కాపాడుకోవడానికి ఆఖరి క్షణంలో మిత్రులు చేసినటువంటి ప్రయత్నాలేవి పలించలేదు. కానీ ప్రభాకర్ ఆయనే చెప్పినట్లుగా ఆయన కవిత్వంలో చిరకాలం జీవించి వుంటాడు.

మరణం ఆయన చివరి చరణం కాదు. అందుకే ఆయన మరణవార్త విని దండకారణ్య రచయితలు ‘జగిత్యాల జైత్రయాత్ర మొదలు చివరి శ్వాస వరకు ప్రభాకర్ పీడిత ప్రజల పక్షాన నిలిచాడు. ప్రజాయుద్ధ రాజకీయాలను బలపరిచినవాడు. సీదా సాదగా జీవించి కలంతో దోపిడీ సమాజంపై తిరుగుబాటు చేసి, చివరి వరకు పోరాడిన వాడు. ఈ పోరాటంలో ఎందరినో తన విప్లవ నిబద్ధతతో ఉత్సాహపరిచాడు. జగిత్యాల, కరీంనగర్, హైదరాబాదు, ఇలా తన మకాం ఎక్కడికి మారినా ఉద్యమంతో సజీవ సంబంధాల ను నిలుపుకున్నవాడు. ఉద్య మం పై నిర్బంధం పెరిగిన క్రమంలో ప్రజలతో తనపై వచ్చే నిర్బంధానికి వెరవక విప్లవ పక్షం నిలి చి తన కలాన్ని మరింత పదునెక్కించిన సైనికుడు ఆయన. అందుకే ప్రభా కర్ అమరుడు. ఆయన నిజాయితీకి విప్లవాభివందనలతో జోహా ర్లు అర్పిస్తున్నాం’ అని దండకారణ్య రచయితలు తెలిపారు.

1990- 93 లో దండకారణ్య రచయితలు అంటే అప్పుడు అక్కడ కామ్రేడ్ మల్లోజుల కోటేశ్వర్‌రావు రామ్‌జీగా ఉన్న రోజులు. అవి దండకారణ్య ఉద్యమానికి భూపతిగా మల్లోజుల వేణుగోపాల్ నాయకత్వం వహిస్తున్న రోజులలో దండకారణ్య రచయితలుగా ఈ సందేశాన్ని పంపారు. పంపిన వాళ్లలో ఆ ఇద్దరు అన్నదమ్ముల్లో ఇద్దరు ఉండి ఉంటారు. మల్లోజుల కోటేశ్వర్‌రావు, ముప్పాళ్ల లక్ష్మణరావు, సాయిని ప్రభాకర్, నల్ల ఆదిడ్డితో పాటు అలిశెట్టి ప్రభాకర్ జగిత్యాల జైత్రయావూతలో పాల్గొన్నవాళ్లు. జగిత్యాల జైత్రయావూతను నిర్మాణం చేసినవాళ్లు. జగిత్యాల జైత్రయాత్ర గుర్తున్నంత కాలం ప్రభాకర్ గుర్తుంటాడు. విప్లవ రచయితల సంఘం బతికి ఉన్నంతకాలం అలిశెట్టి ప్రభాకర్ బతికి ఉంటాడు. విప్లవ సాహిత్య ఉద్యమం బతికి ఉన్నంతకాలం ఆయన బతికి ఉంటాడు.

అలిశెట్టి ప్రభాకర్ నాకు కాదు, నాకుటుంబానికి ఇచ్చిన విలువైన మిత్రు ణ్ని ఇచ్చాడు. అతడే వీరన్న. వీరాడ్డి అలిశెట్టి ప్రభాకర్ వలె కవిత్వం రాయాలని ‘భూమి పుత్రుడు’ కలం పేరుతో కవిత్వం రాసి విరసంలో చేరి, విప్లవ ఉద్యమంలో చేరి హైదరాబాద్ నగరంలో విప్లవోద్యమం నిర్మాణం చేస్తున్న క్రమంలో 94 ఎన్నికల సమయంలో బూటకపు ఎన్‌కౌంటర్లలో ఏటూరు నాగారం అడవు ల్లో అమరుడైన సాహసికుడు. దండకారణ్యంలో తన కోసం దస్తీ వేసి భద్ర పరిచిన స్థానాన్ని పొందకుండానే అమరుడైన వా డు. ఇవ్వాళ దేశవ్యాప్తంగా విస్తరించి సాగుతున్న జైత్రయావూతలో అలిశెట్టి ప్రభాకర్ కనిపిస్తున్నాడు. చురకలతో, తన రక్తరేఖలతో మనకు దిక్సూచిగా మార్గం చూపుతున్నాడు.
-వరవరరావు

35

VARAVARA RAO

Published: Wed,February 19, 2014 12:14 AM

ఈ బొమ్మకింక.. ప్రాణం పోయాలి!

ఎన్నాళ్లుగా నీ బొమ్మ గీయాలని.. ప్రయత్నిస్తున్నాను ఎన్నో పోరాటాల జ్ఞాపకాల కన్నీళ్లతో తడిసి నెత్తురు చింది అది చెరిగిపోయేది సాయు

Published: Tue,November 5, 2013 11:56 PM

దాశరథి దేశకాలాలు వెలుగు చీకటి జ్ఞాపకాలు

నా పదమూడో ఏటనే దాశరథి (కృష్ణమాచార్య)తో పరోక్ష పరిచయం, ప్రత్యక్ష పరిచయంగానే కాదు స్నేహంగా కూడా అంత సులభంగా సాధ్యమవుతుందని నేనూహిం

Published: Mon,September 9, 2013 01:08 AM

కాళోజీ కలగన్న తెలంగాణ

ఇవాళ్టికి కాళోజీకి నూరేండ్లు. ఆయన ‘నా గొడవ’ మొదటి ముద్రణ ఆవిష్కరణ జరిగి ఆరవై ఏళ్లు దాటింది. ఇంకా ఆంధ్రరాష్ట్రం ఏర్పడక ముందు 1953

Published: Wed,August 14, 2013 01:16 AM

కేఎంసీలో వికసించిన ఎర్రమందారం

కాటా నారాయణరావు ‘శబరి గోదారి’ (1986) కవితా సంకలనానికి ముందుమాట రాస్తూ కాళోజీ నారాయణరావు.. ‘1965 లో ప్రారంభమైన అలజడి (విశాఖ ఉక్కు

Published: Wed,June 19, 2013 12:59 AM

తీర్మానం చేయలేని అసెంబ్లీ ఓడిపోయింది చేరనివ్వని చలో గెలిచింది

అసెంబ్లీ అంటే పది మంది సమావేశమయ్యే స్థలం కదా మంది కూడా కాదు మన ప్రజావూపతినిధులు పదికోట్ల మంది పెట్టు.. పెట్టుకున్న సభ మన చె

Published: Fri,June 14, 2013 12:21 AM

ప్రజాస్వామ్యమా! పోలీసుస్వామ్యమా!!

శాసనసభాపతిగా కూడా వ్యవహరించి, విజయవంతంగా, సమర్థవంతంగా శాసనసభను నిర్వహించిన పేరు కూడా తెచ్చుకొని ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్‌డ్

Published: Sun,May 26, 2013 12:54 AM

ఆంధ్ర సారస్వత పరిషత్ జ్ఞాపకాలు ...అనుబంధాలు

జాగీరు గ్రామమైన మా చిన్న పెండ్యాలలో నా బాల్యంలోనే నేను ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరు వినడమే కాదు,అది మా విద్యాభివృద్ధిలో పాత్ర నిర్వ

Published: Sat,April 20, 2013 12:54 AM

ఇంద్రవెల్లి ఇంగలం

‘ఒక నిప్పురవ్వ దావానలమవుతుంది’ అనేమాట సామాన్యంగా ఒకచోట రగుల్కొన్న విప్లవం నలువైపులా విస్తరించడానికి అన్వయిస్తుంటారు. వైనాడ్ (కేరళ)

Published: Mon,April 1, 2013 12:37 AM

రాజ్యాంగమా? మతక్షిగంథాలా?

మన ప్రభుత్వాలు లౌకిక ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాయని ఎవరికైనా భ్రమలుంటే వాటిని పటాపంచలు చేశాడు మన ముఖ్యమంత్రి కిరణ

Published: Thu,March 21, 2013 12:13 AM

‘కుక్క’ల్లో వార్త

‘వార్తల్లో కుక్క’ అనాలి. కాని అపుడది వార్త కాదు. రిపోర్టింగ్‌లో ప్రవేశించిన ప్రతి ఒక్కరికీ మీడియా అనుభవజ్ఞులు ఏది వార్త అవుతుందో,

Published: Fri,March 15, 2013 02:14 AM

వంజెం సోమయ్య జైలుడైరీ...

ఇది జైలు డైరీ కాదు... ఇది నిర్బంధ డైరీ... ఇది పోలీసు అక్రమ అరెస్టు డైరీ.. ఇది చిత్రహింసల డైరీ.. ఇది దాతు ఫిర్యాదులేని రాజ్యాంగం ప

Published: Wed,February 20, 2013 11:57 PM

నాటి మాటలు మరిచారా?

అధ్యక్షా! మన శాసనసభ కేంద్ర ప్రభుత్వానికి మరణశిక్షను రద్దు చేయవలసిందిగా రికమెండ్ చేస్తూ తీర్మానం చేయాలని ప్రతిపాదిస్తున్నా ను. పూర్

Published: Fri,February 15, 2013 11:28 PM

బతికించే వృత్తినుంచి ఉరికంబం దాకా..

అప్జల్‌గురు ప్రస్థానం అతని మాటల్లోనే... నేను పెరుగుతున్న కాలంలో కశ్మీర్ రాజకీయంగా కల్లోలంగా ఉన్నది. మక్బుల్‌భట్‌ను ఉరి తీశారు(198

Published: Sat,December 29, 2012 04:40 PM

డిసెంబర్ 6కు 20 ఏండ్లు

ఈ డిసెంబర్ 6కు (బాబ్రీమసీదు విధ్వంసం జరిగి) 20 ఏండ్లు నిండాయి. ఇరవైఏండ్లంటే ఇంచుమించు ఒక తరం మారింది. పి.వి.నర సింహా రావు నుంచి మన

Published: Wed,October 10, 2012 08:11 PM

‘తెలంగాణ మార్చ్’యే జవాబు

ముందు కొన్ని వాస్తవాలు చెప్పుకోవాలె. ఆ వాస్తవాలపై మన అభివూపాయా లు, వ్యాఖ్యలు ఏమైనా కావచ్చు. నెలవారీగా కేంద్ర హోంమంత్రి నిర్వహించే

Published: Sat,October 6, 2012 03:30 PM

పిల్లి మొగ్గలు ఎలుకల్ని పట్టడానికే

భాషలో తేడాయే తప్ప ప్రకాశ్‌సింగ్, కిషోర్‌చంవూదదేవ్, జైరాంరమేష్‌లు కూడా దళారీ పాలనలో భాగమైనంత కాలం చిదంబరం, రమణ్‌సింగ్, విజయ్‌కుమార్

Published: Sat,October 6, 2012 03:31 PM

ఆత్మావలోకనం

మార్క్సిజం పెట్టుబడిదారీ విధానాన్ని మట్టికాళ్ల మహారాక్షసి అంటుంది. ఆ మహారాక్షసి ఉక్కువేళ్లు మట్టిపొరలు చీల్చుకొని భూగర్భ జలాల్లోకి

Published: Sat,October 6, 2012 03:31 PM

విప్లవ దార్శనికుడు

‘చాటండి గళమెత్తి విప్లవదార్శనికుడు చారుమజుందార్ చచ్చిపోలేదని- కామ్రేడ్ చారుమజుందార్ చంపబడ్డాడని’ అంటూ చెరబండరాజు తన కవితా సంకలనం

Published: Sat,October 6, 2012 03:32 PM

ఆదివాసులకు న్యాయం దక్కేనా?

చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, కాంకేర్ జిల్లాల్లో జూన్ 28,29 తేదీల్లో పోలీసులు మూడుచోట్ల అమాయకులైన 23మంది ఆదివాసీలను చంపారు. జ

Published: Sat,October 6, 2012 03:33 PM

అద్దంలో ‘విద్యార్థి ’ మాట

మొదట వరంగల్ ఆర్ట్స్‌కాలేజీ, తర్వాత ఉస్మానియా క్యాంపస్, రెండుచోట్ల చలం, శ్రీశ్రీ ఇచ్చిన మిత్రులు కాకుండా‘మివూతమండలి’ ఇచ్చిన మిత్రుల

Published: Sat,October 6, 2012 03:33 PM

జార్జ్ అడుగు జాడల్లో..

నేను జార్జిని చూసిన జ్ఞాపకం లేదు. కాని 1972 ఏప్రిల్ 14 సాయంకాలం నుంచి ప్రతి సాయం సంధ్యలోనూ ప్రతి ఉదయసంధ్యలోనూ ఆకాశంలోనే కాదు, నేలమ

Published: Sat,October 6, 2012 03:34 PM

దిక్కుల కూడలిలో ధిక్కార స్వరాలు...?

ఎందుకోసం వచ్చినా.. చెరబండరాజు పుట్టిన రోజు చర్చ మంచి కోసం ఉపయోగపడుతోంది. చెరబండరాజు కు సాహిత్య అకాడమీ నుంచి వచ్చిన సహాయాన్ని తన అవ

Published: Sat,October 6, 2012 03:35 PM

ఉద్యమ పంథా మారాలె

సకలజనుల సమ్మె స్వయంపాలనలో భాగంగా శాంతియుతంగా, రాజకీయాలకు అతీతంగా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని ఒక్కతాటి మీదికి తీసుకురావడం ద్వారా ప్

Published: Sat,October 6, 2012 03:35 PM

కాళోజీ (అను) వాదం

‘నా భారతదేశయాత్ర’ డ్బై ఏళ్ల క్రితం (1941) కాళోజీ (నారాయణరావు)గారు అనువదించి, దేశోద్ధారక గ్రంథమాల పక్షాన వట్టికోట ఆళ్వారుస్వామిగారు

Featured Articles